1
00:01:07,150 --> 00:01:09,111
- అతని బొమ్మ ఎలా వస్తుందో చూడండి.
- కెమెరా, మార్క్.

2
00:01:09,111 --> 00:01:10,362
యాక్షన్.

3
00:01:11,280 --> 00:01:14,992
ఇప్పుడు అది నిత్యం జరుగుతూనే ఉంది,
ఈ వారంతం నేను ఒక బేస్ బాల్ ఆటకి వెళ్లాను,

4
00:01:14,992 --> 00:01:18,161
అక్కడ వేలాది మంది ప్రేక్షకుల మధ్య కూర్చున్నాను.

5
00:01:19,413 --> 00:01:21,206
వాళ్లతో నాకేమీ పని లేదన్నట్టుగా అనిపించింది.

6
00:01:23,250 --> 00:01:27,963
నాకెలా అనిపిస్తోందంటే, నేనేమీ పెద్ద...

7
00:01:27,963 --> 00:01:30,215
నేను చూసే చోట మీరు ఉన్నారు.
దాని వల్ల నాకు ఏకాగ్రత కుదరట్లేదు.

8
00:01:31,633 --> 00:01:33,218
మీరు కాస్త నన్ను చూడటం...

9
00:01:33,218 --> 00:01:34,178
{\an8}మార్క్.

10
00:01:34,178 --> 00:01:35,721
- ...ఆపుతారా?
- యాక్షన్.

11
00:01:36,597 --> 00:01:38,015
ఇప్పుడు అది నిత్యం జరుగుతూనే ఉంది.

12
00:01:39,099 --> 00:01:40,392
ఈ వారంతం...

13
00:01:40,392 --> 00:01:41,768
ఎవరిది ఆ ఫోన్?

14
00:01:41,768 --> 00:01:43,145
ఎవరూ శబ్దం చేయవద్దు. కానిద్దాం.

15
00:01:43,145 --> 00:01:44,563
మిత్రులారా, నేను... ఇది...

16
00:01:44,563 --> 00:01:46,148
{\an8}- కెమెరాలు ఓకే. కానివ్వండి.
- నాకు...

17
00:01:46,148 --> 00:01:47,482
- ఆగండి...
- నా వద్దకి వచ్చేటప్పుడు

18
00:01:47,482 --> 00:01:48,609
కాస్త చెప్పి వస్తారా?

19
00:01:48,609 --> 00:01:51,028
- యాక్షన్.
- అతనికి నేను దొరికిపోతాను.

20
00:01:51,778 --> 00:01:53,947
- అది మీకెలా అనిపిస్తోంది?
- అది బాగా వచ్చింది, కదా?

21
00:01:53,947 --> 00:01:55,824
- యాక్షన్.
- అతనికి నేను దొరికిపోతాను.

22
00:01:56,325 --> 00:01:58,243
ఇలా ఏడవడం మరీ అతిగా ఉందేమో?

23
00:01:58,911 --> 00:02:00,329
- యాక్షన్.
- లైట్ బాగానే ఉందా?

24
00:02:00,329 --> 00:02:01,705
అతనికి నేను దొరికిపోతాను.

25
00:02:01,705 --> 00:02:03,665
{\an8}బాబోయ్, ఇది... నాన్న ఉన్నాడా?

26
00:02:04,249 --> 00:02:06,001
అబ్బా. ఇవాళ అలసట వచ్చేస్తోంది.

27
00:02:06,001 --> 00:02:07,711
ఏంటిది? మీరు వేసుకున్న గుడ్డ ఏంటి?

28
00:02:08,628 --> 00:02:10,255
- ఇది ట్వీడ్. హా.
- చాలా బాగుంది.

29
00:02:10,255 --> 00:02:11,882
{\an8}మీరు చాలా బాగున్నారు. చాలా అందంగా ఉన్నారు.

30
00:02:11,882 --> 00:02:17,804
షూటింగ్ ని ముగించేసేటప్పుడు మీ సమాచారాన్ని నాకు
పంపండి... మనం నటన అవకాశాల గురించి మాట్లాడుకుందాం.

