1
00:00:09,120 --> 00:00:13,160
ఎమిరేట్స్ స్టేడియం
ఆర్సెనల్

2
00:00:13,240 --> 00:00:16,720
మీరు చేసేది చేసేటప్పుడు,
మీకు నచ్చింది కాబట్టి మీరు చేస్తారు.

3
00:00:16,840 --> 00:00:18,880
దానినే అభిరుచి అంటారు.

4
00:00:21,880 --> 00:00:27,120
కేవలం అభిరుచి, నిబద్ధత, ఇంకా అభిరుచి,
అవే మీకెంత పట్టింపో జనాలకు చూపుతాయి.

5
00:00:27,200 --> 00:00:29,720
బయటకు వెళ్లి, ముందుకెళ్లి,
వారిపై దాడి చేయండి.

6
00:00:29,800 --> 00:00:32,840
తెగువతో ఆడండి, నమ్మండి,
ఈ గేమ్ గెలవండి.

7
00:00:37,000 --> 00:00:38,440
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్...

8
00:00:40,440 --> 00:00:42,560
...నార్త్ లండన్ హృదయంలో ఉంది.

9
00:00:43,880 --> 00:00:46,920
ప్రపంచంలో అతి పెద్ద
ఫుట్‌బాల్ క్లబ్‌లలో ఒకటి.

10
00:00:47,000 --> 00:00:48,480
థియెర్రీ హెన్రీ!

11
00:00:49,240 --> 00:00:50,880
అద్భుతమైన గోల్!

12
00:00:50,960 --> 00:00:51,960
శైలిలో ఓ చరిత్ర.

13
00:00:52,040 --> 00:00:54,200
పిరెస్. అమోఘం!

14
00:00:54,560 --> 00:00:56,120
ఇంకా అసాధారణమైన విజయం.

15
00:00:57,320 --> 00:00:58,560
వాళ్లు ఛాంపియన్లు.

16
00:00:59,720 --> 00:01:00,640
అజేయులు.

17
00:01:00,720 --> 00:01:03,080
ప్రీమియర్ లీగ్ సీజన్‌ అంతటా
ఓటమి అనేదే లేదు.

18
00:01:03,160 --> 00:01:04,239
ఛాంపియన్లు 03/04
పీ38 ఎల్ఓ - అజరామరం

19
00:01:05,800 --> 00:01:08,280
కానీ ఈమధ్య,
పరిస్థితులు అంత బాగాలేవు.

20
00:01:08,720 --> 00:01:11,520
ఇక 20 ఏళ్లకు పైబడిన కాలంలో
మొట్టమొదటిసారిగా

21
00:01:11,560 --> 00:01:15,039
ఈ గొప్ప క్లబ్‌కు
యూరోపియన్ ఫుట్‌బాల్‌ ఉండదు.

22
00:01:15,120 --> 00:01:16,560
అభిమానులలో అశాంతి.

23
00:01:17,039 --> 00:01:19,480
మేము ఛాంపియన్స్ లీగ్‌లో
ఎప్పుడూ ఆడేవాళ్లం.

24
00:01:19,560 --> 00:01:21,480
అన్నిసార్లు, తప్పనిసరిగా.

25
00:01:21,560 --> 00:01:23,560
ఇప్పుడు యూరోపాలో అడుగు పెట్టలేకపోయాం.

26
00:01:23,640 --> 00:01:24,720
శిక్షణా కేంద్రం

27
00:01:24,800 --> 00:01:27,160
మేనేజర్ వయసు
ప్రీమియర్ లీగ్‌లోనే అతి తక్కువ.

28
00:01:27,240 --> 00:01:30,360
మేనేజర్‌గా, ఒత్తిడిలో ఉంటారు,
ప్రశ్నలు ఎదుర్కుంటారు,

29
00:01:30,440 --> 00:01:32,080
కానీ నేను పోరాటానికి సిద్ధం.

30
00:01:32,160 --> 00:01:33,880
అతి పిన్న వయసు జట్టు.

31
00:01:35,080 --> 00:01:37,120
చరిత్రలో మొట్టమొదటిసారిగా,

32
00:01:37,200 --> 00:01:39,680
తెర వెనుక సన్నివేశాల కోసం
కెమెరాలకు అనుమతి.

33
00:01:39,759 --> 00:01:41,200
బ్యాడ్జీ కోసం ఆడండి

34
00:01:44,039 --> 00:01:46,120
ఏయ్, ఏయ్, ఏయ్.

35
00:01:47,720 --> 00:01:50,680
తరచుగా మాట్లాడను.
కానీ మాట్లాడితే మనసులోంచి మాట్లాడతాను.

36
00:01:50,759 --> 00:01:54,680
ఇది క్లబ్‌కు కీలక సీజన్ అని నిరూపిస్తుంది.

37
00:01:57,840 --> 00:01:59,800
నాటకీయత బయటపడుతోంది...

38
00:02:00,320 --> 00:02:01,480
ఇంకా రెడ్ కార్డ్.

39
00:02:03,120 --> 00:02:04,280
...పిచ్ బయట.

40
00:02:04,360 --> 00:02:06,600
నేను డ్యుయెల్ ఓడిపోతే, బాధపడతాను!

41
00:02:06,680 --> 00:02:08,479
ఎందుకంటే అదే సరైన ప్రమాణం!

42
00:02:08,560 --> 00:02:11,680
అతను ఇకపై కెప్టెన్ కాదని
ఓ క్లబ్‌గా మనం నిర్ణయించాం.

43
00:02:15,600 --> 00:02:18,240
ఓ ప్రశ్నతో క్లబ్ తర్జన భర్జన పడుతోంది.

44
00:02:20,720 --> 00:02:25,400
ఆర్సెనల్‌ను, అభిమానులను మళ్లీ అత్యుత్తమ
సమయానికి తీసుకెళ్లేది మికెల్ ఆర్టెటానేనా?

45
00:02:26,160 --> 00:02:27,600
మనకు ఓ సవాలు ఉంది.

46
00:02:27,680 --> 00:02:29,840
ఇది అందమైన సవాలు,
వెళ్లి అది సాధించండి.

47
00:02:41,360 --> 00:02:44,520
ఆల్ ఆర్ నథింగ్:
ఆర్సెనల్

48
00:02:44,600 --> 00:02:46,600
డానియెల్ కలూయా వ్యాఖ్యానంతో

49
00:02:56,520 --> 00:02:58,440
ఆర్సెనల్‌కు ఇది కొత్త ఆరంభం.

50
00:02:59,400 --> 00:03:00,400
హెన్రీ

51
00:03:02,880 --> 00:03:06,800
సీజన్ ఆరంభానికి
అభిమానులు స్టేడియం తిరిగొచ్చారు.

52
00:03:07,920 --> 00:03:08,840
9 ఆగస్టు 2021

53
00:03:08,920 --> 00:03:11,160
లండన్‌ కోల్నీ, ఆర్సెనల్ శిక్షణా కేంద్రం,

54
00:03:11,240 --> 00:03:12,920
అక్కడే సన్నద్ధత ఆరంభం.

55
00:03:17,640 --> 00:03:22,000
హేయ్. సెడ్రిక్, నీ చోటులో సాంబీ
పార్క్ చేశాడు.

56
00:03:22,079 --> 00:03:24,040
నా వైపు చూస్తావెందుకు?

57
00:03:34,800 --> 00:03:36,520
డ్రెస్ అంతా బంగారమే!

58
00:03:36,600 --> 00:03:38,400
ఓహో! అదిగో చూడు.

59
00:03:38,640 --> 00:03:41,720
నువ్వు బంగారంతో చేసిన దానిలా ఉన్నావు!

60
00:03:42,400 --> 00:03:43,960
భలే బంగారు బాబు!

61
00:03:49,560 --> 00:03:51,880
ఆర్సెనల్‌లో అనేకమంది
పెద్ద స్టార్లు ఉన్నారు.

62
00:03:52,560 --> 00:03:53,440
ఏంటి?

63
00:03:55,440 --> 00:03:58,800
క్లబ్ కెప్టెన్
పియెర్ ఎమెరిక్ ఒబామెయాంగ్‌తో సహా.

64
00:04:00,960 --> 00:04:04,680
కానీ వాళ్ల జట్టు ప్రధానంగా
25 లోపు వయసు వారితో ఉంటుంది.

65
00:04:04,760 --> 00:04:08,440
నిజానికి, ప్రీమియర్ లీగ్‌లో
అతి పిన్న వయస్కుల జట్టు ఆర్సెనల్‌దే.

66
00:04:10,320 --> 00:04:12,920
వాళ్ల ఉత్సాహభరిత ప్లేయర్లలో ఒకడు...

67
00:04:14,000 --> 00:04:16,600
19 ఏళ్ల బుకాయో సాకా.

68
00:04:18,200 --> 00:04:21,680
ఆర్సెనల్ నన్ను వెతికిన క్షణంలో,
నాకున్నది ఒకే మార్గం.

69
00:04:22,920 --> 00:04:26,680
ఆ స్కౌట్లు తల్లిదండ్రులను సంప్రదించి,
వాళ్లకో ఆర్సెనల్ బ్యాడ్జ్‌

70
00:04:26,760 --> 00:04:28,720
ఇవ్వడం నాకు గుర్తుంది.

71
00:04:28,800 --> 00:04:31,760
కారులోకి ఎక్కుతుంటే
మా నాన్న నాకు అది చూపించడం గుర్తుంది,

72
00:04:31,800 --> 00:04:36,200
నేను కార్డ్ తీసుకుని,
కొన్ని రోజులు నాతోనే ఉంచుకున్నా అనుకుంటా.

73
00:04:37,159 --> 00:04:39,640
చిన్నప్పుడు, సరదా కోసం ఆడతాం, తర్వాత

74
00:04:39,720 --> 00:04:42,520
మీరు టీవీలలో చూసే జట్లు
మీకు కాల్ చేస్తుంటే,

75
00:04:42,600 --> 00:04:47,240
అది ప్రత్యేకం, నాకు నిజంగా ఉత్సాహం,
వెంటనే ప్రారంభించాలని కోరుకున్నాను.

76
00:04:55,600 --> 00:04:59,640
యూరోపియన్ ఛాంపియన్‌షిప్స్‌లో ఫైనల్‌లో
ఇంగ్లాండ్‌కు బుకాయో ఆడాడు.

77
00:05:00,800 --> 00:05:04,320
పెనాల్టీ షూటవుట్‌లో ఆఖరి కిక్
కొట్టేందుకు తనను ఎంచుకున్నారు.

78
00:05:04,920 --> 00:05:06,640
ఇక, ఇప్పుడు బుకాయో సాకా...

79
00:05:06,720 --> 00:05:07,720
ఇటలీ 3 - 2 ఇంగ్లాండ్

80
00:05:08,000 --> 00:05:08,800
11 జూలై 2021

81
00:05:08,920 --> 00:05:12,520
ఇంగ్లీష్ ఫుట్‌బాల్‌లో 50 ఏళ్లకు పైగా
అదే అతి ముఖ్యమైన క్షణం.

82
00:05:13,120 --> 00:05:17,080
దయచేసి. సాకా, నిన్ను నమ్ముతాను.
ఈ టోర్నమెంట్‌లో చాలా బాగా ఆడావు.

83
00:05:17,160 --> 00:05:18,240
కానివ్వు, నేస్తం.

84
00:05:19,320 --> 00:05:22,360
ఈ 19 ఏళ్లవాడు ఇది స్కోర్ చేయాలి.

85
00:05:24,920 --> 00:05:28,040
అతను సేవ్ చేశాడు. డొన్నరూమా సేవ్ చేశాడు.

86
00:05:28,120 --> 00:05:31,600
షూటవుట్‌లో ఇంగ్లాండ్
వరుస మూడు పెనాల్టీలను మిస్ చేసుకుంది.

87
00:05:31,680 --> 00:05:35,400
కీలకమైనది మిస్ చేసుకోవడం
బుకాయో సాకా దురదృష్టం.

88
00:05:43,640 --> 00:05:48,320
ఈ మిస్ తరువాత, బుకాయో
తీవ్ర జాత్యహంకార వేధింపులకు గురయ్యాడు.

89
00:05:50,920 --> 00:05:54,640
టోర్నమెంట్‌లో అతని ప్రదర్శనలు,
ఆ పరిస్థితులను నిర్వహించిన తీరు

90
00:05:54,720 --> 00:05:56,159
తనను చిరపరిచయం చేసింది.

91
00:05:57,640 --> 00:05:58,640
ఓరి దేవుడా.

92
00:06:00,920 --> 00:06:03,440
పెనాల్టీ తీసుకోవడానికి ముందుకొచ్చావంటే,

93
00:06:03,520 --> 00:06:06,880
నువ్వే నాకు హీరో.
కచ్చితంగా, స్కోర్ చేస్తాడు, తను బాగా...

94
00:06:06,960 --> 00:06:08,080
థియెర్రీ హెన్రీ
ఆర్సెనల్ రికార్డ్ గోల్‌కీపర్

95
00:06:08,160 --> 00:06:09,360
...నన్నర్థం చేసుకుంటాడు.

96
00:06:09,440 --> 00:06:13,440
కానీ, నా వరకు, అతను ఇప్పుడు చేస్తున్నది,
తను ఎంత వినయంగా ఉంటాడో,

97
00:06:13,520 --> 00:06:17,120
అది గొప్ప విషయం,
ఎందుకంటే తను అకాడమీ నుంచి వచ్చాడు

98
00:06:17,200 --> 00:06:19,840
ఇంకా ఆర్సెనల్ ప్రతి అడుగులో ఉన్నాడు.

99
00:06:19,920 --> 00:06:24,960
కానీ ఆ పని చేయబోయే వ్యక్తికి ఉండే
ఒత్తిడిని ప్రజలు గుర్తించరు.

100
00:06:25,240 --> 00:06:29,120
మైదానంలో అడుగు పెడితే అలాగే ఉండాలి.
అలాగా ఉండి తీరాలి,

101
00:06:29,200 --> 00:06:33,480
కానీ ఓ మనిషిగా నీ భావన ఏంటో
ప్రజలు గుర్తించనప్పుడు,

102
00:06:33,560 --> 00:06:36,080
అది కష్టంగా మారిపోతుంది.

103
00:06:37,880 --> 00:06:42,680
గతంలో అనుకునేవాడిని,
నేను మామూలు పనులే చేయగలనని,

104
00:06:42,760 --> 00:06:44,560
కానీ ఇకపై వాటిని చేయలేను.

105
00:06:47,120 --> 00:06:48,920
-ప్లేట్ వెచ్చగా ఉంది.
-ఆ. థాంక్యూ.

106
00:06:49,000 --> 00:06:51,240
సరే, బాగుంది. ఆ. ధన్యవాదాలు.

107
00:06:52,520 --> 00:06:55,240
ఇంటి దగ్గర నేను గుడ్డు వండితే,
బాగుంటుంది. అందుకే...

108
00:06:55,720 --> 00:06:56,800
వంట చేయవు, సోదరా.

109
00:06:56,880 --> 00:06:58,400
నేను వండనంటే నీ ఉద్దేశమేంటి?

110
00:06:58,480 --> 00:07:00,280
నిన్న ఏం చేశానని చెప్పాను?

