1
00:01:12,781 --> 00:01:14,366
ఆరంభం అనుకున్నట్టుగా జరగలేదు.

2
00:01:15,993 --> 00:01:16,994
అప్పుడప్పుడూ ఇది మామూలే.

3
00:01:19,496 --> 00:01:20,664
ఇలాంటి కేసులలో ఇది మామూలే.

4
00:01:23,750 --> 00:01:25,127
కనబడకుండా పోయిన గొప్పింటి అమ్మాయి.

5
00:01:25,127 --> 00:01:26,587
డిక్కీలో ఒకడి శవం.

6
00:01:33,260 --> 00:01:35,971
పైగా, నాకు ఉన్న... ఏమో మరి...

7
00:01:36,555 --> 00:01:37,556
సమస్యలు.

8
00:01:41,185 --> 00:01:42,186
నేనేమీ గొప్పలు చెప్పుకోవడం లేదు.

9
00:01:42,811 --> 00:01:44,646
నేను ఈ పని కత్తిలా చేస్తాను.

10
00:01:44,646 --> 00:01:47,566
లేకపోతే జోనథన్ సీగల్ నాకు కాల్ చేయడు కదా.

11
00:01:48,567 --> 00:01:50,944
కాకపోతే, సర్దుకోవడానికి నాకు కాస్తంత సమయం పడుతుందంతే.

12
00:01:51,862 --> 00:01:54,948
ఇక పని గురించి మాట్లాడుకుందాం.

13
00:02:19,181 --> 00:02:20,724
బర్నీ సీగల్,

14
00:02:21,391 --> 00:02:24,353
ఒలీవియా కన్న తండ్రి, ఇంకా చనిపోయిన రేచల్ కేయ్ కి మాజీ భర్త.

15
00:02:24,937 --> 00:02:28,106
ఈయన సినీ నిర్మాత కూడా,
కాకపోతే వాళ్ల నాన్న అంత గొప్ప నిర్మాత కాదు.

16
00:02:28,106 --> 00:02:31,527
దయచేసి నన్ను బర్నీ అని పిలవండి.
హేయ్, ఈ చోటంటే నాకు చాలా ఇష్టం.

17
00:02:31,527 --> 00:02:34,196
చివరిగా హిట్ అయిన
తన సినిమా, సర్ఫింగ్ చేసే కోతి గురించి తీసినది.

18
00:02:34,196 --> 00:02:35,531
ఇది హై క్లాస్ హోటల్.

19
00:02:35,531 --> 00:02:37,407
ఈ నగరానికి వచ్చినప్పుడు, నేను ఇక్కడే ఉంటాను.

20
00:02:37,407 --> 00:02:40,077
మంచి టేస్టే మీది. అది చాలా మంచి విషయమే.

21
00:02:40,077 --> 00:02:41,745
నమస్తే. మీకు ఏం కావాలో చెప్పండి.

22
00:02:41,745 --> 00:02:44,039
వైట్ టోస్ట్ బ్రెడ్ ఇవ్వండి. కాటేజ్ చీజ్ కూడా.

23
00:02:44,039 --> 00:02:46,917
- నిమ్మ దబ్బతో వేడి నీళ్లు తీసుకురండి.
- నాకు బ్లాక్ కాఫీ చాలు.

24
00:02:46,917 --> 00:02:49,127
నిజానికి, నాకు బిర్యానీ, డబుల్ ఆమ్లెట్ తినాలనుంది,

25
00:02:49,127 --> 00:02:50,921
కానీ కారంతో ఉన్న ఆహారం తీసుకోవద్దని చెప్పారు.

26
00:02:51,672 --> 00:02:53,841
ఇంతకీ మీకేం కావాలో చెప్పండి.

27
00:02:54,383 --> 00:02:55,843
నేను ఒలీవియా గురించి మాట్లాడదామనుకుంటున్నా.

28
00:02:56,426 --> 00:02:59,096
మీకు ఒక విషయం చెప్పాలి, షుగర్.

29
00:02:59,096 --> 00:03:02,099
ఈ విషయంలో మీరు మీ సమయాన్ని,
మా నాన్న డబ్బును వృథా చేస్తున్నారనుకుంటా.

30
00:03:02,599 --> 00:03:07,104
ఒలీవియా ఏ రోజైనా తిరిగి వచ్చేయవచ్చు. తను ఎప్పుడూ ఇంతే.

31
00:03:07,104 --> 00:03:08,814
వచ్చాక మళ్లీ పునరావాసానికి పంపించాలి తనని.

32
00:03:09,940 --> 00:03:11,900
నేనే కనుక ఆమె తండ్రి అయితే,
ఆ విషయం నన్ను కుదురుగా ఉండనివ్వదు.

33
00:03:11,900 --> 00:03:13,151
మీరు తండ్రి కాదు, నాకు ఆందోళనా లేదు.

34
00:03:13,735 --> 00:03:15,320
మీ నాన్నకి ఆందోళనగా ఉంది.

35
00:03:15,320 --> 00:03:16,655
ఇవిగోండి.

36
00:03:18,323 --> 00:03:19,408
ఒక విషయం చెప్తాను వినండి.

37
00:03:19,908 --> 00:03:24,162
ఒలీవియా గురించి అందరికన్నా,
మా నాన్న కన్నా కూడా నాకే బాగా తెలుసు.

38
00:03:25,789 --> 00:03:29,293
మెలనీ కన్నా కూడా ఒలీవియా గురించి నాకే బాగా తెలుసు.
అందులో మాత్రం ఏ సందేహమూ లేదు.

39
00:03:29,293 --> 00:03:31,503
నిన్న రాత్రి మెలనీతో బాగానే గడిపినట్టున్నారు కదా?

40
00:03:32,504 --> 00:03:35,716
ఆ విషయంలో నాకు కాస్త కోపం వచ్చిందని
చెప్పక తప్పట్లేదు. ఎంతైనా తను నా మాజీ భార్య కదా.

41
00:03:36,550 --> 00:03:39,303
ఆ విషయం మీకు తెలీదు కదా, మిస్టర్ ప్రైవేట్ డిటెక్టివ్?

42
00:03:39,303 --> 00:03:42,556
{\an8}మీకు, మెలనీ మ్యాథ్యూస్ కి, 1998వ సంవత్సరం డిసెంబర్ 31న

43
00:03:42,556 --> 00:03:43,891
నెవాడాలోని లాస్ వేగస్ లో పెళ్లైంది.

44
00:03:43,891 --> 00:03:46,476
మూడు రోజుల తర్వాత, మీరు
బస ఉంటున్న చోటును ఛిన్నాభిన్నం చేసినందుకు,

45
00:03:46,476 --> 00:03:48,353
డ్రగ్స్ ని కలిగి ఉన్నందుకు,
తాగి అసభ్యంగా ప్రవర్తించినందుకు,

46
00:03:48,353 --> 00:03:50,063
తుపాకీని కాల్చినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేశారు.

47
00:03:51,982 --> 00:03:53,358
అది మామూలు హనీమూన్ కాదులే.

48
00:03:57,154 --> 00:03:58,822
దయచేసి దీన్ని చాటుగా చూడండి.

49
00:04:02,993 --> 00:04:04,119
ఇది మీకు ఎక్కడ దొరికింది?

50
00:04:05,787 --> 00:04:09,166
ఆ పోలరాయిడ్ ఫిల్మ్ రకం మార్కెటులోకి 1996లో వచ్చింది.

51
00:04:11,001 --> 00:04:13,253
ఆ సమయంలో రేచల్ కేయ్ కదా మీకు భార్య?

52
00:04:15,339 --> 00:04:16,339
ఆ విషయం మీకు తెలుసు కదా.

53
00:04:17,966 --> 00:04:19,468
ఆ ఫోటో మీరు తీసినదేనా?

54
00:04:24,389 --> 00:04:25,390
నేను తీయలేదు.

55
00:04:26,099 --> 00:04:29,186
నిజాన్ని చెప్పినందుకు థాంక్స్, బర్నీ. ధన్యవాదాలు.

56
00:04:34,900 --> 00:04:38,487
మీరెప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? మనస్ఫూర్తిగా?

57
00:04:39,071 --> 00:04:40,822
ఒకవేళ యమధర్మరాజు వచ్చి,

58
00:04:40,822 --> 00:04:43,116
"నీకు ప్రాణానికి ప్రాణమైన వ్యక్తి ప్రాణాన్ని

59
00:04:43,116 --> 00:04:46,411
నేను హరించేస్తాను, అలా జరగకూడదంటే
నీ ప్రాణం ఇవ్వాలి," అని నాతో అన్నాడనుకోండి.

60
00:04:49,248 --> 00:04:52,042
రేచల్ కోసం నేను నా ప్రాణాలను హాయిగా ఇచ్చేస్తాను.

61
00:04:54,920 --> 00:04:56,797
తన గుర్తుగా నాకు మిగిలింది ఒలీవియానే.

62
00:04:58,298 --> 00:05:02,511
అలాంటి నా కూతురి గురించి
నేను పట్టించుకోవట్లేదు అని మీరనుకుంటే,

63
00:05:03,262 --> 00:05:05,264
మిమ్మల్ని ఏం చేయాలి!