31
00:02:17,804 --> 00:02:19,264
తర్వాత. నేనేమంటున్నానో అర్థమవుతోందా?

32
00:02:19,264 --> 00:02:21,016
అది... అది... అది చాలా మంచిది అనుకుంటా.

33
00:02:21,600 --> 00:02:26,021
ఈ మధ్య, అతను మళ్లీ వస్తాడని, నన్ను కనిపెడతాడనే ఆలోచన...

34
00:02:28,232 --> 00:02:29,358
నన్ను నిత్యం వేధిస్తూనే ఉంది.

35
00:02:29,358 --> 00:02:31,068
ఇది జరుగుతోందంటే నేను నమ్మలేకపోతున్నాను.

36
00:02:31,568 --> 00:02:35,531
- దీన్ని ఎవరూ చూడరు.
- అది నిజం కాదు, డేవిడ్.

37
00:02:35,531 --> 00:02:37,991
- దాని సంగతి మీ నాన్న చూసుకుంటాడులే.
- ఆయన ఏం చేసినా, అంతే.

38
00:02:37,991 --> 00:02:40,369
నేను మళ్లీ ఈ ఊరిలో పని చేయను.

39
00:02:42,329 --> 00:02:44,122
నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి.

40
00:02:44,122 --> 00:02:47,292
- హా.
- నన్ను చూడు. ఇలా చూడు.

41
00:02:47,292 --> 00:02:53,215
నీ వంశంలో అందరూ గొప్పవాళ్లే ఉన్నారు,
పైగా నువ్వు ఆఖరి మగాడివి,

42
00:02:53,215 --> 00:02:56,093
ఏదోక రోజు ఈ ఆస్థంతా నీ వశం అవుతుంది.

43
00:02:56,093 --> 00:02:58,887
అప్పుడు ఏం చేయగలవో తెలుసుగా?

44
00:03:00,222 --> 00:03:01,223
ఏంటి?

45
00:03:01,723 --> 00:03:06,854
అప్పుడు ఈ ఊరి జనాలందరి ముఖాన ఉమ్మేయవచ్చు నువ్వు.

46
00:03:08,939 --> 00:03:10,440
హా. అవును.

47
00:03:11,024 --> 00:03:12,442
నిజంగానే చెప్తున్నా, బంగారం.

48
00:03:12,442 --> 00:03:16,154
- హా.
- ఇది తొక్కలో ఊరు.

49
00:03:18,782 --> 00:03:19,783
చెప్పు.

50
00:03:22,244 --> 00:03:25,038
ఇది తొక్కలో ఊరు.

51
00:03:25,038 --> 00:03:26,123
అమ్మా.

52
00:03:26,665 --> 00:03:28,292
చెప్పు, డేవీ. ఇది తొక్కలో ఊరు.

53
00:03:29,459 --> 00:03:33,088
ఇది తొక్కలో ఊరు.

54
00:03:38,719 --> 00:03:40,220
నాకు చిరాగ్గా ఉంది,

55
00:03:41,430 --> 00:03:45,225
దానికి కారణం ఈ ట్రాఫిక్, ఇంకా జనాలు
మలుపులు తిరిగేటప్పుడు సిగ్నల్స్ వేయకపోవడం ఒకటే కాదు.

56
00:03:46,310 --> 00:03:50,898
నేను డేవీ సీగల్ దగ్గరికి వెళ్లాలి,
ఒలీవియా గురించి అతనికి ఏం తెలుసో కనుక్కోవాలి.

57
00:03:51,899 --> 00:03:53,066
మిస్టర్ షుగర్.

58
00:03:53,984 --> 00:03:55,319
హేయ్, కార్లోస్.

59
00:03:55,319 --> 00:03:56,862
అతనికి నిజంగా ఏం తెలుసో కనిపెట్టాలి.

60
00:03:58,322 --> 00:03:59,323
ఎలా ఉన్నారు?