111
00:07:00,360 --> 00:07:03,520
ఏం చెప్పాడంటే, భోజనం చేయడానికి
వెయిట్రోజ్‌కు వెళ్లానని.

112
00:07:04,880 --> 00:07:05,840
స్పష్టంగా...

113
00:07:06,840 --> 00:07:08,560
సోదరా, నా జీవితంలో, ఒట్టు.

114
00:07:08,640 --> 00:07:11,080
మొత్తం సిబ్బంది అంతా
బయట నా కోసం వేచి ఉన్నారు.

115
00:07:11,160 --> 00:07:12,280
ఏంటి?

116
00:07:12,360 --> 00:07:15,360
సోదరా, లోపలకు వెళ్లాను,
వాళ్లు గుర్తించే ఉంటారని నా ఆలోచన.

117
00:07:15,440 --> 00:07:17,000
నీ హుడ్ కిందకు పెట్టావా?

118
00:07:17,080 --> 00:07:19,240
నా హుడ్‌ ఇలాగుంది,
మాస్క్ ఇలా పెట్టుకున్నా.

119
00:07:19,320 --> 00:07:20,960
అయినా నిన్ను గుర్తుపట్టారా?

120
00:07:21,480 --> 00:07:23,040
నేను వచ్చేసేటప్పుడు, సోదరా...

121
00:07:23,120 --> 00:07:24,160
మొత్తం ఎలాగంటే...

122
00:07:24,240 --> 00:07:26,560
ప్రవేశం దగ్గర ఎనిమిది మంది
వేచి ఉన్నారు.

123
00:07:26,640 --> 00:07:27,760
చప్పట్లు కొట్టడమా?

124
00:07:27,840 --> 00:07:30,280
లేదు, వాళ్లు కేవలం,
నేను బయటకు రాగానే...

125
00:07:30,360 --> 00:07:32,000
"మేము ఓ ఫోటో తీసుకోమా?"

126
00:07:32,280 --> 00:07:33,280
అబ్బా ఛ, కదా?

127
00:07:33,360 --> 00:07:35,720
సోదరా, నేను నా హుడ్, మాస్క్ పెట్టుకున్నా.

128
00:07:35,800 --> 00:07:38,360
ఇంకేం చేయాలో నాకు తెలియదు, సోదరా.

129
00:07:38,960 --> 00:07:39,880
అది కష్టం...

130
00:07:39,960 --> 00:07:41,760
చిన్నప్పుడు, ఇది ఆలోచించలేదు.

131
00:07:41,840 --> 00:07:44,159
ఫుట్‌బాల్ వైపే ఆలోచించాను.

132
00:07:44,240 --> 00:07:47,480
పిచ్ బయటి సంగతులపై
నేను నిజంగా ఆలోచించలేదు.

133
00:07:47,560 --> 00:07:49,840
చెప్పాలంటే, మీడియా, అలాంటి విషయాలు.

134
00:07:49,920 --> 00:07:52,720
కానీ అవును, నేనది
మార్చగలనని అనుకోను, ఎందుకంటే,

135
00:07:52,800 --> 00:07:55,080
నేను చిరకాలం కలగన్న
ఆ కలలో జీవిస్తున్నాను.

136
00:07:57,159 --> 00:08:00,680
ఈ యువజట్టుకు ప్రీమియర్ లీగ్‌లోనే
అతి పిన్న మేనేజర్ ఉన్నాడు.

137
00:08:00,920 --> 00:08:05,120
39 ఏళ్ల వయసు,
మాజీ ఆర్సెనల్ ప్లేయర్, మికెల్ ఆర్టెటా.

138
00:08:05,200 --> 00:08:07,320
-శుభోదయం, కెల్లీ.
-శుభోదయం, మికెల్.

139
00:08:07,400 --> 00:08:09,040
ఆర్టెటా ఒత్తిడిలో ఉన్నాడు.

140
00:08:09,400 --> 00:08:12,640
అతను వచ్చిన తరువాత
ఆర్సెనల్‌లో నిలకడ లోపించింది,

141
00:08:12,720 --> 00:08:15,080
ఇక ఈ సీజన్‌లో పరిస్థితులు మారాలి.

142
00:08:15,960 --> 00:08:16,800
మికెల్ ఆర్టెటా
మేనేజర్

143
00:08:16,880 --> 00:08:19,440
ప్రతి గేమ్‌ను గెలవాలనేది ఈ క్లబ్ అంచనా.

144
00:08:19,520 --> 00:08:24,040
మేము యూరోప్ గెలవాలి, అవును, మేము
ట్రోఫీలు గెలిచి తీరాలి, అది నిజం.

145
00:08:24,120 --> 00:08:27,760
మీరు మా వింగ్, బాల్‌ను దీనికి
గురి పెట్టాలి. సెంటర్ బ్యాక్ ఎక్కడ?

146
00:08:27,840 --> 00:08:29,160
-అక్కడ, అవునా?
-సరేనా?

147
00:08:29,240 --> 00:08:33,000
గత కొన్నేళ్లుగా కొంత నిలకడక కోల్పోయిన
నా జట్టును

148
00:08:33,039 --> 00:08:35,880
అభిమానులు నమ్మేలా చేయడం
నా ప్రధాన లక్ష్యం.

149
00:08:37,600 --> 00:08:42,120
ఫుట్‌బాల్ అంటే జనాలకు సానుకూల భావోద్వేగాలు
అందించేందుకు ప్రయత్నించాలి.

150
00:08:44,480 --> 00:08:48,840
మేము ఆ పని చేయగలిగితే, ఆశావహంగా,
అందమైన విషయాలు జరుగుతాయి.

151
00:08:49,760 --> 00:08:50,760
మూడు! రెండు!

152
00:08:55,360 --> 00:08:58,080
నా ఆలోచన ఏంటంటే
కొంచెం ఇలా చేయాలని,

153
00:08:58,160 --> 00:09:01,640
"హలో, మీ అందరినీ చూడడం సంతోషం,
మనం మళ్లీ వచ్చాం."

154
00:09:02,200 --> 00:09:06,840
మీడియాలో, మికెల్‌ను, మేనేజర్‌గా
తన సామర్ధ్యంపై ప్రశ్నలు తలెత్తాయి.

155
00:09:06,880 --> 00:09:08,040
అందరికి శుభోదయం.

156
00:09:08,640 --> 00:09:11,960
శుభోదయం. కొత్త సీజన్ కోసం
మీ అందరినీ చూడడం బాగుంది.

157
00:09:12,040 --> 00:09:15,600
ఇది మీ మూడవ సీజన్, అవునా?
రెండుసార్లు ఎనిమిదో స్థానం ముగింపు.

158
00:09:15,640 --> 00:09:19,480
ఇది మీరు సాధించాల్సిన
సమయమని అర్థమైందా?

159
00:09:20,240 --> 00:09:24,000
ఉత్తమ వర్షన్ పొందడమే
మా లక్ష్యం, నిలకడగా,

160
00:09:24,080 --> 00:09:27,520
అది మమ్మల్ని ఫుట్‌బాల్ మ్యాచ్‌లు
గెలిచేందుకు దగ్గర చేస్తుంది.

161
00:09:27,640 --> 00:09:29,600
జట్టు నుంచి నేను కోరుకునేది అదే.

162
00:09:29,640 --> 00:09:31,640
శుక్రవారం, బ్రెంట్‌ఫర్డ్‌పై గెలవడానికి,

163
00:09:31,760 --> 00:09:34,400
గత కొన్ని వారాలుగా ఎంతో శ్రమ, కృషి చేసి

164
00:09:34,480 --> 00:09:36,640
మంచి ఫలితం పొందాలని ఆశిస్తున్నాం.

165
00:09:36,720 --> 00:09:40,400
ఫలితం చూడాలని కోరుకుంటారు,
అందుకే సిద్ధంగా ఉండండి.

166
00:09:40,720 --> 00:09:43,440
-ధన్యవాదాలు, మికెల్.
-ధన్యవాదాలు.

167
00:09:49,720 --> 00:09:50,520
బ్రెంట్‌ఫర్డ్ వర్సెస్ ఆర్సెనల్

168
00:09:50,640 --> 00:09:51,760
బ్రెంట్‌ఫర్డ్ కమ్యూనిటీ స్టేడియం
13 ఆగస్టు 2021

169
00:09:51,840 --> 00:09:55,040
కొత్తగా పదోన్నతి పొందిన బ్రెంట్‌ఫర్డ్‌తో
ఆర్సెనల్ మొదటి మ్యాచ్.

170
00:09:55,120 --> 00:09:57,280
ఇది వాళ్లు గెలుస్తారని అనుకునే గేమ్,

171
00:09:57,360 --> 00:10:00,360
కానీ గేమ్ కోసం వారి ఏర్పాటును
కోవిడ్ దెబ్బ తీసింది,

172
00:10:00,440 --> 00:10:02,400
పరిస్థితులు దారుణంగా మారాయి.

173
00:10:02,480 --> 00:10:04,320
మీరు వార్తలు విని ఉండకపోతే,

174
00:10:04,400 --> 00:10:07,520
పియెర్-ఎమెరిక్ ఒబామెయాంగ్,
అలెక్స్ లాకాజెట్ ఇద్దరూ

175
00:10:07,640 --> 00:10:10,240
అనారోగ్యం కారణంగా
ఇవాల్టి మ్యాచ్ ఆడడం లేదు.

176
00:10:12,200 --> 00:10:15,280
తప్పక, బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కోసం
మ్యాచ్‌ ముందు నడక

177
00:10:15,360 --> 00:10:17,400
ఇక ముందు ఈ సీజన్‌లో కొనసాగనుంది.

178
00:10:17,480 --> 00:10:21,120
చూడడం సంతోషం, అక్కడ
యువ బుకాయోను సాకా బెంచ్‌పై ఉంచారు.

179
00:10:22,520 --> 00:10:23,520
ఇదిగో మొదలైంది.

180
00:10:35,320 --> 00:10:38,520
ఆర్సెనల్ చక్కగా ఆరంభించి
ప్రత్యర్థిపై ఆధిపత్యం చూపింది.

181
00:10:42,640 --> 00:10:44,200
కానీ 20 నిమిషాలలోనే...

182
00:10:49,520 --> 00:10:50,520
బ్రెంట్‌ఫర్డ్ గోల్.

183
00:10:50,600 --> 00:10:54,320
బ్రెంట్‌ఫర్డ్ 1 - 0 ఆర్సెనల్
కానోస్ 22

184
00:10:58,640 --> 00:10:59,920
ఆర్సెనల్ పోరాడాతోంది.

185
00:11:06,720 --> 00:11:10,680
ఇంకా 60 నిమిషాల తర్వాత,
బుకాయో సాకాను మికెల్ పంపాడు,

186
00:11:14,320 --> 00:11:16,640
ఆర్సెనల్ అభిమానులే కాదు,

187
00:11:17,280 --> 00:11:19,560
బ్రెంట్‌ఫర్డ్ అభిమానుల నుంచి కూడా...

188
00:11:19,640 --> 00:11:20,880
జాత్యహంకారానికి వ్యతిరేకంగా
బీస్ అభిమానులు

189
00:11:20,960 --> 00:11:24,920
...బుకాయో సాకాను ఆ పెనాల్టీ మిస్ తర్వాత
పిచ్‌పై అభినందిస్తున్నారు.

190
00:11:25,000 --> 00:11:27,000
కానీ తను ఆర్సెనల్
అదృష్టం మార్చలేకపోయాడు.

191
00:11:27,080 --> 00:11:28,640
ఎడమ చేతివైపు సాకా వెళుతూ,

192
00:11:28,720 --> 00:11:31,960
గ్రానిట్ చాకా, ఎత్తు తక్కువ షాట్...

193
00:11:32,040 --> 00:11:33,800
కానీ పోస్ట్‌కు దూరంగా.

194
00:11:36,400 --> 00:11:38,080
సోరెన్సెన్ దూరం నుంచి త్రో

195
00:11:38,160 --> 00:11:40,960
అది పెనాల్టీ ఏరియా మీద ఎగురుతూ
లోపలకు వెళ్లింది!

196
00:11:41,040 --> 00:11:42,480
బ్రెంట్‌ఫర్డ్ 2 - 0 ఆర్సెనల్
నోర్గార్ద్ 73

197
00:11:42,560 --> 00:11:44,640
బ్రెంట్‌ఫర్డ్‌కు ఇది రెండవ గోల్!

198
00:11:46,000 --> 00:11:48,280
ఆర్సెనల్ అభిమానులకు
సానుకూల ఆరంభం

199
00:11:48,360 --> 00:11:50,680
ఇవ్వాలనే మికెల్ ఆశలు
ఆవిరి అయ్యాయి.

200
00:11:52,520 --> 00:11:56,600
ఆర్సెనల్ అభిమానులు అల్లాడుతున్నారు.
మైదానం వదిలి వెళుతున్నారు.

201
00:11:57,640 --> 00:12:01,200
అభిమానులు బ్రెంట్‌ఫర్డ్‌తో ఓటమిని
అంగీకరించరు.

202
00:12:02,240 --> 00:12:03,640
పతనం మొదలైంది.

203
00:12:04,640 --> 00:12:06,040
చాలా ఇబ్బందికరంగా ఉంది.

204
00:12:08,160 --> 00:12:09,880
మేము లీగ్‌లో అడుగున ఉన్నాం.

205
00:12:12,120 --> 00:12:13,360
వాళ్లు గెలిచారు!

206
00:12:13,440 --> 00:12:17,160
రెండు, సున్నా గోల్స్‌ తేడాతో
వాళ్లు ఆర్సెనల్‌ను ఓడించారు.

207
00:12:17,240 --> 00:12:18,760
ఇప్పుడు వీళ్లపై ఒత్తిడి ఉంది.

208
00:12:18,840 --> 00:12:20,120
ఇక్కడ సాకులు ఉండవు,

209
00:12:20,200 --> 00:12:22,840
మరుసటి రెండు గేమ్‌లు,
చెల్సియా, మాంచెస్టర్ సిటీ,

210
00:12:22,920 --> 00:12:24,560
నేను అనుకునేది ఏమిటంటే

211
00:12:24,640 --> 00:12:27,320
మికెల్ ఆర్టెటా మీద ఒత్తిడి పడింది అందుకే.

212
00:12:27,400 --> 00:12:29,760
తప్పయినా, ఒప్పయినా,
మనం అక్కడే ఉన్నాం.

213
00:12:47,560 --> 00:12:48,560
శుభోదయం.

214
00:12:49,600 --> 00:12:52,200
మేనేజర్‌గా, మీరు ఒత్తిడిలో ఉంటారు,

215
00:12:53,480 --> 00:12:57,040
మీకు ప్రశ్నలు ఎదురవుతాయి.
మీరు సమస్యలను ఎదుర్కోవాలి.

216
00:12:57,560 --> 00:13:02,200
అది నా పనిలో భాగం,
ఈ క్లబ్ కోసం నిజంగా పోరాడాలని నా కోరిక.

217
00:13:02,280 --> 00:13:05,160
మా ప్లేయర్లు, మా అభిమానుల కోసం పోరాడతాను.

