1
00:01:09,069 --> 00:01:10,612
నిద్ర సరిగ్గా పట్టడం లేదు.

2
00:01:13,615 --> 00:01:14,741
పీడకలలు.

3
00:01:21,540 --> 00:01:23,500
ప్రస్తుతం ఈ సమస్య నాతో సహా
చాలా మందినే వేధిస్తూ ఉంటుందిలే.

4
00:01:28,255 --> 00:01:29,882
కానీ వైలీ మాత్రం బాగా విశ్రమిస్తున్నట్టుంది.

5
00:01:39,892 --> 00:01:41,226
- హలో.
- గుడ్ మార్నింగ్.

6
00:01:41,977 --> 00:01:43,687
గుడ్ మార్నింగ్. అంతా ఓకేనా?

7
00:01:44,271 --> 00:01:48,358
హా, నువ్వు ఎలా ఉన్నావో కనుక్కుందామని,
అలాగే గుడ్ మార్నింగ్ చెప్దామని కాల్ చేశాను.

8
00:01:48,358 --> 00:01:50,319
థ్యాంక్యూ. గుడ్ మార్నింగ్.

9
00:01:51,320 --> 00:01:53,864
- నీ కుక్క ఎలా ఉంది?
- అది నా కుక్క కాదు, సరేనా?

10
00:01:53,864 --> 00:01:58,827
అదొక కుక్క అంతే. నిద్రలో గురక పెడుతూ,
పక్కనున్న వాళ్లని తన్నే కుక్క అది, అంతే.

11
00:01:58,827 --> 00:02:01,413
కాబట్టి, అది... దురదృష్టవశాత్తూ అది...

12
00:02:03,081 --> 00:02:04,082
పదం గుర్తుకు రావట్లేదబ్బా!

13
00:02:05,167 --> 00:02:09,670
"అన్హాల్ట్బార్?" "ఒకుంఘాఫతేకీ?"

14
00:02:09,670 --> 00:02:11,006
చూసుకోవడం కష్టం అంటున్నావు.

15
00:02:11,006 --> 00:02:13,091
అవును. ఈ కుక్కని చూసుకోవడం కష్టం.

16
00:02:15,761 --> 00:02:17,095
పని చూసుకోవాల్సిన సమయం వచ్చేసింది,

17
00:02:17,095 --> 00:02:19,848
కానీ, ఏంటంటే, ఏమైనా తెలిసిందా?

18
00:02:20,349 --> 00:02:21,517
సీగల్ అమ్మాయి గురించా?

19
00:02:21,517 --> 00:02:22,643
అవును.

20
00:02:22,643 --> 00:02:25,020
నాలుగు గంటల కిందటే కదా
కాల్ చేశావు, ఈలోపు ఏం తెలుస్తుంది?

21
00:02:25,020 --> 00:02:27,523
నాకు ఇంకా ఏమీ తెలీలేదు.

22
00:02:28,190 --> 00:02:33,153
సరే. పర్వాలేదులే. మళ్లీ ఫోన్ చేస్తా. థ్యాంక్స్...

23
00:02:33,153 --> 00:02:36,490
షుగర్, నేను మళ్లీ చెప్తున్నాను.
ఈ కేసు నీకు మంచిది కాదు అనిపిస్తోంది.

24
00:02:38,450 --> 00:02:39,451
నాకు తెలుసు.

25
00:02:43,372 --> 00:02:47,709
ఎందుకు తను పదే పదే
ఆ మాట అంటోంది? ఎందుకంత కంగారు తనకి?

26
00:02:48,335 --> 00:02:50,295
డ్రగ్స్, పీడకలలు, అప్పుడపుడూ నా చేయి వణకడాల వంటి వాటిని

27
00:02:50,295 --> 00:02:51,797
పక్కకు పెట్టేస్తే, కంగారుపడటానికి ఏముంది!

28
00:02:52,548 --> 00:02:53,549
నాకేమీ కాలేదు.

29
00:02:54,883 --> 00:02:56,885
క్యాలిఫోర్నియాలో మరో అందమైన రోజు ఉదయించేసింది.

30
00:03:02,349 --> 00:03:03,433
హేయ్, నేను నీకు చాలాసార్లు కాల్ చేశా.

31
00:03:03,433 --> 00:03:06,603
సారీ. నిద్రపోదామని ఫోన్ ఆఫ్ చేసేశా. ఏమైంది?

32
00:03:06,603 --> 00:03:08,188
నిన్న రాత్రి ఒకరు...

33
00:03:10,148 --> 00:03:13,569
సారీ. నేను... నేను టిఫిన్ చేస్తున్నాను. ఒకడు ఇంటికి వచ్చి,

34
00:03:13,569 --> 00:03:15,529
- కార్మెన్ గురించి, నీ గురించి అడిగాడు.
- అబ్బా.

35
00:03:15,529 --> 00:03:17,030
నేనేమీ చెప్పలేదు. ఏమీ తెలీనట్టే నటించా.

36
00:03:17,030 --> 00:03:18,282
"నా చెల్లి గురించి, తను చేసే పనుల

37
00:03:18,282 --> 00:03:19,616
- గురించి నాకేం తెలుసు?" అన్నట్టు.
- సరే.

38
00:03:19,616 --> 00:03:21,451
కానీ వాళ్లు నన్ను నమ్మారని అనిపించట్లేదు.

39
00:03:21,451 --> 00:03:23,203
ఇబ్బంది పెడుతున్నందుకు సారీ, కానీ పిల్లలు ఉన్నారు కదా,

40
00:03:23,203 --> 00:03:25,497
పైగా అతడిని చూసి చచ్చేంత భయం వేసేసింది.

41
00:03:25,497 --> 00:03:27,457
- ఏమీ కాదులే. నేను వస్తున్నా అక్కడికి.
- సరే.

42
00:03:33,589 --> 00:03:34,423
ఏం చేస్తున్నావు?

43
00:03:35,007 --> 00:03:36,008
నేను... నేను కావాలని చేయలేదు.

44
00:03:41,638 --> 00:03:44,808
బాగా మాట్లాడావు, టెరీసా. అదరగొట్టేశావు.

45
00:03:54,151 --> 00:03:56,445
హేయ్. బాగానే ఉన్నావా?

46
00:03:56,445 --> 00:03:58,488
క్షమించాలి, నాకు వేరే దారి లేదు.

47
00:03:59,948 --> 00:04:04,161
ఎట్టకేలకు వచ్చేసింది, మెలనీ మ్యాథ్యూస్.

48
00:04:07,915 --> 00:04:11,043
{\an8}చార్లీ

49
00:04:11,043 --> 00:04:13,128
చార్లీ చాలా కాలంగా నాకు తెలుసు, తను చక్కగా పని చేస్తుంది.

50
00:04:14,421 --> 00:04:15,255
హా.

51
00:04:16,173 --> 00:04:17,716
మామూలు పౌరురాలే, కానీ తన మీద నాకు నమ్మకం ఉంది.

52
00:04:17,716 --> 00:04:19,134
నేను స్నానం చేస్తూ ఉన్నా.

53
00:04:19,968 --> 00:04:20,969
హా. ఏంటి సంగతి?

54
00:04:22,221 --> 00:04:23,263
ఎక్కడ?

55
00:04:23,263 --> 00:04:24,681
సరే. వస్తున్నా.

56
00:04:24,681 --> 00:04:27,267
ప్రస్తుతం తను మెలనీ మ్యాథ్యూస్ ని కనిపెట్టుకొని ఉంది.

57
00:04:27,267 --> 00:04:29,895
అలా అని ఒలీవియా అదృశ్యమైపోవడానికి
మెలనీయే కారణమని అనుకుంటున్నానని అనుకోవద్దు.

58
00:04:30,479 --> 00:04:32,314
కానీ, నిన్న తనతో మాట్లాడాక, తను చాలా దాస్తోందని

59
00:04:32,314 --> 00:04:34,066
{\an8}నాకు స్పష్టంగా అర్థమైంది.

60
00:04:34,066 --> 00:04:36,485
- హేయ్. షుగర్ దగ్గర కుక్క ఉందే?
- హేయ్, చార్లీ.

61
00:04:36,985 --> 00:04:40,447
ఇది నా కుక్క కాదు. తను లోపలికి వెళ్లి ఎంత సేపు అయింది?

62
00:04:41,490 --> 00:04:42,658
ఎనిమిదిన్నర నిమిషాలు అయింది.

63
00:04:43,242 --> 00:04:44,618
తను ఎలా ఉంది? అంటే, నీకు ఎలా అనిపించింది?

