﻿1
00:00:55,431 --> 00:00:56,724
పద.

2
00:00:57,183 --> 00:00:58,809
-నాతో వచ్చెయ్యి.
-లేదు.

3
00:00:58,893 --> 00:01:01,729
-దయచేసి?
-అస్సలు కుదరదు.

4
00:01:02,396 --> 00:01:05,274
ఇది వారికి చివరి కలిసి చేసే టూర్ కావచ్చు.

5
00:01:05,357 --> 00:01:06,567
హా, అలానే అనుకోవాలి.

6
00:01:07,777 --> 00:01:08,986
వాళ్లు అత్యుత్తమ బాండ్.

7
00:01:09,069 --> 00:01:10,154
అది మరిచిపో.

8
00:01:10,988 --> 00:01:11,989
చూడు, నేను నిన్ను ఆపట్లేదు.

9
00:01:12,072 --> 00:01:14,158
నువ్వు వెళ్ళాలనుకొంటే,
నేను ముందు వరుస సీట్లు కొంటాను,

10
00:01:14,241 --> 00:01:15,576
రేచల్‌ని తీసుకెళ్లు.

11
00:01:15,659 --> 00:01:18,329
రేచల్‌తో వెళ్ళను నేను.
నీతో వెళ్ళాలనుకుంటున్నాను.

12
00:01:19,371 --> 00:01:21,373
నా చెవులు కోసేసుకోవాల్సి వస్తుంది.

13
00:01:21,457 --> 00:01:22,750
-అంతా కంపు చేస్తాను.
-అవును.

14
00:01:22,833 --> 00:01:25,044
హా, అదంతా మళ్ళీ నేనే శుభ్రం చెయ్యాలి.

15
00:01:25,127 --> 00:01:27,713
-చేస్తావా మరి?
-హా. తెలివైనవాడివి.

16
00:01:29,006 --> 00:01:30,299
నీకు అది ఇష్టం కదా.

17
00:01:30,341 --> 00:01:31,383
ఇష్టమా?

18
00:01:31,467 --> 00:01:33,260
-హా, నీకిష్టం.
-హా.

19
00:02:05,084 --> 00:02:08,671
ది బాయ్స్

20
00:02:24,562 --> 00:02:25,563
వేడి గాలి మరలు

21
00:03:19,158 --> 00:03:20,451
-హే.
-శుభోదయం.

22
00:03:24,580 --> 00:03:25,623
శుభోదయం, డిప్యూటీ డైరక్టర్.

23
00:03:29,543 --> 00:03:31,128
ఇక్కడికి ఎలా వచ్చావు?

24
00:03:32,546 --> 00:03:36,050
బట్టలుతికే చోట పట్టిన పాచివి నువ్వు.

25
00:03:36,133 --> 00:03:38,260
ఎంత గీకినా మళ్లీ వస్తుంది.

26
00:03:40,554 --> 00:03:42,973
కొంచెం తేమ సమస్య ఉన్నట్టుంది నీకు.

27
00:03:43,057 --> 00:03:44,558
సెక్యూరిటీ, దయచేసి.

28
00:03:45,601 --> 00:03:47,561
సూప్స్‌ని మిలటరీలోకి
పంపకుండా వాళ్ళని ఆపుతాను నేను.

29
00:03:47,645 --> 00:03:50,022
నాకు అవసరమంటావా?

30
00:03:50,105 --> 00:03:52,691
వ్యక్తిగతంగా, వాళ్ళు సిరియా
వెళ్ళాలని కోరుకుంటున్నాను నేను.

31
00:03:53,901 --> 00:03:54,902
హా, అవును మరి.

32
00:03:57,488 --> 00:04:00,658
పోయిన వారం, ఏ-ట్రైన్
ఆ పెద్ద రేస్‌కి ముందు మందు వాడాడు.

33
00:04:00,741 --> 00:04:05,079
అతని స్నేహితురాలు, పాప్‌క్లా.
అదే తీసుకుంటూ దొరికింది.

34
00:04:05,162 --> 00:04:06,705
వాళ్ళు దానిని కాంపౌండ్ వి అంటున్నారు.

35
00:04:06,789 --> 00:04:10,417
సూప్స్‌కి ఇచ్చే బూస్టర్ లేక
స్టెరాయిడ్ అది, వెంటనే ఎక్కుతుందది.

36
00:04:10,501 --> 00:04:14,672
ఇక, సూప్స్ మందుకి బానిసలు తప్ప
ఇంకేం కాదని తెలిస్తే బయట,

37
00:04:14,755 --> 00:04:17,216
వాళ్లనెవరూ జాతీయ రక్షణలో చేర్చుకోరు.

38
00:04:18,968 --> 00:04:20,010
సాంపిల్ ఉందా?

39
00:04:21,136 --> 00:04:22,388
ఇంకా దొరకలేదు.

40
00:04:23,389 --> 00:04:25,975
ఇది హెరాయిన్ కావచ్చు.
ఇంకేమైనా కావచ్చు.

41
00:04:26,058 --> 00:04:27,393
నన్ను నమ్మవు కదా.

42
00:04:27,476 --> 00:04:29,311
సూజన్, నాకు చాలా షాకింగ్‌గా, బాధగా ఉంది.

43
00:04:29,395 --> 00:04:31,480
నిజంగానా? ఖచ్చితంగా ఉండే ఉంటుంది.

44
00:04:31,939 --> 00:04:36,402
చెప్పాలంటే, నేను ట్రాన్స్‌లూసెంట్‌ను
ఇక్కడెక్కడా చూడలేదు.

45
00:04:36,485 --> 00:04:39,196
దాని గురించి నీకేం తెలియదు కదా, తెలుసా?

46
00:04:39,905 --> 00:04:42,741
వాడు అదృశ్యుడు కదా. ఆ మూలలో
నుంచొని ఉన్నాడేమో,

47
00:04:42,825 --> 00:04:44,702
మన మాటలు వింటూ,
ఎవరికి తెలుసు.

48
00:04:45,744 --> 00:04:46,912
చూడు.

49
00:04:47,621 --> 00:04:51,208
సూప్స్ వెధవలని అనుకుంటున్నావు,
వాళ్ళు యూనిఫాం వేసుకున్నారంటే ఇంక చూడు.

50
00:04:51,291 --> 00:04:53,127
అంటే, సార్జెంట్ హోంలాండర్‌ని ఎవరు ఆపగలరు

51
00:04:53,210 --> 00:04:55,879
కొన్ని వేలమంది చైనీస్‌ని చంపితే?

52
00:04:55,963 --> 00:04:57,381
అతన్ని యుద్ధనేరాలలో బోను ఎక్కించగలవా?

53
00:04:57,464 --> 00:05:00,718
హేగ్‌లో అడుగు పెట్టకముందే
అక్కడ వందల మందిని చంపగలడతను.

54
00:05:00,801 --> 00:05:04,388
అంటే, బాంబుల లాంచ్ తాళాలు కూడా
వాట్‌కి ఇచ్చెయ్యి ఇప్పుడే నువ్వు.

55
00:05:09,393 --> 00:05:11,145
నిజంగా చాలా ఆలోచిస్తున్నావు, కదా?

56
00:05:12,855 --> 00:05:14,732
బాధ్యత గల పౌరునిగా చేస్తున్నాను, బుజ్జి.

57
00:05:14,815 --> 00:05:16,316
తెలుసు.

58
00:05:18,110 --> 00:05:22,531
సరే, నాకు సరైన సాక్ష్యం ఒకటి తెచ్చివ్వు.

59
00:05:22,614 --> 00:05:25,701
ఏదైనా యాక్షన్ తీసుకోవటానికి వీలైనది,

60
00:05:25,784 --> 00:05:31,081
ఇంకా దానికి నీకు ఖర్చుల క్రింద
కొంత డబ్బులు కూడా పడేస్తాను.

61
00:05:36,628 --> 00:05:38,130
కానీ ఇది కనుక చెడగొట్టావంటే,

62
00:05:38,714 --> 00:05:39,965
ఇక జీవితాంతం,

63
00:05:40,049 --> 00:05:42,926
రహస్య జైలులో నీ ఉచ్ఛ
నువ్వే తాగుతూ బ్రతకాలి.

64
00:05:44,219 --> 00:05:45,846
అర్థమైందనుకుంటాను.

65
00:05:47,556 --> 00:05:51,810
చూడు, ఇక, సూజన్, ఇందుకే
మన మధ్య ఏదీ కొనసాగలేదు.

66
00:05:51,894 --> 00:05:54,313
ఇద్దరు ఆల్ఫా పురుషులు ఒకచోట ఉండలేరు,
అంటే ఎవరో ఒకరు తగ్గాలి కదా...

67
00:05:54,396 --> 00:05:56,982
నీకు అర్థమైందనుకుంటాను.

68
00:05:59,526 --> 00:06:01,236
అర్థమైంది.

69
00:06:02,988 --> 00:06:05,074
చెప్పు నాకు, మన ఒప్పందం ఏంటో?

70
00:06:05,157 --> 00:06:06,116
ఏంటి?

71
00:06:06,200 --> 00:06:07,451
మన ఒప్పందం ఏంటి?

72
00:06:07,534 --> 00:06:11,080
తగలడు. ఏ-ట్రైన్ కాంపౌండ్ వి
తీసుకున్నాడని ముందే చెప్పానుగా...

73
00:06:11,163 --> 00:06:13,791
హా, కాంపౌండ్ విని ప్రక్కనున్న
నూడుల్ షాప్‌లో ఇస్తుంటాడంతేగా.

74
00:06:14,333 --> 00:06:16,794
వారం నుండి చూస్తున్నాం కానీ
మనకేం దొరకలేదస్సలు.

75
00:06:16,877 --> 00:06:18,670
అంటే, అతను వెళ్ళే చోట్లలో
ఎక్కడో ఉందది.

76
00:06:18,754 --> 00:06:21,799
ఎందుకంటే అతను వి వదిలినప్పుడల్లా,
అతను నువ్వుల నూడిల్స్ తింటున్నాడు.

77
00:06:21,882 --> 00:06:22,883
అదే నాకు తెలుసు.

78
00:06:22,966 --> 00:06:24,593
అంటే నువ్వు నిజం చెపుతున్నావనుకుంటాను.

79
00:06:25,177 --> 00:06:28,889
లేదా నువ్వు నీ తాజాగా చచ్చిన యజమాని
ఇద్దరూ పోర్న్‌హబ్‌లో తేలుతారు,

80
00:06:28,972 --> 00:06:30,724
మరణాంతక స్తీ అంగచూషణసెక్షన్‌లో.

81
00:06:30,808 --> 00:06:32,351
చెత్త వెధవ, నీకు అస్సలు...

82
00:06:36,855 --> 00:06:38,273
నూడుల్ ప్లేస్

83
00:06:38,357 --> 00:06:40,984
సారీ, బేబీ, పని చాలా
ఎక్కువగా ఉంది ఈమధ్య.