218
00:13:05,240 --> 00:13:07,960
మేము కలిసి ముందుకు సాగాలని
వాళ్లూ అదే భావిస్తారు.

219
00:13:08,440 --> 00:13:11,360
క్రోంకి వెళ్లాలని మా కోరిక,
క్రోంకి వెళ్లిపోవాలి.

220
00:13:11,440 --> 00:13:16,080
క్రోంకీ వెళ్లాలని మా కోరిక,
క్రోంకీ వెళ్లిపోవాలి.

221
00:13:16,160 --> 00:13:17,400
ప్రక్రియను పక్కన పెట్టండి

222
00:13:17,520 --> 00:13:19,920
అభిమానులు, క్లబ్ మధ్య అనుబంధం

223
00:13:20,000 --> 00:13:22,720
ఏప్రిల్ 2021లో అట్టడుగు స్థాయికి చేరింది.

224
00:13:22,800 --> 00:13:24,520
తాజాగా ప్రతిపాదించిన

225
00:13:24,600 --> 00:13:28,240
యూరోపియన్ సూపర్ లీగ్‌లో క్లబ్ చేరడంపై
అభిమానులు అభ్యంతరం తెలిపారు.

226
00:13:29,560 --> 00:13:32,960
ఆ కోపంలో ఎక్కువ భాగం
క్లబ్ యజమానుల మీదకు మళ్లింది,

227
00:13:33,040 --> 00:13:34,480
వారే క్రోంకీ కుటుంబం.

228
00:13:34,560 --> 00:13:39,000
ఫుట్‌బాల్ క్లబ్‌కు ఏమీ పట్టించుకోని
ఓ యజమాని ఎలా ఉంటాడు? నాకర్థం కాలేదు.

229
00:13:39,080 --> 00:13:42,040
వాళ్లు మమ్మల్ని సూపర్ లీగ్‌లో
ఎలా పెడతారు? ఊరుకో.

230
00:13:42,840 --> 00:13:46,640
స్టాన్ క్రోంకీ, క్రోంకీ స్పోర్ట్స్ అండ్
ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆరంభించారు.

231
00:13:46,720 --> 00:13:50,240
ప్రపంచంలోనే ప్రైవేట్ యాజమాన్యంలోని
అతి పెద్ద క్రీడా సామ్రాజ్యం.

232
00:13:51,440 --> 00:13:55,000
కంపెనీ విలువ
దాదాపు 75 వేల కోట్ల రూపాయలు.

233
00:13:55,960 --> 00:13:57,520
ఆర్సెనల్ విషయానికి వస్తే,

234
00:13:57,600 --> 00:14:01,000
స్టాన్ కుమారుడు జాష్ క్రోంకీ
క్లబ్‌కు డైరెక్టర్.

235
00:14:01,080 --> 00:14:04,480
ఫుట్‌బాల్ క్లబ్‌ను నడపడంలో
అతి పెద్ద సవాలు ఏంటి?

236
00:14:04,560 --> 00:14:06,360
జాష్ క్రోంకీ
డైరెక్టర్

237
00:14:06,440 --> 00:14:07,800
ఎక్కడ ఆరంభించాలి?

238
00:14:12,760 --> 00:14:16,320
నా కుటుంబం నిజానికి
2018లో నియంత్రణ తీసుకుంది.

239
00:14:16,400 --> 00:14:18,440
పరివర్తన సమయంలో

240
00:14:18,520 --> 00:14:21,440
మొదటిసారే అంతా సజావుగా జరగదు.

241
00:14:21,520 --> 00:14:25,560
గతుకులు ఉంటాయి, వాటితో నిలబడేందుకు
మీరు దృఢంగా ఉండాలి.

242
00:14:25,640 --> 00:14:28,280
క్రోంకీ వెళ్లిపోవాలి. క్రోంకీ వెళ్లాలి.

243
00:14:28,360 --> 00:14:30,360
క్రోంకీ వెళ్లాలి

244
00:14:31,480 --> 00:14:33,400
అది చాలా గడ్డుకాలం.

245
00:14:33,480 --> 00:14:37,040
మేము చాలామందిని బాధించామని తెలుసు,
అది దారుణం.

246
00:14:39,000 --> 00:14:42,400
మా అభిమానులలో విశ్వాసం నెలకొల్పేందుకు
చాలా దూరం వెళ్లాలి

247
00:14:42,480 --> 00:14:45,200
కానీ అది ఇప్పటికే తెరవెనుక మొదలైంది.

248
00:14:45,280 --> 00:14:49,280
టెక్నికల్ డైరెక్టర్, ఎడ్యు గాస్పర్‌ను
సీఈఓ వినయ్ వెంకటేశంలను

249
00:14:49,360 --> 00:14:52,080
కలిసేందుకు, జాష్ లండన్ వెళ్లాడు,

250
00:14:52,960 --> 00:14:54,800
ఆర్సెనల్ బోర్డ్‌తో పాటు,

251
00:14:54,880 --> 00:14:58,280
మొదటి జట్టు బృందాన్ని అప్‌గ్రేడ్
చేసే ప్రణాళిక జాష్ ఆమోదించాడు.

252
00:14:59,000 --> 00:15:01,840
ఇక మనం ఇంకా, తప్పకుండా,
మీరిక్కడ చూసే విధంగా,

253
00:15:01,920 --> 00:15:04,280
మనం ఇంకా అనుకుంటున్నట్లుగా, చాలా చేయాలి.

254
00:15:04,360 --> 00:15:08,080
ఇక మీరు చూసినప్పుడు,
ఆ రకమైన పరిస్థితి...

255
00:15:08,480 --> 00:15:11,440
ఈ బదిలీ విండో ముగిసేసరికి
ఇలా చేయాలని నా కోరిక,

256
00:15:11,520 --> 00:15:14,640
ఆ పరిస్థితిని శుభ్రం చేసి,
తిరిగి సమతుల్యం చేయడం.

257
00:15:14,720 --> 00:15:17,280
మీరు చూస్తున్నారు,
మార్టిన్ ఈ భవనంలో ఉన్నాడు

258
00:15:17,360 --> 00:15:19,960
అది ఇప్పటికే ముఖ్యమైన స్థానం

259
00:15:20,040 --> 00:15:23,280
ఎందుకంటే ఆ స్థానంలో
స్మిత్ రోవ్‌ను ఉంచేలోపుగా,

260
00:15:23,360 --> 00:15:27,400
ఇక మన దగ్గర రెండు నుంచి పది ఉన్నారు,
మార్టిన్ మనకు చాలా సరళత ఇస్తాడు.

261
00:15:27,480 --> 00:15:30,600
బృందంలో వయసు గురించి ఏం చేయాలో
మనం అంతా చేసేశాం.

262
00:15:30,680 --> 00:15:34,160
మీరు ప్లేయర్లను చూశారంటే
అందరూ 21, 22, 22, 24ను తీసుకున్నాం.

263
00:15:35,760 --> 00:15:39,920
నార్వేజియన్ కుర్రాడు మార్టిన్ ఓడెగార్డ్
కోసం, జాష్ ఇంకా ఆర్సెనల్ బోర్డ్

264
00:15:40,000 --> 00:15:42,760
30 మిలియన్ పౌండ్లు వెచ్చించారు.

265
00:15:42,840 --> 00:15:45,200
-నీకు సంతోషమా?
-ఆ, సోదరా. కచ్చితంగా.

266
00:15:46,080 --> 00:15:47,760
నీకు తిరిగి రావడం సంతోషమేనా?

267
00:15:49,320 --> 00:15:52,840
నీకు అందే చెల్లింపు విన్నాను,
అది అద్భుతం.

268
00:15:52,920 --> 00:15:56,560
అనేకమంది ఇతర యువ ప్లేయర్లతో
డీల్స్ ఖాయం అయ్యాయి.

269
00:15:56,640 --> 00:16:00,600
21 ఏళ్ల ఆల్బర్ట్ సాంబీ లకోంగా,
15 మిలియన్ పౌండ్లు.

270
00:16:00,960 --> 00:16:03,960
21 ఏళ్ల న్యూనో టవారెస్,
7 మిలియన్ పౌండ్లు.

271
00:16:06,720 --> 00:16:10,320
కానీ అత్యంత ఖరీదైన ఒప్పందం
23 ఏళ్ల బెన్ వైట్‌ది,

272
00:16:10,400 --> 00:16:12,120
50 మిలియన్ పౌండ్లకు కొన్నారు.

273
00:16:14,480 --> 00:16:17,600
కొందరు కుర్రాళ్లు నాకు
అసలు బాధ్యతగా కనబడలేదు,

274
00:16:17,680 --> 00:16:20,760
-నాపై దాడి చేయడంలా ఉంది.
-అలా చేశారా?

275
00:16:20,960 --> 00:16:24,760
"50 మిలియన్లా? చెత్త," అంటున్నారు.

276
00:16:27,040 --> 00:16:30,720
బదిలీ విండోలో అత్యధికంగా
వెచ్చించినది ఆర్సెనల్.

277
00:16:30,800 --> 00:16:33,120
ఇంకా మరింతమంది ప్లేయర్ల కోసం చూస్తున్నారు.

278
00:16:36,240 --> 00:16:38,920
గొప్ప పథకం,
ఈ బదిలీ సమయం తరువాత

279
00:16:39,000 --> 00:16:40,600
అది కచ్చితంగా మారాలి.

280
00:16:40,680 --> 00:16:43,000
నీకక్కడ వేగం ఉంది,
ఇంకా ఆడేందుకు సిద్ధమే.

281
00:16:43,080 --> 00:16:44,160
వెంటాడడం చాలా కష్టం.

282
00:16:44,240 --> 00:16:48,720
మీరు అక్కడ చూస్తే నిజంగానే
యువ ప్రతిభ కనబడుతుంది,

283
00:16:48,800 --> 00:16:50,960
అది బృందంతో పెరుగుతుంది.

284
00:16:51,920 --> 00:16:54,600
-ఎలా ఉన్నావు? బాగున్నావా?
-బాగున్నా, జాష్.

285
00:16:54,680 --> 00:16:56,040
ఇది కఠినమైన వారం.

286
00:16:56,120 --> 00:16:57,000
అవును.

287
00:16:57,080 --> 00:17:00,240
ప్రీమియర్ లీగ్‌లో తొలి ఓటమి తరువాత,
ఏం రానుందో తెలుసు.

288
00:17:00,320 --> 00:17:02,640
మొదటి రోజునే సునామీ రానుంది.

289
00:17:02,720 --> 00:17:04,520
మేఘాలు నల్లగా ఉన్నాయి.

290
00:17:06,079 --> 00:17:07,400
-హలో.
-ఎలా ఉన్నావు?

291
00:17:07,480 --> 00:17:09,280
-బాగున్నా, నువ్వు?
-బాగున్నాను.

292
00:17:10,040 --> 00:17:12,640
సందేశంలో పంపినదానికి కట్టుబడతాను,

293
00:17:12,720 --> 00:17:16,160
ఇదంతా వదిలెయ్, నీకు మంచి
భవిష్యత్తు ఉంది. అది సరదాగా ఉంటుంది.

294
00:17:16,240 --> 00:17:19,520
ఇప్పుడు అతనికి ప్రతి నగరం నుంచి చప్పట్లు,
తనకు చప్పట్లు.

295
00:17:23,040 --> 00:17:25,760
ఎమిరేట్స్ స్టేడియం నుంచి
18 నెలలు దూరంగా ఉన్నాక,

296
00:17:25,800 --> 00:17:26,880
ఫాన్స్ తిరిగొచ్చారు.

297
00:17:30,000 --> 00:17:34,480
యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్‌ విజేతలు,
చెల్సియాతో కఠినమైన మ్యాచ్ కానుంది.

298
00:17:35,000 --> 00:17:37,720
ఈ వారం చెల్సియాతో ఆడాలి,
తర్వాత మాన్ సిటీ.

299
00:17:37,800 --> 00:17:42,240
ఈ సీజన్‌లో మీకు ఉండాల్సిన
సులభ ఆరంభంలా ఇది లేదు.

300
00:17:42,320 --> 00:17:46,800
మమ్మల్ని పాతేయాలని, విమర్శించాలని
జనాలకు ఉద్దేశాలు ఉన్నాయని తెలుసు,

301
00:17:46,880 --> 00:17:48,720
మాకు దానిపై ఆసక్తి లేదు.

302
00:17:48,800 --> 00:17:51,560
ఎవరి గురించి ఈ మాటలు? మాజీ ప్లేయర్లా?

303
00:17:51,680 --> 00:17:55,800
గత వారం మీ గేమ్‌ను రువాండా అధ్యక్షుడు
చాలా విమర్శించారు,

304
00:17:55,920 --> 00:17:58,320
"ఆర్సెనల్ సామాన్యతను
అంగీకరించరాదు," అన్నారు.

305
00:17:58,440 --> 00:18:01,080
ఇతర లీగ్ క్లబ్‌ల కంటే
ఆర్సెనల్ ఎక్కువ వెచ్చించింది.

306
00:18:01,200 --> 00:18:04,040
మీరు ఆర్సెనల్ బాస్‌గా మారాక
ఇది అతి పెద్ద సవాలా?

307
00:18:04,080 --> 00:18:07,000
ప్లేయర్లు, మీరు ఎలాంటి ఒత్తిడి
ఎదుర్కోవడం లేదా?

308
00:18:07,080 --> 00:18:10,000
ఫుట్‌బాల్‌లో, ఏదైనా గొప్ప క్రీడలో
ఒత్తిడి లేకపోతే,

309
00:18:10,080 --> 00:18:11,760
తప్పు వృత్తిని ఎంచుకున్నారు.

310
00:18:11,800 --> 00:18:13,160
-ధన్యవాదాలు.
-ధన్యవాదాలు.

311
00:18:17,680 --> 00:18:19,760
బాగా చేశావు. నేరుగా మాట్లాడావు.

312
00:18:20,560 --> 00:18:22,800
-వాళ్లు ఇవాళ తీవ్రంగా ఉన్నారు.
-అవును.

313
00:18:25,280 --> 00:18:28,280
రామ్స్‌డేల్ విషయం రానుందని చూశావు.

314
00:18:28,720 --> 00:18:30,320
టాక్ స్పోర్ట్,
క్రీడా అప్‌డేట్.

315
00:18:30,440 --> 00:18:33,800
గోల్‌కీపర్, ఆరన్ రామ్స్‌డేల్‌తో
ఒప్పందం ఆర్సెనల్ ప్రకటించింది,

316
00:18:33,880 --> 00:18:36,440
షెఫీల్డ్ యునైటెడ్‌తో సుదీర్ఘ ఒప్పందం.

317
00:18:36,520 --> 00:18:38,480
వారాల పాటు బేరసారాల అనంతరం,

318
00:18:39,480 --> 00:18:44,040
23 ఏళ్ల ఇంగ్లీష్ గోల్‌కీపర్ కోసం ఆర్సెనల్
30 మిలియన్ పౌండ్ల ఒప్పందం చేసుకుంది.

319
00:18:44,080 --> 00:18:45,080
ఆరన్ రామ్స్‌డేల్.

320
00:18:45,200 --> 00:18:46,040
శుభోదయం.

321
00:18:46,560 --> 00:18:48,560
-నువ్వే వచ్చేశావా? మంచిది.
-అవును.

