1
00:00:05,040 --> 00:00:07,960
మేమే ఆర్సెనల్

2
00:00:08,000 --> 00:00:09,520
దగ్గరగా రండి, అంతా. రండి.

3
00:00:14,800 --> 00:00:17,520
శుక్రవారం రాత్రి, స్టేడియం నిండిపోయింది.

4
00:00:17,600 --> 00:00:19,840
మీ కుటుంబాలు ఇక్కడే,
మద్దతుదారులు ఇక్కడే,

5
00:00:19,920 --> 00:00:22,600
వాళ్లలో అగ్ని రగిలించాలంటే,
మీరు ఉత్సాహపరచాలి.

6
00:00:22,680 --> 00:00:26,360
అందరూ వేటాడి, మళ్లీ వెళ్లాలి,
డ్యుయెల్‌ గెలవాలి, బాల్ గెలవాలి,

7
00:00:26,440 --> 00:00:28,520
ఫార్వర్డ్ ఆడాలి,
గేమ్ నిర్వహించాలి.

8
00:00:28,600 --> 00:00:32,080
మనం పొందికగా, నమ్మకంతో ఉండాలి,
మనకు శక్తి ఉండాలి.

9
00:00:32,120 --> 00:00:35,080
ఆరంభం నుంచి పొందికగా, దూకుడుగా ఉండాలి.

10
00:00:35,120 --> 00:00:37,720
మొదటి పది నిమిషాలు,
జనాలలో ఉత్సాహం నింపాలి.

11
00:00:37,760 --> 00:00:41,760
ఇక, మీరిద్దరూ బాక్స్‌, షాట్స్, క్రాస్‌లు,
ఏర్పాటుతో, రక్షణగా ఆడాలి.

12
00:00:41,840 --> 00:00:45,040
వాళ్లను వెనుక నుంచి దాడి చేయాలి.
వెళ్లండి. మరోసారి.

13
00:01:21,000 --> 00:01:24,440
మీరు చేసేది ప్రేమిస్తారు.
దానినే అభిరుచి అంటారు.

14
00:01:25,280 --> 00:01:28,120
మనం నమ్మకం ఉంచాలి.
మనకు శక్తి ఉండాలి.

15
00:01:29,320 --> 00:01:31,800
మీరు ఏంటో వీళ్లకు తెలియజేయండి.

16
00:01:31,880 --> 00:01:32,840
అందుకోసం వెళ్లండి.

17
00:01:33,640 --> 00:01:36,120
ఆల్ ఆర్ నథింగ్
ఆర్సెనల్

18
00:01:36,200 --> 00:01:38,600
డానియెల్ కలూయా వ్యాఖ్యానం

19
00:01:50,560 --> 00:01:55,960
ఆర్సెనల్ వర్సెస్ ఆస్టన్ విల్లా
ఎమిరేట్స్ స్టేడియం - 22 అక్టోబర్ 2021

20
00:01:56,040 --> 00:01:57,480
ఎమిరేట్స్ స్టేడియం

21
00:01:57,560 --> 00:02:00,680
లీగ్‌లో తొమ్మిది వారాలు,
ఇప్పటికి మూడు గెలుపులు,

22
00:02:00,760 --> 00:02:02,920
మూడు ఓటములు, రెండు డ్రాలు.

23
00:02:03,480 --> 00:02:07,120
మికెల్ ఆర్టెటా జట్టు నుంచి
ఏం ఆశించాలో ఎవరికీ అంతగా తెలియదు.

24
00:02:10,160 --> 00:02:12,560
మొదటి నిమిషంలో కొంచెం దూకుడుగా ఉంది.

25
00:02:15,760 --> 00:02:18,440
పోస్ట్ ముందు బాల్,
తలపై బాల్‌ సరిగా కిక్‌ చేయలేదు.

26
00:02:18,520 --> 00:02:20,720
సాకా ఎడమ కాలి ఆటగాడు.

27
00:02:22,440 --> 00:02:24,280
కార్నర్‌లో స్మిత్ రోవ్ బాగా ఆడాడు.

28
00:02:24,360 --> 00:02:25,880
పార్టీ, ఈసారి గోల్!

29
00:02:26,000 --> 00:02:30,440
థామస్ పార్టీ! టచ్ చేశాడు,
ఆర్సెనల్‌కు ఇది అతని మొదటి గోల్.

30
00:02:30,560 --> 00:02:32,280
ఆర్సెనల్ 1 - 0 ఆస్టన్ విల్లా
పార్టీ 23

31
00:02:36,080 --> 00:02:37,880
బెన్ వైట్ ముందుకు వెళుతున్నాడు.

32
00:02:38,000 --> 00:02:39,880
అతనింకా ముందుకే, బెన్ వైట్.

33
00:02:40,000 --> 00:02:43,800
ఆర్సెనల్‌ను మళ్లీ చక్కని ఆట.
స్మిత్ రోవ్, టవారెస్‌ అందుకున్నారు.

34
00:02:45,840 --> 00:02:48,280
ఆర్సెనల్ నుంచి ఇది ఎలక్ట్రిక్ ఆరంభం.

35
00:02:48,760 --> 00:02:53,320
21 ఏళ్ల లెఫ్ట్ బ్యాక్, నూనో టవారెస్,
క్లబ్‌కు వేసవిలో మొదటి ఒప్పందం.

36
00:02:53,400 --> 00:02:56,720
ఈ రాత్రి, ప్రీమియర్ లీగ్‌లో
అతను అరంగేట్రం చేస్తున్నాడు.

37
00:02:57,000 --> 00:02:59,560
అతనిలో చాలా సామర్థ్యం నింపి ఉంటారు,

38
00:02:59,640 --> 00:03:02,160
మొదటి సగంలో
అతను చాలా ఎక్కువ పరిగెత్తాడు.

39
00:03:02,240 --> 00:03:04,360
ఎడమ చేతి వైపు, ఇక్కడ మళ్లీ.

40
00:03:04,440 --> 00:03:05,760
తన స్పాట్‌ను ఎంచుకోగలడు.

41
00:03:05,840 --> 00:03:07,920
క్రాస్ లోపలకు,
దాని కిందే లాకాజెట్.

42
00:03:08,000 --> 00:03:10,200
బుకాయో సాకాకు వచ్చింది,
ఎడమ కాలి పైకి,

43
00:03:10,280 --> 00:03:12,400
ఒబామెయాంగ్‌కు అందించే ప్రయత్నం!

44
00:03:12,480 --> 00:03:17,200
పెనాల్టీ ఏరియాలో సవాలు చేశారు,
లాకాజెట్ పడిపోయాడు. అది పెనాల్టీ.

45
00:03:17,680 --> 00:03:20,680
పియెర్ ఒబామెయాంగ్
ఆర్సెనల్ ఆధిక్యం రెట్టింపు చేయాలి.

46
00:03:22,680 --> 00:03:25,640
మార్టినెజ్ సేవ్ చేశాడు!
ఒబామెయాంగ్, మళ్లీ కొట్టాడు!

47
00:03:25,720 --> 00:03:26,880
ఆర్సెనల్ 2 - 0 ఆస్టన్ విల్లా
ఒబామెయాంగ్ 45+6'

48
00:03:26,960 --> 00:03:29,440
ఆర్సెనల్ ఆధిక్యం రెట్టింపు.
రెండు, సున్నా.

49
00:03:29,520 --> 00:03:30,600
టవారెస్.

50
00:03:31,160 --> 00:03:33,080
ఒబామెయాంగ్, మళ్లీ మంచి ఆట.

51
00:03:33,160 --> 00:03:36,000
ఈసారి స్మిత్ రోవ్
తనకు తానే వెళ్లవచ్చు.

52
00:03:36,080 --> 00:03:39,800
స్మిత్ రోవ్, ఇంకా వెళుతున్నాడు...
తప్పించాడు, పోస్ట్‌కు తగిలి, లోపలకు!

53
00:03:39,880 --> 00:03:41,920
ఆర్సెనల్ సాధించింది, మూడు, సున్నా!

54
00:03:42,000 --> 00:03:43,920
ఆస్టన్ విల్లాకు గందరగోళం.

55
00:03:44,000 --> 00:03:46,160
ఆర్సెనల్ 3 - 0 ఆస్టన్ విల్లా
స్మిత్ రోవ్ 56

56
00:03:50,120 --> 00:03:53,800
బెయిలీ, తీసుకెళ్లే యత్నం,
కొన్ని సవాళ్లు, స్కోర్ చేశాడు.

57
00:03:53,880 --> 00:03:56,640
రామ్‌సే స్కోర్ చేయగా,
ఆపడం కుదరలేదు.

58
00:03:56,720 --> 00:03:58,560
రామ్స్‌డేల్‌కు క్లీన్‌ షీట్ రాదు.

59
00:03:58,640 --> 00:04:00,000
ఆర్సెనల్ 3 - 1 ఆస్టన్ విల్లా
రామ్‌సే 82

60
00:04:00,080 --> 00:04:04,080
దీనితో వాళ్లు గెలవరు,
కానీ క్లీన్ షీట్ అందనీయలేదు.

61
00:04:05,320 --> 00:04:08,880
అదిగో తుది విజిల్,
ఆర్సెనల్‌కు చక్కని మూడు పాయింట్లు,

62
00:04:08,960 --> 00:04:11,440
పోటీలు అన్నిటిలో
వరుసగా ఏడు విజయాలు.

63
00:04:11,520 --> 00:04:13,560
ఈ రాత్రి కొన్నిసార్లు ఉల్లాసం.

64
00:04:13,640 --> 00:04:15,560
-అభినందనలు.
-బాగుంది, అబ్బాయిలు.

65
00:04:19,680 --> 00:04:22,800
అబ్బా ఛ, బాబూ.
ఆ ప్లేయర్‌ను టాకిల్ చేయాలి.

66
00:04:25,240 --> 00:04:26,240
పోరా.

67
00:04:33,200 --> 00:04:34,040
బాగా ఆడారు.

68
00:04:34,120 --> 00:04:35,160
నేను అలసిపోయాను.

69
00:04:35,240 --> 00:04:36,920
-మంచి ఆట, నేస్తం.
-ధన్యవాదాలు.

70
00:04:37,600 --> 00:04:38,480
బాగా ఆడావు.

71
00:04:38,560 --> 00:04:40,320
అది క్లీన్ షీట్ అందనీయలేదు.

72
00:04:40,360 --> 00:04:41,560
-ఛ.
-సరే.

73
00:04:51,360 --> 00:04:52,600
సంతోషించు.

74
00:04:52,680 --> 00:04:54,240
గేమ్‌లు గెలవడం తేలికకాదు.

75
00:04:57,680 --> 00:04:59,360
నా కుర్రాళ్లు ఇష్టమని చెబుతా.

76
00:04:59,480 --> 00:05:02,640
మీరు ఆడిన తీరుపై
గర్వంగా ఉందని చెప్పాలి.

77
00:05:02,720 --> 00:05:06,080
దూకుడు, ప్రయోజనం,
మీరు పిచ్‌పై చూపించారు,

78
00:05:06,160 --> 00:05:07,680
మీరివాళ నాణ్యత చూపించారు.

79
00:05:07,760 --> 00:05:11,680
మనకు మెరగుయ్యే విషయాలు ఇంకా ఉన్నాయి,
కానీ అది కొనసాగించండి,

80
00:05:11,760 --> 00:05:13,800
ఆ విశ్వాసంతో, ఆ శక్తితో.

81
00:05:13,920 --> 00:05:17,160
ఇంకా ఇది ఆనందం.
మీరు అక్కడ ఆడుతుంటే చూడడం

82
00:05:17,440 --> 00:05:18,440
బోలెడు ఆనందం.

83
00:05:18,520 --> 00:05:21,120
నూనో, ప్రీమియర్ లీగ్‌లో
తొలి ఆరంభంలో ఉండేదుకు,

84
00:05:21,200 --> 00:05:24,000
నువ్వు ఆడిన విధంగా ఆడు,
నేస్తమా, అదిరింది!

85
00:05:24,080 --> 00:05:26,240
నీ శక్తికి, వేడుక చేసుకోవచ్చు.

86
00:05:31,440 --> 00:05:35,560
అందరికీ అభినందనలు.
కొనసాగించండి. అభినందనలు.

87
00:05:51,600 --> 00:05:52,960
అవును. దారుణం!

88
00:05:54,440 --> 00:05:56,760
ఆర్సెనల్ ట్రైనింగ్ సెంటర్‌

89
00:06:00,120 --> 00:06:01,920
ఈ చెత్త కారు ఏంటి?

90
00:06:03,240 --> 00:06:05,160
సోదరా, అవి అత్యుత్తమ కార్లు.

91
00:06:06,360 --> 00:06:07,720
సొంత మైదానంలో గెలిచాక,

92
00:06:07,800 --> 00:06:11,160
బయటి మ్యాచ్‌లలో కఠినమైన వాటికి
జట్టు సిద్ధమవ్వాలి

93
00:06:11,240 --> 00:06:13,840
వాటిలో కొన్ని లీగ్‌లో అతి పెద్ద గేమ్‌లు.

94
00:06:13,920 --> 00:06:16,080
పరీక్షా
కేంద్రం

95
00:06:16,160 --> 00:06:17,560
జిమ్, ఇప్పుడు ప్రతిరోజూ.

96
00:06:20,520 --> 00:06:24,600
ప్రతి మ్యాచ్ తర్వాతి ఉదయం,
మికెల్, అతని జట్టు చర్చిస్తారు.

97
00:06:24,680 --> 00:06:28,160
వాళ్ల వ్యూహాలు, ప్లేయర్ల శ్రేయస్సుపై
చర్చలు నిర్వహిస్తారు.

98
00:06:28,240 --> 00:06:29,440
ఓ అప్‌డేట్ విందాం.

99
00:06:29,520 --> 00:06:34,120
ఇక, గేమ్ నుంచి అప్‌డేట్, మీరంతా చూశారు,
అది చాలా నిశితమైన గేమ్.

