1
00:00:06,120 --> 00:00:09,360
జనవరి బదిలీ వ్యవధిని
మీరెలా వివరిస్తారు?

2
00:00:09,440 --> 00:00:11,520
అబ్బా. చెప్పాలి.

3
00:00:18,720 --> 00:00:20,360
ఇది నీ మరో ఆఫీసా?

4
00:00:20,400 --> 00:00:24,240
అవును. నేను ఇంటి నుంచి పని చేయాలంటే,
ఇక్కడి నుంచే.

5
00:00:25,920 --> 00:00:29,920
కొన్నిసార్లు నా టెలిఫోన్,
10:00, 11:00, అర్థరాత్రి,

6
00:00:30,000 --> 00:00:33,120
అమెరికా, బ్రెజిల్, ఇక్కడ, అలా,
జనాలు ఫోన్ చేస్తుంటారు

7
00:00:33,200 --> 00:00:35,200
నేను ఫోన్ తీసి మాట్లాడాల్సిందే.

8
00:00:36,840 --> 00:00:40,520
పది, 20, 50, 60,
70 మిలియన్ పౌండ్ల గురించి మాట్లాడడం,

9
00:00:41,120 --> 00:00:45,120
అలాంటి డీల్స్‌పై బేరసారాలు చేయడం
పెద్ద బాధ్యత.

10
00:00:45,680 --> 00:00:46,680
నాకది అర్థమైంది.

11
00:00:47,360 --> 00:00:50,240
ఒబామెయాంగ్ పరిస్థితి
నిజంగా ఊగిసలాడుతోంది.

12
00:00:50,320 --> 00:00:53,000
వాళ్లు ఒబామెయాంగ్‌ను బయటకు పంపి

13
00:00:53,080 --> 00:00:56,040
కొంత డబ్బును ఖాళీగా ఉంచుకుని,
క్లబ్ నుంచి తనను పంపాలి.

14
00:00:56,120 --> 00:00:59,800
ఒబామెయాంగ్‌తో పరిస్థితి,
ఇది ప్రణాళిక కాదు.

15
00:00:59,880 --> 00:01:02,000
కానీ సీజన్‌లో కొన్ని జరుగుతాయి.

16
00:01:02,080 --> 00:01:04,840
కానీ దీనిని అభిమానులు
అర్థం చేసుకుంటారని అనుకోను.

17
00:01:04,920 --> 00:01:05,720
ఎమిరేట్స్ స్టేడియం

18
00:01:05,840 --> 00:01:07,400
-హలో, నేస్తం.
-ఎలా ఉన్నావు?

19
00:01:07,440 --> 00:01:08,400
ఎడ్యు! మన్నించు.

20
00:01:09,400 --> 00:01:11,800
-ఫోటో తీసుకోవచ్చా?
-సరే. ఎలా ఉన్నావు?

21
00:01:11,880 --> 00:01:14,200
-నేను ఫోటో తీసుకోనా?
-ఒబా సంగతేంటి?

22
00:01:14,280 --> 00:01:15,360
ఒప్పందాలు చేసుకో.

23
00:01:15,440 --> 00:01:16,840
-అవును అంటావా?
-జాగ్రత్త.

24
00:01:16,920 --> 00:01:18,120
ఎమిరేట్స్ స్టేడియంకు
సుస్వాగతం

25
00:01:18,200 --> 00:01:19,880
అలా ప్రతి గేమ్‌లో జరుగుతుందా?

26
00:01:20,800 --> 00:01:23,840
కొంచెం, అవును.
కానీ అది బాగుంటుంది.

27
00:01:25,280 --> 00:01:28,120
ఒబామెయాంగ్ విషయంలో,
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి

28
00:01:28,200 --> 00:01:31,640
ఎందుకంటే పొరపాటు చేసే అవకాశం
చాలా ఎక్కువగా ఉండవచ్చు.

29
00:01:43,640 --> 00:01:46,960
మీరు చేసేది ప్రేమిస్తారు.
దానినే అభిరుచి అంటారు.

30
00:01:47,920 --> 00:01:50,760
మనం నమ్మకం ఉంచాలి.
మనకు శక్తి ఉండాలి.

31
00:01:51,920 --> 00:01:54,120
మీరు ఏంటో వీళ్లకు తెలియజేయండి.

32
00:01:54,520 --> 00:01:55,480
అందుకోసం వెళ్లండి.

33
00:01:56,160 --> 00:01:58,520
ఆల్ ఆర్ నథింగ్
ఆర్సెనల్

34
00:01:58,600 --> 00:02:01,360
డానియెల్ కలూయా వ్యాఖ్యానం

35
00:02:03,000 --> 00:02:04,400
జనవరి 2022

36
00:02:04,480 --> 00:02:05,640
ఆర్సెనల్ శిక్షణా కేంద్రం

37
00:02:05,720 --> 00:02:09,920
జనవరి బదిలీ వ్యవధి ఇంకా ఉంది.
పుకార్లు మళ్లీ షికార్లు చేస్తున్నాయి.

38
00:02:10,600 --> 00:02:14,800
పియెర్-ఎమెరిక్ ఒబామెయాంగ్‌ను
ఏం చేయాలనేదే పెద్ద చిక్కుముడి.

39
00:02:15,560 --> 00:02:17,160
మనకిప్పుడు సమస్య ఉంది,

40
00:02:17,280 --> 00:02:22,880
జట్టుకు సమీపంలో లేనని, పోటీ పడే
ప్రసక్తి లేదని అనుకునే ఓ ప్లేయర్

41
00:02:23,000 --> 00:02:24,880
-మనకు ఉన్నాడు.
-అవును.

42
00:02:25,600 --> 00:02:26,800
నాకది నచ్చలేదు.

43
00:02:28,160 --> 00:02:31,960
మనకు అంత సమయం లేదు,
ఎందుకంటే మనం ఆదివారం ఆడాలి,

44
00:02:32,040 --> 00:02:34,440
-అది పరిష్కరించాలి.
-నేను సిద్ధం.

45
00:02:34,560 --> 00:02:35,600
ఎడ్యు గాస్పర్

46
00:02:35,720 --> 00:02:38,080
జనవరి బదిలీ వ్యవధిపై
ఆర్సెనల్ ప్రణాళికలు

47
00:02:38,160 --> 00:02:41,240
ఇప్పుడు ఒక ప్లేయర్ భవిష్యత్తుపై
కేంద్రీకృతమయ్యాయి.

48
00:02:42,680 --> 00:02:46,080
మనం ఒబామెయాంగ్‌తో,
ఇంకా మికెల్‌తో మాట్లాడాలి.

49
00:02:46,920 --> 00:02:50,160
అతను తిరిగి వచ్చి
సీజన్ చివరి వరకు సాయం చేయాలి.

50
00:02:50,240 --> 00:02:52,240
మనం అతనిని తిరిగి కలుపుకోవాలి.

51
00:02:52,320 --> 00:02:56,000
మనం మికెల్‌తో మాట్లాడాలి.
ఓ చర్చ జరగాల్సి ఉంది.

52
00:02:56,080 --> 00:03:00,880
అవును, అది తేలికని మనం అనుకోము,
కానీ మనం ఏదైనా చేయాలి.

53
00:03:00,960 --> 00:03:02,640
ఫుట్‌బాల్‌ను తెలుసుకోలేము.

54
00:03:02,720 --> 00:03:05,840
కానీ మనకు తెలుసు,
మొత్తంగా చూస్తే అనుబంధం ఏమీ లేదు.

55
00:03:05,920 --> 00:03:07,080
సరే. నాకు అర్థమైంది.

56
00:03:07,680 --> 00:03:10,760
మేము బదిలీ వ్యవధి
తీరిక లేకుండా ఉంటుందని అనుకోలేదు.

57
00:03:10,840 --> 00:03:14,040
మేము వేసవిలో పెట్టిన పెట్టుబడికి,

58
00:03:14,160 --> 00:03:17,160
మేము తీసుకొచ్చిన ప్లేయర్లతో,
సంతోషంగా ఉన్నాము.

59
00:03:17,560 --> 00:03:20,600
మాకు ఒబా సమస్య స్పష్టంగా ఉంది

60
00:03:20,680 --> 00:03:22,920
కానీ అది ఓ సవాలు.

61
00:03:25,320 --> 00:03:28,720
పియెర్-ఎమెరిక్ ఒబామెయాంగ్‌
ఆర్సెనల్‌కు 92 గోల్స్ కొట్టాడు.

62
00:03:29,400 --> 00:03:31,200
అది అద్భుతం.

63
00:03:33,000 --> 00:03:35,080
కానీ అతను డిసెంబర్ నుంచి ఆడలేదు

64
00:03:35,160 --> 00:03:39,360
క్రమశిక్షణా చర్యలలో భాగంగా
అప్పటి నుంచి అతనిని కెప్టెన్సీ నుంచి,

65
00:03:39,440 --> 00:03:41,200
జట్టు శిక్షణ నుంచి తొలగించారు.

66
00:03:42,840 --> 00:03:45,680
ఇక చివరకు,
నిబంధనలు, క్రమశిక్షణ స్పష్టత తెస్తాయి,

67
00:03:45,760 --> 00:03:48,840
ఎందుకంటే చివరకు,
మీరు విశ్వాసాన్ని కొలవలేరు.

68
00:03:48,920 --> 00:03:52,040
మీరు ఆ ప్లేయర్ కళ్లలోకి చూసినప్పుడు

69
00:03:52,720 --> 00:03:55,040
అది పోయిందని మీరు నమ్మితే,

70
00:03:55,120 --> 00:03:59,000
అక్కడి నుంచి వెనుకకు రావడం
చాలా కష్టమైన విషయం.

71
00:04:06,200 --> 00:04:09,320
ఒబాతో పరిస్థితి
మిగతా పేయర్లను

72
00:04:09,400 --> 00:04:12,360
ధ్యాస మళ్లించేలా చేయకూడదని
మికెల్ ఆర్టెటా భావించాడు.

73
00:04:14,920 --> 00:04:18,240
కోవిడ్‌తో ఓ వారం దూరమయ్యాక
కోల్నీకి మికెల్ తిరిగొచ్చాడు.

74
00:04:18,360 --> 00:04:23,040
సీజన్‌లో నిర్ణయాత్మక జనవరి గేమ్‌ల కోసం
జట్టును ఏకం చేశాడు.

75
00:04:25,800 --> 00:04:29,920
మరుసటి పది రోజులలో ముగ్గురు పోటీదారులతో
నాలుగు గేమ్‌లు ఆడతాం,

76
00:04:30,000 --> 00:04:33,520
ఈ సీజన్‌లో
ఏం జరగబోతోందో అవి నిర్ణయిస్తాయి.

77
00:04:33,600 --> 00:04:35,920
నా ఖాళీ సమయంలో చాలా పరిశీలించాను.

78
00:04:36,040 --> 00:04:38,160
నేను 21 ట్రైనింగ్ సెషన్లు చూశాను.

79
00:04:38,240 --> 00:04:41,520
కొందరు ప్లేయర్లు
ఎంతో అసాధారణంగా శిక్షణ పొందారు.

80
00:04:42,480 --> 00:04:45,800
చాలామంది ప్లేయర్లు
బాగా శిక్షణ తీసుకున్నారు,

81
00:04:46,680 --> 00:04:50,680
ఇంకా కొందరు ప్లేయర్ల బృందం
ఊరికే వచ్చారంతే.

82
00:04:54,240 --> 00:04:56,240
ఆదివారం రోజున ట్రైనింగ్ సెషన్‌కు,

83
00:04:56,360 --> 00:05:01,600
నేను ఇక్కడ ఉంటే, నలుగురు ప్లేయర్లు,
బయట ట్రైనింగ్ సెషన్‌కు వెళతారు.

84
00:05:02,160 --> 00:05:06,480
నలుగురు. నలుగురు ప్లేయర్లు,
15 నిమిషాలకు, వెళ్లాలి.

85
00:05:07,320 --> 00:05:10,520
మనం పార్కులో శిక్షణ పొందడం లేదు,
మనం నర్సరీలో లేము,

86
00:05:10,600 --> 00:05:12,800
ఇక్కడ సమయం వృథా చేయడానికి లేము.

87
00:05:12,880 --> 00:05:17,760
ఎక్కువ మంది ప్లేయర్లు నవ్వుతున్నారు,
మరొక విషయం ఫిర్యాదు చేయడం.

88
00:05:18,520 --> 00:05:22,760
ఎవరో సరిగా పాస్ చేయకపోతే, ఫిర్యాదు.
నేను సరిగా పాస్ చేయకపోతే, అది అతని తప్పు.

89
00:05:22,800 --> 00:05:26,680
లేదు, మనం స్థాయిని పెంచాలి,
ఇది అందరికీ వర్తిస్తుంది.

90
00:05:26,760 --> 00:05:30,120
ప్రతి ఒక్కరికీ,
ఎందుకంటే ఇప్పుడు ఉండడం లేదా వెళ్లడం.

91
00:05:30,200 --> 00:05:32,760
ప్రతి రోజు ట్రైనింగ్‌లో,
ప్రతి ఒక్క బాల్‌ను.

92
00:05:33,840 --> 00:05:34,920
వెళదాం పదండి.

93
00:05:38,840 --> 00:05:40,120
వెళదాం పదండి.

94
00:05:41,640 --> 00:05:43,240
ఒబా జట్టులో లేకపోవడంతో,

95
00:05:43,320 --> 00:05:47,200
22 ఏళ్ల స్ట్రైకర్‌, ఎడ్డీ ఎన్‌కేటియాకు
అవకాశం వచ్చింది.

96
00:05:47,760 --> 00:05:50,200
ఎడ్డీ, నువ్వు ఇందులో భాగం. ఆడు, ఎడ్డీ.

97
00:05:51,320 --> 00:05:55,160
అతను అండర్ 21 స్థాయిలో
ఇంగ్లాండ్‌కు ఆల్‌టైం టాప్ స్కోరర్.

98
00:05:57,240 --> 00:06:01,720
ఆర్సెనల్‌కు, ఎడ్డీ ఇప్పటివరకూ
సీజన్‌లో ఐదు గోల్స్ చేశాడంతే.

99
00:06:01,800 --> 00:06:04,400
యువ జట్టుకు
నేను చాలా గోల్స్ కొట్టాను.