84
00:06:41,068 --> 00:06:43,403
తెలుసుగా నాకు ఇంట్లో ఉండి వాటిని
వేళ్ళతో వత్తటం ఇష్టమని

85
00:06:43,487 --> 00:06:44,655
ఇక్కడ చెత్త గొడవలు పడటం కంటే,

86
00:06:44,738 --> 00:06:46,865
కానీ, తెలుసా,
మనకి డబ్బులు కావాలి కదా?

87
00:06:46,949 --> 00:06:48,700
ఖచ్చితంగా.

88
00:06:48,784 --> 00:06:52,412
జీతం రాగానే, మనం కే జ్యువెలర్స్
దగ్గరికి వెళ్ళి దానినంతా కొనేద్దాం.

89
00:06:53,122 --> 00:06:54,540
షాంపేన్ జల్లులు కురిపిద్దాం.

90
00:06:57,334 --> 00:07:01,088
తెలుసు, తెలుసు, తమాషా చేస్తున్నానంతే.
సరే మరి, బంగారం, మళ్ళీ మాట్లాడతాను.

91
00:07:06,510 --> 00:07:07,553
ఏదైనా మాట్లాడు.

92
00:07:10,472 --> 00:07:13,267
అంటే, అది, జీన్-పాల్ సార్ట్రే అన్నాడు,

93
00:07:13,350 --> 00:07:16,186
"పెళ్లి మన మగవారి కోరికలకి ఉరితాడని."

94
00:07:16,270 --> 00:07:19,648
జీన్-పాల్ సార్ట్రే ఒంటరిగా
ముసలితనంలో చచ్చాడు.

95
00:07:19,982 --> 00:07:22,651
అతని పెళ్ళాం ఇంకొకరితో కులుకుతుందనుకో.

96
00:07:22,734 --> 00:07:24,653
ఓయీ, వాళ్ళు స్వేచ్ఛాన్వేషకులు.

97
00:07:24,736 --> 00:07:26,572
ఏం అన్వేషించారు? గనేరియానా?

98
00:07:27,656 --> 00:07:29,241
అరే, ఫ్రెంచీ.

99
00:07:29,324 --> 00:07:30,742
ఇంత కష్టపడటం ఎందుకు

100
00:07:30,826 --> 00:07:33,579
ఇంటికి వెళ్ళి తోడుగా
పడుకోవటానికి ఒకరు లేనప్పుడు?

101
00:07:33,662 --> 00:07:36,415
అంటే, నేను ప్రతి రాత్రి
ఒక్కొక్కరితో పడుకుంటుంటాను.

102
00:07:36,498 --> 00:07:38,542
హా, ఎందుకంటే నువ్వు కూడా
ఒంటరి ముసలివాడివి కనుక.

103
00:07:38,625 --> 00:07:40,043
నువ్వు కూడా ఒంటరిగానే చస్తావు.

104
00:07:40,669 --> 00:07:43,088
ఐతే మరి నీకు, మోనిక్‌కు మధ్య
ప్రేమ అంత పవిత్రమైతే,

105
00:07:43,172 --> 00:07:45,090
నువ్వెక్కడున్నావని అబద్ధమెందుకు ఆడావు?

106
00:07:55,559 --> 00:07:57,561
నూడుల్ వాడు. ప్యాకింగ్ చేస్తున్నాడు.

107
00:07:58,896 --> 00:08:00,063
మనకేదన్నా దొరకవచ్చు.

108
00:08:41,271 --> 00:08:42,814
మనమక్కడికి వెళ్ళాలేమో కదా?

109
00:08:43,357 --> 00:08:45,025
భయపడకు, బక్క హ్యూయీ.

110
00:08:45,108 --> 00:08:47,945
అలా పిలవకు నన్ను?
నా ఎత్తు ఆరు అడుగులు.

111
00:09:43,375 --> 00:09:46,378
త్వరపడండి, పదండి.
ఆ బాక్సులు వెతకండి.

112
00:09:53,135 --> 00:09:54,511
ఫ్రెంచీ, వి కోసం వెతుకు.

113
00:10:02,894 --> 00:10:04,980
ఫ్రెంచీ, అరే, పద.
ఆ బాక్సులు వెతుకు.

114
00:10:08,358 --> 00:10:09,901
అరే రా, ఫ్రెంచీ, ఏం చేస్తున్నావు?

115
00:10:12,821 --> 00:10:14,031
నీకు చెముడా?

116
00:10:17,242 --> 00:10:18,243
దేవుడా.

117
00:10:25,625 --> 00:10:26,626
అదెవరు?

118
00:10:27,169 --> 00:10:28,628
ఆమెని వదిలేస్తే మంచిది.

119
00:10:28,712 --> 00:10:30,130
లేదు, లేదు, లేదు, లేదు, లేదు.

120
00:10:30,213 --> 00:10:32,924
మనం వి కోసం వచ్చాం, వెళ్ళిపోదాం అంతే.
కాపాడటం మన పని కాదు.

121
00:10:33,967 --> 00:10:35,135
బుచర్‌లా మాట్లాడుతున్నావు.

122
00:10:35,802 --> 00:10:37,596
బ్రతకాలని ఆశ ఉన్న వెధవలా
మాట్లాడుతున్నాను.

123
00:10:40,474 --> 00:10:42,351
అబ్బా దేవుడా, ఫ్రెంచీ, ఏంటది...

124
00:10:44,895 --> 00:10:46,355
హే! తనని వదిలెయ్యకు!

125
00:10:53,487 --> 00:10:54,404
ఓరి దేవుడా!

126
00:11:08,794 --> 00:11:09,753
అబ్బా, ఛా.

127
00:11:09,836 --> 00:11:11,797
-హ్యూయీ, పద. పద, హ్యూయీ!
-వెళ్ళు, వెళ్ళు!

128
00:11:11,880 --> 00:11:12,881
అరే రా.

129
00:11:37,864 --> 00:11:39,991
కొన్ని వారాల క్రితం,
మేమందరం బాగా...

130
00:11:40,075 --> 00:11:41,952
మేమంతా వరండాలో తాగి పడుకొనేవాళ్ళం.

131
00:11:42,911 --> 00:11:44,496
సూపర్ బౌల్ సమయంలోలాగా.

132
00:11:47,332 --> 00:11:49,292
నాకు తెలియదు,
నేను తాగానో లేక కానీ...

133
00:11:52,212 --> 00:11:53,338
నేను ప్రయత్నించాను.

134
00:11:55,382 --> 00:11:57,050
నిజంగా ప్రయత్నించాను...

135
00:11:59,302 --> 00:12:00,637
వాళ్ళతో మాట్లాడటానికి.

136
00:12:01,721 --> 00:12:02,722
దేని గురించి?

137
00:12:04,307 --> 00:12:05,392
డాల్ఫిన్ల గురించి.

138
00:12:06,143 --> 00:12:07,686
తెలుసా, జపాన్‌లో,

139
00:12:07,769 --> 00:12:10,939
సంవత్సరానికి వాళ్ళు 20,000
డాల్ఫిన్లని వేటాడి చంపుతారని?

140
00:12:11,022 --> 00:12:12,232
అవి తెలివైన ప్రాణులు.

141
00:12:12,983 --> 00:12:17,487
హా, వాటికి ప్రాంతీయ యాసలు
ఇంకా హాస్య చతురత కూడా ఉంటుందిగా.

142
00:12:17,571 --> 00:12:19,990
అంటే, అవి... అవి చాలా కామెడీ చేస్తాయి.

143
00:12:21,783 --> 00:12:22,784
అవును.

144
00:12:23,785 --> 00:12:25,370
ఆ రాత్రి, ఏ-ట్రైన్...

145
00:12:26,830 --> 00:12:29,583
చచ్చిన డాల్ఫిన్‌ని నా బెడ్ మీద
పెట్టటం తమాషా అనుకున్నారు

146
00:12:31,626 --> 00:12:33,336
దాని గాలి రంధ్రంలో లిప్‌స్టిక్‌తో.

147
00:12:34,588 --> 00:12:36,381
తెలుసుగా, ఎంత తెలివైన వెధవలో.

148
00:12:39,718 --> 00:12:41,011
క్షమించు.

149
00:12:42,721 --> 00:12:43,847
అది బాధ కలిగించి ఉంటుంది.

150
00:12:46,057 --> 00:12:48,894
హా, నేను... నేను...
నేను భిన్నత్వానికి వారసుడిని.

151
00:12:50,729 --> 00:12:52,189
నేను జోక్‌ని.

152
00:12:53,899 --> 00:12:57,194
అంటే, హా, చేపలతో మాట్లాడగలను, ఐతే ఏంటి?

153
00:12:58,320 --> 00:13:01,781
సాల్మన్‌లతో కాపాడబడే అవసరం
నీకు ఎన్నిసార్లు కలుగుతుందేంటి?

154
00:13:02,324 --> 00:13:04,493
కెవిన్, అది వాస్తవం కాదు.

155
00:13:05,660 --> 00:13:08,121
నువ్వు లేకపోతే
ఆ కార్నివాల్ క్రూజ్ ఓడ గతేమయ్యేది?

156
00:13:09,956 --> 00:13:12,667
హా. తెలుసు.

157
00:13:16,046 --> 00:13:20,342
సరే, నాకు ఆత్మ విమర్శ కావాలి.
ఇంకొంచెం ఆత్మవిశ్వాసం చూపించాలి.

158
00:13:21,885 --> 00:13:23,678
అంటే నేనెవరిని కనుక?

159
00:13:24,596 --> 00:13:25,847
నేను సెవన్‌లో ఒకడిని.

160
00:13:25,931 --> 00:13:27,432
అంటే ఏంటి?

161
00:13:27,516 --> 00:13:29,100
నేను అనుకున్నది ఏదైనా చెయ్యగలను.

162
00:13:30,310 --> 00:13:32,020
నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు?

163
00:14:00,006 --> 00:14:01,383
ఏంటి చెత్త.

164
00:14:03,385 --> 00:14:04,302
నువ్వు బాగానే ఉన్నావా?

165
00:14:05,095 --> 00:14:07,681
అంటే, ఇంతకంటే ఘోరం
ఉండదు అనుకొనేలోపే...

166
00:14:07,764 --> 00:14:09,140
లేదు, కంగారుపడకు.

167
00:14:10,392 --> 00:14:12,394
ఇంకా ఘోరంగా మారుతుంది.

168
00:14:23,822 --> 00:14:26,741
డేవిడ్ మెరిడిత్
ష్మూ స్టే,ఫ్లా-యార్క్‌పెన్‌స్టే,న్యూయార్క్

169
00:14:30,662 --> 00:14:33,331
హే, బుచర్. ఇది చూడు వచ్చి.

170
00:14:39,045 --> 00:14:40,380
దీనిని చూడు.

171
00:14:43,675 --> 00:14:44,843
వి.

172
00:14:46,386 --> 00:14:48,346
ఐతే, ఏ-ట్రైన్ ఇక్కడ దాస్తున్నాడు.