64
00:04:45,118 --> 00:04:47,496
ఏమో, షుగ్. తను మామూలుగా ఒక చోటు నుండి ఇంకో చోటుకు

65
00:04:47,496 --> 00:04:49,081
- కారులో వచ్చిన వ్యక్తిలాగానే అనిపించింది.
- హా.

66
00:04:49,081 --> 00:04:52,668
- లోపల ఒలీవియా సీగల్ ఉందనుకుంటున్నావా ఏంటి?
- లోపల ఎవరు ఉన్నారో నాకు తెలీదు, చార్లీ.

67
00:04:53,919 --> 00:04:55,879
ఆ కొత్త ఎఫ్-150 ట్రక్కు చూశావా?

68
00:04:55,879 --> 00:04:57,756
- హా.
- బాగుంది కదా?

69
00:04:58,340 --> 00:05:00,384
- ఇలాంటి ప్రాంతంలో అది ఉందంటే సూపర్ అనే చెప్పాలి.
- హా.

70
00:05:00,384 --> 00:05:03,303
రోడ్డుకు అవతలి ఉన్న ట్రక్కు చూశావా?
అది కూడా ఎఫ్-150 ట్రక్కే.

71
00:05:03,303 --> 00:05:05,180
ముందు సీటులో ఒక భయంకరమైన వ్యక్తి
కూర్చొని ఉన్నాడు చూశావా?

72
00:05:05,180 --> 00:05:07,641
అతను పాటలు వినట్లేదు. సెల్ ఫోన్ చూడట్లేదు.
చుట్టూ జాగ్రత్తగా గమనిస్తున్నాడు.

73
00:05:08,141 --> 00:05:10,227
- అవును. పనిలో ఉన్నాడు.
- అవును.

74
00:05:11,895 --> 00:05:12,896
ఏదో తేడాగా ఉంది.

75
00:05:13,730 --> 00:05:14,857
నేను వెళ్లి చూసొస్తా.

76
00:05:15,357 --> 00:05:17,234
నా కోసం ఒక పది నిమిషాలు చూడు, సరేనా?

77
00:05:18,443 --> 00:05:21,280
అర్థమైంది. వీళ్ళ నంబర్ ప్లేట్స్ రూబీకి పంపించి చూడమంటా.

78
00:05:21,280 --> 00:05:22,364
సరే.

79
00:05:25,659 --> 00:05:27,953
మళ్లీ చెప్తున్నాను, నాకు అస్సలు తెలీదు.

80
00:05:28,620 --> 00:05:30,372
- హా.
- నీ స్నేహితుడు క్లిఫర్డ్ ఒక చవట కాబట్టి,

81
00:05:30,372 --> 00:05:33,458
భార్యపై చేయి చేసుకొనే సన్నాసి కాబట్టి,
ఇంకా నాకు అర్థమైనంత వరకు,

82
00:05:33,458 --> 00:05:36,670
టెరీసా చెల్లి హత్య కేసులో ప్రధాన అనుమానితుడు కాబట్టి,

83
00:05:36,670 --> 00:05:38,755
నాకే కనుక అతని ఆచూకీ తెలిసి ఉంటే,

84
00:05:38,755 --> 00:05:42,551
నువ్వు అడగక ముందే ఎప్పుడో
ఆ విషయాన్ని పోలీసులకి చెప్పి ఉండేదాన్ని.

85
00:05:44,178 --> 00:05:45,304
నువ్వు అబద్ధం ఆడుతున్నావు.

86
00:05:45,804 --> 00:05:46,972
నిజంగానే నాకు తెలీదు.

87
00:05:46,972 --> 00:05:49,516
బాబోయ్. నా వల్ల కావట్లేదు... వేరే విధంగా ప్రయత్నిద్దాం.

88
00:05:50,017 --> 00:05:52,060
వాస్కేజ్. అంటే, కార్మెన్ ఇంటి పేరు.

89
00:05:52,060 --> 00:05:54,563
టిఫిన్ బాబూ, కాస్త తీసుకొస్తావా...

90
00:05:56,481 --> 00:05:58,066
ఒలీవియాకి, కార్మెన్ వాస్కేజ్ తో లింక్ ఉంది,

91
00:05:58,066 --> 00:06:00,903
క్లిఫర్డ్ కార్టర్ తో లింక్ ఉంది, మెలనీతో లింక్ ఉంది...

92
00:06:01,403 --> 00:06:05,240
లేదు, నాకు అర్థమైంది. అంతా చక్కగానే ఉంది. అంటే...

93
00:06:05,240 --> 00:06:08,243
లాజికల్ గా అంతా పక్కాగా ఉంది.

94
00:06:09,995 --> 00:06:15,751
కానీ లాజికల్ గా కాకుండా, నా సిక్త్ సెన్స్ ప్రకారం చూస్తే...

95
00:06:19,213 --> 00:06:22,007
...ఇంకా ఇక్కడున్న వారితో లింక్ ఉంది,

96
00:06:22,508 --> 00:06:23,800
- కాబట్టి...
- అబ్బా.

97
00:06:25,677 --> 00:06:27,596
ఇప్పుడు వద్దు. నాకు చాలా పనుంది.

98
00:06:27,596 --> 00:06:28,972
ఇప్పుడు వద్దు.

99
00:06:28,972 --> 00:06:32,684
నువ్వు అబద్ధం ఆడుతున్నావు అనుకుంటా,
కానీ లాజికల్ గా అంతా బాగానే చెప్పావు కాబట్టి,

100
00:06:32,684 --> 00:06:35,270
నాకు కాస్త అయోమయంగా ఉంది.

101
00:06:38,857 --> 00:06:43,862
ఇప్పుడు నీ స్నేహితురాలు, టెరీసా చేతిని
ఈ మిక్సర్ లో పెడతాం అన్నమాట...

102
00:06:43,862 --> 00:06:45,447
ఇప్పుడు వద్దు.

103
00:06:46,490 --> 00:06:47,783
- ...ఆపై దాన్ని ఆన్ చేస్తాం...
- ఏంటి?

104
00:06:47,783 --> 00:06:49,826
- ...చూద్దాం ఏమవుతుందో!
- ఏంటి?

105
00:06:57,084 --> 00:06:59,002
నువ్వు అరుస్తావులే. అది మాకు తెలుసు.

106
00:06:59,002 --> 00:07:00,546
- నీ అరుపులు మీ పిల్లలకి వినిపిస్తాయి...
- వద్దు.

107
00:07:00,546 --> 00:07:03,006
...ఇక వాళ్లు ఏడుస్తారు.

108
00:07:03,006 --> 00:07:05,342
- కానీ నువ్వేం చేస్తావు?
- దయచేసి ఇక ఆపండి.

109
00:07:05,342 --> 00:07:09,304
అప్పుడు క్లిఫ్ గురించి మాకు ఏం చెప్తావు?

110
00:07:09,888 --> 00:07:13,141
ఏం చెప్తావా అని నాకు చాలా ఆరాటంగా ఉంది.

111
00:07:13,141 --> 00:07:14,518
కానివ్వు.

112
00:07:14,518 --> 00:07:15,769
చూద్దామా మరి?

113
00:07:15,769 --> 00:07:18,021
- వద్దు! ఆగండి!
- బాబోయ్! దేవుడా, చెప్తాను!

114
00:07:19,481 --> 00:07:20,524
- తెలుసు.
- వద్దు!

115
00:07:23,944 --> 00:07:25,070
ఆగు!

116
00:07:26,321 --> 00:07:27,573
టెరీసా, తలుపు తెరువు!

117
00:07:29,241 --> 00:07:30,617
టెరీసా, తెరువు!

118
00:07:31,618 --> 00:07:35,038
టెరీసా, లోపల నువ్వున్నావని నాకు తెలుసు.
నీ గొంతు నాకు వినిపించింది. తలుపు తెరువు. కానివ్వు.

119
00:07:35,622 --> 00:07:36,832
ఎంత మంది ఉంటే, అంత మేలు కదా.

120
00:07:36,832 --> 00:07:38,333
తెరువు, టెరీసా.

121
00:07:41,086 --> 00:07:42,379
మనం ముందే మాట్లాడుకున్నాం కదా, టెరీసా.

122
00:07:42,379 --> 00:07:43,589
నేను ఫోన్ చేసినప్పుడు, నువ్వు ఎత్తాలి.

123
00:07:43,589 --> 00:07:46,175
తలుపు వెంటనే తెరవనందుకు సారీ.
మేము జ్యూసులు చేస్తూ ఉన్నాం.

124
00:07:46,175 --> 00:07:47,676
ఎవరు... ఎవరు వీళ్లంతా?

125
00:07:47,676 --> 00:07:48,844
నువ్వు ఎవరు, మిత్రమా?

