﻿1
00:00:30,573 --> 00:00:34,076
లార్జ్ పైన్స్
జూనిపర్

2
00:00:41,959 --> 00:00:45,212
యెల్లో రాంచ్

3
00:01:22,541 --> 00:01:25,795
టోని సిసిరోస్
ఫ్యామిలీ రెస్టారెంట్

4
00:01:40,518 --> 00:01:44,021
ది బాయ్స్

5
00:01:45,272 --> 00:01:48,484
టోనీ సిసిరోస్‌లో
ఎండ్‌లెస్ పాస్తా వీక్‌కు స్వాగతం.

6
00:01:49,944 --> 00:01:52,446
-నేను ఎక్కడ ఉన్నాను?
-టోనీ సిసిరోస్‌లో.

7
00:01:52,530 --> 00:01:56,242
-లేదు, అసలు ఏ నగరంలో ఉన్నాను?
-ఫోర్ట్ వేన్.

8
00:01:56,909 --> 00:02:00,663
అబ్బా. నీ దగ్గర కాగితం ముక్క ఉందా,
ఏదైనా నేను వ్రాయగలిగింది?

9
00:02:00,746 --> 00:02:01,956
పెన్? ఏదైనా సరే.

10
00:02:02,498 --> 00:02:03,833
అబ్బా!

11
00:02:07,586 --> 00:02:08,879
యెల్లో

12
00:02:09,463 --> 00:02:12,925
...గత నెల నెలకొల్పిన
అత్యధికం కంటే పది శాతం తక్కువ.

13
00:02:13,008 --> 00:02:14,927
ప్రభుత్వాధికారులు విలియం బుచర్ కోసం...

14
00:02:15,010 --> 00:02:16,136
యెల్లో రాంచ్ హౌస్
సూర్యుడికి 60° సె.

15
00:02:16,220 --> 00:02:18,472
...బహుళరాష్ట్ర అన్వేషణ ప్రారంభించారు,

16
00:02:18,556 --> 00:02:22,142
అతనిపై వాట్ ఉపాధ్యక్షులు
మాడలిన్ స్టిల్‌వెల్‌ను హత్య చేసి,

17
00:02:22,226 --> 00:02:25,396
ఆమె చంటి బాబుకు
అపాయం తలపెట్టినట్టు ఆరోపణ, థియాడోర్.

18
00:02:25,479 --> 00:02:30,609
న్యాయ పరిరక్షణాధికారులు ఒక హాట్‌లైన్‌ను
ఏర్పాటు చేశారు, ఎవరైనా ముందుకు వచ్చి

19
00:02:30,693 --> 00:02:34,405
అనుమానితుడి ఆచూకీకి సంబంధించిన
సమాచారం అందించాలని కోరుతూ...

20
00:02:38,492 --> 00:02:39,827
లార్జ్ పైన్స్ జూనిపర్
కాలిబాట లేదు సెయింట్ అగస్టీన్ గ్లాస్

21
00:02:55,718 --> 00:02:56,927
అబ్బాయి అమ్మాయి అబ్బాయి

22
00:02:58,387 --> 00:03:00,681
అబ్బాయి. అమ్మాయి.

23
00:03:02,016 --> 00:03:03,684
అబ్బాయి.

24
00:03:07,271 --> 00:03:08,689
నన్ను క్షమించు.

25
00:03:09,273 --> 00:03:10,983
నాకు అర్థంకావడం లేదు.

26
00:03:19,199 --> 00:03:21,702
-సరే, నేను వెళుతున్నాను.
-ఎక్కడికి?

27
00:03:21,785 --> 00:03:24,538
-పరిచయస్తులను కలవడానికి వెళుతున్నాను.
-ఎవరు?

28
00:03:24,914 --> 00:03:27,750
ఈ వెధవ సూప్ ఉగ్రవాదిని
కనుగొనడంలో సహాయపడేవాళ్ళు.

29
00:03:27,833 --> 00:03:30,753
ఆ పరిచయస్తులు ఎవరు?
వాళ్ళ అసలు పేరు ఏంటి?

30
00:03:33,088 --> 00:03:34,214
నీకది నచ్చుతుంది.

31
00:03:34,298 --> 00:03:38,052
లేదు, నచ్చదు! నాకు అది నచ్చదు!
నాకది ఎప్పటికీ నచ్చదు! ఎప్పటికీ!

32
00:03:41,013 --> 00:03:43,140
-గుర్తుంచుకుంటాను.
-అతని అచూకీ లేదు.

33
00:03:43,223 --> 00:03:46,477
మనల్ని చనిపోడానికి వదిలేసి,
ఏం జరగనట్టు వ్యవహరిస్తున్నాడా?

34
00:03:52,816 --> 00:03:55,611
నువ్వు సరిగ్గా చెప్పావు. నన్ను క్షమించు.

35
00:03:56,612 --> 00:03:59,114
వీరిలో తమని
కాపాడుకునే తెలివుందని నమ్మాను

36
00:03:59,198 --> 00:04:01,909
క్షమించు,
అది వారు ఇదివరకు వందసార్లు చేశారు.

37
00:04:01,992 --> 00:04:03,327
నువ్వెక్కడ ఉండిపోయావు?

38
00:04:03,410 --> 00:04:05,704
నిజానికి, నేను అతనిని రమ్మని పిలిచాను.

39
00:04:05,788 --> 00:04:07,873
అతను మాడలిన్ స్టిల్‌వెల్‌ను పేల్చేశాడు!

40
00:04:07,957 --> 00:04:11,502
చెప్పానుగా, నేను ఆమెను
పేల్చే సమయానికి అప్పటికే చనిపోయింది.

41
00:04:11,585 --> 00:04:13,754
అవునా. చాలా బాగుంది.

42
00:04:14,213 --> 00:04:16,924
పూర్తిగా. మనం ఇది
సాధారణమే అన్నట్టు ఉంటామా?

43
00:04:17,007 --> 00:04:18,842
మనం దద్దమ్మలమా?

44
00:04:29,478 --> 00:04:31,438
వాళ్ళు ఇంకెవరిని అనుసరిస్తారు?

45
00:04:39,613 --> 00:04:40,447
సరే.

46
00:04:55,921 --> 00:04:58,215
హే, నీకు తెలుసా, మా నాన్న దగ్గర

47
00:04:58,757 --> 00:05:01,010
1956 ప్రపంచ సీరీస్‌లో ఆడిన బాల్ ఉంది.

48
00:05:01,093 --> 00:05:05,389
దానిపై గేమ్ 5లో ప్రత్యర్థికి ఒక్క పరుగూ
ఇవ్వని డాన్ లార్సన్ స్వయంగా సంతకం చేశాడు.

49
00:05:05,472 --> 00:05:07,433
-నిజంగానా?
-చాలా బాగుంది, కదా?

50
00:05:11,061 --> 00:05:14,815
ఫర్వాలేదు... నువ్వు...
నువ్వు తరువాతది పట్టుకుంటావు.

51
00:05:15,691 --> 00:05:16,525
-సరే.
-అవును.

52
00:05:16,608 --> 00:05:18,402
అవును, తరువాతది పట్టుకుంటాను.

53
00:05:22,406 --> 00:05:24,908
సరే, రాయన్,

54
00:05:25,784 --> 00:05:28,203
-నీ శక్తులను ఉపయోగించు.
-అంటే ఏంటి?

55
00:05:35,544 --> 00:05:36,754
నేను అది చేయలేను.

56
00:05:36,837 --> 00:05:39,882
నువ్వు చేయగలవు! నువ్వు నా కొడుకువి.

57
00:05:42,468 --> 00:05:46,430
నీ సామర్థ్యం ఏమీటో నీకు ఎవరైనా చెప్పారా?

58
00:05:48,474 --> 00:05:49,516
లేదు.

59
00:05:52,352 --> 00:05:54,772
సరే, నువ్వు తెలుసుకోవాల్సిన సమయమొచ్చింది.

60
00:05:54,855 --> 00:05:57,191
హే, రాయన్, ఇక రా. గణితం చేయాల్సిన సమయం.

61
00:05:57,274 --> 00:05:59,401
నీ వర్క్‌బుక్‌లో 12, 13 పాఠాలు.

62
00:06:00,027 --> 00:06:03,113
సరే. గణితం. అవును.
నన్ను క్షమించు, మర్చిపోయాను.

63
00:06:03,197 --> 00:06:06,075
అది నీకిష్టమైనది.
ఒక్క నిమిషంలో వస్తాను, సరేనా?

64
00:06:06,992 --> 00:06:10,412
వాడి వయసులో నేను
ధ్వని అవరోధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాను.

65
00:06:11,371 --> 00:06:13,207
వాడు కనీసం బంతిని వేగంగానూ విసరలేడు.

66
00:06:13,290 --> 00:06:17,461
మనం వాడు తన చిన్నతనం వీలైనంత
మామూలుగా గడిపితే మంచిదని అనుకున్నాము.

67
00:06:17,795 --> 00:06:21,006
"మనమా"? "మనం" ఎవరు?

68
00:06:21,090 --> 00:06:24,051
చూడు, నా బిడ్డ
సాధారంణంగా ఉండాలని అనుకుంటున్నాను.

69
00:06:25,719 --> 00:06:28,055
అయితే, నేను ఇక్కడకు రావడం మంచిదైంది.

70
00:06:29,098 --> 00:06:32,142
ఎందుకంటే నా కొడుకు ఈ భూమిపైన
సాధారణ చిన్నపిల్లాడిగా

71
00:06:32,226 --> 00:06:33,560
పెరగటం కుదరదు.

72
00:06:33,644 --> 00:06:35,854
నువ్వు ఎన్నాళ్ళు ఉండాలనుకుంటున్నావు?

73
00:06:37,731 --> 00:06:40,567
బెక్కా, మనం ఒక ఒప్పందం చేసుకున్నాము.

74
00:06:40,651 --> 00:06:43,904
ఆ ఒప్పందం ఒక స్వేచ్ఛా పక్షిలా

75
00:06:43,987 --> 00:06:46,740
సజీవంగా, చక్కగా, చుట్టూ తిరుగుతుంది,

76
00:06:46,824 --> 00:06:51,787
అందుకే, మనం మర్యాదగా
వ్యవహరించడానికి ప్రయత్నిద్దాము, సరేనా?

77
00:06:58,085 --> 00:06:59,545
సామూహిక చర్చి

78
00:07:02,422 --> 00:07:05,342
నన్ను నేను అది లేకుండా ఊహించుకోలేనిది?
నా ప్రతిభ

79
00:07:10,722 --> 00:07:12,474
నేను వాటిని సరిగా వ్రాశానా?

80
00:07:14,935 --> 00:07:19,731
లేదు... తప్పు లేదా
ఒప్పు జవాబు లాంటిది ఏం లేదు.

81
00:07:23,902 --> 00:07:25,237
ఇక్కడ ఏం వేయలేదు?

