1
00:01:37,055 --> 00:01:38,265
ఎవరు?

2
00:01:38,265 --> 00:01:41,727
మీరు ఈ డబ్బును భవనం బయట పారేసుకున్నట్టున్నారు.

3
00:01:45,898 --> 00:01:48,066
నేను పొరబడి ఉంటే, క్షమించండి.

4
00:01:48,066 --> 00:01:49,693
లేదు, అదేం లేదు.

5
00:01:49,693 --> 00:01:50,903
సరే.

6
00:02:17,554 --> 00:02:20,849
మిస్టర్. హా, అది నాదే.

7
00:02:20,849 --> 00:02:22,267
మీకు ఇంగ్లీష్ వచ్చా?

8
00:02:22,267 --> 00:02:23,852
పనిలో భాగంగా నాకు తప్పదు.

9
00:02:25,020 --> 00:02:27,064
చాలా డబ్బులు పడి ఉన్నాయి.
మీరు పోగొట్టుకుంటే నష్టపోతారని తెచ్చా.

10
00:02:28,565 --> 00:02:29,650
సరే, థ్యాంక్యూ.

11
00:02:34,696 --> 00:02:37,449
మీకు బహుమానం ఏమైనా ఇవ్వాలంటారా?

12
00:02:37,950 --> 00:02:39,368
లేదు, ఆ అవసరం లేదు.

13
00:02:40,494 --> 00:02:41,912
కానీ నాకొక సాయం చేయగలరా?

14
00:02:43,497 --> 00:02:45,165
మీరు ఈ పిల్లాడిని ఎక్కడైనా చూశారా?

15
00:02:45,749 --> 00:02:48,210
ఆరు రోజుల నుండి కనిపించట్లేదు. ఇతని పేరు యూమా.

16
00:02:49,002 --> 00:02:50,420
ఈ పిల్లాడిని నేను చూడటం ఇదే తొలిసారి.

17
00:03:00,681 --> 00:03:03,475
మీరు నిజం చెప్పట్లేదు అనుకుంటా, హిడేయో.

18
00:03:07,938 --> 00:03:09,940
మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు.

19
00:03:13,694 --> 00:03:15,863
మీరు డబ్బులు ఇవ్వమని బెదిరిస్తూ
యూమా తల్లిదండ్రులకు సందేశం పంపారు.

20
00:03:17,281 --> 00:03:20,742
కొబయాషీ కుటుంబానికి పంపారు మీరు.
కానీ యూమా కన్న తండ్రి మిస్టర్ కొబయాషీ కాదు.

21
00:03:25,998 --> 00:03:26,999
నిజంగానే కాదు.

22
00:03:27,708 --> 00:03:29,293
అతనే తండ్రి అనుకుంటాడు, కానీ అది నిజం కాదు.

23
00:03:30,711 --> 00:03:32,838
యూమా తండ్రి, అసలైన తండ్రి పేరు,

24
00:03:32,838 --> 00:03:36,758
మసాకీ హషిమోటో, ఆయన ఎవరో కాదు...

25
00:03:38,760 --> 00:03:41,263
టోక్యో యాకూజాకి బాస్.

26
00:03:42,097 --> 00:03:43,682
కాబట్టి ఇప్పుడు అసలైన ప్రశ్న ఏంటంటే,

27
00:03:44,641 --> 00:03:46,143
తర్వాత ఏం జరుగుతుంది?

28
00:03:48,061 --> 00:03:51,523
నేను మీకొక అవకాశం ఇస్తాను.
మీరు నన్ను ఆ పిల్లాడి దగ్గరకు తీసుకెళ్తే చాలు.

29
00:03:51,523 --> 00:03:53,358
యూమా నా చెంతకి రాగానే,

30
00:03:53,859 --> 00:03:56,862
మీకు రెండు గంటలు సమయం ఇస్తాను,
ఆ తర్వాత ఆ పిల్లాడి తండ్రికి కాల్ చేస్తాను.

31
00:03:56,862 --> 00:03:59,865
ఆ రెండు గంటల్లో, మీరు విమానాశ్రయానికి వెళ్లిపోయి,

32
00:03:59,865 --> 00:04:01,575
విదేశాలకు పారిపోవాలి.

33
00:04:02,951 --> 00:04:05,204
జపాన్ లో ఉంటే మీ ప్రాణాలు పోతాయి.

34
00:04:12,794 --> 00:04:14,213
జనాల మక్కెలు విరగ్గొట్టడం నాకు సరదా కాదు.

35
00:04:14,838 --> 00:04:15,839
నాకు అది ఇష్టమే ఉండదు.

36
00:04:17,341 --> 00:04:20,135
ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడో చెప్పు,
ఇందాక చెప్పిన ఆఫర్ నీకు మళ్లీ ఇస్తా.

37
00:04:21,720 --> 00:04:24,556
దయచేసి ఆ పిల్లాడిని ఎక్కడ దాచావో చెప్పు.

38
00:04:29,728 --> 00:04:32,064
సారీ. నీ గోతిని నువ్వే తవ్వుకున్నావు.

39
00:04:43,617 --> 00:04:46,161
తొక్కలో రేమండ్ సూట్.

40
00:05:10,686 --> 00:05:12,479
ఎవరు మీరు?

41
00:05:12,479 --> 00:05:14,481
కూర్చోండి.

42
00:05:42,593 --> 00:05:43,677
యూమా.

43
00:05:52,102 --> 00:05:54,313
థ్యాంక్యూ.

44
00:05:54,313 --> 00:05:56,815
మీకు సహాయం చేసే భాగ్యం దక్కడం నా అదృష్టం, సర్.

45
00:05:56,815 --> 00:05:58,192
మీకు గాయమైంది.

46
00:05:58,192 --> 00:06:00,485
- దాని సంగతి నేను చూసుకుంటాలెండి.
- అలాగే.

47
00:06:00,485 --> 00:06:02,321
బయట వేచి చూడు.

48
00:06:09,620 --> 00:06:11,413
ఇక నువ్వు బయలుదేరితే మంచిది.

49
00:06:31,016 --> 00:06:33,101
నాకు జనాలను గాయపరచడం నచ్చదు. నిజంగానే చెప్తున్నా.

50
00:06:34,561 --> 00:06:37,940
ఇప్పటికే ప్రపంచం అష్టకష్టాలు పడుతోంది,
దానికి నేను ఆజ్యం పోయాల్సిన పనే లేదు.

51
00:06:41,610 --> 00:06:43,320
తప్పిపోయిన వారి ఆచూకీని కనిపెట్టడం.

52
00:06:44,154 --> 00:06:46,114
మిస్ అవుతున్నవారి చెంతకు వారిని చేర్చడం.

53
00:06:47,950 --> 00:06:49,409
నేను చేసే పనిలో నాకు ఇష్టమైన భాగం అదే.

54
00:06:51,328 --> 00:06:53,997
అప్పుడప్పుడూ కత్తి ఉపయోగించాల్సి వచ్చినా,
సూట్ పాడైనా, ఆ పని జరిగితే నాకు అదే చాలు.

55
00:06:56,458 --> 00:06:57,584
చాలా కష్టమైన పనే.

56
00:06:58,961 --> 00:06:59,962
కానీ ఆదాయం స్థిరంగా వస్తుంది.

57
00:08:31,553 --> 00:08:33,639
థామస్ కింజీ
సహాయం కావాలి / మిస్టర్ సీగల్

58
00:08:33,639 --> 00:08:37,433
జోనథన్ సీగల్ తరఫున

59
00:09:07,589 --> 00:09:09,591
లాస్ ఏంజెలస్

60
00:09:16,974 --> 00:09:21,019
జ్వరం తగ్గిపోవాలని కోరుకుంటున్నా. వాంతులు ఆగాయా?

61
00:09:21,019 --> 00:09:23,897
క్లయింట్ ఉన్నారు...

62
00:09:23,897 --> 00:09:26,441
తర్వాత కాల్ చేస్తా.

63
00:09:28,652 --> 00:09:30,737
మీకు ఏసీ బాగానే తగులుతోందా, సర్?

64
00:09:30,737 --> 00:09:32,531
ఏసీ పెంచమంటే పెంచుతాను.

65
00:09:32,531 --> 00:09:34,908
ఇది చాలు, బాగుంది. థ్యాంక్యూ.

66
00:09:34,908 --> 00:09:35,993
మీకు అరబిక్ వచ్చా?

67
00:09:35,993 --> 00:09:38,787
వచ్చు. చాలా ఏళ్ల క్రితం డమాస్కస్ లో కొంత కాలం గడిపాను.

68
00:09:38,787 --> 00:09:41,290
అప్పుడు అది చాలా గొప్ప నగరం...
ఆ తర్వాత సమస్యలన్నీ దాన్ని చుట్టుముట్టేశాయి.

69
00:09:41,290 --> 00:09:42,875
నేను కూడా డమాస్కస్ నుండే వచ్చా!

70
00:09:42,875 --> 00:09:44,626
మీ పేరేంటి, మిత్రమా?

71
00:09:44,626 --> 00:09:46,670
ముంజర్.

72
00:09:47,296 --> 00:09:48,672
ముంజర్.

73
00:10:11,528 --> 00:10:12,613
ముంజర్.

74
00:10:13,530 --> 00:10:15,949
మీ కూతురి గురించి మీరు మాట్లాడేటప్పుడు విన్నాను.

75
00:10:17,117 --> 00:10:18,535
ఇది నా డాక్టర్ ఫోన్ నంబర్.

76
00:10:19,870 --> 00:10:21,121
ఆయనకి కాల్ చేయండి, సరేనా?

77
00:10:21,121 --> 00:10:23,916
మీ కూతురికి బాగా లేదని ఆయనకి చెప్పండి,

78
00:10:23,916 --> 00:10:25,876
నేనే నంబర్ ఇచ్చానని మాత్రం
తప్పకుండా చెప్పండి. ఆయన సాయపడతారు.

79
00:10:26,752 --> 00:10:29,213
దైవాశీస్సులతో మీరు చల్లగా ఉండాలి, సర్.

80
00:10:29,213 --> 00:10:30,506
తప్పకుండా.

81
00:10:31,507 --> 00:10:33,467
- మీ కోసం ఆగమంటారా?
- అక్కర్లేదు.

82
00:10:33,467 --> 00:10:35,969
కానీ ఏమనుకోకుండా మీరు నా లగేజీని
హోటల్ కి తీసుకువెళ్తే, నాకు అదే చాలు.

83
00:10:35,969 --> 00:10:39,890
మీ డిశ్పాచర్ అడిగితే, నన్ను కూడా అక్కడే దింపానని చెప్పండి.

84
00:10:39,890 --> 00:10:40,974
తప్పకుండా.

85
00:11:11,755 --> 00:11:14,383
- జాన్ షుగర్, నిన్ను కలవడం చాలా బాగుంది.
- హేయ్, రూబీ.