100
00:06:34,200 --> 00:06:38,040
మనలో కొన్ని లోపాలున్నాయి,
కానీ కుర్రాళ్లు బాగా మెరుగవుతున్నారు.

101
00:06:38,120 --> 00:06:42,880
ఇంకా లాకా, ఎక్కువ గేమ్‌లు ఆడకుండానే
ప్రీమియర్ లీగ్ గేమ్‌లో

102
00:06:42,960 --> 00:06:45,120
అది అతని తొలి చక్కని ప్రయత్నం.

103
00:06:45,200 --> 00:06:47,120
ఆరన్, బాగున్నాడు, ఫిర్యాదులు లేవు.

104
00:06:47,560 --> 00:06:48,840
గొప్పగా ఆడుతున్నాడు.

105
00:06:50,280 --> 00:06:52,480
గేమ్ తర్వాత కోపగించుకున్నాడు.

106
00:06:52,560 --> 00:06:55,840
-అవును, సరే, సరైన పనే.
-ఆ, న్యాయమే, కానీ నాకది నచ్చింది.

107
00:06:56,600 --> 00:06:57,720
నూనో కూడా, అవునా?

108
00:06:57,800 --> 00:07:00,040
-స్థాయికి మించి ఆడాడు, గణాంకాలలో.
-ఔను.

109
00:07:00,600 --> 00:07:02,280
మనం గేమ్ ఆరంభించిన తీరు,

110
00:07:02,360 --> 00:07:04,960
వాట్కిన్స్ మీద
మొదటి చర్యతోనే మొదలైంది.

111
00:07:05,040 --> 00:07:08,200
జట్టు అంతటి ప్రతిస్పందన,
అది దారి నిర్ణయించింది,

112
00:07:08,280 --> 00:07:10,720
అలా చేసేందుకు
గేమ్‌లో ఎంత నిమగ్నమయ్యామో.

113
00:07:10,800 --> 00:07:13,720
పదహారు షాట్లు, మనపై సున్నా,
ఒకసారీ మనపై దాడి లేదు.

114
00:07:13,800 --> 00:07:15,160
పూర్తి ఆధిపత్యం.

115
00:07:15,240 --> 00:07:18,400
అది కాకతాళీయం కాదు,
మనం అది కొనసాగించాలి.

116
00:07:18,480 --> 00:07:20,520
రెండవ సగంలో, ఎక్కువ కష్టపడ్డాం.

117
00:07:20,600 --> 00:07:21,440
ఇక అంతే.

118
00:07:21,520 --> 00:07:22,840
-సరే.
-ధన్యవాదాలు.

119
00:07:27,360 --> 00:07:30,160
-మైకేల్!
-ఐదు నిమిషాలు, సరేనా? డ్రిల్, కదా?

120
00:07:32,640 --> 00:07:33,560
రండి, కుర్రాళ్లు.

121
00:07:43,240 --> 00:07:44,240
అంతే!

122
00:07:44,320 --> 00:07:46,040
కొత్త ఒప్పందం, ఆరన్ రామ్స్‌డేల్,

123
00:07:46,120 --> 00:07:49,400
తను ఆరంభించాక ఆరు గేమ్‌లలో
పెద్ద ప్రభావం చూపాడు.

124
00:07:49,480 --> 00:07:52,480
రామ్స్‌డేల్ గోల్ దగ్గర ఉండగా
ఆర్సెనల్ ఓడిపోలేదు.

125
00:07:52,560 --> 00:07:54,800
నేను ఫోన్‌లో మాట్లాడిన సమయంలో,

126
00:07:54,880 --> 00:07:57,760
అతనే ఉన్నాడు,
తర్వాత తన తండ్రితో మాట్లాడాను,

127
00:07:57,840 --> 00:08:00,600
నాకు బాగా నచ్చాడని చెప్పాను,
ఇతనే సరైనవాడని.

128
00:08:01,080 --> 00:08:03,080
అతనిలో విశ్వాసం ఎక్కువ, తను...

129
00:08:04,200 --> 00:08:07,760
పూర్తి ఉత్సాహం,
తను బాహాటంగా చెబుతాడు...

130
00:08:08,880 --> 00:08:11,240
గత కొన్నేళ్లుగా ఎలా అభివృద్ధి చెందాడో,

131
00:08:11,800 --> 00:08:14,560
క్లబ్‌లో గుర్తింపు పొందాలనే
కోరికపై చెబుతాడు,

132
00:08:15,120 --> 00:08:18,720
అది సహజం, అది స్పష్టం,
అతనికి నిబద్ధత ఉంది,

133
00:08:18,800 --> 00:08:20,640
మీరు పిచ్‌పై చూసినట్లుగానే.

134
00:08:20,760 --> 00:08:22,120
ఎక్కువ ఒత్తిడి.

135
00:08:24,960 --> 00:08:29,080
ప్రీమియర్‌ లీగ్‌ నుంచి ఆరన్
గత రెండు క్లబ్‌లు బహిష్కరణకు గురయ్యాయి.

136
00:08:29,160 --> 00:08:31,400
ఆర్సెనల్‌లో చేరడం అతనికి పెద్ద అడుగు.

137
00:08:31,800 --> 00:08:34,760
పెద్ద క్లబ్‌కు ఆడుతుంటే
మీకది తెలుస్తుంది

138
00:08:34,880 --> 00:08:36,240
నాకది నచ్చింది.

139
00:08:36,280 --> 00:08:39,000
ప్రపంచంలో నేనే ఉత్తమం అనడం లేదు,

140
00:08:39,080 --> 00:08:41,760
కానీ అక్కడకు చేరాలనే లక్ష్యాలు
నాలో ఎప్పుడూ ఉంటాయి.

141
00:08:44,840 --> 00:08:48,520
నేనొచ్చిన చోటు,
గత రెండు సీజన్‌ల ప్రమాణాలలో చూస్తే,

142
00:08:48,880 --> 00:08:52,400
ఈ లీగ్‌లో క్లీన్ షీట్‌లు రావడం
ఎంత కష్టమో నాకు తెలుసు.

143
00:08:52,480 --> 00:08:55,640
బాల్ నెట్‌లో పడకుండా చూసేది
నేనొక్కడినే కాదు, లేదా

144
00:08:55,760 --> 00:08:57,840
బ్యాక్ ఫార్వర్డ్‌లయినా, అందరిదీ.

145
00:08:57,880 --> 00:09:01,240
ప్రధాన విషయం ఏంటంటే
95 నిమిషాల పాటు అందరికీ చూపాలి,

146
00:09:01,320 --> 00:09:04,360
మా ఏకాగ్రతను,
ఉమ్మడి లక్ష్యంపై పని చేస్తున్నామని.

147
00:09:04,440 --> 00:09:05,760
ఆస్టన్ విల్లా గేమ్‌లో,

148
00:09:05,880 --> 00:09:08,640
చివరి ఐదు నిమిషాల్లో
వాళ్లు స్కోర్ చేశారు...

149
00:09:10,440 --> 00:09:14,120
ఇతర రోజులలో అది ఒకటి-ఒకటితో సమానం,
లేదా రెండు-ఒకటి కాగలదు,

150
00:09:14,200 --> 00:09:17,200
చివరి ఐదు, పది నిమిషాలు
ఉత్కంఠభరిత ముగింపు.

151
00:09:21,520 --> 00:09:23,520
సీజన్ ప్రారంభం నుంచి,

152
00:09:23,640 --> 00:09:27,640
యువ ప్రతిభావంతుల ప్రవాహంతో
ఆర్సెనల్‌లో మార్పులు జరిగాయి.

153
00:09:27,880 --> 00:09:30,840
ప్రస్తుత బ్యాక్ ఐదుగురిలో నలుగురు
క్లబ్‌కు కొత్త.

154
00:09:30,880 --> 00:09:34,160
మికెల్, అతని సిబ్బంది
ఈ కొత్త ప్లేయర్లను అర్థం చేసుకుని

155
00:09:34,240 --> 00:09:36,480
వాళ్లను రక్షణ యూనిట్‌గా మలచాలి.

156
00:09:36,520 --> 00:09:40,960
ప్లేయర్లు అంటే సంఖ్యలు అని
ఓ ప్రముఖ స్పానిష్ కోచ్ చెబుతుండేవాడు.

157
00:09:41,840 --> 00:09:45,320
నేను ప్లేయర్లను సంఖ్యగా చూడలేను.
నా వరకు, వాళ్లు మనుషులు

158
00:09:45,400 --> 00:09:49,040
ఇంకా నేను ఈ పనిలో
30 ఏళ్లు ఉన్నాక,

159
00:09:49,120 --> 00:09:51,040
నా మనసు మారితే, తెలియదు.

160
00:09:51,120 --> 00:09:52,440
ఇవాళ ఆ పని చేయలేను.

161
00:09:52,520 --> 00:09:55,040
వాళ్లను భావోద్వేగంగా అర్థం చేసుకోవాలి,

162
00:09:55,120 --> 00:09:59,120
వాళ్ల జీవితాలలో జరిగేవి,
కొత్త సవాళ్లను ఎదుర్కోవడం, ఈ కొత్త దేశం,

163
00:09:59,200 --> 00:10:01,240
ఈ కొత్త క్లబ్, అంతా తెలుసుకోవాలి.

164
00:10:01,320 --> 00:10:04,080
కానీ ఇది రెండు వైపులా ఉండాలి, చెప్పాలంటే,

165
00:10:04,160 --> 00:10:07,320
అది ఇచ్చేందుకు ఆ వ్యక్తి సిద్ధపడాలి.

166
00:10:07,720 --> 00:10:11,520
వైద్య సమీక్ష
మేనేజర్ కార్యాలయం

167
00:10:11,600 --> 00:10:14,520
మోతో సమస్యలు లేవు, నూనోతో ఏమీ లేవు,

168
00:10:14,600 --> 00:10:17,640
టామీ, చీలమండలో పుండు పడింది.

169
00:10:18,480 --> 00:10:23,320
నూనోతో, అతని నుంచి సమాచారం పొందడం
చాలా కష్టం.

170
00:10:23,760 --> 00:10:27,520
ఎలాగోలా సౌకర్యమైన వాతావరణం సృష్టించాలి,

171
00:10:27,600 --> 00:10:30,640
అతను సౌకర్యంగా ఉండి, మాట్లాడి,
తన భావనలు చెప్పగలగాలి,

172
00:10:30,760 --> 00:10:32,840
ఎందుకంటే ఇప్పుడది జరగడం లేదు.

173
00:10:32,880 --> 00:10:35,640
బాగా కష్టపడతాడు,
అసలు ఫిర్యాదులు చేయడు,

174
00:10:35,760 --> 00:10:38,840
కానీ మనం ప్లేయర్‌ను
వేరే మార్గంలో పర్యవేక్షించాలి.

175
00:10:38,880 --> 00:10:41,320
నీ మాట నిజం, అతను చాలా నిశ్శబ్దం.

176
00:10:41,400 --> 00:10:44,600
ఒక వ్యక్తిని ప్రత్యేకంగా
అతనికై ఉంచుతాను.

177
00:10:45,640 --> 00:10:47,760
-సరే, నాకు అంతవరకే.
-ధన్యవాదాలు.

178
00:10:48,280 --> 00:10:52,200
మొదటి ఎంపిక లెఫ్ట్‌ బ్యాక్,
కీరన్ టియెర్నీ, ఇపుడు గాయంతో ఉండడంతో,

179
00:10:52,280 --> 00:10:56,200
మికెల్ కొత్త ఒప్పందం, నూనో టవారెస్‌తో
అంచనాకు ముందుగానే ఆరంభించాడు.

180
00:10:56,800 --> 00:10:58,360
నిన్న ఏం చేశావు?

181
00:10:58,840 --> 00:11:00,880
అమ్మతో ఐకియాకు వెళ్లాను.

182
00:11:01,160 --> 00:11:02,600
అమ్మలకు ఐకియా నచ్చుతుంది.

183
00:11:03,560 --> 00:11:05,120
అక్కడ అన్నీ ఉంటాయి.

184
00:11:07,440 --> 00:11:09,920
నా చిన్నప్పుడు నెలకు ఓసారి వెళ్లేవాడిని.

185
00:11:10,000 --> 00:11:11,800
ఆమె ఆగిన ప్రతి స్టాండ్‌లో...

186
00:11:19,080 --> 00:11:22,760
ఆర్సెనల్‌లో చేరడానికి నాలుగు నెలల క్రితం
నూనో పోర్చుగల్ వదిలాడు.

187
00:11:22,840 --> 00:11:26,000
పోర్చుగల్‌లో కుటుంబాన్ని వదిలేయడం
ఎలా ఉంటుంది? కష్టమా?

188
00:11:26,080 --> 00:11:26,920
నూనో టవారెస్
డిఫెండర్

189
00:11:27,000 --> 00:11:30,000
అవును, కొంచెం,
కానీ వాళ్ల కోసం ఇక్కడ దృఢంగా ఉంటాను.

190
00:11:31,120 --> 00:11:36,960
పోర్చుగల్‌తో పోల్చితే ప్రజలు విభిన్నం

191
00:11:37,600 --> 00:11:41,760
అందుకే క్లబ్‌కు
అంతా ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.

192
00:11:42,720 --> 00:11:47,000
నా పట్ల చాలా గర్వపడతాను,
ప్రీమియర్ లీగ్ అరంగేట్ర ఆరంభానికి.

193
00:11:47,080 --> 00:11:49,160
ఈ క్షణం కోసం మళ్లీ ఎదురుచూస్తున్నా.

194
00:11:58,320 --> 00:12:04,320
లెస్టర్ సిటీ వర్సెస్ ఆర్సెనల్
కింగ్ పవర్ స్టేడియం - 30 సెప్టెంబర్ 2021

195
00:12:07,120 --> 00:12:08,840
శుభ మధ్యాహ్నం, ఇవాళ గేమ్ రోజు.