61
00:04:09,791 --> 00:04:11,627
ఇది మ్యూజియమా?

62
00:04:11,627 --> 00:04:12,920
{\an8}జోనథన్ సీగల్ ప్రొడక్షన్

63
00:04:12,920 --> 00:04:14,755
{\an8}ఇది చూడటానికి సరిగ్గా అలాగే ఉంటుంది.

64
00:04:16,173 --> 00:04:19,051
ఆమె చనిపోయినప్పటి నుండి ఆయన ఈ గదిని ఇలాగే ఉంచేశాడు.

65
00:04:19,760 --> 00:04:24,097
మిస్టర్ సీగల్ కి లొర్రేన్ మీద ఉన్న ప్రేమని
వర్ణించడానికి నాకు ఈ జన్మ సరిపోదు.

66
00:04:41,281 --> 00:04:42,115
హా.

67
00:04:43,450 --> 00:04:45,702
- ఏమైంది?
- జోనథన్ నేను కొన్ని ప్రశ్నలు

68
00:04:45,702 --> 00:04:46,912
తప్పక అడగాల్సిందే, కానీ...

69
00:04:48,372 --> 00:04:49,373
ఏం లేదు.

70
00:04:54,378 --> 00:04:55,712
కానీ,

71
00:04:55,712 --> 00:04:57,130
ఆయన్ని ఇప్పుడు అడిగే పరిస్థితి లేదు.

72
00:04:57,631 --> 00:05:00,342
సరే మరి. ఈలోపు మిగతావాళ్లని

73
00:05:00,342 --> 00:05:01,510
అడగాల్సినవి అడిగేద్దాం.

74
00:05:04,930 --> 00:05:05,931
హేయ్, కెన్నీ.

75
00:05:06,598 --> 00:05:07,766
ఏం కావాలి నీకు?

76
00:05:07,766 --> 00:05:10,185
డేవీ ఇక్కడ ఉన్నాడా అని అడుగుదామని వచ్చా,
కానీ నువ్వు ఇక్కడ ఉన్నావు కదా.

77
00:05:10,185 --> 00:05:11,770
- డేవిడ్ కూడా ఇక్కడే ఉండుంటాడు.
- కెన్నీ.

78
00:05:11,770 --> 00:05:13,146
ఎప్పుడైనా "బీయింగ్ దేర్" సినిమా చూశావా?

79
00:05:14,523 --> 00:05:15,858
పీటర్ సెల్లర్స్ నటించిందే కదా? చూశాను.

80
00:05:15,858 --> 00:05:17,359
- ఎవరు?
- మన్నించాలి.

81
00:05:18,443 --> 00:05:20,153
నేను మాటిమాటికీ చెప్పాపెట్టకుండా వచ్చేస్తున్నా.

82
00:05:20,153 --> 00:05:22,239
అందులో మెల్విన్ డగ్లస్ పాత్ర గుర్తుందా?

83
00:05:22,239 --> 00:05:23,949
పానకంలో పుడకలా.

84
00:05:23,949 --> 00:05:27,327
అతను అన్ని విధాలా శక్తివంతుడు, కానీ ఆరోగ్యం బాగుండదు.
ఇప్పుడేమో చనిపోయే స్థితిలో ఉంటాడు.

85
00:05:27,327 --> 00:05:28,954
కానీ మెల్విన్ డగ్లస్ ఏమంటాడంటే...

86
00:05:28,954 --> 00:05:30,122
అయితే...

87
00:05:30,122 --> 00:05:32,040
..."నేను ఆసుపత్రికి వెళ్లే ప్రసక్తే లేదు.
నేను మెల్విన్ డగ్లస్ ని.

88
00:05:32,040 --> 00:05:33,292
ఆసుపత్రే నా ఇంటికి రావాలి."

89
00:05:33,292 --> 00:05:35,127
మిస్టర్ షుగర్.

90
00:05:36,211 --> 00:05:38,881
- ఏం కావాలి మీకు?
- డేవీ కోసం వచ్చాను.