64
00:05:05,264 --> 00:05:08,517
మీ తొక్కలో కాఫీకి కూడా నేనే కడతాను.

65
00:05:09,226 --> 00:05:10,227
థ్యాంక్యూ.

66
00:05:13,772 --> 00:05:17,067
అతను ఏదో దాస్తున్నాడు.
ఏదేమైనా, అతనికి కోపం అయితే తెప్పించాను.

67
00:05:18,735 --> 00:05:21,947
అంత కోపంతో వెళ్లిపోయాడంటే,
నేను సరైన దిశలోనే వెళ్తున్నానని అర్థం.

68
00:05:52,394 --> 00:05:55,147
డేవీ సీగల్, ఇంకా అతని కుడి భుజమైన, కెన్నీ.

69
00:05:59,985 --> 00:06:01,778
- త్వరగా కానిచ్చేద్దాం, సరేనా?
- సరే.

70
00:06:03,113 --> 00:06:04,781
- నువ్విక్కడ చూస్తావా?
- నువ్వు పడక గదిలో చూడు.

71
00:06:07,201 --> 00:06:10,162
హేయ్, ఆ రహస్య మైక్రోఫోన్ ని ఎక్కడైనా పెట్టు.

72
00:06:10,162 --> 00:06:11,121
అలాగే.

73
00:06:11,121 --> 00:06:14,249
తన చెల్లి ఆచూకీ కనిపెట్టే పని
అప్పగించబడిన వ్యక్తిపై నిఘా ఉంచుతున్నారు.

74
00:06:14,249 --> 00:06:17,711
ఆ అవసరం ఏంటి? ఎందుకు భయపడుతున్నాడు?

75
00:06:19,379 --> 00:06:20,380
హేయ్...

76
00:06:21,298 --> 00:06:22,341
ఏమైనా దొరికిందా?

77
00:06:22,341 --> 00:06:26,011
హా, కానీ... కొన్ని వింత మ్యాగజైన్స్...

78
00:06:26,011 --> 00:06:27,095
...సోదిలే. అసలేం...

79
00:06:27,095 --> 00:06:28,263
పర్సు లేదు. ఇంకా...

80
00:06:28,263 --> 00:06:30,933
- వెధవతనంగా పని చేసి నాకు సాయపడుతున్నారు.
- ఆగు. ఇక్కడ కొన్ని లేఖలున్నాయి.

81
00:06:30,933 --> 00:06:33,101
ఇక్కడికి తీసుకురా. ఫోటోలు తీద్దాం.

82
00:06:34,853 --> 00:06:39,525
ప్రతీసారి సరదాగా ఉండదులే,
కానీ పురోగతి సాధించడంలో తోడ్పడుతుంది.

83
00:06:40,108 --> 00:06:42,694
- మనోడికి సినిమాల పిచ్చి అనుకుంటా.
- హేయ్, హెలెన్. నేనే.

84
00:06:42,694 --> 00:06:45,030
- అవును.
- నీకు ఒకరి నుండి కాల్ వస్తుంది.

85
00:06:45,030 --> 00:06:46,698
మా అమ్మతో మాట్లాడాలని చేస్తారు.

86
00:06:46,698 --> 00:06:48,283
అది నువ్వే అని వాళ్లు అనుకుంటారు.

87
00:06:49,409 --> 00:06:50,786
అంతా లేఖల వల్లనే.

88
00:06:52,538 --> 00:06:54,706
ఏ క్షణంలో అయినా నీకు కాల్ చేయవచ్చు. హా.

89
00:06:58,210 --> 00:07:01,255
డేవీ చేసే పనులు నాకు ముందే తెలిసిపోతున్నాయి,
అంత మాత్రాన అతను ప్రమాదకరమైన వాడు కాదని అనుకోలేను.

90
00:07:01,255 --> 00:07:04,049
నా గతంలోకి అతను తొంగి చూడటం నాకు ఇష్టం లేదు.

91
00:07:04,049 --> 00:07:05,968
అస్సలు ఇష్టం లేదు.

92
00:07:05,968 --> 00:07:09,596
బర్నీ వల్ల ఏ లాభం లేదు, డేవీ అంత కన్నా దారుణం,

93
00:07:09,596 --> 00:07:12,266
ఒలీవియా స్నేహితులతో మాట్లాడితే
ఏమైనా ఉపయోగం ఉంటుందేమో చూడాలి.

94
00:07:12,266 --> 00:07:14,184
సినిమాలలో చూపినట్టే అన్నమాట.

95
00:07:14,184 --> 00:07:16,270
మేం ఆరవ క్లాసులో ఉండగా తొలిసారి డ్రగ్స్ తీసుకున్నాం.

96
00:07:16,270 --> 00:07:17,604
ఆరవ క్లాసా? అప్పుడు మీ వయస్సు ఎంత?

97
00:07:17,604 --> 00:07:18,939
- రఫ్ గా 11.
- వావ్.

98
00:07:18,939 --> 00:07:21,942
కానీ, తనని మేము చూసి ఏడాది పైనే అవుతోంది.

99
00:07:22,651 --> 00:07:23,652
తను డ్రగ్స్ కి దూరంగా ఉందనా?

100
00:07:23,652 --> 00:07:25,654
తను ఎందుకు డ్రగ్స్ కి, మద్యానికి దూరంగా ఉందంటావు?

101
00:07:25,654 --> 00:07:28,949
అందరి కన్నా ఎక్కువ తీసుకోవడం కానీ, తాగడం కానీ చేసేదా?

102
00:07:28,949 --> 00:07:33,245
హా. తను మరీ అతిగా తీసుకోవడం మొదలుపెట్టింది అనుకుంటా.

103
00:07:33,245 --> 00:07:36,248
- అంతే అంటారా?
- తను ఊపులో ఉన్నప్పుడు చూసి ఉండాల్సింది మీరు.

104
00:07:36,248 --> 00:07:39,084
తను చేసిన పనులు జైలుకు వెళ్లేంత పెద్ద నేరాలు.

105
00:07:39,084 --> 00:07:40,043
అంటే, ఎలాంటి పనులు?

106
00:07:40,043 --> 00:07:42,337
- డ్రగ్స్ ని పిచ్చిపిచ్చిగా తీసుకునేది.
- సరే.

107
00:07:42,337 --> 00:07:44,840
కానీ తనకి మర్చిపోలేని సంగతి ఒకటి ఎదురైంది,

108
00:07:44,840 --> 00:07:46,800
అది మానసికంగా తనని బాగా కుదిపేసింది.

109
00:07:48,218 --> 00:07:51,221
తనకి లవర్ కానీ, ఇంకెవరైనా కానీ ఉన్నారా?

110
00:07:51,972 --> 00:07:52,806
లేరు.

111
00:07:52,806 --> 00:07:54,349
నువ్వు నాకు నిజమే చెప్తున్నావు కదా?

112
00:07:55,058 --> 00:07:56,727
తనని ఇతనితో కలిసి ఉండగా చూశావా?

113
00:07:56,727 --> 00:07:58,145
లేదు, నాకు గుర్తున్నంత వరకూ చూడలేదు.

114
00:07:58,145 --> 00:07:59,730
తనకి లవర్ ఎవరైనా ఉన్నాడా?

115
00:07:59,730 --> 00:08:01,565
- మా పార్టీలలో అలా ఉండదులే.
- అంటే?

116
00:08:01,565 --> 00:08:04,651
ఒక్కోసారి ఒక్కో మగాడితో అన్నమాట.
ఆ పార్టీలు ఎలా ఉంటాయో మీకు తెలిసే ఉంటుందిగా.

117
00:08:05,319 --> 00:08:07,279
నాకు అస్సలు తెలీదు, కానీ నీ మాటని నమ్ముతున్నానులే.

118
00:08:07,279 --> 00:08:08,322
{\an8}హత్యానేరం కింద వెతుకుతున్నాం

119
00:08:08,322 --> 00:08:09,990
- హేయ్. నా పేరు జాన్ షుగర్.
- హేయ్.

120
00:08:09,990 --> 00:08:11,533
తనని ఇతనితో ఉండగా ఎప్పుడైనా చూశావా?

121
00:08:11,533 --> 00:08:13,160
- ఇతడిని ఎప్పుడూ చూడలేదు.
- పక్కానా?

122
00:08:13,160 --> 00:08:17,497
పక్కా. తను నా నుండే డ్రగ్స్ కొంటుంది.
తను కొని చాలా కాలమైంది.

123
00:08:17,998 --> 00:08:20,792
- చాలా కాలమంటే? నెలలా, వారాలా?
- ఏమో. కనీసం ఒక ఏడాది అయ్యుంటుంది.

124
00:08:21,919 --> 00:08:24,546
మరి మీ సంగతేంటి? మీరు ఇంకా
డ్రగ్స్ తీసుకుంటున్నారా? ఏంటి సంగతి?

125
00:08:26,089 --> 00:08:27,424
నేను నా డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉన్నా.