173
00:14:48,430 --> 00:14:50,682
వాళ్లు ఈ ఆసియన్
పిల్లకి కూడా ఇది ఇస్తున్నారు.

174
00:14:50,765 --> 00:14:51,975
హా, వాళ్లకి కళ్లుంటే కదా.

175
00:14:52,058 --> 00:14:56,646
హా, కానీ ఎందుకు? ఇది వాట్‌కి
సంబంధించిందా లేక పక్క దారా?

176
00:14:57,981 --> 00:14:59,441
దీనిలో అలంకరించి పంపారు.

177
00:15:02,652 --> 00:15:04,362
ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో.

178
00:15:04,446 --> 00:15:05,614
నేను కొంతమందిని కనుక్కుంటాను.

179
00:15:07,699 --> 00:15:09,409
ఆమెకి ఎందుకు డోసింగ్ ఇస్తున్నారసలు?

180
00:15:09,492 --> 00:15:13,038
అక్కడున్న వాడిని అడక్కపోయావా?
వాడే ఆమెని బయటికి వదిలింది.

181
00:15:13,580 --> 00:15:15,540
-ఆమె అమాయకురాలిలా అనిపించింది.
-అమాయకురాలా?

182
00:15:17,000 --> 00:15:20,837
ఇద్దరు ఆయుధాలున్నవారి కాపలాలో
అండర్‌గ్రౌండ్‌లో బోనులో ఉందిగా?

183
00:15:20,920 --> 00:15:22,213
నాకేదో అనిపించింది తనని చూడగానే.

184
00:15:22,297 --> 00:15:24,549
లేదు, ఫ్రెంచీ.
ప్లాను ప్రకారం నడుచుకోలేదు నువ్వు.

185
00:15:24,633 --> 00:15:25,967
నువ్వెప్పుడూ ప్లాన్ ఆనుసరించవు, బాబు.

186
00:15:26,051 --> 00:15:27,719
నీ బుద్ధి మార్చుకో ముందు.

187
00:15:27,802 --> 00:15:29,596
లేకపోతే నువ్వు మార్చలేవుగా.
ఇంకేంటట?

188
00:15:29,679 --> 00:15:32,557
చిన్నపిల్లల్లా ఎందుకు కొట్టుకుంటున్నారు?

189
00:15:33,183 --> 00:15:35,894
మనమో వాటర్‌గేట్ అంత పెద్ద
బురదలో రాయేసాము.

190
00:15:35,977 --> 00:15:38,772
వాట్ ఇంకా సూప్స్ అంతా
ఆమె కోసం వెతుకుతుండవచ్చు.

191
00:15:38,855 --> 00:15:42,025
ముందు ఆ అమ్మాయిని పట్టుకోవాలి మనం.

192
00:15:48,156 --> 00:15:49,240
వెతుకుతుండండి.

193
00:15:52,952 --> 00:15:53,953
ఐతే తనెవరు?

194
00:15:54,037 --> 00:15:55,038
ఎవరూ కాదు.

195
00:16:02,253 --> 00:16:04,005
"ఆనీ." స్టార్‌లైట్?

196
00:16:04,089 --> 00:16:07,175
హా, ఎవరూ లేరు. అంటే,
మనం డేట్‌కి వెళ్ళలేమోగా.

197
00:16:07,258 --> 00:16:08,677
డేట్ కాదు, అది...

198
00:16:08,760 --> 00:16:11,554
ఆమె నంబర్ కావాలా అని నన్ను అడిగింది,

199
00:16:11,638 --> 00:16:13,765
అప్పుడు మేము మాట వరుసకి
సమాచారం ఇచ్చి పుచ్చుకున్నాం,

200
00:16:13,848 --> 00:16:16,518
కానీ అది... ఆ పదం "డేట్"
గురించి అస్సలు మాట్లాడుకోలేదు.

201
00:16:16,726 --> 00:16:18,520
తనకిప్పుడే మళ్ళీ కాల్ చెయ్యి.
నువ్వు వెళ్లి తీరుతావు.

202
00:16:18,603 --> 00:16:23,024
నియమం ప్రకారం, నేను ఘోరమైన
మారణకాండ తరువాత బయటికి వెళ్ళను.

203
00:16:23,108 --> 00:16:26,403
విను, ఇది నీ పని.
ఆమె ఫోన్‌ని టాప్ చేస్తావు.

204
00:16:26,486 --> 00:16:28,613
ఇప్పటినుండి, ఆమె మాటలన్నీ మనకి తెలుస్తాయి.

205
00:16:28,697 --> 00:16:31,157
అంటే ఇది అద్భుతమైన అవకాశం.

206
00:16:31,241 --> 00:16:33,410
ఇదంతా నీకు వెన్నతో పెట్టిన విద్య కదా.

207
00:16:34,744 --> 00:16:38,123
హా, తను...
తను చెడ్డది కాదు.

208
00:16:40,333 --> 00:16:44,921
తను సూప్, హ్యూయీ.
మిగతావారందరి లాగే తను కూడా.

209
00:16:50,844 --> 00:16:53,388
సరే, మనం దీనిని
ఎక్కువకాలం దాచి ఉంచలేం.

210
00:16:53,471 --> 00:16:56,599
ట్రాన్స్‌లూసెంట్ త్వరలో కనిపించకపోతే,
జనాలు ఖచ్చితంగా గమనిస్తారు.

211
00:16:56,683 --> 00:16:58,101
మనం దాని కన్నా ముందే ఒక పని చేస్తే?

212
00:16:58,184 --> 00:17:01,104
ప్రపంచానికి చెబుదాం, అతను
దేశ సేవలో ప్రమాదవశాత్తూ మరణించాడని?

213
00:17:01,187 --> 00:17:03,606
చాలా గొప్ప అంత్యక్రియలు చేద్దాం,
కెన్నడీ కన్నా గొప్పగా.

214
00:17:03,690 --> 00:17:04,607
నాకు తెలీదు.

215
00:17:04,691 --> 00:17:07,569
అమరులైన మన సూపర్‌హీరోలలో
ఒకరిని ఎవరో చంపారని ఒప్పుకుందామా?

216
00:17:07,652 --> 00:17:09,571
మిలటరీ బిల్‌కి వీడ్కోలు చెప్పటమే.

217
00:17:09,654 --> 00:17:12,866
ఎక్కువగా ఆలోచించకండి.
అతను క్లాసిఫైడ్ మిషన్‌కి వెళ్ళడని చెబుదాం.

218
00:17:12,949 --> 00:17:15,744
ఎక్కడికో చెప్పకూడదు,
జాతీయ భద్రతా సమస్య కనుక అని.

219
00:17:15,827 --> 00:17:18,079
మనం చెప్పేదల్లా అతను
ఎంఎస్-13తో పోరాడుతున్నాడనే.

220
00:17:18,163 --> 00:17:19,372
హా, ఇది బావుంది.

221
00:17:19,456 --> 00:17:20,874
సరళంగా. పనౌతుంది. బూం.

222
00:17:20,957 --> 00:17:23,042
ఎంఎస్-13, నాకు నచ్చింది.

223
00:17:24,544 --> 00:17:25,420
హల్లో.

224
00:17:27,380 --> 00:17:28,423
ఏంటి?

225
00:17:29,841 --> 00:17:30,717
ఎప్పుడు?

226
00:17:33,052 --> 00:17:34,804
ఎంతమందికి తెలుసు?

227
00:17:35,764 --> 00:17:36,806
ఏడు నిముషాల క్రితం,

228
00:17:36,890 --> 00:17:41,728
సముద్రాంతర విమానం 37 పారిస్ నుండి
షికాగో వచ్చేది గాలిలో హైజాక్ అయింది.

229
00:17:41,811 --> 00:17:42,771
ఏడు నిముషాల క్రితం?

230
00:17:42,854 --> 00:17:44,606
హా, నోరాడ్ నుండి మన వేగు
సమాచారం పంపాడు.

231
00:17:44,689 --> 00:17:45,899
హైజాకర్లు ఎంతమంది?

232
00:17:45,982 --> 00:17:47,025
ముగ్గురనుకుంటాను.

233
00:17:47,108 --> 00:17:48,777
ఎఫ్-16లని స్క్రాంబుల్ చేసారా?

234
00:17:48,860 --> 00:17:52,822
చెప్పాలంటే అవును.
కానీ నువ్వక్కడికి వేగంగా వెళ్ళగలవు.

235
00:17:55,283 --> 00:17:56,659
నాకు ఈ రూం ఇస్తారా?

236
00:17:58,953 --> 00:18:00,121
అట్లాంటిక్ మధ్యలో.

237
00:18:01,164 --> 00:18:02,415
-అవును.
-మనుషులు లేని చోట.

238
00:18:02,499 --> 00:18:04,417
విదేశీ నేల మీద నువ్వు నడపకూడదు.

239
00:18:04,501 --> 00:18:06,628
కానీ అంతర్జాతీయ జలాల
మీద హైజాక్ అయిన విమానం?

240
00:18:06,711 --> 00:18:09,339
నువ్వు దాన్ని అటకాయిస్తే
ఎవ్వరూ ప్రతిఘటించరు.

241
00:18:10,381 --> 00:18:12,550
ఆ పాసింజర్లని ప్రాణాలతో తీసుకు వచ్చావంటే,

242
00:18:13,384 --> 00:18:16,596
మన బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయ్యటానికి
ఏ నాయకుడికీ ధైర్యం ఉండదు.

243
00:18:23,478 --> 00:18:25,480
ఇదే మనకున్న అవకాశం.

244
00:18:26,147 --> 00:18:28,149
ట్రాన్స్‌లూసెంట్ కన్నా ముఖ్యం.

245
00:18:29,609 --> 00:18:31,486
అన్నింటికన్నా ముఖ్యం.

246
00:18:31,569 --> 00:18:34,155
విమానం ట్రాకింగ్
అంతర-సముద్ర విమానం #37

247
00:18:36,115 --> 00:18:37,116
గాఢ హాలోథేన్.

248
00:18:40,829 --> 00:18:44,624
ఇది ఖచ్చితంగా కాకపోయినా,
కానీ ఇది నీ పిల్లని స్పృహ తప్పిస్తుంది.

249
00:18:44,707 --> 00:18:46,000
ధన్యవాదాలు, పండు.

250
00:18:46,084 --> 00:18:47,877
నేను వెళ్ళాలి. ఈ అమ్మాయి.
ఆమె ముందే వెళ్లింది.

251
00:18:47,961 --> 00:18:50,129
హే, నిన్ను మిస్సవుతున్నాను.

252
00:18:52,048 --> 00:18:54,092
బావరీ నుండి పైడ్-ఆ-టెర్రే తెచ్చాను.

253
00:18:56,344 --> 00:18:57,428
నువ్వెప్పుడు వస్తున్నావు?

254
00:18:59,180 --> 00:19:02,475
వీలైనంత త్వరగా. ఒట్టు.

255
00:19:02,559 --> 00:19:03,476
ఒట్టా?

256
00:19:06,688 --> 00:19:10,733
ఆ గ్యాసుని నీ మీద వదిలేలా చెయ్యకు, పండు.