86
00:11:14,383 --> 00:11:17,803
హేయ్. ఇలా రా. చాలా కాలమైంది.

87
00:11:17,803 --> 00:11:19,805
- అవును.
- ఆగు, ఓసారి నిన్ను బాగా పరిశీలిస్తా.

88
00:11:22,182 --> 00:11:24,434
- బాగా అలసిపోయినట్టు కనిపిస్తున్నావు.
- చాలా దూర ప్రయాణం కదా.

89
00:11:24,434 --> 00:11:26,103
టోక్యోలో ఒక మిత్రుడిని కలిశా.

90
00:11:26,854 --> 00:11:29,022
అతని స్థానిక వర్గమంతా చెల్లాచెదురైపోయిందని చెప్పాడు,

91
00:11:29,857 --> 00:11:32,192
ఆ వర్గంలోని ఇతర సభ్యులని చూసి ఏడాదిపైనే అయిందట.

92
00:11:32,192 --> 00:11:36,697
ఇక్కడికి రావడం అతనికి ఏ అభ్యంతరమూ
లేకపోతే, మన దగ్గర పని చేయవచ్చని చెప్పా.

93
00:11:36,697 --> 00:11:39,992
హా, తప్పకుండా. సరే మరి.
లోపల నీ కోసం కొన్ని సిద్ధంగా ఉంచా.

94
00:11:39,992 --> 00:11:41,326
- సరే, పద మరి.
- హా.

95
00:11:44,663 --> 00:11:46,832
మిరంబే, మిరంబే, మిరంబే.

96
00:11:46,832 --> 00:11:47,916
హాయ్. హాయ్.

97
00:11:52,171 --> 00:11:54,631
నిన్ను ఇంత సులభంగా పడేయవచ్చని నాకు తెలీదే.

98
00:11:54,631 --> 00:11:57,050
పడేయడం లేదు, గిడేయడం లేదే.
ఇదేం చేస్తోందో నాకు బాగా తెలుసు.

99
00:11:58,302 --> 00:11:59,303
మంచి పిల్లి.

100
00:12:02,264 --> 00:12:04,183
- ఏంటవి?
- హెలెన్ రాసిన లేఖలు.

101
00:12:04,183 --> 00:12:07,102
- తను చాలా మంచిదబ్బా.
- హా, ఈరోజుల్లో కూడా లేఖలు రాస్తుందంటే, నమ్మలేకున్నా.

102
00:12:07,102 --> 00:12:08,478
అంటే, నిజంగానే రాస్తోంది.

103
00:12:08,478 --> 00:12:09,605
తను పాత రకంలే.

104
00:12:09,605 --> 00:12:11,648
- నిజంగానే పాత రకం.
- థ్యాంక్యూ.

105
00:12:11,648 --> 00:12:12,816
ఏం పర్లేదు.

106
00:12:14,234 --> 00:12:18,447
నీ విమానం వచ్చి, నాలుగు గంటలు అయిందా?

107
00:12:19,239 --> 00:12:20,574
సుమారుగా అంతే. హా.

108
00:12:23,911 --> 00:12:25,078
మరి ఇప్పటి దాకా ఎక్కడికి వెళ్ళావు?

109
00:12:26,705 --> 00:12:27,706
కొన్ని పనులు ఉంటే చూసుకున్నా.

110
00:12:32,127 --> 00:12:33,295
పనులా?

111
00:12:33,962 --> 00:12:35,339
అవును, పనులు.

112
00:12:35,339 --> 00:12:37,466
ఏ పనులు?

113
00:12:37,466 --> 00:12:38,675
మామూలు పనులే.

114
00:12:39,635 --> 00:12:40,928
జోనథన్ సీగల్ పనులా?

115
00:12:43,680 --> 00:12:45,474
నా పేరు థామస్ కింజీ, మిస్టర్ సీగల్ లాయరుని.

116
00:12:45,474 --> 00:12:46,558
నా పేరు షుగర్.

117
00:12:46,558 --> 00:12:48,060
స్వాగతం. ఆయన గార్డెనులో ఉన్నాడు.

118
00:12:48,060 --> 00:12:50,270
- మళీ నాపై నిఘా ఉంచావా?
- లేదు, నేను...

119
00:12:50,270 --> 00:12:53,357
నాకు థామస్ కింజీ నుండి ఫోన్ వచ్చింది.

120
00:12:53,357 --> 00:12:55,359
అవును, మీ ఒప్పందం గురించి చెప్పాడు,

121
00:12:55,359 --> 00:12:59,446
అది నాకు చాలా వింతగా అనిపించింది, ఎందుకంటే,
ఆయన మూడు రోజుల క్రితం నాకు కాల్ చేసినప్పుడు,

122
00:12:59,446 --> 00:13:03,408
నువ్వు ఆ పని చేయవని అతనికి చాలా స్పష్టంగా చెప్పాను.

123
00:13:05,327 --> 00:13:06,328
చెప్పావేమో.

124
00:13:06,328 --> 00:13:08,413
మీరు అందించిన రెఫరెన్సులకు కాల్ చేశాము.

125
00:13:08,997 --> 00:13:11,041
వాళ్లందరూ మీరు చాలా నిబద్ధత గలవారని చెప్పారు.

126
00:13:11,041 --> 00:13:12,459
కుటుంబ విషయాలను

127
00:13:12,459 --> 00:13:15,754
మిస్టర్ సీగల్ అస్సలు బయటకు పొక్కనిచ్చే రకం కాదు.

128
00:13:15,754 --> 00:13:18,882
ఈ విషయాల గురించి ఏ ఒక్క సమాచారం బయటకు పొక్కినా

129
00:13:18,882 --> 00:13:20,968
ఆయన చాలా బాధపడతాడు.

130
00:13:21,552 --> 00:13:23,887
- అక్కడ ఉన్నాడు.
- హా.

131
00:13:26,098 --> 00:13:28,684
మీకు నచ్చినన్ని మొక్కలు నాటండి.
కానీ ఇక్కడ మరింత మట్టిని తీసుకురండి.

132
00:13:28,684 --> 00:13:30,686
అంతే. థ్యాంక్యూ. చాలా చాలా థ్యాంక్స్.

133
00:13:32,312 --> 00:13:35,524
షుగర్, జోనథన్ సీగల్.

134
00:13:35,524 --> 00:13:37,943
మిమ్మల్ని కలవడం నా భాగ్యం, సర్.
మీ సినిమాలకు నేను వీరాభిమానిని.

135
00:13:37,943 --> 00:13:41,154
మీరు నిర్మించిన ప్రతీ సినిమాను నేను చూశాను.

136
00:13:41,154 --> 00:13:43,490
చాలా వరకు అయితే, అయిదు, ఆరు సార్లు చూశాను,

137
00:13:43,490 --> 00:13:45,534
"మిస్టరీ మహిళ" సినిమా తప్ప.

138
00:13:45,534 --> 00:13:47,661
దాన్ని నేను ఎన్నిసార్లు చూశానో లెక్కే లేదు.

139
00:13:49,454 --> 00:13:52,583
- ఇక నువ్వు బయలుదేరవచ్చు, టామ్. నీకు తర్వాత కాల్ చేస్తా.
- మిస్టర్ షుగర్.

140
00:13:52,583 --> 00:13:53,667
థ్యాంక్యూ.

141
00:13:54,751 --> 00:13:55,878
- మనం లోపలికి వెళ్దామా?
- సరే.

142
00:13:57,337 --> 00:14:00,340
అయితే, మీకు సినిమాలంటే ఇష్టమా?

143
00:14:00,841 --> 00:14:02,843
ఇష్టమా? ఇష్టం అనేది...

144
00:14:02,843 --> 00:14:05,220
చాలా చిన్న పదం. నాకు పిచ్చి అని చెప్పవచ్చు.

145
00:14:08,515 --> 00:14:11,059
అది నాకు సరదాగా అనిపించట్లేదు, జాన్.
నాకు అస్సలు అనిపించట్లేదు.

146
00:14:12,269 --> 00:14:14,980
ఏ క్లయింట్ అయినా నిన్ను నేరుగా సంప్రదిస్తే,
నన్ను అమర్యాద పరిచినట్టే కదా.

147
00:14:15,606 --> 00:14:17,274
నువ్వు నా మనిషివి.

148
00:14:17,274 --> 00:14:20,861
పైగా టోక్యో పని పూర్తి అయ్యాక
నువ్వు కొంత కాలం విరామం తీసుకోవాలని

149
00:14:20,861 --> 00:14:22,988
మనిద్దరి మధ్య ఒప్పందం కూడా ఉంది.

150
00:14:24,114 --> 00:14:25,616
ఆ విరామం చాలా అవసరం.

151
00:14:25,616 --> 00:14:27,743
నీ గురించి ఎమిలీ కార్పెంటరుతో మాట్లాడాను.

152
00:14:30,037 --> 00:14:33,123
నువ్వు ఒక్కటంటే ఒక్కటే పని చేస్తావని ఎమిలీ చెప్పింది.

153
00:14:33,874 --> 00:14:34,958
విషయాలను రహస్యంగా ఉంచాలనుకునే

154
00:14:36,627 --> 00:14:38,712
నా లాంటి వాళ్లకు, తప్పిపోయిన వాళ్ల ఆచూకీని

155
00:14:39,796 --> 00:14:41,298
కనిపెడతావని చెప్పింది.

156
00:14:42,216 --> 00:14:44,676
- రూబీ, నన్ను సంప్రదించింది జోనథన్ సీగల్.
- ఎవరైతే నాకేంటి!

157
00:14:46,720 --> 00:14:48,055
ఒక అమ్మాయి కనబడట్లేదు.

158
00:14:49,765 --> 00:14:50,891
అతని మనవరాలు.

159
00:14:51,892 --> 00:14:55,687
ఆమెకి ఇప్పుడు పాతికేళ్లు,
కానీ ఇప్పటికీ ఆయన దృష్టిలో ఆమె పసిపిల్లే.

160
00:14:55,687 --> 00:14:58,315
ఒలీవియా రెండు వారాల నుండి ఏమైందో తెలీట్లేదు.

161
00:15:01,151 --> 00:15:05,322
నా కొడుకు బెర్నార్డ్,
కొన్ని రోజుల క్రితమే నాకు విషయం చెప్పాడు.

162
00:15:05,864 --> 00:15:09,576
తను అప్పుడప్పుడూ చెప్పాపెట్టకుండా
వెళ్లిపోతుంది కదా, ఇది కూడా అలాంటిదే అనుకున్నాడు.

163
00:15:09,576 --> 00:15:11,995
నువ్వు కోరిన వాటిని,
టామ్ మనుషులకు చెప్పి ఏర్పాటు చేయించాను.