126
00:07:48,844 --> 00:07:51,013
మొదటగా, నేను నీ మిత్రుడిని కాదు.
నేను చట్ట సంబంధిత అధికారిని.

127
00:07:51,013 --> 00:07:52,556
రెండవ విషయం ఏంటంటే, టెరీసా వాస్కేజ్ నా ప్రొబేషనర్.

128
00:07:52,556 --> 00:07:53,974
నువ్వు తన ప్రొబేషన్ ఆఫీసరువా?

129
00:07:53,974 --> 00:07:55,934
ఈ చోటంతా చిందరవందరగా ఉంది. ఇప్పుడేం చేద్దాం?

130
00:07:55,934 --> 00:07:58,395
చిన్నారుల సంరక్షణ శాఖ వాళ్లు
ఇంకో గంటలో వస్తారన్న విషయం మర్చిపోయావా?

131
00:07:58,395 --> 00:08:01,940
అపాయింట్మెంట్ ఉందని మర్చిపోయావు.
అదుగో మర్చిపోయావు. అసలు ఎలా... సూపర్.

132
00:08:01,940 --> 00:08:05,319
సరే. ఇక అందరూ బయలుదేరండి. పదండి.
నువ్వు, నువ్వు, నువ్వు, నువ్వు, పదండి.

133
00:08:05,319 --> 00:08:07,029
నువ్వు ఉండి శుభ్రపరచడంలో సాయపడు. నువ్వు వెళ్లిపో!

134
00:08:07,029 --> 00:08:08,655
నేను గుర్తింపు కార్డులను పరిశీలించడం మొదలుపెడతా,

135
00:08:08,655 --> 00:08:10,365
పరోల్ ని ఎవరైనా ఉల్లంఘిస్తున్నారో చూస్తాను.

136
00:08:10,365 --> 00:08:13,285
బయటకు వెళ్ళండి. పదండి. ఓయ్, దొబ్బేయ్ బయటకి.

137
00:08:13,285 --> 00:08:14,453
లేదు, లేదు, గురూ.

138
00:08:14,453 --> 00:08:16,163
"లేదు లేదు" ఏంటి? బయటకు పద!

139
00:08:16,163 --> 00:08:19,249
ఆ సూట్? ఆ గడియారం? కానే కాదు.

140
00:08:19,249 --> 00:08:24,671
నిజమైన... నిజమైన ప్రొబేషన్ ఆఫీసర్ జీవితాంతం పని చేసినా,

141
00:08:24,671 --> 00:08:26,006
అంత ఖరీదైనవి కొనలేడు.

142
00:08:26,006 --> 00:08:27,090
సూట్ నచ్చిందా?

143
00:08:28,967 --> 00:08:30,427
నిజంగా నువ్వు ఎవరో చెప్పు, గురూ!

144
00:08:32,221 --> 00:08:36,725
చిత్రంగా నాకు వీళ్ల పని పట్టాలనిపిస్తోంది.
కానీ ఒకవేళ అలా కాకుండా...

145
00:08:38,769 --> 00:08:39,645
ఏంటి?

146
00:08:40,270 --> 00:08:41,522
అది చార్లీ పనే అయ్యుంటుంది.

147
00:08:42,356 --> 00:08:43,357
ఏంటి?

148
00:08:46,401 --> 00:08:47,611
బాబోయ్!

149
00:08:48,195 --> 00:08:49,112
నువ్వు కూడా నాతో రా.

150
00:08:50,697 --> 00:08:52,533
- వాళ్లు ఇక్కడే ఉండాలి.
- సరే.

151
00:08:55,410 --> 00:08:56,411
అక్కడే ఉండండి.

152
00:09:02,125 --> 00:09:04,545
- పిల్లలను తీసుకురండి.
- ఏంటిది, షుగర్?

153
00:09:04,545 --> 00:09:05,754
అదే నేనూ అడుగుతున్నా.

154
00:09:12,135 --> 00:09:14,221
ఈ ట్రక్కును నీ కంటికి రెప్పలా కాపాడుతూ ఉండమని చెప్పా కదా.

155
00:09:14,221 --> 00:09:15,347
నాకు... నాకు తెలుసు.

156
00:09:15,347 --> 00:09:16,431
నీ యెంకమ్మ!

157
00:09:19,226 --> 00:09:20,227
- థ్యాంక్యూ.
- సరే మరి.

158
00:09:20,727 --> 00:09:24,439
- సరే, చార్లీ. వీళ్లని ఇక్కడి నుండి తీసుకెళ్లిపో.
- అలాగే. హేయ్, మరి కుక్క సంగతేంటి?

159
00:09:30,195 --> 00:09:31,446
బాస్.

160
00:09:35,033 --> 00:09:36,034
మనల్ని మాయ చేశారు.

161
00:09:41,248 --> 00:09:42,249
మ్యానీకి కాల్ చేయ్.

162
00:09:47,754 --> 00:09:48,755
ఫోన్ ఎత్తట్లేదు.

163
00:09:55,179 --> 00:09:57,097
- సరే మరి. మనం బయలుదేరాలి.
- ఏంటి? ఏంటి?

164
00:09:57,097 --> 00:09:58,182
మనం బయలుదేరాలి.

165
00:10:01,101 --> 00:10:02,978
నువ్వు నన్ను ఫాలో అవుతున్నావంటే నమ్మలేకపోతున్నా.

166
00:10:04,980 --> 00:10:06,899
రా. ఎక్కు. మంచి కుక్కవి.

167
00:10:09,026 --> 00:10:10,652
పర్లేదులే. నేనున్నాగా.

168
00:10:26,543 --> 00:10:29,463
హలో, అపరిచితుడా. చెప్పకుండా వచ్చావు, ఏంటి విశేషం?

169
00:10:32,341 --> 00:10:34,134
ఇలా వచ్చినందుకు నీకు అభ్యంతరం లేదనుకుంటా.

170
00:10:36,345 --> 00:10:37,554
కాల్ చేయకుండా, చెప్పా పెట్టకుండా రావడం.

171
00:10:38,180 --> 00:10:39,473
లేదు, అస్సలు లేదు.

172
00:10:41,099 --> 00:10:42,309
లోపలికి వస్తావా?

173
00:10:46,730 --> 00:10:47,773
నాకు ఒక సహాయం కావాలి.

174
00:10:50,901 --> 00:10:52,069
హా, అందుకేగా వచ్చావు!

175
00:10:56,698 --> 00:11:03,539
జాన్ స్టీవెన్ షుగర్, సెప్టెంబర్ 2, 1976లో
ఒహాయోలోని చాగ్రిన్ ఫాల్స్ లో పుట్టాడు.

176
00:11:04,414 --> 00:11:07,918
ఇద్దరు పిల్లల్లో ఇతను ఒకడు. నాన్న, ఎలక్ట్రీషియన్.

177
00:11:07,918 --> 00:11:11,922
జాన్ కి 12 ఏళ్లు ఉన్నప్పుడు చనిపోయాడు.
అమ్మ, టీచరుగా పదవీ విరమణ పొందింది.

178
00:11:11,922 --> 00:11:15,717
ఇంకా చూద్దాం. తెలివైన పిల్లాడు.

179
00:11:15,717 --> 00:11:17,970
పబ్లిక్ స్కూలులో మంచి మార్కులే సంపాదించాడు.

180
00:11:17,970 --> 00:11:20,639
వాసర్ కళాశాలలో తన క్లాసులో ఇతనే టాప్.
ఆ... ఆ తర్వాతదే ఆసక్తికరంగా ఉంది...

181
00:11:20,639 --> 00:11:23,308
అతను మొంటెరేలో ఉన్న డీఎల్ఐలో చేరాడు.

182
00:11:23,308 --> 00:11:25,727
అది సైనిక భాషా కళాశాల.
చాలా వేగంగా క్రాష్ కోర్సులు బోధిస్తారు అక్కడ.

183
00:11:25,727 --> 00:11:28,856
రష్యన్, స్పానిష్, ఉర్దూ, ఇంకా చాలా భాషల్లో.

184
00:11:28,856 --> 00:11:31,608
ఏళ్లు శ్రమిస్తే కానీ రానివన్నీ,
ఇతను వారాల్లోనే నేర్చుకున్నాడు.

185
00:11:31,608 --> 00:11:32,818
వావ్.

186
00:11:33,318 --> 00:11:35,279
- ఈ కళాశాలలో ఎవరెవరు చేరుతారు?
- చాలా మంది.

187
00:11:35,279 --> 00:11:38,365
సైనిక ఆఫీసర్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల్లో చేరబోయే అధికారులు,

188
00:11:38,365 --> 00:11:40,367
- విదేశీ దౌత్యాధికారులు కావాలనుకొనేవారు.
- గూఢచారులు కావాలనుకొనేవారు?