322
00:18:48,640 --> 00:18:52,440
క్లబ్ డాక్టర్ గ్యారీ ఒడ్రిస్కల్‌కు
తన మెడికల్ అందించాలంతే.

323
00:18:52,520 --> 00:18:54,080
కూర్చో.

324
00:18:56,640 --> 00:18:59,280
-ఇక, చూడు, అభినందనలు.
-ధన్యవాదాలు.

325
00:18:59,320 --> 00:19:01,440
-కొంచెం సమయం తీసుకున్నావు.
-అవును.

326
00:19:01,880 --> 00:19:04,080
నువ్వు రావడం మాకు ఉత్సాహం,
అభినందనలు.

327
00:19:04,480 --> 00:19:06,880
-గతంలో పరీక్షలు చేయించావా?
-అవును.

328
00:19:06,960 --> 00:19:09,320
గోల్‌కీపర్‌వు, కుడి లేదా ఎడమ చేతి వాటం?

329
00:19:09,400 --> 00:19:10,320
కుడి.

330
00:19:10,440 --> 00:19:11,800
-ఏ కాలు?
-కుడి.

331
00:19:12,280 --> 00:19:14,960
-పెళ్లయిందా, భాగస్వామి లేదా పిల్లలు?
-భాగస్వామి.

332
00:19:15,040 --> 00:19:16,720
-భాగస్వామి ఉందా?
-ఉంది.

333
00:19:17,080 --> 00:19:20,520
ఈ రోజు చివరకు
నా నంబర్ ఇస్తాను, నీకు గానీ, లేదా

334
00:19:20,560 --> 00:19:25,440
నీ భాగస్వామికి, లేదా కుటుంబానికి,
ఏ సమస్య వచ్చినా సరే,

335
00:19:25,520 --> 00:19:28,280
నాకు ఫోన్ చెయ్యి,
మేము చూసుకుంటాం.

336
00:19:28,320 --> 00:19:30,440
-ఇక, ఇప్పుడు ఏ గాయాలు లేవా?
-లేవు.

337
00:19:30,520 --> 00:19:31,920
చివరగా ఎప్పుడు గాయమైంది?

338
00:19:32,000 --> 00:19:34,560
-నా ఆటను ఏది ఆపిందనా?
-అవును.

339
00:19:34,680 --> 00:19:37,400
గుర్తు లేకపోతే మంచిదే,
మంచి విషయమే.

340
00:19:37,480 --> 00:19:39,320
-చేయి, మోచేయి?
-లేదు.

341
00:19:39,400 --> 00:19:40,480
-మణికట్టు?
-లేదు.

342
00:19:40,560 --> 00:19:42,080
వేళ్లు, చేతులు, విరగలేదా...

343
00:19:42,200 --> 00:19:44,080
-కొన్ని విరిగాయి...
-బొటనవేలు.

344
00:19:44,160 --> 00:19:47,560
-అప్పటి నుంచి ఏదైనా సమస్య?
-లేదు. అది ఓ వంగిన గాయం.

345
00:19:48,240 --> 00:19:50,560
అంతేనా? వేరే గాయాలు లేవు.

346
00:19:50,640 --> 00:19:54,000
ఎప్పుడైనా ఆపరేషన్ అయిందా?
అసలు నీకేదైనా ఆపరేషన్ జరిగిందా?

347
00:19:54,080 --> 00:19:55,520
గజ్జలు? హెర్నియాలు?

348
00:19:55,560 --> 00:19:57,800
నాకు పదేళ్ల వయసులో,
చేయి విరిగింది.

349
00:19:58,560 --> 00:20:00,080
అదెలా జరిగిందో గుర్తుందా?

350
00:20:01,680 --> 00:20:03,240
అడగకుండా ఉండడం సరైనదా?

351
00:20:03,320 --> 00:20:06,080
కిందకు జారుతూ
స్కేట్‌బోర్డ్ పైనుంచి పడ్డాను.

352
00:20:07,320 --> 00:20:08,320
మంచి పిల్లాడివి.

353
00:20:09,800 --> 00:20:12,720
గొప్ప గోల్‌కీపర్
అక్కడే మొదలయ్యాడు. నచ్చింది.

354
00:20:13,880 --> 00:20:18,040
మ నాన్న, సోదరులతో కలిసి
మైదానాలలో ఆడేవాడిని,

355
00:20:18,080 --> 00:20:20,240
"ఎక్కడ ఆడతావు?" అని నాన్న అడిగేవాడు.

356
00:20:20,320 --> 00:20:23,000
"గోల్‌లో," అని చెబితే,
"నీకు పిచ్చా?" అనేవాడు.

357
00:20:23,080 --> 00:20:24,920
నా భుజాలు తడుముకున్నాను.

358
00:20:26,560 --> 00:20:29,720
మడ్ దగ్గర డైవ్ చేయడం
ఉత్తేజకరంగా భావించాను.

359
00:20:30,280 --> 00:20:34,640
సేవ్ చేయడం, డోపీలా, జోకర్‌లా
అలా ఉండడం లాంటివి.

360
00:20:34,800 --> 00:20:36,400
నీకు కుర్రాళ్లు తెలుసా?

361
00:20:36,480 --> 00:20:39,560
బెన్, బుకాయో, ఎమిలే, రీస్...

362
00:20:40,720 --> 00:20:42,440
-అందరూ ఇంగ్లాండ్ నుంచేనా?
-అవును.

363
00:20:42,520 --> 00:20:45,800
నేను బోల్టన్‌లో ఉండగా
నాకు రాబ్ కొంచెం తెలుసు.

364
00:20:46,680 --> 00:20:48,680
-బోల్టన్‌లోనూ ఉన్నావు.
-చిన్న వయసులో.

365
00:20:48,760 --> 00:20:50,280
-కుదరదు.
-అవును.

366
00:20:50,320 --> 00:20:54,480
నేను బోల్టన్‌లో అకాడమీలో ఉండగా,
12 నుంచి 16 వరకు

367
00:20:54,560 --> 00:20:57,560
కాంట్రాక్టులు వచ్చాయి, ఓ కారణంతోనే

368
00:20:57,640 --> 00:21:01,080
అకాడమీలో ఉన్నానని
ప్రతిభ ఉందని గ్రహించాను,

369
00:21:01,160 --> 00:21:05,240
కానీ నాకు 17, 18 నిండేవరకూ
షెఫ్ యునైటెడ్‌తో

370
00:21:05,320 --> 00:21:07,800
మెరుగైన ఆరంభం పొందేవరకూ
నేనేమీ ఆలోచించలేదు

371
00:21:07,920 --> 00:21:10,320
నిజంగా ఆ బృందంలో భాగంగా ఉన్నాను,

372
00:21:10,440 --> 00:21:13,800
బహుశా అప్పుడే అనుకున్నా,
"సరే, నాకు అవకాశం లభించింది"

373
00:21:13,920 --> 00:21:16,040
ఆరు నెలల తర్వాత
బోర్న్‌మత్‌లో ఉన్నా.

374
00:21:18,480 --> 00:21:21,240
అతను బోర్న్‌మత్‌లో చేరే ముందు సీజన్‌లో
కిందకు జారారు.

375
00:21:21,320 --> 00:21:23,000
అది చాలా డబ్బు కావచ్చు.

376
00:21:23,080 --> 00:21:26,080
నిజంగా చెబితే,
నాకు రామ్స్‌డేల్ అంతగా అర్థం కాలేదు.

377
00:21:27,280 --> 00:21:29,000
వాళ్లంతా ఇపుడు బాంటర్ ఎఫ్‌సీ.

378
00:21:30,960 --> 00:21:36,160
ఇన్‌స్టాగ్రాం, ట్విట్టర్‌లలో నా కామెంట్లు,
ఇంకా అన్నీ ఆఫ్ చేసే నిర్ణయం తీసుకున్నాను.

379
00:21:36,240 --> 00:21:37,720
వాటిని వినే అవసరం లేదు.

380
00:21:37,800 --> 00:21:41,280
నేను వినాల్సిన ఏకైక అభిప్రాయం
మేనేజర్‌ది మాత్రమే,

381
00:21:41,320 --> 00:21:42,640
అతనే జట్టును ఎంచుకుంటాడు.

382
00:21:42,720 --> 00:21:45,520
నా జట్టు సభ్యులు, నా కుటుంబం
అభిప్రాయాలు వినాలి

383
00:21:45,560 --> 00:21:49,920
వాళ్లే అన్ని పరిస్థితులలో,
నా ప్రయాణంలో ఉన్నారు.

384
00:21:53,920 --> 00:21:58,040
జనాలకు అసూయ, జనాలు చంచలం,
తాము మెరుగ్గా చేయగలమని అనుకుంటారు.

385
00:21:58,120 --> 00:22:01,760
నా అభిప్రాయంలో అదో సాకు,
కీబోర్డ్ వెనకాల దాక్కుంటావు.

386
00:22:01,840 --> 00:22:03,120
అలా తప్పించుకోవడం తేలిక.

387
00:22:05,680 --> 00:22:08,120
వాటిని చదవడం మొదలుపెడితే,
చెడు అవుతుంది,

388
00:22:08,200 --> 00:22:10,840
మీ మానసిక స్థితికి చెడు జరుగుతుంది.

389
00:22:10,920 --> 00:22:14,560
నన్ను చివరలో నిర్ణయిస్తే,
స్వీకరణ ఎలా ఉంటుందో చూద్దాం.

390
00:22:14,640 --> 00:22:19,320
ఆర్సెనల్ వర్సెస్ చెల్సియా
ఎమిరేట్స్ స్టేడియం - 22 ఆగస్టు, 2021

391
00:22:19,400 --> 00:22:21,200
ఆర్సెనల్! అదరగొట్టు!

392
00:22:25,200 --> 00:22:28,120
ఆర్సెనల్, ఆర్సెనల్, ఆర్సెనల్...

393
00:22:35,360 --> 00:22:38,720
సీజన్‌లో రెండవ లీగ్ మ్యాచ్
చెల్సియాతో జరగనుంది.

394
00:22:40,640 --> 00:22:42,560
ఆర్సెనల్ కెప్టెన్
ఒబామెయాంగ్ వచ్చాడు.

395
00:22:42,640 --> 00:22:45,240
కోవిడ్ నుంచి కోలుకున్నాక
బెంచ్ పైకి వచ్చాడు,

396
00:22:45,320 --> 00:22:48,960
కానీ 50 మిలియన్ పౌండ్ల డిఫెండర్
బెన్ వైట్ వైరస్ బారిన పడ్డాడు.

397
00:22:50,800 --> 00:22:54,400
తమ సొంత అభిమానుల ముందు
మికెల్ జట్టు ప్రదర్శన చేసి తీరాలి,

398
00:22:54,480 --> 00:22:57,040
లేకపోతే జనాలు అతనికి వ్యతిరేకంగా మారవచ్చు.

399
00:22:59,360 --> 00:23:02,920
ఒకవేళ పరిస్థితులు మెరుగవకపోతే
ఆర్సెనల్ అభిమానులు ఎంతకాలం పాటు

400
00:23:03,000 --> 00:23:04,720
వెనుక నిలుస్తారనేదే ప్రశ్న.

401
00:23:05,640 --> 00:23:08,840
కారణం ఆర్సెనల్‌కు గత సీజన్‌లో
మైదానంలో ఉండుంటే

402
00:23:08,920 --> 00:23:12,880
తమ భావనల గురించి ప్లేయర్లకు,
మేనేజర్‌కు తెలియజేసేవారు.

403
00:23:14,040 --> 00:23:16,240
ప్రస్తుతం ఆర్సెనల్ అభిమానిగా ఉండడం దారుణం.

404
00:23:16,320 --> 00:23:17,320
క్సీ
వినోదకుడు

405
00:23:17,400 --> 00:23:21,800
నిజాయితీగా చెబితే,
ఉత్సాహపరిచేందుకు ఇప్పుడేమీ లేదు.

406
00:23:22,560 --> 00:23:27,040
ఎన్నో లోట్లు, ప్రత్యేకించి మేము ఎన్నో
గొప్పవి చూసిన తర్వాత,

407
00:23:27,120 --> 00:23:30,680
మేము ఎప్పుడూ ఛాంపియన్స్ లీగ్‌లో
ఉండేవాళ్లం, అది విషాదం.

408
00:23:30,760 --> 00:23:32,400
అయితే వాళ్లతో ఎందుకు నిలవడం?

409
00:23:32,480 --> 00:23:37,040
ఎందుకంటే అలాగే ఉండాలి.
నేనిప్పుడు చెల్సియా అభిమాని కాలేను.

410
00:23:38,320 --> 00:23:40,680
లేదా టోటెన్‌హామ్...
లేదు, కనీసం అనుకోలేను.

411
00:23:43,000 --> 00:23:46,320
రండి. రండి, కుర్రాళ్లు. పదండి.
మీరు చేయగలరు. రండి.

412
00:23:46,400 --> 00:23:47,720
వెళ్లండి. ఆరంభ సమయం.

413
00:23:50,560 --> 00:23:51,760
శాంతంగా ఉండండి.

414
00:23:51,840 --> 00:23:55,080
సరే, ఈ వారం, గయ్స్,
మనమంతా బాధలో ఉన్నాం.

415
00:23:55,160 --> 00:23:58,760
మనం బాధపడుతున్నాం, ఎందుకంటే
చాలామంది మన గౌరవాన్ని గాయపరిచారు.

416
00:24:00,240 --> 00:24:03,200
మిమ్మల్ని గేమ్ తర్వాత చూశాను,
మీకు ఎంత పట్టింపు ఉందోనని,

417
00:24:03,280 --> 00:24:04,240
అది నాకు బాధ.

418
00:24:04,320 --> 00:24:06,320
అది మీ కోసం, సిబ్బంది అందరి కోసం,

419
00:24:06,400 --> 00:24:09,640
ఫుట్‌బాల్ క్లబ్‌లో మన కోసం పట్టింపు ఉండే
అందరి కోసం బాధపడ్డాను.

420
00:24:09,720 --> 00:24:12,080
నా కోసం, విమర్శలు లేదా దేని కోసం కాదు.

421
00:24:12,160 --> 00:24:15,320
మీ కోసం, గయ్స్,
కారణం మీరెంత కష్టపడ్డారో నాకు తెలుసు.

422
00:24:15,760 --> 00:24:19,600
కానీ, ఇవాళ, ఇక్కడ
ఒకటి నిరూపించే అవకాశం ఉంది

423
00:24:19,680 --> 00:24:24,080
అందరూ మీకు వ్యతిరేకంగా ఉంటే
మీరిక్కడ బలంగా నిలబడ్డారు, గయ్స్.

424
00:24:25,960 --> 00:24:29,240
హోమ్ ఓపెనర్‌లో ఆర్సెనల్
తప్పక వేగం పుంజుకోవాలి

425
00:24:29,320 --> 00:24:34,440
గనర్స్‌గా యూరోపియన్ ఛాంపియన్స్ చెల్సియాకు
ఎమిరేట్స్ స్టేడియంకు స్వాగతం.