164
00:15:16,208 --> 00:15:18,460
- ఆ ఫోటోలో ఉండేది తనే.
- చాలా అందంగా ఉంది.

165
00:15:19,837 --> 00:15:22,464
ఈమె ఇలా ఇంతకు ముందు చేసిందా? అంటే ఇలా వెళ్లిపోవడం?

166
00:15:23,173 --> 00:15:28,178
వెళ్లింది. కానీ, దానికి కారణం ఏంటంటే,
చాలా ఏళ్లు తను డ్రగ్స్ కి బానిసగా ఉండేది,

167
00:15:28,178 --> 00:15:32,015
చాలాసార్లు రోజులపాటు,
కొన్నిసార్లు అయితే నెలలపాటు ఎటో వెళ్లిపోయేది.

168
00:15:32,015 --> 00:15:34,726
కానీ ఈసారి ఏదో జరిగింది.
మీరు కంగారుపడుతున్నారు. ఎందుకు?

169
00:15:35,769 --> 00:15:40,023
ఒలీవియా చెప్పాపెట్టకుండా
వెళ్లిపోయినప్పుడు, తను నాకు కాల్ చేసేది.

170
00:15:40,023 --> 00:15:41,984
ప్రతిసారి డబ్బు కోసం కాల్ చేసేది,

171
00:15:41,984 --> 00:15:43,277
నేను ఇచ్చేవాడిని కూడా.

172
00:15:43,277 --> 00:15:45,445
కానీ ఈసారి ఆమె కాల్ చేయలేదా? కాల్స్ కానీ...

173
00:15:45,445 --> 00:15:47,739
లేదు, ఈసారి అదేమీ లేదు.

174
00:15:48,240 --> 00:15:49,825
ఒలీవియాని మీరు చివరిసారిగా ఎప్పుడు చూశారు?

175
00:15:51,952 --> 00:15:54,621
సుమారుగా ఒక నెల క్రిందట చూశా.
అప్పుడు తనని డిన్నర్ కి తీసుకెళ్లా.

176
00:15:54,621 --> 00:15:57,249
తను డ్రగ్స్ కి దూరంగా ఉండి
రెండేళ్లు అయిన సందర్భంగా పార్టీ చేసుకున్నాం.

177
00:15:57,791 --> 00:16:00,377
ఆ విషయంలో తను చాలా గర్వపడింది. నేను కూడా.

178
00:16:01,628 --> 00:16:05,549
ఆ రాత్రి తను చాలా కొత్తగా కనిపించింది.

179
00:16:05,549 --> 00:16:07,009
కొత్తగా? అంటే ఎలా?

180
00:16:07,634 --> 00:16:13,056
తనలో నాకు ఆశలు, ఆత్మవిశ్వాసం,
కుతూహలం, హాస్యచతురత అన్నీ కనిపించాయి.

181
00:16:14,892 --> 00:16:18,020
ఎట్టకేలకు తను ఒక మార్గంలోకి వచ్చిందని
అప్పుడు నాకు చాలా స్పష్టంగా అర్థమైంది.

182
00:16:18,020 --> 00:16:19,396
ఒక మార్గం అంటే ఏ మార్గంలోకి, సర్?

183
00:16:21,148 --> 00:16:22,608
మంచి మార్గంలోకి.

184
00:16:27,446 --> 00:16:29,031
నాకు వయస్సు అయిపోయింది, షుగర్,

185
00:16:30,073 --> 00:16:32,451
నా ఆరోగ్యం కూడా ఇప్పుడు అంత బాగా లేదు.

186
00:16:33,577 --> 00:16:34,620
గుండె సంబంధిత వ్యాధి ఉంది.

187
00:16:35,913 --> 00:16:38,165
ఇప్పుడు నాకు నా మనవరాలు తప్ప

188
00:16:39,666 --> 00:16:41,752
ఇంకేది ఎక్కువ కాదు.

189
00:16:43,921 --> 00:16:47,382
దయచేసి తన ఆచూకీని కనిపెట్టు.

190
00:16:49,718 --> 00:16:51,094
అది అతని సమస్య.

191
00:16:52,179 --> 00:16:53,847
నా సమస్య కాదు, నీది కూడా కాదు.

192
00:16:58,560 --> 00:16:59,728
త్వరలోనే కలుద్దాం.

193
00:17:00,687 --> 00:17:01,939
అది సరదాగా అనిపించట్లేదు, జాన్.

194
00:17:01,939 --> 00:17:04,525
నువ్వు ఇప్పుడే థామస్ కింజీకి కాల్ చేసి, ఉన్న విషయం చెప్పేయ్.

195
00:17:05,233 --> 00:17:06,108
రూబీ,

196
00:17:07,736 --> 00:17:08,819
నేను ఆ పని చేయలేను.

197
00:17:10,571 --> 00:17:12,991
ఆ పని నేను చేయలేను. ఆ అమ్మాయి ఉందే.

198
00:17:19,790 --> 00:17:21,083
తనని చూస్తే నాకు జెన్ గుర్తొచ్చింది.

199
00:17:25,170 --> 00:17:26,171
హా.

200
00:17:29,299 --> 00:17:30,467
ఏం చెప్పాలో నాకు తెలీట్లేదు.

201
00:17:31,343 --> 00:17:32,886
తను...

202
00:17:40,352 --> 00:17:43,438
ఓహో. నువ్వు మామూలోడివి కాదు.

203
00:17:43,438 --> 00:17:44,648
ఏంటి?

204
00:17:44,648 --> 00:17:46,567
నేను ఏం చెప్తే కరిగిపోతానో నీకు బాగా తెలుసు, కదా?

205
00:17:46,567 --> 00:17:49,278
- నిన్ను కరిగించాలని నేను ఇది చెప్పలేదు, రూబీ.
- హా.

206
00:17:49,278 --> 00:17:53,991
నేను తన ఫోటోలను చూడగానే, నాకు జెన్ గుర్తొచ్చింది.

207
00:17:55,117 --> 00:17:56,743
సరే. నీకు ఇవి అవసరం అవుతాయి.

208
00:17:56,743 --> 00:17:58,579
తుపాకీలను తీసుకెళ్లడానికి అనుమతి,

209
00:17:58,579 --> 00:18:00,914
పునరుద్ధరించబడిన కాలిఫోర్నియా డిటెక్టివ్ లైసెన్స్,

210
00:18:00,914 --> 00:18:01,999
- డ్రైవింగ్ లైసెన్స్...
- ఆగు. ఆగాగు.

211
00:18:01,999 --> 00:18:05,043
తుపాకీలను తీసుకెళ్లడానికి అనుమతి నాకెందుకు?

212
00:18:13,427 --> 00:18:15,470
రూబీ, నీకు తెలుసా కదా, నాకు తుపాకులంటే చిరాకు అని.

213
00:18:15,470 --> 00:18:17,514
హా, తెలుసు. కానీ అది...

214
00:18:17,514 --> 00:18:19,016
ఇది మామూలు పాత తుపాకీ కాదు, సరేనా?

215
00:18:19,016 --> 00:18:21,727
"బిగ్ హీట్" సినిమాలో గ్లెన్ ఫోర్డ్ ఉపయోగించిన తుపాకీ.

216
00:18:21,727 --> 00:18:25,731
"బిగ్ హీట్" సినిమాలో గ్లెన్ ఫోర్డ్ ఉపయోగించిన తుపాకీ అంటే?

217
00:18:25,731 --> 00:18:27,649
అంటే ఇది ఆ తుపాకీని ఆధారంగా తీసుకొని చేసిన తుపాకీయా?

218
00:18:27,649 --> 00:18:29,902
కాదు, ఇది డూప్లికేట్ కాదు.

219
00:18:29,902 --> 00:18:31,486
గ్లెన్ ఫోర్డ్?

220
00:18:31,987 --> 00:18:33,530
హా, అతను ఉపయోగించిన తుపాకీయే ఇది.

221
00:18:33,530 --> 00:18:34,865
- ఈ తుపాకీని గ్లెన్ ఫోర్డ్ వాడాడా?
- నేను...

222
00:18:34,865 --> 00:18:37,409
- హా. చెప్పు.
- ఈ తుపాకీని గ్లెన్ ఫోర్డ్ వాడాడు.

223
00:18:38,493 --> 00:18:39,578
- అయ్య బాబోయ్.
- హా,

224
00:18:39,578 --> 00:18:41,079
నేను దీన్ని ప్రైవేట్ కలెక్టర్ నుండి సంపాదించా.

225
00:18:41,079 --> 00:18:43,790
కేవలం నీ కోసమే, ఇది పని చేసే తుపాకీగా మార్పించా.

226
00:18:44,416 --> 00:18:46,877
- ఎందుకు?
- నీ దగ్గర తుపాకీ ఉంటే,

227
00:18:46,877 --> 00:18:47,961
నాకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.

228
00:18:48,462 --> 00:18:51,590
అదీగాక, ఈ పని చేస్తే కానీ,
నువ్వు తుపాకీ పెట్టుకోవని నాకు తెలుసు.

229
00:18:51,590 --> 00:18:53,342
ఎవరు ఎవరిని ఆడిస్తున్నారు?

230
00:18:54,510 --> 00:18:58,180
- వావ్. థ్యాంక్యూ.
- అంతే. మరేం పర్వాలేదు.

231
00:18:58,180 --> 00:19:01,308
- కానీ, నాకు వద్దులే, థ్యాంక్యూ.
- లేదు. లేదు.

232
00:19:02,476 --> 00:19:04,937
నీకు ఇవన్నీ ఇస్తా, కానీ నువ్వు నాకు మాటివ్వాలి.

233
00:19:05,646 --> 00:19:07,105
మాట అంటే?

234
00:19:07,105 --> 00:19:09,149
ఈ తుపాకీని నువ్వు ఈ క్షణమే

235
00:19:09,149 --> 00:19:10,609
- తీసుకువెళ్లాలి.
- అలాగే.

236
00:19:10,609 --> 00:19:12,861
సరే, నువ్వు డాక్టర్ వికర్స్ కి చూపించుకోవాలి.

237
00:19:13,779 --> 00:19:15,489
రూబీ, నాకు...

238
00:19:15,489 --> 00:19:17,824
నా ఆరోగ్యం చాలా బాగా ఉంది. నేను చక్కగా ఉన్నాను.

239
00:19:17,824 --> 00:19:21,245
అబద్ధాలు చెప్పకు, జాన్.
నీ గురించి నాకు తెలుసు. అది నీకూ తెలుసు.

240
00:19:21,245 --> 00:19:24,331
- డాక్టర్ వికర్స్ కి నేను చూపించుకోనక్కర్లేదు.
- సరే, జాన్, నీ చేయి ఎలా ఉంది?

241
00:19:29,545 --> 00:19:30,546
చెప్పు.

242
00:19:31,880 --> 00:19:32,881
నా చేయి బాగానే ఉంది.