196
00:12:08,920 --> 00:12:12,960
కింగ్ పవర్ స్టేడియంలో గేమ్ ఆరంభానికి
ఇంకా అరగంట మాత్రమే ఉంది.

197
00:12:13,040 --> 00:12:15,480
ఇది లెస్టర్ సిటీ వర్సెస్ ఆర్సెనల్.

198
00:12:16,000 --> 00:12:20,600
మికెల్ చిగురిస్తున్న డిఫెన్స్‌కు లెస్టర్
సిటీతో వారి చోటులో ఆడడం తేలికైన పని కాదు.

199
00:12:20,680 --> 00:12:24,000
లెస్టర్‌కు అత్యంత విజయవంత
గోల్ స్కోరర్‌లలో ఒకరున్నారు.

200
00:12:24,080 --> 00:12:25,640
హేయ్, మనకు చాలా గౌరవం.

201
00:12:26,640 --> 00:12:27,920
దగ్గరగా రండి.

202
00:12:28,000 --> 00:12:29,560
ఆ, దగ్గరగా ఉండండి.

203
00:12:32,560 --> 00:12:33,920
బెన్ వస్తున్నాడు.

204
00:12:34,000 --> 00:12:34,960
-ఎవరు?
-బెన్.

205
00:12:45,400 --> 00:12:47,560
అవునా? తనకు దగ్గరగా ఉండండి.

206
00:12:47,800 --> 00:12:49,120
మనం ఓ పని చేయనున్నాం.

207
00:12:49,200 --> 00:12:51,840
ఈ గదిలో అందరం కలిసి
శక్తి తెచ్చుకోనున్నాం.

208
00:12:51,920 --> 00:12:53,160
మనం ఒకరకంగా చేద్దాం.

209
00:12:53,240 --> 00:12:57,240
నేను చెప్పాక, ఇలా చేయండి,
మీరు కళ్లు మూసుకోవాలి.

210
00:12:57,320 --> 00:12:59,880
ఈ గేమ్‌లో ఏం జరుగుతుందో చెబుతాను.

211
00:12:59,960 --> 00:13:03,200
ఆ తరువాత, అందరూ చేతులు పట్టుకుని
కలిసి ఉండాలి

212
00:13:03,280 --> 00:13:05,560
మనం గేమ్‌లో ఆడే శక్తితో.

213
00:13:05,640 --> 00:13:07,200
అందరికీ అర్థమైందా?

214
00:13:07,280 --> 00:13:08,440
ఇలా చేయండి.

215
00:13:08,840 --> 00:13:11,960
కళ్లు మూసుకోండి,
మిమ్మల్ని ఓ జట్టుగా చూడాలి,

216
00:13:12,040 --> 00:13:13,920
మీరు యూనిట్‌లో ఉండగా,

217
00:13:14,000 --> 00:13:17,280
అధిక ఒత్తిడి పరిస్థితిలో ఎదిరించడానికి
ఎంత దూకుడుగా ఉంటారో.

218
00:13:17,360 --> 00:13:21,960
అలా జరిగాక, మీరు బాల్ తిరిగి పొందుతారు,
ఫార్వర్డ్ ఆడి, ఆ పని పూర్తి చేస్తారు.

219
00:13:22,040 --> 00:13:25,040
అలా కాకపోతే, బాల్ లేనప్పుడు,
అది ట్రాక్ చేయాలి,

220
00:13:25,120 --> 00:13:28,720
మీరు బాల్ తిరిగి పొందాలి,
ఎందుకంటే వాళ్లను పరిగెత్తనీయకూడదు.

221
00:13:28,800 --> 00:13:33,120
బాల్‌తో స్పష్టత, సామర్థ్యం,
ఒకరిపై ఒకరి నమ్మకంతో,

222
00:13:33,200 --> 00:13:36,920
ప్రతి చర్య, ప్రతి బాల్, గయ్స్,
మనం జట్టుగా ఆడతాం.

223
00:13:37,000 --> 00:13:41,040
ధైర్యం ఉంచుకోండి,
పరస్పరం ఆడేందుకు ఆటను ఆస్వాదించండి.

224
00:13:41,120 --> 00:13:42,880
ఇప్పుడు చేతులు పట్టుకోండి,

225
00:13:43,200 --> 00:13:46,520
మీ శరీరంలో దానిని భావించండి, మీరెవరో,
పక్కన ఎవరున్నారో.

226
00:13:46,600 --> 00:13:48,000
మనం ఎవరమో!

227
00:13:48,080 --> 00:13:49,520
కలిసి ఆడడం ఆస్వాదించండి.

228
00:13:49,600 --> 00:13:51,840
వెళ్లి ఈ గేమ్‌లో అదరగొట్టండి, గయ్స్!

229
00:14:06,320 --> 00:14:08,240
బుకాయో సాకా, ఇంకా వెళుతున్నాడు.

230
00:14:08,320 --> 00:14:09,320
అతను సాకా.

231
00:14:09,680 --> 00:14:12,800
గన్నర్స్‌కు ఇది దాదాపు చక్కని ఆరంభం.

232
00:14:16,760 --> 00:14:20,000
సాకా ప్రమాదకర ఏరియాలో,
అది గాబ్రియెల్ లోపలకు కొట్టాడు.

233
00:14:20,080 --> 00:14:22,280
ఐదు నిమిషాల్లో ఆర్సెనల్‌కు ఆధిక్యం.

234
00:14:22,360 --> 00:14:25,720
లెస్టర్ 0 - 1 ఆర్సెనల్
గాబ్రియెల్ 5

235
00:14:28,520 --> 00:14:29,840
ఒబామెయాంగ్ వచ్చాడు,

236
00:14:29,920 --> 00:14:34,720
డానియెల్ అమార్టీ నుంచి అందుకోవడం,
ఇంకా ఒబామెయాంగ్, నేరుగా స్కీమికెల్ వద్ద.

237
00:14:34,800 --> 00:14:37,400
లాకాజెట్ మధ్యలో అటాక్‌లో చేరాడు.

238
00:14:37,480 --> 00:14:38,800
ఫ్రెంచ్‌మన్ వచ్చాడు.

239
00:14:39,360 --> 00:14:42,840
బాక్స్‌లోకి పాస్ పంపే యత్నం,
స్మిత్ రోవ్‌కు వచ్చింది!

240
00:14:42,920 --> 00:14:45,000
ఆర్సెనల్ అవకాశాలు రెట్టింపు.

241
00:14:45,080 --> 00:14:48,200
లెస్టర్ 0 - 2 ఆర్సెనల్
స్మిత్ రోవ్ 18

242
00:14:48,320 --> 00:14:51,400
ఆర్సెనల్‌కు రెండు గోల్స్ ఆధిక్యం
ఓ విజయంపై అవకాశం,

243
00:14:51,480 --> 00:14:53,200
వాళ్లు క్లీన్ షీట్ చేయగలిగితే.

244
00:14:53,280 --> 00:14:55,760
ఇహియనాచో, అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.

245
00:15:00,720 --> 00:15:02,120
అక్కడ ఫౌల్ లేదు.

246
00:15:02,200 --> 00:15:07,360
ఎంతో చక్కని పరిస్థితిలో
లెస్టర్‌కు ఫ్రీ కిక్ ఇవ్వబడింది.

247
00:15:11,160 --> 00:15:12,160
తెలివైన సేవ్!

248
00:15:12,240 --> 00:15:14,600
లోపలకు, అది...
లేదు, అది లైన్‌పై ఉంది.

249
00:15:14,680 --> 00:15:17,840
ఆరన్ రామ్స్‌డేల్ అమోఘమైన సేవ్.

250
00:15:23,360 --> 00:15:25,680
ఇక్కడ కింగ్ పవర్‌లో అది ఫుల్ టైమ్‌

251
00:15:25,760 --> 00:15:28,920
మికెల్ ఆర్టెటా జట్టుకు ఇది మరొక విజయం.

252
00:15:32,400 --> 00:15:36,560
ఆరన్ గోల్ ఇవ్వలేదు. జట్టుకు ఇప్పుడు
ఓటమి లేకుండా తొమ్మిది విజయాలు.

253
00:15:52,680 --> 00:15:54,680
ఇక నేనొక విషయం చెప్పాలి.

254
00:15:54,760 --> 00:15:56,960
మికెల్ సరేనంటే, నేను...

255
00:15:57,040 --> 00:15:58,000
కానివ్వు.

256
00:15:58,080 --> 00:16:00,400
సరే, అందరూ కళ్లు మూసుకోండి.

257
00:16:04,040 --> 00:16:05,960
మీ చేతులు పట్టుకుని వెళ్లండి.

258
00:16:06,480 --> 00:16:07,360
ఇప్పుడు పాడండి.

259
00:16:07,440 --> 00:16:11,200
రెండు రోజుల సెలవు, రెండు రోజుల సెలవు,
రెండు రోజుల సెలవు

260
00:16:11,680 --> 00:16:14,760
రెండు రోజుల సెలవు, రెండు రోజుల సెలవు,
రెండు రోజుల సెలవు

261
00:16:15,200 --> 00:16:18,000
రెండు రోజుల సెలవు, రెండు రోజుల సెలవు

262
00:16:18,440 --> 00:16:20,680
రెండు రోజుల సెలవు, రెండు రోజుల సెలవు

263
00:16:28,880 --> 00:16:30,000
అభినందనలు!

264
00:16:33,200 --> 00:16:35,080
ఇది ఆర్సెనల్‌

265
00:16:35,160 --> 00:16:38,760
ఆర్సెనల్‌కు ఈ ఫలితం తరువాత
వాట్‌ఫర్డ్‌తో ఒకటి-సున్నా.

266
00:16:38,840 --> 00:16:41,160
ఓటమి లేని విజయాలు ఇప్పుడు పది.

267
00:16:41,960 --> 00:16:43,920
ఎమిరేట్స్ స్టేడియం

268
00:16:44,000 --> 00:16:44,840
ద ఆర్సెనల్
ఫౌండేషన్

269
00:16:49,280 --> 00:16:52,640
ఈ సీజన్‌లో ఎత్తుపల్లాలు ఉన్నాయని అంటాను,

270
00:16:52,840 --> 00:16:54,640
కానీ నాది సానుకూల దృక్పథం.

271
00:16:54,720 --> 00:16:56,800
ఇతర జట్లను చూస్తే,
మాకు ఇంకా కావాలి.

272
00:16:56,880 --> 00:16:58,480
అది అడిగేందుకు మాకు కారణముంది

273
00:16:58,560 --> 00:17:01,520
జట్టుకు ఆర్సెనల్ ఇష్టమనేలా కనబడుతోంది,

274
00:17:01,600 --> 00:17:04,560
మేము ఎక్కడ ఉండాలో
అక్కడకు తేవాలని వాళ్ల కోరిక.

275
00:17:05,320 --> 00:17:08,560
ఆర్టెటాతో, ప్లేయర్లు
అతనిని గౌరవించడం చూడవచ్చు.

276
00:17:08,600 --> 00:17:11,200
మికెల్ కోసం బాగా ఆడాలని కోరుకుంటారు.

277
00:17:11,280 --> 00:17:15,080
కానీ అతను కొంచెం గౌరవంతో పాలిస్తాడు,
కానీ కొంచెం భయం కూడా.

278
00:17:15,160 --> 00:17:18,040
ఫిన్స్ బరీ పార్క్

279
00:17:18,080 --> 00:17:20,640
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్

280
00:17:23,320 --> 00:17:25,520
థోర్ప్ పార్క్ గురించి తెలుసుగా?

281
00:17:26,320 --> 00:17:27,200
థోర్ప్ పార్కా?

282
00:17:27,280 --> 00:17:28,280
అది ఉద్యానవనమా?

283
00:17:28,320 --> 00:17:30,080
అక్కడ ఏం చేస్తారు?

284
00:17:30,200 --> 00:17:32,200
రోలర్‌కోస్టర్లు, మేజ్‌లు, రైడ్‌లు,

285
00:17:32,280 --> 00:17:35,400
అక్కడ గెలిచేందుకు గేమ్‌లుంటాయి,
పెద్ద టెడ్డీబేర్ల వంటివి.

286
00:17:35,480 --> 00:17:37,680
-ప్రేయసితో వెళ్లడం బాగుంటుంది.
-ఔను.

287
00:17:37,760 --> 00:17:41,880
పిచ్ మీద విజయంతో, శిక్షణా మైదానంలో
వాతావరణం మారుతోంది.

288
00:17:41,960 --> 00:17:43,520
-నాన్న నంబర్ తెలుసా?
-తెలుసు.

289
00:17:43,560 --> 00:17:48,880
ఆ నంబర్ల గురించి ఏమనుకుంటావు?
విడివిడిగా లేదా మూడు నంబర్ల బ్లాక్‌లుగా?

290
00:17:48,960 --> 00:17:51,440
మొదటి నాలుగు, రెండవ నాలుగు,
తర్వాత మిగతావి.

291
00:17:51,520 --> 00:17:52,720
నాలుగులుగా చేయడమా?

292
00:17:52,800 --> 00:17:56,080
ఎక్కువ మంది మూడుగా చేస్తారు.
మూడుగా గుర్తుంచుకుంటారు.

293
00:17:58,680 --> 00:18:00,280
నీకు మేజ్ ఏంటో తెలుసా?

294
00:18:00,320 --> 00:18:02,440
-లేదు.
-నీకు మేజ్ ఏంటో తెలుసా?

295
00:18:02,520 --> 00:18:04,200
నీకు మేజ్ ఏంటో తెలుసా?

296
00:18:04,280 --> 00:18:05,480
-మేజ్ ఏమిటి?
-అవును.

297
00:18:05,560 --> 00:18:06,560
ఇదేంటి?

298
00:18:08,400 --> 00:18:10,960
కార్ల్, నీకు మేజ్ ఏంటో తెలుసుగా? తెలియదా?