126
00:08:27,424 --> 00:08:29,134
- నేను... వాటికి దూరంగా ఉండి చక్కగా జీవిస్తున్నా.
- అవునా?

127
00:08:29,134 --> 00:08:30,844
- నువ్వు?
- నో కామెంట్స్.

128
00:08:30,844 --> 00:08:31,803
అంతేగా.

129
00:08:31,803 --> 00:08:35,224
సరే మరి. నీకు ఏమైనా గుర్తొస్తే,
ఈ నంబరుకు కాల్ చేయ్. థ్యాంక్యూ.

130
00:08:35,224 --> 00:08:37,601
- మీ సమయాన్ని వెచ్చించినందుకు థ్యాంక్స్. సరే మరి.
- పర్లేదులే.

131
00:08:37,601 --> 00:08:40,479
ఒలీవియా నిజంగానే
తాగుడుకు, డ్రగ్స్ కి దూరంగా ఉంటున్నట్టుంది.

132
00:08:40,479 --> 00:08:41,563
అది మంచి విషయమే.

133
00:08:42,606 --> 00:08:45,108
చెడు విషయం ఏంటంటే,

134
00:08:45,108 --> 00:08:48,487
తన కొత్త జీవితం వల్ల
తను మరింత ప్రమాదంలోకి పడినట్టుగా అనిపిస్తోంది.

135
00:08:49,821 --> 00:08:53,784
జోనథన్ సీగల్ కి ఇవన్నీ చెప్పాల్సిన సమయం వచ్చేసింది.
నేను అతడిని కూడా కొన్ని అడగాలి.

136
00:08:55,494 --> 00:08:58,205
"అయోమయపు కుర్రాడు" చాలా పెద్ద హిట్ అయింది.
అదొక ప్రభంజనం సృష్టించింది.

137
00:08:58,789 --> 00:09:00,832
"అయోమయపు మగవాడు" కూడా అంతే హిట్ అవుతుంది.

138
00:09:00,832 --> 00:09:04,044
ఈ సినిమాతో డేవిడ్ మళ్లీ హిట్స్ బాట పడతాడు,
అందులో మరో మాట కూడా లేదు.

139
00:09:05,337 --> 00:09:10,717
ఈ కథనం బయటకు వస్తే,
ఈ సినిమాని ఏ నిర్మాణ సంస్థా విడుదల చేయదు,

140
00:09:10,717 --> 00:09:12,886
అప్పుడు నీకు ఆరు కోట్ల డాలర్లు నష్టం వస్తుంది.

141
00:09:13,554 --> 00:09:15,806
నువ్వు నిర్మాతలు చేయకూడని పెద్ద తప్పు చేశావు, బర్నీ.

142
00:09:15,806 --> 00:09:17,099
నువ్వు నీ సొంత డబ్బు వాడావు.

143
00:09:17,599 --> 00:09:19,476
ఈ కథనం బయటకు రాదు, కదా?

144
00:09:19,476 --> 00:09:24,231
లేదు. మొత్తం ఎనిమిది మంది బాధితుల్లో
ఏడుగురు నుండి బలమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాం.

145
00:09:24,231 --> 00:09:25,357
"బాధితులు" అన్న పదం వాడవద్దు.

146
00:09:25,357 --> 00:09:29,069
కానీ ఆరోపణలు గుప్పిస్తున్న
ఆ ఎనిమిదవ వ్యక్తి గురించే కంగారు అంతా.

147
00:09:29,069 --> 00:09:31,947
తను చికాకు తెప్పిస్తోంది,
కానీ మనం అనుకున్నది సాధిస్తాంలే. నా మాట నమ్ము.

148
00:09:31,947 --> 00:09:33,866
ఎలాగైనా, తను ఒక మెట్టు దిగి తీరుతుంది.

149
00:09:34,366 --> 00:09:37,286
మిగతా ఏడుగురూ మీరు దయా హృదయులు అని భావిస్తున్నారు.

150
00:09:37,286 --> 00:09:41,081
ఒక్క నిమిషం, బర్నీ. డేవీ దోషి అని అంటున్నావా?

151
00:09:41,081 --> 00:09:42,499
అలా అని అన్నానా?

152
00:09:42,499 --> 00:09:44,543
- అలా అని అతను అనలేదు.
- ఇంకా అతని పేరు డేవిడ్.

153
00:09:44,543 --> 00:09:46,211
ఎనిమిదవ వ్యక్తి ససేమిరా ఒప్పుకోకపోతే ఏం చేద్దాం?

154
00:09:46,211 --> 00:09:48,797
అదే కనుక జరిగితే, దురదృష్టవశాత్తూ,
మనం కోర్టు మెట్లు ఎక్కాల్సిందే.

155
00:09:48,797 --> 00:09:50,132
సమస్య పరిష్కారమవుతుందిలే.

156
00:09:50,132 --> 00:09:51,842
"బాధితులు" అనే పదం వాడవద్దు.

157
00:09:51,842 --> 00:09:53,719
ఎవరూ "బాధితులు" అనే పదాన్నే వాడకూడదు.

158
00:09:54,219 --> 00:09:57,181
- ఏం ఆలోచిస్తున్నావు, జాన్?
- ఏమో మరి.

159
00:09:57,181 --> 00:09:59,933
ఈ సీగల్ కుటుంబమంతా చిత్రవిచిత్రంగా ఉంది.

160
00:10:01,185 --> 00:10:02,769
సరే. ఎందుకలా అనిపిస్తోంది?

161
00:10:03,395 --> 00:10:04,980
- డ్రింక్ కావాలా?
- వద్దు.

162
00:10:05,689 --> 00:10:08,525
- మళ్లీ జోనథన్ ని కలవడానికి వెళ్ళా.
- వావ్. అయితే?

163
00:10:09,401 --> 00:10:12,279
మనిద్దరం మాట్లాడుకున్న తర్వాత,
నేను మీ కుటుంబ సభ్యులలో కొందరిని కలిశాను.

164
00:10:12,279 --> 00:10:16,283
అయ్యయ్యో. బర్నీని కలిశావు కదా.

165
00:10:17,242 --> 00:10:19,328
అవును. ఒలీవియా అదృశ్యం విషయంలో

166
00:10:19,328 --> 00:10:21,622
- మీలా అతను ఆందోళన పడట్లేదు.
- అందులో వింతేం ఉంది.

167
00:10:21,622 --> 00:10:22,748
- అవునా?
- హా.

168
00:10:22,748 --> 00:10:26,251
అవును, నేను, అతను టిఫిన్ చేసేటప్పుడు

169
00:10:26,251 --> 00:10:28,003
తన కొడుకు డేవీని, ఇంకా అతని బాడీగార్డ్ ని

170
00:10:28,003 --> 00:10:30,005
- నా హోటల్ గదిని సోదా చేయడానికి పంపాడు.
- దేవుడా.

171
00:10:30,005 --> 00:10:33,008
ఒలీవియా పాడైపోయిన అమ్మాయి. తను మారదు.

172
00:10:33,008 --> 00:10:35,552
ఆ అభిప్రాయమే బర్నీకి బాగా సెట్ అవుతుంది.

173
00:10:36,053 --> 00:10:39,640
చెత్త సినిమాలు చేయడానికి, పిచ్చి కొడుకును
చూసుకోవాలంటే అది తప్పదు కదా.

174
00:10:41,683 --> 00:10:43,227
ఆ మాట అనుండాల్సింది కాదు.

175
00:10:44,478 --> 00:10:46,230
బర్నీ సినిమాలన్నీ చెత్తవే అనుకోవడానికి వీల్లేదు.

176
00:10:46,813 --> 00:10:47,981
అబ్బా.

177
00:10:48,857 --> 00:10:51,485
బర్నీకి, మార్గిట్ సొరెన్సన్ కి పుట్టిన అబ్బాయా డేవిడ్?

178
00:10:51,985 --> 00:10:53,237
- తనని కలిశావా?
- లేదు.

179
00:10:54,404 --> 00:10:59,952
స్వార్థానికి మరో ఉదాహరణ ఆమె. భయంకరమైన మహిళ.

180
00:11:01,328 --> 00:11:04,581
మీ కుటుంబంలో అందరి మధ్యా మంచి సాన్నిహిత్యం ఉన్నట్టుందే.

181
00:11:08,168 --> 00:11:09,169
అంటే...

182
00:11:12,548 --> 00:11:14,174
మా కారణాలు మాకు ఉన్నాయిలే.

183
00:11:18,345 --> 00:11:20,347
జాన్, నాకు కాస్త సాయపడతావా?

184
00:11:22,349 --> 00:11:26,812
నా మనవరాలి విషయం తప్ప
మనం అన్నింటి గురించి మాట్లాడుకున్నాం.

185
00:11:27,646 --> 00:11:29,481
మీ ఓపికకి ధన్యవాదాలు.

186
00:11:29,481 --> 00:11:30,816
సారీ.

187
00:11:30,816 --> 00:11:34,319
ఒలీవియా కారులోని జీపియస్ రికార్డ్ ఇది.

188
00:11:34,319 --> 00:11:36,154
అబ్బా.

189
00:11:36,154 --> 00:11:37,489
జాన్, కూర్చో.