189
00:11:41,243 --> 00:11:44,454
వాళ్లు కూడా. ఎవరు ఇతను, కెన్నీ?

190
00:11:44,454 --> 00:11:45,831
ఇతనిపై ఇంకా దర్యాప్తు జరుపు.

191
00:11:47,833 --> 00:11:49,543
మీకేమీ కానందుకు ఆనందంగా ఉంది.

192
00:11:51,003 --> 00:11:52,212
గాయలపాలవ్వలేదు, అందుకు సంతోషం.

193
00:11:57,259 --> 00:11:58,760
ఏం జరుగుతోందో మీరు చెప్పాలి.

194
00:12:00,220 --> 00:12:01,221
అక్కడికి ఎందుకు వెళ్లారు?

195
00:12:02,014 --> 00:12:03,015
టెరీసా మీకు ఎలా తెలుసు?

196
00:12:09,313 --> 00:12:10,856
నేను ఒక ఆవాస కేంద్రంలో వాలంటీరుగా పని చేస్తున్నా.

197
00:12:11,356 --> 00:12:15,527
గృహహింస బారి నుండి బయటపడేయడంలో
మహిళలకు సాయపడే పని స్వచ్చందంగా చేస్తుంటా.

198
00:12:15,527 --> 00:12:19,781
చాలా కాలం క్రితం, టెరీసాని,
నరకం చూపిస్తున్న తన భర్త చెర నుండి కాపాడాను.

199
00:12:20,532 --> 00:12:24,203
ఆ తర్వాత ఒక నెల క్రితం,
తన చెల్లి కార్మెన్ నాకు కాల్ చేసింది.

200
00:12:24,912 --> 00:12:28,498
ఆ ఇద్దరు మహిళలూ సూపర్ అన్నమాట.
రాక్షస మగాళ్లు దొరికారు వాళ్లకి.

201
00:12:29,666 --> 00:12:33,504
ఆ సమయంలో నాకు ఒలీవియా
సాయపడుతూ ఉండింది. తనకి... తనకి ఆ పని బాగా నచ్చింది.

202
00:12:33,504 --> 00:12:35,756
నేను ఏవైతే పనులు చేస్తూ బాధలను మర్చిపోతానో,
తనకి కూడా ఆ అవకాశం ఇచ్చా.

203
00:12:35,756 --> 00:12:38,425
వ్యక్తిగత సమస్యలు, తలనొప్పుల
వంటి వాటి నుండి అది దృష్టి మరలుస్తుంది...

204
00:12:39,301 --> 00:12:42,804
కార్మెన్ పై తను మమకారం పెంచుకుంది.
వాళ్లిద్దరూ ప్రాణ మిత్రులు అయ్యారు.

205
00:12:42,804 --> 00:12:45,807
అప్పుడు ఒలీవియా... డ్రగ్స్ కి దూరంగా ఉందా? తను...

206
00:12:45,807 --> 00:12:46,934
తను వాటి జోలికే పోలేదు.

207
00:12:47,434 --> 00:12:48,477
కానీ...

208
00:12:49,561 --> 00:12:52,147
...ఏమైంది? ఏం జరిగింది? అంటే, ఏదో జరిగింది కదా.

209
00:12:54,983 --> 00:12:57,236
ఆ రోజు రాత్రి, కార్మెన్ ఇంటి నుండి తను నాకు కాల్ చేసింది.

210
00:12:58,779 --> 00:13:00,155
చాలా భయంతో ఉంది అప్పుడు తను.

211
00:13:05,577 --> 00:13:06,578
పరిస్థితి ఏం బాగాలేదు.

212
00:13:08,830 --> 00:13:10,624
ఫోన్ చేస్తుంటే కార్మెన్ ఎత్తడం లేదు,

213
00:13:10,624 --> 00:13:11,875
నేను... చాలాసార్లు కాల్ చేశా.

214
00:13:13,001 --> 00:13:14,461
అందుకని ఇక్కడికే వచ్చి చూద్దామనుకున్నా.

215
00:13:14,461 --> 00:13:16,421
ఇంట్లో రక్తం ఉంది, తను...

216
00:13:17,714 --> 00:13:19,842
కార్మెన్... తను...

217
00:13:19,842 --> 00:13:23,679
కాబట్టి నేను... నేను పోలీసులకి
కాల్ చేద్దామనుకున్నా. నంబర్ నొక్కుతూ ఉన్నా కూడా.

218
00:13:23,679 --> 00:13:25,264
ఫైర్ ప్లేస్ మీద ఒక తుపాకీ ఉంది,

219
00:13:25,264 --> 00:13:29,351
అది అక్కడ ఎందుకు ఉందో అర్థం కాలేదు... ఇంతలో
ఒకడు లోపలికి వచ్చాడు, నాకు విషయం అర్థమైంది.

220
00:13:29,351 --> 00:13:32,104
అతని... అతని చేతిలో శవాలను తీసుకెళ్లే కవర్ ఉంది.

221
00:13:32,104 --> 00:13:35,941
అసలు... అసలు అలాంటి కవరును ఎవరైనా ఎందుకు తెస్తారు?

222
00:13:35,941 --> 00:13:38,402
ఎవరు... ఎవరు తెస్తారు?

223
00:13:39,111 --> 00:13:41,071
తుపాకీ అక్కడ ఉండింది. అతను అక్కడ ఉన్నాడు.

224
00:13:41,071 --> 00:13:46,577
నన్ను చూశాడు. నేను అతడిని చూడటం అతనికి నచ్చలేదు.

225
00:13:46,577 --> 00:13:48,120
అప్పుడు...

226
00:13:50,622 --> 00:13:51,623
అదన్నమాట.

227
00:14:01,842 --> 00:14:04,428
- నేను కావాలని చేయలేదు. కావాలని చేయలేదు.
- ఏం పర్వాలేదు.

228
00:14:07,139 --> 00:14:08,390
తను ఏ తప్పూ చేయలేదు.

229
00:14:10,225 --> 00:14:13,604
- మరి పోలీసులకి కాల్ చేసి ఉండవచ్చు కదా?
- నేను... చాలాసార్లు చెప్పాను,

230
00:14:13,604 --> 00:14:16,732
"మనం ఫోన్ చేసి ఉండాల్సింది," అని
కానీ... తను అందుకు ఒప్పుకోలేదు.

231
00:14:16,732 --> 00:14:18,692
- అది స్కాండల్ అవ్వడం తనకి ఇష్టం లేదు.
- స్కాండల్ ఏముంది?

232
00:14:18,692 --> 00:14:20,527
నేను క్లిఫర్డ్ కేసుల చిట్టాని చూశాను.

233
00:14:21,195 --> 00:14:23,530
పోలీసులు ఖచ్చితంగా తనని ఘనంగా సత్కరించి ఉండేవాళ్లు.

234
00:14:23,530 --> 00:14:26,742
కుటుంబం కోసం తను ఏమైనా చేస్తుంది.
తనకి కుటుంబమే ముఖ్యం.

235
00:14:27,409 --> 00:14:29,578
రెండేళ్ల నుండి వాళ్ల గురించి కథనాలేవీ రాకుండా ఉన్నాయి...

236
00:14:29,578 --> 00:14:31,830
- వావ్.
- ...ఇప్పుడు ఇది బయటకు పొక్కితే ఏమైనా ఉందా?

237
00:14:33,040 --> 00:14:36,210
తను భయపడిపోయింది. ఇద్దరం భయపడ్డాం.

238
00:14:41,173 --> 00:14:43,217
తనని చివరిసారిగా నేను చూసింది అదే.

239
00:14:44,676 --> 00:14:47,012
ఎంతైనా... ఎంతైనా తను నాకు బిడ్డే కదా.

240
00:14:48,263 --> 00:14:50,724
తనని నేను నా సొంత బిడ్డలానే చూస్తాను.

241
00:14:53,435 --> 00:14:55,812
కానీ మేము పిచ్చి పని చేశాం.

242
00:14:57,022 --> 00:14:59,608
తను చాలా పిచ్చి పనులు చేస్తుంది,
నేను కూడా చేస్తాననే చెప్పాలి.

243
00:14:59,608 --> 00:15:01,944
ఇప్పుడు పెనము నుండి పొయ్యిలో పడ్డాం.

244
00:15:05,864 --> 00:15:06,865
ఆమెపై మీకు ప్రేమ ఉంది.

245
00:15:08,909 --> 00:15:11,245
ఆమె గురించి మీరు అంత పిచ్చి పని చేశారంటే,

246
00:15:12,204 --> 00:15:13,789
దానికి అత్యుత్తమ కారణం అదే అవుతుంది.