243
00:19:37,261 --> 00:19:38,178
సరే.

244
00:19:38,846 --> 00:19:41,139
నువ్వు సీగల్ కేసు తీసుకో.
కానీ అది అయ్యాక, నువ్వు పని ఆపేయాలి.

245
00:19:41,139 --> 00:19:42,224
అలాగే.

246
00:19:43,725 --> 00:19:45,185
నేను మళ్లీ చేయమనే దాకా నువ్వు పని చేయకూడదు.

247
00:19:46,311 --> 00:19:47,980
- సరే. తీసుకో.
- అలాగే.

248
00:19:49,231 --> 00:19:52,234
- నువ్వు ఒకటి మర్చిపోతున్నావు.
- లేదు, ఇవే అన్నీ.

249
00:19:52,234 --> 00:19:56,154
నీ ఎడమ చేతిలో ఉంది అది. చూపించు, చూపించు.

250
00:19:56,154 --> 00:19:57,656
థ్యాంక్యూ.

251
00:20:10,711 --> 00:20:12,421
ఈ అద్భుతాన్ని నువ్వు నడపడం నాకు ఇష్టముండదు.

252
00:20:12,421 --> 00:20:15,007
అద్భుతం కాదు, ఇది కళాఖండం.

253
00:20:22,681 --> 00:20:23,515
సరే మరి.

254
00:20:23,515 --> 00:20:24,766
- థ్యాంక్యూ.
- మరేం పర్వాలేదు.

255
00:20:25,350 --> 00:20:27,477
- నువ్వు డెల్ కోరెజాన్ హోటల్ లోనే ఉంటావు కదా.
- అంతేగా.

256
00:20:28,103 --> 00:20:29,646
నువ్వు అంతంత ఖర్చు పెట్టి అక్కడ ఉండే బదులు,

257
00:20:29,646 --> 00:20:32,357
- ఒక మంచి ఇల్లు కొనుక్కోవచ్చు.
- నాకు ఆ హోటల్ అంటే ఇష్టం.

258
00:20:32,357 --> 00:20:34,902
రోజుకు రెండుసార్లు గదిని ఊడ్చే పనివాళ్లు ఉంటారు.

259
00:20:34,902 --> 00:20:38,864
నాకు కావలసిన పనుల్లో సాయపడే సహాయకుడు
ఉంటాడు. అక్కడ రూమ్ సర్వీస్ కూడా ఉంటుంది.

260
00:20:38,864 --> 00:20:41,909
అదేం కాదు, అక్కడ పని చేసే వాళ్లు
నీకు ఆత్మీయులుగా అనిపిస్తారు,

261
00:20:41,909 --> 00:20:43,577
- అందుకే నీకు ఆ చోటు నచ్చుతుంది.
- నిజంగా?

262
00:20:43,577 --> 00:20:45,412
- హా, నీకు ఒక కుటుంబంలా అనిపించడం బాగుంది.
- వావ్.

263
00:20:46,288 --> 00:20:49,583
హా. కానీ అదంతా భ్రమ, షుగర్. నీకు ఇల్లు కావాలి.

264
00:21:19,112 --> 00:21:20,113
మిస్టర్ బాస్కోంబ్?

265
00:21:20,113 --> 00:21:22,282
నేనే. మీరు గ్యారీ అని పిలవవచ్చు.

266
00:21:22,282 --> 00:21:24,618
- నా పేరు జాన్ షుగర్.
- హాయ్. హా, మిస్టర్ కింజీ ఆఫీసు నుండి కాల్ వచ్చింది,

267
00:21:24,618 --> 00:21:26,370
- మిమ్మల్ని లోపలికి అనుమతించమని చెప్పారు. కాబట్టి...
- సూపర్.

268
00:21:26,370 --> 00:21:30,707
ఒక్క నిమిషం. ఇక్కడ ఉండే ప్రతీ ఒక్కరికీ
సొంతంగా ఒక పార్కింగ్ స్లాట్ ఉంటుందా?

269
00:21:30,707 --> 00:21:32,209
హ, ఉంటుంది. కొందరికైతే రెండు స్లాట్లు ఉన్నాయి.

270
00:21:32,918 --> 00:21:34,419
మిస్ సీగల్ కి చెందిన పార్కింగ్ స్లాట్ చూపించగలరా?

271
00:21:35,087 --> 00:21:36,421
తప్పకుండా. ఇలా రండి.

272
00:21:40,175 --> 00:21:43,011
ఈ కారు రెండు వారాల నుండి ఇక్కడే ఉంది.

273
00:21:43,011 --> 00:21:46,723
అది మీకెలా తెలుసు? ఇక్కడి కార్లన్నింటినీ
అనుక్షణం కనిపెట్టుకొని ఉండటం అసాధ్యం కదా?

274
00:21:46,723 --> 00:21:50,227
లేదు, లేదు. ఇక్కడ ఉండేవారి కార్లన్నింటిలో
పార్కింగ్ గేట్ తెరవడానికి కావలసింది ఉంటుంది,

275
00:21:50,227 --> 00:21:52,020
వాళ్లు బయటకు వెళ్లిన ప్రతిసారి,
అది సమయాన్ని రికార్డ్ చేస్తుంది.

276
00:21:52,020 --> 00:21:55,566
ఆ సమయాలన్నీ నా ఆఫీసులో ఉండే
సెక్యూరిటీ కంప్యూటరులో ఉంటాయి...

277
00:21:57,943 --> 00:22:00,279
మీ దగ్గర డూప్లికేట్ తాళాలు ఏమైనా ఉంటాయా?

278
00:22:00,279 --> 00:22:02,239
కార్లకా? కార్లకు ఉండవు, ఇళ్ళకు మాత్రమే ఉంటాయి.

279
00:22:02,239 --> 00:22:04,491
సరే. ఇప్పుడు ఈమె ఇంటికి వెళ్దామా?

280
00:22:04,491 --> 00:22:05,784
హా, సరే. ఇలా రండి.

281
00:22:08,537 --> 00:22:11,081
సరే మరి, ఇదే ఇల్లు.

282
00:22:12,833 --> 00:22:15,210
ఈమె ఎవరో కూడా నాకు తెలీదు.
ఈమె కుటుంబ వివరాలతో సహా ఏ వివరాలూ తెలీవు.

283
00:22:15,210 --> 00:22:17,296
- గ్యారీ, థ్యాంక్యూ. మీకు ధన్యవాదాలు.
- పర్లేదు.

284
00:22:17,296 --> 00:22:19,298
ఇక్కడి నుండి నేనే చూసుకుంటాలే.
తాళం చెవులు కూడా ఇచ్చేయండి.

285
00:22:20,215 --> 00:22:23,468
అన్ని ఇళ్ల తాళం చెవులు నా దగ్గర ఉంటాయి.
నేను బిల్డింగ్ మేనేజర్ ని కదా.

286
00:22:23,468 --> 00:22:24,928
హా, అవును. కానీ ఇది అపార్టుమెంటు కదా,

287
00:22:24,928 --> 00:22:27,598
ఇక్కడి ఫ్లాట్ల తాళం చెవులన్నీ చట్టపరంగా
అపార్టుమెంట్ యజమానికే చెందుతాయి,

288
00:22:27,598 --> 00:22:31,226
ఆ యజమాని, జోనథన్ సీగల్.
ఆయన ప్రతినిధిగా మిమ్మల్ని అడుగుతున్నాను.

289
00:22:31,226 --> 00:22:32,311
థ్యాంక్యూ.

290
00:22:32,311 --> 00:22:35,731
కానీ ఏదైనా జరిగితే? అంటే, ఏదైనా పైపు లీక్ అయితే?

291
00:22:35,731 --> 00:22:37,232
ఇది నా నంబరు, దీనికి కాల్ చేయండి.

292
00:22:38,233 --> 00:22:40,068
- మీకు కాల్ చేయాలా?
- అవును, థ్యాంక్యూ.

293
00:22:40,777 --> 00:22:41,778
మరేం పర్వాలేదు.

294
00:22:52,456 --> 00:22:53,457
ఇల్లు చాలా బాగుంది.

295
00:22:56,752 --> 00:22:59,796
ఈమె సీగల్ వంశస్థురాలు కదా, బాగానే ఉంటుంది మరి.

296
00:23:06,303 --> 00:23:07,930
వివేకవంతమైన స్త్రీవాదానిదే పైచేయి
జిప్పర్ క్లబ్

297
00:23:07,930 --> 00:23:10,140
{\an8}ఏప్రిల్ 4 శనివారం
వెన్నిలా హోర్

298
00:23:32,913 --> 00:23:36,166
ఎవరు నువ్వు? నీకు ఇక్కడ ఏం పని?

299
00:23:36,166 --> 00:23:39,002
- నేను కూడా మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నా.
- కెన్నీ! కెన్నీ!

300
00:23:40,963 --> 00:23:45,175
వావ్. అంత ఆవేశం పనికి రాదు.

301
00:23:45,175 --> 00:23:47,845
నేను నిన్ను ఒక ప్రశ్న అడిగాను కదరా. ఎవరు నువ్వు?

302
00:23:47,845 --> 00:23:49,096
నా పేరు జాన్ షుగర్.

303
00:23:49,096 --> 00:23:51,890
నేను కాలిఫోర్నియా రాష్ట్రం నుండి
లైసెన్స్ పొందిన ప్రైవేట్ డిటెక్టివ్ ని.

304
00:23:51,890 --> 00:23:55,227
- నా జేబులో గుర్తింపు కార్డ్ కూడా ఉంది.
- హేయ్, ప్యాంట్ జేబులో చేతులు పెట్టకు.

305
00:23:55,227 --> 00:23:56,311
సరే.

306
00:24:01,233 --> 00:24:02,776
సారీ, మిమ్మల్ని మొదటే గుర్తించలేకపోయా.

307
00:24:03,652 --> 00:24:04,736
మీరు డేవీ సీగలే కదా.

308
00:24:04,736 --> 00:24:05,821
డేవిడ్.

309
00:24:06,780 --> 00:24:08,031
ఇప్పుడు డేవీ కాదు.

310
00:24:08,031 --> 00:24:09,741
ఈమధ్యే మీరు ఒక సీక్వెల్ షూటింగ్ పూర్తి చేశారు కదా?

311
00:24:09,741 --> 00:24:11,743
"అయోమయపు కుర్రాడు" అనే సినిమాకి,

312
00:24:11,743 --> 00:24:14,872
అందులో అబ్బాయి అలానే ఉంటాడు,
కానీ అతని వయస్సు పెరిగిపోతూ ఉంటుంది.

313
00:24:14,872 --> 00:24:16,623
- అవును.
- ఆ విషయంలో గుడ్ లక్.

314
00:24:17,624 --> 00:24:20,210
మీరు కాస్త అది దించుతారా?
తుపాకులంటే నాకు చిరాకు.