257
00:19:11,401 --> 00:19:12,402
సరే?

258
00:19:12,777 --> 00:19:13,987
సరే.

259
00:19:42,348 --> 00:19:43,182
అబ్బా!

260
00:19:46,019 --> 00:19:47,395
అంతరఖండంలోకి ఎప్పుడు వస్తారు?

261
00:19:49,063 --> 00:19:52,901
కార్పోరల్, నీతో గదిలో ఎవరున్నారన్నది
అనవసరం, నాకు అప్‌డేట్ కావాల్సిందే.

262
00:19:54,777 --> 00:19:55,778
దేవుడా.

263
00:19:56,487 --> 00:19:57,822
హే, ఒక్క క్షణం మాట్లాడవచ్చా?

264
00:19:58,323 --> 00:20:00,491
-ఇప్పుడు అంత సమయం లేదు.
-నిజంగా అభినందిస్తాను.

265
00:20:00,575 --> 00:20:01,743
-త్వరగా చెప్పేస్తాను, దయచేసి.
-కుదరదు.

266
00:20:01,826 --> 00:20:03,119
-ధన్యవాదాలు.
-సరే.

267
00:20:05,288 --> 00:20:07,832
ఐతే, నాకో మిషన్ దొరికింది.

268
00:20:09,626 --> 00:20:14,964
ఇంకా అది చాలా ముఖ్యమైనది,
అందుకే నేను చేద్దామనుకుంటున్నాను.

269
00:20:15,048 --> 00:20:16,674
నీ అనుమతితోనే అనుకో.

270
00:20:16,758 --> 00:20:18,343
ఏంటి? ఎక్కడ?

271
00:20:18,801 --> 00:20:19,844
ఓషన్‌లాండ్.

272
00:20:20,219 --> 00:20:21,429
ఓషన్‌లాండ్?

273
00:20:21,763 --> 00:20:23,473
హా. ఐతే...

274
00:20:24,223 --> 00:20:26,309
ఆలోచించు, అక్కడున్న డాల్ఫిన్లు,

275
00:20:26,392 --> 00:20:29,646
అంటే వాటికి సరైన తిండి ఉండదు,
హింసకి గురవుతుంటాయి.

276
00:20:31,147 --> 00:20:32,815
నిజం చెప్పాలంటే,
అవి బాగా విసుగెత్తి పోయాయి.

277
00:20:33,983 --> 00:20:37,278
వాటి మీద దృష్టి పెట్టాలనుకుంటున్నాను.

278
00:20:37,362 --> 00:20:39,447
జనాలు దానికి బాగా
స్పందిస్తారని అనిపిస్తుంది.

279
00:20:40,615 --> 00:20:43,368
నీకు తెలుసు కదా నువ్వు కేంద్ర బిందువువని

280
00:20:43,451 --> 00:20:45,453
ఓష‌న్‌లాండ్ శిశిరపు ప్రచారానికి.

281
00:20:45,536 --> 00:20:47,872
హా, అంటే, అది,
దానిని వదిలెయ్యవచ్చు కదా?

282
00:20:47,956 --> 00:20:49,248
ఆ డీల్ చెత్తదనుకో.

283
00:20:49,332 --> 00:20:50,750
లేదు, కుదరదు.

284
00:20:50,833 --> 00:20:52,085
విను, నేను చెప్పేది, అది,

285
00:20:52,168 --> 00:20:54,462
కొంచెం మంచి సత్తువ ఉన్న పని చేద్దామని.

286
00:20:56,464 --> 00:20:58,883
-సరే. విన్నాను. సరే.
-హా? సరే.

287
00:21:00,259 --> 00:21:01,260
డీప్.

288
00:21:02,679 --> 00:21:03,972
నీ శక్తి మేరకు ఆడు.

289
00:21:19,654 --> 00:21:22,281
హే, బేబీ. హే.

290
00:21:29,372 --> 00:21:30,540
ఏం చేసావు నువ్వు?

291
00:21:31,916 --> 00:21:33,584
నువ్వేమంటున్నావు అసలు?

292
00:21:33,668 --> 00:21:36,045
కాంపౌండ్ వి గురించి ఎవరికి చెప్పావు?

293
00:21:37,505 --> 00:21:40,299
ఎవరికీ చెప్పలేదే. ఎందుకు? ఏం...

294
00:21:40,383 --> 00:21:44,345
నాకు తప్ప అది తెలిసిన
ఇంకో ప్రాణి నువ్వే కనుక,

295
00:21:44,804 --> 00:21:46,139
నేను ఎక్కడ తీసుకుంటానో అనే విషయం.

296
00:21:46,806 --> 00:21:50,893
నేను ఎవరికీ ఏం చెప్పలేదు.
నువ్వు అతిగా భయపడుతున్నావు.

297
00:21:50,977 --> 00:21:52,937
ఇంకెవరెవరికి చెప్పావు?

298
00:21:59,235 --> 00:22:00,570
నా మీద అరవకు.

299
00:22:01,738 --> 00:22:03,239
నా మాట విను.

300
00:22:04,907 --> 00:22:06,159
కూర్చో.

301
00:22:17,003 --> 00:22:19,464
చూడు, ఐ లవ్ యూ. అది నీకు తెలుసు.

302
00:22:20,131 --> 00:22:22,216
మనం కలిసిన మొదటి రోజు నుండే
నిన్ను ప్రేమించటం మొదలుపెట్టాను...

303
00:22:22,300 --> 00:22:23,468
నిజంగానా?

304
00:22:23,968 --> 00:22:28,598
రేస్‌లో నీ మాటలు విన్నాను.
గర్ల్‌ఫ్రెండ్ లేదు? నేను ఖాళీ అని?

305
00:22:28,681 --> 00:22:33,186
అరే, అలాంటివి చెప్పాలి నేను.
ఇది నీకు తెలుసు. వాళ్లు చెప్పిస్తారని.

306
00:22:34,187 --> 00:22:35,354
అది నా బ్రాండ్.

307
00:22:39,317 --> 00:22:40,485
ఇక్కడికి రా.

308
00:22:42,111 --> 00:22:43,196
ఇక్కడికి రా.

309
00:22:49,577 --> 00:22:51,329
నీకు మళ్ళీ తిరగబెట్టటం గుర్తుందా?

310
00:22:52,205 --> 00:22:54,624
-హా.
-నేను ఉండి నీకు వీపు రాయడం?

311
00:22:55,416 --> 00:22:57,376
వాంతి చేసుకుంటే శుభ్రం చేయడం?

312
00:22:59,879 --> 00:23:02,006
నీకోసం నేనెప్పుడూ ఉంటాను.

313
00:23:07,345 --> 00:23:08,721
తెలుసు, బేబీ.

314
00:23:10,932 --> 00:23:12,433
దయచేసి.

315
00:23:13,976 --> 00:23:15,561
నువ్వేం చెప్పావో చెప్పు.

316
00:23:16,979 --> 00:23:19,107
ఎందుకంటే ప్రమాదంలో ఉన్నాం.
చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నాం.

317
00:23:26,447 --> 00:23:28,199
నేనెవరికీ చెప్పలేదు.

318
00:23:45,550 --> 00:23:48,136
ఏదేమైనా,
నువ్వు బట్టలు సర్దేసుకోవాలి,

319
00:23:48,219 --> 00:23:49,679
నీకు కావలసినవన్నీ సర్దుకో.

320
00:23:50,596 --> 00:23:51,848
ఎందుకు? ఎక్కడికి వెళుతున్నాం?

321
00:23:52,557 --> 00:23:54,308
నేను చూసుకుంటాను అంతా.

322
00:23:54,392 --> 00:23:56,352
కానీ అంతవరకూ,
నిన్ను సురక్షితమైన చోటులో ఉంచాలి,

323
00:23:56,435 --> 00:23:58,521
హోంలాండర్‌కి తెలిసేలోపు.

324
00:24:00,857 --> 00:24:02,191
ఐ లవ్ యూ.

325
00:24:07,864 --> 00:24:09,157
లవ్ యూ, టూ.

326
00:24:36,517 --> 00:24:38,352
మానిక్యూరా? పెడిక్యూరా? ప్రత్యేక డీల్.

327
00:24:45,109 --> 00:24:47,778
కామెడీ డాల్ఫిన్లు అహోయ్ అద్భుత ప్రదర్శన,

328
00:24:47,862 --> 00:24:50,448
ఈ రెండు తిక్క మొహాల ఆధ్వర్యంలో.

329
00:24:50,531 --> 00:24:53,492
ఈ శిశిరం, గుర్తుంచుకోండి డీప్‌గా వెళ్ళండి.

330
00:24:53,576 --> 00:24:54,493
ఓషన్‌లాండ్ వెళ్ళండి.

331
00:24:55,203 --> 00:24:56,746
సరే మరి, నీ సంగతి చూద్దాం.

332
00:25:11,677 --> 00:25:13,846
నువ్వు... ఇంతకుముందు బౌల్ చేసావా?

333
00:25:14,805 --> 00:25:17,141
హా, కొంచెం సాన పెట్టాలంతే. నువ్వు?

334
00:25:17,225 --> 00:25:20,811
హా, ఇక్కడే, చెప్పాలంటే. నా జీవితమంతా.

335
00:25:21,896 --> 00:25:24,774
మగవాళ్ళ బాత్రూంలో 14 ఏళ్ళప్పుడు ఆమీ
సీలర్‌తో తొలి ముద్దు ఇక్కడే పెట్టుకున్నా.

336
00:25:25,107 --> 00:25:26,442
అది చాలా రొమాంటిక్‌గా ఉందే.

337
00:25:27,109 --> 00:25:30,863
హా. ఆమె తన తొలిముద్దుని అలానే
ఊహించుకొని ఉంటుందిగా.

338
00:25:30,947 --> 00:25:33,241
మన్నించాలి, నీ తొలిముద్దు ఎక్కడ?

339
00:25:33,324 --> 00:25:35,868
ప్రామ్. చాలా బావుంది.

340
00:25:37,703 --> 00:25:41,707
ఆగు, సీనియర్ ప్రామ్?
అంటే, నీ తొలిముద్దు నీకు 18 ఏళ్ళప్పుడా?

341
00:25:43,960 --> 00:25:46,963
నువ్వు జోక్ చెయ్యట్లేదు,
పర్లేదు, బావుంది.

342
00:25:47,380 --> 00:25:51,050
హా, నా చిన్నతనమంతా
క్రీస్తు-ప్రభావంతో గడిచింది.

343
00:26:00,851 --> 00:26:02,228
తరువాత తను నన్నెప్పుడూ బయటికి పిలవలేదు.

344
00:26:02,311 --> 00:26:04,772
క్షమించు, ఏదో చెపుతున్నావు?

345
00:26:05,856 --> 00:26:07,775
లేదు, ప్రామ్ గురించి అంతే.

346
00:26:09,068 --> 00:26:11,529
-అదేంటి? నీ సంగతి...
-ఏంలేదు, అది... ఏదో తిక్క పని.