100
00:06:04,480 --> 00:06:08,800
అది నాకు నమ్మకం ఇచ్చింది, ఎందుకంటే నాకు
అవకాశం వస్తే మరిన్ని కొట్టగలనని తెలుసు.

101
00:06:08,880 --> 00:06:10,120
బాగుంది, ఎడ్డీ!

102
00:06:10,880 --> 00:06:13,080
ఇది గొప్ప ప్లేయర్లుండే పెద్ద క్లబ్.

103
00:06:13,160 --> 00:06:16,320
ముందు ప్రాంతాలలో
చాలా పోటీ ఉంటుంది,

104
00:06:16,400 --> 00:06:18,680
ప్లేయర్‌గా మీరు నమ్మకంతో ఉండాలి.

105
00:06:18,760 --> 00:06:22,080
అవకాశం వచ్చినప్పుడు
అవసరమైనది ఇవ్వగలగాలి.

106
00:06:23,000 --> 00:06:25,920
ఎఫ్ఏ కప్ కోసం ఆర్సెనల్‌ ఆరంభించడంతో
ఈ వారాంతం

107
00:06:26,000 --> 00:06:28,480
లైనప్‌లో ఎడ్డీకి స్థానం లభించింది.

108
00:06:29,760 --> 00:06:30,920
ఆర్సెనల్ ఆటగాళ్లు,

109
00:06:31,000 --> 00:06:34,640
ఆకాంక్షించే కప్‌లో 14 సీజన్లలో
మూడవసారి విజేతలుగా నిలిచారు.

110
00:06:35,160 --> 00:06:38,400
వాళ్లు రికార్డు స్థాయిలో
14 సార్లు గెలిచిన పోటీ అది.

111
00:06:41,760 --> 00:06:42,760
చివరిది.

112
00:06:48,000 --> 00:06:51,560
నాటింగ్‌హమ్ ఫారెస్ట్ వర్సెస్ ఆర్సెనల్
సిటీ గ్రౌండ్ స్టేడియం - 9 జనవరి 2022

113
00:06:51,640 --> 00:06:54,920
రండి, అబ్బాయిలు! ఆడండి!

114
00:06:58,080 --> 00:07:00,080
యూరోప్ ఛాంపియన్లు 1979
సిటీ గ్రౌండ్‌కు స్వాగతం

115
00:07:01,160 --> 00:07:04,320
ఎఫ్ఏ కప్‌కు వెళ్లాలి.
అది మన ట్రోఫీ. మనం 14 సార్లు గెలిచాం.

116
00:07:04,400 --> 00:07:05,520
అది మళ్లీ గెలవాలి.

117
00:07:06,000 --> 00:07:09,800
ఈరాత్రి, ఛాంపియన్‌షిప్‌లో
నాటింగ్‌హమ్ ఫారెస్ట్‌తో తలపడుతుంది,

118
00:07:10,320 --> 00:07:11,920
వాళ్ల స్థాయికి కింది లీగ్.

119
00:07:12,000 --> 00:07:14,600
సాధారణంగా మ్యాచ్‌లు ప్రారంభించని ఏడుగురికి

120
00:07:14,680 --> 00:07:16,360
మికెల్ అవకాశం ఇచ్చాడు.

121
00:07:17,840 --> 00:07:22,600
మొరటుగా ఉండే 20,000 మంది
సొంత అభిమానుల ముందు తేలికైన పని కాదు.

122
00:07:25,960 --> 00:07:28,200
సరే, దగ్గరగా రండి. రండి, దగ్గరగా.

123
00:07:28,280 --> 00:07:30,240
మనం కొత్త పోటీ ఆరంభిస్తున్నాం,

124
00:07:30,320 --> 00:07:34,280
ఈ పోటీ క్లబ్ చరిత్రలో,
డీఎన్‌ఏలో ఉంది.

125
00:07:35,000 --> 00:07:38,200
నాకు మొదటి నిమిషం నుంచి కావాలి,
అందరూ దానిపై ఉండాలి.

126
00:07:38,280 --> 00:07:41,720
నా జట్టు ఇక్కడకు వచ్చి,
వాళ్లపై ఆధిక్యం చూపడం చూడాలి.

127
00:07:41,800 --> 00:07:46,160
మీ శరీరం, మీ ఉద్దేశం ఉపయోగించండి,
తర్వాత గెలిచేందుకు మీ నైపుణ్యం.

128
00:07:46,240 --> 00:07:47,240
మీకు మంచి జరగాలి.

129
00:07:47,320 --> 00:07:48,480
పదండి!

130
00:07:53,000 --> 00:07:57,360
ఇది ఆర్సెనల్‌కు అగ్నిపరీక్ష.
అది వాళ్లు సాధించాలి.

131
00:07:57,440 --> 00:08:00,800
నాటింగ్‌హమ్ ఫారెస్ట్ ఆతిథ్యం ఇవ్వగా,
ఎఫ్ఏ కప్ మూడవ రౌండ్‌లో

132
00:08:00,880 --> 00:08:02,560
ఆ గేమ్ ఇప్పుడు జరుగుతోంది.

133
00:08:05,280 --> 00:08:08,080
ఆర్సెనల్ ఇక్కడ ముందడుగు వేసే
ప్రయత్నం చేస్తుంది.

134
00:08:09,000 --> 00:08:11,760
ఇది ఆరంభం,
షాట్ కొట్టినా, అది వైడ్.

135
00:08:15,720 --> 00:08:19,040
అది లూజ్ బాల్‌, టవారెస్ కొట్టాడు.

136
00:08:19,120 --> 00:08:21,920
అక్కడ టవారెస్ ఆలోచన ఏంటో
అర్థం కాలేదు.

137
00:08:22,520 --> 00:08:24,720
ఎన్‌కేటియా, మరొక షాట్ కొట్టాడు.

138
00:08:24,800 --> 00:08:27,760
అది లక్ష్యానికి ఒకటిన్నర గజం దూరం.

139
00:08:27,840 --> 00:08:30,760
ఆర్సెనల్ ఇంకా ఎక్కువగా
నిమగ్నం కావాల్సి ఉంది.

140
00:08:32,000 --> 00:08:35,040
మ్యాచ్ ఆరంభమైన ముప్ఫై నిమిషాలు,
మికెల్ మార్పు చేశాడు.

141
00:08:35,760 --> 00:08:38,160
అతను నూనో టవారెస్.

142
00:08:38,240 --> 00:08:41,400
తొలి సగంలో వెనక్కు పిలవడం
విచారం కలిగించే విషయం.

143
00:08:41,480 --> 00:08:44,480
అవును. నీకు ఒకటి చెబుతాను,
తనది సరైన నిర్ణయం.

144
00:08:45,880 --> 00:08:48,240
గ్లోవ్స్ తీసేశాడు. తను సంతోషంగా లేడు.

145
00:08:50,200 --> 00:08:51,880
జాన్సన్ మంచి వేగం చూపుతున్నాడు.

146
00:08:52,000 --> 00:08:55,760
ఇక్కడ ఆర్సెనల్‌కు సమస్య.
బాల్ వెనక్కు. లెనో బాగా సేవ్ చేశాడు.

147
00:08:55,880 --> 00:08:58,320
ఆర్సెనల్ ఆఖరి నిమిషాల్లో వణికిపోతోంది.

148
00:08:58,400 --> 00:09:00,400
మికెల్ ఆర్టెటా అంత సంతోషంగా లేడు.

149
00:09:01,240 --> 00:09:02,640
గంట ఆడిన తరువాత,

150
00:09:02,760 --> 00:09:05,360
ఆర్సెనల్ టార్గెట్ మీద
ఒక షాట్ కూడా కొట్టలేదు.

151
00:09:07,280 --> 00:09:09,840
మంచి బాల్‌! ఓరి, బాబూ.

152
00:09:10,720 --> 00:09:14,400
ఎన్‌కేటియా ఆ అవకాశం వృథా చేశాడు.

153
00:09:18,160 --> 00:09:19,280
త్వరగా లోపలికి బాల్!

154
00:09:22,640 --> 00:09:23,880
తను లూయిస్ గ్రాబ్.

155
00:09:24,000 --> 00:09:28,280
ఆర్సెనల్ డిఫెన్స్‌కు తప్పు వైపు కొట్టాడు,
దగ్గరి నుంచి లోపలకు కొట్టాడు.

156
00:09:28,360 --> 00:09:29,440
నాటింగ్‌హమ్ ఫారెస్ట్ 1 - 0 ఆర్సెనల్
గ్రాబన్ 83'

157
00:09:29,520 --> 00:09:31,360
ఫారెస్ట్ అభిమానులు పిచ్‌ మీదకు.

158
00:09:35,520 --> 00:09:38,720
బాల్‌తో ఆర్సెనల్ బద్ధకంగా ఉంది,
తేలికగా ఇచ్చేస్తుంది.

159
00:09:38,760 --> 00:09:40,880
చాలా సులభం, చాలా నెమ్మది.

160
00:09:47,200 --> 00:09:49,120
ఆర్సెనల్ నిరుత్సాహం కలిగిస్తోంది.

161
00:09:50,360 --> 00:09:52,120
అదిగో చివరి విజిల్.

162
00:09:53,400 --> 00:09:55,600
నాటింగ్‌హమ్ ఫారెస్ట్‌కు ఇది పెద్ద విజయం.

163
00:09:55,640 --> 00:09:58,480
వాళ్లు ఎఫ్ఏ కప్ నుంచి ఆర్సెనల్‌ను
బయటకు పంపేశారు.

164
00:10:08,160 --> 00:10:09,520
దారుణం, గయ్స్.

165
00:10:22,320 --> 00:10:24,320
ఓటమి ఒప్పుకుంటాను, గయ్స్.

166
00:10:24,400 --> 00:10:28,640
ఈ చెత్త ప్రమాణాలను నేను ఒప్పుకోను.
వాటిని ఒప్పుకోను.

167
00:10:28,760 --> 00:10:31,000
నేను ఒప్పుకోను, ఈ ప్రమాణాలను.

168
00:10:31,080 --> 00:10:34,640
అసలు సమీపంలో లేదు. దగ్గరగా కూడా లేదు!

169
00:10:35,880 --> 00:10:38,760
మీ వైఖరి నాకు తెలుసు,
ఆ వైఖరి సరిపడదు.

170
00:10:38,880 --> 00:10:42,520
ధైర్యం, పరుగు అవి సరిపోవు,
మీరు అంతకంటే ఎక్కువగా ఉండాలి.

171
00:10:42,600 --> 00:10:44,280
అది దగ్గరగా కూడా లేదు.

172
00:10:44,360 --> 00:10:46,720
-మీరు నాతో అంగీకరిస్తారా?
-అవును.

173
00:10:46,760 --> 00:10:50,080
అవునా? కానీ మీ మధ్య ఏదైనా చేయండి.
మిమ్మల్నే అడగండి.

174
00:10:50,160 --> 00:10:52,440
మీకు శిక్షణలో అదే చెప్పాను.

175
00:10:52,520 --> 00:10:54,760
ఎందుకంటే అది శిక్షణలో చూశాను,

176
00:10:54,880 --> 00:10:57,520
బాల్ ఇచ్చేయడం
పెద్ద విషయం కాదనేలా ఆడడం.

177
00:10:57,880 --> 00:11:01,200
పర్వాలేదు, కొన్నిసార్లు
బాల్ వెనుక వెళ్లి, పరిగెడతాను.

178
00:11:01,280 --> 00:11:03,680
లేదు! ఎందుకంటే గేమ్‌లో, అది గోల్!

179
00:11:05,480 --> 00:11:07,800
డ్యుయెల్ ఓడిపోతే బాధపడతాను.

180
00:11:07,880 --> 00:11:10,560
చిన్న జట్ల గేమ్‌లలో ఓడిపోతే బాధపడతాను.

181
00:11:11,440 --> 00:11:13,280
ఎందుకంటే అవి ప్రమాణాలు!

182
00:11:13,360 --> 00:11:15,600
ఎందుకంటే మీరిక్కడకు వచ్చి ఓడిపోయారు.

183
00:11:17,440 --> 00:11:20,160
ఏ మాత్రం సమీపాన లేదు, గయ్స్.
ఇది దారుణం.

184
00:11:20,240 --> 00:11:21,560
మీకు చెబుతున్నా, దారుణం!

185
00:11:24,240 --> 00:11:26,840
మనం లివర్‌పూల్‌తో అలా ఆడితే,
ఘోరంగా ఉంటుంది.

186
00:11:44,560 --> 00:11:46,040
మా అమ్మ ఇవాళ వెళ్లిపోయింది.

187
00:11:46,120 --> 00:11:47,680
-వెళ్లిందా?
-నాకు భోజనం లేదు.

188
00:11:47,760 --> 00:11:50,600
-నీ షెఫ్‌కు ఏమైంది?
-ఆమె సెలవులో ఉంది.

189
00:11:50,680 --> 00:11:53,120
-ఎప్పటివరకూ సెలవులో ఉంటుంది?
-రేపటిదాకా.

190
00:11:53,200 --> 00:11:55,200
-సరే.
-ఈరాత్రికి ఏం చేస్తావు?

191
00:11:55,280 --> 00:11:56,520
లిటిల్ నాందోస్, అంతేగా?

192
00:11:57,040 --> 00:11:58,040
అదిగో చూడు.

193
00:11:58,120 --> 00:12:03,840
తను డబుల్ చికెన్ ర్యాప్ చేయవచ్చు.
రెండు క్రీమ్‌లతో పెరి చిప్స్.

194
00:12:05,000 --> 00:12:06,640
ఒబా సంతకం చేయమంటారా?

195
00:12:10,880 --> 00:12:14,160
ఒబా ప్రస్తుతం 5,000 మైళ్ల దూరాన
ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్‌లో

196
00:12:14,960 --> 00:12:16,760
గబోన్‌కు ఆడుతున్నాడు.

197
00:12:19,320 --> 00:12:23,720
ఇక్కడ, గోల్ కొట్టకుండా
ఎఫ్ఏ నుంచి ఆర్సెనల్ బయటకొచ్చింది.

198
00:12:25,000 --> 00:12:28,400
సీజన్‌లో కీలక సమయంలో
స్టార్ స్ట్రైకర్ లేకపోవడం

199
00:12:28,480 --> 00:12:30,360
మికెల్ మీద ఒత్తిడి తెచ్చింది.

200
00:12:30,440 --> 00:12:34,520
మికెల్ ఆర్టెటా, ఒబామెయాంగ్‌ల మధ్య బంధం
దారుణంగా దెబ్బ తినింది.