247
00:15:18,502 --> 00:15:20,254
అసలైన కన్యా రాశి వాడిలా చెప్పావు.

248
00:15:28,178 --> 00:15:31,014
తనని మనం కనిపెడతాం. సరేనా? కనిపెట్టి తీరుతాం.

249
00:15:33,308 --> 00:15:34,309
నేను ఖచ్చితంగా కనిపెడతాను తనని.

250
00:15:36,687 --> 00:15:37,521
మాటిస్తున్నాను.

251
00:15:40,148 --> 00:15:41,733
ఇంతకీ ఎవరు నువ్వు, జాన్ షుగర్?

252
00:15:44,695 --> 00:15:47,030
అనధికార యాక్సెస్ గుర్తించబడింది

253
00:15:57,291 --> 00:15:58,292
1551 లేకెన్ అవెన్యూ

254
00:15:58,292 --> 00:15:59,376
ఎవరు ఉన్నారు ఇక్కడ?

255
00:16:00,002 --> 00:16:00,878
{\an8}నేషనల్ సెక్యూరిటీ ఎజెన్సీ

256
00:16:00,878 --> 00:16:01,879
పర్సనల్ ఫైల్, గోప్యమైనది

257
00:16:01,879 --> 00:16:03,964
అతను డిఎల్ఐ నుండి బయటికి వచ్చాక,
మెరీన్ కార్ప్స్ లో చేరాడు.

258
00:16:07,509 --> 00:16:09,136
{\an8}వింత జీవితమబ్బా.

259
00:16:09,136 --> 00:16:11,221
భార్యాపిల్లలు లేరా?

260
00:16:12,806 --> 00:16:14,016
మరి అతని బలహీనతని పట్టుకోవడం ఎలా?

261
00:16:15,267 --> 00:16:16,852
తల్లి ఎలాగూ ఉంటుంది కదా.

262
00:16:16,852 --> 00:16:18,270
నిజమే.

263
00:16:18,937 --> 00:16:20,564
హెలెన్ షుగర్,

264
00:16:20,564 --> 00:16:25,194
ఇప్పుడు ఆరిజోనాలోని ఫ్లాగ్ స్టాఫ్ లో ఉంటోంది.

265
00:16:27,362 --> 00:16:32,201
సినిమా తాలూకు రఫ్ కట్ చూశాను, బర్నీ.
వాడు చాలా బాగా నటించాడు.

266
00:16:32,201 --> 00:16:34,578
అది నిజమే. చాలా బాగా నటించాడు. నిజంగానే.

267
00:16:34,578 --> 00:16:36,288
ఇది వాడి జీవితాన్ని మార్చేస్తుంది.

268
00:16:36,288 --> 00:16:40,334
చిన్నప్పుడు మన కొడుకు
బెస్ట్ సపోర్టింగ్ యాక్టరుగా నామినేట్ అయ్యాడు,

269
00:16:40,334 --> 00:16:42,211
ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అవార్డ్ గెలుస్తాడు.

270
00:16:42,836 --> 00:16:47,591
వాడు గెలవడానికి ఎక్కువ అవకాశం ఉందని
నాకు అనిపిస్తోంది. ఏమైంది?

271
00:16:48,425 --> 00:16:51,303
డేవీ చేసిన పిచ్చి పనులు బయటపడే అవకాశం ఉంది.

272
00:16:51,303 --> 00:16:53,805
ఆమె పేరు చెప్పు. తను పెదవి విప్పకుండా నేను చూసుకుంటా.

273
00:16:53,805 --> 00:16:55,557
అదంత తేలికైన విషయం కాదు.

274
00:16:57,518 --> 00:16:58,769
మధ్యలో ఈ డిటెక్టివ్ కూడా ఉన్నాడు కదా.

275
00:16:58,769 --> 00:17:00,521
హా, షుగర్.

276
00:17:02,648 --> 00:17:04,942
ఆ విషయంలో నీకు సాయపడుతున్నాడని డేవీ చెప్పాడే.

277
00:17:04,942 --> 00:17:07,027
హా, మనోడు ఖాళీగా ఏ పని లేకుండా కూర్చొని ఉన్నాడు.

278
00:17:07,027 --> 00:17:08,654
ఖాళీగా ఉంటే, ఏదోక పిచ్చి పని చేస్తాడు.

279
00:17:08,654 --> 00:17:11,198
- అందుకే నేను వాడికి ఓ పని అప్పగించా.
- హా.

280
00:17:13,617 --> 00:17:14,701
ఏంటి?

281
00:17:14,701 --> 00:17:15,911
పని జరిగిందా?

282
00:17:16,411 --> 00:17:17,454
జరిగింది, గురూజీ.

283
00:17:17,454 --> 00:17:19,580
- మంచి పని చేశావు.
- థ్యాంక్యూ.

284
00:17:19,580 --> 00:17:20,665
పిచ్చెక్కించా.

285
00:17:30,509 --> 00:17:32,302
మెలనీ చెప్పిన దాని గురించి నా అభిప్రాయం ఏంటి?

286
00:17:33,095 --> 00:17:36,890
ఏమీ అర్థం కావట్లేదు. ఒలీవియా చాలా పిచ్చి పనులు చేసింది,

287
00:17:37,391 --> 00:17:39,518
తన వల్ల మళ్లీ తన కుటుంబానికి మచ్చ రాకూడదని భావించింది.

288
00:17:40,435 --> 00:17:41,353
అంతేగా.

289
00:17:42,229 --> 00:17:44,231
అందుకే కదా తన కారు డిక్కీలో ఒక శవం ఉంది.

290
00:17:45,357 --> 00:17:50,028
ఆ తర్వాత ఏం చేయాలి? భయం కాస్త తగ్గినప్పుడు

291
00:17:50,028 --> 00:17:52,865
ఎవరినైనా సంప్రదించి సాయం అడగాలి కదా?

292
00:17:52,865 --> 00:17:56,326
కానీ ఒలీవియా అలా చేయలేదు. అదే నాకు ఆందోళన కలిగిస్తోంది.

293
00:17:57,452 --> 00:18:00,873
ఎవరికో తను సాయం కోరడం అస్సలు ఇష్టం ఉన్నట్టు లేదు.

294
00:18:00,873 --> 00:18:03,417
...సొంతంగా చేసుకోవాలంటే దానికి కాస్త సాయం కావాలి.

295
00:18:03,417 --> 00:18:05,294
సరే మరి, గిన్నెలో నీకు నీళ్లు నిండుగా పోసి పెట్టా.

296
00:18:05,294 --> 00:18:08,088
క్లింటన్ నీకు డిన్నర్ తెచ్చిస్తాడు.
అందాకా నువ్వు ఆనందంగా సినిమా చూడు.

297
00:18:09,006 --> 00:18:10,340
నీకేమైనా పిచ్చా?

298
00:18:10,340 --> 00:18:11,758
మరీ అంత పిచ్చేం లేదు.

299
00:18:13,218 --> 00:18:14,928
- ఉంటా మరి, మిసెస్ డీట్రిక్సన్.
- ఏమైంది?

300
00:18:16,221 --> 00:18:18,390
వావ్. ఈ సినిమా చాలా బాగుంటుంది.

301
00:18:20,976 --> 00:18:22,186
నీకు అతడిని చంపాలని ఉంది కదా?

302
00:18:22,186 --> 00:18:24,104
- క్లాసిక్ సినిమా ఇది.
- అంత దారుణంగా మాట్లాడకు.

303
00:18:24,104 --> 00:18:25,647
నేనెవరని అనుకుంటున్నావు?

304
00:18:25,647 --> 00:18:27,608
ఒక అందమైన మహిళ ఉండే ఇంటి గుమ్మం ముందుకు వచ్చి,

305
00:18:27,608 --> 00:18:29,568
{\an8}"హాయ్, నేను భర్తలకు ప్రమాద బీమాలు
అమ్ముతుంటా," అని చెప్పేవాడిననా?

306
00:18:29,568 --> 00:18:30,485
{\an8}కాస్మోపాలిటన్ పాలిగ్లాట్ సొసైటీ

307
00:18:30,485 --> 00:18:32,362
{\an8}నేను ఇక్కడికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనా?

308
00:18:33,197 --> 00:18:35,866
అవును, వెళ్లాలి.

309
00:18:36,950 --> 00:18:38,452
నువ్వు చెడ్డ మనిషివి.

310
00:18:38,452 --> 00:18:39,995
- అదృష్టం ఉంది నీకు బాగా.
- నీ భర్తని

311
00:18:39,995 --> 00:18:42,247
- కానంత వరకూ నీకు ఆనందమే కదా.
- బయలుదేరు ఇక.