315
00:24:21,795 --> 00:24:22,796
థ్యాంక్యూ.

316
00:24:23,881 --> 00:24:25,257
నీకు ఇక్కడ ఏం పని?

317
00:24:25,257 --> 00:24:26,633
మీ చెల్లి కనబడట్లేదు కదా,

318
00:24:26,633 --> 00:24:28,594
ఆ సంగతి చూసే పని మీ తాతగారు నాకు అప్పగించారు.

319
00:24:28,594 --> 00:24:30,470
కావాలంటే మీరు ఆయనకి కానీ, ఆయన లాయరు మిస్టర్ కింజీకి కానీ

320
00:24:30,470 --> 00:24:33,724
- ఫోన్ చేసి కనుక్కోవచ్చు.
- పరవాలేదులే. నేను మిమ్మల్ని నమ్ముతున్నా.

321
00:24:33,724 --> 00:24:35,976
సరే. ఇక మనం కలవగానే మాట్లాడుకున్న మాటల దగ్గరికి వద్దాం.

322
00:24:37,811 --> 00:24:38,937
- ఏంటది?
- అదే,

323
00:24:38,937 --> 00:24:40,480
నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్పా,

324
00:24:40,480 --> 00:24:42,649
కానీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో ఇంకా నాకు చెప్పలేదు.

325
00:24:42,649 --> 00:24:45,068
- ఇక్కడికి వెళ్లమని మా నాన్న చెప్పాడు.
- నిజంగా?

326
00:24:45,068 --> 00:24:47,863
ఒలీవియా వచ్చేసిందో లేదో చూడటానికి నేను రోజూ ఇక్కడికి రావాలి.

327
00:24:47,863 --> 00:24:50,157
- మీకు తాళం చెవులు ఎక్కడివి?
- నాన్న ఇచ్చాడు.

328
00:24:51,283 --> 00:24:55,537
మీ చెల్లి కోసమని జోనథన్ తీసుకొన్న ఫ్లాటుకు
సంబంధించిన డూప్లికేట్ తాళం చెవులు బర్నీ దగ్గర ఉన్నాయా?

329
00:24:55,537 --> 00:24:57,831
సొంత చెల్లి కాదు. కానీ, ఉన్నాయి.

330
00:24:57,831 --> 00:25:00,083
మరి డోర్ బెల్ ఎందుకు కొట్టలేదు?
పోనీ, తలుపు ఎందుకు తట్టలేదు?

331
00:25:04,087 --> 00:25:06,423
- ఏంటి?
- మీరు ఒలీవియా కోసమే ఇక్కడికి వచ్చారు కదా?

332
00:25:06,423 --> 00:25:09,968
ఆమె వచ్చేసి ఉండవచ్చు కదా,
కానీ ఆమె రాలేదనే ఫీలింగ్ లోనే ఉన్నారు మీరు.

333
00:25:09,968 --> 00:25:11,261
హా, తను మత్తులో ఉండవచ్చు.

334
00:25:11,845 --> 00:25:13,805
ఒలీవియా గురించి మీకు ఎంత తెలుసో ఏమో కానీ,

335
00:25:14,473 --> 00:25:16,016
ఒకసారి డ్రగ్స్ కి అలవాటు పడ్డాక, ఆ అలవాటు పోదు.

336
00:25:18,936 --> 00:25:21,980
- మీరు దారుణంగా అబద్ధాలు ఆడతారు, డేవీ.
- డేవిడ్ అని పిలవండి.

337
00:25:21,980 --> 00:25:23,398
మీరు చెప్పేది అబద్ధమని పిల్లలైనా చెప్పేయగలరు.

338
00:25:25,859 --> 00:25:27,027
ఏదేమైనా ఒలీవియా ఇక్కడ లేదు.

339
00:25:27,027 --> 00:25:28,111
హా, అది నాకు కూడా అర్థమైంది.

340
00:25:29,029 --> 00:25:31,573
కాబట్టి, ఇక్కడ మీకు ఇంకేం పని లేదు కదా?

341
00:25:37,079 --> 00:25:38,080
సూట్ బాగుంది.

342
00:25:38,080 --> 00:25:39,248
గుడ్ నైట్, కెన్నీ.

343
00:25:40,249 --> 00:25:41,625
అభిమానిని ఎప్పుడు కలిసినా నాకు ఆనందమే.

344
00:25:43,460 --> 00:25:44,461
బాగా చెప్పారు.

345
00:25:44,962 --> 00:25:46,672
ఇది భలే చిత్రంగా ఉంది.

346
00:25:47,172 --> 00:25:48,215
అతని ముఖంలో భయం కనిపించింది.

347
00:25:48,215 --> 00:25:49,675
{\an8}"పరాయా" సినిమా ముచ్చట్లు

348
00:25:49,675 --> 00:25:51,176
{\an8}కానీ ఆ భయం ఎందుకు?

349
00:25:52,135 --> 00:25:53,136
ఎవరంటే భయం?

350
00:26:00,227 --> 00:26:01,395
ఈమె ఒలీవియా అమ్మ.

351
00:26:01,979 --> 00:26:03,981
హా, చూడగానే తెలిసిపోతోంది.

352
00:26:03,981 --> 00:26:05,399
ఒకటే కళ్లు ఇద్దరివీ.

353
00:26:06,900 --> 00:26:08,068
రేచల్ కేయ్.

354
00:26:08,652 --> 00:26:10,112
ఈమెది కూడా అదే ధీన గాథ.

355
00:26:40,184 --> 00:26:41,643
తెల్ల జుట్టు మహిళ ఎవరో నాకు తెలుసు.

356
00:26:41,643 --> 00:26:42,895
మెలనీ మ్యాథ్యూస్.

357
00:26:42,895 --> 00:26:45,731
ఒకప్పుడు ఒలీవియాకి సవతి తల్లి ఈమె,
అలాగే గొప్ప రాక్ స్టార్ కూడా.

358
00:26:45,731 --> 00:26:46,857
స్టెప్-హాయ్
18/01/2023

359
00:26:46,857 --> 00:26:48,150
కానీ ఇది ఈ మధ్య తీసిన ఫోటోనే.

360
00:26:53,071 --> 00:26:53,947
ఈమెకి ఏమైనా తెలిసి ఉండవచ్చేమో.

361
00:26:56,783 --> 00:26:58,076
స్టెప్-హాయ్ లాంజ్.

362
00:26:59,036 --> 00:27:02,080
మెలనీ ఇంట్లో లేదు, కాబట్టి ఆ ఫోటోలోని బారులో ఆమె ఉండవచ్చేమో.

363
00:27:04,208 --> 00:27:05,209
ఈ బార్ నాకు బాగానే తెలుసు.

364
00:27:06,793 --> 00:27:08,795
కాక్టెయిల్స్
స్టెప్ హాయ్

365
00:27:21,266 --> 00:27:22,267
నీ పేరేంటి, మిత్రమా?

366
00:27:23,810 --> 00:27:26,271
- కార్ల్.
- కార్ల్. నా పేరు జాన్.

367
00:27:26,855 --> 00:27:29,191
నిన్ను కలవడం బాగుంది, కార్ల్. ఈ కుక్క పేరేంటి?

368
00:27:29,900 --> 00:27:31,026
- దీని పేరు వైలీ.
- నేను దాన్ని...

369
00:27:31,818 --> 00:27:34,238
- అలాగే.
- హేయ్. హేయ్, వైలీ.

370
00:27:36,073 --> 00:27:37,991
హేయ్, కార్ల్, నువ్వు నాకొక సాయం చేయగలవా?

371
00:27:38,492 --> 00:27:39,868
నా కారును గమనిస్తూ ఉంటావా?

372
00:27:39,868 --> 00:27:42,788
నేను నీకు 200 డాలర్లు ఇస్తాను.

373
00:27:43,330 --> 00:27:44,790
నువ్వేమీ చేయాల్సిన పని లేదు. ఊరికే...

374
00:27:48,627 --> 00:27:52,548
ఎవరైనా దాన్ని దొంగలించాలని చూసినా,
లేదా దానికి మరీ దగ్గరగా వచ్చినా,

375
00:27:52,548 --> 00:27:54,967
నువ్వు చేయాల్సిందల్లా... ఇదుగో ఫోన్.

376
00:27:56,051 --> 00:27:57,678
ఈ నంబరుకు కాల్ చేయ్, చాలు.

377
00:27:59,221 --> 00:28:00,556
ఇవిగో 100 డాలర్లు.

378
00:28:00,556 --> 00:28:03,267
మళ్లీ వచ్చాక, మిగతా 100 డాలర్లు ఇస్తా. ఓకేనా?

379
00:28:03,767 --> 00:28:06,270
- హా. డబుల్ ఓకే.
- సరే మరి.

380
00:28:08,188 --> 00:28:10,315
- హేయ్ వైలీ.
- ఇది మనుషులతో ఇట్టే కలిసిపోతుంది.

381
00:28:11,984 --> 00:28:13,235
నువ్వు మంచి మనిషివి, కార్ల్.

382
00:28:24,204 --> 00:28:26,206
మనం మామూలోళ్లం కాదు

383
00:28:27,624 --> 00:28:30,627
నేను బయటకు వచ్చాను

384
00:28:30,627 --> 00:28:33,714
అడ్డూ అదుపూ లేకుండా

385
00:28:35,382 --> 00:28:41,513
రహదారుల్లో ఒక్కదాన్నే దూసుకుపోతున్నాను

386
00:28:44,057 --> 00:28:46,518
మొదట, ఒలీవియాతో ఫోటోలో కనిపించిన ఈమె

387
00:28:46,518 --> 00:28:48,812
ఇక్కడ కనిపించడం కాకతాళీయంగా జరిగిందేమో అనుకున్నా.

388
00:28:48,812 --> 00:28:52,274
కానీ, ఈమె ఎక్కువగా ఇక్కడే
ఉంటుందని నాకు ఎందుకో అనిపిస్తోంది.

389
00:28:52,816 --> 00:28:54,943
- మీకేం కావాలి?
- ఆమె ఏం తాగుతోందో, అదే ఇవ్వండి.

390
00:28:55,569 --> 00:28:58,322
అది విలెట్ డిస్టిలరీ సింగిల్ బ్యారెల్ బోర్బన్ విస్కీ, సర్.

391
00:28:58,322 --> 00:29:00,782
ఒక్క షాట్ కి 100 డాలర్లు అవుతుంది.

392
00:29:00,782 --> 00:29:03,035
ఉత్త విస్కీ ఒక గ్లాసులో, నీళ్ళు ఒక గ్లాసులో
ఇవ్వండి. తనకి కూడా నేనే కడతా.

393
00:29:03,035 --> 00:29:07,247
అది మీ మంచితనం, కానీ తనకి మగవాళ్లు
డ్రింక్స్ కొని ఇవ్వడం నచ్చదు.