201
00:12:34,600 --> 00:12:37,640
అది బాగుచేయవచ్చా,
వాళ్లు సరిచేసేందుకు ప్రయత్నిస్తారా?

202
00:12:37,960 --> 00:12:40,480
ఒబామెయాంగ్‌కు క్లబ్‌లో
సుదీర్ఘ భవిష్యత్తు ఉంటే,

203
00:12:40,560 --> 00:12:42,160
అది ఇప్పుడే తిరిగి రావాలి.

204
00:12:42,240 --> 00:12:44,360
ఒబామెయాంగ్‌తో ఎంతదూరం వెళతావో తెలియదు,

205
00:12:44,440 --> 00:12:46,960
ఎందుకంటే అది మనం నమ్మినంత పెద్దది అయితే,

206
00:12:47,040 --> 00:12:49,160
అందుకు ప్రత్యామ్నాయం లేదు.

207
00:12:49,240 --> 00:12:50,960
ఒబామెయాంగ్ గురించి చర్చించేందుకు

208
00:12:51,040 --> 00:12:54,320
ఆర్సెనల్ నలుగురు డైరెక్టర్లలో ఒకడైన
టిమ్ లూయిస్‌ను మికెల్ కలిశాడు.

209
00:12:56,640 --> 00:13:00,440
అతను వెళ్లి తప్పు చేశాడు,
నువ్వు స్పందించావు, సరైన విధంగానే,

210
00:13:00,960 --> 00:13:03,200
నీ అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించావు.

211
00:13:03,680 --> 00:13:09,520
ఒబాను బయటకు పంపడంపై చాలా ఆధారపడి ఉంది,
మనం అతనిని పంపగలమా?

212
00:13:11,360 --> 00:13:15,640
మికెల్‌తో బంధం అనేది లావాదేవీ కాదు,
అది బంధం.

213
00:13:16,600 --> 00:13:17,600
అతను మేనేజర్

214
00:13:17,680 --> 00:13:19,040
టిమ్ లూయిస్
నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్

215
00:13:19,760 --> 00:13:23,480
ఒబామెయాంగ్ లాంటి విషయంలో,
అతను స్పందనలో సాయం అడిగితే

216
00:13:24,000 --> 00:13:29,000
అతనికి మద్దతు ఇచ్చేందుకు, సవాలు చేసేందుకు,
సహాయం చేసేందుకు నేను ఉన్నాను.

217
00:13:29,760 --> 00:13:33,160
అతనికి ఫుట్‌బాల్ సలహా ఇవ్వను.
అది హాస్యాస్పదం.

218
00:13:33,520 --> 00:13:35,800
ఇక్కడ తేలికైన జవాబు లేదు.

219
00:13:35,880 --> 00:13:39,640
కానీ మనం జనవరి ముగింపును దాటితే,
అతనికే అన్ని అవకాశాలు ఉంటాయి.

220
00:13:41,280 --> 00:13:43,120
అతనిపై ఉన్న ఒత్తిడంతా నాకు తెలుసు,

221
00:13:43,200 --> 00:13:46,160
ఎందుకంటే అతనే ఇక్కడ జనాల మధ్యన ఉంటాడు,

222
00:13:46,240 --> 00:13:48,440
మాకు వచ్చే ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు,

223
00:13:48,520 --> 00:13:51,360
కానీ అలా జరిగేందుకు వెనుక
ఓ జట్టుంది.

224
00:13:54,920 --> 00:13:57,360
జనవరి బదిలీ వ్యవధి పూర్తి కానుండటంతో

225
00:13:57,440 --> 00:14:01,840
ఒబామెయాంగ్ భవిష్యత్తుపై నిర్ణయానికి
క్లబ్‌కు సమయం మించిపోతోంది.

226
00:14:01,920 --> 00:14:04,520
మనం ప్రాజెక్టును, ప్రణాళికను
తిరిగి పరిశీలించాలి...

227
00:14:04,600 --> 00:14:07,360
-అవును.
-చేయగలిగే పనులు కొన్నే ఉన్నాయి.

228
00:14:10,680 --> 00:14:12,600
-మనం దీనిపై మాట్లాడాలా?
-అవును.

229
00:14:12,680 --> 00:14:13,840
-లేదా అన్నీనా?
-అవును.

230
00:14:15,080 --> 00:14:16,600
ఎడ్యు, నిన్నటి కాల్‌లో,

231
00:14:16,680 --> 00:14:19,680
అభిప్రాయాన్ని చక్కగా చెప్పావని అనుకుంటాను.

232
00:14:19,760 --> 00:14:22,360
-అవును, రిచ్‌తో మాట్లాడాను.
-సరే.

233
00:14:23,240 --> 00:14:26,480
అందరూ కోల్పోతున్నారు, అవునా?
అందరూ కోల్పోతున్నారు.

234
00:14:27,040 --> 00:14:31,240
మార్కెట్‌కు వెళ్లడం,
ఏదైనా జరగడం, పరిస్థితి మారడం అలా

235
00:14:31,320 --> 00:14:34,120
కచ్చితంగా ఏదీ అనిపించడం లేదు.

236
00:14:34,200 --> 00:14:37,880
మనం ఓ పరిష్కారం వెతకాలి,

237
00:14:37,960 --> 00:14:40,920
ఎందుకంటే ఇది సమస్య, ఇది ఎక్కడికీ పోదు.

238
00:14:43,640 --> 00:14:46,880
జట్టును నిర్వహించడానికి
మికెల్ చాలా చేయాల్సి ఉంటుంది,

239
00:14:46,960 --> 00:14:49,040
అతని ధ్యాస దానిపైనే ఉండాలి.

240
00:14:49,120 --> 00:14:52,440
ఒబామెయాంగ్‌తో, అన్నీ సరిగ్గా
పని చేసేలా చూడాలి.

241
00:14:53,920 --> 00:14:59,400
తీసుకోగలిగే ఉత్తమ నిర్ణయంపై
మేమంతా కలిసి క్లబ్‌గా చర్చించాము.

242
00:14:59,880 --> 00:15:04,000
ఇది ఒబా, మికెల్ పరిస్థితి కాదు,
ఇది దాని కంటే పెద్దది.

243
00:15:04,680 --> 00:15:08,560
మనం మరుసటి గేమ్‌పై దృష్టి పెట్టాలి,
నువ్వు ఆ సంగతి చూడాలి,

244
00:15:08,640 --> 00:15:10,440
వాళ్లు ఒత్తిడి చేస్తే, గయ్స్...

245
00:15:11,320 --> 00:15:13,840
ఎందుకంటే మీడియా
ఎలా స్పందిస్తుందో తెలుసు,

246
00:15:13,920 --> 00:15:17,880
జనాలు ఎలా స్పందిస్తారో తెలుసు,
కథనాలు ఎలా అందిస్తారో తెలుసు.

247
00:15:19,320 --> 00:15:23,320
ఒబామెయాంగ్ ఆఫ్రికన్ నేషన్స్ కప్‌లో
ఆడుతున్నాడు. పార్టీ చేసుకుంటున్నాడు.

248
00:15:23,400 --> 00:15:27,920
ఒబామెయాంగ్‌తో మీ నిర్వహణ సరిగ్గానే ఉందని
అలాగే అతను కొంచెం సమస్యాత్మక ఆటగాడని

249
00:15:28,000 --> 00:15:30,560
నిరూపించినట్లు భావిస్తున్నారా?

250
00:15:30,640 --> 00:15:33,640
నేను తీసుకున్న నిర్ణయం స్పష్టంగా,

251
00:15:33,720 --> 00:15:37,560
ఎల్లప్పుడూ క్లబ్ ఆసక్తుల కోసమే ఉంటుంది

252
00:15:37,640 --> 00:15:40,160
ఇంకా సరైన పని చేయాలని చూస్తున్నాను.

253
00:15:40,240 --> 00:15:43,440
ఇక్కడ ప్లేయర్లు ఇప్పటివరకూ
కట్టుబడి ఉన్నారు.

254
00:15:43,520 --> 00:15:44,840
అందరికీ, ధన్యవాదాలు.

255
00:15:46,600 --> 00:15:50,120
మేనేజర్‌గా ఉండాలని అనుకున్నప్పుడు
నిర్ణయం తీసుకున్నాను

256
00:15:50,200 --> 00:15:52,720
నేను ప్లేయర్లతో బాహాటంగా ఉంటాను,

257
00:15:53,160 --> 00:15:55,360
అలా చేసేందుకు
మీరు బాహాటంగా ఉండాలంటే

258
00:15:55,440 --> 00:15:58,680
మీరు బాధపడే అవకాశం ఉందని
అంగీకరించి తీరాలి.

259
00:16:04,400 --> 00:16:08,200
వివాదం మధ్యలో ఉంటే ఎలా ఉంటుందో
ఓ ప్లేయర్‌కు తెలుసు,

260
00:16:08,280 --> 00:16:09,360
అతనే గ్రానిట్ చాకా.

261
00:16:11,400 --> 00:16:13,040
మాకు చాలా యువ జట్టు ఉంది.

262
00:16:13,280 --> 00:16:14,120
గ్రానిట్ చాకా
మిడ్‌ఫీల్డర్

263
00:16:14,200 --> 00:16:16,480
మా పని వాళ్లకు ఎక్కువ సలహా ఇవ్వాలి,

264
00:16:16,560 --> 00:16:20,600
ఇది అతి తేలిక కాదని చెప్పాలి,
ఎందుకంటే మీరు చాలా పని చేయాలి.

265
00:16:20,880 --> 00:16:25,480
నేనిప్పటికే పెద్దవాళ్లలో ఒకడిని,
ఇప్పుడు నా వయసు 28.

266
00:16:28,320 --> 00:16:31,600
నా గేమ్ కారణంగా నాకు దూకుడు ఎక్కువని
జనాలు అనుకుంటారు.

267
00:16:32,240 --> 00:16:34,920
మీరు మమ్మల్ని పిచ్ మీద
90 నిమిషాలు చూస్తారు,

268
00:16:35,000 --> 00:16:40,400
ఆ వ్యక్తిలో విభిన్న వైపును మీరు చూస్తారు.

269
00:16:43,760 --> 00:16:47,280
గ్రానెట్‌కు ఆర్సెనల్ కెరీర్‌లో
నాలుగు రెడ్ కార్డ్‌లు ఇచ్చారు.

270
00:16:47,360 --> 00:16:48,840
అతను క్లబ్‌లో చేరాక,

271
00:16:48,920 --> 00:16:52,080
ప్రీమియర్ లీగ్‌లో వేరే ఏ ఇతర ప్లేయర్‌ను
అన్నిసార్లు పంపలేదు.

272
00:16:52,160 --> 00:16:54,320
ఇది గ్రానిట్ చాకాకు రెడ్ కార్డ్‌.

273
00:16:54,400 --> 00:16:56,920
అతను అలా చేయడం ఇది మొదటిసారి కాదు.

274
00:16:57,000 --> 00:17:00,720
రెండు సీజన్ల క్రితం అతను క్లబ్ కెప్టెన్,
కానీ అభిమానులతో గొడవపడ్డాడు.

275
00:17:00,800 --> 00:17:03,920
గ్రానిట్ చాకాపై వెటకారం,
అక్కడ అతని స్పందన

276
00:17:04,000 --> 00:17:08,200
ఏ మాత్రం బాగాలేదంటూ కొందరు
ఆర్సెనల్ అభిమానులు ప్రశంసిస్తున్నారు.

277
00:17:08,280 --> 00:17:11,040
ఒబామెయాంగ్ మాదిరిగా,
అతని పాత్రను తగ్గించారు.

278
00:17:11,480 --> 00:17:12,440
చాకా, వదిలెయ్.

279
00:17:12,520 --> 00:17:15,240
సోదరా, కొన్ని రోజులు బాగా ఆడతావు,
కొన్ని రోజులు...

280
00:17:15,320 --> 00:17:18,200
నోరు ముయ్. సరే. నోరు ముయ్.

281
00:17:19,400 --> 00:17:22,720
మిమ్మల్ని ప్రేమించే జనాలు,
ప్రేమించని జనాలు ఉంటారు.

282
00:17:22,800 --> 00:17:27,080
మిమ్మల్ని విమర్శిస్తారు,
చాలా కఠినమైన విషయాలు రాస్తారు.

283
00:17:27,200 --> 00:17:30,080
ఫుట్‌బాల్ అంటే కార్లు, ఇళ్లు,
డబ్బులు, ఇంకా

284
00:17:30,160 --> 00:17:33,520
అలాంటి వాటికోసమని అనుకుంటారు,
కానీ మాలో ఎవరూ

285
00:17:33,560 --> 00:17:37,200
పిల్లలకు ఫుట్‌బాల్ మొదలుపెట్టినప్పుడు
డబ్బు కోసం కాదు.

286
00:17:37,280 --> 00:17:39,760
మీకు నచ్చడంతో ఫుట్‌బాల్ మొదలుపెడతారు.

287
00:17:39,800 --> 00:17:42,800
మేము కూడా మనుషులమేనని
జనాలు మరిచిపోతారు.

288
00:17:42,920 --> 00:17:45,760
ఈ భాగం, ఇక్కడ కుటుంబం
కలిసి ఉండడం కోసం,

289
00:17:45,800 --> 00:17:49,960
కలిసుంటే మాత్రమే
కష్ట సమయాలను ఎదుర్కోగలరు.

290
00:17:51,440 --> 00:17:53,800
లివర్‌పూల్ వర్సెస్ ఆర్సెనల్
ఆన్‌ఫీల్డ్ స్టేడియం - 13 జనవరి 2022

291
00:17:53,880 --> 00:17:56,240
ఫిబ్రవరి చివరలో
వెంబ్లీలో చెల్సియాను

292
00:17:56,320 --> 00:17:58,640
ఎదుర్కునే జట్టుగా ఎవరు నిలుస్తారు?

293
00:17:59,760 --> 00:18:01,280
లివర్‌పూల్ ఉన్నత జట్టు.

294
00:18:01,320 --> 00:18:05,280
మేము పురోగతి చెందుతున్నామని అనుకోవాలంటే,
వాళ్లను ఓడించాలి.

295
00:18:08,200 --> 00:18:12,480
ఈ రాత్రి, ఈఎఫ్ఎల్ కప్‌లో
రెండవ పోటీ అయిన సెమీఫైనల్‌లో,

296
00:18:13,080 --> 00:18:14,560
ఆర్సెనల్ ఆడుతుంది.