426
00:24:34,520 --> 00:24:37,360
ఇంటర్ నుండి 100 మిలియన్ పౌండ్ల
మార్పు కారణంగా

427
00:24:37,440 --> 00:24:40,320
రొమేలు లుకాకు నేరుగా
వెలుగులోకి వచ్చాడు.

428
00:24:41,440 --> 00:24:44,000
ఇక ఆరంభమైంది.
ఇది వినండి.

429
00:24:44,960 --> 00:24:48,600
ఎమిరేట్స్ స్టేడియంకు
ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ తిరిగొచ్చింది.

430
00:24:49,880 --> 00:24:52,000
సొంత అభిమానుల అరుపులు ఉన్నా,

431
00:24:53,200 --> 00:24:57,400
ఆర్సెనల్ వెంటనే ఒత్తిడిలో పడింది,
చెల్సియా మొదటి గోల్ కొట్టింది.

432
00:24:58,280 --> 00:25:00,600
కుడి చేతి వైపు జేమ్స్,
పెనాల్టీ ఏరియాలో,

433
00:25:00,680 --> 00:25:02,920
లుకాకుకు ఎత్తు తక్కువ
అవకాశం, తీసుకున్నాడు!

434
00:25:03,000 --> 00:25:04,360
ఆర్సెనల్ 0 - 1 చెల్సియా
లుకాకు 15

435
00:25:04,440 --> 00:25:07,560
వాళ్ల భారీ డబ్బు ఒప్పందం
త్వరగానే ఫలితం ఇచ్చింది.

436
00:25:07,640 --> 00:25:09,560
అది చాలా తేలికైన గోల్.

437
00:25:21,920 --> 00:25:25,480
మార్కస్ అలోన్సో, హావెర్జ్ బాగా ఆడాడు,
తను రొమేలు లుకాకు

438
00:25:25,560 --> 00:25:27,800
ఇప్పుడు మౌంట్ నుంచి జేమ్స్ వైపు,

439
00:25:29,600 --> 00:25:32,800
దానిని తన శైలిలో
గొప్పగా నెట్‌లోకి కొట్టాడు.

440
00:25:32,880 --> 00:25:33,920
ఆర్సెనల్ 0 - 2 చెల్సియా
జేమ్స్ 35

441
00:25:34,000 --> 00:25:37,560
రెండు, సున్నా, స్టేడియంలో
శక్తి తగ్గిపోయింది.

442
00:25:43,720 --> 00:25:46,840
ఇక్కడ ఎమిరేట్స్ స్టేడియంలో హాఫ్ టైమ్,

443
00:25:46,920 --> 00:25:49,920
ఆర్సెనల్ మద్దతుదారుల నుంచి
ఒకటి రెండు వెక్కిరింపులు.

444
00:25:58,520 --> 00:26:00,240
రెండు. ఒకటి కాదు, రెండు.

445
00:26:01,320 --> 00:26:02,640
రొమేలు బాగా ఆడుతున్నాడు,

446
00:26:03,000 --> 00:26:04,280
మనం వెనుకకు వెళుతున్నాం.

447
00:26:04,360 --> 00:26:06,920
అతని ముందు ఉండేందుకు
తనను ఆఫ్‌సైడ్ వెళ్లనీయండి.

448
00:26:07,000 --> 00:26:08,160
అది ఎలా పరిష్కరించాలి?

449
00:26:08,240 --> 00:26:12,560
మనం వింగర్‌ను మార్క్‌కు, మేసన్‌కు పిలవాలి
అప్పుడు లుకాకు ముందు ఉంటారు.

450
00:26:12,640 --> 00:26:14,280
మనకున్నది అదొక్కటే అవకాశం.

451
00:26:15,360 --> 00:26:19,440
గయ్స్, మన లైన్ హైట్‌ను
లుకాకు నిర్దేశిస్తున్నాడు.

452
00:26:19,520 --> 00:26:22,560
లుకాకు ఇక్కడుంటే,
మనం ఇక్కడున్నాం, బాల్ ఇక్కడుంది.

453
00:26:22,640 --> 00:26:25,080
మనకు బాల్ ఎక్కడుండాలో
మనం నిర్దేశించాలి.

454
00:26:25,160 --> 00:26:28,200
బాల్ ఒత్తిడిలో ఉన్నప్పుడు
అతనిని ఆఫ్‌సైడ్ ఆడేలా చేయాలి.

455
00:26:28,280 --> 00:26:30,080
అప్పుడు తను మనతో ఇరుక్కుంటాడు.

456
00:26:30,160 --> 00:26:33,400
వచ్చేటప్పుడు అవకాశాలు ఉన్నాయి,
పాయింట్లున్నాయి, గోల్ కావాలి,

457
00:26:33,480 --> 00:26:36,080
మనకు ఆశను, శక్తిని ఇచ్చేందుకు
మనకు గోల్ కావాలి.

458
00:26:36,160 --> 00:26:39,240
ఏం జరిగినా సరే,
ఒక ప్లేయర్ కూడా ఫిర్యాదు చేయకూడదు,

459
00:26:39,320 --> 00:26:42,880
ఒకరు నడిచినా చాలు,
స్పష్టంగా ఉందా? పదండి.

460
00:26:48,680 --> 00:26:51,320
మనం సెకండ్ హాఫ్‌లోకి వస్తున్నాం.

461
00:26:51,400 --> 00:26:55,880
సెకండ్ హాఫ్ మొదలయ్యాక, జనాలను
ఉత్సాహపరిచేందుకు ఆర్సెనల్ దారి వెతకాలి.

462
00:26:57,800 --> 00:26:59,960
సాకాకు కొట్టేందుకు పిలుపు,

463
00:27:00,640 --> 00:27:03,200
అతను అంతలో కొట్టాడు
మెండీ వేళ్లతో తోసేశాడు.

464
00:27:03,640 --> 00:27:04,840
అద్భుత హిట్.

465
00:27:05,160 --> 00:27:08,640
బ్యాక్ పోస్ట్ వైపు లోతుగా,
తిరిగి కొట్టారు, హెడర్‌తో,

466
00:27:08,720 --> 00:27:11,200
లేదు, అది టార్గెట్‌కు దూరం,
రాబ్ హోల్డింగ్.

467
00:27:14,720 --> 00:27:15,760
మార్టినెల్లి...

468
00:27:15,960 --> 00:27:17,040
ఓ కీలక మలుపు,

469
00:27:17,120 --> 00:27:19,920
ఆఫ్‌సైడ్‌ చూసే ఒబామెయాంగ్‌ వైపు
స్లిప్ చేసే యత్నం.

470
00:27:20,000 --> 00:27:22,880
ఇదుగో ఒబా,
నేరుగా మెండీ చేతుల్లోకి.

471
00:27:26,680 --> 00:27:27,680
రీస్ జేమ్స్...

472
00:27:30,240 --> 00:27:33,000
మేసన్ మౌంట్, లుకాకు వైపు మళ్లీ కొట్టాడు,

473
00:27:33,080 --> 00:27:36,000
బెర్న్‌డ్ లెనో అద్భుత సేవ్,
వుడ్‌వర్క్ వైపు.

474
00:27:36,080 --> 00:27:38,040
కానీ అసలు విషయం ఏమిటంటే,

475
00:27:38,120 --> 00:27:40,800
ఇది ఆర్సెనల్‌ ఆఫీస్‌కు
మంచి రోజు కాదు.

476
00:27:47,200 --> 00:27:51,440
ఇది ఫుల్ టైమ్.
మికెల్ ఆర్టెరా ఇక్కడ ఇంకా ఏదో చేయాలి.

477
00:27:52,800 --> 00:27:56,200
వరుస పరాజయాలు,
విమర్శకుల గొంతు తారాస్థాయికి చేరింది.

478
00:27:57,040 --> 00:28:00,240
మాకు ఇంత మంచి స్టేడియం ఉంది,
కానీ చివరకు

479
00:28:00,320 --> 00:28:04,400
ఇన్విన్సిబుల్ పొట్టలో ఉండే
అగ్ని మాత్రం లేనట్లుంది.

480
00:28:10,120 --> 00:28:14,000
-మేనేజర్‌ను వెంటనే గెంటేయండి.
-ఆర్టెరాను గెంటండి, వెంటనే.

481
00:28:14,520 --> 00:28:18,240
అభిమానులం, మాకు నాశనమైనట్లుగా ఉంది,
వెంటనే ఆర్టెరాను తీసేయాలి,

482
00:28:18,320 --> 00:28:20,080
వెళ్లాలి... అతను వెళ్లాలి.

483
00:28:20,160 --> 00:28:22,360
-సున్నా పాయింట్లు.
-అతనికి సమయం ఇవ్వాలి.

484
00:28:22,440 --> 00:28:24,120
లేదు. ఏం సమయం కావాలి?

485
00:28:24,200 --> 00:28:25,840
-సమయమా? ఏంటది?
-లేదు.

486
00:28:25,920 --> 00:28:28,760
-అతనికి సమయం ఇవ్వాలంటాను.
-లేదు. ఏం సమయం?

487
00:28:30,080 --> 00:28:32,040
ఆగు. ఈ క్లబ్ కలిసి రాలేదు.

488
00:28:32,120 --> 00:28:35,240
అతనికి సమయం ఇవ్వాలి,
కుర్రవాడు, మన మద్దతు ఉండాలి,

489
00:28:35,320 --> 00:28:37,360
కొన్ని గేమ్‌లు ఓడిపోతే వేధించరాదు.

490
00:28:39,160 --> 00:28:43,240
ఆర్సెనల్‌ మేనేజర్‌ను తిట్టిపోయడానికి
గేమ్ తర్వాత కొందరు అభిమానులు ఆగారు.

491
00:28:43,320 --> 00:28:45,080
ఆర్టెటా, అది సరిపోతుందా?

492
00:28:48,000 --> 00:28:50,640
మనం యువ జట్టు,
అందుకే కొన్ని కష్టాలు వస్తాయి.

493
00:28:50,720 --> 00:28:53,960
మీరు చెప్పేది అదే,
ఫుట్‌బాల్‌లో, క్రీడలో ఇలాగే ఉంటుంది.

494
00:28:54,040 --> 00:28:58,400
గెలుస్తూ ఉంటే, అందరూ కలిసుంటారు,
విజయం అన్నీ దాచేస్తుంది.

495
00:28:58,680 --> 00:29:01,480
అలాంటి ఓటమి తరువాత,
ఎప్పుడూ విచారిస్తావు.

496
00:29:01,560 --> 00:29:03,160
పరిస్థితులు బాగాలేనప్పుడు,

497
00:29:03,240 --> 00:29:05,920
డైరెక్టర్ బాక్స్ వైపు వేళ్లు చూపిస్తారు

498
00:29:06,000 --> 00:29:07,960
ఎందుకంటే జనాలు మార్పు ఆశిస్తారు

499
00:29:08,040 --> 00:29:11,640
మంచి అయినా, చెడు అయినా,
అది ప్రొఫెషనల్ గేమ్‌లలో పని చేస్తుంది.

500
00:29:11,720 --> 00:29:12,680
నా అంచనా బహిష్కరణ

501
00:29:12,760 --> 00:29:14,400
మీకు టాప్ నాలుగు లేనట్లే
హాస్య క్లబ్

502
00:29:14,480 --> 00:29:16,040
ఇబ్బందికరం

503
00:29:25,640 --> 00:29:28,080
మీరు విభిన్న క్షణాలు ఎదుర్కోవాలి,

504
00:29:28,160 --> 00:29:31,480
కొన్ని కష్టమైనవి,
చాలామంది పొడవాలని చూస్తారు,

505
00:29:31,560 --> 00:29:33,240
విమర్శలు వస్తాయి.

506
00:29:35,880 --> 00:29:40,360
మీరు నిలబడి మీ కోసం పోరాడాలి.
మీపై నమ్మకం ఉంచాలి.

507
00:29:43,560 --> 00:29:46,440
మేము చాలా ఒత్తిడి, విమర్శల మధ్యలో ఉన్నాం,

508
00:29:46,520 --> 00:29:51,280
కానీ ఓ క్లబ్‌గా, మాకు ఇక్కడున్న
ఐకమత్యాన్ని చూపేందుకు నిలబడాలి

509
00:29:51,360 --> 00:29:52,840
ఇంకా ముందుకు సాగాలి.

510
00:29:58,680 --> 00:29:59,840
మాంచెస్టర్‌కు స్వాగతం

511
00:29:59,920 --> 00:30:02,200
మాంచెస్టర్ సిటీ వర్సెస్ ఆర్సెనల్
ఎతిహాద్ స్టేడియం - 28 ఆగస్టు 2021

512
00:30:02,280 --> 00:30:04,120
గేమ్‌లు ఇకపై తేలికగా ఉండవు.

513
00:30:04,200 --> 00:30:07,920
తరువాత ప్రీమియర్ లీగ్ ఛాంపియన్స్,
మాంచెస్టర్ సిటీతో ఆడాలి.

514
00:30:09,160 --> 00:30:13,040
మికెల్‌కు, పెప్ గార్డియోలాకు
అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్న క్లబ్‌కు

515
00:30:13,120 --> 00:30:14,600
ఇది తిరిగి పర్యటన.

516
00:30:18,560 --> 00:30:20,040
ఇదిగో మొదలైంది.

517
00:30:29,760 --> 00:30:34,600
జీసస్. సిల్వా తరచుగా చేసే విధంగా
పాస్ చేస్తున్నాడు.

518
00:30:36,960 --> 00:30:40,360
జీసస్ అతనితో...
అది మంచి గేమ్, బ్యాక్ పోస్ట్‌లోకి.

519
00:30:40,440 --> 00:30:41,960
ఇంకా సిటీకి ఆధిక్యం.

520
00:30:42,040 --> 00:30:43,920
మాన్ సిటీ 1 - 0 ఆర్సెనల్
గుండోగాన్ 7

521
00:30:52,080 --> 00:30:54,520
కాన్సెలో. మళ్లీ గుండోగాన్.

522
00:30:55,480 --> 00:30:56,960
ఇప్పుడు సిల్వా డెలివరీ.

523
00:30:57,880 --> 00:31:01,160
విభిన్న రకమైన డెలివరీ,
కానీ అది దూసుకుపోయింది.

524
00:31:01,240 --> 00:31:02,400
మాన్ సిటీ 2 - 0 ఆర్సెనల్
ఎఫ్. టోరెస్ 12

525
00:31:02,480 --> 00:31:04,920
మాంచెస్టర్ సిటీ
అవకాశం రెట్టింపు చేసుకుంది.

526
00:31:05,000 --> 00:31:09,400
ఆర్సెనల్ అభిమానులకు
ఇది సుదీర్ఘ మధ్యాహ్నమనే భావన కలుగుతుంది.

527
00:31:26,240 --> 00:31:29,320
కాన్సెలో మీద చాకా మరొక పెద్ద సవాలు.

528
00:31:38,880 --> 00:31:41,080
గ్రానిట్ చాకాకు రెడ్ కార్డ్.

529
00:31:42,120 --> 00:31:45,680
ఆర్సెనల్‌కు మధ్యాహ్నం
దారుణం నుంచి ఘోరంగా మారింది.

530
00:31:47,320 --> 00:31:50,840
ఇక చూసినది చాలు అనుకుని
ఆర్సెనల్ అభిమానులు,

531
00:31:50,920 --> 00:31:52,800
నిష్క్రమణ వైపు వెళుతున్నట్లు ఉంది.