190
00:11:37,990 --> 00:11:40,534
తను అదృశ్యమైపోవడానికి ఒక వారం ముందు,

191
00:11:40,534 --> 00:11:43,161
తను పదే పదే ఒక చోటికి వెళ్లింది, అదే నాకు ఆందోళనగా ఉంది.

192
00:11:43,662 --> 00:11:46,331
ఈ చిరునామాలో ఉండే కార్మెన్ వాస్కేజ్ అనే మహిళని

193
00:11:46,331 --> 00:11:47,708
ఇటీవలే రేప్ చేసి చంపేశారు.

194
00:11:47,708 --> 00:11:50,794
మిస్ వాస్కేజ్ చనిపోయిన రాత్రి, ఒలీవియా కారు అక్కడే ఉంది.

195
00:11:50,794 --> 00:11:53,630
మిస్ వాస్కేజ్ ని చంపిన వ్యక్తికి,

196
00:11:53,630 --> 00:11:55,340
ఈ కారు అక్కడ ఉండటానికి సంబంధం ఉండవచ్చు.

197
00:11:55,340 --> 00:11:56,633
నీకు ఎందుకలా అనిపిస్తోంది?

198
00:11:57,885 --> 00:12:00,971
ఎందుకంటే, ఇప్పుడు అతని శవం
ఒలీవియా కారు డిక్కీలోనే ఉంది.

199
00:12:04,892 --> 00:12:05,893
బాబోయ్.

200
00:12:09,438 --> 00:12:10,814
క్లిఫర్డ్ కార్టర్.

201
00:12:11,356 --> 00:12:13,650
ఇతడిని దాడి, రేప్, ఇంకా
మానవ అక్రమ రవాణా కేసుల్లో గతంలో అరెస్ట్ చేశారు.

202
00:12:13,650 --> 00:12:14,735
జాన్.

203
00:12:14,735 --> 00:12:17,529
ఇప్పుడు అదృశ్యమైపోయిన
హాలీవుడ్ పెద్ద తలకాయ కారులో, ఓ శవమై ఉన్నాడు.

204
00:12:18,030 --> 00:12:19,281
కూర్చో.

205
00:12:21,033 --> 00:12:22,576
ఎవరైనా హత్యకు గురైనప్పుడు

206
00:12:22,576 --> 00:12:25,037
పోలీసులకు ఫిర్యాదు చేయడం నా బాధ్యత, మిస్టర్ సీగల్.

207
00:12:25,037 --> 00:12:26,997
కానీ నువ్వు ఫిర్యాదు చేయలేదు కదా?

208
00:12:29,875 --> 00:12:32,586
ఆ కారు డిక్కీని నేను అసలు తెరవలేదన్నట్టే ఉంటాను.

209
00:12:32,586 --> 00:12:34,171
థ్యాంక్స్.

210
00:12:34,171 --> 00:12:36,798
అయినా కానీ, ఒలీవియా ప్రాణం ప్రమాదంలో ఉందనిపిస్తోంది.

211
00:12:37,299 --> 00:12:38,926
- అయ్య బాబోయ్.
- హా.

212
00:12:38,926 --> 00:12:40,010
జాన్.

213
00:12:40,677 --> 00:12:43,388
చాలా జరుగుతున్నాయి. అంటే... ఈ వ్యక్తులు, ఈ ప్రదేశాలు.

214
00:12:43,388 --> 00:12:44,848
ఈపాటికి నేను ఒక అంచనాకు వచ్చి ఉండాల్సింది...

215
00:12:44,848 --> 00:12:47,267
- కూర్చో.
- ...కానీ ఈ కేసు పెద్దది అవుతూనే ఉంది.

216
00:12:47,267 --> 00:12:48,435
నన్ను అడిగితే,

217
00:12:48,435 --> 00:12:50,479
ఒలీవియా కనిపించకుండా పోవడానికి,

218
00:12:50,479 --> 00:12:55,484
- ఇంకా ఈ తతంగమంతటికీ ఏదో సంబంధం...
- సరే. ఇదే నేను చెప్పేది.

219
00:12:57,486 --> 00:12:58,570
ఏంటి?

220
00:13:00,113 --> 00:13:02,366
ఏం లేదు. నిన్ను మిస్ అయ్యా, షుగర్.

221
00:13:03,742 --> 00:13:04,743
నేను కూడా నిన్ను మిస్ అయ్యా.

222
00:13:05,410 --> 00:13:07,829
హా. అందుకే ఇద్దరం కలిసి

223
00:13:07,829 --> 00:13:10,832
కాసేపు గడిపితే బాగుంటుంది అనుకున్నా.

224
00:13:10,832 --> 00:13:13,544
- కేసు గురించి మాట్లాడకూడదు. అంతేగా.
- ఆ పని చేద్దామా? కాస్త మనం

225
00:13:13,544 --> 00:13:14,962
- మన గురించే మాట్లాడుకుంటూ...
- సరే.

226
00:13:14,962 --> 00:13:16,547
- ...కలిసి తిందామా?
- తప్పకుండా. అంటే...

227
00:13:17,047 --> 00:13:18,715
- ఆ పని చేసి చూద్దాం, సరేనా?
- సరే.

228
00:13:23,929 --> 00:13:25,013
ఇది చాలా మంచి ఆలోచన.

229
00:13:25,514 --> 00:13:26,765
భోజనం.

230
00:13:28,851 --> 00:13:31,478
- ఎలా ఉన్నావు?
- బాగున్నా. బిజీగా కూడా ఉన్నా.

231
00:13:31,478 --> 00:13:34,314
ఏమైనా సూపర్ నువ్వు. అదిరిపోయేలా వండావు.

232
00:13:34,314 --> 00:13:35,649
నాతో సహా 15 మందిని చూసుకుంటున్నావా?

233
00:13:35,649 --> 00:13:36,984
ఇప్పుడు అదనంగా వంట కూడా చేస్తున్నావు.

234
00:13:36,984 --> 00:13:39,444
- పందొమ్మిది మందిని.
- వావ్, 19 మందినా?

235
00:13:39,444 --> 00:13:40,821
బై, మిరంబే.

236
00:13:42,739 --> 00:13:45,242
మళ్లీ మర్చిపోతానేమో, నేను చార్లీకి కాల్ చేశాను,

237
00:13:45,242 --> 00:13:48,954
- నిఘా విషయంలో సహాయం కోసం.
- వావ్. నాకు చెప్పకుండానేనా?

238
00:13:49,788 --> 00:13:50,789
చురుకుగా వ్యవహరించానంతే.

239
00:13:51,373 --> 00:13:55,210
చురుకుగానా? నువ్వు కాస్త గుట్టుగా
పని చేయాలన్న విషయం మర్చిపోకు.

240
00:13:55,210 --> 00:13:56,837
హా, నాకు తెలుసు.

241
00:14:01,633 --> 00:14:03,260
సరే. ఇలా ఎక్కువగా జరుగుతోందా?

242
00:14:04,678 --> 00:14:06,013
ఎక్కువగా ఏం కాదు.

243
00:14:06,013 --> 00:14:07,639
డాక్టర్ వికర్స్ కి కాల్ చేశావా?

244
00:14:07,639 --> 00:14:09,933
- చేద్దామనే అనుకున్నా.
- జాన్.

245
00:14:09,933 --> 00:14:12,853
రేపు సమావేశంలో కలుస్తాను ఆయన్ని.
అప్పుడు మట్లాడతానులే. సరేనా?

246
00:14:12,853 --> 00:14:15,230
అదేమీ కుదరదు. ఇవాళే కాల్ చేయ్.

247
00:14:19,526 --> 00:14:22,070
మరేం పర్వాలేదు. భోజనానికి థ్యాంక్స్.

248
00:14:25,240 --> 00:14:28,243
రూబీ ఊరికే కంగారుపడిపోతుంది,
అందుకు తనంటే నాకు ఇష్టం.

249
00:14:29,286 --> 00:14:30,495
కానీ నాకు చాలా పని ఉంది.

250
00:14:32,122 --> 00:14:35,209
ఇప్పుడు ఒలీవియా ఆచూకీని కనిపెట్టడానికి
నాకున్న ఏకైక దారి, మెలనీ మ్యాథ్యూస్,

251
00:14:35,209 --> 00:14:39,213
ఇప్పుడు అది సులువే, ఎందుకంటే
ఆమె నాకు కాల్ చేసి, కలవాలంది.

252
00:14:40,881 --> 00:14:42,424
హాయ్, నా పేరు మెలనీ.

253
00:14:42,424 --> 00:14:44,051
హాయ్, మెలనీ.

254
00:14:44,051 --> 00:14:45,344
నేను తాగుబోతును.

255
00:14:46,845 --> 00:14:48,889
ఈ సమావేశానికి నేను వచ్చి చాలా కాలమైంది.

256
00:14:48,889 --> 00:14:54,603
చాలా కాలమంటే నిజంగానే చాలా కాలం.
నేను 23 ఏళ్లు తాగుడుకు దూరంగా ఉన్నా.