297
00:18:14,680 --> 00:18:17,880
ఈ సీజన్‌లో ట్రోఫీ గెలిచేందుకు
వాళ్ల ఆఖరి అసలైన అవకాశం.

298
00:18:18,400 --> 00:18:19,800
లివర్‌పూల్‌తో ఆడతారు.

299
00:18:19,920 --> 00:18:23,000
ఈ టీమ్‌ల చివరి మ్యాచ్‌లో,
నాలుగు-సున్నాతో ఆర్సెనల్‌ ఓడింది.

300
00:18:23,080 --> 00:18:25,160
ఈ సాయంత్రం ఇది పెద్ద గేమ్.

301
00:18:25,240 --> 00:18:29,320
లివర్‌పూల్ అత్యుత్తమంగా ఉండగా,
ఇది ఆర్సెనల్‌కు పెద్ద సవాలు.

302
00:18:29,800 --> 00:18:33,440
మికెల్‌కు, ఒబా చుట్టూ
పుకార్లు ఇంకా తిరుగుతుండడంతో,

303
00:18:33,520 --> 00:18:36,400
విమర్శకులకు స్పందించేందుకు
ఓ విజయం సహాయపడుతుంది.

304
00:18:36,880 --> 00:18:39,800
ఆర్సెనల్‌కు గ్రానిట్, ఎడ్డీ
ఇద్దరూ ఆరంభిస్తారు.

305
00:18:41,280 --> 00:18:43,320
-కుర్రాళ్లూ, వెళ్లండి.
-పదండి.

306
00:18:43,400 --> 00:18:48,160
ఇప్పుడే శక్తి మొదలవుతుంది, అబ్బాయిలు,
తర్వాత కాదు, ఇప్పుడే, సిద్ధంగా ఉండండి.

307
00:18:51,920 --> 00:18:52,880
నిలబడండి.

308
00:18:56,920 --> 00:18:59,000
గయ్స్, ఇది సాధించండి.

309
00:18:59,560 --> 00:19:02,200
జట్టులో భావోద్వేగాలు నిండడం కావాలి.

310
00:19:02,280 --> 00:19:05,080
నేను మీ కళ్లలోకి చూస్తే మీ వైఖరి చూడాలి,

311
00:19:05,160 --> 00:19:06,760
మంట, విశ్వాసం కనబడాలి.

312
00:19:06,800 --> 00:19:10,040
మీరు డిఫెండ్ చేస్తే ధైర్యం కనపడాలి,

313
00:19:10,080 --> 00:19:13,200
మనం ఆడేటప్పుడు,
నిగ్రహం, నాణ్యత కనబడాలి.

314
00:19:13,280 --> 00:19:16,280
వాళ్ల మీద, ఏం చేయాలో మీకు తెలుసు,
రన్నర్‌తో ఉండండి,

315
00:19:16,320 --> 00:19:19,680
షాట్‌లు ఆపి, డిఫెండ్ చేయండి,
మనకు గోల్‌కీపర్ ఉన్నాడు.

316
00:19:19,760 --> 00:19:21,200
వెళదాం పదండి.

317
00:19:22,440 --> 00:19:23,440
పదండి!

318
00:19:32,880 --> 00:19:34,720
ఆర్సెనల్ ఇది ఆరంభించింది.

319
00:19:38,480 --> 00:19:40,720
అబ్బబ్బా, రామ్స్‌డేల్ అక్కడ పట్టుకున్నాడు,

320
00:19:40,800 --> 00:19:44,160
కానీ ఆర్సెనల్ గోల్‌కీపర్‌కు
అక్కడ తప్పు జరిగింది.

321
00:19:45,440 --> 00:19:47,920
గేమ్‌ను ఆరంభం నుంచి
లివర్‌పూల్ నియంత్రించింది.

322
00:19:48,000 --> 00:19:49,400
అది మినమినో నుంచి.

323
00:19:50,880 --> 00:19:53,720
ఆర్సెనల్‌పై లివర్‌పూల్
కచ్చితంగా బాగా ఆడుతోంది.

324
00:19:54,320 --> 00:19:56,720
లివర్‌పూల్ నేరుగా కొట్టింది. రాబర్ట్‌సన్.

325
00:20:04,760 --> 00:20:06,520
ఇంకా రెడ్ కార్డ్‌.

326
00:20:07,800 --> 00:20:11,280
గ్రానిట్ చాకాను పంపించేందుకు
తన జేబులోంచి తీశాడు.

327
00:20:12,080 --> 00:20:13,920
చాకాకు మరోసారి రెడ్ కార్డ్,

328
00:20:14,000 --> 00:20:16,800
అతని ఆర్సెనల్ కెరియర్‌లో
ఇది ఐదవసారి.

329
00:20:16,880 --> 00:20:19,800
ఆర్సెనల్ ఇప్పుడు పదిమందికి పడిపోయింది.

330
00:20:28,560 --> 00:20:29,640
దారుణం, బాబూ.

331
00:20:43,800 --> 00:20:46,960
డిఫెన్స్ కోసం మార్పు చేసేలా
మికెల్ మీద ఒత్తిడి నెలకొంది.

332
00:20:48,720 --> 00:20:52,000
ఎడ్డీ ఎన్‌కేటియా ఆట అయిపోయింది,
రాబ్ హోల్డింగ్ వచ్చాడు.

333
00:20:52,080 --> 00:20:55,200
ఆర్సెనల్ తమ ప్రాణాల కోసం
ఇప్పుడు డిఫెండ్ చేయాలి.

334
00:20:55,720 --> 00:20:58,320
ఇది వారి వ్యక్తిత్వానికి అసలైన పరీక్ష.

335
00:21:03,760 --> 00:21:07,520
మినమినో. ఆర్సెనల్ దృఢంగా నిలబడింది.

336
00:21:08,040 --> 00:21:12,080
తొలి సగం చివరి క్షణాలలోకి వచ్చింది,
ఆర్సెనల్ నిలబడగలదా?

337
00:21:19,400 --> 00:21:22,640
ఓటమి ఒప్పుకోకండి, ఆడండి. కానివ్వండి.

338
00:21:23,560 --> 00:21:24,560
సరే, వినండి.

339
00:21:24,680 --> 00:21:27,880
మనకు క్రమశిక్షణ ఉంటే,
డిఫెండ్ బాగా చేయగలిగితే,

340
00:21:27,960 --> 00:21:29,160
గయ్స్, మనం చేయగలం.

341
00:21:29,240 --> 00:21:33,160
క్రమశిక్షణ గయ్స్, బాధపడినా ఇప్పుడు
మనం ఆడే తీరుగా గేమ్ ఆడండి,

342
00:21:33,240 --> 00:21:36,320
మనం చేయాలని అనుకునేదానికి
ఇంకా శిక్షణ పొందిన దానికి,

343
00:21:36,400 --> 00:21:37,560
పూర్తి వ్యతిరేకంగా,

344
00:21:37,640 --> 00:21:39,920
కానీ ఈ గేమ్ ఆడడం ముఖ్యం.

345
00:21:40,000 --> 00:21:43,680
మనకు వేరే పరిష్కారం లేదు,
మనం ఇవాళ నిలబడాలి. సరేనా?

346
00:21:46,440 --> 00:21:47,440
కలిసి ఉండండి.

347
00:21:59,440 --> 00:22:02,160
ఆర్సెనల్ 45 నిమిషాల పాటు నిలబడగలదా?

348
00:22:02,760 --> 00:22:06,120
ఇది తక్కువ దూరం,
రామ్స్‌డేల్ దాదాపు దొరికిపోయాడు.

349
00:22:10,120 --> 00:22:12,280
గాబ్రియెల్ బాగా డిఫెన్స్ చేశాడు.

350
00:22:13,720 --> 00:22:16,680
ఆర్సెనల్ డిఫెన్స్‌ను
లివర్‌పూల్ ఛేదించలేక పోతోంది.

351
00:22:17,800 --> 00:22:20,640
ఇప్పుడు లివర్‌పూల్‌లో ఆక్రోశం
కనబడడం మొదలైంది.

352
00:22:21,520 --> 00:22:23,520
లివర్‌పూల్‌కు సమయం మించిపోతోంది.

353
00:22:23,880 --> 00:22:26,440
మరొక్క నిమిషం నిలబడగలిగితే,

354
00:22:26,520 --> 00:22:27,920
ఇది భారీ ఫలితం అవుతుంది.

355
00:22:31,360 --> 00:22:35,360
మినమినో! అది వాళ్లు ఎదురుచూస్తున్న అవకాశం.

356
00:22:38,800 --> 00:22:42,280
ఆర్సెనల్ అద్భుత ఫలితం నమోదు చేసింది.

357
00:22:45,200 --> 00:22:51,160
అది చిరస్థాయిగా నిలిచే డిఫెన్స్ ప్రదర్శన,
ఇంకా ఈ ఈఎఫ్ఎల్ కప్ సెమీఫైనల్

358
00:22:51,240 --> 00:22:54,520
రెండవ దశలోకి వెళుతున్న ఆర్సెనల్‌
పటిష్ట స్థితిలో ఉంది.

359
00:22:58,440 --> 00:23:01,240
మేము సొంతమైదానంలో లేము,
పదిమందికి తగ్గిపోయాము.

360
00:23:01,320 --> 00:23:04,360
ఆర్సెనల్‌కు సున్నా-సున్నా అని
నేను పాట పాడాను.

361
00:23:04,440 --> 00:23:09,000
"ఆర్సెనల్‌కు సున్నా-సున్నా," అని పాడాను,
ఎందుకంటే నేను విజయాలను చూశాను,

362
00:23:09,080 --> 00:23:12,640
కానీ ఇవాల్టి కుర్రాళ్ల ఆట కంటే
తక్కువ గర్వంతో వెళ్లాను.

363
00:23:16,760 --> 00:23:20,360
అబ్బాయిలు, అలాంటి పని ఎక్కువ టీమ్‌లు
చేయలేవు. అవకాశం లేదు.

364
00:23:30,640 --> 00:23:34,320
అందుకే, గయ్స్, గేమ్‌కు ముందు
మీకు ఇక్కడ చెప్పాను,

365
00:23:34,400 --> 00:23:38,120
భావోద్వేగం చూపించి, భావోద్వేగంతో ఆడాలని,
ధైర్యంగా ఆడడం

366
00:23:38,200 --> 00:23:39,680
చూడాలని చెప్పాను.

367
00:23:39,760 --> 00:23:42,560
కొన్నిసార్లు మీ ఆటకు
నాకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

368
00:23:42,640 --> 00:23:44,560
-అదేనా పదం?
-నిక్కబొడుచుకోవడం.

369
00:23:44,640 --> 00:23:45,720
నిక్కబొడుచుకోవడం.

370
00:23:45,800 --> 00:23:48,760
ఇవాళ మీరు ఇక్కడ చేసినది,
మీరు పోటీ పడిన విధానం,

371
00:23:48,840 --> 00:23:52,160
క్రమశిక్షణ, ధైర్యం,
పోరాటం ప్రదర్శించిన తీరు,

372
00:23:52,240 --> 00:23:55,280
ఓ సహచరుడు
ఆఖరి గీత దగ్గర ఏదైనా చేయాల్సి ఉంటే,

373
00:23:55,360 --> 00:23:58,520
అతనిని పంపేశారు,
అఫ్పుడు మీరు ఆట పెంచి, తనను రక్షించారు,

374
00:23:58,600 --> 00:24:01,920
ఇవాళ మీరు ఆడిన తీరు,
కచ్చితంగా అమోఘమైనది.

375
00:24:02,000 --> 00:24:04,200
మీ పట్ల గర్వంగా ఉంది, గయ్స్. అభినందనలు.

376
00:24:09,120 --> 00:24:11,520
మేమే ఆర్సెనల్

377
00:24:12,520 --> 00:24:15,160
ఫలితం పట్ల ఆర్సెనల్ అభిమానులు
ఆనందంగా ఉన్నారు,

378
00:24:15,240 --> 00:24:17,960
కానీ చాకాను పంపినప్పుడు,
రిఫరీ వెంటనే గుర్తించాడు,

379
00:24:18,040 --> 00:24:19,800
చాకా మళ్లీ తప్పుడు.

380
00:24:20,160 --> 00:24:22,080
చాకా ఇవాళ నిరుత్సాహపడవచ్చు.

381
00:24:22,160 --> 00:24:24,440
అతను దీనిని చూసి మారాల్సి ఉంది,

382
00:24:24,520 --> 00:24:28,400
తన ప్రదర్శనను అతను విశ్లేషించుకుని,
ఇలా చెప్పుకోవాలి, "నేను మారాలి."

383
00:24:28,480 --> 00:24:31,080
అతనికి ఈ క్లబ్‌లో భవిష్యత్తు ఉందనుకోను.

384
00:24:39,360 --> 00:24:42,600
సెమీఫైనల్ తరువాత
కోల్నీలో ఉత్సాహం పెరిగింది.

385
00:25:02,080 --> 00:25:02,920
ఆర్సెనల్‌కు స్వాగతం

386
00:25:03,000 --> 00:25:06,240
కానీ ఇప్పుడు ఆర్సెనల్ వరుసగా
రెండు మ్యాచ్‌లలో స్కోర్ చేయలేదు.

387
00:25:06,320 --> 00:25:07,320
పియెర్స్‌కు చీర్స్.

388
00:25:07,840 --> 00:25:10,000
తన నువ్వు బాగా ఆడావని అనుకున్నాడు.

389
00:25:10,080 --> 00:25:13,600
ఛ. ఇవాళ ఒబా వర్సెస్ థామస్.

390
00:25:13,680 --> 00:25:14,960
ఊరుకో, గబాన్.

391
00:25:15,040 --> 00:25:17,080
ఒబా తిరిగొస్తాడని అనుకోను.

392
00:25:17,160 --> 00:25:18,240
తను గుర్తొస్తాడు.

393
00:25:20,440 --> 00:25:24,520
జిమ్‌లో, గ్రానిట్ రెడ్ కార్డ్ మీద
పోస్ట్‌మార్టం మొదలయ్యింది.

394
00:25:25,080 --> 00:25:28,520
కానీ, సోదరా, ఒక ప్రశ్న.
నువ్వెందుకు ఆఖరి డిఫెండర్?