532
00:31:58,840 --> 00:32:01,160
కొంచెం పోటీ పడి, పోరాటం చూపడం కావాలి.

533
00:32:01,240 --> 00:32:05,760
అక్కడ తగినంతగా చూపడం లేదు,
మీరు ఇంకా పాటను వినవచ్చు,

534
00:32:05,840 --> 00:32:08,720
సిటీ అభిమానులను వినలేము,
సాకా, రోవ్ పాడుతున్నారు,

535
00:32:08,800 --> 00:32:10,960
ఇది బాధాకరం,
కారణం మాకు ఉన్న అభిరుచి

536
00:32:11,040 --> 00:32:13,480
అది పిచ్‌పై పరస్పరం కనబడిన భావన లేదు.

537
00:32:17,920 --> 00:32:20,440
జాక్ గ్రీలిష్ ఎడమవైపు ఆడుతున్నాడు.

538
00:32:20,520 --> 00:32:24,080
చాంబర్స్‌తో గ్రీలిష్ తలపడుతున్నాడు.
మధ్యలో గ్రీలిష్.

539
00:32:28,600 --> 00:32:30,600
మాన్ సిటీ, మూడు, సున్నా.

540
00:32:31,760 --> 00:32:34,600
ఇలాంటి రోజులలో,
మీరు అన్నిటిపై ఆశ్చర్యపోతారు.

541
00:32:35,160 --> 00:32:40,120
ఆర్టెటా వెళ్లాలి. పైనుంచి కిందవరకు
అన్నీ మారాలి, క్లబ్ కుళ్లిపోయింది.

542
00:32:40,200 --> 00:32:43,080
రోడ్రి, లోపలకు పాస్ చేయగలిగాడు.

543
00:32:43,160 --> 00:32:45,480
మాన్ సిటీ 4 - 0 ఆర్సెనల్
రోడ్రి 53

544
00:32:47,360 --> 00:32:50,280
సీజన్‌లో తొలి గేమ్, చెత్త.

545
00:32:50,840 --> 00:32:53,640
రెండవ గేమ్, చెత్త.
మేము ఒక గోల్ కూడా కొట్టలేదు,

546
00:32:53,720 --> 00:32:57,320
గోల్ కొడతామని కూడా
మేము బెదిరించలేదు, అది భయానకం.

547
00:32:57,400 --> 00:33:00,200
నా జీవితంలో చూసినవాటిలో
ఇది చెత్త ఆర్సెనల్ జట్టు.

548
00:33:03,200 --> 00:33:07,960
మాన్ సిటీ 5 - 0 ఆర్సెనల్
ఎఫ్. టోరెస్ 84'

549
00:33:10,560 --> 00:33:13,640
మార్టిన్ అట్కిన్సన్‌
గేమ్‌ను చివరకు చేర్చాడు.

550
00:33:17,200 --> 00:33:19,120
ఇది భయానకం. ఇది ఇబ్బందికరం.

551
00:33:19,200 --> 00:33:22,920
నేను, ఇతర అభిమానులు
ప్రక్రియను నమ్ముతారని అనుకోను,

552
00:33:23,000 --> 00:33:25,880
ప్లేయర్లు కూడా ఈ ప్రక్రియను నమ్మకపోవచ్చు.

553
00:33:25,960 --> 00:33:30,320
మన్నించాలి, అతని సమయం... ముగిసింది.
అతను వెళ్లిపోవాలి.

554
00:33:30,400 --> 00:33:34,840
అతనికి తన ఆరంభ 11 గురించి తెలియదు.
తను ఆచరణలో అసమర్ధుడు.

555
00:33:34,920 --> 00:33:37,600
తొలగింపునకు గురయ్యే
మొదటి మేనేజర్ అతనే.

556
00:33:37,680 --> 00:33:39,880
మరుసటి స్థాయికి తీసుకెళ్లేది ఇతనేనా?

557
00:33:39,960 --> 00:33:41,240
కాదనే చెప్పాలి.

558
00:33:41,560 --> 00:33:43,240
ఛాంపియన్స్ లీగ్ అర్హత

559
00:33:43,320 --> 00:33:47,360
మూడు గేమ్‌ల తరువాత, ఆర్సెనల్‌కు
టేబుల్‌లో చదివేందుకు సంతోషం లేదు.

560
00:33:47,440 --> 00:33:50,040
అట్టడుగున ఉన్నారు,
పరిస్థితులు దారుణం చేసేందుకు,

561
00:33:50,120 --> 00:33:53,600
వారి నార్త్ లండన్ ప్రత్యర్ధి, టోటెన్‌హామ్,
లీగ్‌లో అగ్రస్థానం.

562
00:33:56,640 --> 00:34:01,040
మనం లీగ్‌లో అట్టడుగున ఉన్నాం,
సున్నా గోల్స్, తొమ్మిది ఇచ్చాం.

563
00:34:02,000 --> 00:34:03,280
సున్నా పాయింట్లు.

564
00:34:04,640 --> 00:34:07,320
ఇంకా అందరితోనూ తిట్లు తింటున్నాం.

565
00:34:09,199 --> 00:34:12,920
క్లబ్‌లో చేరిన తరువాత
నేను ఎదుర్కునే అతి పెద్ద సవాలు ఇదే.

566
00:34:16,280 --> 00:34:19,800
కష్ట సమయాలలో మిమ్మల్ని ప్రశ్నించుకుంటారు,
భయాలు ఉంటాయి,

567
00:34:21,280 --> 00:34:25,280
మీ మనసులో కష్టమైనవి జరుగుతాయి.
తిరిగి గాడిలో పెట్టగలనా?

568
00:34:25,920 --> 00:34:29,000
రేపు తిరిగి వెళ్లే శక్తి నాలో ఉందా,

569
00:34:29,080 --> 00:34:31,360
నేను అందించేది అందించగలనా?

570
00:34:31,440 --> 00:34:32,800
మేము ఆ పని ఎలా చేయాలి?

571
00:34:34,760 --> 00:34:37,639
మేము చేసే పనిని
ప్రజలు నమ్ముతారా?

572
00:34:38,520 --> 00:34:40,639
మీకు మద్దతు ఇచ్చేందుకు మీ చుట్టూ

573
00:34:40,679 --> 00:34:45,120
సరైన వ్యక్తులు ఉండాలి, కొన్నిసార్లు
మీరు కష్టంలో ఉంటే సహాయం చేయగలవారు ఉండాలి.

574
00:34:47,880 --> 00:34:48,679
ఎలా ఉన్నావు?

575
00:34:48,800 --> 00:34:49,960
ఆ, బాగున్నాను.

576
00:34:51,159 --> 00:34:53,880
మనకు నిలకడ కావాలి.
మనకు ఇదేదీ అవసరం లేదు...

577
00:34:54,080 --> 00:34:58,640
చాలామంది బృందాన్ని దెబ్బ తీయాలని చూడడం
నాకు కోపంగా ఉంది, తెలుసా?

578
00:34:59,480 --> 00:35:01,320
మేము అది చాలా ఎదుర్కున్నాం.

579
00:35:02,800 --> 00:35:06,440
నువ్వు నమ్మగలిగేది ఈ గదిలో ఉన్న
నీతో ఉన్నవాళ్లే.

580
00:35:07,680 --> 00:35:08,960
నాకు అంతవరకే తెలుసు.

581
00:35:09,040 --> 00:35:10,480
ఆ పదం చాలా...

582
00:35:11,200 --> 00:35:12,600
కనుగొనడం కష్టం.

583
00:35:14,040 --> 00:35:15,920
చాలావరకు. చాలావరకు.

584
00:35:16,880 --> 00:35:19,160
కానీ ముందు ముందు తెలుస్తుంది.

585
00:35:19,960 --> 00:35:21,040
-అవును.
-సరే.

586
00:35:21,840 --> 00:35:24,160
కథనాల గురించి తెలుసుకోవడం
నా పనిలో భాగం,

587
00:35:24,280 --> 00:35:26,880
బయట జరిగే విషయాలు,
వాటిని నమ్ముతానని కాదు,

588
00:35:26,960 --> 00:35:30,480
లేదా శ్రద్ధ పెడతానని కాదు,
కానీ ఏం చెబుతున్నారో తెలుసుకోవాలి.

589
00:35:30,560 --> 00:35:32,920
కానీ మా ప్రధాన లక్ష్యం ఏంటంటే

590
00:35:33,000 --> 00:35:37,000
"గోల వినకూడదు, మన తలలు వంచుకుని,
ఒకరినొకరు మద్దతు ఇచ్చుకోవాలి."

591
00:35:37,640 --> 00:35:40,920
కొన్ని సమయాలలో ప్రతివారికి
ఎవరైనా మద్దతు ఇవ్వాలి.

592
00:35:43,680 --> 00:35:48,040
బదిలీ విండో మూసేసే ముందు
ఆర్సెనల్ మరొక ఒప్పందం చేసుకుంది.

593
00:35:48,560 --> 00:35:49,400
ఎడ్యు గాస్పర్

594
00:35:49,480 --> 00:35:54,120
మనం వెంటనే ఆరంభించగలం. ఇక, టొమియసు
ప్లేయర్‌తో ఒప్పందం ఖరారు చేశాడు.

595
00:35:54,160 --> 00:35:56,480
నిజంగా ఇప్పుడు
కాగితం పని సంతకం చేయడమే...

596
00:35:56,560 --> 00:36:00,000
వైద్య పరీక్షలు నిర్ధారణపై సంతోషం,
చేతిలో ఉన్నది అంతే.

597
00:36:00,080 --> 00:36:01,960
మనం సరైన ఆకృతిలో ఉన్నామోమో.

598
00:36:02,880 --> 00:36:06,320
టకిహీరో టొమియసు,
జపనీస్ అంతర్జాతీయ రైట్ బ్యాక్

599
00:36:06,400 --> 00:36:09,760
బొలోన్యాతో 17 మిలియన్ పౌండ్లకు
సంతకం చేశాడు.

600
00:36:11,360 --> 00:36:16,000
మొత్తంగా, ఆర్సెనల్ ఈ వేసవిలో
156 మిలియన్ పౌండ్లు వెచ్చించింది.

601
00:36:19,560 --> 00:36:21,640
వరుస మూడు ఓటముల తరువాత,

602
00:36:21,760 --> 00:36:24,200
కొన్ని మార్పులు చేయడంపై
మికెల్ ఆలోచిస్తున్నాడు.

603
00:36:25,200 --> 00:36:29,160
బెర్న్‌డ్ లెనో మూడేళ్లుగా ఆర్సెనల్‌కు
నంబర్ వన్ గోల్‌కీపర్‌గా ఉన్నాడు,

604
00:36:29,560 --> 00:36:33,200
కానీ ఆరన్ రామ్స్‌డేల్‌తో కొత్త ఒప్పందం
చేసుకోవడంతో పోరు జరగనుంది.

605
00:36:34,800 --> 00:36:38,560
కాలంతో పాటు నా స్థానం గురించి తెలుసు,
ఇంకా చేయాలి...

606
00:36:38,640 --> 00:36:42,480
టాప్‌కు చేరడానికి, టాప్‌లో ఉన్నవారిని
ఓడించేందుకు ప్రయత్నించాలి.

607
00:36:42,560 --> 00:36:46,520
కొన్నిసార్లు స్వార్ధంగా ఉండాలి
కారణం మీరు నంబర్ వన్ అయినప్పుడు,

608
00:36:46,600 --> 00:36:50,080
విమర్శలు వస్తాయి, కానీ మీకు గ్లామర్,
ఇంకా కీర్తి కూడా ఉంటాయి,

609
00:36:50,160 --> 00:36:52,840
ఇంకా మ్యాచ్‌లు ఆడడం నుంచి ఊరట...

610
00:36:52,920 --> 00:36:54,600
అదే నాకు ప్రోత్సాహం.

611
00:36:54,640 --> 00:36:59,640
నార్విచ్ నాకు తెలుసు, ఇది భారీ గేమ్,
జట్టులో చేరడమే నా లక్ష్యం.

612
00:37:01,080 --> 00:37:04,160
మేము ఎదుర్కుంటున్న కఠిన సమయాలలో
జట్టు మెరుగయ్యేందుకు.

613
00:37:10,360 --> 00:37:13,560
ప్రీమియర్ లీగ్‌లో
ఇది చరిత్రలోనే వాళ్ల చెత్త ఆరంభం.

614
00:37:13,640 --> 00:37:17,160
మరొక ఓటమిపై ఆలోచించలేమని
కోల్నీలో అందరికీ తెలుసు.

615
00:37:17,280 --> 00:37:21,160
దాదాపు 100 సంవత్సరాలలో తమ మొదటి
నాలుగు గేమ్‌లను వాళ్లు ఏనాడూ ఓడిపోలేదు.

616
00:37:21,280 --> 00:37:24,160
మొదటగా, వాళ్లను ఆడనిద్దాం,
ఉదాహరణకు, వీరితో...

617
00:37:24,200 --> 00:37:26,920
ఎక్కువ సూచనలు ఇవ్వడం
ఆరంభించేలా చేయాలి,

618
00:37:27,000 --> 00:37:29,120
ఓడిపోతామని అనిపించకుండా.

619
00:37:29,160 --> 00:37:30,840
ఇక సగం ఆట గడుస్తుంది.

620
00:37:30,920 --> 00:37:33,160
ఎలా చేయగలం,
వాళ్లను ఐదు నిమిషాలు ఆడనీయాలా?

621
00:37:33,200 --> 00:37:35,520
అతను తన జీవితమంతా
ఒత్తిడి నిర్వహించాడు.

622
00:37:36,800 --> 00:37:39,640
తను పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి
ఉన్నత స్థాయిలో ఆడేవరకూ

623
00:37:39,680 --> 00:37:42,600
ఇప్పుడు శిక్షణ, నిర్వహణ
అత్యున్నత స్థాయిలో చేయడం,

624
00:37:42,640 --> 00:37:44,760
అది లేకుండా ప్రపంచం అతనికి తెలియదు.

625
00:37:44,840 --> 00:37:47,200
మనం చర్చించిన
నాలుగు పాయింట్లకు వెళతాం,

626
00:37:47,320 --> 00:37:50,280
డిఫెన్స్ చేసుకుని,
ప్రెస్ మీద దూకుడుతో.

627
00:37:50,360 --> 00:37:54,160
తమ స్థానాలలో ఉన్న అత్యుత్తమ వ్యక్తులు
దానిని స్వీకరించగలరు

628
00:37:54,200 --> 00:37:55,640
ఇంకా అది కావాలి.

629
00:37:55,760 --> 00:38:00,360
ఏం చేయాలనే అంశంపై అతను
చాలా దృష్టి, ఏకాగ్రత పెట్టాడు.

630
00:38:00,680 --> 00:38:02,480
అంతే. సరే, ధన్యవాదాలు.

631
00:38:12,320 --> 00:38:15,600
ఇది ఆర్సెనల్ అనే నిజం నుంచి దాక్కోవద్దు.

632
00:38:17,080 --> 00:38:19,160
మీరు టాప్ ఫోర్‌లోకి చేరాలి.