257
00:14:56,855 --> 00:14:59,358
కానీ రెండు వారాల నుండి, పిచ్చెక్కినట్టు తాగుతున్నా.

258
00:15:00,859 --> 00:15:04,530
కానీ నిన్న రాత్రితో తాగుడుకు మళ్లీ ఫుల్ స్టాప్ పెట్టేశా.

259
00:15:04,530 --> 00:15:08,492
ఎందుకంటే, నిన్న రాత్రి నేను
ఒక అపరిచితుడిని నా ఇంట్లోకి రానిచ్చాను,

260
00:15:08,492 --> 00:15:13,038
నేను అలా ఇరవైల వయస్సులో ఉన్నప్పుడే చేశాను.

261
00:15:15,040 --> 00:15:19,336
కానీ నేను మద్యం మత్తులో ఉన్నా కదా,
అందుకని ఆ అపరిచితుడిని రమ్మన్నాను.

262
00:15:24,299 --> 00:15:27,052
మనం ఇలా పాడైపోవడానికి ఒకే ఒక కారణం ఉంటుంది.

263
00:15:28,095 --> 00:15:29,847
- వీళ్లు ఒంటరివాళ్లు.
- మనం ఒంటరివాళ్లం.

264
00:15:34,893 --> 00:15:36,228
పైగా భయం కూడా ఉంటుంది.

265
00:15:39,439 --> 00:15:41,942
మన ప్రపంచంలో మనతో పాటు కోట్లాది మంది ఉన్నారు,

266
00:15:41,942 --> 00:15:45,237
ఎవరోకరితో మనం ప్రేమలో పడవచ్చు, ప్రేమించబడవచ్చు, కానీ...

267
00:15:47,197 --> 00:15:49,241
...మనం వాటికి దూరంగానే ఉండిపోతున్నాం.

268
00:15:49,241 --> 00:15:51,660
దానికి కారణం మన భయమే అనుకుంటా.

269
00:15:53,370 --> 00:15:57,457
గతంలో మనకి చేదు అనుభవాలు ఎదురయ్యాయి,
భవిష్యత్తులో అలా జరగకూడదనే భయం నాటుకు పోయి ఉంటుంది.

270
00:15:57,457 --> 00:16:01,295
కాబట్టి... మనం పాడైపోతాం,

271
00:16:03,005 --> 00:16:05,007
పిచ్చి పిచ్చి పనులు చేస్తాం,

272
00:16:05,007 --> 00:16:07,384
ఏది దొరికితే దానితో సంబంధాన్ని ఏర్పరచేసుకుంటాం.

273
00:16:10,470 --> 00:16:12,139
కానీ నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా?

274
00:16:13,640 --> 00:16:16,518
నేను ఇంటికి తీసుకొచ్చిన వ్యక్తి
నన్నేమీ చేయలేదు, ఏదీ దొంగతనం చేయలేదు.

275
00:16:16,518 --> 00:16:21,273
నాతో పడుకోలేదు, నేను
ఎంత ఆహ్వానించినా అతను వద్దనే అన్నాడు.

276
00:16:22,983 --> 00:16:24,109
హా. అతనేం చేశాడో తెలుసా?

277
00:16:26,737 --> 00:16:28,530
నన్ను బాగా చూసుకున్నాడు.

278
00:16:30,574 --> 00:16:34,620
నాకు దుప్పటి కప్పి వెళ్లిపోయాడు.

279
00:16:35,412 --> 00:16:38,790
అప్పటికి నేనింకా పనిలో ఉన్నా. ఇప్పటికీ పనిలోనే ఉన్నా.

280
00:16:40,042 --> 00:16:42,127
నేను ఉదయం లేచేసరికి,

281
00:16:42,127 --> 00:16:43,879
ఆ వ్యక్తిని దేవుడే నా దగ్గరికి పంపాడేమో అన్న

282
00:16:43,879 --> 00:16:47,382
అలోచన నాకు వచ్చింది.

283
00:16:49,301 --> 00:16:50,844
లేదా, అతను మంచి వాడే ఏమో.

284
00:16:53,138 --> 00:16:54,640
లేదా స్వలింగ సంపర్కుడేమో.

285
00:16:58,519 --> 00:17:02,773
కానీ, ఇప్పుడు అతను ఎవరనేది ముఖ్యం కాదు.

286
00:17:04,191 --> 00:17:06,527
నాలో ఏ ఆలోచన రేపాడో అది ముఖ్యం,

287
00:17:06,527 --> 00:17:11,615
నాకు జీవితంలో మరో అవకాశం
అవసరమనే ఆలోచన నాకు కలిగించాడు.

288
00:17:12,241 --> 00:17:14,159
కాబట్టి, థ్యాంక్స్.

289
00:17:23,877 --> 00:17:24,962
{\an8}వచ్చినందుకు థ్యాంక్స్.

290
00:17:25,587 --> 00:17:26,588
రమ్మని పిలిచినందుకు థ్యాంక్స్.

291
00:17:27,297 --> 00:17:29,383
- ఒలీవియా గురించి మాట్లాడాలనుకుంటున్నావా?
- అవును.

292
00:17:29,883 --> 00:17:32,803
నాకు ఇంకా రాత్రి తాగింది దిగలేదు. ఏమన్నా తిందామా?

293
00:17:32,803 --> 00:17:34,263
- తప్పకుండా.
- నన్ను దింపగలవా?

294
00:17:34,263 --> 00:17:35,347
- హా.
- మంచిది.

295
00:17:40,686 --> 00:17:44,565
నేను లేచాక, మద్యాన్నంతటినీ పారేశా,
కాబటి ఇంట్లో సోడా మాత్రమే ఉంది.

296
00:17:44,565 --> 00:17:46,650
- పర్వాలేదు.
- హా, తెలుసు.

297
00:17:46,650 --> 00:17:47,860
నీకు ఎలాగూ మత్తు ఎక్కదు కదా.

298
00:17:49,278 --> 00:17:51,697
- అది మీకు బాగానే గుర్తుందే.
- హా, దాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను.

299
00:17:53,949 --> 00:17:57,327
మరి నిన్న, నువ్వు నన్ను ఫాలో చేశావా, జాన్ షుగర్...

300
00:17:57,327 --> 00:18:01,290
- లేదు, అది అనుకోకుండా జరిగింది, అంతే.
- ...ప్రైవేట్ డిటెక్టివ్ కదా నువ్వు? హా?

301
00:18:01,290 --> 00:18:04,001
నేను మరో ఆధారంపై దర్యాప్తు చేస్తూ ఉన్నా అప్పుడు.

302
00:18:04,001 --> 00:18:05,169
అది ఇదేనా?

303
00:18:05,711 --> 00:18:06,837
- హా, అదే.
- సరే.

304
00:18:06,837 --> 00:18:09,673
ఒలీవియా గురించి మాట్లాడాలని ఉన్నప్పుడు,
తన గురించి అడిగి ఉంటే సరిపోయేది కదా.

305
00:18:09,673 --> 00:18:12,301
నిన్న రాత్రి బాగా తాగున్నారు కదా,
ఆ మత్తులో మీరు చెప్పేది నమ్మవచ్చో లేదో అని.

306
00:18:12,301 --> 00:18:14,720
నీకు చిత్రంగా అనిపించవచ్చు కానీ,
తాగినప్పుడు, నేను అన్నీ నిజాలే మాట్లాడతాను.

307
00:18:14,720 --> 00:18:16,096
మత్తులో లేనప్పుడు, చాలా గుట్టుగా ఉంటా.

308
00:18:16,972 --> 00:18:19,057
ఒలీవియా విషయంలో కూడా అలాగే ఉంటే మేలు అనిపిస్తోందా మీకు?

309
00:18:19,057 --> 00:18:20,142
అలా అని నేను అనలేదు.

310
00:18:20,142 --> 00:18:21,435
మిమ్మల్ని ఒకటి అడగవచ్చా?

311
00:18:21,977 --> 00:18:24,980
తను కనబడకుండా పోయిన ఒక వారం ముందు,
దాదాపుగా ప్రతీరోజు రాత్రి తను ఇక్కడికి వచ్చింది. ఎందుకు?

312
00:18:25,564 --> 00:18:27,065
తను ఇక్కడికి వచ్చిందని మీకు ఎవరు చెప్పారు?

313
00:18:27,065 --> 00:18:29,026
- తను ఇక్కడికి వచ్చిందని నాకు తెలుసు.
- ఎలా తెలుసు?

314
00:18:29,526 --> 00:18:31,820
తన కారుకు ఉన్న జీపియస్ సిస్టములో ఇదంతా ఉంది.

315
00:18:31,820 --> 00:18:33,614
కారులో తనే వచ్చిందని ఎందుకు అనుకున్నారు?

316
00:18:33,614 --> 00:18:35,949
తన మిత్రుల్లో ఎవరో వచ్చి ఉండవచ్చు కదా?

317
00:18:37,284 --> 00:18:38,410
జరిగింది అదేనా?

318
00:18:43,498 --> 00:18:45,334
ఇదే కదా గుట్టుగా ఉండటం అంటే?