299
00:18:14,320 --> 00:18:18,040
నా నంబర్‌ను వేరే రకంగా నాకు చెబితే,

300
00:18:18,080 --> 00:18:20,200
-నా నంబర్ గుర్తించను.
-అవును.

301
00:18:20,560 --> 00:18:23,680
ఎందుకంటే అది నేను శబ్దాన్ని
గుర్తుంచుకోవడం కూడా.

302
00:18:23,760 --> 00:18:26,560
గేమ్ కూడా అంతే,
మీరు యూనిట్‌గా ఆడతారు

303
00:18:26,640 --> 00:18:30,320
అర్థం చేసుకోవడం తేలిక.

304
00:18:31,440 --> 00:18:32,640
అది ఆసక్తికరం.

305
00:18:34,640 --> 00:18:37,080
మికెల్ మెరుగ్గా కనబడుతున్నాడు.

306
00:18:37,200 --> 00:18:39,280
అవును. కొంచెం ఊరటగా.

307
00:18:39,320 --> 00:18:40,680
అవును, మరింత ప్రశాంతంగా.

308
00:18:40,760 --> 00:18:44,080
-తను చాలా తెలివైనవాడు, రోజూ నేర్చుకుంటాడు.
-అవును.

309
00:18:45,000 --> 00:18:47,320
ప్లేయర్లతో మరింతగా చూస్తున్నాను... "హేయ్"

310
00:18:49,200 --> 00:18:50,040
తెలుసుగా?

311
00:18:50,080 --> 00:18:51,280
నేనెప్పుడూ చెబుతాను

312
00:18:52,280 --> 00:18:54,800
అతను ప్లేయర్లతో వ్యక్తిగత సంబంధాలను

313
00:18:54,920 --> 00:18:57,280
మరింతగా మెరుగు పరచుకుంటే,

314
00:18:57,320 --> 00:18:59,640
మరో స్థాయికి వెళతాడని చెబుతాను,

315
00:19:01,160 --> 00:19:05,480
ఎందుకంటే ఫుట్‌బాల్‌ను వ్యూహాలతో
అర్థం చేసుకునే అగ్రగామి అవుతాడు.

316
00:19:05,560 --> 00:19:08,000
జనాలను మానసికంగా,
తార్కికంగా అర్థం చేసుకోగలడు.

317
00:19:08,080 --> 00:19:11,720
జట్టు కలిసి ఉండడం,
ఒకరి కోసం ఒకరు పోరాడడం చూడవచ్చు.

318
00:19:11,800 --> 00:19:14,440
వాళ్లు మాటలు, కలిసి గడపడం,
కలిసి భోజనం చేస్తున్నారు.

319
00:19:14,520 --> 00:19:16,080
అవన్నీ మేనేజర్‌తో మొదలవుతాయి.

320
00:19:16,160 --> 00:19:18,040
అవును, కచ్చితంగా.

321
00:19:23,480 --> 00:19:25,680
మేమంతా ఆర్సెనల్‌ను అనుసరిస్తాం

322
00:19:25,760 --> 00:19:27,000
హలో!

323
00:19:27,720 --> 00:19:32,200
కీరన్ టియెర్నీ 2019లో
స్కాటిష్ పక్కన సెల్టిక్ నుంచి వచ్చాడు.

324
00:19:32,560 --> 00:19:35,560
కుటుంబం గర్వపడేలా చేయడమే
నేను ఎక్కువగా ఆస్వాదిస్తా.

325
00:19:35,640 --> 00:19:39,280
అదే నాకు ఉత్తమ విషయం,
డబ్బు అలాంటివి కొనలేదు.

326
00:19:41,320 --> 00:19:44,400
మా అమ్మ టీవీ చూస్తుంది,
ఈ సూపర్‌స్టార్లను చూస్తుంది,

327
00:19:44,480 --> 00:19:47,280
కొన్నిసార్లు వాళ్లు
ఫుట్‌బాలర్ల కంటే సెలబ్రిటీలు.

328
00:19:47,320 --> 00:19:51,880
నేనిక్కడకు వచ్చినప్పుడు,
నేను మారిపోతానని ఆమె భయపడింది.

329
00:19:52,480 --> 00:19:55,440
చీలమండ గాయంతో అతను
మూడు వారాలుగా ఆడడం లేదు.

330
00:19:55,520 --> 00:19:59,720
అతను తిరిగి మొదటి జట్టులోకి రావడానికి
వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు.

331
00:19:59,800 --> 00:20:01,240
ఐదు శాతం, నీ శరీర కొవ్వా?

332
00:20:01,320 --> 00:20:02,520
నాకు 7.5 శాతం.

333
00:20:03,240 --> 00:20:04,080
కేటీ.

334
00:20:04,160 --> 00:20:05,520
-డాక్ అల్డినో.
-హేయ్.

335
00:20:05,560 --> 00:20:06,480
డాక్టర్.

336
00:20:06,880 --> 00:20:08,400
నేను సిస్టం హ్యాక్ చేశా.

337
00:20:08,480 --> 00:20:09,320
దేనిని?

338
00:20:09,760 --> 00:20:11,040
శరీర కొవ్వు వ్యవస్థ.

339
00:20:11,080 --> 00:20:12,400
అతనది చేశాడు.

340
00:20:12,480 --> 00:20:13,520
7.5

341
00:20:13,920 --> 00:20:16,720
నాకు నిరుత్సాహం.
కాడ్‌బరీ సంగతి ఏమైంది?

342
00:20:16,800 --> 00:20:19,720
-కాడ్‌బరీ వాటా హఠాత్తుగా తగ్గింది.
-ఆ, తెలుసు.

343
00:20:19,800 --> 00:20:21,400
అందులో పెట్టుబడి పెట్టే సమయం.

344
00:20:21,480 --> 00:20:23,160
అందుకోసం కృషి చేశావా?

345
00:20:23,560 --> 00:20:24,720
కొన్ని సర్దుబాట్లు.

346
00:20:26,000 --> 00:20:27,720
చాక్లెట్లు తినడం ఆపేశావా?

347
00:20:27,800 --> 00:20:28,920
లేదు, మానేయాలేమో.

348
00:20:29,000 --> 00:20:30,080
కుదరదు.

349
00:20:31,280 --> 00:20:32,400
అసాధ్యం.

350
00:20:33,320 --> 00:20:35,000
కోపంగా ఉంది, తెలుసా?

351
00:20:35,080 --> 00:20:36,320
కచ్చితంగా. ఒప్పుకుంటా.

352
00:20:36,400 --> 00:20:37,720
-అంతా బాగుందా?
-బాగుంది.

353
00:20:37,920 --> 00:20:39,560
-అందరూ బాగున్నారా?
-అవును.

354
00:20:39,680 --> 00:20:43,320
ప్రతి వారం ఆడుతున్నప్పుడు,
మరుసటి గేమ్ ఉండగా జీవితం కనబడుతుంది,

355
00:20:43,440 --> 00:20:45,400
అక్కడ ఒత్తిడే ఒత్తిడి ఉంటుంది.

356
00:20:45,480 --> 00:20:47,960
నాకు గాయమైనప్పుడు, ఒత్తిడి లేదు,
అది విచిత్రం.

357
00:20:48,040 --> 00:20:51,320
మీరెక్కడ ఉన్నారో తెలియదు,
ఎక్కడో దేని మధ్యలోనో.

358
00:20:51,440 --> 00:20:53,240
-బాగున్నావా?
-ఇంకా పూర్తిగా కాదు.

359
00:20:53,320 --> 00:20:54,280
అవునా?

360
00:20:54,640 --> 00:20:57,000
ఇప్పుడు శిక్షణ పొంది, తిరిగి వెళ్లగలను...

361
00:20:57,080 --> 00:20:58,520
-దాదాపుగా.
-అవును.

362
00:20:58,560 --> 00:20:59,480
మంచిది.

363
00:20:59,720 --> 00:21:03,280
కీరన్ పురోగతి గురించి చర్చకు
వైద్య సిబ్బంది భేటీ అయ్యారు.

364
00:21:04,320 --> 00:21:06,000
బెడ్స్ మీద ఎవరిదైనా ఫిర్యాదు?

365
00:21:06,080 --> 00:21:09,560
కేటీ నన్ను పిలిచి, తను గురువారం
శిక్షణ పొందుతానని చెప్పాడు.

366
00:21:09,680 --> 00:21:10,760
నాకూ చెప్పాడు.

367
00:21:10,800 --> 00:21:13,080
అతనితో మాట్లాడడం మంచిది.

368
00:21:13,160 --> 00:21:15,240
ఈ సమయంలో కోలుకోవడమే ప్రణాళిక.

369
00:21:15,320 --> 00:21:18,320
కానీ అప్పుడు, తన మానసిక స్థితిపైనా
అతను ప్రస్తావించాడు.

370
00:21:18,440 --> 00:21:21,960
గేమ్‌లు జరుగుతుంటే,
ట్రైనింగ్ సెషన్లలో తీవ్రత పెంచుకోవచ్చు,

371
00:21:22,040 --> 00:21:25,520
ఇంకా గేమ్‌లో, గాడిలో పడవచ్చు,
ఇది గతం అయిపోతుంది.

372
00:21:25,560 --> 00:21:28,440
ఇప్పుడు మనం సరైన మార్గంలో వెళుతున్నాం.

373
00:21:30,640 --> 00:21:31,640
మంచి విషయం.

374
00:21:39,480 --> 00:21:40,800
ఎలా ఉన్నావు, పెద్దోడా?

375
00:21:40,920 --> 00:21:42,800
నీకు అన్నీ కొంచెం కావాలా?

376
00:21:42,920 --> 00:21:44,000
అది నీ మామూలుది.

377
00:21:44,080 --> 00:21:46,640
ఎప్పుడూ తీసుకునేదే,
దుప్పి మాంసం, ఇవ్వు.

378
00:21:46,720 --> 00:21:51,400
ఆర్సెనల్‌తో పని ఆరంభించేందుకు ముందే,
కీరన్‌కు జానీ మెక్‌కల్లమ్ వ్యక్తిగత షెఫ్.

379
00:21:52,160 --> 00:21:55,320
ఆ రెండిటి ఖరీదు ఎంతో తెలుసా?
148 పౌండ్లు.

380
00:21:55,400 --> 00:21:56,880
బాబూ, నిజంగా.

381
00:21:56,960 --> 00:21:59,200
నువ్వు తినే ఉత్తమ మాంసాలలో ఒకటి.

382
00:21:59,280 --> 00:22:01,680
కొంత ఇంటికి తీసుకెళ్లి,
మా కుక్కకు ఇస్తాను.

383
00:22:01,760 --> 00:22:02,720
సరిగ్గా.

384
00:22:10,880 --> 00:22:13,800
కీరన్ శిక్షణా మైదానానికి దగ్గరలో
జానీతో పాటు ఉంటాడు.

385
00:22:14,120 --> 00:22:17,680
మేము ఓడిపోతే అతనికి కొన్నిసార్లు
బాగా కోపం వస్తుంది, అదేమీ...

386
00:22:17,760 --> 00:22:21,040
కానీ అది అతని అభిరుచి నుంచి,
అతని పట్టింపు అదే,

387
00:22:21,120 --> 00:22:22,600
అందుకే అడ్డు తప్పుకుంటాను.

388
00:22:23,040 --> 00:22:24,760
-అయినా, జానీకి తెలుసు.
-అవును.

389
00:22:24,840 --> 00:22:27,760
నాకు కోపంగా ఉంటే,
ఆహారం ఉంచేసి, ఎటో వెళ్లిపోతాడు.

390
00:22:27,840 --> 00:22:28,960
అవును, అది నిజం.

391
00:22:29,040 --> 00:22:31,600
మదర్‌వెల్‌లో ముయిర్‌హౌస్‌లో
నేను పెరుగుతుండగా,

392
00:22:31,680 --> 00:22:34,040
అది శ్రామిక స్థాయిలో నివసించడమే,

393
00:22:34,120 --> 00:22:38,080
మీకు ఏదైనా కావాలంటే,
దానికోసం పని చేయాలని చెబుతారు,

394
00:22:38,160 --> 00:22:42,480
బహుశా అక్కడి నుంచి
శ్రామిక నైతికతను పొంది ఉంటాను,

395
00:22:42,560 --> 00:22:45,480
నా ఆలోచనలు
మా అమ్మానాన్నలను ప్రతిబింబిస్తాయి,

396
00:22:45,560 --> 00:22:47,800
ఎందుకంటే వాళ్లు అన్నిటికీ పని చేస్తారు.

397
00:22:47,880 --> 00:22:49,920
మా అమ్మ మూడు ఉద్యోగాలు చేస్తుంది,

398
00:22:50,480 --> 00:22:53,080
స్కూల్లో భోజనం తయారు చేసేది,
శుభ్రం చేసేది,

399
00:22:53,160 --> 00:22:57,360
ఆమె ఉదయం 6:00 కు లేస్తుంది,
ప్రతి రోజు, ఉదయం 5:00, 6:00 కు,

400
00:22:57,840 --> 00:23:01,080
మాకు సౌకర్యం ఇవ్వడానికి,
నాకు, నా సోదరికి.

401
00:23:01,640 --> 00:23:05,040
లండన్ లాంటి నగరానికి రావడం
ఎలా ఉంటుంది?

402
00:23:05,240 --> 00:23:07,800
ఇది ప్రారంభించడం కష్టం,
ఇబ్బంది పడేవాడిని,

403
00:23:07,880 --> 00:23:10,200
ఉత్సాహం తగ్గడం, ఇంటి మీద బెంగ.

404
00:23:10,280 --> 00:23:12,080
ఆరంభించడం చాలా కష్టం.

405
00:23:12,400 --> 00:23:15,240
శిక్షణకు బయట,
మనకు ఆలోచించే సమయం చాలా ఉంది.

406
00:23:15,320 --> 00:23:19,440
నేను ఆత్మహత్య చేసుకునేటటువంటి
దారుణమైన పరిస్థితుల్లో లేను,

407
00:23:19,960 --> 00:23:21,560
కానీ నా స్నేహితులు ఉన్నారు.