312
00:18:42,247 --> 00:18:44,166
- నేను తప్పకుండా వెళ్లిపోతా, బంగారం.
- సరే మరి.

313
00:18:44,166 --> 00:18:45,751
నేను వెళ్లిపోతా, కానీ ఒక చిన్న మాట చెప్తాను.

314
00:18:46,585 --> 00:18:47,961
నా కోసం వేచి చూడకు.

315
00:18:49,588 --> 00:18:51,632
నాకు మంచి పార్టీని ఆస్వాదించాలని లేదనుకోకండి.

316
00:18:51,632 --> 00:18:55,344
పాత మిత్రులు. మంచి సంగీతం.
అందులో నచ్చకపోవడానికి ఏముంటుంది?

317
00:18:57,387 --> 00:19:02,059
ఏదేమైనా, పార్టీకి వచ్చేశా.
ఇక ఏడుపు పక్కన పెట్టేసి, పని చూడాలి.

318
00:19:13,779 --> 00:19:16,615
ఈ పార్టీ అంత బోరింగ్ పార్టీకి నేనెప్పుడూ వెళ్లలేదు.

319
00:19:18,659 --> 00:19:20,494
అటెన్సియాన్, పొర్ ఫెవోర్!

320
00:19:20,494 --> 00:19:21,954
అలేంతిబా!

321
00:19:22,704 --> 00:19:25,541
ఇప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే

322
00:19:25,541 --> 00:19:26,667
ఈ దేశపు భాషలో మాట్లాడతాను.

323
00:19:26,667 --> 00:19:28,919
నేను ఇంకా ప్రాక్టీస్ చేస్తే మేలని అన్నారు.

324
00:19:29,962 --> 00:19:30,963
మళ్లీ అందరం ఇక్కడికి చేరుకున్నాం.

325
00:19:30,963 --> 00:19:33,674
ప్రపంచ నలుమూలలకి వెళ్లిపోతాం, మళ్లీ ఇక్కడికి వస్తాం.

326
00:19:34,633 --> 00:19:37,344
ప్రపంచంలో ఎక్కడెక్కడికో వెళ్లి, మన పని మనం చేసుకుంటాం.

327
00:19:38,011 --> 00:19:42,599
మన అతి ముఖ్యమైన పని. మనం విఫలమవ్వకుండా చేయాల్సిన పని.

328
00:19:43,976 --> 00:19:46,562
కానీ ఈరాత్రికి అందరం ఇక్కడ ఏకమయ్యాం.

329
00:19:47,771 --> 00:19:51,108
మీ అందరినీ చూస్తున్నందుకు,
అందరూ ఇక్కడికి క్షేమంగా చేరుకున్నందుకు...

330
00:19:52,025 --> 00:19:55,153
నాకు చాలా ఆనందంగా ఉంది.

331
00:19:57,406 --> 00:20:01,702
ఇక్కడ ఆహారం ఉంది. డ్రింక్స్ ఉన్నాయి.

332
00:20:01,702 --> 00:20:05,122
మియా సొంతంగా నేర్చుకొని చేసిన ఏంజల్ ఫుడ్ కేకు కూడా ఉంది.

333
00:20:06,582 --> 00:20:07,916
అందరికీ స్వాగతం.

334
00:20:20,596 --> 00:20:24,558
ఒక పెద్ద టోపీ పెట్టుకొని,
ఒళ్లంతా "సన్ స్క్రీన్" రాసుకున్నా,

335
00:20:24,558 --> 00:20:28,187
ఎండలోకి అడుగు పెడితే చాలు,

336
00:20:28,187 --> 00:20:30,189
చర్మం బాగా బిగుతుగా అయిపోతుంది.

337
00:20:38,530 --> 00:20:40,449
మరి నీ సంగతేంటి, షుగర్?

338
00:20:40,449 --> 00:20:41,533
బీచ్?

339
00:20:41,533 --> 00:20:43,118
- నీకు వెళ్లడం ఇష్టమా?
- అవును.

340
00:20:43,118 --> 00:20:45,120
నాకు బీచ్ అంటే చాలా ఇష్టం.

341
00:20:45,120 --> 00:20:46,413
ఇప్పుడే వస్తా.

342
00:21:03,013 --> 00:21:05,849
రూబీ చెప్పింది నిజమే.
నువ్వు ఇంత ధగధగలాడిపోవడం నేనెప్పుడూ చూడలేదు.

343
00:21:05,849 --> 00:21:09,102
హేయ్, హెన్రీ. నువ్వు రావడం నేను గమనించలేదు.

344
00:21:09,102 --> 00:21:11,146
లేదు, నేను ఇప్పుడే వచ్చా. పని ముగించుకొని వచ్చా.

345
00:21:11,146 --> 00:21:12,981
- అంతా ఓకేనా?
- హా, అంతా సూపర్ గా ఉంది.

346
00:21:12,981 --> 00:21:14,650
పద, కేకు కూడా ఉందట.

347
00:21:27,120 --> 00:21:28,789
నీకు షిబూయా క్రాసింగ్ తెలుసా?

348
00:21:28,789 --> 00:21:30,249
ఎప్పుడూ అక్కడికి వెళ్లలేదు.

349
00:21:30,249 --> 00:21:34,586
అయ్యో, తప్పనిసరిగా వెళ్లు, హెన్రీ. నీకు భలే నచ్చుతుంది.

350
00:21:34,586 --> 00:21:36,463
ఈ భూమిపైన ఉండే చౌరాస్తాల్లో
అత్యంత రద్దీగా ఉండే చౌరస్తా అది.

351
00:21:36,463 --> 00:21:39,716
ప్రతీ రెండు నిమిషాలకు
ఆ చౌరాస్తా గుండా 3,000 మంది ప్రయాణిస్తుంటారు.

352
00:21:39,716 --> 00:21:42,261
ప్రతీరోజూ, ప్రతీ క్షణం అన్నమాట.

353
00:21:42,261 --> 00:21:46,849
ఒక కాఫీ షాపులో కూర్చొని, ఆ... ఆ చౌరాస్తా గుండా

354
00:21:46,849 --> 00:21:50,018
నడుస్తూ వెళ్లే జనాలను చూస్తూ ఉంటాను, వాళ్ల నవ్వులు,

355
00:21:50,018 --> 00:21:52,604
వాళ్ల ముఖంలో ఆనందం, కోపం, బాధని గమనిస్తుంటా,
అందరూ అటూఇటూ తిరుగుతూనే ఉంటారు.

356
00:21:53,397 --> 00:21:57,734
ఊరికే వాళ్లని గమనిస్తూ
నేను చాలా గంటలు అక్కడ కూర్చున్నా, హెన్రీ.

357
00:21:58,402 --> 00:22:00,153
అంటే... వాళ్లతో పూర్తిగా కనెక్ట్ అయిపోయా అన్నమాట.

358
00:22:01,905 --> 00:22:02,990
వినడానికి చాలా బాగుంది.

359
00:22:02,990 --> 00:22:08,328
హా, అవునులే. మరి నీ సంగతేంటి? ఏమైనా విశేషాలు చెప్పు.

360
00:22:09,079 --> 00:22:13,125
ఈమధ్య నాకు నిద్ర సరిగ్గా పట్టడం లేదు.
నీకు బాగానే పడుతోందా?

361
00:22:14,334 --> 00:22:16,628
నిజం చెప్పాలంటే నాకూ సరిగ్గా పట్టడం లేదు.

362
00:22:16,628 --> 00:22:20,007
హా. కాబట్టి, నిద్రపోవాలంటే గగనమైపోయింది నాకు.

363
00:22:20,007 --> 00:22:25,596
పోయిన వారం, అర్ధరాత్రి వేళ నేను నిద్ర లేచి,
వెల్లుల్లిపాయలను కోసే మెషిన్ ని కొన్నా.

364
00:22:26,263 --> 00:22:27,222
హా.

365
00:22:27,222 --> 00:22:31,310
దాన్ని అలా చూస్తూ ఉన్నానన్నమాట.
ఇక దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అనిపించేసింది.

366
00:22:31,310 --> 00:22:34,479
అది నా దగ్గర ఉండాలనుకున్నా.
అసలు నాకు వెల్లుల్లి అంటేనే పడదు, కాబట్టి...

367
00:22:38,483 --> 00:22:39,526
నువ్వు వెళ్లావా?

368
00:22:39,526 --> 00:22:40,694
ఇంకా లేదు.

369
00:22:43,155 --> 00:22:45,616
- నీ ఆంథ్రపాలజీ పని ఎలా ఉంది?
- నా గురించి నీకు తెలుసు కదా.