319
00:18:49,379 --> 00:18:52,674
గత ఆరు నెలల కాలంలో ఒలీవియా సోషల్ మీడియాలో చేసిన పోస్టులలో

320
00:18:52,674 --> 00:18:53,759
దాదాపుగా అన్నింటినీ గమనించేశాను.

321
00:18:53,759 --> 00:18:55,969
అంతా సాధారణమైన విషయాలే,

322
00:18:56,887 --> 00:18:59,473
కానీ మీ ఇద్దరూ ఎక్కువ సేపు గడపడం
ప్రారంభమైన నాటి నుండి అందులో మార్పు గమనించా.

323
00:19:00,766 --> 00:19:02,017
తన దృష్టి మళ్లింది.

324
00:19:02,017 --> 00:19:04,811
- మహిళల హక్కుల మీదకు మళ్లింది.
- అందులో... అందులో తప్పేముంది?

325
00:19:04,811 --> 00:19:06,313
ఏ... ఏ తప్పూ లేదు.

326
00:19:06,897 --> 00:19:09,983
ఎట్టకేలకు తనకి ఆసక్తి ఉన్న దాని వైపు ఆమె అడుగు వేసింది.

327
00:19:11,401 --> 00:19:13,737
కానీ రెండు వారాల క్రితం, తను కనబడకుండా పోయినప్పుడు,

328
00:19:13,737 --> 00:19:15,906
తన ఆన్ లైన్ యాక్టివిటీ కూడా ఆగిపోయింది,
అదే ఆందోళన కలిగించే విషయం.

329
00:19:15,906 --> 00:19:18,700
తను ఎంతైనా డ్రగ్స్ కి బానిస కదా,
తన ప్రవర్తన ఊరికే మారుతూ ఉండటం మామూలే.

330
00:19:18,700 --> 00:19:21,912
మళ్లీ డ్రగ్స్ తీసుకోవడం మొదలుపెట్టిందేమో. చూడు, అది...

331
00:19:21,912 --> 00:19:23,956
తను బాగా తాగి ఉండి, మత్తులో తూలుతూ

332
00:19:23,956 --> 00:19:28,335
ఏ రోజైనా తిరిగి వచ్చేయవచ్చు,
అప్పుడు మళ్లీ పునరావాసానికి పంపించాలి తనని.

333
00:19:29,920 --> 00:19:30,921
ఇది భలే గమ్మత్తుగా ఉంది.

334
00:19:31,797 --> 00:19:33,632
మీ మాజీ భర్త కూడా ఈ మాటలే అన్నాడు,

335
00:19:33,632 --> 00:19:35,551
దాదాపుగా మీరు వాడిన పదాలే వాడాడు.

336
00:19:37,010 --> 00:19:40,055
అతను ఖచ్చితంగా రక్షణాత్మక వైఖరి తీసుకొని ఉంటాడు కదా.

337
00:19:40,055 --> 00:19:42,850
హా, నువ్వు అతనితో టిఫిన్ చేశాక, నాకు కాల్ చేశాడు.

338
00:19:43,934 --> 00:19:47,312
బర్నీ మొగుడుగా చెత్తగాడే, కానీ అతను చాలా మంచి మిత్రుడు.

339
00:19:47,312 --> 00:19:48,480
- అవునా?
- హా.

340
00:19:50,774 --> 00:19:53,861
- తను జుట్టును అలా అంటోందంటే, అది అబద్ధమే.
- ఇలా చూడండి.

341
00:19:54,611 --> 00:19:56,822
మీరు ఇతడిని ఎప్పుడైనా చూశారా?

342
00:20:00,158 --> 00:20:02,953
మెలనీ, మీరు సమస్యల్లో ఉన్నా,
లేదా ఒలీవియా సమస్యల్లో ఉన్నట్టు మీకు అనిపించినా,

343
00:20:02,953 --> 00:20:04,997
నేను సాయపడగలను. ఏం జరిగిందో నాకు చెప్పండి.

344
00:20:07,332 --> 00:20:09,459
అతడిని ఇప్పటిదాకా నేను చూడనే లేదు.

345
00:20:09,459 --> 00:20:11,170
- ఎందుకిలా చేస్తున్నారు?
- ఎలా?

346
00:20:11,170 --> 00:20:13,046
ఇదే. ఈ నటన. నాకు...

347
00:20:14,131 --> 00:20:16,550
మీరు అబద్ధమాడుతున్నారని అర్థమవుతోంది.
కానీ ఎందుకు ఆడుతున్నారో తెలియట్లేదు.

348
00:20:18,218 --> 00:20:19,469
మీరేమైనా దాస్తున్నారేమో.

349
00:20:19,970 --> 00:20:21,180
దాయడం అంటే?

350
00:20:21,180 --> 00:20:22,347
తను ఎక్కడ ఉంది అనే విషయం.

351
00:20:23,891 --> 00:20:25,809
లేదా తన శవం ఎక్కడ ఉంది అనే విషయం.

352
00:20:28,437 --> 00:20:29,438
ఇక బయలుదేరు.

353
00:20:29,438 --> 00:20:34,526
మీరు తనకి మేలు చేస్తున్నారనే అనుకుంటున్నారు,
కానీ దీని వలన మేలు కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది.

354
00:20:34,526 --> 00:20:36,653
- సరే, ఇక బయలుదేరు.
- ఒకటి స్పష్టంగా చెప్తున్నాను.

355
00:20:36,653 --> 00:20:38,739
ఎలాగైనా నేను ఒలీవియా ఆచూకీని కనిపెడతా.

356
00:20:39,698 --> 00:20:41,158
నా పనే అది.

357
00:20:41,825 --> 00:20:43,035
నా పని నేను కత్తిలా చేస్తా.

358
00:20:47,831 --> 00:20:48,832
ఇక బయలుదేరు.

359
00:21:04,139 --> 00:21:05,140
హేయ్, చార్లీ.

360
00:21:05,682 --> 00:21:08,602
తనకి ఒలీవియా ఎక్కడ ఉందో తెలుసు అనిపిస్తోంది,
రేపు తన దగ్గరకే మనల్ని తీసుకెళ్లవచ్చు.

361
00:21:08,602 --> 00:21:10,187
వ్యాన్ సిద్ధంగా ఉంచు, సరేనా?

362
00:21:10,771 --> 00:21:12,981
రేపు ఉదయం కలుస్తా. బై మరి.

363
00:21:23,825 --> 00:21:26,161
ఆ సినిమాలను కుట్రపూరిత ఉద్దేశంతో తీస్తున్నారు అనుకుంటా.

364
00:21:26,703 --> 00:21:27,746
నిజంగానే చెప్తున్నా.

365
00:21:28,372 --> 00:21:32,584
అలా అని ఎందుకు అన్నానంటే,
అవి నిన్ను ఏమారుస్తున్నాయి, ఫ్లోరెన్స్.

366
00:21:32,584 --> 00:21:35,629
నీ చిన్నతనం నుండి అవి నిన్ను ఏమారుస్తూనే ఉన్నాయి.

367
00:21:36,129 --> 00:21:38,674
నువ్వు అన్నీ నమ్మేలా చేస్తున్నాయి.

368
00:21:38,674 --> 00:21:45,180
ఆదర్శాలు, స్థైర్యం, మంచివాళ్లు, ప్రేమ మొదలైన విషయాలను.

369
00:21:46,807 --> 00:21:51,603
కానీ నా జీవితంలో
నన్ను నన్నుగా ప్రేమించేవాడు ఎవడూ లేడు, ఫ్లోరెన్స్.

370
00:21:51,603 --> 00:21:55,065
కనీసం ప్రేమను చూపే వాళ్లు కూడా నాకు ఎదురుకాలేదు.

371
00:21:55,065 --> 00:21:56,692
అసలు... అసలు అలాంటి వాళ్లు నాకు తారసపడనే లేదు.

372
00:21:56,692 --> 00:21:57,985
అర్థమవుతోంది కదా?

373
00:21:57,985 --> 00:22:00,487
అలాంటి వాళ్లు ఎవరూ ఉండరు, ఫ్లోరెన్స్. అదే నిజం.

374
00:22:12,875 --> 00:22:14,001
మళ్లీ అదే కారు.

375
00:22:15,460 --> 00:22:17,004
ఎవరో నా మీద నిఘా పెడుతున్నారు.

376
00:22:17,504 --> 00:22:19,339
అప్పుడప్పుడే అయినా, దూరంగా ఉంటూ తెలివిగా చేస్తున్నారు.

377
00:22:20,674 --> 00:22:23,635
చాలా బాగా నిఘా పెడుతున్నారు, కానీ నాకు తెలిసిపోతోంది.

378
00:22:38,025 --> 00:22:40,527
హేయ్! హేయ్!

379
00:22:46,241 --> 00:22:47,242
కార్ల్?

380
00:22:48,076 --> 00:22:49,077
వైలీ.

381
00:22:50,162 --> 00:22:51,496
హేయ్, ఎవరైనా కార్ల్ ని చూశారా?

382
00:22:53,207 --> 00:22:55,751
- పొడుగ్గా ఉంటాడు. తెల్ల జుట్టు. ఎవరైనా చూశారా? కార్ల్.
- లేదు.