394
00:29:07,789 --> 00:29:08,874
మంచిదే.

395
00:29:10,083 --> 00:29:11,084
థ్యాంక్యూ.

396
00:29:14,922 --> 00:29:16,173
చాలా బాగుంది.

397
00:29:18,050 --> 00:29:21,929
మామూలుగా అయితే నేను స్కాచ్ తాగుతా,
కానీ ఇది తాగాక, ఇదే తాగాలనుంది.

398
00:29:22,471 --> 00:29:23,722
ఎప్పుడైనా రై విస్కీ తాగారా?

399
00:29:25,015 --> 00:29:28,977
రై తాగినా కూడా చాలా బాగుంటుంది.

400
00:29:28,977 --> 00:29:31,647
లేదు, దాన్ని కౌబాయ్ సినిమాల్లో తాగడమే చూశాను.

401
00:29:31,647 --> 00:29:34,024
"బార్టెండర్, ఒక షాట్ రై ఇచ్చుకో," అని అంటుంటారు కదా.

402
00:29:34,024 --> 00:29:35,776
కానీ దాన్ని తాగాలని నాకు ఎప్పుడూ అనిపించలేదు.

403
00:29:45,869 --> 00:29:47,538
- మెలనీ.
- జాన్.

404
00:29:47,538 --> 00:29:49,039
హేయ్, మెలనీ.

405
00:29:50,999 --> 00:29:52,000
మీకు బాగా తాగాలనుందా?

406
00:29:54,211 --> 00:29:55,879
ఈమెకి ఇంకో గ్లాస్ ఇవ్వండి.

407
00:29:58,090 --> 00:30:02,386
నేనెన్ని డ్రింక్స్ తాగానో, మీరు కూడా అన్నే తాగారు.
కానీ నేను మైకంలో ఉన్నాను, మీరు ఏమీ తాగనట్టే ఉన్నారు.

408
00:30:02,386 --> 00:30:06,723
హా, నా ఒంటి తీరు అంతే.

409
00:30:07,224 --> 00:30:12,271
నా శరీరం మందును 50 రెట్లు
ఎక్కువ వేగంతో కరిగించేసుకుంటుంది.

410
00:30:12,271 --> 00:30:15,774
అంటే. ఆ డ్రింక్ ని, ఈ డ్రింక్ ని,
ఈ బారులో ఉన్న డ్రింక్స్ అన్నింటినీ తాగినా,

411
00:30:16,358 --> 00:30:19,111
- నాకు కాస్త మత్తు కూడా ఎక్కదు.
- మీకు మత్తెక్కాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.

412
00:30:19,111 --> 00:30:20,112
అది నిజమే కావచ్చు.

413
00:30:22,364 --> 00:30:23,740
అలాంటప్పుడు మరి తాగడం ఎందుకు?

414
00:30:25,367 --> 00:30:27,452
తాగితే ఏదో తెలీని సంతృప్తి కలుగుతుంది నాకు.

415
00:30:29,037 --> 00:30:30,372
హా.

416
00:30:31,623 --> 00:30:33,125
సినిమాలు చూసి అలవాటు అయింది అనుకుంటా.

417
00:30:34,585 --> 00:30:35,586
నాకు సినిమాలంటే చాలా ఇష్టం.

418
00:30:36,128 --> 00:30:37,254
నాకు సైన్స్ ఫిక్షన్ సినిమాలంటే ఇష్టం.

419
00:30:37,754 --> 00:30:38,964
అవునా?

420
00:30:38,964 --> 00:30:41,300
మీకు నచ్చిన సినిమాలేంటో చెప్పగలరా?

421
00:30:41,300 --> 00:30:44,303
అంటే, ఒక మంచి సైన్స్ ఫిక్షన్ సినిమా...

422
00:30:44,303 --> 00:30:45,971
ఎన్ని ప్రశ్నలు?

423
00:30:48,473 --> 00:30:50,517
ఒక్క నిమిషం. నేను ఒకటి తెల్చాలి.

424
00:30:50,517 --> 00:30:54,104
మీరు వెధవ కాదు,
మీకు పిచ్చి లేదు, కపట బుద్ధి కూడా లేదు.

425
00:30:54,104 --> 00:30:55,731
- లేదు. ఎక్కువ...
- ఇప్పుడే కలిశాం, ఎలా చెప్పగలరు?

426
00:30:55,731 --> 00:30:58,358
ఎక్కువ మంది ఈ వర్గాలకే చెందినవారు ఉంటారు.
అది నాకు తెలుసు. బాగా తెలుసు.

427
00:30:58,358 --> 00:30:59,526
కానీ మీరు కాదు,

428
00:30:59,526 --> 00:31:04,907
కానీ మీలో ఏదో మిస్టరీ ఉంది.

429
00:31:05,782 --> 00:31:10,412
మీకు రహస్యాలు ఉన్నాయి,
మీరు కొన్నిటిని బయటకు అస్సలు చెప్పరు.

430
00:31:10,913 --> 00:31:14,541
వాటిని మీకు నమ్మకస్థులైన కొంతమందితో మాత్రమే పంచుకుంటారు.

431
00:31:14,541 --> 00:31:19,546
అలా మీకు నమ్మకస్థులు అవ్వడం అంత సులభం కాదు.

432
00:31:19,546 --> 00:31:20,923
వావ్.

433
00:31:30,807 --> 00:31:32,351
నన్ను ఇంట్లో దింపగలరా?

434
00:31:34,061 --> 00:31:35,103
పర్వాలేదు.

435
00:31:38,607 --> 00:31:40,609
హేయ్, కార్ల్. థ్యాంక్యూ.

436
00:31:43,153 --> 00:31:45,614
నా పేరు గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్, మిస్టర్ షుగర్.

437
00:31:45,614 --> 00:31:47,741
- జాన్ అని పిలవండి చాలు.
- జాన్.

438
00:31:49,660 --> 00:31:51,453
సరే. ఒక నిమిషంలో వచ్చేస్తా.

439
00:31:52,829 --> 00:31:53,914
థ్యాంక్యూ.

440
00:31:53,914 --> 00:31:55,958
వైలీ, థ్యాంక్యూ. థ్యాంక్యూ.

441
00:31:55,958 --> 00:31:58,335
- దీనికి మీరు బాగా నచ్చారు.
- నాకు కూడా ఇది బాగా నచ్చేసింది.

442
00:31:59,837 --> 00:32:02,548
ఇచ్చిన మాట ప్రకారం ఇవిగోండి. థ్యాంక్యూ, సర్.

443
00:32:03,215 --> 00:32:04,508
- థ్యాంక్యూ, సర్.
- హా.

444
00:32:04,508 --> 00:32:05,592
మిస్టర్ షు... జాన్.

445
00:32:05,592 --> 00:32:07,177
జాన్. జాన్.

446
00:32:07,761 --> 00:32:09,346
సరే మరి. ఇదిగోండి మీ...

447
00:32:09,346 --> 00:32:10,848
ఒకటి చెప్పనా? అది మీరే ఉంచుకోండి.

448
00:32:11,390 --> 00:32:14,726
సరే. ఈరాత్రి మీరు, వైలీ పడుకోవడానికి వీలుగా
ఒక మంచి చోటు చూసుకుంటే బాగుంటుంది.

449
00:32:16,061 --> 00:32:16,895
సరేనా?

450
00:32:17,479 --> 00:32:19,231
- సరే. అలాగే.
- సరే.

451
00:32:19,231 --> 00:32:20,399
మీకు కుటుంబం ఉందా, కార్ల్?

452
00:32:23,485 --> 00:32:26,113
మిల్వాకీలో అక్క ఉంది.

453
00:32:26,613 --> 00:32:29,366
- సరే. ఆమె పేరేంటి?
- సోఫీ.

454
00:32:29,366 --> 00:32:30,951
- సోఫీ?
- అవును.

455
00:32:30,951 --> 00:32:33,996
సోఫీ. ఆమెకి తెలుసా మీరు ఈ స్థితిలో ఉన్నారని?

456
00:32:39,626 --> 00:32:43,338
ఆమెకి... అదీ...

457
00:32:43,338 --> 00:32:46,425
కార్ల్, ఆ ఫోనుతో ఈరాత్రి సోఫీకి కాల్ చేయండి.

458
00:32:47,176 --> 00:32:49,136
కాల్ చేసి, అక్కడ ఉండవచ్చా అని అడగండి.

459
00:32:49,136 --> 00:32:53,515
సరేనా? ఏం జరిగిందో చెప్పండి. అహం అడ్డురానివ్వకండి.

460
00:32:54,224 --> 00:32:55,517
మీరు ఇలా వీధిలో ఉంటున్నారు కదా అని

461
00:32:55,517 --> 00:32:57,603
మీరేమీ అల్పులు అయిపోరు.

462
00:32:57,603 --> 00:32:59,396
మీకు జరిగింది ఎవరికైనా జరగవచ్చు.

463
00:33:00,814 --> 00:33:02,524
మీరు ఈరాత్రి సోఫీకి కాల్ చేయగలరా? ఏమంటారు?

464
00:33:04,026 --> 00:33:05,152
- చేస్తాను.
- సరే.

465
00:33:05,944 --> 00:33:07,029
ఈరాత్రికే కాల్ చేయండి.

466
00:33:07,529 --> 00:33:10,741
రేపు నాకు కాల్ చేయండి.
మీకు మిల్వాకీకి టికెట్ బుక్ చేస్తాను, సరేనా?

467
00:33:12,701 --> 00:33:15,537
- వైలీ కూడా ఉంది, కాబట్టి...
- సర్వీస్ కుక్క అని చెప్పి ఎక్కిద్దాం.

468
00:33:16,163 --> 00:33:20,375
ఏం కాదు. దానికి కూడా ఒక టికెట్ బుక్ చేస్తా.
అలా అని మాటిస్తున్నా. మీకు ఓకేనా?

469
00:33:24,046 --> 00:33:25,923
సరే. సరే మరి.

470
00:33:25,923 --> 00:33:27,925
- హేయ్.
- హేయ్, ఏం పర్వాలేదు. దగ్గరికి రా.

471
00:33:28,592 --> 00:33:30,219
- ఇలా రా.
- దా. నీకేమీ కాదు.

472
00:33:30,219 --> 00:33:32,095
- మనం మిల్వాకీకి వెళ్తున్నాం.
- హా, నువ్వు ఇంటికి వెళ్తున్నావు.

473
00:33:32,888 --> 00:33:34,056
రేపు మాట్లాడుకుందామా?

474
00:33:34,056 --> 00:33:35,933
- మీకు రేపు కాల్ చేస్తాను, సర్.
- సరే మరి.

475
00:33:36,683 --> 00:33:38,852
హేయ్, థ్యాంక్యూ.