408
00:23:21,640 --> 00:23:25,160
వారిలో ఇద్దరు, ముగ్గురు
ఆత్మహత్య చేసుకుని, ప్రాణాలు కోల్పోయారు

409
00:23:25,240 --> 00:23:28,440
మీరు వాళ్లతో ఉన్నా
మీకు ఏమీ తెలియదు

410
00:23:28,520 --> 00:23:30,440
ఎందుకంటే వాళ్లేమీ చెప్పలేదు.

411
00:23:31,000 --> 00:23:34,480
అందుకే ప్రయత్నించి, సాయం చేయడంలో
నేను చేయగలిగినంత నా బాధ్యత

412
00:23:34,560 --> 00:23:39,520
ఉందని భావిస్తాను, ఎందుకంటే ఆ పరిస్థితుల్లో
అదెలా ఉంటుందో నాకు తెలుసు,

413
00:23:39,600 --> 00:23:41,640
ఇప్పుడు వెనుకకు చూసుకోవడం అది కష్టం.

414
00:23:41,720 --> 00:23:44,560
మా అమ్మానాన్నలు చెబుతారు,
నీతో జానీ ఉండడం మంచిది,

415
00:23:44,640 --> 00:23:46,360
నీతో జానీ ఉంటే మాకు ఊరట,

416
00:23:46,440 --> 00:23:48,960
అతను వండుతాడనే కాదు,
నిన్ను చూసుకుంటాడని కూడా.

417
00:23:49,040 --> 00:23:50,360
భావోద్వేగం చెందుతున్నాను.

418
00:23:52,200 --> 00:23:56,000
నేను తరచుగా మాట్లాడను, బాబూ,
అందుకే మాట్లాడితే మనసుతో మాట్లాడతా.

419
00:24:00,520 --> 00:24:03,520
మనం దేనికైతే చెందుతామో

420
00:24:09,000 --> 00:24:12,080
నేను కుక్కను తెచ్చుకుంటా,
నీకు కాకపూ తెలుసా?

421
00:24:13,400 --> 00:24:14,520
పూపీ మాదిరిగానా?

422
00:24:14,600 --> 00:24:15,720
-పూపీనా?
-పూడిల్.

423
00:24:16,000 --> 00:24:17,520
అతను పూపీ అన్నాడు.

424
00:24:17,720 --> 00:24:18,720
పూపీ.

425
00:24:18,960 --> 00:24:20,960
ఆగు, అతను పప్పీ అందామనే ప్రయత్నమా?

426
00:24:25,000 --> 00:24:29,200
ఆర్సెనల్ మరుసటి మ్యాచ్
టైటిల్ పోటీదారులు లివర్‌పూల్‌తో.

427
00:24:31,080 --> 00:24:34,160
లీగ్‌లో చివరిసారి ఆన్‌ఫీల్డ్‌లో
ఆర్సెనల్ గెలిచింది

428
00:24:34,240 --> 00:24:38,160
అది 2012లో
మికెల్ ఆరంభ లైనప్‌లో ఉండగా.

429
00:24:39,960 --> 00:24:43,480
అది ఆర్సెనల్ అజేయ వరుసను
ప్రమాదంలో నెట్టే సందర్భం.

430
00:24:45,120 --> 00:24:47,480
శుభ మధ్యాహ్నం, మిమ్మల్ని చూడడం బాగుంది.

431
00:24:47,560 --> 00:24:51,000
మనం ఇక్కడ దృష్టి పెట్టాలి,
మనకు చాలా గేమ్‌లు రానున్నాయి,

432
00:24:51,080 --> 00:24:54,280
మన సీజన్‌లో జరగబోయే విషయాలను,
అవి భారీగా నిర్ణయిస్తాయి,

433
00:24:54,360 --> 00:24:56,280
మనం ఆన్‌ఫీల్డ్‌లో ఆరంభించాలి.

434
00:24:57,000 --> 00:25:00,920
మనం ఇక్కడ, ఇక్కడ చేసేది
అతి ముఖ్యమైన విషయం కాదు,

435
00:25:01,000 --> 00:25:03,240
ఆన్‌ఫీల్డ్‌తోనే అతి ముఖ్యమైన విషయం,

436
00:25:03,960 --> 00:25:06,160
మీరిక్కడ పోటీ పడేందుకు

437
00:25:06,360 --> 00:25:09,440
భావోద్వేగంగా సమున్నత స్థితిలో ఉన్నారు.

438
00:25:09,520 --> 00:25:10,680
భావోద్వేగంగా అగ్రగణ్యులు

439
00:25:11,200 --> 00:25:13,880
అలా చేసేందుకు,
మీకు ఆన్‌ఫీల్డ్ ఏమిటో తెలియాలి.

440
00:25:13,960 --> 00:25:17,640
ప్రీమియర్ లీగ్‌లో
మీరు ఎదుర్కున్న ఏ మైదానంతో పోల్చినా

441
00:25:17,720 --> 00:25:18,880
ఇది చాలా విభిన్నం.

442
00:25:18,960 --> 00:25:21,040
మొదట, మీ మొదటి ఆలోచన ఇలా ఉండాలి,

443
00:25:21,120 --> 00:25:24,360
"నేను ఆన్‌ఫీల్డ్ వెళ్లి,
వాళ్లను ఓడించి గెలుస్తాను."

444
00:25:24,440 --> 00:25:28,120
మనం ఆన్‌ఫీల్డ్‌కు వెళ్లి,
వాళ్లపై గెలుస్తామని నమ్ముతాను.

445
00:25:39,080 --> 00:25:42,200
కొనసాగింపు వైర్లు పెట్టు,
అవి అక్కడ ఉండాలి.

446
00:25:42,640 --> 00:25:46,760
ఆన్‌ఫీల్డ్‌లో నిశిత వాతావరణానికి
ప్లేయర్లను సిద్ధం చేయాలని మికెల్ కోరిక.

447
00:25:46,840 --> 00:25:50,000
జట్టులో చాలామంది
ఇంకా ఆ అనుభవం పొందాల్సి ఉంది.

448
00:25:50,640 --> 00:25:52,240
నా చక్కని ఆలోచనలలో ఒకటి,

449
00:25:52,320 --> 00:25:55,120
"యు విల్ నెవర్ వాక్ అలోన్" ను
నేపథ్యంలో వింటూ

450
00:25:55,200 --> 00:25:56,800
ఇవాళ వాళ్లు శిక్షణ పొందుతారు.

451
00:25:56,880 --> 00:25:59,200
అది మంచి ఆలోచన,
ఆసక్తికర ఆలోచన.

452
00:26:00,160 --> 00:26:01,680
దీని కోసం చూస్తున్నాను.

453
00:26:01,920 --> 00:26:05,320
మేము స్పెయిన్‌లో వాడే
ఓ మాట ఉంది, సైక్లింగ్‌లో,

454
00:26:05,400 --> 00:26:08,840
సైక్లిస్ట్ పైకి వెళుతుంటే,
అద్భుతంగా కనబడతాడు,

455
00:26:09,200 --> 00:26:11,320
అతను ఒక కిలోమీటర్ వెళ్లాక...

456
00:26:11,520 --> 00:26:15,400
తను ఆగిపోయి, ముందుకు సాగలేనట్లు ఉంటాడు...
ఆ పదాన్ని పహారా అంటారు.

457
00:26:16,160 --> 00:26:19,160
నాకు ఆన్‌ఫీల్డ్‌లో ఓసారి జరిగింది,

458
00:26:19,240 --> 00:26:24,840
అక్కడ ఆట జరుగుతోంది, హఠాత్తుగా
ఎర్ర చొక్కాలు మాత్రమే ఎగురుతూ కనబడ్డాయి,

459
00:26:24,920 --> 00:26:28,040
గేమ్ నీ మీద అంతటా తిరుగుతోంది,
నేను స్పందించలేకపోయాను,

460
00:26:28,120 --> 00:26:30,360
జనాలు అనుకుంటారు,
"అతనేం చేస్తున్నాడు?"

461
00:26:30,440 --> 00:26:33,640
నేనేమో, ఆ పని చేయలేను,
మానసికంగా, శారీరకంగా,

462
00:26:33,720 --> 00:26:36,080
కోలుకోలేను, అంతా వేగంగా జరిగిపోయింది.

463
00:26:36,160 --> 00:26:40,520
ఆ భావన నాకు నా కెరీర్‌లో ఒక్కసారే
జరిగింది, అది ఆన్‌ఫీల్డ్‌లో.

464
00:26:41,000 --> 00:26:42,000
కుర్రాళ్లూ!

465
00:26:43,240 --> 00:26:46,440
మానసికంగా గేమ్‌ ఇప్పుడే ఆరంభించేంతటి
సిద్ధంగా ఉన్నాం.

466
00:26:46,520 --> 00:26:47,520
సరేనా?

467
00:26:47,600 --> 00:26:49,960
మనం ఆన్‌ఫీల్డ్‌లో ఉన్నాం, కానివ్వండి.

468
00:27:02,080 --> 00:27:03,640
ఎడమకు, కుడికి కదలండి.

469
00:27:03,720 --> 00:27:05,200
మళ్లీ, మళ్లీ, మళ్లీ!

470
00:27:05,280 --> 00:27:07,200
జనాలు ఆ భావనలో ఉండగా,

471
00:27:07,280 --> 00:27:11,120
ఆ గేమ్‌లో ప్రతి బాల్‌ను
జట్టుతో ఆడాలని అనుకుంటే,

472
00:27:11,800 --> 00:27:13,000
అది మీకు తెలుస్తుంది.

473
00:27:13,240 --> 00:27:15,480
కీరన్ టియెర్నీ పూర్తిగా ఫిట్ అవ్వడంతో,

474
00:27:15,560 --> 00:27:20,360
ఆన్‌ఫీల్డ్‌కు తన లెఫ్ట్‌బ్యాక్‌లలో ఎవరు
పూర్తిగా సిద్ధమయ్యారో మికెల్ నిర్ణయించాలి.

475
00:27:20,840 --> 00:27:21,680
నూనో!

476
00:27:22,400 --> 00:27:24,600
నీకు కావాల్సిన చోటు కోసం
నువ్వు సర్వశక్తులు ఒడ్డాలి.

477
00:27:24,680 --> 00:27:26,880
నువ్వు అటు వైపు వెళ్లిన క్షణంలో,

478
00:27:27,320 --> 00:27:29,640
ఓసారి చూడు, అది చాంబీరియన్ అయితే,

479
00:27:29,720 --> 00:27:32,160
లేదా అది, అతని పేరేంటి,
అలెగ్జాండర్ ఆర్నాల్డ్ అయినా.

480
00:27:44,080 --> 00:27:45,960
భళా, కుర్రాళ్లు, బాగుంది.

481
00:27:59,240 --> 00:28:01,440
లివర్‌పూల్

482
00:28:05,560 --> 00:28:09,880
లివర్‌పూల్ వర్సెస్ ఆర్సెనల్
ఆన్‌ఫీల్డ్ స్టేడియం - 20 నవంబర్ 2021

483
00:28:10,000 --> 00:28:13,480
సెప్టెంబర్‌లో, లివర్‌పూల్‌కు
15 స్థానాల దిగువన ఆర్సెనల్ ఉంది,

484
00:28:13,560 --> 00:28:16,400
కానీ వాళ్లు సరిగా ఆడితే
విభ్రాంతికర విజయం పొందుతారు,

485
00:28:16,480 --> 00:28:19,120
జూర్గెన్ క్లాప్‌కు మించి వాళ్లు వెళతారు.

486
00:28:19,880 --> 00:28:23,920
ఈ గేమ్ పట్ల ఎందుకు నమ్మకంగా ఉన్నానో
నాకు తెలియదు, ఎందుకో తెలియదు.

487
00:28:25,200 --> 00:28:29,080
నేను అనుకోవడం ఆర్టెటా,
తను ఎంత బాగా చేయగలడో చూపించే సమయం,

488
00:28:29,160 --> 00:28:32,440
అతనిని నమ్ముతాను, నిజంగా నమ్ముతాను.

489
00:28:41,280 --> 00:28:45,120
గేమ్‌లో వ్యూహాల విషయంలో,
సాంకేతిక పరంగా మనం ఏం చేయాలో

490
00:28:45,200 --> 00:28:47,760
గత రెండు రోజులలో
చాలానే చర్చించాము.

491
00:28:47,840 --> 00:28:50,440
ఇప్పుడు మనం గేమ్ ఎలా గెలవాలో
మీకు చెబుతాను

492
00:28:50,520 --> 00:28:53,400
ఇంకా ఈ గేమ్‌లో ఎలా పోటీ పడాలో చెబుతాను.

493
00:28:53,960 --> 00:28:57,680
మొదటగా, పోటీ పడేందుకు,
మనం పిచ్ మీద ఇలా ఉండాలి.

494
00:28:57,760 --> 00:29:01,520
ఈ విధంగా.
ఇది 96 నిమిషాల పాటు విచ్ఛిన్నం కాకూడదు.

495
00:29:02,920 --> 00:29:05,880
గత కొన్ని రోజులుగా, నన్ను చూశారు,
నేను సంగీతం పెట్టాను

496
00:29:05,960 --> 00:29:08,760
ఎందుకంటే ఈ పిచ్‌తో,
నాకు కొంత భావోద్వేగంగా ఉంది.

497
00:29:08,840 --> 00:29:11,160
నాకు ఎందుకు భావోద్వేగమో మీకు చెబుతాను.

498
00:29:11,240 --> 00:29:13,200
నేను ఆ షర్ట్ వేసుకుని, అక్కడ ఉండగా,

499
00:29:13,280 --> 00:29:16,240
సుదీర్ఘంగా ఆటకై ఇక్కడకు వచ్చాను,
వాళ్లిక్కడ గెలవలేదు.