383
00:22:57,711 --> 00:22:59,755
- కార్ల్!
- ఇక్కడి నుండి దొబ్బేయ్, బాసూ.

384
00:23:06,053 --> 00:23:07,054
క్షమించాలి.

385
00:23:07,054 --> 00:23:08,222
- మీరు డిస్ కనెక్ట్ చేయబడిన...
- అబ్బా.

386
00:23:08,222 --> 00:23:09,890
- ...నంబరుకు కాల్ చేశారు.
- ఇలా రా. రా.

387
00:23:10,682 --> 00:23:13,727
ఎక్కు. ఎక్కు. సూపర్.

388
00:23:20,400 --> 00:23:23,403
కాంటాక్ట్ ఫైండర్
లొకేషన్ కోసం వెతుకుతోంది...

389
00:23:30,077 --> 00:23:31,662
నాకు తెలుసు. తెలుసు.

390
00:23:32,454 --> 00:23:33,580
కానీ నాకెందుకు?

391
00:23:34,373 --> 00:23:35,874
ఇది నాకు సంబంధించిన పని కాదు కదా?

392
00:23:37,501 --> 00:23:40,671
హా. నేను కూడా ఆ ప్రశ్నే వేసుకుంటూ ఉంటా.

393
00:23:45,801 --> 00:23:46,718
సరే మరి.

394
00:24:38,854 --> 00:24:40,105
అబ్బా, కార్ల్.

395
00:24:49,031 --> 00:24:50,407
ఎవరు నువ్వు?

396
00:24:50,407 --> 00:24:51,617
ఇతనికి ఏం ఇచ్చావు?

397
00:24:55,662 --> 00:24:56,788
ఏమిచ్చావు?

398
00:24:59,041 --> 00:25:00,417
దొబ్బేయ్.

399
00:25:06,131 --> 00:25:07,090
హేయ్!

400
00:25:16,141 --> 00:25:18,018
నాకు జనాలను కొట్టడం ఇష్టం లేదు.

401
00:25:20,312 --> 00:25:21,313
నిజంగానే నాకు ఇష్టం లేదు.

402
00:25:33,158 --> 00:25:34,159
నేను ఇక్కడికి అస్సలు రాలేదు.

403
00:25:37,162 --> 00:25:38,789
కానీ నా ఉద్దేశం ఇదే.

404
00:25:38,789 --> 00:25:42,000
డ్రగ్స్ ఎక్కువ తీసుకొని చావడం. ప్రతిరోజూ జరిగే తంతే ఇది.

405
00:25:43,085 --> 00:25:44,419
ఇదంతా నాకు ఎందుకు?

406
00:25:46,421 --> 00:25:51,760
ఎందుకు నాకు కోపం
వస్తోంది? అసలు ఏదైనా నేనెందుకు తెచ్చుకోవడం?

407
00:26:26,920 --> 00:26:28,297
- హేయ్.
- హాయ్.

408
00:26:28,881 --> 00:26:30,632
నా బ్రిడ్జ్ ఆట మధ్యలో వచ్చావు నువ్వు.

409
00:26:31,800 --> 00:26:34,386
సరే. మంగళవారం బ్రిడ్జ్ ఆడుకుంటావు కదా. బాగుంది.

410
00:26:35,262 --> 00:26:37,639
- సరే. గుడ్ నైట్, జాన్.
- నేను లోపలికి రావచ్చా?

411
00:26:38,640 --> 00:26:41,101
సీగల్ కేసు గురించి అర్జంట్ విషయమేమైనా మాట్లాడాలా?

412
00:26:41,101 --> 00:26:44,730
లేదు. అంటే...

413
00:26:48,525 --> 00:26:50,819
- దీన్ని ఇక్కడ ఉంచడం కుదురుతుందా?
- జాన్.

414
00:26:54,281 --> 00:26:56,158
ఇది మిరంబే ఇల్లు.

415
00:26:59,494 --> 00:27:00,996
మిరంబే ఒకటే నియమం పెట్టింది.

416
00:27:01,496 --> 00:27:02,873
- కుక్కలని లోపలికి రానివ్వకూడదు.
- హా.

417
00:27:03,373 --> 00:27:04,374
సరే.

418
00:27:05,375 --> 00:27:07,211
బూడిద రంగు ఫోక్స్ వ్యాగన్.

419
00:27:08,420 --> 00:27:09,505
ఏంటి?

420
00:27:09,505 --> 00:27:13,592
ఇవాళ నన్ను బూడిద రంగు ఫోక్స్ వ్యాగనులో
ఎవరో వెంబడించారు. వాళ్లెవరో నీకేమైనా తెలుసా?

421
00:27:14,259 --> 00:27:17,012
సీగల్ కుటుంబం వాళ్లు అంటావా? నీపై నిఘా వేసి ఉంచారంటావా?

422
00:27:17,012 --> 00:27:18,972
కాదు, నాకు తెలిసి వాళ్లు వేరే.

423
00:27:21,683 --> 00:27:23,936
డిక్కీలో ఉండే శవం సంగతి చూసుకున్నావా?

424
00:27:28,190 --> 00:27:29,274
ఆ పని చేయి.

425
00:27:30,901 --> 00:27:32,528
పద, వైలీ.

426
00:27:33,153 --> 00:27:35,447
చాలా పెద్ద పొరపాటు చేస్తున్నావు.
ఈ రెండూ మంచి దోస్తులు అయ్యుండవచ్చు.

427
00:27:45,666 --> 00:27:50,587
ఇప్పుడే వెళ్లిపోయాడు. ఎవరో ఫాలో చేస్తున్నారట.
లేదు, వాళ్లు ఇతనిపై నిఘా వేసి ఉంచారని అర్థమైపోతోంది.

428
00:28:11,066 --> 00:28:12,317
దుంపదెగ.

429
00:28:16,154 --> 00:28:17,447
పారేయడానికి శవం ఎక్కడిది!

430
00:28:19,533 --> 00:28:20,659
నా కన్నా ముందే ఎవరో ఆ పని చేసేశారు.

431
00:28:42,848 --> 00:28:44,016
ఏంటి ఇవన్నీ?

432
00:28:44,016 --> 00:28:46,518
సినిమాల మ్యాగజైన్స్. నాకు తెలీని సినిమాలు.

433
00:28:46,518 --> 00:28:49,146
నాకే కాదు, ఎవరికీ తెలీని సినిమాలు ఇవి.

434
00:28:51,773 --> 00:28:52,774
ఇవేంటి?

435
00:28:53,400 --> 00:28:54,735
ఆమె తల్లి పంపిన ఉత్తరాలు, సర్.

436
00:28:54,735 --> 00:28:55,819
హా, ఇది చూడు.

437
00:28:56,862 --> 00:28:57,863
ఇది తెచ్చావా?

438
00:28:59,156 --> 00:29:00,574
ఏమైంది? అతను చదివేశాడుగా.

439
00:29:00,574 --> 00:29:02,743
- ఈసారి, డేవీ...
- డేవిడ్.

440
00:29:02,743 --> 00:29:07,497
ఈసారి, డేవిడ్, ఫోటోలు తీసే పని కెన్నీ చూసుకుంటాడులే, సరేనా?

441
00:29:08,290 --> 00:29:10,292
సరే మరి. ఇదేంటి?

442
00:29:10,792 --> 00:29:11,627
ఒక ఆహ్వానం.

443
00:29:11,627 --> 00:29:14,004
హా. అది తెలుస్తోంది. దేనికి ఆహ్వానం?

444
00:29:14,004 --> 00:29:16,882
తెలీదు. నేను గూగుల్ లో కూడా వెతికా.
కానీ... కానీ ఏమీ దొరకలేదు.

445
00:29:16,882 --> 00:29:19,009
అందులో స్థాన సమాచారం కూడా లేదు, మిస్టర్ సీగల్.

446
00:29:19,009 --> 00:29:20,969
తేదీ, సమయం మాత్రమే ఉన్నాయి. రేపటి రాత్రికే.

447
00:29:24,056 --> 00:29:25,182
మరి రహస్య మైక్రోఫోన్ సంగతేంటి?

448
00:29:25,182 --> 00:29:27,476
దాని నుండి ఏం తెలీట్లేదు. అతను కనిపెట్టేసి ఉంటాడు.

449
00:29:30,020 --> 00:29:31,522
నా మాటను ఆలకించి,
ఏదైనా తెలుసుకోవడానికి ప్రయత్నించండి.

450
00:29:31,522 --> 00:29:34,066
నా జీవితం ఒక ఎకో సిస్టమ్ లాంటిది.

451
00:29:35,442 --> 00:29:37,319
- అంటే ఏంటో తెలుసా?
- హా, ఎకో సిస్టమ్ అంటే ఏంటో నాకు తెలుసు.

452
00:29:37,319 --> 00:29:39,238
మంచిది, అయితే జాగ్రత్తగా విను. ఎందుకంటే నా ఎకో సిస్టములో

453
00:29:39,238 --> 00:29:43,492
నేను, నా భార్యాపిల్లలు,

454
00:29:43,492 --> 00:29:45,118
నా నిర్మాణ సంస్థ ఉంది.