476
00:33:43,232 --> 00:33:44,233
ఒక్క నిమిషం.

477
00:33:45,150 --> 00:33:46,693
అతనికి మీరు బాగా నచ్చారు అనుకుంటా.

478
00:33:47,736 --> 00:33:48,737
మిమ్మల్ని షుగర్ అని పిలిచాడు.

479
00:33:50,280 --> 00:33:51,281
అది నా పేరు.

480
00:33:51,865 --> 00:33:53,158
మీ పేరు జాన్ షుగరా?

481
00:33:53,909 --> 00:33:55,744
అవును, జాన్ షుగర్.

482
00:33:56,870 --> 00:33:58,997
సరే. మీ పేరును ఎప్పటికీ మర్చిపోలేను.

483
00:34:03,669 --> 00:34:05,462
మీ పుట్టిన రోజు ఎప్పుడు, జాన్ షుగర్?

484
00:34:06,255 --> 00:34:07,422
సెప్టెంబర్ రెండు.

485
00:34:07,422 --> 00:34:09,466
కన్యా రాశి? హా, నేను ఊహించాగా.

486
00:34:09,466 --> 00:34:12,427
నాకు ఆ రాశి వాళ్లంటే ఇష్టం.
మంచివాళ్లు, నమ్మకంగా ఉంటారు, కరుణామయులు.

487
00:34:12,427 --> 00:34:15,472
నాలాంటి వాళ్లని కాకుండా
వేరే వాళ్లని కలిసినప్పుడు, తెలిసిపోతుంది కదా.

488
00:34:15,472 --> 00:34:17,599
- మీలో ఏదో ప్రత్యేకత ఉంది.
- నిజంగానా?

489
00:34:18,475 --> 00:34:19,560
నాకు ముందే తెలుసు.

490
00:34:19,560 --> 00:34:22,603
కానీ ఒక విషయం చెప్పనా,
లోలోపల మిమ్మల్ని ఒంటరితనం ఆవహించేసి ఉంది.

491
00:34:25,274 --> 00:34:30,152
ఇంట్లో మీకు భార్యాపిల్లలు లేరు.

492
00:34:30,821 --> 00:34:32,906
మీకు ఒంటరిగా ఉండటమంటేనే ఇష్టం.

493
00:34:36,534 --> 00:34:38,786
కానీ మీ జీవితం మెరుగవ్వగలదు, జాన్ షుగర్.

494
00:34:40,539 --> 00:34:41,540
నిజంగానా?

495
00:34:52,634 --> 00:34:54,261
- నా ఇల్లు.
- హా.

496
00:34:54,803 --> 00:34:56,304
నేను ఎక్కడ ఉంటానో మీకు చెప్పలేదే.

497
00:34:56,304 --> 00:34:58,807
- మీరు చెప్పారు. బారులో చెప్పారు. హా.
- అవునా?

498
00:35:07,482 --> 00:35:08,650
గుడ్ నైట్.

499
00:35:08,650 --> 00:35:12,988
లోపలికి వచ్చి, నన్ను రేప్ చేయడానికి కానీ,
చంపడానికి కానీ ఎవరూ మాటు వేయలేదని చూసి చెప్తారా?

500
00:35:12,988 --> 00:35:14,072
సరే.

501
00:35:27,920 --> 00:35:29,213
ఎవరూ లేరు. అంతా ఓకే.

502
00:35:29,963 --> 00:35:32,674
రై విస్కీ ఒకటి కనిపించింది.
వెళ్లే ముందు ఒక పెగ్గు వేసి పోండి.

503
00:35:33,675 --> 00:35:34,676
బాగా అలసిపోయాను ఇవాళ.

504
00:35:35,886 --> 00:35:39,556
భలేవారే. ఎంత తాగినా మీకు ఎక్కదు కదా. ఏమీ కాదు కదా?

505
00:35:42,184 --> 00:35:44,019
మధ్యలో పోలీసులు ఆపితే?

506
00:35:46,355 --> 00:35:49,816
మద్యం అంతా మీ రక్తంలోనే ఉంటుంది కదా?

507
00:35:51,318 --> 00:35:53,111
నాకేమీ కాదులెండి.

508
00:35:55,072 --> 00:35:57,324
ఎంతైన జాగ్రత్తగా ఉంటే మేలు కదా.

509
00:35:58,534 --> 00:36:00,327
మీరు ఈరాత్రికి ఇక్కడే ఉంటే మంచిది అనుకుంటా.

510
00:36:01,495 --> 00:36:02,538
ఈరాత్రికి కాదులెండి, మెలనీ.

511
00:36:02,538 --> 00:36:03,997
మీరు ముద్దు బాగానే పెడతారనిపిస్తోంది.

512
00:36:06,542 --> 00:36:07,876
ఇవాళ వద్దు, మెలనీ.

513
00:36:07,876 --> 00:36:09,336
ఎందుకు వద్దు?

514
00:36:09,336 --> 00:36:11,213
ఎందుకంటే, మీరు తాగి ఉన్నారు, నేను లేను.

515
00:36:11,713 --> 00:36:13,131
కానీ నేనే అడుగుతున్నా కదా.

516
00:36:15,676 --> 00:36:17,594
కన్యారాశి మగాళ్ల గురించి ఇంకో విషయం చెప్పనా?

517
00:36:18,720 --> 00:36:23,267
వాళ్లకి, వృషభ రాశి అమ్మాయిలకు పొత్తు
బాగా కుదురుతుంది, ప్రత్యేకించి శృంగారం విషయంలో.

518
00:36:25,269 --> 00:36:26,520
నాది వృషభ రాశి.

519
00:36:27,855 --> 00:36:32,025
నాది వృషభ రాశి. నాది వృషభ రాశి.

520
00:36:41,743 --> 00:36:43,245
మీరు తాగి ఉన్నారు, నేను లేను.

521
00:36:45,706 --> 00:36:46,790
సరే. అలాగే కానివ్వండి.

522
00:36:48,625 --> 00:36:50,002
తప్పు నాదే.

523
00:36:50,002 --> 00:36:51,753
విస్కీ ఎంత తాగిందో నేను గమనించలేదు.

524
00:36:53,380 --> 00:36:55,507
ఇక ఇప్పటికి మెలనీ నుండి నేను ఏ సమాచారాన్నీ రాబట్టలేను.

525
00:36:59,845 --> 00:37:02,306
తనది వృషభ రాశి, తన ఇంట్లో
ఈత కొలను ఉంది అన్న విషయాలు తప్ప.

526
00:37:03,682 --> 00:37:04,892
ఇంకా తను ఒంటరిగా ఉందనే విషయం కూడా.

527
00:37:06,518 --> 00:37:07,519
ఈమె నాకు నచ్చింది.

528
00:37:10,439 --> 00:37:13,358
కానీ తప్పదు, సమాధానాల కోసం కొంత సమయం వేచి చూడాల్సిందే.

529
00:37:16,028 --> 00:37:17,613
వావ్, మంచి సినిమా వస్తోంది.

530
00:37:25,871 --> 00:37:26,872
గుడ్ నైట్, మెలనీ.

531
00:37:50,229 --> 00:37:53,148
నా వెంటపడటం ఆపేయ్, కెన్నీ, సరేనా?
నీకు వెంటబడటం సరిగ్గా రాదు కూడా.

532
00:37:53,148 --> 00:37:56,401
నువ్వు చంద్రమండలం మీద ఉన్నా, నేను చెప్పేయగలను.

533
00:37:56,401 --> 00:37:59,780
నేను డెల్ కోరెజాన్ హోటల్ లో ఉంటున్నా.

534
00:38:00,656 --> 00:38:02,658
డేవీకి అదొక్కటి చెప్పు చాలు.

535
00:38:03,492 --> 00:38:07,204
అది నిజమని అతను కనుగొన్నప్పుడు,
నువ్వు అదరగొట్టేశావని చప్పట్లు కొడతాడు.

536
00:38:07,204 --> 00:38:08,288
తీసుకో.

537
00:38:10,916 --> 00:38:12,417
ఇక బయలుదేరు.

538
00:38:15,796 --> 00:38:19,383
ఎందుకు నా మీద నిఘా ఉంచాడు? ఏం చేశాను నేను?

539
00:38:23,387 --> 00:38:24,638
మామూలుగా నేను మంచివాడినే.

540
00:38:26,014 --> 00:38:29,268
అయినా నిజం చెప్పాలంటే, ఈ లోకంలో
మంచి, చెడు అనేది ఒక్కొక్కరి దృష్టిలో ఒక్కోలా ఉంటుంది.

541
00:38:30,561 --> 00:38:33,063
డేవీ సీగల్ దృష్టిలో నేను మంచివాడినని నాకు అనిపించట్లేదు.

542
00:38:35,691 --> 00:38:39,111
లాస్ ఏంజలెస్ అంటే జనాలు అస్సలు పడుకోరని
అందరూ అనుకుంటుంటారు. కానీ అది నిజం కాదు.

543
00:38:40,195 --> 00:38:41,196
అర్ధ రాత్రి అయ్యేటప్పటికి,

544
00:38:41,947 --> 00:38:45,868
పార్టీలంటూ తిరిగే కుర్రకారు,
ఇంకా హాలీవుడ్ కి చెందిన తాగుబోతులు తప్ప,

545
00:38:45,868 --> 00:38:47,202
అందరూ పడక ఎక్కేస్తారు.

546
00:38:47,995 --> 00:38:49,538
కాబట్టి ఎవరూ గమనించే అవకాశం లేదు.

547
00:38:50,831 --> 00:38:52,958
మనం ఇష్టమొచ్చిన పనులు చేసుకోవచ్చు.

548
00:38:52,958 --> 00:38:54,209
మ్యాచ్ నిర్ధారించబడింది

549
00:39:08,974 --> 00:39:10,767
ఎవరైనా ఎక్కడికి వెళ్ళారు అనేది

550
00:39:10,767 --> 00:39:12,769
ఒక్కోసారి వారు ఎక్కడెక్కడ తిరిగారో
తెలుసుకున్నాక చెప్పేయవచ్చు,

551
00:39:44,551 --> 00:39:45,552
ఇదెవరు?

552
00:39:47,262 --> 00:39:48,639
చూస్తుంటే, ఇది పెద్ద కేసులానే అనిపిస్తోంది.

553
00:39:49,431 --> 00:39:52,017
బైకరా? రౌడీనా? ఎవరు?

554
00:39:52,017 --> 00:39:53,769
స్కాన్ చేయడానికి సిద్ధంగా ఉంది

555
00:39:53,769 --> 00:39:55,354
స్కాన్ చేస్తోంది...

556
00:39:55,354 --> 00:39:57,814
ఇంకా ఇంకా దారుణంగా జరిగి ఉండవచ్చు,
ఈ దుస్థితి ఒలీవియాకి ఎదురై ఉండవచ్చు.