82
00:07:29,408 --> 00:07:30,993
డీప్

83
00:07:34,246 --> 00:07:37,791
డీప్, నీతో నువ్వే నిజాయితీగా లేకపోతే,
సెవెన్‌లో నిన్ను తిరిగి

84
00:07:37,875 --> 00:07:39,918
స్వాగతించాలని ఎలా అనుకుంటున్నావు?

85
00:07:40,002 --> 00:07:44,256
కెరల్, నేను నిజాయితీగా చెప్పాలంటే,
నీకు అసలు ఏంకావాలో నాకు తెలియదు.

86
00:07:46,800 --> 00:07:49,803
హేయ్, ఎలా కొనసాగుతోంది?

87
00:07:50,762 --> 00:07:52,431
నేను ఒకసారి మాట్లాడవచ్చా?

88
00:07:54,725 --> 00:07:57,603
ప్రతికూలంగా ఉండాలని కాదు,
కానీ ఇతని కార్యచరణ దృక్పథం

89
00:07:57,686 --> 00:07:59,521
క్రియాత్మకంగా ఉనికిలో లేదు.

90
00:08:00,355 --> 00:08:02,149
ఇందులో ఏ అవకాశం ఉందనుకోను.

91
00:08:03,442 --> 00:08:04,359
అది నాకొదిలేయ్.

92
00:08:06,653 --> 00:08:10,157
నువ్వు అణిచివేసిన శక్తి చేత
నిరోధించబడుతున్నావు అంతే.

93
00:08:10,240 --> 00:08:12,117
విషయాలను తిరిగి రూపకల్పన చేయాలి.

94
00:08:13,327 --> 00:08:14,453
ఏంటవి? పుట్టగొడుగులా?

95
00:08:14,536 --> 00:08:17,331
క్రితం సారి పుట్టగొడుగులు
గూ గూ డాల్స్ కచేరీలో

96
00:08:17,414 --> 00:08:20,209
ఒక ఒబర్లిన్ నుంచి
రాజ్యాంగ శాస్త్ర అమ్మాయితో తిన్నాను.

97
00:08:21,877 --> 00:08:24,671
అవి ఎక్కువ మత్తునిస్తాయని అనుకుంటున్నాను.

98
00:08:34,640 --> 00:08:36,725
ఆగు, నువ్వు ఏమీ తాగవా?

99
00:08:36,808 --> 00:08:39,519
లేదు, డీప్, ఇది నీ ప్రయాణం.

100
00:08:43,815 --> 00:08:45,442
అమ్మాయిలు ఇది పూర్తిచేశారు

101
00:08:45,525 --> 00:08:47,819
సెవెన్‌లో ఎవరు
అమ్మాయిల శక్తిని శక్తివంతం చేస్తున్నారు?

102
00:08:47,903 --> 00:08:53,075
చూస్తుండండి డబ్ల్యూడీసీఎస్, క్లీవ్‌ల్యాండ్
స్థానిక వార్తల మొదటి, ఉత్తమ మూలం.

103
00:08:53,158 --> 00:08:55,661
దయచేసి నిశ్శబ్దం. మళ్ళీ ప్రారంభం.
ఘంట మోగగానే.

104
00:08:55,744 --> 00:08:57,329
-రోలింగ్.
-ఎక్కడ ప్రారంభించాలి?

105
00:08:57,412 --> 00:09:00,082
సెవెన్ కొత్త సభ్యురాలిని
కలవడానికి సిద్ధమేనా?

106
00:09:00,165 --> 00:09:02,084
ఇక్కడే మొదట చూడండి, డబ్ల్యూఎఫ్ఏకే.

107
00:09:02,167 --> 00:09:03,752
కేఎంఎఫ్‌టి. డబ్ల్యూడీసీఎస్

108
00:09:03,835 --> 00:09:05,379
-కట్.
-ఇంకా రికార్డవుతుంది.

109
00:09:05,462 --> 00:09:08,966
ఆమె సెవెన్ కొత్త సభ్యురాలు
ఇంకా అమెరికాను కుదిపేస్తుంది.

110
00:09:09,049 --> 00:09:12,636
పోర్ట్‌ల్యాండ్ నుండి సియాటెల్‌కు, తరువాత
ఏం రాబోతుందో చూస్తుండండి, కేఎంఎఫ్‌టి.

111
00:09:14,096 --> 00:09:15,597
అద్భుతం.

112
00:09:15,681 --> 00:09:18,392
నీకు విరామం కావాలా లేక
చివరివరకు కొనసాగిద్దామా?

113
00:09:18,475 --> 00:09:19,601
చివరివరకు కొనసాగిద్దాము.

114
00:09:20,102 --> 00:09:21,186
ఇటు వైపు తిరుగు!

115
00:09:22,521 --> 00:09:25,148
ఇటు. మమ్మల్ని
ఒక ఫోటో తీసుకోనివ్వు. మనోహరి!

116
00:09:27,484 --> 00:09:28,986
స్టార్మ్‌ఫ్రంట్, ఇక్కడ!

117
00:09:29,069 --> 00:09:30,904
స్టార్మ్‌ఫ్రంట్, నీ శక్తి చూపించు.

118
00:09:35,701 --> 00:09:38,120
సరే, అమ్మాయిలు, మనము ఈ రోజు చాలా బిజీ.

119
00:09:38,203 --> 00:09:41,832
మధ్యాహ్నం వరకు దేశీ ఛానెళ్ళు, ఒక్కో
దానికి పది నిమిషాలు, 2:00 వరకు విదేశీవి.

120
00:09:41,915 --> 00:09:44,751
రౌండ్ టేబుల్ సమావేశాలు 4:00 వరకు.
ఇంటర్వ్యూలు 6:00 వరకు...

121
00:09:44,835 --> 00:09:48,672
దేవుడా, ఇంతకంటే ఎక్కువ
ఉత్సుకత ఉంటే తన నడ్డి పేలిపోతుంది.

122
00:09:52,050 --> 00:09:53,218
హలో?

123
00:09:57,889 --> 00:09:58,974
ఏంటి?

124
00:09:59,891 --> 00:10:00,976
ఎప్పుడు?

125
00:10:04,730 --> 00:10:06,481
సరే, ధన్యవాదాలు.

126
00:10:06,565 --> 00:10:10,861
మనం సానుకూలంగా, స్త్రీవాదంతో, సాలోచనతో
కానీ ప్రోత్సాహకరంగా... ఎక్కడికి? ఏంటి?

127
00:10:10,944 --> 00:10:12,529
-నేనెళ్ళాలి.
-ఏంటి? కుదరదు!

128
00:10:12,904 --> 00:10:14,656
క్షమించు. కుటుంబ అత్యవసరం.

129
00:10:14,740 --> 00:10:16,074
అంతా బాగానే ఉందా?

130
00:10:16,158 --> 00:10:18,076
సెవెన్‌లో ఎప్పుడూ ముగ్గురు మహిళలు లేరు.

131
00:10:18,160 --> 00:10:20,829
ఇది ఆ తరుణం. అమ్మాయిలు అది చేయాలి!
నువ్వు...

132
00:10:23,623 --> 00:10:25,667
నాదీ కుటుంబ అత్యవసర పరిస్థితి.

133
00:10:26,960 --> 00:10:29,087
ప్రకటన గ్రంథం నుండి చదువుతున్నాను,

134
00:10:29,171 --> 00:10:32,174
"ఆయన వారి కన్నుల
ప్రతి బాష్పబిందువును తుడిచివేయును,

135
00:10:32,257 --> 00:10:34,176
"మరణము ఇక ఉండదు."

136
00:10:34,259 --> 00:10:36,678
ఈ రోజు సుసన్ రేనర్‌కు వీడ్కోలు పలుకుదాం,

137
00:10:36,762 --> 00:10:40,682
ఆమె శరీరం విశ్రమించినా,
ఆమె ఆత్మ అనంతకాలం సజీవంగా ఉంటుంది.

138
00:10:40,766 --> 00:10:45,354
మరియు ఏదో ఒక రోజు, మీరు సూసన్‌ను
ఆనందంగా, అలాగే బాధగా గుర్తు చేసుకుంటారు.

139
00:10:45,437 --> 00:10:49,149
ఎప్పటికీ సుఖదుఃఖాలు రెండూ ఉంటాయి.

140
00:10:49,232 --> 00:10:54,780
అది అనుభవించడంలో సాయం చేయడానికి నీకు
నీ కుటుంబం ఇంకా స్నేహితులు ఉన్నారు.

141
00:10:54,863 --> 00:10:57,491
దేవుని స్తుతించుడి. ఆమెన్.

142
00:11:07,042 --> 00:11:09,795
నువ్వు నన్ను
ఆశ్యర్యపరచగలవని అనుకుంటున్నావా?

143
00:11:09,878 --> 00:11:12,047
వాస్తవానికి ఇది నేను నేర్పించాను.

144
00:11:15,509 --> 00:11:17,135
హలో, గ్రేస్.

145
00:11:17,636 --> 00:11:19,888
నాకు మళ్ళీ కనిపించనని మాట ఇచ్చావు.

146
00:11:21,056 --> 00:11:24,726
నేను నీ ఇంటికి మళ్ళీ రానని మాట ఇచ్చాను.

147
00:11:27,187 --> 00:11:29,856
సూక్ష్మమైనదే కానీ ముఖ్యమైన వ్యత్యాసం.

148
00:11:29,940 --> 00:11:32,401
నువ్వు ఆ పూలతో పళ్ళబుట్ట పంపించావనుకుంటా?

149
00:11:32,484 --> 00:11:36,655
వైట్ చాక్లెట్‌లో ముంచిన అనాస పావురం
బొమ్మలతో డీలక్స్ బంధువియోగ పూలగుత్తి.

150
00:11:37,155 --> 00:11:38,824
రేనర్‌కు అది నచ్చి ఉంటుంది.

151
00:11:42,411 --> 00:11:43,537
ఓయ్, ఎక్కడికి వెళుతున్నావు?

152
00:11:43,620 --> 00:11:47,374
పొరుగున ఉన్న చర్చిలో
దాదాపు రెండు డజన్ల పోలీసులు ఉన్నారు.

153
00:11:47,457 --> 00:11:50,085
నిన్ను మాడలిన్ స్టిల్‌వెల్
హత్యకు అదుపులోకి తీసుకోడానికి.

154
00:11:50,168 --> 00:11:52,712
ఊరుకో, గ్రేస్.
నేనది చేశానని నమ్ముతున్నావా?

155
00:11:52,796 --> 00:11:54,506
దానికి సమాధానం చెప్పాలంటావా?

156
00:11:55,590 --> 00:11:57,384
గ్రేస్, రేనర్‌ను ఎవరు చంపారో నాకు తెలుసు.

157
00:12:02,639 --> 00:12:03,473
ఎవరు?

158
00:12:04,182 --> 00:12:08,311
సరే. అంటే, చూడు, దానికి ప్రత్యేకించి,
వాస్తవంగా నా దగ్గర సమాధానం లేదు,

159
00:12:08,395 --> 00:12:10,397
కానీ అది ఎలా పొందాలో నాకు తెలుసు.