633
00:38:20,200 --> 00:38:23,800
తప్పకుండా, గౌరవం నిలబడాలి
కొన్నిసార్లు జనాలు మేనేజర్ దగ్గరకు

634
00:38:23,880 --> 00:38:27,600
వెళ్లి ఇలా అనడం నాకు కోపం తెప్పిస్తుంది,
"అతను అది చేయలేడు."

635
00:38:27,640 --> 00:38:30,200
లేదు, వాళ్లు అది చేయలేరు.

636
00:38:34,560 --> 00:38:37,200
వరుసగా రెండు గేమ్‌లు ఓడిపోయాక,
అది బాగాలేదు.

637
00:38:37,320 --> 00:38:40,120
వరుసగా మూడు ఓడిపోయాక,
అది నిజంగా దారుణం అవుతుంది.

638
00:38:40,160 --> 00:38:43,120
సీజన్ ఆరంభంలోనే
సున్నా పాయింట్లు ఉంటే,

639
00:38:43,160 --> 00:38:44,680
అది బహిష్కరణ ఫామ్.

640
00:38:44,800 --> 00:38:46,400
ఆర్సెనల్ బార్బర్స్
ధరల పట్టిక

641
00:38:46,480 --> 00:38:50,640
నా వయసు 22, నా క్లబ్
ప్రీమియర్ లీగ్ గెలవడం నేను చూడలేదు,

642
00:38:50,680 --> 00:38:54,640
ఇంకా చూసిన అందరూ, మా నాన్న, మామయ్యలు
అందరూ నాకు చెప్పే మాట,

643
00:38:54,680 --> 00:38:57,600
ఇది ఆర్సెనల్ కాదు,
"ఇలా చూసే అలవాటు మాకు లేదు."

644
00:39:01,120 --> 00:39:02,120
శుభోదయం.

645
00:39:03,280 --> 00:39:06,160
మికెల్ పురోగమించే ఆలోచనలు ఉన్న
ఆధునిక మేనేజర్.

646
00:39:06,280 --> 00:39:08,320
కోచింగ్ సిబ్బందితో పాటు,

647
00:39:08,400 --> 00:39:11,640
ప్లేయర్ల నుంచి ఉత్తమం వెలికితీయడంపై
తను దృష్టి పెట్టాడు.

648
00:39:11,680 --> 00:39:15,880
మనం ఆఫీసులో మాట్లాడాం, మనం దేనిపై
పని చేయాలో ఆ ఫోటోలను చూశాం.

649
00:39:15,960 --> 00:39:20,160
మొదటి విషయం, క్లీన్ షీట్,
గోల్స్ ఇవ్వకూడదు, మీ పని చేయాలి,

650
00:39:20,280 --> 00:39:23,960
మీరు చేయగలిగే సహాయం కూడా.
సరేనా? కానివ్వండి.

651
00:39:30,600 --> 00:39:34,280
బెన్. దాడి చేయడం, డిఫెండ్ చేయడంలో
నువ్వు చేసే కొన్ని పనులలో

652
00:39:34,360 --> 00:39:37,560
నీకు దూకుడు ఎక్కువ స్థాయిలో ఉంది,

653
00:39:37,640 --> 00:39:41,600
వెనుక లీడర్‌గా మారేందుకు
నువ్వు దాని నుంచి బయటపడాలి.

654
00:39:41,640 --> 00:39:46,280
మాది యువ జట్టు, వాళ్లు ఒత్తిడి
భరించగలరో లేదో నాకు తెలియదు.

655
00:39:46,360 --> 00:39:49,960
అందుకే వాళ్లలో ఒత్తిడి
ఉపశమనం కలిగేలా చేయాలి.

656
00:39:50,040 --> 00:39:52,160
బాగుంది. అంతే, ఎయిన్‌స్లీ.

657
00:39:52,280 --> 00:39:56,400
ఇంకా వాళ్లు,
మా వైపు మా మాట వినగలగాలి,

658
00:39:56,480 --> 00:39:59,760
వాళ్లను నమ్ముతామని భావించాలి,
వాళ్లపై నమ్మకముందని తెలియాలి,

659
00:39:59,840 --> 00:40:03,160
ఇంకా ఏం జరిగినా సరే
మేము వాళ్లను సమర్ధిస్తాం.

660
00:40:03,280 --> 00:40:06,000
ఇంకా అదే విధానం,
నేను ప్రయత్నం చేసేది.

661
00:40:06,360 --> 00:40:07,680
మరి ఎందుకు వెళతావు?

662
00:40:07,800 --> 00:40:08,960
నేను చేయలేదు. ఆగాను.

663
00:40:09,040 --> 00:40:13,280
సరే, నువ్వు ఆగి, వెళ్లినప్పుడు,
ఏం జరిగింది? అతనింకా అక్కడ లేడా?

664
00:40:13,360 --> 00:40:14,960
నువ్వతనితో మాట్లాడాలి...

665
00:40:15,040 --> 00:40:18,040
తను వచ్చీరాగానే, అతనే టాప్ మేనేజర్
అవుతాడని తెలుసు.

666
00:40:18,120 --> 00:40:19,800
వ్యూహాత్మకంగా చాలా గొప్పవాడు.

667
00:40:19,880 --> 00:40:22,840
అతను ఇచ్చే వివరాలు
మాకు చాలా సహాయపడతాయి...

668
00:40:22,920 --> 00:40:26,320
వరుస అనేది లేకపోతే, అది సృజనాత్మక కాదు.
అది గందరగోలం.

669
00:40:26,400 --> 00:40:29,280
ఈ గందరగోళాన్ని ఏదైనా విధంగా
మీరు చేయగలగాలి,

670
00:40:29,360 --> 00:40:31,000
అలా చాలా గమ్మత్తు అవుతుంది.

671
00:40:31,080 --> 00:40:34,760
మికెల్ చాలా ప్రత్యేకం.
నాకు చాలా మంది కోచ్‌లు ఉన్నా కానీ,

672
00:40:34,840 --> 00:40:38,840
అతను "విచిత్రవ్యక్తి,"
కానీ సానుకూల మార్గంలో,

673
00:40:38,920 --> 00:40:44,560
ఎందుకంటే తను వివరాలు చూస్తాడు,
అలాంటి కోచ్‌ను నేను చూడలేదు.

674
00:40:46,200 --> 00:40:50,520
అతను జట్టుతో కలిసే తీరు,
తను సృష్టించే వాతావరణం,

675
00:40:50,600 --> 00:40:54,520
అతను తెలివైనవాడు,
ఇంకా మేము గెలవాలి

676
00:40:54,600 --> 00:40:57,200
జట్టు ఎక్కడకు చేరాలో అక్కడకు చేర్చాలి.

677
00:41:02,600 --> 00:41:04,200
మూడు ఐదు ఐదు, బాగుంది, ఔబ్.

678
00:41:05,880 --> 00:41:09,440
నాది అదృష్టంగా భావిస్తాను
ఎందుకంటే ఆ ప్లేయర్లు,

679
00:41:09,520 --> 00:41:13,400
మేము ప్రయత్నించే దానికి
వాళ్లు నిజంగా అంగీకరించారు.

680
00:41:30,280 --> 00:41:32,120
మనం రేపు గెలవడం ఆరంభించాలి.

681
00:41:32,440 --> 00:41:35,640
మనం ఓడిపోయి, స్కోర్ చేయకపోతే,

682
00:41:35,680 --> 00:41:40,960
ఆర్సెనల్‌కు అతి చెత్త ఆరంభం ఇస్తాము,
ప్రీమియర్‌ లీగ్‌లో అతి చెత్త ఆరంభం.

683
00:41:41,040 --> 00:41:43,800
-చరిత్రలో.
-ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే.

684
00:41:46,960 --> 00:41:49,320
లేదు. మనం స్కోర్ చేస్తాం, మనం గెలుస్తాం.

685
00:41:51,080 --> 00:41:53,400
నేను అనుకోవడం
మూడు, సున్నా లేదా మూడు, ఒకటి.

686
00:41:53,480 --> 00:41:56,360
మూడు, ఒకటి ఎందుకు?
ఓ గోల్ ఇవ్వాలని దానర్థం.

687
00:41:56,440 --> 00:41:58,120
మూడు సున్నా లేదా మూడు ఒకటి అన్నా.

688
00:41:58,160 --> 00:42:00,120
క్లీన్ షీట్ కావాలని కోచ్ అన్నాడు.

689
00:42:05,040 --> 00:42:11,000
ఆర్సెనల్ వర్సెస్ నార్విచ్
ఎమిరేట్స్ స్టేడియం - 11 సెప్టెంబర్, 2021

690
00:42:11,080 --> 00:42:14,640
మికెల్ ఈ మ్యాచ్ ఓడిపోతే, ఇదే ఆర్సెనల్‌తో
అతనికి ఆఖరి మ్యాచ్ అని.

691
00:42:14,680 --> 00:42:16,640
అనేకమంది నిపుణుల అంచనా.

692
00:42:17,560 --> 00:42:21,880
మూడు లీగ్ గేమ్‌ల తరువాత,
గోల్స్ చేయలేదు, తొమ్మిది ఇచ్చారు.

693
00:42:21,960 --> 00:42:24,520
గెలవక తప్పదనేందుకు
ఇది నిర్వచనం.

694
00:42:26,920 --> 00:42:29,600
ఇవాళ ఈ గేమ్ కచ్చితంగా కీలకం.

695
00:42:29,640 --> 00:42:35,000
మూడు పాయింట్లు తప్పనిసరి. క్లీన్‌ షీట్,
ఇంకా గెలుపు కంటే వేరే ఏదైనా, కుదరదు.

696
00:42:35,080 --> 00:42:37,320
నలుగురు ప్లేయర్లు తిరిగి రావడం మంచిది,

697
00:42:37,400 --> 00:42:41,640
అందుకే మనం శాయశక్తులా కృషి చేయాలి.
తను సరైన జట్టు ఎంచుకుంటాడని ఆశిద్దాం.

698
00:42:46,600 --> 00:42:49,280
-మనకు కార్ పార్కింగ్ ఉంది.
-ఆరన్ రామ్స్‌డేల్ కోసం.

699
00:42:50,280 --> 00:42:53,000
అతని పేరు చెప్పమన్నారు.
మాకు చోటు ఉంది.

700
00:42:53,080 --> 00:42:54,120
-థాంక్స్.
-పర్లేదు.

701
00:42:54,160 --> 00:42:57,760
రామ్స్‌డేల్ కుటుంబం,
తమ బిడ్డ, ఆరన్‌కు అంకితమైన అనుచరులు.

702
00:42:58,200 --> 00:42:59,560
హాయ్. హలో మిమ్మల్నే.

703
00:42:59,640 --> 00:43:00,880
-హలో.
-హాయ్.

704
00:43:00,960 --> 00:43:03,800
కోవిడ్ నివారణగా, నేను అనుకోవడం
మా అమ్మానాన్నలు

705
00:43:03,880 --> 00:43:07,440
మూడు లేదా నాలుగేళ్లలో
రెండు గేమ్‌లు మిస్ అయుంటారు.

706
00:43:08,800 --> 00:43:12,400
వాళ్లు స్టాండ్స్‌లో ఉన్నారని తెలియడం,
నాకది గొప్ప విషయం.

707
00:43:13,000 --> 00:43:14,120
తను ఆడుతున్నాడు.

708
00:43:17,840 --> 00:43:21,840
హేయ్. అబ్బా, మొదలవుతోంది.

709
00:43:23,120 --> 00:43:26,600
ఒక ట్రైనింగ్ సెషన్ తరువాత
22 ఏళ్ల జపాన్ ఇంటర్నేషనల్,

710
00:43:26,640 --> 00:43:29,200
టకిహీరో టొమియసు అరంగేంట్రం.

711
00:43:29,320 --> 00:43:33,160
కానీ పెద్ద విషయం ఏంటంటే
గోల్ దగ్గర బెర్న్‌డ్ లెనో కంటే

712
00:43:33,280 --> 00:43:36,880
ఆరన్‌ రామ్స్‌డేల్‌కు ప్రాధాన్యత,
తను ఆర్సెనల్‌కు లీగ్ మొదటి ఆట.

713
00:43:37,320 --> 00:43:39,400
తను ఇప్పుడే పిచ్ మీదకొచ్చాడు.

714
00:43:47,200 --> 00:43:51,120
ప్రతి గేమ్‌లో మా అమ్మకు చేయి ఊపుతాను
అది బాగుంటుంది,

715
00:43:51,200 --> 00:43:55,120
అది వాళ్లకు గర్వం,
వారి మద్దతు ఉండడం గొప్ప విషయం

716
00:43:55,200 --> 00:43:59,320
ఎందుకంటే నేను బాగా ఆడినా, ఆడకపోయినా
వాళ్లు నాకు చెబుతారు.

717
00:43:59,400 --> 00:44:00,920
నాన్న కచ్చితంగా చెబుతారు.

718
00:44:02,160 --> 00:44:04,280
తను ప్రోగ్రాం కోసం మొదటిలో ఉన్నాడు.

719
00:44:06,760 --> 00:44:10,400
వారి అంకితభావం లేదా ప్రోత్సాహం లేకపోతే
ఇక్కడ ఉండేవాడివా?

720
00:44:10,480 --> 00:44:12,480
లేదు. కచ్చితంగా లేదు.

721
00:44:13,000 --> 00:44:18,000
దానిపై ముందుకెళ్లే అవసరం ఏమీ లేదు,
కచ్చితంగా లేదు. లేదు.

722
00:44:18,400 --> 00:44:21,400
వాళ్లిద్దరూ లేకుండా
నేను ఇక్కడ కూర్చునే అవకాశం లేదు.

723
00:44:24,640 --> 00:44:28,240
అతని భావన ఎలా ఉంటుంది?
నా ఆలోచన అదే, అతని ఆలోచన గురించి.

724
00:44:29,160 --> 00:44:31,600
అంటే, తనకు ఉత్సాహమని తెలుసు,
కానీ హమ్మయ్య.

725
00:44:36,640 --> 00:44:37,840
ఇప్పుడు ఉత్సాహం.

726
00:44:44,200 --> 00:44:46,920
ఇది మికెల్‌కు సుదీర్ఘ, భావోద్వేగ వారం

727
00:44:47,000 --> 00:44:50,400
ఇప్పుడు తన భావనలు ఏంటో
తన జట్టుకు చెప్పేందుకు సిద్ధమయ్యాడు.

728
00:44:54,880 --> 00:44:56,200
అందరికీ చక్కని మధ్యాహ్నం.

729
00:44:57,240 --> 00:45:00,640
ఇవాళ, మీకు ఓ వ్యక్తిగత
భావోద్వేగం గురించి చెబుతాను.

730
00:45:00,720 --> 00:45:02,920
ఇంకా నేనిక్కడ ఎందుకు ఉన్నానని.

731
00:45:08,200 --> 00:45:10,040
చాలా పరిశ్రమలలో,

732
00:45:10,720 --> 00:45:13,320
అధిక పనితీరు జట్లు ఉంటాయి,

733
00:45:14,880 --> 00:45:17,520
ఈ అధిక పనితీరు జట్లను
అలా పిలిచే కారణం,

734
00:45:17,600 --> 00:45:19,720
వాళ్లలో ఏదైనా విషయం ఉమ్మడిగా ఉంటుంది,

735
00:45:19,800 --> 00:45:21,640
కారణం వాళ్లు ఫలితాలు పొందుతారు.