370
00:22:46,325 --> 00:22:50,245
కొన్ని పుస్తకాలు, సిద్దాంతాలు,
ఒక ల్యాబ్ కోటు ఉంటే చాలు, దిల్ ఖుష్ నాకు.

371
00:22:50,871 --> 00:22:51,872
అది మంచిదే.

372
00:22:52,706 --> 00:22:54,333
నీ ఇతర పని ఎలా సాగుతోంది?

373
00:22:54,333 --> 00:22:56,126
పర్వాలేదు. కనిపించకుండా పోయిన ఒక యువతి కేసు...

374
00:22:56,919 --> 00:22:59,046
- దానికి...
- దానికే నీ సమయమంతా అయిపోతుందా?

375
00:23:00,380 --> 00:23:03,509
తను ఒక యువతి, పాతికేళ్లుంటాయి.

376
00:23:04,760 --> 00:23:06,637
- జాన్.
- ఏంటి?

377
00:23:09,348 --> 00:23:11,892
జాగ్రత్తగా ఉండు, అంతే.

378
00:23:24,947 --> 00:23:25,948
హా.

379
00:23:43,215 --> 00:23:44,258
ఏంటిది?

380
00:23:45,843 --> 00:23:48,053
నేను ఈ వృత్తిలో ఉన్నాను కదా,
కాబట్టి నేను ఎవరెవరిని అయితే కలుస్తానో,

381
00:23:48,053 --> 00:23:50,597
వాళ్లతో మాట్లాడిన సంభాషణలను, నా ఆలోచనలను అందులో రాశా.

382
00:23:51,640 --> 00:23:52,933
అవునా?

383
00:23:52,933 --> 00:23:54,017
అవును.

384
00:23:56,061 --> 00:24:00,148
"ఎయిర్ కండిషనరుకు పైన ఉన్న కర్టెన్స్
అటూఇటూ కదలడం చూస్తుంటే చాలా బాగుంది.

385
00:24:02,150 --> 00:24:07,531
యూఎఫ్ఓ చాలా గొప్ప బ్యాండ్ అని, కానీ దానికి దక్కాల్సిన
ఆదరణ దక్కలేదని అంటుంటారు, అది నిజమే."

386
00:24:08,365 --> 00:24:11,118
ఇందులో కేసులకి సంబంధించిన వాస్తవాలు ఏమైనా ఉన్నాయా,

387
00:24:11,118 --> 00:24:15,080
పైగా జపాన్ లోని ఒక వీధిలో జనాలు వెళ్తూ ఉన్నప్పుడు

388
00:24:15,080 --> 00:24:18,542
నీకు కలిగిన అనుభూతి గురించి పేజీలు, పేజీలు రాశావు.

389
00:24:18,542 --> 00:24:20,002
అది షిబూయా క్రాసింగ్ గురించి.

390
00:24:21,628 --> 00:24:25,299
ఆ తర్వాత, నిన్ను పిచ్చోడిలా
చేసిన కేసు గురించి రాసుకున్నావు.

391
00:24:25,299 --> 00:24:27,926
- ఆ కేసు తీసుకోవద్దని నేను చెప్పా కూడా.
- నేనేమీ ఆ కేసు విషయంలో పిచ్చోడిని అవ్వట్లేదు.

392
00:24:31,388 --> 00:24:36,185
"నేను తనని కనిపెట్టాలి. బర్నీని చూసినప్పుడల్లా

393
00:24:36,185 --> 00:24:38,812
నాకు అబద్ధాలు, బాధ మాత్రమే కనిపిస్తున్నాయి.

394
00:24:38,812 --> 00:24:41,106
తను కుటుంబానికి దూరంగా ఉండాలనుకుంటుంది అనుకుంటా."

395
00:24:41,106 --> 00:24:44,610
నాకు, నాకు, నాకు, అనిపిస్తోంది, అనిపిస్తోంది, అనిపిస్తోంది.

396
00:24:49,239 --> 00:24:53,368
మన పని జనాలను గమనించడమే,
వాళ్ల జీవితాల్లోకి దూరిపోవడం కాదు.

397
00:24:53,368 --> 00:24:55,829
- నాకు తెలుసు.
- ఈ ఆలోచన కూడా నీదే.

398
00:24:55,829 --> 00:24:57,831
- అవును.
- జెన్ కి జరిగిన దానివల్ల నువ్వే దీన్ని ప్రతిపాదించావు.

399
00:24:58,874 --> 00:25:02,461
షుగర్, నువ్వు ఎల్లప్పుడూ ఏకాగ్రతతో
ఉండాలి. నువ్వు ఎవరు అనేది మర్చిపోకు.

400
00:25:12,262 --> 00:25:13,680
ఇదుగో కొత్తది.

401
00:25:14,932 --> 00:25:15,974
థ్యాంక్యూ.

402
00:25:22,481 --> 00:25:23,607
వాళ్ల నుండి ఏమైనా కబురు అందిందా?

403
00:25:26,610 --> 00:25:30,322
మరి? ఏమంటున్నారు?

404
00:25:34,201 --> 00:25:35,994
మన మీదనే అంతా ఆధారపడి ఉందని అంటున్నారు.

405
00:25:42,709 --> 00:25:43,919
హేయ్, హేయ్. ఇంకో విషయం.

406
00:25:45,462 --> 00:25:47,297
టెరీసా ఇంటి బయట కాపలాగా ఉన్నవాళ్లకు సంబంధించి,

407
00:25:47,297 --> 00:25:48,841
చార్లీ రహస్యంగా తీసి పంపిన ఫోటోలు అందాయా?

408
00:25:49,633 --> 00:25:50,467
ఏమైనా తెలిసిందా?

409
00:25:50,467 --> 00:25:53,804
ఈ పార్టీ ఆహ్వానానికి సంబంధించి, నేను కాస్త దర్యాప్తు చేశాను.

410
00:25:53,804 --> 00:25:58,225
ఫ్రెంచ్ లో సొసైటే పాలిగ్లాట్ కాస్మోపాలిటాన్ అంటే

411
00:25:58,225 --> 00:26:01,228
కాస్మోపాలిటాన్ పాలిగ్లాట్ సొసైటీ అట.

412
00:26:02,020 --> 00:26:04,731
సరే. ముఖ్యమైన వ్యక్తి పేరు బైరన్ స్టాలింగ్స్.

413
00:26:04,731 --> 00:26:06,608
అతని మీద అనేక కేసులు ఉన్నాయి, అందులో వింతేమీ లేదనుకో.

414
00:26:06,608 --> 00:26:09,361
కానీ క్యాలిఫోర్నియా కరెక్షన్స్ జైలు వాళ్లు
ఒక కొత్త ఎంక్రిప్షన్ సర్వరును వాడుతున్నారు,

415
00:26:09,361 --> 00:26:12,322
అది నాకు భలే చికాకు తెప్పిస్తోంది,
కాబట్టి నాకు ఇంకో రోజు కావాలి. సరేనా?

416
00:26:12,322 --> 00:26:13,657
ఈ సొసైటీ విషయానికి వద్దాం.

417
00:26:13,657 --> 00:26:16,410
నాకు అతని కేసులతో పని లేదు.
అతని ఫోన్స్ ని, మెయిల్స్ ని ట్యాప్ చేయ్...

418
00:26:16,410 --> 00:26:17,995
పాలీగ్లాట్ అంటే అర్థం తెలుసా?

419
00:26:17,995 --> 00:26:19,746
భాషల మీద పట్టు ఉన్న వ్యక్తి అని అర్థం.

420
00:26:20,831 --> 00:26:21,707
అవును.

421
00:26:21,707 --> 00:26:23,000
- హా, సరే.
- మంచిది.

422
00:26:23,000 --> 00:26:27,671
ఈ గ్రూపులో ప్రపంచ నలుమూలల నుంచి
గూఢచారులు ఉంటారనే పుకార్లు కెన్నీ చెవిన పడ్డాయి.

423
00:26:27,671 --> 00:26:29,882
అతను ఎవరితో మాట్లాడుతున్నాడో,
ఎక్కడో, ఎప్పుడో, ఎందుకో నాకు తెలియాలి.

424
00:26:29,882 --> 00:26:30,883
- షుగర్.
- ఆ వివరాలన్నీ కావాలి.

425
00:26:30,883 --> 00:26:32,092
ఒకప్పుడు వాళ్లందరూ శత్రువులు.