160
00:12:11,189 --> 00:12:14,317
వాట్ దేనికో చాలా దగ్గరవడానికి
ఆమెను చంపేశాడని అనుకుంటున్నాము.

161
00:12:14,401 --> 00:12:15,485
దేనికి దగ్గరవ్వడానికి?

162
00:12:15,569 --> 00:12:17,571
కొన్ని రాత్రులకు ముందు,
జెర్సీలోకి సూప్ ఉగ్రవాది

163
00:12:17,654 --> 00:12:20,115
అక్రమ రవాణాకు సంబంధించినది.
మనం అక్కడే మొదలుపెడతాం.

164
00:12:20,198 --> 00:12:23,869
నిజంగా, అది బొద్దింకను
బొద్దింకలా ఉండవద్దని అడగడమే.

165
00:12:23,952 --> 00:12:25,162
అది నీ స్వభావం అంతే.

166
00:12:25,245 --> 00:12:26,997
ఆమె నీకు ఏంటో నాకు తెలుసు.

167
00:12:27,080 --> 00:12:30,500
మనమీ ఉగ్రవాదిని కనుగొంటే,
ఆమెను ఎవరు చంపారో తెలుసుకోవచ్చు.

168
00:12:30,584 --> 00:12:32,127
నేను తిరిగి ఆ జట్టులో చేరను.

169
00:12:32,210 --> 00:12:34,963
ఒకవేళ నేను చేరితే,
నీకది ఇబ్బందిగా మారకూడదు.

170
00:12:35,046 --> 00:12:37,466
నేను నిన్ను పూర్తిగా అందులో
చేరమనడం లేదు,

171
00:12:37,549 --> 00:12:39,968
కాస్త వేలు ముంచు చాలు, సరేనా?

172
00:12:40,051 --> 00:12:42,721
బహుశా రెండు. నాకోసం కాదు, రేనర్ కోసం.

173
00:12:42,804 --> 00:12:44,764
నువ్వెప్పుడూ సూసన్‌ను పట్టించుకోలేదు.

174
00:12:44,848 --> 00:12:47,893
నువ్వు తెగింపుతో, ఇబ్బందులతో
ఏదో కావాలనుకునేవాడివి.

175
00:12:49,603 --> 00:12:53,064
సరే, అది వదిలేయ్. గ్రేస్! గ్రేస్! ఆగు!

176
00:12:53,857 --> 00:12:55,609
నీతో నిజాయితీగా ఉంటాను, సరేనా?

177
00:12:57,319 --> 00:12:59,070
నేను చెప్పేది విను.

178
00:13:08,705 --> 00:13:09,539
హే.

179
00:13:16,046 --> 00:13:16,880
హే.

180
00:13:20,717 --> 00:13:21,551
ఈగిల్?

181
00:13:23,053 --> 00:13:23,887
హే!

182
00:13:25,222 --> 00:13:27,265
నేను లోపల ఉన్నాను. తెరువు.

183
00:13:41,530 --> 00:13:43,031
సోదరా, మనం మాట్లాడుకోవాలి.

184
00:13:45,534 --> 00:13:48,119
-లేదు. నువ్వు మమ్మల్ని చూడాలి.
-లేదు.

185
00:13:48,662 --> 00:13:50,163
మమ్మల్ని చూడు!

186
00:13:57,420 --> 00:13:58,338
సరే.

187
00:13:59,673 --> 00:14:01,508
మెలీస్సా డబ్రోస్కీ గుర్తుందా?

188
00:14:01,591 --> 00:14:05,887
వీహెచ్1 ఎడ్యుకేటర్ అవార్డుల వేదిక వెనుక
ఆమెతో సన్నిహితంగా మెలిగావు?

189
00:14:05,971 --> 00:14:07,013
అయితే ఏంటి?

190
00:14:07,097 --> 00:14:10,016
నువ్వు ఆమెకు టీచర్ ఆఫ్ ద ఇయర్
అవార్డు అందించాల్సుంది,

191
00:14:10,100 --> 00:14:13,019
కానీ ఆమె లోదుస్తులు
వేసుకుంటుండగా నువ్వెళ్ళిపోయావు.

192
00:14:13,562 --> 00:14:15,146
ఎందుకంటే ఆమె నన్ను పరిహసించింది.

193
00:14:15,230 --> 00:14:17,983
అబ్బా, ఛా.
ఆమె నీ ఛాతిపై చేయిపెట్టింది అంతే.

194
00:14:18,066 --> 00:14:19,734
నువ్వు ఎప్పుడూ నీ సూట్ జిప్ తెరవలేదు.

195
00:14:19,818 --> 00:14:21,111
ఆమె నవ్వి ఉండేది.

196
00:14:21,194 --> 00:14:22,862
ఎందుకంటే నువ్వు చేసేది అదే.

197
00:14:22,946 --> 00:14:26,533
స్త్రీలు మనల్ని చూసి నవ్వుతారని
అనుకుని, వాళ్ళను ముందరే అవమానిస్తావు.

198
00:14:26,616 --> 00:14:27,701
లేదు, అది నిజం కాదు.

199
00:14:27,784 --> 00:14:31,246
నీ శరీరాన్ని నువ్వు స్వీకరించలేవు,
అందుకే వారిని హింసిస్తావు.

200
00:14:32,872 --> 00:14:35,542
నోరు మూసుకోండి. నోరుమూసుకోండి అంతే!

201
00:14:37,043 --> 00:14:39,045
హే. హే. హే.

202
00:14:40,922 --> 00:14:43,133
-నన్ను బయటకు రానివ్వండి.
-నువ్వు మానుండి ఎప్పటికీ తప్పించుకోలేవు.

203
00:14:43,216 --> 00:14:45,552
నోరుమూసుకోండి, దరిద్రపుమొహాలు.

204
00:14:45,635 --> 00:14:47,387
నేను మీకు చెప్పాల్సింది ఇంకేమీ లేదు.

205
00:14:47,470 --> 00:14:50,223
ఇకమీదట నువ్వు మా నోరు మూయించలేవు, కెవిన్.

206
00:14:50,307 --> 00:14:53,435
హే. హే. నన్ను బయటకు రానివ్వు.

207
00:14:53,518 --> 00:14:55,645
నన్ను బయటకు రానివ్వు! ఈగిల్!

208
00:14:57,355 --> 00:14:58,690
నన్ను బయటకు రానివ్వు!

209
00:14:58,773 --> 00:15:00,275
దానిని ఎదుర్కో, సోదరా.

210
00:15:09,034 --> 00:15:11,119
అమెరికాకు రక్షణ

211
00:15:26,009 --> 00:15:27,427
నువ్విక్కడేం చేస్తున్నావు?

212
00:15:29,596 --> 00:15:35,101
స్పష్టంగా, నీ పనిచేసే చోట ఇంకా
మ్యాగీ షా అత్యవసర సంప్రదింపుగా ఉంది.

213
00:15:35,185 --> 00:15:37,646
అయ్యో, ఛ. క్షమించు.

214
00:15:37,729 --> 00:15:39,147
ఫర్వాలేదు.

215
00:15:41,191 --> 00:15:43,860
ఈ బొమ్మను ఇంకెక్కడ పొందగలను?

216
00:15:47,447 --> 00:15:49,699
అది చెడ్డ మంచినీటి మలుగు చేప అనుకుంటా.

217
00:15:49,783 --> 00:15:52,160
అది నా అపెండిక్స్ పగిలిపోయేదే.

218
00:15:52,243 --> 00:15:55,747
సరే, నా దృష్టి పొందడానికి
ఇంకా చాలా సులభ మార్గాలున్నాయి.

219
00:15:58,291 --> 00:15:59,834
నువ్వు ఫోన్ చేస్తావనుకుంటూ ఉన్నాను.

220
00:16:01,294 --> 00:16:03,588
సరే. నేను కూడా అంతే.

221
00:16:04,881 --> 00:16:06,508
మీ అమ్మకు ఫోన్ చేయమంటావా?

222
00:16:07,717 --> 00:16:09,678
ఖచ్చితంగా వద్దు.

223
00:16:10,970 --> 00:16:14,599
ఇంకెవరికైనా? ఎవరైనా గర్ల్‌ఫ్రెండ్, లేదా...

224
00:16:14,683 --> 00:16:18,978
నిజంగానా, వచ్చినందుకు ధన్యవాదాలు,
కానీ నీకు ముఖ్యమైన పనులు ఉండి ఉంటాయి.

225
00:16:19,062 --> 00:16:21,940
హే. నువ్వు ఇలాంటి వాటితో
చనిపోయి ఉండే దానివి.

226
00:16:22,023 --> 00:16:24,609
కానీ చనిపోలేదు, కనక నువ్వు నన్ను
కాపాడాల్సిన అవసరం లేదు.

227
00:16:24,693 --> 00:16:27,487
సరే, అయినా నేను
డాక్టర్‌ను కలవాలనుకుంటున్నాను.

228
00:16:28,822 --> 00:16:30,990
మేవ్, నేను బాగానే ఉన్నాను. నిజంగా.

229
00:16:37,205 --> 00:16:41,793
నీకు తెలుసా, బాచ్డ్ చూస్తే నువ్వు
వైద్య నిపుణురాలివి అయిపోవు.

230
00:16:42,919 --> 00:16:45,964
నేను కొంచెంసేపు వేచి చూస్తాను,
చూస్తానంతే, సరేనా?

231
00:16:47,257 --> 00:16:50,051
ఈ మధ్య కుర్చి ఇక్కడనుండి తీస్తారా?
ధన్యవాదాలు.

232
00:16:50,135 --> 00:16:51,678
ఈ రెండు ఒక దగ్గర పెడతారా?

233
00:16:51,761 --> 00:16:53,763
ఒకరు రావడం లేదు.

234
00:16:53,847 --> 00:16:55,682
సరే. ఒకరి చోటును తిరిగి సర్దుతున్నాము.

235
00:16:55,765 --> 00:16:57,559
సెట్‌లో నిశ్శబ్దం. కెమెరా.

236
00:16:57,642 --> 00:17:01,438
స్టార్మ్‌ఫ్రంట్, సెవెన్‌లో చేరికకు
అభినందనలు. ఇక్కడ ఉండడం ఉత్సాహంగా ఉందా?

237
00:17:01,521 --> 00:17:03,523
నాకు తెలియదు. నేనలా అనుకోవటం లేదు.

238
00:17:04,524 --> 00:17:06,860
అమ్మాయిలు అదెలా
పూర్తి చేస్తారో తెలియచేస్తారా?

239
00:17:06,943 --> 00:17:10,113
అమ్మాయిలు అది పూర్తి చేస్తారు.

240
00:17:10,196 --> 00:17:12,866
అబ్బాయిల గురించి మాట్లాడుకుందాం.
స్టార్‌లైట్, ఒంటరా, జత కట్టారా?