736
00:45:22,320 --> 00:45:25,840
నేను పుట్టినప్పుడు,
పెద్ద గుండె జబ్బుతో పుట్టాను.

737
00:45:25,920 --> 00:45:28,760
రెండేళ్ల పాటు,
నా ప్రాణం నిలిపేందుకు వారు పోరాడారు

738
00:45:28,840 --> 00:45:33,160
స్పెయిన్‌లో నాకు మొదటి ఓపెన్ సర్జరీ
చేసే అవకాశం వచ్చేవరకూ.

739
00:45:34,800 --> 00:45:38,000
ఓ అధిక పనితీరు జట్టు,
ఫుట్‌బాల్ కాదు, బాస్కెట్‌బాల్ కాదు,

740
00:45:38,080 --> 00:45:39,880
ఉదాహరణకు, అది ఏదైనా

741
00:45:40,280 --> 00:45:44,200
అత్యవసర బృందం, అక్కడ ఉంటారు కదా,
ఉదాహరణకు, ఆస్పత్రులలో.

742
00:45:44,480 --> 00:45:50,480
ఇక, ఈ బృందాలు చాలా ప్రత్యేకమైన
వ్యక్తులతో నిండి ఉంటాయి.

743
00:45:50,560 --> 00:45:52,920
వాళ్లు నిరంతరం
పని చేసేందుకు ఇష్టపడతారు.

744
00:45:53,000 --> 00:45:57,160
వాళ్లలా ఒక కారణం కోసమే చేస్తారు,
వాళ్లకలా చేయడం ఇష్టం. ఇంకేమీ కాదు.

745
00:45:57,240 --> 00:45:59,800
అది వాళ్లను నడుపుతుంది,
అదే వారి ప్రయోజనం.

746
00:45:59,880 --> 00:46:01,680
మీతో ఓ విషయం పంచుకోవాలి.

747
00:46:01,760 --> 00:46:03,040
ఇది నేనే.

748
00:46:03,120 --> 00:46:05,040
ఇది నా భావోద్వేగ స్థాయి.

749
00:46:05,480 --> 00:46:08,400
గత పధ్నాలుగు రోజులలో.
ఒకటి నుంచి పది.

750
00:46:12,440 --> 00:46:15,320
మాన్ సిటీ తర్వాత, ఇక్కడ ఉన్నాను.

751
00:46:17,040 --> 00:46:19,040
చనిపోయినా, ఇక్కడున్నాను.

752
00:46:20,840 --> 00:46:21,880
నాకు భయం ఉండేది.

753
00:46:23,120 --> 00:46:24,400
నాకు అభద్రతలు ఉండేవి.

754
00:46:25,480 --> 00:46:28,480
నన్ను చంపేసే మీడియా నా చుట్టూ ఉంది.

755
00:46:30,680 --> 00:46:34,160
హఠాత్తుగా, అన్నీ సానుకూలతలు వచ్చాయి.

756
00:46:35,000 --> 00:46:39,200
నాకు అద్భుతమైన కుటుంబం,
భార్య, ముగ్గురు పిల్లలు, ఇంకొకటి...

757
00:46:39,520 --> 00:46:42,720
క్లబ్‌, నాకు ఎప్పుడూ మద్దతు ఇస్తుంది,
పై స్థాయి నుంచి,

758
00:46:42,800 --> 00:46:44,040
యజమాని నుంచి, అందరూ.

759
00:46:44,120 --> 00:46:46,120
పెద్దగా ఇక్కడ ఉన్నారు.

760
00:46:46,320 --> 00:46:50,200
ఇక్కడి నుంచి ఇక్కడికి
నేను వెళ్లిన క్షణం

761
00:46:51,760 --> 00:46:52,960
అది మీ కారణంగానే.

762
00:46:53,600 --> 00:46:57,960
ఎందుకంటే ఈ వారం, నాకు లక్ష్యం దొరికింది.
నేను కోచ్‌గా ఎందుకున్నానో.

763
00:46:58,040 --> 00:47:01,320
ఈ పరిశ్రమలో ఎందుకున్నానో,
వీళ్లతో ఎందుకు ఉంటున్నానో అని.

764
00:47:01,400 --> 00:47:06,520
ఇక ఇందుకోసం, నేను ఏం చెప్పాలంటే,
నా వైపు నుంచి...

765
00:47:06,920 --> 00:47:09,320
ధన్యవాదాలు, మీ అందరికీ

766
00:47:09,400 --> 00:47:11,600
ఎందుకంటే మీరు నాకు, కష్టమైన సమయంలో

767
00:47:11,680 --> 00:47:15,320
నా ఫుట్‌బాల్ కెరీర్‌లో
ఉత్తమ వారం అందించారు.

768
00:47:16,600 --> 00:47:18,160
మిమ్మల్ని నమ్మండి,
నేను నమ్ముతా.

769
00:47:18,240 --> 00:47:19,240
మీరు బాగా ఆడతారు.

770
00:47:19,320 --> 00:47:21,120
కోచ్‌గా నేను చేయాలనుకునే ఆఖరి పని

771
00:47:21,200 --> 00:47:23,360
ఈ కష్ట సమయంలో
మీలో ఎవరినైనా నిందించడం.

772
00:47:23,440 --> 00:47:25,920
నా బాధ్యత, తప్పును స్వీకరిస్తాను.

773
00:47:26,000 --> 00:47:27,000
ఇక వెళదాం.

774
00:47:43,280 --> 00:47:47,160
ప్రీమియర్ లీగ్‌లో మొదటి మూడు గేమ్‌లను
ఆర్సెనల్ ఇంకా నార్విచ్

775
00:47:47,240 --> 00:47:48,520
రెండు జట్లు మరిచిపోవాలి,

776
00:47:48,600 --> 00:47:51,400
కోపంతో ఉన్న అభిమానులలో
ఉత్సాహం తీసుకురావాలి.

777
00:47:59,920 --> 00:48:00,920
ఆడండి!

778
00:48:04,360 --> 00:48:08,520
ఆర్సెనల్ ఈ మ్యాచ్‌పై పట్టు తెచ్చుకుంది.
స్టేడియంలో భారీ అరుపులు.

779
00:48:19,080 --> 00:48:20,800
అతని వెంట టొమియసు వచ్చాడు.

780
00:48:21,840 --> 00:48:22,920
టిజోలిస్.

781
00:48:24,400 --> 00:48:25,640
త్వరిత బాల్.

782
00:48:25,720 --> 00:48:27,840
-ఛత్.
-సేవ్ చెయ్, ఆరన్!

783
00:48:28,320 --> 00:48:30,520
బాల్ వాలుగా వచ్చింది, అక్కడెవరూ లేరు.

784
00:48:33,120 --> 00:48:36,080
మాక్స్ ఆరన్స్‌. షాట్ ప్రయత్నించాడు.

785
00:48:36,160 --> 00:48:37,560
సేవ్ చెయ్, ఆరన్!

786
00:48:37,640 --> 00:48:38,960
అది చక్కని సేవ్.

787
00:48:40,000 --> 00:48:41,560
అబ్బా ఛ.

788
00:48:41,640 --> 00:48:45,560
విలియమ్స్ నుంచి, ఒకటిలో ఆట,
తిరిగినది తీసుకుని, పూక్కీకి ఇచ్చాడు.

789
00:48:45,640 --> 00:48:47,640
రామ్స్‌డేల్ ఆపాడు. సరిగా చదివాడు.

790
00:48:47,720 --> 00:48:49,040
అభినందనలు, ఆరన్.

791
00:48:51,000 --> 00:48:53,000
-దాన్ని ముందుకు తొయ్!
-ఆడు, ఆరన్.

792
00:48:55,200 --> 00:48:56,960
ఆర్సెనల్ కొంచెం వెనక్కి తగ్గింది.

793
00:48:57,040 --> 00:48:59,280
రామ్స్‌డేల్ ఆట బాగుంది.

794
00:49:02,800 --> 00:49:05,720
ఏమీ లేదు, వాళ్లకు హృదయం లేదు.

795
00:49:06,040 --> 00:49:08,520
కనారీస్ తక్షణమే టిజోలిస్‌తో వచ్చాడు.

796
00:49:08,600 --> 00:49:10,960
దూరం నుంచి లాంగ్ షాట్,
టార్గెట్ వైపు.

797
00:49:12,280 --> 00:49:14,880
ఒబామెయాంగ్‌ కోసం చూస్తున్న
మైట్‌లాండ్‌ నైల్స్.

798
00:49:17,720 --> 00:49:21,280
ఇక, బాక్స్ లోకి ప్లేయర్లను
ఆర్సెనల్ తెస్తుందా? ఒబామెయాంగ్‌...

799
00:49:22,320 --> 00:49:25,800
అది సాకాకు డ్రాప్ చేయవచ్చు.
అది తిరిగింది. తప్పకుండా... లేదు!

800
00:49:27,920 --> 00:49:29,040
అబ్బా ఛ.

801
00:49:38,840 --> 00:49:41,800
తిరిగి పొందాలని హాన్లీ ప్రయత్నం.
సాకా లాగేసుకున్నాడు.

802
00:49:41,880 --> 00:49:43,400
ఇప్పుడు ఆర్సెనల్‌కు అవకాశం...

803
00:49:50,360 --> 00:49:53,240
లోపలకు వెళ్లుండాలి.
మళ్లీ పోస్ట్‌కు తగిలింది.

804
00:49:53,640 --> 00:49:55,560
ఒబామెయాంగ్‌ లోపలకు పంపాడు!

805
00:49:55,640 --> 00:49:58,520
ఆర్సెనల్ 1 - 0 నార్విచ్ సిటీ
ఒబామెయాంగ్‌ 66

806
00:50:01,120 --> 00:50:05,080
ఆర్సెనల్‌కు ఎట్టకేలకు తమ సీజన్
మొదలైనట్లు కనబడుతోంది.

807
00:50:11,320 --> 00:50:13,480
స్మిత్ రోవ్‌ వచ్చాడు, దూరంగా.

808
00:50:13,560 --> 00:50:16,120
ఇది పూర్తి కాగలదు!
క్రుల్ బాగా సేవ్ చేశాడు.

809
00:50:23,480 --> 00:50:25,040
అదిగో చివరి విజిల్.

810
00:50:25,120 --> 00:50:28,400
మికెల్ ఆర్టెటా, అతని కోచింగ్ సిబ్బంది
అంతటా ఊరట.

811
00:50:29,240 --> 00:50:30,680
సాధించాం!

812
00:50:30,760 --> 00:50:33,680
ఆడండి! బాగా ఆడండి!

813
00:50:36,680 --> 00:50:39,320
ముఖ్యమైన మూడు పాయింట్లు,
అట్టడుగున ఉన్నారు

814
00:50:39,400 --> 00:50:43,320
ప్రీమియర్ లీగ్ టేబుల్‌లో, ధన్యవాదాలు,
ఆశావహంగా, పైకి ఎగదాలి.

815
00:50:47,800 --> 00:50:50,920
భావోద్వేగంగా, ఆడేందుకు కష్టమైన రోజు.
మూడు ఓటములు తరువాత,

816
00:50:51,000 --> 00:50:55,120
ఇక్కడకు రావడం, టేబుల్‌లో చివరి స్థానంలో
ఉండడం, అంతా నిరూపించాలి,

817
00:50:55,200 --> 00:50:58,880
కుర్రాళ్లు అద్భుతంగా తమ పాత్ర పోషించారని
అంటాను, గొప్ప వైఖరి.

818
00:50:58,960 --> 00:51:01,640
మొదటి నుంచి,
మనకేం కావాలో మీరు గ్రహించారు.

819
00:51:01,720 --> 00:51:03,160
ఇది కష్టమైన గేమ్.

820
00:51:03,240 --> 00:51:05,120
మీ భావోద్వేగం సంగతి తెలుసు.

821
00:51:05,200 --> 00:51:07,320
జనాల నుంచి పెరిగే ఒత్తిడి.

822
00:51:07,400 --> 00:51:10,600
మీరు అద్భుతం అంటాను.
మీ వైఖరి బయడపడింది.

823
00:51:10,680 --> 00:51:12,480
ఎన్నో ధన్యవాదాలు. అభినందనలు.

824
00:51:19,840 --> 00:51:22,920
మీరు వచ్చాక ప్లేయర్లు, అభిమానుల మధ్య
బంధం గురించి

825
00:51:23,000 --> 00:51:24,880
-మనం మాట్లాడాం.
-అవును.

826
00:51:24,960 --> 00:51:28,360
నేను కృతజ్ఞుడిని,
ఇది కష్ట సమయమని నాకు తెలుసు,

827
00:51:28,440 --> 00:51:32,600
కానీ జట్టును ఉత్సాహం అందించాలని కోరుకునే
ప్రజలను చూశాను.

828
00:51:34,520 --> 00:51:37,840
అతను అభిమానులను గెలిచాడని అనను,
కానీ కొంత సమయం పొందాడు.

829
00:51:37,920 --> 00:51:41,720
కారణం మా ముందు ఉన్న గేమ్‌లు,
అవి అన్నీ గెలవాలి.

830
00:51:42,840 --> 00:51:46,800
అతను నార్త్ లండన్ డెర్బీలో
సానుకూల ఫలితం పొందాలి.

831
00:51:46,880 --> 00:51:51,240
అలా చాలామంది అభిమానులు ఊరట చెందుతారు,
కానీ ఇంకా అతనిపై ఒత్తిడి ఉంది.

832
00:51:56,240 --> 00:51:57,240
మరుసటి సారి...

833
00:51:57,320 --> 00:51:59,680
నార్త్ లండన్ డెర్బీలో స్కోర్ చేయడం ఊహించు.

834
00:52:00,320 --> 00:52:04,640
ఇక్కడ హోమ్‌లో కొన్ని డెర్బీలలో
స్కోర్ చేశాను, ఆ భావనేంటో నాకు తెలుసు.

835
00:52:04,720 --> 00:52:05,760
టోటెన్‌హామ్‌
హాట్‌స్పర్

836
00:52:05,840 --> 00:52:09,400
డెర్బీ డే అంటే అన్నీ, టోటెన్‌హామ్‌ను
ద్వేషించాలని నేర్పారు.

837
00:52:09,480 --> 00:52:13,120
మేము గెలిచే స్థితి గురించి వారం అంతా
నాకు నేనే ఊహించాను.

838
00:52:13,840 --> 00:52:15,400
ఇది అనుకున్నంత పెద్దది.

839
00:52:17,160 --> 00:52:20,160
అది బార్‌కు తగిలింది!
రామ్స్‌డేల్ సేవ్ చేశాడు.

840
00:53:12,840 --> 00:53:15,520
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్‌లోని ఆటగాళ్లు,
కోచ్‌లు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు

841
00:53:16,840 --> 00:53:18,840
ఉపశీర్షికలు అనువదించినది కర్త
కృష్ణమోహన్ తంగిరాల

842
00:53:18,920 --> 00:53:21,280
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