347
00:26:13,322 --> 00:26:15,658
నేను... నేను ఒకటి విసురుతాను.

348
00:26:21,914 --> 00:26:23,958
ఐతే, ఎలా... ట్రాన్స్‌లూసెంట్ ఎలాంటివాడు?

349
00:26:25,584 --> 00:26:27,295
మాట అంతగా మారుస్తున్నావు.

350
00:26:28,004 --> 00:26:29,422
హా, అవును. నన్ను క్షమించు.

351
00:26:29,505 --> 00:26:30,965
క్షమించు, హా, ఏదో ఆలోచన అడిగేసాను.

352
00:26:31,048 --> 00:26:32,383
చిన్నప్పుడు అతను నా ఫేవరేట్.

353
00:26:32,466 --> 00:26:35,219
మిగతావాళ్ళంతా వెధవలన్నావు,
అతను కూడా వెధవేనా?

354
00:26:36,220 --> 00:26:41,142
అంటే, అది, అతనికి ఏకాంతం లేదా వ్యక్తిగత
హద్దులు అంత బాగా తెలియవని మాత్రం చెప్తాను.

355
00:26:42,435 --> 00:26:47,189
అంతే తప్ప అతను చాలా వరకూ ఒంటరివాడు.
అతని ఖాళీ సమయమంతా అతని బిడ్డతో గడుపుతాడు.

356
00:26:50,401 --> 00:26:51,610
అతనికి బిడ్డున్నాడా?

357
00:26:51,694 --> 00:26:54,071
హా, పెళ్ళైన వెంటనే విడాకులనుకుంటాను.

358
00:26:54,155 --> 00:26:58,367
అతనికి 10 ఏళ్లు. హంటరో లేక
మావెరిక్ ఏదో అలాంటి పేరే తనది.

359
00:27:27,438 --> 00:27:28,439
పర్లేదు.

360
00:28:05,935 --> 00:28:08,062
సరే మరి, అందరూ, అంతా అయిపోయింది.

361
00:28:08,854 --> 00:28:11,482
ఇప్పడంతా సురక్షితమే. మీకేం కాదు.

362
00:28:12,775 --> 00:28:14,235
ధన్యవాదాలు, హోంలాండర్!

363
00:28:15,277 --> 00:28:16,362
లేదు, లేదు...

364
00:28:19,031 --> 00:28:23,160
అరే మీరంతా. మీరంతా. చాలా ధైర్యంగా ఉన్నారు.

365
00:28:23,744 --> 00:28:25,037
-బాగానే ఉన్నావా, తల్లి?
-హా.

366
00:28:25,121 --> 00:28:26,580
-హా? మంచిది.
-హా.

367
00:28:27,415 --> 00:28:29,583
మీరు చాలా బాగా చేసారు. అద్భుతం.

368
00:28:29,667 --> 00:28:30,626
వెళ్ళు, మేవ్!

369
00:28:30,709 --> 00:28:33,546
హే, క్వీన్ మేవ్‌కు అంతా
ఒక్కసారి చప్పట్లు కొట్టండి.

370
00:28:35,256 --> 00:28:36,549
మేవ్ నువ్వంటే మాకిష్టం.

371
00:28:40,010 --> 00:28:41,053
కెప్టెన్?

372
00:28:45,349 --> 00:28:46,434
ఆగు. ఆగు.

373
00:28:47,059 --> 00:28:49,437
శాంతించు, బాబు. కంగారుపడకు.

374
00:28:50,646 --> 00:28:52,690
అదిగో అలా. స్థిమితపడు.

375
00:29:04,452 --> 00:29:05,744
ఎటిసి!

376
00:29:07,621 --> 00:29:10,332
అది చచ్చింది. విమానం నడపగలవా?

377
00:29:11,792 --> 00:29:13,169
నడిపినా ప్రయోజనం లేదు.

378
00:29:16,755 --> 00:29:18,048
ఏం చేద్దాం మరి?

379
00:29:27,850 --> 00:29:29,560
అంతా బాగానే ఉందా? నేను... నేను అది...

380
00:29:29,643 --> 00:29:30,644
నీ సీట్లోకి వెళ్ళి కూర్చో.

381
00:29:30,728 --> 00:29:32,354
సరే మరి, అంతా. శాంతంగా ఉండండి.

382
00:29:32,438 --> 00:29:35,566
మీ సీట్లలో మీరు కూర్చోండి.
అంతా బాగానే ఉంది.

383
00:29:37,067 --> 00:29:38,694
అటు వెళ్ళాలి. విమానాన్ని పైకెత్తాలి.

384
00:29:38,777 --> 00:29:40,070
విమానం ఎత్తాలా?

385
00:29:40,154 --> 00:29:43,073
ఎలా? నుంచోవటానికి కింద అడుగు లేదు.
ఇదంతా గాలేగా.

386
00:29:43,157 --> 00:29:45,576
నాకు తెలియదు, అలానే ఎగరవెయ్యి, సరి చెయ్యి.

387
00:29:45,659 --> 00:29:48,996
అంత వేగంలో,
విమానం తల్లక్రిందులైనా ఆవుతుంది

388
00:29:49,079 --> 00:29:50,998
లేదా నేను చచ్చూరుకుంటాను...

389
00:29:56,629 --> 00:30:00,633
అది చాలా పెద్దది.
అంతా బాగానే ఉంది. కంగారుపడకండి.

390
00:30:04,595 --> 00:30:06,430
సరే. సరే.

391
00:30:06,514 --> 00:30:09,183
అందరినీ ఒక్కొక్కరుగా తీసుకెళ్ళు.
నేల మీదకి తీసుకెళ్లి దింపు...

392
00:30:09,808 --> 00:30:12,853
ఏంటి? 123 సార్లు తిరగాలా?

393
00:30:13,354 --> 00:30:15,064
మేవ్ ఆలోచించు.

394
00:30:18,859 --> 00:30:19,902
మన పనైపోయింది.

395
00:30:21,779 --> 00:30:23,405
-దయచేసి.
-అంతా బాగానే ఉంది, గయ్స్.

396
00:30:23,489 --> 00:30:25,616
అంతా బాగానే ఉంది. మనం బాగానే ఉన్నాం.

397
00:30:25,699 --> 00:30:26,784
ఆగు, మమ్మల్ని వదిలేసి వెళ్తున్నావా?

398
00:30:26,867 --> 00:30:29,119
లేదు. లేదు, లేదు, లేదు. వెనక వైపు
ఒకసారి చూడటానికి వెళ్తున్నాను.

399
00:30:31,372 --> 00:30:32,957
దేవుడా. వెళ్ళిపోతున్నావు.
వదిలేసి పోతున్నాడు.

400
00:30:33,040 --> 00:30:34,250
వెళ్ళట్లేదని చెపుతున్నాగా.

401
00:30:37,169 --> 00:30:39,547
హోంలాండర్, మమ్మల్ని కాపాడతావా?

402
00:30:39,964 --> 00:30:43,551
బంగారం, ఖచ్చితంగా
కాపాడతాను. నమ్ము.

403
00:30:43,634 --> 00:30:46,387
ఇక్కడున్న అందరినీ
కాపాడుతాను. కంగారుపడకండి.

404
00:30:48,138 --> 00:30:50,224
పర్లేదు. పర్లేదు.

405
00:30:51,725 --> 00:30:53,018
మేడమ్, శాంతించండి.

406
00:30:53,310 --> 00:30:55,020
మేవ్!

407
00:31:15,207 --> 00:31:19,128
సరే, మీరిద్దరూ. మాస్కులు తియ్యండి.
అరే.

408
00:31:20,546 --> 00:31:21,755
ఇప్పుడు, వీళ్ళని తీసుకెళ్ళు.

409
00:31:22,548 --> 00:31:23,799
దయచేసి మమ్మల్ని కాపాడు!

410
00:31:26,260 --> 00:31:27,595
-వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళు.
-లేదు, లేదు.

411
00:31:27,678 --> 00:31:28,929
-వీళ్ళిద్దరినే.
-వద్దు.

412
00:31:29,013 --> 00:31:31,890
ఏంటి, ప్రపంచానికి చెప్పటానికా
మిగతా అందరినీ చావుకి వదిలేసామని?

413
00:31:31,974 --> 00:31:34,226
-అరే!
-వద్దు, మేవ్, వద్దు...

414
00:31:34,310 --> 00:31:37,313
వెనక్కి వెళ్ళండి. అంతా, వెనక్కి వెళ్ళండి.

415
00:31:37,396 --> 00:31:40,232
మీరంతా వెనక్కి వెళ్ళకపోతే
లేజర్‌తో బూడిద చేస్తానందరినీ!

416
00:31:40,316 --> 00:31:42,234
అందరినీ బూడిద చేసేస్తాను!

417
00:31:43,319 --> 00:31:44,570
వెనక్కి వెళ్ళండి.

418
00:31:45,738 --> 00:31:46,864
పద.

419
00:31:48,324 --> 00:31:49,950
వద్దు, ఆగు, వద్దు!

420
00:31:50,034 --> 00:31:51,118
దయచేసి ఆగు!

421
00:31:51,201 --> 00:31:52,286
-క్షమించాలి.
-దయచేసి మమ్మల్ని తీసుకెళ్ళు.

422
00:31:52,369 --> 00:31:55,581
-దయచేసి!
-దయచేసి మమ్మల్ని వదిలెయ్యవద్దు, మేవ్.

423
00:31:55,664 --> 00:31:56,832
మేవ్!

424
00:31:57,583 --> 00:31:58,709
వాళ్ళతో కలిసి చావకు.

425
00:32:01,754 --> 00:32:02,838
దయచేసి.

426
00:32:02,921 --> 00:32:04,590
-నీకు ఏమైంది అసలు?
-మేవ్.

427
00:32:05,341 --> 00:32:07,843
నన్ను క్షమించు. నన్ను క్షమించు.

428
00:32:07,926 --> 00:32:11,013
దయచేసి తనని తీసుకెళ్ళు.
నా కూతురిని తీసుకెళ్లు!

429
00:32:12,931 --> 00:32:14,266
హోంలాండర్?

430
00:32:14,350 --> 00:32:17,311
ఆగు! దయచేసి! దయచేసి
తనని తీసుకెళ్ళు. తనని తీసుకెళ్ళు!

431
00:32:47,883 --> 00:32:49,385
ఇది చూడు.

432
00:32:50,052 --> 00:32:51,178
హత్య.

433
00:32:51,261 --> 00:32:52,596
చాలా త్వరగా వచ్చావు ఇక్కడికి.

434
00:32:52,680 --> 00:32:54,181
హా, స్క్వాకర్‌లో వచ్చింది.

435
00:32:54,264 --> 00:32:55,432
యాసేంటి అలా ఉంది?

436
00:32:55,849 --> 00:32:56,934
నీ యాసే అలా ఉందేంటి?

437
00:32:58,268 --> 00:32:59,853
ఇక్కడెప్పుడైనా తనని చూసావా?