241
00:17:12,949 --> 00:17:14,075
ఒంటరిని.

242
00:17:14,159 --> 00:17:15,785
ఒంటరిని.

243
00:17:15,869 --> 00:17:17,495
ఖచ్చితంగా ఒంటరిని.

244
00:17:18,163 --> 00:17:20,790
ఈ అమ్మాయి శక్తిని పొందడం
ఎంత సరదానో చెప్పండి.

245
00:17:21,458 --> 00:17:23,334
అది మళ్ళీ చెబుతారా, కానీ చివరకు

246
00:17:23,418 --> 00:17:25,628
"బలంగా ఉండడం కొత్తదనం" అనుకుంటారు.

247
00:17:26,546 --> 00:17:28,339
అమ్మాయిలు మంచి హీరోలు కాగలరా?

248
00:17:28,423 --> 00:17:30,341
అబ్బాయిల కంటే అమ్మాయిలు
మంచి హీరోలు కాగలరా?

249
00:17:30,425 --> 00:17:32,886
అమ్మాయిలు మంచి హీరోలు కాగలరా?

250
00:17:32,969 --> 00:17:36,139
అపార్థం చేసుకోకండి,
మీకు చర్చాంశాలు ఉంటాయని తెలుసు,

251
00:17:36,222 --> 00:17:39,309
కానీ హీరోలు అమ్మాయిలయితే ఏంటి
అబ్బాయిలయితే ఏంటి?

252
00:17:39,934 --> 00:17:43,813
అంటే, మేము అందరం మా పనిలో
సామర్థ్యం కలిగి ఉండాలి అంతేగా?

253
00:17:44,439 --> 00:17:47,859
అమ్మాయిలు అంతకంటే బాగా ఏం చేయరు.
అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి చేస్తారు.

254
00:17:50,445 --> 00:17:51,529
ఓహ్, అది నాది.

255
00:17:56,326 --> 00:17:57,702
క్షమించు, ఆషీ.

256
00:17:57,786 --> 00:18:00,246
వాట్ ఇందులో జేబులు పెట్టుకోనివ్వలేదు.

257
00:18:00,330 --> 00:18:02,207
నా నడుము ప్రతి మడతను చూడగలరు.

258
00:18:02,290 --> 00:18:04,501
స్టార్‌లైట్ కడుపు చూడగలరు.

259
00:18:04,584 --> 00:18:07,337
అమ్మాయి శక్తి గురించి మాట్లాడాలన్నారుగా,
జేబుల గురించయితే?

260
00:18:08,838 --> 00:18:12,509
స్టార్‌లైట్, నీ సహచరుడు, ఏ-ట్రెయిన్,
ప్రజలు దృష్టిని ఆకర్షించారు.

261
00:18:13,510 --> 00:18:17,889
ఈమధ్యే తను కాందహార్‌లో అత్యంత రహస్యమైన
మిషన్‌లో ఉన్నారని వాట్ తెలియచేశారు.

262
00:18:17,972 --> 00:18:21,226
-మీకు ఆయన గురించి ఆందోళనగా ఉందా?
-అవును, ఖచ్చితంగా.

263
00:18:21,309 --> 00:18:23,394
ప్రతిరాత్రి ఆయనకోసం ప్రార్థిస్తాను.

264
00:18:24,687 --> 00:18:28,233
తమ కోసం అంత సాహసవంతమైన హీరో
పోరాడటం అమెరికా అదృష్టం.

265
00:18:28,316 --> 00:18:31,361
నేను అతను సరిగ్గా మీ వెనుకే ఉన్నారంటే?

266
00:18:31,903 --> 00:18:37,325
హే! ఇదిగోండి వచ్చేశాడు ఏ ట్రెయిన్!
ఏంటి విశేషాలు?

267
00:18:37,867 --> 00:18:39,744
సరే. అవును.

268
00:18:43,706 --> 00:18:46,084
-తిరిగి స్వాగతం.
-ధన్యవాదాలు.

269
00:18:47,252 --> 00:18:50,713
స్టార్మ్‌ఫ్రంట్, నిన్ను కలవటం ఒక గౌరవం.
నేను నీ అభిమానిని.

270
00:18:50,797 --> 00:18:52,841
-నాదీ అదే భావన.
-లెగవద్దు.

271
00:18:52,924 --> 00:18:55,927
క్షణం విశ్రాంతి తీసుకోండి.
నాకు కుర్చీ ఇస్తారా?

272
00:19:10,650 --> 00:19:14,195
హే. నీకు ఎలా ఉంది?

273
00:19:16,155 --> 00:19:18,575
-అభి-మ-నోహరం.
-చాలా మంచిది.

274
00:19:18,658 --> 00:19:20,910
మేము నీ గురించి చాలా ఆందోళన చెందాము.

275
00:19:23,538 --> 00:19:24,706
నువ్వు వాయిస్తావా?

276
00:19:24,789 --> 00:19:28,418
లేదు. పర్పుల్ రెయిన్‌లో
ప్రిన్స్‌ది ఈ గిటార్.

277
00:19:28,877 --> 00:19:31,713
నాకు మెలుకువ వచ్చాక అనుకున్నాను,

278
00:19:32,797 --> 00:19:35,466
"అది వదిలేయ్, నాకు అది కావాల్సిందే."

279
00:19:37,760 --> 00:19:39,762
నేను ఎదుర్కున్న దానికి

280
00:19:40,889 --> 00:19:43,308
నిజంగా నీకు ఒక అవగాహన ఇస్తుంది.

281
00:19:45,268 --> 00:19:46,394
నీకు తెలుసా?

282
00:19:46,477 --> 00:19:47,687
పూర్తిగా.

283
00:19:47,770 --> 00:19:53,151
నువ్వు నా గదికి ప్రతిరోజు వచ్చి
నాకోసం ప్రార్థించావని వాళ్ళు చెప్పారు.

284
00:19:54,736 --> 00:19:55,904
ధన్యవాదాలు.

285
00:19:56,237 --> 00:19:57,322
నీకోసం ఏదైనా.

286
00:19:57,405 --> 00:20:00,825
అవును, ఆ ప్రార్థన నాకు
చాలా సాయపడిందనుకుంటాను.

287
00:20:02,869 --> 00:20:03,953
ఏదేమైనా...

288
00:20:05,246 --> 00:20:09,250
నువ్వు ఆ రాత్రి నాకోసం అదనపు భద్రతను
పిలవటం మంచి ఆలోచన అని అందరూ

289
00:20:09,334 --> 00:20:11,294
అనుకుంటున్నారని నీకు తెలియాలి.

290
00:20:11,377 --> 00:20:15,840
అంటే, నేను నీకు సీపీఆర్ ఇవ్వడానికి అక్కడ
ఉండిఉండకపోతే ఏం జరిగి ఉండేది?

291
00:20:18,885 --> 00:20:20,637
అది తెలుసుకోవటం బాగుంది.

292
00:20:23,848 --> 00:20:27,226
నీ దేశద్రోహ ప్రియుడి పరారీలో
నీ సాయం గురించి వారెలా భావిస్తున్నారు?

293
00:20:29,187 --> 00:20:31,147
లేదా బహుశా నువ్వా సంగతి వివరించలేదేమో.

294
00:20:38,488 --> 00:20:44,118
అయితే, ఆ విషయం ఎవరికి చెప్పావు?

295
00:20:57,882 --> 00:21:01,427
నువ్వు కష్టకాలం ఎదుర్కొంటున్నావు
ఈ మధ్య నీకు మంచి భావన కలగడం లేదు

296
00:21:05,181 --> 00:21:09,185
పొరుగువారిలో చెడ్డ పేరు పొందుతున్నావు

297
00:21:22,198 --> 00:21:24,617
కల్నల్‌ను ఇప్పుడే కలిసి వస్తున్నాను.

298
00:21:29,956 --> 00:21:31,374
కల్నల్ మల్లోరీ?

299
00:21:32,917 --> 00:21:34,002
ఆమెను కలిశావా?

300
00:21:34,085 --> 00:21:35,878
అవును, ఫ్రెంచీ.

301
00:21:37,088 --> 00:21:38,297
మనకామె సాయం చేస్తుంది.

302
00:21:38,381 --> 00:21:40,633
మనం ఆమెకు సూప్ ఉగ్రవాదిని పట్టిస్తాము,

303
00:21:40,717 --> 00:21:43,344
సీఐఏ మన రికార్డులు
చెరిపేసేలా ఆమె చేస్తుంది.

304
00:21:43,428 --> 00:21:46,014
పోలీసులు మనల్ని పరీశీలించకుండా చేస్తుంది,

305
00:21:46,097 --> 00:21:48,391
నిన్ను నీ భార్యాబిడ్డల చెంతకు చేరుస్తుంది.

306
00:21:48,474 --> 00:21:50,601
నువ్వు చెప్పేది నిజం అని ఏంటి?

307
00:21:53,980 --> 00:21:58,735
734 సెంట్రల్ ఏవ్, నెవార్క్.

308
00:21:59,444 --> 00:22:01,904
-దానర్థం ఏంటి?
-ఆమె నాకు ఇచ్చిన చిరునామా.

309
00:22:01,988 --> 00:22:05,241
అమెరికాలో అక్రమ రవాణా అయిన
ఆ ఉగ్రవాద ఖాతాకు జోడించబడింది,

310
00:22:05,324 --> 00:22:07,160
ఖచ్చితంగా అతనక్కడే ఉండిఉంటాడు.

311
00:22:07,910 --> 00:22:12,165
దేవుడా, నేను రావడం మీ వెధవల అదృష్టం కదా?

312
00:22:32,769 --> 00:22:36,481
మెలిసా డబ్రోస్కీతో కేవలం సన్నిహిత
సంబంధం కంటే ఎక్కువ, తెలుసా?

313
00:22:36,564 --> 00:22:40,151
లేదు, లేదు. అది అస్సలు జరగదు!
అది వాస్తవం కాదు.

314
00:22:40,234 --> 00:22:43,905
ఆమె నీవైపు చూసిన తీరు.
ఆమె మంచిది, తెలివైనది.

315
00:22:43,988 --> 00:22:45,990
అలాంటి అమ్మాయితో సంతోషంగా ఉండేవాడివి.

316
00:22:47,700 --> 00:22:49,118
నీకు ప్రేమ పొందే అర్హత ఉంది.

317
00:22:52,497 --> 00:22:53,873
నన్ను గందరగోళం చేయొద్దు.

318
00:22:53,956 --> 00:22:58,419
నువ్వు ప్రేమించబడడానికి అర్హుడివి, కెవిన్.
కానీ అది నీతోనే మొదలవుతుంది.

319
00:22:58,503 --> 00:22:59,921
నన్ను గందరగోళ పరచొద్దు.

320
00:23:00,004 --> 00:23:02,965
ఒకసారి చూడు. నిజంగా చూడు.

321
00:23:04,842 --> 00:23:06,052
వెళ్ళు.

322
00:23:25,738 --> 00:23:29,742
నన్ను క్షమించండి.