395
00:25:28,600 --> 00:25:32,760
తెలియదు. చెప్పాగా, ఇతని కారణంగా,
తను నాకు మంచి పాస్ ఇస్తే, స్కోర్ వచ్చేది.

396
00:25:32,840 --> 00:25:35,120
సోదరా, నీ రెడ్ కార్డ్‌కు నా మీద నిందా?

397
00:25:35,200 --> 00:25:37,280
డొమినో విషయం అక్కడే మొదలైంది.

398
00:25:38,480 --> 00:25:41,880
పిచ్ మీద జనాలు ఉండగానే
డొమినో మొదలవుతుంది. నా తప్పు కాదు.

399
00:25:41,960 --> 00:25:46,760
నీ పాస్ చక్కగా వస్తే,
మనం టార్గెట్ మీద షాట్ కొట్టేవాళ్లం.

400
00:25:46,840 --> 00:25:49,920
మనం టార్గెట్ మీద షాట్ కొట్టినా...
కీపర్ కాపాడతాడు...

401
00:25:50,000 --> 00:25:51,960
అవును, అవతలి పక్షాన్ని నిందిస్తావు.

402
00:25:52,040 --> 00:25:54,960
లేదు. అయినా వాళ్లు పాస్ చేయగలరు, గ్రానిట్.

403
00:25:55,600 --> 00:25:57,280
పిచ్ మీదున్న జనాలతో సమస్య.

404
00:25:57,360 --> 00:25:58,360
పిచ్ మీదున్న జనాలు.

405
00:25:58,440 --> 00:25:59,920
నిన్ను నీవు నియంత్రించుకో.

406
00:26:00,000 --> 00:26:03,320
ఒకడి మీద ముగ్గురా?
ఒంటరిగా ఉండడంతో, స్ప్రింట్ చేశా.

407
00:26:03,400 --> 00:26:05,920
-నిన్ను నియంత్రించుకోవాలి.
-హే, చింతించకు.

408
00:26:06,000 --> 00:26:07,760
నింద వేసుకుంటాను, పర్వాలేదు.

409
00:26:07,840 --> 00:26:11,440
నేనతన్ని ఆపకపోతే, ఒకటి-సున్నాతో
వెనుకబడతాం, మనపై గెలిచేవారు.

410
00:26:11,520 --> 00:26:13,640
అందుకే గ్రానిట్‌కు ఒకసారి ధన్యవాదాలు.

411
00:26:35,760 --> 00:26:36,720
హేయ్.

412
00:26:37,000 --> 00:26:38,400
ఎవరో నీకోసం చూస్తున్నారు.

413
00:26:38,480 --> 00:26:39,680
హలో. హాయ్.

414
00:26:45,240 --> 00:26:49,800
గ్రానిట్ తన భార్య లియోనితా,
ఇద్దరు పిల్లలు అయానా, లినేయాలతో ఉంటాడు.

415
00:26:51,040 --> 00:26:51,880
హాయ్.

416
00:26:52,600 --> 00:26:55,560
మేము తమ్ముడు, నాన్న, మా అమ్మ
కలిసి పెరిగాము,

417
00:26:55,640 --> 00:26:59,240
అంటే ఇంట్లో ఆమె ఒక్కతే అమ్మాయి,
ఎప్పుడూ చెప్పేది,

418
00:26:59,320 --> 00:27:03,080
"మీతో చాలా కష్టం అబ్బాయిలు," అనేది.
ఇప్పుడు వ్యతిరేకం అయింది.

419
00:27:03,160 --> 00:27:06,960
మా ఇంటిలో ముగ్గురు అమ్మాయిలు.
అది అంతటినీ మార్చేసింది.

420
00:27:07,400 --> 00:27:09,520
-నాన్న ముద్దుపెట్టుకోవచ్చా?
-సరే.

421
00:27:09,760 --> 00:27:10,800
ఐ లవ్యూ.

422
00:27:11,680 --> 00:27:16,360
మరింత శాంతం. ఏదైనా చేసే ముందు
వాళ్ల కారణంగా రెండు సార్లు ఆలోచించాలి.

423
00:27:21,440 --> 00:27:23,840
ఇది, మా పెళ్లి జరిగినప్పటిది.

424
00:27:24,480 --> 00:27:29,000
మేము ఎన్నటికీ మరువలేని ఫోటోలు,
ఎందుకంటే అది మాకు ప్రత్యేకమైన రోజు.

425
00:27:30,200 --> 00:27:32,880
ఇక్కడ నేను ఏదైనా చేయగలను,
ఫోటోలు ఉండవు,

426
00:27:33,800 --> 00:27:38,400
ఎవరూ వెనుక నుంచి అరవరు.
ఎవరూ మీ గురించి చెడుగా మాట్లాడరు.

427
00:27:38,800 --> 00:27:43,120
నేను కుంగినా, మేము గేమ్ ఓడిపోయినా,
తనకు అంత తేలిక కాదు,

428
00:27:43,200 --> 00:27:47,960
కానీ ఆమెతో మాత్రమే
మనసులో ఉన్నది మాట్లాడగలను.

429
00:27:48,320 --> 00:27:51,040
వాళ్లు గేమ్ ఓడిపోయి,
తను ఇంటికి వచ్చాక

430
00:27:51,120 --> 00:27:52,800
అతను నిజంగా బాధపడతాడు,

431
00:27:52,880 --> 00:27:57,640
అతనితో మాట్లాడేందుకు ప్రయత్నించి,
ఏదైనా చెప్పాలని చూస్తాను,

432
00:27:58,160 --> 00:28:01,360
వచ్చే గేమ్ బాగుంటుందని, అదీ ఇదీ, కానీ,

433
00:28:01,880 --> 00:28:04,600
అతను ఏమీ ఆడలేదని జనాలు అన్నప్పుడు,

434
00:28:04,680 --> 00:28:06,960
వాళ్లు ఓడిపోయినప్పుడు
తను రాత్రంతా నిద్రపోడు.

435
00:28:07,640 --> 00:28:10,080
ఎందుకంటే నేను బాగా ప్రేమించేది పిచ్‌నే,

436
00:28:10,160 --> 00:28:13,400
ఎందుకంటే అది నా అభిరుచి.
నేను చేసేది, ప్రేమించడమే.

437
00:28:14,000 --> 00:28:18,160
పిచ్ మీద, బయట
అతని పట్ల చాలా గర్వపడతాను, అవును.

438
00:28:38,920 --> 00:28:42,160
ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ నుంచి
ఒబా తిరిగొచ్చాడు.

439
00:28:44,880 --> 00:28:45,760
ఎవరు ఉన్నారు?

440
00:28:45,840 --> 00:28:47,120
హలో. ఎలా ఉన్నావు?

441
00:28:47,720 --> 00:28:49,280
-బాగున్నావా?
-ఆ, నువ్వో?

442
00:28:49,360 --> 00:28:50,600
అందరూ బాగున్నారా?

443
00:28:50,840 --> 00:28:52,440
అతని శిక్షణ ఇంకా ఒంటరిగానే.

444
00:28:52,520 --> 00:28:55,160
ఒబామెయాంగ్. అందరూ బాగున్నారా?

445
00:28:55,240 --> 00:28:56,960
-అవును.
-పిల్లలు బాగున్నారా?

446
00:28:57,040 --> 00:28:58,760
-బాగున్నారు.
-బడికి వెళ్లారా?

447
00:28:58,840 --> 00:29:00,480
లేదు. ఇంకా లేదు, సోమవారం.

448
00:29:00,560 --> 00:29:01,920
మరి మీ అమ్మ? ఆవిడ బాగుందా?

449
00:29:02,000 --> 00:29:03,840
ఆ, తను బాగుంది.

450
00:29:05,600 --> 00:29:07,280
-కఠినమైన వారాలా?
-అవును.

451
00:29:09,880 --> 00:29:10,920
బాగున్నావా, నేస్తమా?

452
00:29:11,000 --> 00:29:12,720
ఆ, నువ్వో? ఎలా ఉన్నావు?

453
00:29:12,800 --> 00:29:15,520
ఇవాళ, సెషన్ చేస్తావు,
ముందుకు కొనసాగుతావు.

454
00:29:15,600 --> 00:29:18,160
అంతా సరిపోయిందేమో చూసి,
బాగా స్పందించు.

455
00:29:18,240 --> 00:29:20,200
ఆదివారానికి అందుబాటులో ఉండవు.

456
00:29:20,280 --> 00:29:23,400
ఇక్కడ మేము ప్రణాళిక చేస్తాము.
మికెల్ నీతో మాట్లాడతాడు.

457
00:29:23,480 --> 00:29:24,480
తప్పకుండా.

458
00:29:26,440 --> 00:29:27,680
అతను లేనప్పుడు,

459
00:29:27,760 --> 00:29:31,360
మికెల్, ఆర్సెనల్ బోర్డ్ కలిసి
తమ తుది నిర్ణయం తీసుకున్నారు,

460
00:29:32,080 --> 00:29:36,920
మిగిలిన బదిలీ వ్యవధిలో, ఒబా క్లబ్‌ను
వదిలివెళ్లేందుకు ప్రయత్నిస్తారు.

461
00:29:37,320 --> 00:29:40,000
మేనేజర్‌

462
00:29:42,000 --> 00:29:46,080
ఒబా ఇకమీదట జట్టులో భాగం కాదని
ఏ సమయంలో గ్రహించారు?

463
00:29:46,160 --> 00:29:49,480
అతని కళ్లలోకి చూసినప్పుడు,
కనబడింది, నాకు ఆ భావన తెలిసింది,

464
00:29:49,560 --> 00:29:52,280
ఆ విశ్వాస స్థాయి పోయింది. ఆ రోజునే.

465
00:29:54,640 --> 00:29:57,840
క్లబ్‌లో అతి ముఖ్యమైన ప్లేయర్‌తో,
సీజన్ మధ్యలో

466
00:29:57,920 --> 00:30:00,040
నిర్ణయం తీసుకోవడం
చాలా కష్టమైన విషయం,

467
00:30:00,120 --> 00:30:03,520
జట్టు ప్రదర్శన చేయాల్సిన రీతిలో
ఆ ప్లేయర్ లేనప్పుడు,

468
00:30:03,600 --> 00:30:06,680
వాళ్లు ఆ ప్రభావం చూపించలేకపోతున్నారు.

469
00:30:06,760 --> 00:30:10,520
కానీ మీరు ఈ అంశాలు అన్నీ కలిపితే,
అవి ఇప్పటికీ కూడా,

470
00:30:10,600 --> 00:30:14,240
నిర్ణయం స్పష్టం,
అది జరిగేలా చూడాలి.

471
00:30:16,520 --> 00:30:20,480
ఒబాను చాలా మిస్ అవుతున్నాం,
తన వ్యక్తిత్వం, పిచ్‌పై అతని నైపుణ్యం,

472
00:30:21,280 --> 00:30:24,760
కానీ మేనేజర్ నిర్ణయం,
మేమది గౌరవిస్తాం.

473
00:30:24,880 --> 00:30:25,760
ఆరన్ రామ్స్‌డేల్
గోల్‌కీపర్

474
00:30:25,840 --> 00:30:29,960
డ్రెసింగ్ రూంలో అది పెద్ద ఆశ్చర్యం కాదు,
అది మంచి విషయం.

475
00:30:32,800 --> 00:30:36,680
అతనిని వదిలించుకోవాలని నిర్ణయించారు,
అది ఆర్సెనల్‌ కోరుకోనిది.

476
00:30:36,760 --> 00:30:39,840
అతను ఆర్సెనల్‌లో పొందే
వేతనాన్ని గుర్తుంచుకుంటే,

477
00:30:39,920 --> 00:30:42,440
అది సులువైన నిష్క్రమణ కాబోదు.

478
00:30:42,880 --> 00:30:47,360
ఒబామెయాంగ్‌కు వారానికి
3,50,000 పౌండ్లు చెల్లిస్తారు.

479
00:30:47,800 --> 00:30:51,120
అతనిని పేరోల్ నుంచి తప్పించి,
వేరే క్లబ్‌కు ఆడేలా చేయడం

480
00:30:51,200 --> 00:30:52,960
ఇప్పుడు ఎడ్యు, రిచ్‌ల పని.

481
00:30:53,040 --> 00:30:54,360
తను ఏం చేయాలని అనుకుంటాం?

482
00:30:54,440 --> 00:30:56,000
-రెండు ఎంపికలు ఉన్నాయి.
-అవును.

483
00:30:56,080 --> 00:30:57,960
లోన్ లేదా కాంట్రాక్టు రద్దు చేయడం.

484
00:30:58,040 --> 00:31:00,360
నేను ఓ ప్లేయర్‌ను
అమ్మే ప్రతిపాదన చేయకపోవడంతో,

485
00:31:00,440 --> 00:31:02,440
ఇక్కడ ఎవరూ ప్లేయర్‌ను కొనడాన్ని వినరు.

486
00:31:02,520 --> 00:31:04,920
-లేదు, అంటే, అతను 32, 33.
-అసాధ్యం.

487
00:31:05,000 --> 00:31:08,720
అందుకే వాటిలో మనకు అతని కాంట్రాక్టు
రద్దు చేయడమే ఉత్తమం.

488
00:31:08,800 --> 00:31:12,800
అతను లోన్‌పై వెళితే,
అది మనకు దారుణ దృష్టాంతం.

489
00:31:12,880 --> 00:31:17,040
ఈ క్షణంలో, అవును, ఎందుకంటే,
అతను రద్దు చేసుకోకపోతే

490
00:31:17,120 --> 00:31:19,400
మరుసటి సీజన్‌కు
అతను మనకు భారం కావచ్చు.

491
00:31:19,480 --> 00:31:20,320
అవును.

492
00:31:20,400 --> 00:31:22,480
ఒబా పరిస్థితితో రెండు విషయాలు,

493
00:31:22,560 --> 00:31:26,640
స్పష్టంగా, అతను అద్భుతమైన ప్లేయర్,
తను చాలా గోల్స్ కొట్టాడు,

494
00:31:27,080 --> 00:31:30,320
కానీ అతను జట్టుకు సహకారం అందించకపోతే,

495
00:31:30,400 --> 00:31:33,800
డీల్‌ను రద్దు చేయడం
చాలా వేతనాలను ఆదా చేస్తుంది.