500
00:29:16,320 --> 00:29:18,480
మేము వరుసగా రెండేళ్లు గెలిచాము,

501
00:29:19,920 --> 00:29:23,400
కానీ ఆ మరుసటి ఏడాది,
ఇక్కడకు రావాలని సిద్ధమైతే,

502
00:29:23,480 --> 00:29:26,600
మేము గెలవగలమని నమ్మాను,
ఏం జరిగిందో తెలుసా?

503
00:29:26,680 --> 00:29:28,240
గేమ్ ఓడిపోవడం మొదలుపెట్టాం.

504
00:29:28,320 --> 00:29:31,280
వాళ్లు మా మీద పడ్డారు,
నాకు నేనేం చేశానో తెలుసా?

505
00:29:31,360 --> 00:29:34,520
నేను దాక్కుని, పిచ్ మీద ఆశ వదులుకున్నాను.

506
00:29:34,960 --> 00:29:37,000
మేము ఐదు ఒకటితో ఓడాము, వదిలేశాను.

507
00:29:37,080 --> 00:29:41,480
నేనిక్కడ ఏం చేశానో నా కెరీర్ మొత్తంలో
ఎన్నడూ మరిచిపోలేదు, ఎన్నడూ కూడా.

508
00:29:41,560 --> 00:29:46,160
ఆ పిచ్ మీద ఏదీ వదిలిపెట్టకండి,
ఎందుకంటే నేను చూడకపోవడం బాధాకరం.

509
00:29:46,240 --> 00:29:50,200
జట్టును, నన్ను కుంగదీశాను,
మీకు అలా జరగడం నాకిష్టం లేదు.

510
00:29:50,280 --> 00:29:52,640
అందుకే, అక్కడకు వెళ్లండి,
ధైర్యంగా ఆడండి

511
00:29:52,720 --> 00:29:54,880
ఇవాళ పిచ్ మీద మనలా ఉండండి.

512
00:29:54,960 --> 00:29:57,280
నాకు ఆ సహాయం మాత్రమే చేయండి. సరేనా?

513
00:30:01,320 --> 00:30:02,240
యూరోప్ మహరాజులు

514
00:30:02,360 --> 00:30:03,360
లివర్‌పూల్

515
00:30:13,560 --> 00:30:16,360
సెంటర్ సర్కిల్ ముందు
టవారెస్ తిరిగి పొందాడు.

516
00:30:16,440 --> 00:30:19,080
అతనిది బాగా ఆసక్తికర పాత్ర,
నూనో టవారెస్.

517
00:30:19,160 --> 00:30:23,080
టియెర్నీ ఫిట్‌గా ఉండి, బెంచ్ మీదున్నా
ఇవాళ అతనికి అవకాశం వచ్చింది,

518
00:30:23,160 --> 00:30:25,280
ఆఖరి కొన్ని గేమ్‌ల ప్రకారం,

519
00:30:25,360 --> 00:30:28,880
చివరి పదకొండులో ఉండేందుకు
తన అర్హతను నిరూపించుకున్నాడు.

520
00:30:30,360 --> 00:30:33,200
మొదటి 30 నిమిషాలు
భీకరంగా పోరాడారు.

521
00:30:33,880 --> 00:30:35,880
పోస్ట్ దగ్గర చక్కని క్రాస్

522
00:30:35,960 --> 00:30:38,960
సాకా తలతో కొట్టాడు,
అది సరిగా తాకలేదు.

523
00:30:39,040 --> 00:30:42,000
థియాగో వైపు, ఎడమ కాలి షాట్,
గోల్‌కీపర్‌ వైపు స్కూప్,

524
00:30:42,080 --> 00:30:44,280
అక్కడ మానే, రామ్స్‌డేల్ రెండు సేవ్‌లు,

525
00:30:44,360 --> 00:30:47,280
అతనిని దాటి వెళుతుంటే ఆపాడు
ఇంకా నెట్‌లోకి.

526
00:30:49,480 --> 00:30:51,640
అది మానే నుంచి ఆలస్య సవాలు,

527
00:30:51,720 --> 00:30:54,040
ఇది ఆర్సెనల్ బెంచ్‌ను నిలబెట్టింది.

528
00:30:54,120 --> 00:30:56,480
అక్కడ వాదోపవాదాలు జరుగుతున్నాయి,

529
00:30:56,560 --> 00:30:59,960
ఆర్టెటా, క్లాప్ ముఖాముఖి
తలపడేందుకు వచ్చారు,

530
00:31:00,040 --> 00:31:03,920
ఇప్పుడు ఒకరిపై ఒకరు చేతులు విసురుకుంటూ,
ఉమ్మి వేస్తున్నారు

531
00:31:04,000 --> 00:31:07,440
టచ్‌లైన్ దగ్గర వేడి పెరుగుతోంది.

532
00:31:10,120 --> 00:31:12,480
ఒబామెయాంగ్ పరుగును
లాకాజెట్ గుర్తించాడు

533
00:31:12,560 --> 00:31:14,160
ఫేబినో అడ్డంగా వచ్చి

534
00:31:14,240 --> 00:31:17,920
అక్కడ మంటలు రగిలే లోపే
దాన్ని ఆర్పేశాడు.

535
00:31:18,000 --> 00:31:20,760
-ఆ జనాల అరుపులు వినండి.
-ఆ, వాళ్లకది నచ్చింది.

536
00:31:20,840 --> 00:31:24,120
పెనాల్టీ ఏరియాకు బయట 15 గజాలలో
లివర్‌పూల్‌కు ఫ్రీ కిక్,

537
00:31:24,200 --> 00:31:25,840
హాఫ్ టైమ్‌కు ఆరు నిమిషాల ముందు.

538
00:31:25,920 --> 00:31:29,240
అది మానేకు గురిపెట్టగా,
రామ్స్‌డేల్‌ను దాటి హెడర్ కొట్టాడు.

539
00:31:29,360 --> 00:31:31,400
లివర్‌పూల్‌కు ఒకటి సున్నా ఆధిక్యం.

540
00:31:31,480 --> 00:31:34,800
లివర్‌పూల్ 1 - 0 ఆర్సెనల్
మానే 39'

541
00:31:37,360 --> 00:31:40,960
గయ్స్, మనం గేమ్‌లో నిలవాలి.
అవకాశాలు వస్తాయి.

542
00:31:41,040 --> 00:31:44,040
మనం దూకుడుగా ఉండాలి,
మైదానం మధ్యలో ఉండి

543
00:31:44,120 --> 00:31:46,120
గేమ్‌ను మెరుగ్గా నిర్వహించాలి.

544
00:31:46,200 --> 00:31:48,280
ఆఖరి నిమిషం వరకు నమ్మకం ఉంచండి.

545
00:31:48,800 --> 00:31:50,280
మనం చేస్తాము? అవునా?

546
00:31:59,120 --> 00:32:03,200
అంతరం తగ్గించి, స్కోర్ సమం చేయాలని
ఆర్సెనల్ రెండవ సగం ఆడుతోంది.

547
00:32:05,440 --> 00:32:08,680
డిఫెన్స్ దగ్గర టవారెస్ పరుగు,
నేరుగా జోటాకు ఇచ్చారు,

548
00:32:08,760 --> 00:32:10,960
రామ్స్‌డేల్ చుట్టూ డియోగో జోటా.

549
00:32:11,040 --> 00:32:12,880
లివర్‌పూల్‌కు స్కోర్!

550
00:32:12,960 --> 00:32:14,960
లివర్‌పూల్ 2 - 0 ఆర్సెనల్
జోటా 52

551
00:32:15,040 --> 00:32:17,840
వెనుకకు పాస్‌తో నూనో టవారెస్

552
00:32:17,920 --> 00:32:21,080
ఇంకా ఆర్సెనల్, వాళ్లకు శిక్ష పడింది.

553
00:32:21,560 --> 00:32:23,880
టవారెస్, తన మార్కర్ నుంచి
బాగా దూరం జరిగాడు

554
00:32:23,960 --> 00:32:26,640
కానీ నేరుగా ఇద్దరు
లివర్‌పూల్ ప్లేయర్లకు చేరాడు.

555
00:32:26,720 --> 00:32:30,160
మానే ఎడమవైపు, అక్కడ ఏరియా లోపల
సలా ఎదురుచూస్తున్నాడు,

556
00:32:30,240 --> 00:32:31,560
తను కనుగొన్నాడు, ఇంకా...

557
00:32:32,360 --> 00:32:33,200
తేలికైన గోల్.

558
00:32:33,280 --> 00:32:37,040
లివర్‌పూల్ 3 - 0 ఆర్సెనల్‌
సలా 73

559
00:32:37,360 --> 00:32:38,360
అదుగో సలా,

560
00:32:39,200 --> 00:32:41,080
అలెగ్జాండర్ ఆర్నాల్డ్...

561
00:32:41,600 --> 00:32:43,720
టకూమి మినమినోకు మొదటి టచ్...

562
00:32:43,800 --> 00:32:45,000
లివర్‌పూల్ 4 - 0 ఆర్సెనల్
మినమినో 77

563
00:32:45,080 --> 00:32:46,800
...బాల్ నెట్‌లోకి వెళ్లింది.

564
00:32:50,400 --> 00:32:52,400
అది ఫుల్‌టైమ్ విజిల్.

565
00:32:52,480 --> 00:32:57,440
ఆర్సెనల్ ఓటమి లేని వరుసను
భారీగా లివర్‌పూల్ నాశనం చేసింది.

566
00:33:28,960 --> 00:33:30,160
మనం మళ్లీ వెళ్లాలి.

567
00:33:31,120 --> 00:33:32,720
బాధపడుతున్నట్లు నటించ వద్దు.

568
00:33:43,560 --> 00:33:47,120
గయ్స్, మనకు అలాంటి ఆరంభం తర్వాత
మనం పది గేమ్‌లలో ఓడిపోలేదు.

569
00:33:48,160 --> 00:33:51,720
నా అభిప్రాయంలో, మీరు వచ్చింది
ఈ గేమ్‌లో అతి కష్టమైన చోటుకు.

570
00:33:52,120 --> 00:33:54,280
వాళ్లను 45 నిమిషాలు ఆపగలిగాము,

571
00:33:54,360 --> 00:33:57,400
ఎందుకంటే మనం ఎక్కువసేపు
ఏం చేయాల్సిందో అదే చేశాము,

572
00:33:57,480 --> 00:33:59,200
వాళ్లు మన కంటే ఉన్నతులైనా సరే,

573
00:33:59,280 --> 00:34:02,200
మనమది అంగీకరించాలి,
మన కంటే మెరుగ్గా ఉన్నారు.

574
00:34:02,280 --> 00:34:05,360
కానీ రెండో సగంలో
మొదటి ఇరవై నిమిషాల్లో, గయ్స్...

575
00:34:05,440 --> 00:34:06,600
జట్టు విచ్ఛిన్నమైంది.

576
00:34:06,680 --> 00:34:09,160
మీ కోసం బాధపడతాను,
ఎందుకంటే ఇదెంత కష్టమో తెలుసు

577
00:34:09,240 --> 00:34:13,480
అక్కడ రెండు-సున్నా, మూడు-సున్నా,
నాలుగు-సున్నాతో ఉండడం, అదే జరగడం.

578
00:34:13,560 --> 00:34:16,920
గేమ్‌కు ముందు ఒక విషయం అడిగాను,
ఎవరూ దాక్కోవద్దని,

579
00:34:17,000 --> 00:34:17,840
మీరు దాక్కోలేదు.

580
00:34:17,920 --> 00:34:21,600
ఇంకా లోపాలు లేదా తప్పులు,
నమ్మండి, వాటిని పట్టించుకోను,

581
00:34:21,640 --> 00:34:25,000
ఇది నేర్చుకోవడంలో భాగం,
ఇంకా ఇది వృత్తి.

582
00:34:25,080 --> 00:34:28,120
మీ కోసం నేను సమర్ధిస్తాను, చింతించకండి.

583
00:34:28,160 --> 00:34:31,520
ఏదైనా ఉంటే, అది తప్పయితే,
నేను బాధ్యత తీసుకుంటాను.

584
00:34:31,600 --> 00:34:34,560
అందుకే, కోలుకోండి, కలిసి ఉండండి,
సోమవారం, గయ్స్,

585
00:34:34,640 --> 00:34:36,920
నమ్మకం ఉంచండి, మళ్లీ మొదలుపెడదాం, సరేనా?

586
00:34:42,800 --> 00:34:45,640
మికెల్ ఆర్టెటా గురించి ఆ క్షణంపై
మీరు ఆశ్చర్యపోతారు,

587
00:34:45,760 --> 00:34:48,880
జూర్గెన్ క్లాప్ ముఖంపై వెళ్లడం,
అది జనాలను ఉత్సాహపరిచింది.

588
00:34:49,440 --> 00:34:51,200
అది నాకు అమాయకత్వం.

589
00:34:51,320 --> 00:34:53,280
-ఆన్‌ఫీల్డ్‌లో...
-ఉత్సాహం ఇవ్వడం.

590
00:34:53,360 --> 00:34:57,200
...జనాలను ఉత్సాహపరచడం,
ఉత్తేజం కలిగించే పని ఉండదు.

591
00:35:07,560 --> 00:35:09,120
గేమ్‌లు వస్తూనే ఉంటాయి.

592
00:35:09,160 --> 00:35:11,440
న్యూకాజిల్‌తో ఆర్సెనల్ కోలుకుంది,

593
00:35:11,800 --> 00:35:13,920
కానీ ఒబామెయాంగ్ స్కోర్ చేయలేకపోయాడు.

594
00:35:14,000 --> 00:35:15,520
స్మిత్ రోవ్, మంచి సేవ్!

595
00:35:15,600 --> 00:35:19,400
-ఒబామెయాంగ్! అక్కడ ఎలా మిస్ అయ్యాడు?
-అతనెలా మిస్ చేశాడు?

596
00:35:19,480 --> 00:35:23,520
తర్వాత ఓల్డ్ ట్రాఫర్డ్‌కు వెళ్లిన
ఆర్సెనల్, పాత ప్రతర్థులతో ఓడిపోయింది.