323
00:23:29,826 --> 00:23:32,120
-నేను కురూపిని.
-కాదు.

324
00:23:32,203 --> 00:23:33,162
అవును.

325
00:23:34,872 --> 00:23:36,666
అంతర్గతంగా.

326
00:23:38,626 --> 00:23:41,295
నేను చూసేది నువ్వు చూడవు అంతే.

327
00:23:52,557 --> 00:23:57,311
నువ్వు చాలా అందగాడివి

328
00:24:00,481 --> 00:24:01,566
కాదు!

329
00:24:02,358 --> 00:24:03,693
నాకుమటుకు

330
00:24:04,360 --> 00:24:09,282
నువ్వు చాలా అందగాడివి

331
00:24:10,741 --> 00:24:12,118
నాకు

332
00:24:13,452 --> 00:24:14,412
నేను కాను.

333
00:24:14,495 --> 00:24:19,667
నేను ఆశించినది అంతా నువ్వే

334
00:24:19,750 --> 00:24:25,173
నాకు కావాల్సినది అంతా నువ్వే

335
00:24:25,423 --> 00:24:30,136
నువ్వు చాలా అందగాడివి

336
00:24:31,304 --> 00:24:32,847
నాకు

337
00:24:39,145 --> 00:24:43,524
నీవు చూడలేవా

338
00:24:47,528 --> 00:24:53,034
నేను ఆశించినది అంతా నువ్వే

339
00:24:53,117 --> 00:24:58,289
నాకు కావాల్సినది అంతా నువ్వే

340
00:24:59,624 --> 00:25:03,794
నువ్వు చాలా

341
00:25:05,296 --> 00:25:07,715
అందగాడివి

342
00:25:09,217 --> 00:25:11,302
నాకు

343
00:25:11,385 --> 00:25:12,470
అవును

344
00:25:17,016 --> 00:25:20,269
క్లుప్తంగా, నువ్వు కష్టపడి
సంపాదించిన డబ్బంతా ఈ పిచ్చి,

345
00:25:20,353 --> 00:25:22,772
పెద్ద ప్లాస్టిక్ బొమ్మ ఏదైతే చివరకు

346
00:25:22,855 --> 00:25:26,901
నీ పిల్లలు చెత్తలో పడేస్తే మనాటీ
బొడ్డులో తేలేదానిపై వృథా చేయకు.

347
00:25:27,944 --> 00:25:31,530
హే, నేను ఇది చెప్పి తీరాలి,

348
00:25:32,406 --> 00:25:35,618
నువ్వు వాట్ గురించి చెప్పిందంతా
నాకు చాలా నచ్చింది,

349
00:25:35,701 --> 00:25:36,953
సరే, అలాగే. మంచిది.

350
00:25:37,662 --> 00:25:40,122
లేదు, నువ్వు చెప్పినదానికి సమ్మతిస్తాను.

351
00:25:41,040 --> 00:25:44,001
-నువ్వు మైక్రోఫోన్ లాంటిది పెట్టుకున్నావా?
-అదేంటి

352
00:25:44,085 --> 00:25:46,921
చూడు, నేను సాధ్యమైనంత
మంచిగా చెబుతున్నాను, కానీ

353
00:25:47,004 --> 00:25:50,383
నేను జట్టులో భాగమేనా అని
తెలుసుకోడానికి వాట్ బార్బీ గూఢచారి

354
00:25:50,466 --> 00:25:52,176
నాపై గూఢచర్యం చేయనవసరం లేదు.

355
00:25:52,260 --> 00:25:56,013
ఏంటి? నేను అసలు అలాంటి దాన్ని కాదు

356
00:25:56,097 --> 00:25:59,392
నేను నీకు పెద్ద అభిమానిని,
కానీ నిన్ను చూడు.

357
00:25:59,850 --> 00:26:02,687
నువ్వు మొత్తం వాట్ ప్రతినిధిలా ఉన్నావు.

358
00:26:08,317 --> 00:26:12,655
ఒంటి కన్ను రాక్షసుడు నీకోసం
వేచి చూస్తున్నట్టు ఉన్నాడు అనుకుంటా.

359
00:26:15,283 --> 00:26:16,951
నీ కంటికి ఏమయింది?

360
00:26:17,034 --> 00:26:21,247
పరిమాణం పెంచే కొత్త పొడి షాంపూను
వాట్ కంటి దురదకై పరీక్షిస్తున్నారు.

361
00:26:21,330 --> 00:26:22,456
నీకేదో చింత ఉన్నట్టు.

362
00:26:23,666 --> 00:26:26,752
ఇదిగో, నేను నీకోసం నమూనా తెచ్చాను.

363
00:26:30,548 --> 00:26:33,217
హాస్యమాడుతున్నావా?
నేనిది ఇప్పుడు తీసుకోలేను.

364
00:26:33,301 --> 00:26:36,846
నేనీ ప్రెస్ కార్యక్రమాల నుండి
తప్పించుకోలేను. నాకు జేబులు లేవు.

365
00:26:36,929 --> 00:26:38,139
వీ కావాలన్నావు, ఇదిగో.

366
00:26:38,222 --> 00:26:41,642
నన్ను మళ్ళీ బెదిరిస్తే, ఇది నువ్వే
తీసుకున్నావని అందరికీ తెలిసిపోతుంది.

367
00:26:47,648 --> 00:26:49,025
గెకోతో సాన్నిహిత్యమా?

368
00:26:49,108 --> 00:26:54,947
హే. అవును.
కేప్స్ ఫర్ క్రైస్ట్ అప్పటినుండి. అవును.

369
00:26:55,323 --> 00:26:57,992
సరే. నువ్వు నీ బూట్‌లో ఏం పెట్టుకున్నావు?

370
00:26:58,075 --> 00:26:59,535
ఏంటి? ఏమీ లేదు.

371
00:27:01,912 --> 00:27:04,457
నువ్వు ఏదో బూట్‌లో
పెట్టినట్టు అనిపించింది.

372
00:27:05,541 --> 00:27:08,794
నా బూట్‌లో ఏముందో నువ్వే చెప్పవచ్చు కదా?

373
00:27:26,896 --> 00:27:30,816
బహుశా నువ్వు ఇంత త్వరగా నీ స్నేహితులతో

374
00:27:30,900 --> 00:27:33,444
క్రిస్టల్ తాగి ఉండాల్సింది కాదేమో?

375
00:27:34,111 --> 00:27:37,406
రండి, ఈ మూర్ఖుల ఆత్మాభిమానాన్ని
సంతృప్తిపరుచుదాం,

376
00:27:37,490 --> 00:27:39,367
అప్పుడు మనం మన అసలైన పని చేసుకోవచ్చు.

377
00:27:42,578 --> 00:27:43,913
వెళదామా?

378
00:27:48,793 --> 00:27:51,253
సరే, బాబు. ఇదిగో వచ్చేశాం.

379
00:27:51,337 --> 00:27:53,506
-పాఠాలు బాగా నేర్చుకో.
-సరే.

380
00:27:57,051 --> 00:28:00,012
గంటలో తిరిగొస్తాను.
మిస్ బర్డ్‌తో కాఫీ తాగుతాను.

381
00:28:00,096 --> 00:28:01,472
సరే.

382
00:28:02,473 --> 00:28:04,433
ధన్యవాదాలు. బై.

383
00:28:04,517 --> 00:28:06,769
హాయ్, రాయన్. ఎలా ఉన్నావు?

384
00:29:04,493 --> 00:29:07,872
తలుపు తెరువు. చెత్త తలుపు తెరువు!

385
00:29:07,955 --> 00:29:10,624
-కారులో కూర్చోండి.
-డా. పార్క్‌తో మాట్లాడాలి.

386
00:29:10,708 --> 00:29:11,709
వెళ్ళి కారులో కూర్చోండి.

387
00:29:11,792 --> 00:29:13,836
అబ్బా, ఛ! డా. పార్క్! ఇప్పుడే!

388
00:29:19,008 --> 00:29:21,886
-హే, బెక్కా.
-ఏం జరుగుతోంది?

389
00:29:22,303 --> 00:29:23,888
ఇది నిరాశ కలిగించిందని తెలుసు.

390
00:29:23,971 --> 00:29:26,474
నేను అతనిని ఇక తిరిగి ఎప్పుడూ చూడనని,

391
00:29:26,557 --> 00:29:29,310
రాయన్ లేదా నా గురించి తెలుసుకోలేడన్నారు.
అది ఒప్పందం.

392
00:29:29,393 --> 00:29:32,438
హోంలాండర్ నుండి
ఈ సమాచారం దాచబడిందని బాధపడ్డాడు.

393
00:29:32,521 --> 00:29:35,524
సంస్థ అతనిని ఇంకా
బాధ పెట్టకూడదని నిర్ణయించుకుంది.

394
00:29:36,775 --> 00:29:40,821
మీరు అతను వెళ్ళిపోయేలా చేయాలి,
మీరలా చేయకపోతే, నేను రాయన్‌ను

395
00:29:40,905 --> 00:29:44,700
తీసుకుని పారిపోతాను,
ఇక మీరు మమ్మల్ని ఎప్పటీకీ కనుగొనలేరు.

396
00:29:44,783 --> 00:29:47,036
అది సాధ్యం కాదని మన ఇద్దరికీ తెలుసు.

397
00:29:50,331 --> 00:29:53,542
మీరు మమ్మల్ని రక్షించాలి. మీరు...

398
00:29:53,626 --> 00:29:55,878
మీరు మమ్మల్నీ పంపించాలి, ప్లీజ్.

399
00:29:55,961 --> 00:29:57,421
క్షమించు. ఇక అతనికి తెలుసు కాబట్టి,

400
00:29:57,505 --> 00:29:59,715
టూత్‌పేస్టును తిరిగి
ట్యూబ్‌లోకి పెట్టలేము.

401
00:29:59,798 --> 00:30:02,718
నువ్వు తిరిగెళ్ళాలి.
పియానో పాఠాలు అయిపోయుంటాయి.

402
00:30:03,677 --> 00:30:04,845
అతనిని శాంతంగా ఉండనీ.

403
00:30:04,929 --> 00:30:07,431
మనం అనుకోగలిగింది,
అతను విసుగేసి వెళ్ళిపోతాడు.

404
00:30:08,891 --> 00:30:12,520
అది మీకు తెలియదు. మీకు తెలియదు.

405
00:30:22,112 --> 00:30:23,822
నేను ఇది ఉంచుకోవచ్చా?

406
00:30:23,906 --> 00:30:26,033
ఉంచుకోవచ్చేమో.
బదులుగా ఏం ఇస్తావు?

407
00:30:28,494 --> 00:30:30,704
నన్ను డిన్నర్‌కు బయటకు తీసుకెళ్ళనిస్తాను.

408
00:30:34,833 --> 00:30:36,001
సరే.