496
00:31:34,360 --> 00:31:38,080
అతని కాంట్రాక్ట్ రద్దు చేసే ఏకైక అవకాశం,
అతను ఒప్పుకుంటే,

497
00:31:38,160 --> 00:31:41,200
కాంట్రాక్ట్ రద్దు చేస్తాం,
నువ్వు వెళ్లవచ్చు, సరే.

498
00:31:41,960 --> 00:31:43,160
పరస్పర సమ్మతి.

499
00:31:44,080 --> 00:31:47,120
అతను తిరిగి రావాలని కోరుకోం,
పూర్తిగా రద్దు కావాలి.

500
00:31:47,200 --> 00:31:49,800
సుదీర్ఘ కాలం క్లబ్
మెరుగైన స్థితిలో ఉంటుంది.

501
00:31:54,000 --> 00:31:57,240
ఒబామెయాంగ్ కాంట్రాక్టును రద్దు చేయాలని
ఆర్సెనల్ భావిస్తోంది,

502
00:31:57,320 --> 00:32:01,320
కానీ మిగతా సీజన్‌కు, మరుసటి దానికి
అతనితో సంతకం చేసి,

503
00:32:01,400 --> 00:32:05,840
వేతనాలు చెల్లించేందుకు మరొక పెద్ద క్లబ్‌
ముందుకు వస్తేనే అది జరుగుతుంది.

504
00:32:11,400 --> 00:32:15,920
ఆ వ్యవధిలో, అనేక ఇతర పెద్ద బదిలీ
నిర్ణయాలను ఆర్సెనల్ బోర్డ్ తీసుకుంది.

505
00:32:17,160 --> 00:32:21,440
మరిన్ని ప్లేయర్లను వెళ్లనిచ్చారు,
వారిలో ఎయిన్స్‌లీ మెయిట్‌లండ్-నైల్స్‌,

506
00:32:22,400 --> 00:32:23,720
సేయద్ కొలాసినాక్,

507
00:32:25,240 --> 00:32:26,720
కలమ్ చాంబర్స్,

508
00:32:28,560 --> 00:32:30,640
ఇంకా డిఫెండర్ పాబ్లో మారి ఉన్నారు.

509
00:32:37,560 --> 00:32:41,040
ఇది కష్టం, నేస్తమా, మూడేళ్ల తరువాత,
ఇది తేలిక కాదు,

510
00:32:41,640 --> 00:32:43,040
కానీ జీవితమంటే ఇదే.

511
00:32:43,120 --> 00:32:46,320
నాకు బాధాకర క్షణం, కానీ సంతోషమే,
ఎందుకంటే నేను ఆడతాను,

512
00:32:46,400 --> 00:32:48,880
నా జీవితంలో కొత్త సవాలు ఉంటుంది.

513
00:32:49,240 --> 00:32:52,440
అందుకే, ఆర్సెనల్‌కు, నా సహచరులకు
శుభాకాంక్షలు చెబుతాను.

514
00:32:52,960 --> 00:32:56,000
ఎవరైనా వెళిపోతుంటే,
ఏం జరుగుతుందో మీకు తెలియదు

515
00:32:56,080 --> 00:32:59,160
మాటలు, విషయాలు తెలియవు,
మీకు ఒక రోజున జట్టు

516
00:32:59,240 --> 00:33:02,320
గ్రూప్ చాట్‌లో మెసేజ్ వస్తుంది,
"సీజన్‌లో మీకు మంచి జరగాలి.

517
00:33:02,400 --> 00:33:06,080
"నేను ఈ చోటుకు వెళుతున్నాను.
మీకు శుభం కలగాలి," ఇక అంతే.

518
00:33:06,160 --> 00:33:07,160
మళ్లీ కలుద్దాం.

519
00:33:07,240 --> 00:33:09,240
ఇది ఫుట్‌బాల్, జనాలు వెళతారు.

520
00:33:11,920 --> 00:33:15,360
కొందరు ప్లేయర్లను పంపడం అనేది
మాకు అవసరమనేది సుస్పష్టం,

521
00:33:15,440 --> 00:33:17,720
జట్టులో కొంతకాలంగా ఆడని ప్లేయర్లు,

522
00:33:17,800 --> 00:33:20,760
ఇంకా బయట ఆడుకోవాలని
మికెల్ భావించే వాళ్లు,

523
00:33:20,840 --> 00:33:23,080
అందరికీ కొంత రీసెట్ అవసరం.

524
00:33:25,360 --> 00:33:28,720
గత సీజన్‌తో పోల్చితే
ఆర్సెనల్ జట్టు సగానికి తగ్గింది

525
00:33:30,560 --> 00:33:33,080
పైగా కొత్తగా వచ్చే
పెద్ద ప్లేయర్లు లేరు.

526
00:33:35,760 --> 00:33:37,360
వాళ్లు ఏదైనా చేయాలి.

527
00:33:37,440 --> 00:33:39,960
వాళ్లు ఏదో ఒకటి చేసి
గాడిలో పడేలా చూడాలి.

528
00:33:40,040 --> 00:33:42,160
మెరుగైన ప్రమాణాల ప్లేయర్లను తేవాలి.

529
00:33:45,240 --> 00:33:50,240
మేము ఒక గోల్ కూడా కొట్టలేదు, ఎంతసేపటిగానో
తెలియదు, దాదాపు 600 నిమిషాల్ ఫుట్‌బాల్‌లో.

530
00:33:50,320 --> 00:33:55,200
వాళ్లు ఏదైనా చేయాలి,
ఏదో ఒకటి చేయాలి.

531
00:33:56,080 --> 00:34:00,600
మేము ఇప్పుడు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం,
ఇలా చేసేందుకు పలు మూల్యాంకనాలు ఉంటాయి.

532
00:34:00,680 --> 00:34:02,040
మీరు జట్టు పెరగడం చూస్తారు.

533
00:34:02,120 --> 00:34:03,840
కానీ మా దృష్టి నుంచి,

534
00:34:03,920 --> 00:34:06,880
మేము ఐదు, ఆరు, ఏడుగురుని
జనవరిలో తీసుకొస్తే,

535
00:34:06,960 --> 00:34:08,800
గతంలో ఏదో తప్పు చేసినట్లే.

536
00:34:10,080 --> 00:34:14,440
వ్యవధి ముగిసేందుకు పది రోజులుండగా,
ఒబా గురించి ఏ డీల్ జరగలేదు.

537
00:34:16,960 --> 00:34:21,320
ఇతర క్లబ్‌లేవీ అతనితో శాశ్వత ఒప్పందానికి,
తన వేతనం భరించడానికి ఇష్టపడలేదు.

538
00:34:29,280 --> 00:34:30,920
ఆర్సెనల్ వర్సెస్ లివర్‌పూల్‌
ఎమిరేట్స్ స్టేడియం - 20 జనవరి 2022

539
00:34:31,000 --> 00:34:34,480
కప్ సెమీ ఫైనల్‌ ఇంకా వెంబ్లీ సిద్ధమైంది.

540
00:34:34,560 --> 00:34:37,960
ఇంగ్లీష్ ఫుట్‌బాల్‌లో రెండు భారీ జట్లు
ఆర్సెనల్, లివర్‌పూల్

541
00:34:38,040 --> 00:34:43,480
ఈఎఫ్ఎల్ కప్ రెండవ దశ సెమీఫైనల్‌లో
తలపడేందుకు సిద్ధమయ్యాయి.

542
00:34:45,440 --> 00:34:49,840
ఒబామెయాంగ్ గురించి మికెల్ వచ్చి
మాట్లాడినప్పుడు, అది నాకు తేలిక కాదు.

543
00:34:49,920 --> 00:34:54,360
కానీ సున్నితంగా ఉండి ఇలా చెప్పాలి,
"అవును, అది నిజమే. తనకు మద్దతు ఇవ్వాలి."

544
00:34:55,200 --> 00:34:59,280
లివర్‌పూల్ టై చేసుకోనుంది,
ఎమిరేట్స్‌లో భారీ కేరింతలు.

545
00:35:00,040 --> 00:35:05,040
క్లబ్‌కు ఏది ఉత్తమమో జనాలు అర్థం చేసుకోవడం
పెద్ద సవాలు అవుతుంది.

546
00:35:05,960 --> 00:35:08,600
ఎందుకంటే వాళ్లు చూసేది, గేమ్‌ను మాత్రమే.

547
00:35:09,400 --> 00:35:13,640
జోటా, అతనిని దాటి లోపలకు వచ్చాడు.
అది జోటాకు ఆరంభం.

548
00:35:15,040 --> 00:35:16,400
లోపలకు వెళ్లింది!

549
00:35:16,840 --> 00:35:20,440
స్లో మోషన్‌లో దాదాపు తాకాడు,
రామ్స్‌డేల్ తప్పు అంచనా వేశాడు.

550
00:35:20,520 --> 00:35:23,640
సెమీ ఫైనల్‌లో లివర్‌పూల్‌
ఆధిక్యం సాధించింది.

551
00:35:26,680 --> 00:35:29,520
మేము చూడాల్సినది పెద్ద చిత్రం,

552
00:35:30,480 --> 00:35:33,280
ఈ ఫుట్‌బాల్ క్లబ్ భవిష్యత్తుకు
ఏది మంచిదో చూడాలి.

553
00:35:33,360 --> 00:35:35,760
అది లోపలకు వెళ్లవచ్చు, కొట్టాడు, స్కోర్.

554
00:35:35,840 --> 00:35:36,880
ఆర్సెనల్ 0 - 2 లివర్‌పూల్
జోటా 77'

555
00:35:36,960 --> 00:35:39,480
డియాగా జోటా లివర్‌పూల్‌కు
రెండు-సున్నా చేశాడు.

556
00:35:41,440 --> 00:35:43,440
ఆర్సెనల్ ఇక్కడ దెబ్బ తిన్నది.

557
00:35:43,520 --> 00:35:47,880
ఆర్సెనల్ అభిమానులు అది గ్రహించారు,
భారీగా బయటకు వెళ్లారు.

558
00:35:48,800 --> 00:35:52,560
మిడ్‌ఫీల్డ్ లేదు. జనవరి బదిలీ వ్యవధిలో
మేము ఏమీ చేయలేదు,

559
00:35:52,640 --> 00:35:54,640
వేరే ఏదీ మేము ఆశించలేము.

560
00:35:54,760 --> 00:35:56,560
అదే పాత కథ, అదే పాత ఆర్సెనల్.

561
00:35:56,640 --> 00:35:59,480
అతను ఇంకా కొంత చేయాలి.
మాకు కొత్త స్ట్రైకర్ కావాలి.

562
00:35:59,560 --> 00:36:02,840
భర్తీ చేయలేని ఆటగాళ్లతో
గొడవ పడకూడదు

563
00:36:02,920 --> 00:36:05,880
ఒబామెయాంగ్‌ను అక్కడే ఉంచారు,
ఇంటిలో ఖాళీగా.

564
00:36:06,640 --> 00:36:08,880
అది ఇబ్బందికరం, సోదరా.

565
00:36:08,960 --> 00:36:12,000
ఎమిరేట్స్ స్టేడియం

566
00:36:12,080 --> 00:36:15,320
ఇది జనవరి అని, ఈ సీజన్‌లో
ఏ ట్రోఫీని గెలవలేమని తెలియడం

567
00:36:15,400 --> 00:36:19,600
ఏ ఆర్సెనల్ అభిమానిని అయినా
కలవరపెట్టే విషయం.

568
00:36:20,560 --> 00:36:23,200
మికెల్‌ ఆర్టెటా మీద ఒత్తిడి పెరగడం
మీరు చూడవచ్చు

569
00:36:23,320 --> 00:36:26,080
వాళ్లు ఛాంపియన్స్ లీగ్‌లో
స్థానం పొందకపోతే.

570
00:36:27,200 --> 00:36:31,160
లివర్‌పూల్‌తో తలపడే సామర్థ్యం కోసం
ఇంకా చాలా చేయాల్సి ఉందా?

571
00:36:31,200 --> 00:36:35,640
అవును, ఎందుకంటే 20, 22 మంది
మైదానంలో టాప్ ప్లేయర్ల జట్టు ఉండాలి,

572
00:36:35,680 --> 00:36:39,640
అలా చేసేందుకు సమయం కావాలి.

573
00:36:40,000 --> 00:36:41,400
ఈ వ్యవధి ముగిసేలోగానే

574
00:36:41,480 --> 00:36:44,160
ఒబామెయాంగ్ క్లబ్‌ను
వదిలి వెళతాడని భావిస్తారా?

575
00:36:44,280 --> 00:36:47,280
ఇవాల్టి మ్యాచ్‌కు కూడా
ఒబాను మళ్లీ ఎంపిక చేయలేదు.

576
00:36:48,920 --> 00:36:51,960
కానీ అతనింకా ఆర్సెనల్ ప్లేయర్ కాగలడా?

577
00:36:52,680 --> 00:36:56,880
మరుసటి మ్యాచ్‌కు అతను
ఎంపిక కాగలడో, లేదో నాకు తెలియదు.

578
00:37:21,960 --> 00:37:24,160
ఆర్సెనల్ జనవరి పరుగు దాదాపు ముగిసింది,

579
00:37:24,200 --> 00:37:28,560
ఒక్క గోల్ కూడా చేయకుండానే
రెండు పోటీల నుంచి బయటకొచ్చారు.

580
00:37:28,640 --> 00:37:31,640
నువ్వు బాల్‌ను నియంత్రించి,
లయను మార్చాలి.

581
00:37:31,680 --> 00:37:32,680
అంతే.

582
00:37:32,800 --> 00:37:36,160
సీజన్‌లో విరామం వస్తే,
ప్లేయర్లు కోలుకోవడం కుదురుతుంది.

583
00:37:36,560 --> 00:37:38,760
మొదట ముందుకు, అవును.

584
00:37:39,600 --> 00:37:43,360
వెచ్చని వాతావరణంలో శిక్షణ కోసం
మికెల్ ప్లేయర్లను దుబాయ్‌కి తీసుకొచ్చాడు,

585
00:37:44,080 --> 00:37:47,440
కానీ జట్టు క్రమశిక్షణ నిర్వహించడానికి
అధిక ప్రాధాన్యత.

586
00:37:48,400 --> 00:37:52,640
మరి ఏం చేయాలి? వదిలేయాలా?
మరేం చేయాలి?

587
00:37:56,840 --> 00:37:58,320
-నువ్వేం చేస్తావు?
-ఏమీ లేదు.

588
00:37:58,400 --> 00:38:00,200
పోనీలే, పరవాలేదు, పోనీలే.