438
00:33:01,313 --> 00:33:03,023
సంవత్సరం క్రీతం.

439
00:33:07,778 --> 00:33:08,987
అది గ్యాంగ్ గొడవ.

440
00:33:11,365 --> 00:33:12,616
గ్యాంగ్ గొడవ?

441
00:33:13,367 --> 00:33:14,868
అదెవరు చెప్పారు నీకు?

442
00:33:15,327 --> 00:33:16,578
నీతో వాదించను నేను.

443
00:33:17,705 --> 00:33:18,706
నేను పరిశీలిస్తాను.

444
00:33:20,416 --> 00:33:21,500
మన్నించాలి.

445
00:33:24,211 --> 00:33:25,462
చీర్స్, బాబు.

446
00:33:45,065 --> 00:33:48,360
ఏ-ట్రైన్ నన్ను వారం క్రితం చూసాడు.
నన్ను గుర్తుపడితే ఎలా?

447
00:33:48,444 --> 00:33:49,862
అతను నిన్ను చూడలేదు.

448
00:33:51,113 --> 00:33:53,490
విను, చెప్పటం చాలా తేలిక,
బుచర్. కానీ నాకోసం మనుషులున్నారు.

449
00:33:54,616 --> 00:33:55,701
నాకు లేరనేగా?

450
00:33:57,828 --> 00:34:02,374
చూడు, వాట్ గ్యాంగ్
గొడవలోకి సూప్‌ను పంపదు. సరేనా?

451
00:34:02,458 --> 00:34:03,751
అతను ఆ అమ్మాయి కోసం వచ్చాడు.

452
00:34:03,834 --> 00:34:05,544
హే, బాబు, ఆ అమ్మాయి ఎవరు?

453
00:34:06,462 --> 00:34:10,132
రాబర్టా చో. నలుగురు పిల్లల తల్లి,
మెక్సికన్ తిండి ఇష్టం,

454
00:34:10,215 --> 00:34:13,385
పసిఫిక్ పై నుండి వచ్చిన
అనేక మంది వలసదారులలో ఒకరు.

455
00:34:13,510 --> 00:34:14,803
మన అమ్మాయిలాగానా.

456
00:34:14,887 --> 00:34:16,847
ఏ-ట్రైన్, సెల్ఫీ ఇస్తావా?

457
00:34:21,518 --> 00:34:24,271
ఆ వెధవ మాన్‌హాటన్ అంతా
30 నిముషాలలో చుట్టేస్తాడు.

458
00:34:24,354 --> 00:34:26,356
మనకన్నా ముందే కనిపెట్టేస్తాడు.

459
00:34:26,440 --> 00:34:28,984
లేదు, కనిపెట్టడు. ఎక్కడికి
వెళ్ళిందో తెలుసు నాకు.

460
00:34:29,943 --> 00:34:31,737
పెన్ స్టేషన్.

461
00:34:32,321 --> 00:34:35,157
ఆమె ఏదో పని చేసుకొని బ్రతుకుతుంది.
ఇంటికి వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది.

462
00:34:39,745 --> 00:34:43,582
నేను ఎజీకియల్,
బిలీవ్ ఎక్స్‌పోలో నన్ను కలువండి.

463
00:34:43,665 --> 00:34:47,795
జూన్ 6 నుండి 10 వరకూ ఫెయిర్ గ్రౌండ్స్‌లో.
సమారిటన్ ఎంబ్రేస్ స్పాన్సర్ చేస్తుంది.

464
00:34:47,878 --> 00:34:49,671
సంగీతం ఉంటుంది.
మనం...

465
00:34:49,755 --> 00:34:50,589
ప్రార్థనలు చేస్తాం.

466
00:34:50,672 --> 00:34:51,632
ఫుడ్ ట్రక్స్

467
00:34:51,715 --> 00:34:54,009
కూడా ఉంటాయి, హా,

468
00:34:54,092 --> 00:34:56,261
క్రీస్తు.

469
00:34:56,345 --> 00:34:57,221
హోంలాండర్

470
00:34:57,304 --> 00:34:58,263
స్టార్‌లైట్

471
00:34:58,347 --> 00:34:59,556
ద సెవెన్ నుండి.

472
00:34:59,640 --> 00:35:01,266
-హే.
-తెలుసు.

473
00:35:01,350 --> 00:35:03,727
చూడు, నేను వాళ్ళని
మతం మార్చటానికి అలా చెయ్యట్లేదు.

474
00:35:03,811 --> 00:35:07,648
నేను అది... కుర్రవాళ్ళకి
పానెల్ చేస్తున్నాను. ఇంకా...

475
00:35:08,232 --> 00:35:10,901
నాకు ఇచ్చే రుసుంని
కోవెనంట్ హౌస్‌కి ఇచ్చేస్తున్నాను.

476
00:35:11,443 --> 00:35:15,030
సిటీలోకెల్లా మంచిదానివి నువ్వు.

477
00:35:15,113 --> 00:35:16,198
లేదు, నిజంగా.

478
00:35:16,281 --> 00:35:18,784
మిగతా మంచివాళ్ళంతా
ముసుగేసుకొని పడుకోవటమే.

479
00:35:19,701 --> 00:35:21,453
అంటే, అందుకే నేను చేస్తున్నాను.

480
00:35:21,537 --> 00:35:23,497
కక్ష కోసం, వ్యక్తిగత పేరు కోసం.

481
00:35:29,837 --> 00:35:32,923
-బాగానే ఉన్నావా?
-హా. హా. హా.

482
00:35:36,677 --> 00:35:38,929
నువ్వు కొంచెం...

483
00:35:39,638 --> 00:35:41,223
తెలియదు.

484
00:36:04,496 --> 00:36:05,497
సరే.

485
00:36:07,958 --> 00:36:10,961
నేను నిజం చెబుతాను. నిజం చెప్పాలంటే,

486
00:36:12,880 --> 00:36:14,548
నీమీద కొంచెం అనుమానంగా ఉంది.

487
00:36:15,883 --> 00:36:16,925
అవునా?

488
00:36:17,634 --> 00:36:21,138
హా. అంటే, నువ్వు
చాలా సార్లు బౌలింగ్ చేసానన్నావు

489
00:36:21,221 --> 00:36:23,891
ఇంకా నీకేమో, అదే, అతీతశక్తులున్నాయి.

490
00:36:23,974 --> 00:36:26,476
ఐనా కానీ నీ బౌలింగ్ చాలా ఘోరంగా ఉంది.

491
00:36:29,479 --> 00:36:30,856
ఏం జరుగుతుందో చెప్పనా?

492
00:36:30,939 --> 00:36:32,816
నువ్వు కావాలనే చేస్తున్నావు

493
00:36:32,900 --> 00:36:35,986
మొదటి డేట్‌లోనే అన్నీ చూపించకూడదు
అన్న వింత కారణంగా అనుకుంటాను.

494
00:36:38,530 --> 00:36:41,283
నా ఇగోని సంతృప్తిపరచటం ఆపి
నీ నైపుణ్యం చూపిస్తావా ఇంక.

495
00:36:50,834 --> 00:36:52,085
దేవుడా.

496
00:36:55,005 --> 00:36:56,506
ఇది స్ట్రైక్ అంటే.

497
00:36:59,009 --> 00:37:00,218
హా.

498
00:37:02,971 --> 00:37:03,972
8వ ఎవెన్యూ సబ్‌వే

499
00:37:04,056 --> 00:37:06,099
హా, చాలా బావుంది, బాబు.
బాగా చూసారు. ధన్యవాదాలు.

500
00:37:07,392 --> 00:37:09,019
అదే, మమ్మల్ని సస్పెన్స్‌లో పెట్టకు.

501
00:37:09,102 --> 00:37:12,481
సరే, డెషాన్ అన్న మా ఇంటి దగ్గరుండేవాడు,
ఇప్పుడు ప్యాకేజీలు డెలివరీ చేస్తున్నాడు.

502
00:37:12,564 --> 00:37:14,316
హా, నాకు కావాల్సిన సమాచారం కాదు.

503
00:37:14,399 --> 00:37:15,525
అతను ఎకౌంట్ నంబర్ చెక్ చేసాడు,

504
00:37:15,609 --> 00:37:18,820
వి ఉన్న బాక్స్ వచ్చేది
సమారిటన్ ఎంబ్రాస్ నుండి.

505
00:37:18,904 --> 00:37:20,238
ఎజీకియల్ సూప్ చారిటీనా?

506
00:37:21,573 --> 00:37:25,452
ఆ దేవుడిని-ప్రార్థించే,
సాగే వెధవకి దానికి సంబంధం ఏంటి?

507
00:37:25,535 --> 00:37:27,371
ఆ అమ్మాయి దొరికితే, మనకి తెలుస్తుంది.

508
00:37:28,288 --> 00:37:29,706
హా.

509
00:37:29,790 --> 00:37:33,043
సరే మరి, ప్లాట్‌ఫార్ములు. కింది అంతస్తు.
నేను పైకి వెళతాను.

510
00:37:33,126 --> 00:37:34,503
ఎవరికి కనిపించినా, ఫ్రెంచీకి చెప్పండి

511
00:37:34,586 --> 00:37:36,213
అక్కడే తనతో ఉండండి
మనం గ్యాస్ వాడేవరకూ సరేనా?

512
00:37:49,559 --> 00:37:50,727
మీరు ఇప్పుడే చూస్తుంటే కనుక...

513
00:37:50,811 --> 00:37:52,104
హ్యాక్ అయిన విమానం #37 మాయం అయ్యింది

514
00:37:52,187 --> 00:37:54,481
...అధికారులు రాడార్ ఇంకా శాటిలైట్
దృశ్య సంబంధాలని పూర్తి కోల్పోయారు

515
00:37:54,564 --> 00:37:57,651
హైజాక్ అయిన విమానం 37,
చాలా కష్టం అంటున్నారు.

516
00:37:57,734 --> 00:38:01,238
అట్లాంటిక్ పైన శోధక విమానాలు
ఆ విమానపు జాడ కోసం వెతుకుతున్నాయి.

517
00:38:53,331 --> 00:38:55,500
సంప్రదింపులు - డబ్ల్యూ. బుచర్

518
00:38:58,336 --> 00:39:00,422
టెక్ స్టోర్

519
00:39:06,219 --> 00:39:07,220
లేదు, లేదు.

520
00:39:11,058 --> 00:39:12,350
పర్లేదు.

521
00:39:13,185 --> 00:39:14,436
అది పోయింది.

522
00:39:16,104 --> 00:39:17,272
అది పోయింది, చూసావుగా?

523
00:39:19,316 --> 00:39:20,567
నిన్ను బాధ పెట్టటానికి రాలేదు.

524
00:39:27,449 --> 00:39:28,742
నీకు సంగీతం ఇష్టమా?

525
00:39:30,494 --> 00:39:31,703
నాకు కూడా ఇష్టమే.

526
00:39:34,831 --> 00:39:37,626
ఎవరికీ చెప్పని రహస్యం
నీకొకటి చెప్పనా?