409
00:30:36,460 --> 00:30:40,089
మర్చిపోయాను. మనం భోజనం ఆర్డర్ చేసుకోవాలి.
తక్కువ ప్రోటీన్లు ఉన్నది.

410
00:30:40,798 --> 00:30:43,759
మేవ్, ఏమీ మారకపోతే
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?

411
00:30:44,677 --> 00:30:46,220
దేవుడా.

412
00:30:47,721 --> 00:30:50,849
ఒక మహిళ కావాలని కోరుకోనిది
మరో ముక్కు సర్జరీ.

413
00:30:50,933 --> 00:30:53,519
సరే. మనమిది ఇదివరకు మాట్లాడాము,
ధన్యవాదాలు.

414
00:30:54,812 --> 00:30:56,397
-ఎలీనా
-నువ్విక వెళ్ళాలి.

415
00:31:13,747 --> 00:31:18,252
ట్వెల్వ్ ఇయర్స్ స్లేవ్‌కు హోంలాండర్ ఇంకా
నేను ఆస్కార్ పార్టీకి వెళ్ళాము.

416
00:31:18,335 --> 00:31:22,339
అక్కడ ఒక నిర్మాత, నా పక్కన
కూర్చోవచ్చని పేర్ల కార్డులను మార్చాడు.

417
00:31:23,924 --> 00:31:25,551
నాతో రాత్రంతా మాట్లాడుతూనే ఉన్నాడు.

418
00:31:25,634 --> 00:31:28,095
రెండు రోజులకు,
అతని ఆఫీసులో మంటలంటుకున్నాయి.

419
00:31:28,178 --> 00:31:30,556
అతని తల ఒక గదిలో,

420
00:31:32,224 --> 00:31:34,310
మొండెం మరో గదిలో దొరికాయి.

421
00:31:36,228 --> 00:31:37,479
నువ్వేం చెబుతున్నావు?

422
00:31:39,315 --> 00:31:41,400
అతను నీకలా చేయాలని నేను కోరుకోను.

423
00:31:42,276 --> 00:31:43,110
ఎవరు?

424
00:31:48,866 --> 00:31:50,075
హోంలాండర్?

425
00:31:52,286 --> 00:31:54,121
అది హోంలాండర్ చేశాడనా?

426
00:31:54,580 --> 00:31:57,916
నేను చూసిన అతను చేసిన పనులు,

427
00:32:02,379 --> 00:32:04,340
అతను నా చేత చేయించిన పనులు...

428
00:32:09,845 --> 00:32:11,847
అతను నీ గురించి ఎప్పటికైనా తెలుసుకుంటే...

429
00:32:16,060 --> 00:32:17,978
నువ్విది నాకిప్పుడు ఎందుకు చెబుతున్నావు?

430
00:32:25,944 --> 00:32:28,072
నువ్వు నన్ను ఇకమీదట ద్వేషించకూడదని.

431
00:32:31,075 --> 00:32:32,660
బాగుంది! ధన్యవాదాలు.

432
00:32:34,244 --> 00:32:35,704
నీకోసం ఎల్లప్పుడు.

433
00:32:35,788 --> 00:32:38,207
నిజానికి, నీకిప్పటికే ఒకటి
లేకపోవటం బాగోలేదు.

434
00:32:38,290 --> 00:32:40,834
అయినా, నేను ఫోన్ చేయడానికి నాకు ఎవరూ లేరు.

435
00:32:42,461 --> 00:32:44,004
నువ్వు నాకు ఫోన్ చేయవచ్చు.

436
00:32:46,924 --> 00:32:50,177
నీకు తెలుసా, రాయన్,
నేను నీ వయస్సులో ఉన్నప్పుడు,

437
00:32:50,260 --> 00:32:52,346
నాకూ ఎక్కువమంది స్నేహితులు లేరు.

438
00:32:52,763 --> 00:32:55,557
ఒంటరితనంలో నిన్ను నువ్వు
బాగా తెలుసుకోగలవని అమ్మ చెప్పింది.

439
00:32:56,308 --> 00:32:59,353
అంటే, అది తప్పు కాదు అనుకుంటా.

440
00:33:02,648 --> 00:33:06,151
నీకు ఒక రహస్యం చెప్పనా?
దాపరికం లేకుండా, సరేనా?

441
00:33:17,538 --> 00:33:23,293
మా నాన్నా, నేనూ, ఎప్పుడూ పెరట్లో
ప్రపంచ సీరీస్ బాల్‌తో ఆడలేదు.

442
00:33:24,962 --> 00:33:26,213
నిజం ఏమిటంటే,

443
00:33:26,964 --> 00:33:29,007
నాకు ఎప్పుడూ నాన్న లేడు.

444
00:33:30,384 --> 00:33:31,760
లేదా అమ్మా లేదు.

445
00:33:33,387 --> 00:33:35,431
ఆగు, నీకు లేరా?

446
00:33:38,267 --> 00:33:42,354
చూడు, కొన్నిసార్లు,
అది కష్టతరంగా ఉంటుంది, రాయన్,

447
00:33:42,438 --> 00:33:47,568
ఈ భూమి మీద ప్రతి ఒక్కరికంటే ఉన్నతంగా ఉండటం

448
00:33:47,651 --> 00:33:49,987
అది వేరుగా ఉండడం.

449
00:33:50,070 --> 00:33:51,947
ఇంకా దేవుళ్ళకు

450
00:33:52,030 --> 00:33:55,159
అలాంటి భావన ఉండకూడదు...

451
00:33:56,827 --> 00:33:57,828
అది నొప్పి భావన.

452
00:33:59,163 --> 00:34:03,584
ఎందుకంటే మనం అదే, రాయన్.

453
00:34:06,170 --> 00:34:08,422
నువ్వు ఇంకా నేనూ...

454
00:34:11,592 --> 00:34:12,926
మనం దేవుళ్ళం.

455
00:34:16,930 --> 00:34:20,601
బాబూ, మనం కోరుకున్నది ఏదైనా మనం చేయవచ్చు,

456
00:34:21,518 --> 00:34:23,771
ఎవరూ మనల్ని ఆపరు.

457
00:34:24,354 --> 00:34:26,315
ఇప్పుడు ఇక,

458
00:34:27,441 --> 00:34:29,276
అది మంచి భావన.

459
00:34:30,360 --> 00:34:32,196
చాలా మంచి భావన.

460
00:34:33,864 --> 00:34:38,452
ఇక ఇప్పుడు, నువ్వూ నేనూ...

461
00:34:39,787 --> 00:34:41,497
అది కలిసి పంచుకోవచ్చు.

462
00:34:46,126 --> 00:34:49,546
నీకు తెలుసా, నేను ఇక పడుకోవాలనుకోవాలేమో?

463
00:34:50,506 --> 00:34:51,548
తప్పకుండా.

464
00:35:04,353 --> 00:35:05,437
నాకు నువ్వంటే ప్రేమ, బాబు.

465
00:35:08,315 --> 00:35:09,942
ఇప్పుడు, అది తిరిగి చెప్పు.

466
00:35:11,485 --> 00:35:13,654
నాకూ నువ్వంటే ప్రేమ.

467
00:35:15,697 --> 00:35:17,282
ఇది బాగుంది.

468
00:35:29,253 --> 00:35:31,296
-నీ వంతు, అమ్మా.
-నువ్వు వెళ్ళాలి.

469
00:35:32,589 --> 00:35:33,423
ఏంటి?

470
00:35:33,507 --> 00:35:36,093
నువ్వు నా ఇంటినుండి బయటకు నడవాలి.

471
00:35:42,766 --> 00:35:45,060
ఏం జరుగుతుంది, ఏదో రోజు,

472
00:35:45,143 --> 00:35:49,731
రాయన్ బేస్‌బాల్ ఆటకు వెళ్ళాలంటే?

473
00:35:49,815 --> 00:35:52,651
సముద్రంలో ఈదాలంటే?
లేదా బర్గర్ కింగ్‌లో తినాలంటే?

474
00:35:54,695 --> 00:35:56,196
నువ్వు వాడితో జీవితాంతం

475
00:35:56,280 --> 00:35:59,533
అబద్దం చెప్పావని తెలుసుకున్నాక
తనకెలా ఉంటుందని అనుకుంటున్నావు?

476
00:36:02,953 --> 00:36:04,830
నువ్వు వాడిని ఈ అందమైన జైలులో

477
00:36:04,913 --> 00:36:08,000
పెట్టావని సంతోషిస్తాడని అనుకుంటున్నావా?

478
00:36:11,003 --> 00:36:15,382
లేదా నిన్ను
ఈసడించుకుంటాడని అనుకుంటున్నావా?

479
00:36:20,095 --> 00:36:22,014
వెళ్ళి వాడినే అడుగుదాం పద.

480
00:36:23,056 --> 00:36:23,974
వద్దు.

481
00:36:28,186 --> 00:36:29,521
నువ్వు సరిగ్గా చెప్పావు.

482
00:36:31,023 --> 00:36:33,358
నేను విసుగుచెంది వెళ్ళిపోను.

483
00:36:34,484 --> 00:36:36,028
నేను ఎక్కడికీ వెళ్ళను.

484
00:36:36,862 --> 00:36:40,157
అందుకే నువ్వు
డా. పార్క్‌కు ఏమైనా చేసుకోమని చెప్పు.

485
00:36:46,246 --> 00:36:47,831
జఫ్ఫీ పాప్‌కార్న్ తింటావా?

486
00:36:55,380 --> 00:36:58,759
హలోథేన్ ఇంజక్షన్.
నా వద్ద ఇవి రెండు మాత్రమే ఉన్నాయి, హా?

487
00:36:59,509 --> 00:37:01,386
ఇవి పూర్తిగా ఉపయోగించుకోవాలి.

488
00:37:01,470 --> 00:37:03,639
ఇది ఉగ్రవాది మీద పనిచేయకపోతే?

489
00:37:03,722 --> 00:37:05,474
మనం సరిగ్గా బాగా చిక్కుకుంటాం.

490
00:37:23,575 --> 00:37:24,576
బాగానే ఉన్నావా?

491
00:38:46,033 --> 00:38:48,076
షైనింగ్ లైట్ లిబరేషన్ ఆర్మీ?

492
00:38:50,537 --> 00:38:52,164
నిన్ను అపహరించినవారా?

493
00:38:53,498 --> 00:38:54,708
నీకు ఇతను తెలుసా?

494
00:38:57,836 --> 00:38:59,212
ఏం జరుగుతోంది?

495
00:39:02,007 --> 00:39:03,508
కిమికో!

496
00:39:51,556 --> 00:39:55,560
మౌస్.

497
00:39:55,644 --> 00:39:59,940
నేను నిన్ను తిరిగి చూడలేనేమో అనుకున్నాను.

498
00:40:00,023 --> 00:40:01,608
అబ్బాయి. అమ్మాయి...

499
00:40:02,943 --> 00:40:04,361
ఆమె సోదరుడు.

500
00:40:04,444 --> 00:40:06,905
ఆమె నాకు అదే చెప్పాలని చూసింది.