597
00:35:23,600 --> 00:35:24,920
క్రిస్టియానో రొనాల్డో!

598
00:35:28,200 --> 00:35:31,200
ఒబామెయాంగ్‌ను వరుసగా
రెండో గేమ్‌లో తప్పించారు.

599
00:35:31,320 --> 00:35:33,680
పియెర్-ఎమెరిక్ ఒబామెయాంగ్ లేడు.

600
00:35:33,800 --> 00:35:35,840
ఇవాళ శక్తివంతంగా లేడు.

601
00:35:36,160 --> 00:35:39,120
గత కొన్ని గేమ్‌లుగా
అలాగే ఉన్నట్లున్నాడు.

602
00:35:39,160 --> 00:35:43,160
గత మూడు గేమ్‌లలో రెండు ఓడిపోయి
ఆర్సెనల్ ఫామ్ కోల్పోయింది,

603
00:35:43,200 --> 00:35:45,080
వాళ్ల పాయింట్లు పెరగడం లేదు.

604
00:35:45,160 --> 00:35:47,080
వాళ్ల ప్రత్యర్థులు బలపడ్డారు.

605
00:36:06,440 --> 00:36:09,960
ఆన్‌ఫీల్డ్‌కు వెళ్లినప్పుడు,
ఉత్తమ జట్టును ఎంచుకోవాలి.

606
00:36:10,040 --> 00:36:12,880
కీరన్ టియెర్నీ మన ఉత్తమ లెఫ్ట్‌ బ్యాక్.

607
00:36:12,960 --> 00:36:15,520
అది తప్పు అని భావిస్తాను.

608
00:36:16,120 --> 00:36:19,480
ఓల్డ్ ట్రాఫర్డ్‌లో,
తన కెప్టెన్‌ను ఆర్టెటా ఎందుకు తీసేశాడు?

609
00:36:19,560 --> 00:36:22,680
మీరు ఆశ్చర్యపోయి
తెర వెనుక సంఘటనల కోసం వెతుకుతారు,

610
00:36:22,800 --> 00:36:25,840
ప్లేయర్‌కు, మేనేజర్‌కు మధ్య
అంతా బాగానే ఉందా అని?

611
00:36:25,920 --> 00:36:28,800
పెప్ నాకిచ్చిన అతి పెద్ద సలహా,

612
00:36:29,160 --> 00:36:32,440
ఇది అత్యంత ఒంటరి వృత్తి అని
తను నాకు చెబుతుండేవాడు.

613
00:36:32,880 --> 00:36:36,480
మీరు ఆ తలుపు మూశాక,
మీరు, మీ బాధలే ఉంటాయి

614
00:36:36,560 --> 00:36:40,560
ఇంకా మీ సమస్యలు,
మీ నిర్ణయాలు ఎప్పుడూ అక్కడే ఉంటాయి.

615
00:36:41,560 --> 00:36:44,400
నేను తీసుకున్న నిర్ణయాలపై
అసలే మాత్రం బాధపడను.

616
00:36:44,480 --> 00:36:48,920
ప్రతి కఠిన నిర్ణయం నన్ను మెరుగైన
వ్యక్తి, మెరుగైన ప్రొఫెషనల్‌గా చేస్తుంది.

617
00:36:49,000 --> 00:36:52,760
రాబోయే దానికోసం అది నన్ను
సిద్ధం చేస్తుంది,

618
00:36:52,840 --> 00:36:55,520
అది మరొక సవాలు,
నేనది తీసుకునే మార్గం ఇదే,

619
00:36:55,600 --> 00:36:57,280
ఇక్కడ ఉండడమనేది నా నిర్ణయం.

620
00:36:58,160 --> 00:36:59,680
గయ్స్, అందరూ దగ్గరగా రండి.

621
00:37:03,200 --> 00:37:06,160
మనం మెరుగయ్యి, బాగా చేయాల్సిన
విషయాలు కొన్ని ఉన్నాయి,

622
00:37:06,200 --> 00:37:08,960
వాటిలో ఒకటి చాలా బలమైన లింక్,

623
00:37:09,040 --> 00:37:11,920
మనం తీవ్రతను కొంచెం
వదిలేసినా సరే, గయ్స్,

624
00:37:12,760 --> 00:37:16,360
గేమ్ మారిపోయే తీరు, ఇది మనకెంత ముఖ్యమైనదో,
ఎంత బలాన్ని ఇస్తుందో

625
00:37:16,440 --> 00:37:20,360
మిమ్మల్ని ఒప్పించడానికి
యూనిట్లలో మరిన్ని మీకు చూపుతాను

626
00:37:20,440 --> 00:37:23,040
మనం ఆ అధిక తీవ్రత నిర్వహించగలిగితే

627
00:37:23,120 --> 00:37:27,440
మనకు ఇప్పుడున్న ప్లేయర్లతో,
మనం ఆడడానికి ప్రయత్నించే విధానం.

628
00:37:27,840 --> 00:37:30,320
ఈ వారం, మరింత ఎక్కువ తీవ్రతతో,

629
00:37:30,400 --> 00:37:33,080
మరింత నిబద్ధతతో
నాణ్యత స్థాయిని పెంచండి.

630
00:37:33,160 --> 00:37:35,160
ఇది స్థాయిని పెంచే సమయం.

631
00:37:35,200 --> 00:37:37,880
నేను మార్పులు చేయడంతో
అందరూ ఉన్నారు.

632
00:37:37,960 --> 00:37:41,160
అన్ని సమయాల్లో అదే జట్టుతో ఆడతామని
మీరు అనుకోకండి.

633
00:37:41,280 --> 00:37:44,400
అందుకే, సంపాదించండి, సంపాదించే
ఉత్తమ మార్గం మాట్లాడకపోవడం,

634
00:37:44,480 --> 00:37:47,080
వారంలో అది
పిచ్ మీద చేయాలి, అవునా?

635
00:37:47,320 --> 00:37:48,160
వెళదాం పదండి.

636
00:37:54,000 --> 00:37:56,440
లీగ్‌లో తన జట్టు
తప్పులు చేస్తుండడంతో,

637
00:37:56,520 --> 00:37:57,800
మికెల్‌కు గెలుపు అవసరం.

638
00:37:58,360 --> 00:38:01,640
ఎవర్టన్‌తో మరుసటి గేమ్ కోసం
తను నిర్ణయించే లైనప్ కోసం

639
00:38:01,760 --> 00:38:05,560
అతను శిక్షణలో నిశితంగా
ప్లేయర్ల ప్రదర్శనను పరిశీలిస్తున్నాడు.

640
00:38:06,600 --> 00:38:08,680
ఈ సమయంలో బాగా విశ్రాంతిగా కనబడుతున్నాడు.

641
00:38:09,360 --> 00:38:11,040
అది కష్టమైన విషయం ఎందుకంటే

642
00:38:11,120 --> 00:38:13,480
బయటకు రావడానికి సిద్ధమా
లేక మళ్లీ వెళతాడా?

643
00:38:18,640 --> 00:38:21,040
అభిమానులకు కేటీ ఇష్టమని తెలుసు.

644
00:38:21,560 --> 00:38:25,800
నాకది తెలుస్తుంది,
కానీ నా స్థానం కోసం నేను పోరాడాలి.

645
00:38:25,880 --> 00:38:28,000
ఇది నాకు కీరన్‌తో పోటీ కాదు,

646
00:38:28,080 --> 00:38:31,320
ఆర్సెనల్‌తో ఆడే స్థానం గురించి.

647
00:38:32,120 --> 00:38:35,000
కీరన్, నిర్మాణంలో
మొదటి రెండు దశలలో ఉన్నాడు,

648
00:38:35,080 --> 00:38:37,600
ఈ సందర్భంలో టామీకి
బాల్ వచ్చినప్పుడు

649
00:38:38,200 --> 00:38:40,400
మనం మూడు హైస్ చేశాక
వాళ్లు వస్తారు,

650
00:38:40,480 --> 00:38:42,400
అన్ని వేళలా లోపల కన్నేసి ఉంచాలి.

651
00:38:42,480 --> 00:38:46,200
లివర్‌పూల్‌తో అక్కడ, న్యూకాజిల్‌తో ఇక్కడ,
మాన్ యూతో అక్కడ,

652
00:38:46,320 --> 00:38:48,760
బెంచ్ మీదనే ఉన్నాను
ఇంకా ఇలా జరగడం

653
00:38:48,840 --> 00:38:50,520
నాకు ఇదే మొదటిసారి.

654
00:38:51,280 --> 00:38:52,880
అది స్వీకరించడం కష్టం.

655
00:38:52,960 --> 00:38:57,000
మేమిద్దరం ఆడాలనుకోవడం నిజం,
అదే గేమ్ లక్షణం.

656
00:39:02,080 --> 00:39:03,880
మంచి సెషన్. అభినందనలు, బాయ్స్.

657
00:39:07,200 --> 00:39:09,160
ఇవాళ ఎక్స్‌ట్రాలు లేవు, అందరూ రండి.

658
00:39:11,280 --> 00:39:15,360
శిక్షణ తరువాత, డెవలప్‌మెంట్ కోచ్
కార్లోస్ క్వెస్టాతో తన తాజా ప్రదర్శనలపై

659
00:39:15,440 --> 00:39:17,480
చర్చించడానికి నూనో భేటీ అయ్యాడు.

660
00:39:18,160 --> 00:39:19,880
నాకు ఒక విషయం అర్థం కావాలి.

661
00:39:21,680 --> 00:39:23,800
నువ్వు ఏదైనా అర్థం చేసుకోలేకపోతే,
నాకు చెప్పు.

662
00:39:23,880 --> 00:39:27,080
నాకిది అర్థం కావాలి నూనో ఎందుకు,
కొన్ని రోజులు ఇక్కడ ఉన్నాడు,

663
00:39:27,160 --> 00:39:29,520
కొన్నిసార్లు ఇక్కడ,
ఇంకొన్నిసార్లు ఇక్కడ ఉంటాడో.

664
00:39:30,560 --> 00:39:32,480
మనం మనుషులమని అర్థం చేసుకుంటాను.

665
00:39:32,560 --> 00:39:36,520
జనాలకు మంచి రోజులు, చెడు రోజులు ఉంటాయి.

666
00:39:38,080 --> 00:39:39,560
కానీ నేనది అర్థం చేసుకోవాలి.

667
00:39:40,080 --> 00:39:41,160
నాకు తెలియదు.

668
00:39:42,280 --> 00:39:46,880
నా తప్పుల గురించి ఆలోచించాను,
ఎందుకంటే అదే,

669
00:39:47,400 --> 00:39:51,280
నేను పిచ్ మీద సరిగా ఆడకపోవడం
నా బుర్రలో ఉండిపోయింది.

670
00:39:51,600 --> 00:39:56,640
గేమ్‌లో చేసిన తప్పు
మెదడులో తిరుగుతూ ఉండవచ్చు.

671
00:39:57,920 --> 00:39:59,080
ఏమంటున్నావు?

672
00:39:59,160 --> 00:40:00,640
నువ్వు తప్పులు చేస్తావు.

673
00:40:00,760 --> 00:40:02,800
అది సహజం, దాని గురించి చింతించకు.

674
00:40:02,880 --> 00:40:05,760
వాటిని సరి చేసుకుంటే,
అవి పునరావృతం కావు.

675
00:40:05,840 --> 00:40:07,880
బహుశా నువ్వు వేరేవి చేస్తావు.
అది సహజం.

676
00:40:07,960 --> 00:40:11,640
నీకు అన్నీ ఉన్నాయి.
ఛాంపియన్ అయ్యే తెలివి నీకుంది,

677
00:40:11,760 --> 00:40:13,600
నా కోరిక నీకు సాయం చేయాలనే.

678
00:40:13,640 --> 00:40:16,360
ఇదుగో, నూనో,
నీకు సాయం చేసేవారిని కనుగొంటావు.

679
00:40:17,320 --> 00:40:21,800
కార్లోస్, తను ప్లేయర్లను అర్థం చేసుకోగలడు,
ఎందుకంటే అతనూ యువకుడే.

680
00:40:22,800 --> 00:40:26,080
నేను మెరుగయ్యేందుకు అతను సాయం చేశాడు.

681
00:40:31,200 --> 00:40:33,680
వాళ్ల రెండు బయటి మ్యాచ్‌లు ఓడిపోయాక,

682
00:40:33,800 --> 00:40:36,560
మరోసారి ఉత్తరానికి ప్రయాణించేందుకు
జట్టు సిద్ధమైంది.

683
00:40:39,640 --> 00:40:40,560
సౌండ్.

684
00:40:40,640 --> 00:40:43,800
తర్వాత ఎవర్టన్‌తో,
అది కఠిన పరిస్థితి కానుంది,

685
00:40:43,880 --> 00:40:46,000
ఈ పరిస్థితిపై మీ ఆలోచనలు ఏంటి?

686
00:40:46,080 --> 00:40:48,040
ఒకటి లేదా రెండు గేమ్‌లు ఓడిపోయాక,

687
00:40:48,120 --> 00:40:51,440
అందరిపై ఒత్తిడి ఏర్పడుతుంది,
అక్కడేమీ తేడా ఉండదు.

688
00:40:51,520 --> 00:40:54,680
యునైటెడ్‌తో గేమ్ తరువాత,
థియెర్రీ హెన్రీ, ఆలన్ షీరర్,

689
00:40:55,040 --> 00:40:58,520
గేమ్ గురించి మాట్లాడుతూ
తమ ఉద్దేశం తెలియజేశారు

690
00:40:58,600 --> 00:41:01,160
మీకు, మీ కెప్టెన్‌కు మధ్య
ఏదో సమస్య ఉందన్నారు

691
00:41:01,200 --> 00:41:03,600
ఎందుకంటే 15 నిమిషాలు ఉండగా
అతని తీసేశావు.