527
00:39:44,216 --> 00:39:45,926
నా చిన్నప్పుడు,

528
00:39:46,718 --> 00:39:48,512
మా నాన్న, అమ్మ
దగ్గరినుండి నన్ను ఎత్తుకొచ్చాడు.

529
00:39:50,388 --> 00:39:53,391
మార్సే‌లో. అర్థరాత్రి,
ఇంట్లోకి వచ్చి పట్టుకెళ్ళాడు.

530
00:39:53,683 --> 00:39:57,229
చాలా ఏళ్లు తనే పెంచాడు.
హోటళ్ళలోనే బ్రతికాం.

531
00:39:58,688 --> 00:40:00,816
రాత్రుళ్లు చాలాసార్లు నడకకి వెళ్ళేవాళ్లం,

532
00:40:02,776 --> 00:40:05,112
గలాష్ తాగేవాళ్ళం, నేనంటే ఇష్టమనేవాడు.

533
00:40:05,195 --> 00:40:06,196
తరువాత...

534
00:40:13,036 --> 00:40:15,205
చాలాసార్లు పారిపోవటానికి చూసేవాడిని.

535
00:40:20,752 --> 00:40:23,130
బస్సుల మీద, రైళ్ళ మీద,

536
00:40:23,213 --> 00:40:25,757
మార్సేకు వెళ్ళటానికి చాలా చేసాను.

537
00:40:28,051 --> 00:40:29,636
అమ్మ దగ్గరికి.

538
00:40:31,638 --> 00:40:33,473
కానీ ప్రతిసారి, తనకి దొరికిపోయేవాడిని.

539
00:40:37,936 --> 00:40:40,188
అందుకే, ఇంటికి వెళ్ళాలన్న
కోరిక గురించి నాకు బాగా తెలుసు.

540
00:40:47,904 --> 00:40:49,906
చూసావా? నీ రహస్యం నాకు తెలుసు.

541
00:40:53,034 --> 00:40:54,578
నువ్వు చెడ్డదానివి కాదు.

542
00:40:56,621 --> 00:40:58,582
భయపడుతున్నావంతే.

543
00:41:06,339 --> 00:41:08,008
నా సహాయం తీసుకో.

544
00:41:33,366 --> 00:41:35,994
వద్దు, వద్దు, వద్దు, వద్దు, వద్దు.

545
00:41:36,119 --> 00:41:38,413
ఫ్రెంచీ, తనని చూసావా?
ఎటువైపు వెళ్ళింది?

546
00:41:38,496 --> 00:41:39,748
-తెలియదు.
-గ్యాస్ పెట్టటానికి చూసావా?

547
00:41:39,831 --> 00:41:40,957
-లేదు.
-ఎందుకని?

548
00:41:41,041 --> 00:41:42,334
సరైన పని అనిపించలేదు.

549
00:41:42,417 --> 00:41:43,793
సరైనది కాదని ప్లాన్ ప్రకారం చెయ్యలేదా?

550
00:41:43,877 --> 00:41:45,253
క్షమించు, సరేనా?

551
00:41:49,674 --> 00:41:53,178
షాన్ జకౌస్కీ. అంతర దేశ టీం.

552
00:41:53,929 --> 00:41:58,516
నాకు అతనంటే పిచ్చి,
చివరికి అతను నన్ను పార్టీకి పిలిచాడు.

553
00:41:58,600 --> 00:42:02,312
నా జుట్టు బావుంది, చేతులు
పట్టుకున్నాం, అంతా సరిగ్గా ఉంది.

554
00:42:02,395 --> 00:42:04,356
ఐతే, హఠాత్తుగా,
సీనియర్ ఒకడు షాన్‌ను తోసాడు,

555
00:42:04,439 --> 00:42:07,525
తరువాత అతనిని కొట్టాడు, ముందుకి వచ్చాను.

556
00:42:07,609 --> 00:42:08,818
నేను అతని నడ్డి మీద కొట్టాను.

557
00:42:09,611 --> 00:42:11,154
మంచి పని చేసావు.

558
00:42:11,238 --> 00:42:13,323
-షాన్ ఎలా కృతజ్ఞతలు చెప్పాడో తెలుసా?
-హా.

559
00:42:13,406 --> 00:42:16,493
మళ్లీ నాతో మాట్లాడలేదు. ఒక్కసారి కూడా.

560
00:42:18,203 --> 00:42:19,579
అప్పుడే నేను తెలుసుకున్నాను,

561
00:42:19,663 --> 00:42:21,957
నీకు నచ్చిన అబ్బాయి దగ్గర
నీ శక్తి చూపించకూడదని.

562
00:42:24,251 --> 00:42:28,129
అంటే, నిజంగా, షాన్ జకౌస్కీ పిరికి సన్నాసి.

563
00:42:33,426 --> 00:42:36,263
బౌలింగ్‌లో నిన్ను ఓడించటం
నిన్ను ఇబ్బంది పెట్టదా,

564
00:42:37,138 --> 00:42:39,307
అన్నింటిలో?

565
00:42:40,058 --> 00:42:41,851
నిన్ను అణిచేస్తే?

566
00:42:41,935 --> 00:42:43,478
ఓరి దేవుడా. భయపెట్టటమా లేక మాటిస్తున్నావా?

567
00:42:45,063 --> 00:42:47,232
లేదు. లేదు. నేను...

568
00:42:48,275 --> 00:42:51,820
అది చాలా బావుంటుంది. నిజమైన నువ్వు.

569
00:42:57,409 --> 00:42:59,035
కెచప్ అంటింది.

570
00:43:02,080 --> 00:43:04,040
ఏంటి? అది నీకు నచ్చలేదా?

571
00:43:04,666 --> 00:43:06,042
నీకు కుదరదా?

572
00:43:16,136 --> 00:43:18,513
నా స్థానం అట్టిపెట్టు. ఇప్పుడే వస్తాను.

573
00:43:53,048 --> 00:43:55,050
-హే.
-హే.

574
00:43:59,846 --> 00:44:01,306
ఐతే, అమ్మాయి ఎక్కడ, ఫ్రెంచీ?

575
00:44:01,389 --> 00:44:03,641
సైకో అమ్మాయిల
మంత్రగాడివయ్యావుగా హఠాత్తుగా.

576
00:44:03,725 --> 00:44:06,603
సబ్‌వేలో ఉండవచ్చు.
ఇంటికి వెళ్ళటానికి రైలు కోసం వెళ్ళిందేమో.

577
00:44:06,686 --> 00:44:08,271
హా? నీకు ఎంత తిక్కుంటే ఆ పని చేస్తావు?

578
00:44:08,355 --> 00:44:10,065
చెప్పలేం. నీ నోరు అదుపులో ఉన్నంతవరకూ?

579
00:44:10,148 --> 00:44:13,610
విను, తను తప్పించుకుంది, బాబు. ఆజ్ఞలవి.
మనం వాటిని పాటించాలంతే.

580
00:44:13,693 --> 00:44:15,195
మనం ప్రొఫెషనల్స్
ఒకరి మీద ఒకరు ఆధారపడున్నాం.

581
00:44:15,278 --> 00:44:18,448
కానీ నువ్వేదో వెర్రి బొహేమియన్
మత్తుమందు వేసినట్టున్నావు.

582
00:44:18,531 --> 00:44:21,618
హ్యూయీ కూడా, ఆ తెల్ల వెధవ కూడా
నీకన్నా మంచి ప్రొఫెషనల్‌గా ఉన్నాడు.

583
00:44:21,701 --> 00:44:24,287
నీలాంటి ఓసిడి గాడికి
అర్థమవ్వటం కష్టమని తెలుసు...

584
00:44:24,371 --> 00:44:26,039
సరే, ఐతే. అర్థమయ్యేలా చెప్పు, ఫ్రెంచీ.

585
00:44:26,122 --> 00:44:27,957
మలోరీ లాంప్‌లైటర్‌ని
అనుసరించమన్న రాత్రి ఏమైంది?

586
00:44:28,041 --> 00:44:29,125
ఇంక ఆపు.

587
00:44:29,209 --> 00:44:31,378
మలోరీ మన బాస్, బాబు. మనకి ఆజ్ఞలున్నాయి.

588
00:44:31,461 --> 00:44:34,297
మనం వాటిని పాటించాలి.

589
00:44:34,381 --> 00:44:37,509
నువ్వు లాంప్‌లైటర్‌ని అనుసరించాలి,
కానీ నువ్వతనిని వదిలేసావు.

590
00:44:37,592 --> 00:44:38,426
నాకు తెలియదు.

591
00:44:38,510 --> 00:44:40,970
లాంప్‌లైటర్ వెళ్లి
మలోరీ మనవళ్లని కాల్చేడు.

592
00:44:41,054 --> 00:44:41,971
నాకు తెలియదది.

593
00:44:42,055 --> 00:44:43,306
అది అనవసరం!

594
00:44:44,182 --> 00:44:46,142
నువ్వు ఆజ్ఞలు పాటించలేదు,
వాళ్ల ప్రాణాలు పోయాయి అంతే.

595
00:44:48,436 --> 00:44:51,189
హే, హే, హే. ఇంక ఆపండి. ఇంక ఆపండి.

596
00:44:51,272 --> 00:44:54,567
ఒకటి చెప్పనా? ఇంక చాలు, బుచర్.

597
00:44:55,443 --> 00:44:57,404
నీ కర్మ. నేను వెళ్లిపోతున్నాను.

598
00:44:58,613 --> 00:45:00,532
-పో.
-ఎంఎం, ఆగు.

599
00:45:02,367 --> 00:45:04,786
ఈసారి పరిస్థితులు వేరన్నావు.

600
00:45:04,869 --> 00:45:07,622
కానీ ఆ వెధవ ఇక్కడ
మళ్లీ అదే పనులు చేస్తున్నాడు.

601
00:45:07,705 --> 00:45:10,500
ఇంక మనమంతా మలోరీలాగానే మిగిలిపోతాం.

602
00:45:10,792 --> 00:45:12,419
-హా, పో.
-ఇంక ఆపిది.

603
00:45:12,502 --> 00:45:13,628
అరే.

604
00:45:13,711 --> 00:45:14,671
మీరిద్దరూ.

605
00:45:14,754 --> 00:45:16,756
-ఎంఎం?
-ఏంటి?

606
00:45:18,633 --> 00:45:20,176
స్పోర్టీ స్పైస్ ఏం చేస్తుంది?

607
00:45:20,260 --> 00:45:21,261
ఎవరు?

608
00:45:22,345 --> 00:45:24,514
స్పోర్టీ స్పైస్. తన సంగతేంటి?

609
00:45:28,309 --> 00:45:29,352
నాకు తెలియదు.

610
00:45:29,436 --> 00:45:33,231
అదే మరి. పోష్ సంగతేంటి?
తనేం చేస్తుందో నీకు తెలుసా?

611
00:45:33,314 --> 00:45:34,482
నాకు అర్థం కాలేదు.