501
00:40:15,163 --> 00:40:18,250
బుచర్, ఆగు. అతను ఆమె సోదరుడు.

502
00:40:55,704 --> 00:40:56,705
కిమికో!

503
00:41:00,959 --> 00:41:02,252
ఆగు!

504
00:41:13,722 --> 00:41:14,556
హే.

505
00:41:16,266 --> 00:41:19,102
నీకు నేను తెలియదు.
నేను అమ్ముడుపోయేదాన్ని కాదు.

506
00:41:19,603 --> 00:41:22,189
సరే. మంచిది. శుభాభినందనలు.

507
00:41:25,317 --> 00:41:27,277
నేనేం అనుకుంటున్నానో
నీకు ఎందుకు?

508
00:41:29,279 --> 00:41:33,450
బహుశా నువ్వు వాట్ గురించి చెప్పేదంతా
నేను చెప్పాలనుకోవట్లేదు కాబట్టే.

509
00:41:33,533 --> 00:41:35,368
బహుశా నేను అనుకోవడం వాట్...

510
00:41:41,249 --> 00:41:42,459
ఏంటి? వాట్ ఏంటి?

511
00:41:45,337 --> 00:41:48,840
అయ్యో, దేవుడా.
ప్రతిఒక్కరు చాలా నియంత్రణలో ఉంటున్నారు.

512
00:41:48,924 --> 00:41:52,636
నిజానికి జీవితం పీఆర్ ప్రణాళిక కాదు.
మీకు తోచింది మాట్లాడవచ్చు.

513
00:41:52,719 --> 00:41:54,262
అది సురక్షితం కాకపోతే?

514
00:41:54,346 --> 00:41:58,058
వాస్తవానికి మనం బులెట్‌ప్రూఫ్‌లో ఉన్నాం.
ఏం జరుగుతుంది?

515
00:42:00,352 --> 00:42:03,772
సరే, ఎప్పటికీ ఎవరు గొప్ప సూపర్ హీరో?

516
00:42:04,814 --> 00:42:05,815
హోంలాండర్?

517
00:42:05,899 --> 00:42:08,276
కాదు. పిప్పీ లాంగ్‌స్టాకింగ్.

518
00:42:09,152 --> 00:42:11,655
పిప్పీ లాంగ్‌స్టాకింగ్.
తను తొమ్మిదేళ్ళ అమ్మాయి.

519
00:42:11,738 --> 00:42:14,324
ఒంటరిగా ఒక ఇంట్లో ఉండేది?
పెంపుడు కోతి?

520
00:42:14,407 --> 00:42:18,119
ఒక చేత్తో గుర్రాన్ని ఎత్తేది?
పిప్పీ లాంగ్‌స్టాకింగ్ చదవలేదా?

521
00:42:18,203 --> 00:42:19,037
చదవలేదనుకుంటా.

522
00:42:20,872 --> 00:42:24,376
సరే. నేను ప్రతి హాలోవీన్‌కు
తనలా తయారయ్యేదాన్ని.

523
00:42:24,459 --> 00:42:27,504
డిస్నీ వ్యభిచారుల్లా తయారైన అమ్మాయిలందరూ
నన్ను గేలి చేసేవారు,

524
00:42:27,587 --> 00:42:31,007
నేను ఏం అనుకునేదాన్నో తెలుసా?
"ఎవరు పట్టించుకుంటారు?" అని.

525
00:42:31,091 --> 00:42:32,801
పిపి పట్టించుకోలేదు.

526
00:42:32,884 --> 00:42:35,679
ఆమె ఎప్పుడూ మర్యాదగా ఉండాలని
లేదా బాగుండాలని పట్టించుకోలేదు.

527
00:42:37,472 --> 00:42:42,727
చూడు, మంచిగా ఉండటానికి బాగుండటానికి
మధ్య గందరగోళపరిచే ప్రపంచం సంగతి వదిలేయ్.

528
00:42:42,811 --> 00:42:44,771
ద్వేషపూరితంగా ఉండాలనుకుంటే ఉండు,

529
00:42:44,854 --> 00:42:47,607
ఏది కావాలనుకుంటే అలా, అప్పుడప్పుడు
ముసుగు తీయాలంతే.

530
00:42:47,691 --> 00:42:51,027
బాగా అనిపిస్తుంది. నువ్వు చివరకు
ఊపిరి పీల్చుకోగలవు.

531
00:42:55,532 --> 00:42:59,869
ఎవరైనా అంగం నోట్లో పెట్టాలని చూస్తే,
దానిని కొరికేయ్.

532
00:43:01,871 --> 00:43:05,834
పిప్పి లాంగ్‌స్టాకింగ్
ఖచ్చితంగా అంగాన్ని కొరికేస్తుంది.

533
00:43:16,428 --> 00:43:18,972
బుచర్! ఆగు, మిత్రమా.

534
00:43:20,724 --> 00:43:22,934
నీ చేయి అందించు. సరే.

535
00:43:39,617 --> 00:43:42,078
వద్దు, బుచర్! వద్దు!
శాంతించు, బుచర్.

536
00:43:42,162 --> 00:43:45,790
సీఐఏ అతనిని ఎప్పటికీ జైలులో పెట్టేది,
ఆమె ఇంకెప్పుడు అతనిని చూడలేకపోయేది.

537
00:43:45,874 --> 00:43:46,708
శాంతించు!

538
00:43:47,751 --> 00:43:50,128
ఇద్దరూ, దయచేసి ఆపండి, ఇప్పుడు వద్దు.

539
00:43:54,924 --> 00:43:56,217
సరే.

540
00:44:02,724 --> 00:44:04,142
నువ్వు...

541
00:44:04,934 --> 00:44:07,103
వెళ్ళిపో.

542
00:44:11,191 --> 00:44:12,484
తక్కినవారు నాతో రండి.

543
00:44:18,740 --> 00:44:21,326
రండి, సమయం వృథా చేయకండి.
మనకు రాత్రంతా లేదు.

544
00:44:26,915 --> 00:44:28,750
మీరు దేనికై వేచి చూస్తున్నారు?

545
00:44:40,887 --> 00:44:42,514
మీ కుటుంబాన్ని కలవడంకంటే

546
00:44:43,515 --> 00:44:46,476
ఆమె కుటుంబం ఎక్కువని చెబుతున్నారా?

547
00:44:46,559 --> 00:44:48,895
లేదు. నేను అలా అనడం లేదు.

548
00:44:50,772 --> 00:44:53,566
కానీ కిమికొ మనలో ఒకరు.

549
00:44:55,652 --> 00:44:57,487
నేను మరో మార్గం కనుగొంటాను.

550
00:44:57,570 --> 00:45:00,073
నువ్వు అంగీకరించాలనుకుంటా? కాదా?

551
00:45:00,156 --> 00:45:02,575
నువ్వు ఆమెను ఇష్టపడుతున్నావు కాబట్టి.

552
00:45:02,659 --> 00:45:03,535
దేవుడా!

553
00:45:03,618 --> 00:45:06,788
హ్యూయీ మీ ఇద్దరినీ బలహీనులను చేసాడు.

554
00:45:22,220 --> 00:45:23,221
బెక్కా బ్రతికే ఉంది.

555
00:45:24,139 --> 00:45:25,265
ఏంటి?

556
00:45:28,351 --> 00:45:31,354
ఆమె బ్రతికే ఉంది.
వాట్ ఆమెను ఎక్కడో నిర్బంధించాడు.

557
00:45:31,438 --> 00:45:32,814
బుచర్, ఒకవేళ నువ్వు

558
00:45:32,897 --> 00:45:36,234
చూడు, నేను పిచ్చివాడినేం కాను, సరేనా?
నేను ఆమెను చూశాను.

559
00:45:40,280 --> 00:45:42,449
ఆమెతో ఒక చిన్న బాబు ఉన్నాడు,

560
00:45:43,241 --> 00:45:44,951
హోంలాండర్ నోట్లోంచి ఊడిపడ్డాడు.

561
00:45:45,034 --> 00:45:48,204
అతను నాకు మంచి వార్త ఇచ్చేముందు

562
00:45:48,288 --> 00:45:50,248
నాదైన ఆమ్మాయికి ఏం చేశాడో చూపించి

563
00:45:50,331 --> 00:45:52,584
బాధపెట్టాలని భావించాడని అనుకుంటున్నా.

564
00:45:52,667 --> 00:45:56,045
మూడు గంటల తరువాత నేను
టోనీ సిసిరోస్‌లో మేల్కొన్నాను.

565
00:45:56,129 --> 00:45:57,422
ఎందుకో ఆ దేవుడికే తెలియాలి.

566
00:46:03,887 --> 00:46:05,346
నేను ఆమెను కనిపెట్టాలి.

567
00:46:06,514 --> 00:46:09,225
అక్కడనుండి ఆమెను బయటపడేయాలి.

568
00:46:11,728 --> 00:46:13,521
అది చేయడానికి నాకు మీ సహాయం కావాలి.

569
00:46:14,731 --> 00:46:16,149
నువ్వు మాతో హాస్యమాడుతున్నావా?

570
00:46:16,566 --> 00:46:18,735
నేను మెలరీ కోసం ఉగ్రవాదిని కనుగొంటే,

571
00:46:18,818 --> 00:46:21,571
ఆమె నాకోసం బెక్కాను కనిపెడుతుంది.
నేను చేసుకున్న ఒప్పందం అదే.

572
00:46:21,654 --> 00:46:24,908
నేను మీకు ఏం చేశానో నాకు తెలుసు, సరేనా?

573
00:46:26,242 --> 00:46:29,913
మీకు నన్ను వెళ్ళిపొమ్మనే
హక్కు ఉంది, అయినాగానీ...

574
00:46:30,997 --> 00:46:32,290
నేను వేడుకుంటున్నాను.

575
00:46:46,971 --> 00:46:49,015
నువ్వు...

576
00:46:50,308 --> 00:46:52,435
నువ్వు ఆ రాత్రి మాయమయినప్పుడు...

577
00:46:52,519 --> 00:46:53,728
నన్ను క్షమించు.

578
00:46:55,021 --> 00:46:58,566
మనం ఒకరినొకరం కనిపెట్టుకు ఉండాలి,
కానీ నువ్వు మాయమయిపోయావు.

579
00:47:04,572 --> 00:47:08,076
షైనింగ్ లైట్ నన్ను ఇక్కడకు పంపింది.

580
00:47:08,159 --> 00:47:14,123
నా వెన్నులోకి సూది గుచ్చి
నీలం విషం ఎక్కించింది.

581
00:47:17,752 --> 00:47:19,837
నేను నిన్ను కనుగొనాల్సింది.

582
00:47:21,005 --> 00:47:24,926
లేదు. నేను నీ అక్కను.
నీకోసం నేను తిరిగి రావాలి, కానీ...

583
00:47:29,013 --> 00:47:32,475
వాళ్ళు నన్ను...

584
00:47:34,477 --> 00:47:36,145
ఒక దుష్టురాలిని చేశారు.