692
00:41:03,640 --> 00:41:07,280
-సమస్యే లేదు, ఉందా?
-అలాంటిదేమీ లేదని హామీ ఇవ్వగలను.

693
00:41:07,360 --> 00:41:10,400
అతనిని తీసేయడం అంటే
తను అవమానంగా భావించాడట,

694
00:41:10,480 --> 00:41:12,920
పియెర్-ఎమెరిక్
అలా భావించడని అనుకోవచ్చా?

695
00:41:13,000 --> 00:41:16,640
ప్లేయర్లతో వ్యవహరించడంలో
నేను ఉపయోగించే ఆఖరి మాట అదే,

696
00:41:16,680 --> 00:41:19,120
కచ్చితంగా, ఎందుకంటే అది అవమానం అయితే,

697
00:41:19,160 --> 00:41:21,600
అలాంటి ఎవరూ లేరని అనుకోండి.

698
00:41:33,560 --> 00:41:34,520
"నువ్వు ఎవర్టన్‌కు ఆడుతుంటే, మరిచిపోవాలి
విశ్రాంతి గురించి, విశ్రాంతి అంటే శూన్యం!"

699
00:41:34,600 --> 00:41:35,960
ఎవర్టన్ 1878

700
00:41:36,040 --> 00:41:42,040
ఎవర్టన్ వర్సెస్ ఆర్సెనల్
గుడిసన్ పార్క్ స్టేడియం - 6 డిసెంబర్ 2021

701
00:41:44,120 --> 00:41:46,640
టియెర్నీ జట్టులోకి వచ్చాడు, నాకు సంతోషం.

702
00:41:46,760 --> 00:41:49,600
నాకు టవారెస్ ఇష్టమే,
కానీ అతను చాలా పచ్చి అనవచ్చు.

703
00:41:51,560 --> 00:41:53,600
-బెంచ్‌ మీదే ఒబామెయాంగ్!
-అవును, డ్రాప్.

704
00:41:53,640 --> 00:41:55,200
సరైన పనే, అనుకుంటాను.

705
00:41:55,320 --> 00:41:56,600
అవును, కచ్చితంగా.

706
00:41:59,200 --> 00:42:02,640
నాలుగు మార్పులలో కీరన్ టియెర్నీ ఒకడు,
నూనో టవారెస్ స్థానంలో,

707
00:42:02,760 --> 00:42:06,360
టియెర్నీ, గత ఆరు
ప్రీమియర్ లీగ్ గేమ్‌లు ఆడలేదు.

708
00:42:06,800 --> 00:42:10,200
ఆర్సెనల్, ఆర్సెనల్, ఆర్సెనల్‌!

709
00:42:13,080 --> 00:42:16,960
గేమ్‌ను ఆరంభించడం, మనకు కావాల్సిన
ఊపు పొందడం ముఖ్యమైన విషయం.

710
00:42:17,040 --> 00:42:21,560
మనం గేమ్‌ను మైదానానికి తీసుకెళ్లి,
చివరి వరకు అక్కడ నిలవాలి.

711
00:42:21,800 --> 00:42:24,560
పిచ్ మీద ఏదైనా కనబడాలి.

712
00:42:24,640 --> 00:42:28,160
గత మూడు లేదా నాలుగు రోజులలో
మీతో నా అనుభవం ఏంటంటే,

713
00:42:28,280 --> 00:42:30,360
మీ సమన్వయం, మీ సాన్నిహిత్యం,

714
00:42:30,440 --> 00:42:32,080
నేను అది పిచ్ మీద చూడాలి.

715
00:42:32,160 --> 00:42:35,160
ఆ సాన్నిహిత్యం ఉండాలి, శక్తిని పంచాలి,
ఆ కట్టుబాటు ఉండాలి.

716
00:42:35,280 --> 00:42:36,920
ప్లేయర్లు, ఇక్కడున్నారు,

717
00:42:37,000 --> 00:42:39,560
లోపలకు వచ్చేటప్పుడు ముఖ్యం,
మీరంతా కూడా.

718
00:42:39,640 --> 00:42:42,000
ఉత్తమ గోల్‌తో
గొప్పగా ప్రారంభించాలి, పదండి!

719
00:42:47,880 --> 00:42:48,880
ఇదిగో పదండి.

720
00:42:48,960 --> 00:42:52,840
గుడిసన్ పార్క్‌లో సోమవారం రాత్రి,
ఇది ఎవర్టన్ వర్సెస్ ఆర్సెనల్.

721
00:42:57,160 --> 00:42:59,960
అది డుకూరే నుంచి వచ్చింది,
తను తిప్పి, కొట్టాడు,

722
00:43:00,040 --> 00:43:02,680
కానీ సమతుల్యం కోల్పోయాడు,
అది ఎవర్టన్‌కు అవకాశం.

723
00:43:02,800 --> 00:43:04,880
రిషార్లిసన్ పెనాల్టీ ఏరియాలోకి.

724
00:43:04,960 --> 00:43:07,760
ఎవర్టన్ దూకుడు కొంచెం పెంచింది.

725
00:43:07,840 --> 00:43:09,920
డిఫెండర్ పడిపోయాడు, గోర్డన్ కొట్టాడు,

726
00:43:10,000 --> 00:43:11,640
టొమియసు వచ్చాడు.

727
00:43:11,760 --> 00:43:15,640
ఇక్కడ చూస్తున్న, మెరుగైనదాన్ని
ఎవర్టన్ అభిమానులు ఆస్వాదిస్తున్నారు.

728
00:43:19,080 --> 00:43:21,120
ఇది మెరుగైన ఫుట్‌బాల్, ఇదిగో టియెర్నీ.

729
00:43:21,800 --> 00:43:24,160
అది చక్కని బాల్, వాళ్లు స్కోర్ చేశారు!

730
00:43:24,200 --> 00:43:25,320
ఎవర్టన్ 0 - 1 ఆర్సెనల్
ఓడెగార్డ్ 45+2'

731
00:43:25,400 --> 00:43:29,160
మార్టిన్ ఓడెగార్డ్, చక్కని మూవ్ తరువాత
గన్నర్స్‌కు తొలి అవకాశం.

732
00:43:29,280 --> 00:43:32,120
టియెర్నీ వేగంగా వెళుతూ,
అవకాశం చూసుకున్నాడు

733
00:43:32,160 --> 00:43:35,320
అందమైన బాల్‌తో
సగం నుంచి సరైన చోటుకు కొట్టాడు.

734
00:43:35,400 --> 00:43:37,880
ఈ తొలి సగంలో ఆర్సెనల్ గొప్పగా ఆడలేదు,

735
00:43:37,960 --> 00:43:40,320
వాళ్ల గోల్ ప్లే రన్‌కు వ్యతిరేకంగా ఉంది

736
00:43:40,400 --> 00:43:43,760
రెండవ సగంలో తమ గేమ్ స్థాయిని
వాళ్లు పెంచనున్నారు

737
00:43:43,840 --> 00:43:46,240
వాళ్లు ఆధిక్యం నిలబెట్టుకోవాలి.

738
00:43:48,480 --> 00:43:50,840
మన సమస్యలకు మనమే కారణం, రండి.

739
00:43:50,920 --> 00:43:53,840
మనం వెనుకకే ఆడగలం,
కేవలం వెనుకకే.

740
00:43:53,920 --> 00:43:56,400
మరి ఇది ఎలా జరుగుతుందని అనుకుంటావు

741
00:43:57,120 --> 00:43:59,200
ఒకసారి ఫార్వర్డ్ ఆడాము, స్కోర్ చేశాము.

742
00:43:59,280 --> 00:44:02,720
నిజంగా నీకిది చెప్పాలి,
అందరూ బైలైన్ దగ్గరే ఉన్నారు,

743
00:44:02,960 --> 00:44:04,160
నీకు ఇవ్వడం కోసం,

744
00:44:04,240 --> 00:44:05,480
స్పందించడం కోసం,

745
00:44:05,560 --> 00:44:09,080
ఈ స్థాయిలో ఆడేలా మీకు మీరు
డిమాండ్ చేయడం కోసం.

746
00:44:09,560 --> 00:44:11,240
నేను ఆ పని చేయాలా?

747
00:44:12,960 --> 00:44:15,880
మీరు బాగా అదృష్టవంతులు.

748
00:44:18,000 --> 00:44:19,440
బాల్‌తో

749
00:44:19,520 --> 00:44:22,920
అన్నిచోట్లా అవకాశాలు మీకున్నాయి,
మీరది గ్రహించారా?

750
00:44:23,400 --> 00:44:26,160
విభిన్న వైఖరితో
నేను జట్టును చూడాలి,

751
00:44:26,240 --> 00:44:28,400
ఇది బాల్‌ను తీసుకోవాల్సిన సమయం,

752
00:44:28,480 --> 00:44:31,200
బాల్ తీసుకోవాలి, ఆడాలి.
నాకు డిఫెన్స్ వద్దు.

753
00:44:31,280 --> 00:44:33,640
ఒత్తిడి చేయాలి,
బాల్ తీసుకుని దాడి చేయండి.

754
00:44:33,720 --> 00:44:35,400
రెండవ దానికై వెళ్లండి.

755
00:44:36,040 --> 00:44:37,200
ఆడండి!

756
00:44:49,320 --> 00:44:51,720
ఇంకా పది నిమిషాలు మాత్రమే ఉండగా,

757
00:44:52,040 --> 00:44:54,760
ఆర్సెనల్ గెలుపుతో వెళ్లేలా కనబడింది.

758
00:44:54,960 --> 00:44:56,640
ఆర్సెనల్‌కు మంచిరోజు కావచ్చు,

759
00:44:56,720 --> 00:45:01,040
ఛాంపియన్స్ లీగ్ స్థానాలకు ఒక పాయింట్
దూరానికి వెళ్లగలరు.

760
00:45:01,640 --> 00:45:03,120
అది క్రాస్‌బార్‌కు తగిలింది

761
00:45:03,200 --> 00:45:06,160
తిరిగి వచ్చింది, లోపలకు! రిషార్లిసన్!

762
00:45:06,240 --> 00:45:07,920
ఎవర్టన్ 1 - 1 ఆర్సెనల్‌
రిషార్లిసన్ 80'

763
00:45:08,000 --> 00:45:10,440
ఎవర్టన్ ఒకటి, ఆర్సెనల్ ఒకటి.
మంచి వాతావరణం.

764
00:45:10,520 --> 00:45:12,760
గుడిసన్ పార్క్‌లో
రాత్రి అంతటా అరుపులే.

765
00:45:12,840 --> 00:45:15,800
ఆర్సెనల్ పెనాల్టీ ఏరియాలోకి
డెమారీ గ్రే వెళ్లాడు,

766
00:45:15,880 --> 00:45:19,760
కొంతసేపటి క్రితం క్రాస్‌బార్‌కు తగిలింది,
ఇక్కడ నెట్‌కు తగిలింది!

767
00:45:19,840 --> 00:45:21,640
ఇది మ్యాచ్ గెలిచే గోల్.

768
00:45:21,720 --> 00:45:23,160
ఎవర్టన్ 2 - 1 ఆర్సెనల్
గ్రే 90+2'

769
00:45:23,240 --> 00:45:26,520
ఒకటి సున్నా నుంచి, వాళ్లు రెండు-ఒకటితో
గేమ్ గెలిచారు!

770
00:45:26,600 --> 00:45:29,080
అది తుది విజిల్.

771
00:45:41,920 --> 00:45:43,800
అది ఎంతో ఇబ్బందికరం.

772
00:45:45,080 --> 00:45:48,080
పది నిమిషాలు ఉండగా,
మన మూడవ రౌండ్‌ను ఇచ్చేశాం.

773
00:45:48,160 --> 00:45:50,040
బాల్‌ను కూడా ఇచ్చేశాం,

774
00:45:50,880 --> 00:45:54,400
గేమ్‌ను డిఫెండ్ చేయాలి,
చాలా అమాయకత్వం.

775
00:46:07,320 --> 00:46:10,960
నేను చెప్పబోయేదాని గురించి
నేను చింతించ దలుచుకోలేదు,

776
00:46:12,120 --> 00:46:13,960
అందుకే ఎక్కువ చెప్పాలనుకోను,

777
00:46:14,800 --> 00:46:17,360
కానీ ఇక్కడ స్పందన ఆలస్యమైంది.

778
00:46:17,920 --> 00:46:20,240
ఇక్కడ చాలా ఆలస్యం, అక్కడ ఉండాలి.

779
00:46:31,480 --> 00:46:34,160
మరుసటి సారి

780
00:46:34,240 --> 00:46:36,640
సరే, నేను ఓ ప్రకటన చేయాలి.

781
00:46:38,240 --> 00:46:42,320
ఒబాకు మనం ఇచ్చిన
క్రమశిక్షణా చర్య ప్రకారం,

782
00:46:43,520 --> 00:46:47,240
ఓ క్లబ్‌గా అతను ఇకపై కెప్టెన్‌గా కాడని
మేము నిర్ణయించాం.

783
00:46:49,040 --> 00:46:51,520
మికెల్ ఆర్టెటాకు
కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది

784
00:46:51,600 --> 00:46:54,240
మాంచెస్టర్ సిటీతో గేమ్
అతను మిస్ అవుతాడు.

785
00:46:54,320 --> 00:46:57,000
అక్కడకు వెళ్లి
ఈ గేమ్ గెలుద్దాం! పదండి!

786
00:46:57,520 --> 00:47:00,440
సాకా షాట్ కొట్టాడు! సాకా గోల్ కొట్టాడు!

787
00:47:00,840 --> 00:47:02,200
ఇంకా అది రెడ్ కార్డ్.

788
00:47:55,680 --> 00:47:58,360
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్లు,
కోచ్‌లు, సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు

789
00:47:59,680 --> 00:48:01,680
సబ్‌టైటిల్ అనువాద కర్త: కృష్ణమోహన్ తంగిరాల

790
00:48:01,760 --> 00:48:03,760
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్