589
00:38:00,320 --> 00:38:02,840
గత పదేళ్లలో ఏం జరిగింది, వదిలేయడం.

590
00:38:02,920 --> 00:38:05,560
మరుసటి సారి అంతే,
మరోసారి అంతే.

591
00:38:05,640 --> 00:38:08,120
స్పెయిన్‌లో దాని కాసా పెపే అంటారు.

592
00:38:08,160 --> 00:38:10,760
కాసా పెపే అంటే ఏంటో తెలుసా?
"పెపే ఇల్లు."

593
00:38:10,840 --> 00:38:13,000
ప్రతివాడు తను చేయదలచుకున్నదే చేస్తాడు.

594
00:38:13,640 --> 00:38:16,040
మనం స్థాయిలను పెంచాలి, పదండి.

595
00:38:16,120 --> 00:38:19,400
మరుసటి కొన్నివారాలు
ఆర్సెనల్ కఠిన స్థితులు ఎదుర్కుంటుంది.

596
00:38:19,480 --> 00:38:20,640
బాగుంది, గ్రానిట్.

597
00:38:20,760 --> 00:38:24,400
టాప్ నాలుగులో పూర్తి చేయడం,
యూరోపియన్ ఫుట్‌బాల్‌కు చేరడం

598
00:38:24,800 --> 00:38:26,960
ఇప్పుడు మికెల్ ఏకైక ధ్యాస.

599
00:38:29,080 --> 00:38:32,160
ఇక్కడ బాల్! సెడ్రిక్, అతనిని వదిలెయ్,

600
00:38:32,200 --> 00:38:34,800
తనకు చెప్పు, తను వెళితే, నువ్వు వెళతావు!

601
00:38:35,680 --> 00:38:36,680
పదండి.

602
00:38:37,640 --> 00:38:39,360
అంతే. గ్రానిట్, ఆడు!

603
00:38:39,440 --> 00:38:40,440
బాగున్నావా?

604
00:38:41,160 --> 00:38:43,520
-ఎందుకు?
-నీ గొంతు బాగా దారుణంగా ఉంది.

605
00:38:44,520 --> 00:38:46,200
అలాగే, పదండి!

606
00:38:47,920 --> 00:38:50,480
బాగా పూర్తి చేయండి, గయ్స్,
ఆడండి, పూర్తి చేయండి.

607
00:38:58,520 --> 00:39:00,400
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్

608
00:39:00,480 --> 00:39:03,840
డెడ్‌లైన్ రోజున
5 లైవ్ స్పోర్ట్‌కు స్వాగతం.

609
00:39:04,640 --> 00:39:09,040
బదిలి వ్యవధికి ఆఖరి రోజున,
ఒబాకు ఓ ఆఫర్ వచ్చింది.

610
00:39:10,400 --> 00:39:13,760
ప్రపంచ ఫుట్‌బాల్‌లో అతి పెద్ద క్లబ్‌లలో
ఒకటైన బార్సిలోనా,

611
00:39:13,840 --> 00:39:16,480
తనను తీసుకుంటానంది, కానీ లోన్‌గా.

612
00:39:17,000 --> 00:39:18,600
అది ఒబాకు మంచి డీల్

613
00:39:18,920 --> 00:39:21,080
కానీ లోన్ అంటే
మరుసటి సీజన్‌లో కూడా

614
00:39:21,160 --> 00:39:23,320
అతనికి ఆర్సెనల్ వేతనం ఇవ్వాల్సి ఉంటుంది.

615
00:39:23,400 --> 00:39:24,200
తుది గడువు రోజు

616
00:39:24,760 --> 00:39:28,160
ఎందుకంటే, చూడండి,
ఇప్పుడు మన పరిస్థితి,

617
00:39:28,280 --> 00:39:31,360
క్రమంగా మరింత గందరగోళంగా మారుతుంది.

618
00:39:31,600 --> 00:39:32,480
తాజా వార్త

619
00:39:32,560 --> 00:39:37,280
అందుకు బదులు, ఒబాను శాశ్వతంగా
తీసుకునేలా బార్సిలోనాను ఒప్పించేందుకు,

620
00:39:37,360 --> 00:39:39,320
ఆర్సెనల్ కాంట్రాక్టు రద్దు చేసేందుకు,

621
00:39:39,760 --> 00:39:42,640
ఎడ్యు, రిచ్‌లకు రా. 11 వరకు సమయం ఉంది.

622
00:39:43,320 --> 00:39:46,760
ఇది పూర్తి చేసేలా చూద్దాం, రిచ్,
వాళ్లతో నేరుగా మాట్లాడదాం.

623
00:39:47,760 --> 00:39:49,360
మనం ఓ కాల్ చేయాలంతే.

624
00:39:49,440 --> 00:39:50,960
అతను బార్సిలోనాలో ఉన్నాడు.

625
00:39:51,440 --> 00:39:52,600
-ఎవరు?
-ఒబా.

626
00:39:53,120 --> 00:39:56,640
అతను బార్సిలోనా ఎయిర్‌పోర్ట్‌లోకి
నడుస్తున్న ట్వీట్ వచ్చింది.

627
00:39:56,680 --> 00:39:58,160
నిజంగానా? సరే.

628
00:39:59,160 --> 00:40:00,480
మొదట అది చూద్దాం.

629
00:40:07,480 --> 00:40:10,640
ఆర్సెనల్ అనుమతి లేకుండా
ఒబా స్పెయిన్‌కు వెళ్లాడు.

630
00:40:16,280 --> 00:40:18,480
ఇప్పుడు ఒబామెయాంగ్ ఏం చేస్తుంటాడు?

631
00:40:18,560 --> 00:40:20,920
-ట్రైనింగ్.
-తను ట్రైనింగ్ తీసుకుంటాడా?

632
00:40:23,920 --> 00:40:26,120
అతని ప్రతినిధులలో ఒకరికి
ఎడ్యు కాల్ చేశాడు.

633
00:40:27,760 --> 00:40:30,760
మీరు మాతో ఏం చేయాలనుకుంటున్నారో
అది మాకు పంపండి

634
00:40:30,840 --> 00:40:34,080
దానికి అంగీకరిస్తామో లేదో
అప్పుడు మేము నిర్ణయిస్తాం,

635
00:40:34,160 --> 00:40:37,400
ఎందుకంటే ప్లేయర్ ఇప్పుడే
బార్సిలోనా చేరాడని నాకు తెలుసు.

636
00:40:37,480 --> 00:40:39,960
ఇది పియెర్-ఎమెరిక్ వ్యక్తిగత విషయం.

637
00:40:40,040 --> 00:40:43,800
బార్సిలోనా సందర్శనకు వచ్చాడు.
అక్కడ తన తండ్రి ఉంటాడు.

638
00:40:43,880 --> 00:40:45,280
అలాగే, సరే.

639
00:40:45,360 --> 00:40:49,320
అయితే మనం అబద్ధపు
ఊహా ప్రపంచంలో బతుకుతున్నాం.

640
00:40:49,680 --> 00:40:53,200
ఒక క్లబ్‌గా మేము, మాకు ఏం చేయాలని
అనుకుంటున్నారో మాకు పంపమని

641
00:40:53,320 --> 00:40:56,920
మేము ఎదురుచూస్తున్నాం,
లేదా అతను లండన్ తిరిగి రావాలి.

642
00:40:57,280 --> 00:41:00,840
మెరుగైన ఆఫర్‌తో
మీకు మరో ఈమెయిల్ పంపించమంటారా?

643
00:41:00,920 --> 00:41:05,120
అవును. మా అంచనాకు
మేము చాలా దూరంలో ఉన్నాం.

644
00:41:05,160 --> 00:41:08,520
-సరే. ఉంటాను.
-సరే. చీర్స్. చీర్స్, ఉంటాను.

645
00:41:09,400 --> 00:41:13,320
అంటే, వాస్తవంలో, ఈరోజు ఏం జరుగుతుందనే
అంచనాల దగ్గర ఉన్నాం?

646
00:41:13,800 --> 00:41:16,000
బాల్ వాళ్ల కోర్టులోనే ఉంది.

647
00:41:17,360 --> 00:41:18,320
వేచి చూద్దాం.

648
00:41:21,040 --> 00:41:22,600
తుది గడువు రోజు

649
00:41:22,640 --> 00:41:24,520
పియెర్-ఎమెరిక్ ఒబామెయాంగ్,

650
00:41:24,600 --> 00:41:27,520
ఇంకా ఆర్థిక ఒప్పందం జరగాల్సి ఉంది,

651
00:41:27,600 --> 00:41:32,160
కానీ ఆర్సెనల్, బార్సిలోనాల మధ్య
బేరసారాలు ఇంకా జరుగుతున్నాయి.

652
00:41:32,680 --> 00:41:35,320
-అది ఒప్పందం మార్చిందా?
-"ఆట మొదలైంది."

653
00:41:35,400 --> 00:41:36,400
ఏంటి?

654
00:41:36,480 --> 00:41:38,960
షెర్లాక్ హోమ్స్ అదే అంటాడు.

655
00:41:39,960 --> 00:41:42,320
బదిలీ తుది గడువు దగ్గరపడడంతో

656
00:41:42,400 --> 00:41:46,040
లోన్ నుంచి తగ్గేందుకు
బార్సిలోనా తిరస్కరించింది.

657
00:41:47,680 --> 00:41:52,160
బార్సిలోనా డీల్ బేరం కోసం
ఒబామెయాంగ్ ఇవాళ స్పెయిన్ చేరాడు,

658
00:41:52,200 --> 00:41:56,640
అతని వేతనంలో బార్సిలోనా ఎంత ఇవ్వాలనే
అంశంపై రెండు క్లబ్‌లు ఒప్పందానికి రాలేదు.

659
00:41:56,760 --> 00:41:59,000
అతను ఆర్సెనల్‌కు వచ్చేలా ఉన్నాడు.

660
00:41:59,400 --> 00:42:00,400
మికెల్?

661
00:42:01,280 --> 00:42:03,520
అప్‌డేట్ కోసం దుబాయ్ నుంచి
మికెల్ కాల్.

662
00:42:03,880 --> 00:42:08,760
మా మధ్య ఇంకా పరిష్కారం రాలేదు.

663
00:42:08,840 --> 00:42:11,280
వాళ్లు ఇప్పుడు పంపినది
మన దగ్గర ఉన్నదే.

664
00:42:11,360 --> 00:42:14,360
మేము పరిష్కారాల కోసం చూశాం,
కానీ కుదరలేదు.

665
00:42:19,600 --> 00:42:22,600
బార్సా నుంచి స్పందన లేదు.
వాళ్లు ఏదైనా ఆఫర్ చేశారా?

666
00:42:23,120 --> 00:42:24,000
లేదు.

667
00:42:26,400 --> 00:42:29,160
ఎవరైనా ఏమైనా చెబుతారేమో చూసే
ఎదురుచూపుల ఆట.

668
00:42:29,200 --> 00:42:31,160
-అవును. అంతే.
-ఇది పోకర్ ఆట.

669
00:42:38,640 --> 00:42:41,800
గంటలు మాత్రమే మిగలడంతో,
బార్సిలోనా మాట్లాడాలంది.

670
00:42:43,680 --> 00:42:45,600
నువ్వు కాల్ చేస్తావా, చేయనా?

671
00:42:46,360 --> 00:42:50,680
ఒబాతో సంతకానికి ఒప్పుకుని,
లోన్‌కు బదులుగా అతని వేతనం చెల్లిస్తే,

672
00:42:51,840 --> 00:42:54,160
ఆర్సెనల్‌కు పదుల
మిలియన్‌ పౌండ్లు మిగులుతాయి.

673
00:42:57,840 --> 00:43:01,040
సరే, ఇక, మతేయో,
మనం ఒప్పందం చేసుకోగలం,

674
00:43:01,160 --> 00:43:03,360
ప్లేయర్ కాంట్రాక్టుకు సంబంధించి

675
00:43:03,440 --> 00:43:06,320
రద్దు చేసుకోవడానికే మా ప్రాధాన్యత.

676
00:43:06,400 --> 00:43:10,600
మరుసటి సీజన్‌కు పియెర్-ఎమెరిక్‌కు
బార్సిలోనా ఆఫర్ ఇచ్చి,

677
00:43:10,640 --> 00:43:12,840
అతని వేతనం కవర్ చేస్తుంది,

678
00:43:12,920 --> 00:43:15,760
అది మా ప్రణాళిక,
ఈ రకంగా చేద్దామని.

679
00:43:15,840 --> 00:43:18,640
సరే. ఇది మంచి డీల్ కావడంతో

680
00:43:18,760 --> 00:43:21,560
మీకు అభినందనలు చెప్పాలి. అభినందనలు

681
00:43:21,640 --> 00:43:22,640
ధన్యవాదాలు.

682
00:43:25,120 --> 00:43:27,160
-ఇంకా పని పూర్తి చేయాలి.
-సరే.

683
00:43:27,280 --> 00:43:28,160
-ఉంటాను.
-ఉంటాను.

684
00:43:29,160 --> 00:43:33,160
రిచ్, ఆర్సెనల్ న్యాయవాదులు కలిసి
ఒబామెయాంగ్ కాంట్రాక్ట్ రద్దు చేసి,

685
00:43:33,200 --> 00:43:35,520
ప్రీమియర్ లీగ్‌తో పేపర్ వర్క్‌ను

686
00:43:35,600 --> 00:43:37,440
తుది గడువు రా. 11 లోపు సమర్పించాలి.

687
00:43:37,880 --> 00:43:39,760
గడువు దగ్గర పడుతోంది.

688
00:43:43,520 --> 00:43:46,080
హాయ్. మీకు వచ్చిందా...

689
00:43:46,160 --> 00:43:47,640
అతను సంతకం చేశాడా?

690
00:43:49,960 --> 00:43:52,680
-ఇప్పుడు పంపుతారా? సరే. అలాగే.
-వస్తోంది.

691
00:43:52,760 --> 00:43:55,200
మాకు అది ఇప్పుడే కావాలి.

692
00:43:59,080 --> 00:44:02,360
అయింది. మేము సమర్పించేశాం.
అవి ప్రీమియర్ లీగ్‌కు వెళ్లాయి.

693
00:44:02,440 --> 00:44:04,640
అవును, అయితే మనం 11 లోగా పంపాం, కదా?