455
00:29:45,827 --> 00:29:48,914
నాకు నా ఎకో సిస్టమ్ తప్ప ఇంకేమీ అక్కర్లేదు.

456
00:29:48,914 --> 00:29:52,042
కాబట్టి, ఏదైనా బయటి శక్తి
ప్రవేశిస్తే, నేను అప్రమత్తం అవుతాను,

457
00:29:52,042 --> 00:29:54,294
"ఇది మంచి శక్తా, చెడు శక్తా?" అని ఆలోచిస్తా.

458
00:29:54,294 --> 00:29:59,216
ఆ విషయం నాకు పూర్తిగా తెలియాలంటే,
ఆ బయటి శక్తి గురించి నాకు పూర్తిగా తెలియాలి.

459
00:29:59,216 --> 00:30:03,053
అతను ఒలీవియానే కాకుండా,
నీలాగా ఇంకెవరిపైన అయినా దర్యాప్తు చేయడం

460
00:30:03,053 --> 00:30:04,137
నాకు అస్సలు ఇష్టం లేదు, డేవిడ్.

461
00:30:05,764 --> 00:30:08,892
కాబట్టి ఈ మిస్టర్ జాన్ షుగర్ గురించి
నాకు అన్ని వివరాలూ తెలియాలి.

462
00:30:10,185 --> 00:30:11,061
తప్పకుండా.

463
00:30:11,061 --> 00:30:13,522
- రేపు సాయంత్రానికల్లా నాకు రిపోర్ట్ కావాలి.
- అలాగే, నాన్నా.

464
00:30:25,659 --> 00:30:28,495
{\an8}హోటల్ డెల్ కోరెజాన్

465
00:30:31,290 --> 00:30:33,417
క్లిఫర్డ్ కార్టర్, కార్మెన్ వాస్కేజ్.

466
00:30:33,917 --> 00:30:35,502
తూర్పు లాస్ ఏంజెలస్ లో మానభంగం, హత్య

467
00:30:35,502 --> 00:30:39,882
వీళ్లకి, ఒలీవియాకి ఏంటి సంబంధం?
అది ఇంకా నాకు ఎందుకు తెలీట్లేదు?

468
00:30:43,635 --> 00:30:45,304
నిజానికి, నేను ఇంతగా జోక్యం చేసుకోకూడదు.

469
00:30:53,353 --> 00:30:55,063
నా దర్యాప్తు నేను చేసేసి, కనిపెట్టిన వాటిని రిపోర్ట్ చేయాలంతే.

470
00:30:57,024 --> 00:30:58,358
అన్నీ నోట్ చేసుకోవాలంతే.

471
00:31:00,194 --> 00:31:01,403
అదే నా అసలైన పని.

472
00:31:09,494 --> 00:31:11,038
లక్ష్యం అయితే అదే మరి.

473
00:31:16,793 --> 00:31:18,795
రూబీ మాకు అదే చెప్తూ ఉంటుంది...

474
00:31:21,173 --> 00:31:22,382
కానీ నేను నియంత్రించుకోలేకపోతున్నాను.

475
00:31:25,177 --> 00:31:26,178
ఆగలేకపోతున్నాను.

476
00:31:28,680 --> 00:31:29,681
నేను ఇందులో దూరిపోయా.

477
00:31:31,683 --> 00:31:33,435
తనని చూస్తే నాకు జెన్ గుర్తొస్తోంది.

478
00:31:35,145 --> 00:31:37,731
ఈ కేసు వేరేగా ముగియాలని కోరుకుంటున్నా. కానీ...

479
00:31:41,235 --> 00:31:42,653
తనని చూస్తే నాకు నా చెల్లి గుర్తొస్తోంది.

480
00:31:45,155 --> 00:31:46,198
తనని నేను కనిపెట్టి తీరుతా.

481
00:31:47,115 --> 00:31:49,201
తను ఎక్కడో ఉంది.

482
00:32:12,140 --> 00:32:13,141
ఆగండి.

483
00:32:13,141 --> 00:32:15,644
లేదు, లేదు. ఇంటి లోపలికి పదండి.

484
00:32:16,979 --> 00:32:18,355
గుడ్ ఈవినింగ్.

485
00:32:19,273 --> 00:32:20,357
మీరు టెరీసా, కదా?

486
00:32:22,651 --> 00:32:24,820
ఇప్పుడు ఆమె వారిని పడక గదిలోకి తీసుకెళ్లి,

487
00:32:24,820 --> 00:32:26,363
టీవీ ఏదైనా పెడుతుంది.

488
00:32:28,448 --> 00:32:30,826
లేదా వాళ్ల సంగతి చూసుకోమని అతనికి చెప్తా.

489
00:32:32,035 --> 00:32:33,745
రండి, సినిమా చూద్దాం.

490
00:32:33,745 --> 00:32:35,455
త్వరగా వెళ్లండి. సరేనా?

491
00:32:37,249 --> 00:32:40,919
టెరీసా, నేను ఒక మిత్రుని కోసం వెతుకుతున్నాను.

492
00:32:41,670 --> 00:32:43,881
క్లిఫర్డ్ కార్టర్. అతను నీ చెల్లితో తిరుగుతున్నాడు.

493
00:32:46,216 --> 00:32:47,217
నాకు అతనెవరో తెలీదు.

494
00:32:47,718 --> 00:32:49,178
అబద్ధాలాడకు, టెరీసా.

495
00:32:50,179 --> 00:32:51,430
సరే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను,

496
00:32:51,430 --> 00:32:55,058
కానీ ఇంకో అబద్ధమాడితే, పళ్లు రాళేలా చెంప చెళ్లుమనిపిస్తా.

497
00:32:56,143 --> 00:32:57,144
సరేనా?

498
00:32:57,853 --> 00:32:59,396
హేయ్, క్లిఫర్డ్ నా దగ్గర నమ్మకంగా పని చేస్తున్నాడు.

499
00:33:00,105 --> 00:33:04,443
అతనికి నా గురించి, నా క్లయింట్స్ గురించి
అంతా తెలుసు, అవి వెరెవరికీ తెలీడం నాకు ఇష్టం లేదు.

500
00:33:05,277 --> 00:33:08,614
ఈ సమాచారాన్ని... నా సమాచారాన్నంతటినీ
అతను ఫోనులో స్టోర్ చేసి ఉంచుకున్నాడు.

501
00:33:08,614 --> 00:33:14,494
కానీ నేను క్లిఫర్డ్ ని చూసి కానీ,
అతనితో మాట్లాడి కానీ చాలా రోజులైంది.

502
00:33:17,414 --> 00:33:18,415
అందుకని నాకు కంగారుగా ఉంది.

503
00:33:20,751 --> 00:33:22,085
అది నీకు అర్థమవుతోందా?

504
00:33:23,212 --> 00:33:24,213
హా.

505
00:33:25,130 --> 00:33:28,133
అతను మాయమైపోక ముందు నాకు పంపిన చివరి సందేశం ఇది.

506
00:33:29,343 --> 00:33:30,344
{\an8}క్లిఫర్డ్
దీన్ని వేసేయాలి.

507
00:33:30,344 --> 00:33:31,595
{\an8}ఈమె నీ చెల్లి కార్మెన్, కదా?

508
00:33:34,306 --> 00:33:35,307
అవును.

509
00:33:36,475 --> 00:33:39,311
ఇది ఎవరో తెలుసుకోవడానికి నాకు రెండు వారాలు పట్టింది.

510
00:33:43,357 --> 00:33:46,151
కాబట్టి, ఇది మంచి లోకమే అయితే,
నమ్మకంగా నా దగ్గర పని చేసే వాడికి ఏమైంది అని

511
00:33:46,151 --> 00:33:47,778
మేము కార్మెన్ తోనే మాట్లాడేవాళ్లం.

512
00:33:47,778 --> 00:33:50,322
కానీ ఇది మంచి లోకం కాదే, ఎందుకంటే తను చనిపోయింది కదా.

513
00:33:50,322 --> 00:33:54,117
కానీ మేము నీతో మాట్లాడగలం కదా, టెరీసా?

514
00:33:56,078 --> 00:33:57,538
- అవును.
- సరే.

515
00:33:59,248 --> 00:34:02,501
దాని తర్వాత అతను మాకు పంపిన సందేశం ఇదే.

516
00:34:03,836 --> 00:34:05,712
ఈమె ఎవరో నీకేమైనా తెలుసా?

517
00:34:07,464 --> 00:34:10,717
{\an8}ఈ పిచ్చిది ఎవరో తెలుసా మీకు?

518
00:34:19,851 --> 00:34:21,018
థ్యాంక్యూ.

519
00:34:22,312 --> 00:34:23,563
థ్యాంక్యూ. థ్యాంక్యూ.

520
00:34:23,563 --> 00:34:25,399
ఈమెకి... ఈమెకి తెలుసు.

521
00:34:26,233 --> 00:34:27,484
తర్వాత తనతోనే మాట్లాడదాం మనం.

522
00:35:38,805 --> 00:35:40,807
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