585
00:47:40,316 --> 00:47:44,070
అదే నిజమయితే, ఇప్పుడు మనిద్దరం దుష్టులం.

586
00:47:46,906 --> 00:47:48,741
అది బాధించిందా?

587
00:47:49,367 --> 00:47:51,035
నేను చనిపోదామనుకున్నాను.

588
00:47:54,497 --> 00:47:56,374
నేను కూడా.

589
00:47:57,375 --> 00:47:59,752
వాళ్ళదగ్గర ఇంకా ఒక్క డోసు మాత్రమే ఉంది,

590
00:47:59,836 --> 00:48:02,213
అది నీపై పనిచేసిందని వాళ్ళకు తెలుసు,

591
00:48:02,297 --> 00:48:05,800
అందుకే అది నాపైనా పనిచేస్తుందని
వాళ్ళు కనుగొన్నారు.

592
00:48:13,600 --> 00:48:15,685
నన్ను క్షమించు.

593
00:48:15,768 --> 00:48:18,187
అది నీ తప్పు కాదు.

594
00:48:37,040 --> 00:48:39,334
అది నీ తప్పు కాదు.

595
00:49:04,400 --> 00:49:07,612
ఎక్కడున్నావు?? అది దొరికింది.
భయంగా ఉంది. ఫోన్ చేయ్!!

596
00:49:14,619 --> 00:49:16,329
ఎవరికి... ఆ శృంగార సందేశాలు?

597
00:49:16,829 --> 00:49:19,707
నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళిపో!

598
00:49:22,669 --> 00:49:25,046
లేదు... సరే, చూడు, నన్ను కనిపెట్టావు.

599
00:49:25,129 --> 00:49:27,507
నాకు అధిక రుతుస్రావం అవుతుంది. అది...

600
00:49:30,093 --> 00:49:31,636
దీనితో నువ్వేం చేస్తున్నావు?

601
00:49:32,679 --> 00:49:36,766
ఇది కనిపిస్తున్నట్టుగా కాదు, సరేనా?
అపార్థం చేసుకుంటున్నావు.

602
00:49:37,517 --> 00:49:39,602
నువ్వు హ్యూయీని కలుస్తున్నావని

603
00:49:39,686 --> 00:49:42,230
హోంలాండర్‌కు తెలియగానే నీ పనిపడతాడు.

604
00:49:42,313 --> 00:49:45,024
హ్యూయీ నీ ప్రాణాలు కాపాడాడు.
మేమిద్దరం కాపాడాం.

605
00:49:46,442 --> 00:49:47,402
నువ్వు పొరబడ్డావు.

606
00:49:47,944 --> 00:49:50,279
నాకు నిమిషం ఇస్తే, నీకంతా వివరిస్తాను.

607
00:49:50,697 --> 00:49:54,033
నీకు తెలుసా, నీ మొహంపై
చర్మం చెక్కుతున్నప్పుడు

608
00:49:54,117 --> 00:49:58,037
నువ్వు నన్ను
గుర్తుచేసుకోవాలి, దొంగమొహందానా.

609
00:50:04,377 --> 00:50:06,671
నువ్వు ఎవరికీ ఏమీ చెప్పబోవడం లేదు.

610
00:50:09,507 --> 00:50:11,092
నేను చెప్పలేదని ఎవరు చెప్పారు?

611
00:50:11,175 --> 00:50:13,720
అలా అయితే ఇప్పటికే
నేను చనిపోయి ఉండేదాన్ని.

612
00:50:13,803 --> 00:50:15,471
నువ్వు ఏమీ చేయబోవడం లేదు.

613
00:50:16,556 --> 00:50:17,807
అలా ఎందుకు?

614
00:50:18,975 --> 00:50:21,477
ఎందుకంటే నువ్వు నీ ప్రియురాలిని చంపేశావు.

615
00:50:24,021 --> 00:50:27,191
హ్యూయీకి అదే చెప్పావు, కదా?
నువ్వు పాప్‌క్లాని చంపావని.

616
00:50:31,446 --> 00:50:33,030
నువ్వు ఏదీ నిరూపించలేవు.

617
00:50:33,448 --> 00:50:35,575
ఆమె బాధ అనుభవించిందా?

618
00:50:37,243 --> 00:50:42,039
నువ్వు అలా చేస్తున్నప్పుడు
ఆమె పెద్ద, బాధాకరమైన కళ్ళలోకి చూశావా?

619
00:50:44,208 --> 00:50:45,501
పోవే.

620
00:50:46,252 --> 00:50:51,132
సరే, చూడు, నేను వాట్ ఫోరెన్సిక్
నివేదికను చూశాను ఇంకా...

621
00:50:53,259 --> 00:50:57,722
ఒకే సమయంలో అన్ని సూదులు
ఆమె చేతిలోకి గుచ్చుకున్నాయా?

622
00:50:57,805 --> 00:51:00,183
నిజానికి అందులో ఒకటి
ఎముకను ముక్కలు చేసింది.

623
00:51:00,266 --> 00:51:02,977
నీకది తెలుసా?
ఎవరైనా తమకు తాము అలా చేసుకుంటారా?

624
00:51:03,060 --> 00:51:05,605
అది ప్రమాదంలా నాకు అనిపించడం లేదు.

625
00:51:06,147 --> 00:51:09,108
వాట్ అది కప్పిపుచ్చేందుకు
సిద్ధంగా ఉంది, కానీ...

626
00:51:10,276 --> 00:51:14,447
నీకు తెలుసా, ఒకవేళ స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్
తెలుసుకుందనుకో ఏమవుతుంది?

627
00:51:16,991 --> 00:51:18,451
ఒకవేళ నువ్వలా చేస్తే,

628
00:51:19,911 --> 00:51:22,079
నాతో నిన్ను కూడా నాశనం చేస్తాను,

629
00:51:22,747 --> 00:51:24,457
ఆ తరువాత ఇద్దరం పోతాము.

630
00:51:27,502 --> 00:51:30,588
కానివ్వు. ప్రయత్నించి చూడు.

631
00:51:31,756 --> 00:51:33,174
నాకేం భయం లేదు.

632
00:52:06,833 --> 00:52:09,919
నువ్వు ఉన్న ఈ జనం...

633
00:52:10,461 --> 00:52:13,297
వాళ్ళు నన్ను సురక్షితంగా ఉంచారు.
నిన్నూ ఉంచుతారు.

634
00:52:16,759 --> 00:52:19,762
లేదా మనం ఇంటికి వెళ్ళిపోవచ్చు.
తిరిగి మన ఊరికి.

635
00:52:22,056 --> 00:52:23,683
అక్కడ ఇక ఊరేమీ లేదు.

636
00:52:24,684 --> 00:52:25,518
ఏంటి?

637
00:52:26,936 --> 00:52:28,187
వాళ్ళు మనకోసం వచ్చారు.

638
00:52:28,271 --> 00:52:30,147
ఎవరు?

639
00:52:30,398 --> 00:52:31,607
అమెరికన్లు.

640
00:52:31,691 --> 00:52:34,527
ఈ హీరో ఆకాశంనుండి
రాక్షసుడిలా విరుచుకుపడ్డాడు.

641
00:52:35,403 --> 00:52:38,781
క్యాంప్‌ను, దాని చుట్టూ ఉన్న
గ్రామాలను కూడా నాశనం చేశాడు.

642
00:52:40,199 --> 00:52:42,159
అంతటా శవాలు.

643
00:52:43,411 --> 00:52:44,829
అందరూ చనిపోయారు.

644
00:52:44,912 --> 00:52:47,832
అయితే మరెక్కడికయినా వెళదాం.
తిరిగి జపాన్‌కు వెళదాం.

645
00:52:47,915 --> 00:52:50,751
బహుశా అమ్మమ్మా తాతయ్యలు
ఇంకా బ్రతికే ఉన్నారేమో.

646
00:52:50,835 --> 00:52:52,753
నువ్వు పట్టించుకోవా?

647
00:52:52,837 --> 00:52:55,548
సూపర్ హీరో ఒక వృద్ధ మహిళను
రెండుగా చీల్చినా?

648
00:52:56,424 --> 00:52:58,467
ఒక స్కూల్ మొత్తం అందులో
పిల్లలతో నేలమట్టం అయినా?

649
00:52:58,551 --> 00:53:01,846
ప్రోపేన్ ట్యాంకులు పేలి
చంటి పిల్లలు వారి ఉయ్యాలలో కాలిపోయినా?

650
00:53:01,929 --> 00:53:04,765
నేనిది ఎప్పుడూ కోరుకోలేదు.
కానీ వారు ఎప్పుడూ సరైనవారే.

651
00:53:05,349 --> 00:53:07,518
షైనింగ్ లైట్ అంతా బూటకం!

652
00:53:07,602 --> 00:53:10,021
షైనింగ్ లైట్ అన్యాయాన్ని ఎదిరిస్తుంది.

653
00:53:10,104 --> 00:53:11,772
వారు మౌనంగా జనానికి అండగా నిలుస్తారు.

654
00:53:12,356 --> 00:53:14,984
వాళ్ళు మన తల్లిదండ్రులను చంపేశారు!

655
00:53:15,067 --> 00:53:17,528
ఈ దేశం ఇప్పుడు ప్రపంచానికంతటికీ శత్రువు.

656
00:53:18,905 --> 00:53:21,198
మనం తిరిగి పోరాడాలి. నాతో పోరాడు!

657
00:53:21,991 --> 00:53:26,621
నువ్వు తల్లిని కోల్పోయిన ప్రతి
ఎలుకను సాకిన అబ్బాయివి.

658
00:53:29,165 --> 00:53:30,791
అది చాలా కాలం క్రితం.

659
00:53:31,751 --> 00:53:34,670
అయినా నువ్వింకా నా తమ్ముడివే.

660
00:53:36,255 --> 00:53:40,301
అయితే నేను ఇది చేయాలని నీకు తెలుసు.

661
00:55:08,597 --> 00:55:09,849
నువ్వు బానే ఉన్నావా?

662
00:55:15,646 --> 00:55:18,441
సరే, అభినందనలు, ప్రేమ.

663
00:55:18,899 --> 00:55:21,193
ఇక్కడ కనీసం
ఒకరికి కొంచెం తెలివి ఉంది.

664
00:55:32,079 --> 00:55:32,913
నెమ్మదిగా.

665
00:56:08,741 --> 00:56:11,243
నువ్వు మళ్ళీ నాకూ నా భార్యకు మధ్య వస్తే,

666
00:56:12,828 --> 00:56:14,497
నిన్ను చంపేస్తాను.

667
00:56:37,394 --> 00:56:39,939
హే, బాబు, వస్తున్నావా?

668
00:59:02,915 --> 00:59:04,917
సబ్‌టైటిల్ అనువాద కర్త సమత

669
00:59:05,000 --> 00:59:07,002
క్రియేటివ్ సూపర్‌వైజర్
రాజేశ్ వలవల