426
00:26:32,092 --> 00:26:33,552
అందరూ ఉద్యోగాలు మానేసిన తర్వాత,

427
00:26:33,552 --> 00:26:37,014
అందరూ ఏకమై, ఏదైనా మంచి చేసి
మార్పు తీసుకువద్దామని ఒప్పందం కుదుర్చుకున్నారు.

428
00:26:37,014 --> 00:26:39,641
పుకారును బట్టి, అది చెడు పని కూడా కావచ్చు.

429
00:26:39,641 --> 00:26:41,685
ప్రపంచాన్ని కాపాడటానికి ప్రపంచంలోని గూఢచారులందరూ

430
00:26:41,685 --> 00:26:43,729
ఏకమవ్వడం అనే కాన్సెప్టుతో నేను ఒక సినిమా నిర్మించాను.

431
00:26:43,729 --> 00:26:44,813
"జర భద్రం."

432
00:26:44,813 --> 00:26:46,940
- సూపర్ సినిమా అది.
- అది ఒక చెత్త సినిమా.

433
00:26:46,940 --> 00:26:49,776
కథాంశమే పిచ్చిది కాబట్టి, అది పరమ చెత్త సినిమా.

434
00:26:49,776 --> 00:26:53,113
చూడు, అతని గురించి వివరాలన్నీ
మన దగ్గర ఉన్నాయని నేను అనట్లేదు.

435
00:26:53,113 --> 00:26:55,240
నాకు ఒక్కటి కూడా మిస్ కాకుండా వివరాలన్నీ కావాలి...

436
00:26:55,240 --> 00:26:57,743
- నేను చూసుకుంటా అన్నాగా. సరే.
- సరే. అలాగే.

437
00:27:00,913 --> 00:27:01,955
అరిచినందుకు సారీ.

438
00:27:04,124 --> 00:27:05,709
డాక్టర్ వికర్స్ ని కలిశావా?

439
00:27:06,376 --> 00:27:09,004
- లేదు. నేను... నేను...
- సరే. అలాగే.

440
00:27:09,004 --> 00:27:12,591
రేపు అపాయింట్మెంట్ తీసుకో. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. సరేనా?

441
00:27:13,091 --> 00:27:14,510
- సరే.
- మంచిది.

442
00:27:14,510 --> 00:27:16,345
మనం చాలా ప్రమాదంలో ఉంటాం.

443
00:27:16,345 --> 00:27:18,013
నాకు తెలుసు, నేను చూసుకుంటా.

444
00:27:18,013 --> 00:27:19,431
లోపలికి వస్తున్నావా?

445
00:27:20,098 --> 00:27:21,350
లేదు, నేను అలా...

446
00:27:21,350 --> 00:27:24,811
శిక్ష అనుభవించేశావులే. సరే. ఇంటికి వెళ్లు ఇక.

447
00:27:24,811 --> 00:27:26,730
- సరే. గుడ్ నైట్.
- గుడ్ నైట్.

448
00:27:26,730 --> 00:27:29,775
కెన్నీ, నేనూ ఈరాత్రి ఆరిజోనాకి బయలుదేరుతున్నాం.

449
00:27:30,442 --> 00:27:31,860
ఆరిజోనాకా?

450
00:27:31,860 --> 00:27:34,071
ఫ్లాగ్ స్టాఫ్ లో షుగర్ అమ్మ ఉంది, అక్కడికి.

451
00:27:34,988 --> 00:27:36,823
- డేవీ.
- నన్ను చూసుకోమన్నావు కదా.

452
00:27:36,823 --> 00:27:38,075
ఆ పనిలోనే నేను ఉన్నా.

453
00:27:46,667 --> 00:27:49,545
అవకాశం అందిందని అందరూ ఎగబడుతున్నారు.

454
00:27:53,257 --> 00:27:55,259
ఇవాళ చాలా మందికి మండించాను నేను.

455
00:27:56,760 --> 00:27:57,928
రూబీకి కోపం రావడానికి కారణం ఉంది.

456
00:27:58,470 --> 00:28:00,931
- వికర్స్.
- రూబీ, ఏంటి సంగతి?

457
00:28:00,931 --> 00:28:03,183
ఈ సమయంలో కాల్ చేసినందుకు సారీ.
కానీ ఒక సమస్య వచ్చి పడింది.

458
00:28:04,268 --> 00:28:05,644
షుగర్, స్టాలింగ్స్ పై దర్యాప్తు చేస్తున్నాడు.

459
00:28:06,144 --> 00:28:08,397
మిగతా విషయాలని అతను ఇట్టే కనిపెట్టేయగలడు.

460
00:28:09,064 --> 00:28:12,025
మనం అలా జరగనివ్వకూడదు.
ఇతరులకి చెప్పాల్సిన సమయం వచ్చేసింది.

461
00:28:12,025 --> 00:28:13,277
స్టాలింగ్స్
అరెస్ట్ రికార్డ్, హత్య

462
00:28:13,277 --> 00:28:14,194
ఇతరులకా?

463
00:28:15,654 --> 00:28:18,156
నువ్వు ఏదోకటి చేయ్, కానీ దీని గురించి మిల్లర్ కి చెప్పాలి.

464
00:28:19,950 --> 00:28:23,912
పనికే తొలి ప్రాధాన్యత. ఆ విషయంలో తను చెప్పింది నిజమే.

465
00:28:25,622 --> 00:28:27,374
కానీ ఈ కేసును నేను వదిలేసే ప్రసక్తే లేదు.

466
00:28:38,177 --> 00:28:39,428
ఏదో మిస్ అవుతున్నా నేను.

467
00:28:43,140 --> 00:28:44,266
ఎక్కువగా, కళ్ల ముందు ఉండేవే అవి.

468
00:28:47,227 --> 00:28:49,021
అంతర్గత భద్రతా శాఖ

469
00:28:49,021 --> 00:28:51,064
డేటా తొలగింపు - స్టాలింగ్స్, బైరన్

470
00:28:51,064 --> 00:28:52,941
అది వస్తువైనా కావచ్చు, మనిషైనా కావచ్చు.

471
00:28:58,697 --> 00:29:00,032
ఆరిజోనాకి స్వాగతం
గ్రాండ్ కాన్యన్ రాష్ట్రం

472
00:29:02,075 --> 00:29:07,164
నేను ఆశించే అబద్ధాలు. అలాంటి అబద్ధాలు మామూలే.

473
00:29:10,667 --> 00:29:13,420
జనాల రహస్యాలను కనిపెట్టడమే పని.

474
00:29:16,548 --> 00:29:19,760
కానీ ఈ కేసు వింతగా ఉంది,
సీగల్ కుటుంబం కూడా వింతగానే ఉంది.

475
00:29:22,763 --> 00:29:24,348
ఏదో తేడాగా ఉంది.

476
00:29:29,645 --> 00:29:33,398
ఈ కేసులో ఎవరెవరికి పాత్ర ఉందో,
ఎందుకు ఉందో, అది ఎలాగో కూడా నాకు తెలీదు.

477
00:29:35,817 --> 00:29:36,902
ప్రస్తుతానికైతే తెలీదు.

478
00:29:41,156 --> 00:29:42,366
రికార్డులని తీసివేయండి: ఆర్. పావిచ్
నిర్ధారించండి

479
00:29:49,289 --> 00:29:50,707
హాయ్.

480
00:29:50,707 --> 00:29:52,125
హలో.

481
00:30:01,134 --> 00:30:04,555
నేను పోలీసులకి కాల్ చేద్దామనుకున్నా. నంబర్ నొక్కుతూ
ఉన్నా కూడా. అక్కడ ఒక తుపాకీ ఉంది...

482
00:30:07,266 --> 00:30:10,727
నేను ఖచ్చితంగా కనిపెడతాను తనని. మాటిస్తున్నాను.

483
00:30:21,947 --> 00:30:23,365
నేను అన్నింటినీ నియంత్రణలో ఉంచుకోవాలి.

484
00:30:35,961 --> 00:30:37,921
వాళ్ల దగ్గర ఎప్పుడూ ఏదోకటి దాచి పెట్టే ఉంటారు.

485
00:30:39,756 --> 00:30:41,508
వారిని భయపెట్టే విషయాన్ని.

486
00:30:44,761 --> 00:30:47,598
దాన్ని దాచడానికి వాళ్లు ఏమైనా చేస్తారు.

487
00:30:50,767 --> 00:30:52,227
అది మాత్రం నాకు బాగా తెలుసు.

488
00:31:07,618 --> 00:31:09,077
మనందరికీ రహస్యాలు ఉంటాయి.

489
00:31:14,374 --> 00:31:15,667
నాకు కూడా.

490
00:31:17,794 --> 00:31:19,505
మరీ ముఖ్యంగా, నాకు.

491
00:32:17,688 --> 00:32:19,690
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