694
00:44:04,720 --> 00:44:06,480
సంతకం చేసేసి. అన్ని సంతకాలు.

695
00:44:06,560 --> 00:44:07,560
ఉంటాను.

696
00:44:08,520 --> 00:44:10,000
-అభినందనలు, గయ్స్.
-దేవుడా!

697
00:44:11,400 --> 00:44:12,720
బాగా చేశారు, గయ్స్.

698
00:44:13,680 --> 00:44:16,040
మనం 10:59కి అది పూర్తి చేశాం.

699
00:44:16,120 --> 00:44:18,200
పియెర్-ఎమెరిక్ ఒబామెయాంగ్‌తో
ఒప్పందానికి బార్సిలోనా అంగీకారం

700
00:44:18,280 --> 00:44:21,320
అలాంటి పని చేయడం,
ఒక ఊరట, గర్వకారణం.

701
00:44:21,400 --> 00:44:24,440
ఇది జరగక పోవచ్చని
అందరూ గ్రహించిన తరువాత

702
00:44:24,520 --> 00:44:26,120
అది జనాలను ఆకర్షిస్తుంది.

703
00:44:28,560 --> 00:44:32,840
స్పెయిన్‌లో, బార్సిలోనా కొత్త ప్లేయర్‌ను
ప్రపంచానికి పరిచయం చేశారు.

704
00:44:32,920 --> 00:44:36,160
ఆర్సెనల్ అభిమానులకు ఒబామెయాంగ్
వీడ్కోలు సందేశం ఇచ్చాడు.

705
00:44:36,240 --> 00:44:38,600
ఇది ఓ రకంగా బాధాకర నిష్క్రమణ.

706
00:44:38,680 --> 00:44:41,000
ఈ వార్తతో ఆర్సెనల్ అభిమానులకు నిరుత్సాహం,

707
00:44:41,080 --> 00:44:45,560
ఒబామెయాంగ్ వెళ్లడం గురించి కాదు,
అతని భర్తీకి ఆర్సెనల్ ప్రణాళిక చేయలేదు.

708
00:44:46,000 --> 00:44:49,640
అసలు ప్రణాళిక ఏమిటి?

709
00:44:49,720 --> 00:44:52,080
ఆర్సెనల్‌ భారీ రిస్క్ తీసుకుంటోంది.

710
00:44:52,560 --> 00:44:55,520
ఈ క్యాలెండర్ ఏడాదిలో
ఆర్సెనల్ ఒకే ఒక్క గోల్ చేసింది

711
00:44:55,960 --> 00:44:59,400
ఇంకా ఒబామెయాంగ్‌ను
బార్సిలోనాకు వెళ్లనిచ్చారు,

712
00:44:59,480 --> 00:45:01,080
పైగా అతనిని భర్తీ చేయలేదు.

713
00:45:01,160 --> 00:45:03,920
చేసేందుకు ఇదే సరైన పని అని
మేము విశ్వసించాము,

714
00:45:04,000 --> 00:45:06,320
కానీ మేము స్పష్టం,
మాకు ఉత్తములే కావాలి,

715
00:45:06,400 --> 00:45:08,040
క్లబ్‌లో ఉత్తమ ప్లేయర్ ఉండాలి.

716
00:45:08,120 --> 00:45:11,080
క్లబ్‌కు ఒబా చేసినదానిపై
నేను కృతజ్ఞత చూపుతాను

717
00:45:11,160 --> 00:45:13,760
ఆ అనుబంధంలో నేను చూసినది

718
00:45:13,840 --> 00:45:16,600
ఓ పరిష్కారం, సమస్యను కాదు.

719
00:45:18,560 --> 00:45:21,360
ఒబాతో నా జ్ఞాపకాలు
అమోఘమైన క్షణాలు.

720
00:45:24,840 --> 00:45:29,880
అలా ముగియాలని నేను కోరుకోను,
ఎందుకంటే ఒబాకు ఇంకా ఎక్కువ అర్హత ఉంది,

721
00:45:29,960 --> 00:45:34,320
ఇంకా క్లబ్‌కు కూడా, కానీ ఏదేమైనా,
ఇది నా అభిప్రాయం కాకూడదు.

722
00:45:38,040 --> 00:45:39,720
ఆర్సెనల్

723
00:45:39,800 --> 00:45:42,720
మికెల్, ఆర్సెనల్‌లకు
జనవరి కష్టంగా గడిచింది.

724
00:45:42,800 --> 00:45:44,720
మనం వాళ్లకు బాల్‌తో సమయం ఇవ్వకూడదు.

725
00:45:45,320 --> 00:45:47,240
నెల రోజులుగా వాళ్లు స్కోర్ చేయలేదు.

726
00:45:48,000 --> 00:45:51,640
వచ్చే సీజన్‌లో యూరోపియన్ ఫుట్‌బాల్‌కు
అర్హత సాధించేందుకు

727
00:45:51,720 --> 00:45:53,720
మికెల్‌కు ప్లేయర్ల నుంచి స్పందన కావాలి.

728
00:45:53,800 --> 00:45:54,720
ఛాంపియన్స్ లీగ్ అర్హత

729
00:45:57,520 --> 00:46:01,040
వూల్వ్స్ మీద విజయం సాధిస్తే,
ప్రత్యర్థులపై అవకాశం వస్తుంది.

730
00:46:04,360 --> 00:46:07,640
వూల్వ్స్ వర్సెస్ ఆర్సెనల్
మోలినూ స్టేడియం - 10 ఫిబ్రవరి 2022

731
00:46:07,720 --> 00:46:13,520
ఆర్సెనల్! ఆర్సెనల్! ఆర్సెనల్!

732
00:46:13,600 --> 00:46:16,560
టాప్ నాలుగులో ముగించాలని
లక్ష్యాలను పెట్టుకున్న

733
00:46:16,640 --> 00:46:19,560
రెండు జట్ల మధ్య పోరాటం
ఈ రాత్రి గెలిచిన జ్టటు

734
00:46:19,640 --> 00:46:24,400
మరింత చేరువవుతుంది, ఇక్కడ ప్రీమియర్
లీగ్‌లో ఆర్సెనల్‌కు వూల్వ్స్ ఆతిథ్యం.

735
00:46:24,480 --> 00:46:27,560
-రెడ్ ఆర్మీ!
-రెడ్ ఆర్మీ!

736
00:46:27,640 --> 00:46:31,000
మేము ఏ స్థితిలో ఉన్నామంటే
టాప్ నాలుగులో ఒకటైనా సాధించాలి.

737
00:46:31,080 --> 00:46:33,880
ఇది సంక్లిష్టమైన గేమ్
కానీ మేము గెలిచి తీరాలి.

738
00:46:35,560 --> 00:46:38,800
-వెళ్లేందుకు సిద్ధమా?
-సిద్ధం, పదండి, అబ్బాయిలు.

739
00:46:38,880 --> 00:46:41,560
ఒకరికొకరు సాయం చేయండి. కలిసి పని చేయండి.

740
00:46:41,640 --> 00:46:42,680
రండి, కుర్రాళ్లు.

741
00:46:44,520 --> 00:46:47,040
సరే, వినండి. దగ్గరగా ఉండండి.

742
00:46:49,080 --> 00:46:50,640
మనం చాలా వేగంగా ఆరంభించాలి.

743
00:46:50,720 --> 00:46:53,640
వెళ్లి, ఆటపై ఆధిపత్యం చూపి
మనం ఆడాలనుకునేలా ఈ ఆట ఆడాలి,

744
00:46:54,240 --> 00:46:57,200
దూకుడుగా ఉండాలి,
మనకు ధైర్యసాహసాలు ఉండాలి.

745
00:46:57,280 --> 00:47:01,840
నిర్ణయాలను తీసుకునే, గెలవాలని చూసే
మనుషులను నేను చూడాలి.

746
00:47:01,920 --> 00:47:06,120
పోరాడండి, ఎందుకంటే వాళ్లు డైవ్ చేస్తారు,
అవమానిస్తారు, రెచ్చగొడతారు,

747
00:47:06,200 --> 00:47:07,840
ఇంకా ఎక్కువ రెచ్చగొడతారు.

748
00:47:07,920 --> 00:47:09,640
సరే, వెళ్లండి, ఆ పని చేయండి.

749
00:47:23,920 --> 00:47:26,160
ఇక్కడ వూల్వ్స్ ఆరంభించారు.

750
00:47:27,800 --> 00:47:31,480
ఆర్సెనల్, గెలుపు లేకుండా ఐదు గేమ్‌లు,
ఈ రాత్రి వాళ్లు గెలవాలి.

751
00:47:36,160 --> 00:47:37,920
గేమ్‌పై ఆర్సెనల్ ఆధిపత్యం.

752
00:47:39,120 --> 00:47:41,840
సాకా నుంచి చక్కని ఆట
వైట్‌కు దగ్గరగా లేదు.

753
00:47:45,600 --> 00:47:48,600
అది లాకాజెట్‌ను దాటి వెళ్లింది.
అక్కడ గాబ్రియెల్!

754
00:47:48,680 --> 00:47:50,760
ఆర్సెనల్‌కు ఆధిక్యం దక్కింది.

755
00:47:50,840 --> 00:47:53,680
వూల్వ్స్ 0 - 1 ఆర్సెనల్
గాబ్రియెల్ 25'

756
00:47:53,760 --> 00:47:57,560
మికెల్ దానినెలా ఆనందిస్తాడో చూడండి.

757
00:48:00,240 --> 00:48:05,880
గాబ్రియెల్ చేసిన గోల్, 478 నిమిషాల
ఫుట్‌బాల్‌లో మొదటి ఆర్సెనల్ గోల్.

758
00:48:09,760 --> 00:48:13,120
కానీ మరొక గంట మిగిలి ఉండగా,
వూల్వ్స్‌కు అవకాశం వచ్చింది.

759
00:48:15,120 --> 00:48:17,960
మార్టినెల్లి అక్కడ పోడెన్స్‌తో తలపడ్డాడు.

760
00:48:18,040 --> 00:48:23,000
ఇతను మరొక ఫౌల్ చేశాడు,
సరిగ్గా రిఫరీ ముందు.

761
00:48:24,600 --> 00:48:29,040
ఒక యెల్లో కార్డ్. రెండు యెల్లో కార్డ్‌లు.
మార్టినెల్లి బయటకు.

762
00:48:29,480 --> 00:48:33,400
ఒకే ఆట ప్యాసేజ్‌లో
రెండు వేర్వేరు తప్పులు,

763
00:48:33,480 --> 00:48:36,840
అదే ఇప్పుడు ఆర్సెనల్, ఆర్టెటా కోరుకోనిది.

764
00:48:44,040 --> 00:48:45,040
చెత్త గోల.

765
00:48:47,680 --> 00:48:51,880
సీజన్‌లో ఐదవ సారి,
ఆర్సెనల్ పది మందికి పరిమితమైంది.

766
00:48:54,800 --> 00:48:56,400
వూల్వ్స్‌కు ఫ్రీ కిక్ వచ్చింది.

767
00:48:56,480 --> 00:48:58,160
అది లోపలకు వెళ్లింది.

768
00:48:58,520 --> 00:49:00,520
ఆర్సెనల్ దారుణ అదృష్టం.

769
00:49:00,600 --> 00:49:03,760
కానీ ఆగండి, జెండా చూపారు,
కానీ అది లెక్కలోకి రాదు.

770
00:49:06,920 --> 00:49:11,000
జిమెనెజ్! ఆర్సెనల్ అది తీసుకుపోనుంది.

771
00:49:13,240 --> 00:49:15,600
ఇది ఆర్సెనల్‌కు పెద్ద విజయం కానుంది

772
00:49:15,680 --> 00:49:18,640
వాళ్లు దీనిని మరికొంతసేపు నిలబెట్టుకుంటే.

773
00:49:21,000 --> 00:49:23,800
ఇది ముగిసింది.
ఆర్సెనల్‌కు పెద్ద, పెద్ద విజయం.

774
00:49:23,880 --> 00:49:26,040
ఆర్టెటా ఆనందం.

775
00:49:29,680 --> 00:49:32,440
టాప్ నాలుగుకు చేరేందుకు
ఆర్సెనల్‌కు ఒక పాయింట్‌ దూరమే.

776
00:49:34,880 --> 00:49:37,080
ఇవి భారీ మూడు పాయింట్లు.

777
00:50:05,800 --> 00:50:07,080
మరుసటి సారి

778
00:50:07,160 --> 00:50:10,640
ఒబామెయాంగ్ బార్సిలోనాలో ఉన్నాడు.
పరిస్థితి గురించి ఏమంటారు?

779
00:50:10,720 --> 00:50:14,280
ఒకరి తర్వాత ఒకరుగా ప్లేయర్లను వెళ్లనిచ్చి,
ఎవరినీ తీసుకోలేదు.

780
00:50:14,360 --> 00:50:16,480
లాకాజెట్, ఇది పూర్తిగా అయోమయం.

781
00:50:16,560 --> 00:50:18,560
స్కోర్ కొడతావు, నాకు సందేహం లేదు.

782
00:50:18,640 --> 00:50:21,440
పెద్ద క్లబ్‌గా ఉండడంతో,
చెడు రోజులు ఉండకూడదు.

783
00:50:21,520 --> 00:50:23,920
జోటా కొట్టాడు, లివర్‌పూల్‌కు స్కోర్.

784
00:50:24,400 --> 00:50:26,400
వాళ్లకు చిన్న అవకాశం వచ్చింది.

785
00:50:27,760 --> 00:50:32,040
మేనేజర్ రెండేళ్లుగా ఉన్నాడు,
ఈ కాలంలో మేము పెద్దగా మెరుగవడం చూడలేదు.

786
00:50:32,760 --> 00:50:38,000
ఫుట్‌బాల్‌లో జరిగేదానిపై ప్రజలు నిజంగా
చాలా ఎక్కువగా ఆసక్తి చూపుతారు.

787
00:50:39,080 --> 00:50:40,400
నిజానికి నువ్వు నచ్చవు.

788
00:51:32,360 --> 00:51:35,040
ఆర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్లేయర్లు,
కోచ్‌లు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలతో

789
00:51:36,400 --> 00:51:37,400
ఉపశీర్షికలు అనువదించినది
కృష్ణమోహన్ తంగిరాల

790
00:51:38,440 --> 00:51:40,440
క్రియేటివ్ సూపర్‌వైజర్
నల్లవల్లి రవిందర్ రెడ్డి