557
00:39:57,814 --> 00:39:58,941
స్కాన్ సేవ్ అయింది

558
00:39:58,941 --> 00:40:01,485
హా, ఈ విషయాన్ని నేను చాలా త్వరగా ఛేదించాలి.

559
00:40:02,194 --> 00:40:04,821
లేదా తర్వాతి శవం తనదే కావచ్చని ఎందుకో నాకు అనిపిస్తోంది.

560
00:40:09,326 --> 00:40:13,580
గమ్మత్తైన విషయం ఏంటంటే, చాలా కాలంగా ఇది చేస్తున్నా
కాబట్టి, ఇది నాకు దాదాపుగా అలవాటైపోయిందని చెప్పవచ్చు.

561
00:40:14,957 --> 00:40:15,999
దాదాపుగా.

562
00:40:27,177 --> 00:40:28,637
ఈ హింస.

563
00:40:31,223 --> 00:40:33,433
చాలా అనుభవం ఉంది కాబట్టి,
ఇలాంటివి ఉంటాయని ముందే ఐడియా వస్తోంది.

564
00:40:39,690 --> 00:40:40,858
హోటల్ డెల్ కోరెజాన్

565
00:40:40,858 --> 00:40:42,860
అది ప్రపంచం గురించి ఏం చెప్తుందో నాకు తెలుసు,

566
00:40:44,194 --> 00:40:46,321
- కానీ అది నా గురించి ఏం చెప్తుందో ఏమో మరి.
- గుడ్ ఈవినింగ్, సర్.

567
00:40:47,531 --> 00:40:50,242
మిస్టర్ షుగర్. మిమ్మల్ని మళ్లీ చూడటం చాలా బాగుంది, సర్.

568
00:40:50,242 --> 00:40:51,827
థ్యాంక్యూ, క్లింటన్. మళ్లీ ఇక్కడికి రావడం బాగుంది.

569
00:40:51,827 --> 00:40:54,788
మీ బంగళా అంతా సిద్ధంగా ఉంది,
అంతా మీకు నచ్చినట్టే సర్దడం జరిగింది.

570
00:40:54,788 --> 00:40:56,874
- మీకు ఏమైనా ఆకలిగా ఉందా?
- చాలా ఆకలిగా ఉంది.

571
00:40:56,874 --> 00:41:00,043
చెఫ్ కి చెప్తాను. మీ కోసం స్పెషల్ గా ఏదైనా చేస్తాడులెండి.

572
00:41:00,043 --> 00:41:02,296
నా మనస్సులో ఏముందో నీకు
భలే తెలిసిపోతుంది. క్లింటన్, మర్చిపోయా.

573
00:41:02,296 --> 00:41:03,922
నా కారు డిక్కీలో ఒక సూట్ కేసు ఉంది.

574
00:41:04,464 --> 00:41:05,674
దాని సంగతి నేను చూసుకుంటా.

575
00:42:01,355 --> 00:42:02,356
థ్యాంక్యూ.

576
00:42:06,026 --> 00:42:07,027
గుడ్ ఈవినింగ్.

577
00:42:25,796 --> 00:42:26,964
కన్సుయేలో.

578
00:42:26,964 --> 00:42:29,341
గుడ్ ఈవినింగ్, మిస్టర్ షుగర్. నేను లోపలికి రావచ్చా?

579
00:42:29,341 --> 00:42:32,636
తప్పకుండా. నిన్ను చూడటం చాలా బాగుంది.

580
00:42:35,222 --> 00:42:38,642
- హోర్హే, పిల్లలు ఎలా ఉన్నారు?
- బాగున్నారు, సర్, థ్యాంక్యూ.

581
00:42:38,642 --> 00:42:41,436
- మంచిది.
- మర్చిపోయానండి.

582
00:42:41,436 --> 00:42:43,730
ఇది ఇందాకే మీ పేరు మీద వచ్చింది.

583
00:42:44,982 --> 00:42:47,192
- గుడ్ నైట్.
- గుడ్ నైట్.

584
00:42:50,487 --> 00:42:52,030
జాన్ షుగర్

585
00:42:59,913 --> 00:43:01,582
{\an8}కాస్మోపాలిటన్ పాలీగ్లాట్ సొసైటీ

586
00:43:01,582 --> 00:43:03,083
{\an8}పార్టీకి ఆహ్వానం.

587
00:43:04,001 --> 00:43:05,127
{\an8}పార్టీ.

588
00:43:08,130 --> 00:43:10,174
అందరినీ కలవడం బాగానే ఉంటుంది.

589
00:43:12,634 --> 00:43:17,264
"వాళ్ళని కలవడం అంత మంచి విషయం అయితే,
ఎందుకు వాళ్లకి అంత దూరంగా ఉంటున్నావు,"

590
00:43:17,973 --> 00:43:19,474
అని ఎవరైనా అడగవచ్చు.

591
00:43:23,478 --> 00:43:25,856
నాకు పనిలో తీరిక ఉండుంటే,
దానికి నేను సమాధానం కూడా చెప్పేవాడినే.

592
00:43:26,648 --> 00:43:29,276
రేచల్ కేయ్: "పరాయా సినిమా నాకు
మంచి అనుభూతిని అందించింది"

593
00:43:31,945 --> 00:43:32,779
రేచల్ కేయ్ పరాయా

594
00:43:37,201 --> 00:43:39,786
నేను అతడిని కొట్టడానికే ప్రయత్నించా,
కానీ పశుబలంతో అతను నన్ను కదలనివ్వలేదు.

595
00:43:39,786 --> 00:43:40,996
చాలా బలముంది అతనికి.

596
00:43:42,039 --> 00:43:43,540
చాలా అంటే చాలా బలం.

597
00:43:43,540 --> 00:43:45,542
పరాయా

598
00:43:45,542 --> 00:43:47,544
అతను నాకు ముద్దుపెట్టాలని చూసినప్పుడు,
అతడిని కొరకాలని చూశాను.

599
00:43:48,337 --> 00:43:50,172
అప్పుడే అతను నా గొంతును చేత్తో గట్టిగా నొక్కాడు,

600
00:43:50,964 --> 00:43:52,758
"నాకు కావాల్సింది దక్కించుకుంటా," అని అన్నాడు.

601
00:43:52,758 --> 00:43:53,926
తను మంచి నటి.

602
00:43:55,135 --> 00:43:57,804
నేను ఇక అలా జీవచ్చవంలా
ఉండిపోయా, అతనికి కావాల్సింది అతను చేసుకున్నాడు.

603
00:43:58,847 --> 00:44:02,684
అంతగాక ఇంకేం చేయగలను నేను?
వండర్ వుమన్ అయిపోలేను కదా?

604
00:44:02,684 --> 00:44:04,436
బాగానే చెప్తోంది అయినా.

605
00:44:04,436 --> 00:44:07,731
నేను ఏమీ చేయలేకపోయాను. ఏమీ చేయలేదు.

606
00:44:08,273 --> 00:44:09,483
మంచి ఆత్మస్థైర్యం గల మహిళ.

607
00:44:09,983 --> 00:44:11,610
రేచల్ కేయ్ మరణం

608
00:44:17,157 --> 00:44:19,993
కారు ప్రమాదంలో నటి రేచల్ కేయ్ మరణం

609
00:44:26,083 --> 00:44:27,376
ప్రాణాన్ని బలి తీసుకున్న కారు దుర్ఘటన

610
00:44:27,376 --> 00:44:28,377
కూతురు, ఒలీవియా.

611
00:44:30,295 --> 00:44:31,922
ఒలీవియా సీగల్

612
00:44:32,923 --> 00:44:34,591
ఒలీవియా సీగల్
నటి

613
00:44:38,136 --> 00:44:40,264
నేనతడిని కొట్టడానికే ప్రయత్నించా,
కానీ పశుబలంతో అతను నన్ను కదలనివ్వలేదు.

614
00:44:40,264 --> 00:44:41,890
చాలా బలముంది అతనికి.

615
00:44:43,100 --> 00:44:45,602
అతను నాకు ముద్దుపెట్టాలని చూసినప్పుడు,
అతడిని కొరకాలని చూశాను.

616
00:44:47,521 --> 00:44:50,232
అప్పుడే అతను నా గొంతును చేత్తో గట్టిగా నొక్కాడు,

617
00:44:50,232 --> 00:44:53,819
"నాకు కావాల్సింది దక్కించుకుంటా," అని అన్నాడు.

618
00:44:53,819 --> 00:44:56,154
తన అమ్మ అడుగుజాడల్లోనే నడుస్తోంది.

619
00:44:56,154 --> 00:45:00,033
ఇద్దరు స్థైర్యవంతమైన మహిళలు తిరగబడుతున్నారు,
కనీసం తిరగబడటానికి ప్రయత్నిస్తున్నారు.

620
00:45:00,033 --> 00:45:01,785
అంతగాక ఇంకేం చేయగలను నేను?

621
00:45:01,785 --> 00:45:02,995
ఏంటిది?

622
00:45:04,454 --> 00:45:09,835
వండర్ వుమన్ అయిపోలేను కదా?
నేను ఏమీ చేయలేకపోయాను. ఏమీ చేయలేదు.

623
00:45:12,546 --> 00:45:14,464
- రేచల్.
- నేను ఇక అలా జీవచ్చవంలా ఉండిపోయా...

624
00:45:15,132 --> 00:45:16,216
ఈ ఫోటోలు ఎవరు తీశారు?

625
00:45:16,216 --> 00:45:19,845
...అతనికి కావాల్సింది అతను చేసుకున్నాడు.

626
00:45:21,555 --> 00:45:24,766
- నాకు కూడా కావాలసింది అదేనా?
- ఒలీవియా దగ్గర ఈ ఫోటోలు ఎందుకు ఉన్నాయి?

627
00:45:24,766 --> 00:45:26,310
మీరు అనేది అదేనా?

628
00:45:28,812 --> 00:45:30,063
ఒక్క నిమిషం.

629
00:45:31,899 --> 00:45:33,317
బహుశా నేను...

630
00:45:34,526 --> 00:45:35,611
ఒక్క నిమిషం.

631
00:45:35,611 --> 00:45:38,989
నేను నేల మీద పడుకుంటే మేలేమో.

632
00:46:49,768 --> 00:46:51,228
నేను ఈ పని చేయాల్సిందే.

633
00:47:03,991 --> 00:47:05,367
నేను...

634
00:47:15,460 --> 00:47:17,045
ఒలీవియా ఆచూకీని కనిపెట్టాల్సిందే.

635
00:47:22,551 --> 00:47:24,136
తప్పదు.

636
00:47:29,975 --> 00:47:31,268
తప్పదు.

637
00:47:37,274 --> 00:47:38,817
తప్పదు.

638
00:48:45,050 --> 00:48:47,052
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