612
00:45:34,566 --> 00:45:38,486
టేస్ట్ లేనివాళ్ళకి బట్టలు కుడుతుంది. కదా?
అంత మంచి వృద్ధి కూడా ఉండదు.

613
00:45:39,154 --> 00:45:41,698
ఇంకా బేబీ? తనేం చేస్తుందో తెలుసా?

614
00:45:42,157 --> 00:45:45,410
చావనీ. డైలీ మెయిల్‌లో
ఆరో పేజి కూడా చెయ్యట్లేదు.

615
00:45:45,493 --> 00:45:51,082
ఇంకా స్కేరీ స్పైస్, కోర్టు కేసులలో
సెక్స్ టేపులలో ఇరుక్కుపోయింది.

616
00:45:51,916 --> 00:45:54,294
ఇంకో ప్రక్క జింజర్,
మూడు ఆల్బంలు విడుదల చేసింది.

617
00:45:54,377 --> 00:45:59,132
పాషన్, స్కీజోఫోనిక్,
ఇంకా స్క్రీం ఇఫ్ యు వాంట్ టు గో ఫాస్టర్.

618
00:45:59,215 --> 00:46:01,676
నీ చెవుల నుండి రక్తం కారుతుంది వింటే.

619
00:46:02,469 --> 00:46:06,890
చూసావా, వాళ్ళు విడిపోతే,
వాళ్లు దమ్మిడీకి పనికిరారు అస్సలు.

620
00:46:07,474 --> 00:46:10,393
కానీ వాళ్ళు ఒక చోట ఉన్నారంటే,

621
00:46:12,270 --> 00:46:14,689
వాళ్లు స్పైస్ గర్ల్స్.

622
00:46:20,403 --> 00:46:22,655
స్పైస్ గర్ల్స్ గురించి
నీకిదంతా ఎలా తెలుసు?

623
00:46:23,907 --> 00:46:26,201
లేదు. పాయింట్ ఏంటంటే...

624
00:46:27,368 --> 00:46:30,163
మనం కూడా విడిపోతే అంతే సున్నా.

625
00:46:32,040 --> 00:46:33,791
మనం ఒకరికొకరం సహాయపడాలి.

626
00:46:33,875 --> 00:46:36,836
మనకి ఒకరికొకరం కావాలి,
లేదా మనమంతా మట్టి కొట్టుకుపోతాం.

627
00:46:37,754 --> 00:46:40,507
ఇప్పుడు, మీరు కొట్టుకు చావండి,

628
00:46:40,590 --> 00:46:41,799
నేను పట్టించుకోను.

629
00:46:41,883 --> 00:46:44,010
అది గతాన్ని మార్చలేదు.

630
00:46:50,934 --> 00:46:53,770
మనం వెళ్లి ఆ మడ్డిదాన్ని వెతికి వద్దాం,

631
00:46:53,853 --> 00:46:57,398
దానికి గ్యాస్ పెడదాం,
ఇక్కడినుండి వెళ్లిపోదాం?

632
00:47:02,612 --> 00:47:04,364
దేవుడా, అతని మాటలు చాలా చెత్తగా ఉంటాయి.

633
00:47:04,447 --> 00:47:05,615
ఇది మాత్రం పచ్చి నిజం.

634
00:47:10,620 --> 00:47:12,664
ఓషన్‌లాండ్
గో డీప్. గో ఓషన్‌లాండ్.

635
00:47:14,249 --> 00:47:15,792
హా, హా, హా, హా!

636
00:47:16,834 --> 00:47:19,254
అదే కరెక్ట్. తరువాతి స్టాప్,
అట్లాంటిక్ మహాసముద్రం.

637
00:47:20,046 --> 00:47:22,131
అదే కరెక్ట్. హా, అదే కరెక్ట్.

638
00:47:25,009 --> 00:47:26,010
ఏంటి?

639
00:47:27,220 --> 00:47:29,389
సరే. సరే.

640
00:47:29,806 --> 00:47:32,350
హా, అంటే, తప్పించుకోవటం
మీద శ్రద్ధ పెడదాం ముందు,

641
00:47:32,433 --> 00:47:35,353
తెలుసుగా, దీని గురించి తరువాత మాట్లాడదాం.

642
00:47:39,482 --> 00:47:41,276
నాకు కూడా ఇష్టమే. తెలుసుగా.

643
00:47:41,442 --> 00:47:43,570
కానీ దేనికి తొందరపడకూడదు.

644
00:47:46,864 --> 00:47:49,534
ఆగు, సీరియస్‌గా?
ఇది సరైన సమయం కాదు.

645
00:47:51,411 --> 00:47:52,662
ఇంకా, పరిస్థితులని తారుమారు చెయ్యకు.

646
00:47:54,706 --> 00:47:57,625
సరే, సరే. అది ముట్టుకుంటే,
నువ్వు నోరు మూస్తావా?

647
00:48:02,130 --> 00:48:03,840
ఓహ్, ఛా! ఛా, ఛా, ఛా.

648
00:48:04,299 --> 00:48:05,592
నీకు మాటిచ్చాను.

649
00:48:24,152 --> 00:48:25,111
34 పెన్ స్టేషన్

650
00:49:43,398 --> 00:49:45,108
-పద వెళదాం.
-వద్దు, ఫ్రెంచీ.

651
00:49:45,650 --> 00:49:47,193
మరిచిపో బాబు. ఆమె కథ ముగిసింది.

652
00:49:51,280 --> 00:49:55,326
ఏ-ట్రైన్! అక్కడ చూడు!
చూడండి, అంతా! ఏ-ట్రైన్ ఉన్నాడక్కడ!

653
00:49:55,410 --> 00:49:56,994
-ఏ-ట్రైన్ ఇక్కడున్నడా?
-చూడండి, ఏ-ట్రైన్.

654
00:49:59,914 --> 00:50:01,165
హే.

655
00:50:06,879 --> 00:50:09,257
ఏ-ట్రైన్, హే. హే, సెల్ఫీ ఇస్తావా?

656
00:50:09,340 --> 00:50:12,218
తప్పకుండా, తప్పకుండా. ఒకటి రెండు ఇవ్వగలను.

657
00:50:40,413 --> 00:50:43,332
లేదు. తనతో మాట్లాడనివ్వు.

658
00:50:43,416 --> 00:50:44,876
పిచ్చి మాటలు మాట్లాడకు.

659
00:50:47,128 --> 00:50:48,671
తను స్పైస్ గర్ల్ అయ్యుంటే?

660
00:50:51,048 --> 00:50:52,091
ఫ్రెంచీ.

661
00:51:14,071 --> 00:51:15,656
నిన్ను నేను ఇంటికి తీసుకెళతాను.

662
00:51:51,651 --> 00:51:53,277
తను స్పైస్ గర్ల్ కాదు.

663
00:52:38,906 --> 00:52:40,283
ఫ్లైట్ 37 హైజాక్ అయ్యింది:
హోంలాండర్ మాట్లాడాడు

664
00:52:40,366 --> 00:52:42,451
ఇంకోసారి, అంతరసముద్ర
విమానం 37 ఘోరమైన శిథిలాలు

665
00:52:42,535 --> 00:52:44,871
మళ్లీ ఒడ్డుకు కొట్టుకు వస్తున్నాయి.

666
00:52:44,954 --> 00:52:47,415
విమానంలోని ప్రతి పాసింజర్ చచ్చిపోయాడు.

667
00:52:50,710 --> 00:52:51,919
వాళ్లు చనిపోయుండాల్సింది కాదు.

668
00:52:53,796 --> 00:52:56,507
హోంలాండర్ ఇంకా
క్వీన్ మేవ్ ఇక్కడ సీన్‌లో ఉన్నారు.

669
00:52:56,591 --> 00:52:57,758
ఏమన్నా చెప్తారా?

670
00:53:00,136 --> 00:53:01,804
వాళ్ళు చనిపోయుండాల్సింది కాదు.

671
00:53:02,305 --> 00:53:05,057
మేము విమానం పడిన తరువాత
మూడు నిముషాలకి వచ్చాం.

672
00:53:06,017 --> 00:53:07,143
ఎందుకని?

673
00:53:08,311 --> 00:53:10,479
మేము అధికార యంత్రాంగంలో లేము కనుక.

674
00:53:12,064 --> 00:53:15,318
నోరాడ్ జెట్లు పంపించే
ముందు మాకు కాల్ చేసుంటే,

675
00:53:15,401 --> 00:53:16,861
మేము వాళ్లని కాపాడుండేవాళ్లం.

676
00:53:16,944 --> 00:53:20,740
నూట ఇరవై-మూడు మంది స్త్రీలు,
పురుషులు ఇంకా పిల్లలు.

677
00:53:20,823 --> 00:53:22,658
మన్నించాలి.

678
00:53:28,122 --> 00:53:31,751
కానీ మమ్మల్ని మిలటరీలో పెట్టుకొని ఉంటే,

679
00:53:32,376 --> 00:53:36,964
ఇలా ఎన్నటికీ జరగదు.
ఇది మీ అందరికీ నేనిస్తున్న మాట.

680
00:53:39,091 --> 00:53:40,217
కదా, మేవ్?

681
00:53:43,429 --> 00:53:44,889
మీ రాజకీయ నాయకులతో మాట్లాడండి.

682
00:53:44,972 --> 00:53:47,099
వాళ్లతో మాట్లాడండి.
వాళ్లు జనాల మాట వింటారు.

683
00:53:47,183 --> 00:53:48,893
ఇంక అందరం కలిసికట్టుగా,

684
00:53:49,602 --> 00:53:50,895
కలిసికట్టుగా, మనం ఇలా జరగకుండా

685
00:53:50,978 --> 00:53:55,399
ఉండేలా, మన దేశానికి ఇంకెన్నడూ
నష్టం వాటిల్లకుండా ఉండేలా చూసుకుందాం!

686
00:53:59,779 --> 00:54:02,698
దేవుడి దయ ఉండుగాక. అమెరికా
మీద దేవుని దయ ఉండుగాక.

687
00:54:03,115 --> 00:54:04,742
హోంలాండర్ మీ మాటలు అర్థం చేసుకున్నాం!

688
00:54:04,825 --> 00:54:08,079
నేను మీ మాటలు అర్ఖం చేసుకున్నాను,
సోదరా! అర్థం చేసుకున్నాను!

689
00:54:08,996 --> 00:54:11,499
ప్రపంచం కూడా తెలుసుకుంటుంది!

690
00:54:12,333 --> 00:54:15,002
ఇంకా అతి త్వరలో, మిత్రమా,

691
00:54:15,086 --> 00:54:18,547
మనకి ఈ నష్టం కలిగించనవారు
మన కోపాన్ని చవిచూస్తారు!

692
00:54:20,007 --> 00:54:24,178
హోంలాండర్! హోంలాండర్! హోంలాండర్!

693
00:54:24,261 --> 00:54:27,139
హోంలాండర్! హోంలాండర్! హోంలాండర్!

694
00:54:27,223 --> 00:54:31,894
హోంలాండర్! హోంలాండర్! హోంలాండర్!