91
00:05:39,464 --> 00:05:40,465
డేవీ కాదు, డేవిడ్.

92
00:05:40,465 --> 00:05:43,302
నీ ఫీజు విషయానికి వస్తే, ఇప్పుడు మా నాన్నకి బాగాలేదు కాబట్టి,

93
00:05:43,302 --> 00:05:45,262
నీకు ఇవ్వాల్సిన మిగతా ఫీజు కూడా ఆనందంగా ఇచ్చేస్తా.

94
00:05:45,262 --> 00:05:47,431
కావాలంటే, ఈ కేసును నువ్వు ఇంతటితో వదిలేయవచ్చు కూడా.

95
00:05:47,431 --> 00:05:49,808
మీ ఆఫర్ చాలా బాగుంది, కానీ మీ డబ్బు నాకు అక్కర్లేదులెండి.

96
00:05:50,309 --> 00:05:53,228
నాకు పని జోనథన్ అప్పగించారు.
ఆయన చెప్పే దాకా కేసును వదలను.

97
00:05:53,812 --> 00:05:57,316
"కేసును వదలవా?" అబ్బో, భలే గమ్మత్తుగా ఉందే అది.

98
00:05:57,316 --> 00:06:00,652
అవును, డేవిడ్. మన్నించాలి,
నేను డేవిడ్ తో మాట్లాడటానికి వచ్చాను.

99
00:06:00,652 --> 00:06:01,904
డేవిడ్ గురించి ఏమైనా తెలిసిందా?

100
00:06:02,654 --> 00:06:06,074
మీరు డైనింగ్ గదికి వెళ్లి కూర్చోండి.

101
00:06:06,074 --> 00:06:07,326
నిస్సంకోచంగా కూర్చోండి.

102
00:06:07,326 --> 00:06:10,245
- అది మీకెందుకు?
- అతనితో మాట్లాడాలనుకుంటున్నా.

103
00:06:10,871 --> 00:06:12,497
మీరు వార్తలను చూసే ఉంటారు కదా.

104
00:06:12,497 --> 00:06:17,586
- చూశాను.
- డేవిడ్ పెద్ద షాకులో ఉన్నాడు.

105
00:06:17,586 --> 00:06:23,842
ఆ పిచ్చి రాతల్లో ఒక్కటి కూడా నిజం కాదు,
అది మేము నిరూపించగలం కూడా.

106
00:06:24,468 --> 00:06:28,388
డేవీ అయితే చాలా బాధపడ్డాడు. నాతో ఏమన్నాడో చెప్పనా,

107
00:06:28,388 --> 00:06:33,268
"అమ్మా, పాపం ఈ మహిళ ఇంత పెద్ద అబద్ధం చెప్పిందంటే

108
00:06:33,936 --> 00:06:35,729
చాలా బాధలో ఉండుంటుంది కదా," అని చెప్పాడు.

109
00:06:37,397 --> 00:06:39,733
వాడి జీవితాన్ని నాశనం చేయాలని చూసినా,

110
00:06:40,317 --> 00:06:42,611
వాడికి ఆమె మీద జాలే కలిగింది.

111
00:06:50,077 --> 00:06:52,996
నా బంగారం ఎంత మంచోడో చూశారా?

112
00:06:55,958 --> 00:06:56,959
లేదు.

113
00:07:02,381 --> 00:07:03,632
అయితే.

114
00:07:03,632 --> 00:07:07,511
నేను మీతో చాలా మంచిగా ఉంటున్నాను.
కానీ నా కొడుకు దరిదాపుల్లోకి వెళ్లావంటే...

115
00:07:07,511 --> 00:07:08,428
మిస్టర్ షుగర్...

116
00:07:08,428 --> 00:07:10,806
అతని గురించి చెడుగా మీరు ఆలోచించినా...

117
00:07:10,806 --> 00:07:12,432
...మన్నించాలి, కానీ...

118
00:07:12,432 --> 00:07:14,518
...నా లాయర్లతో మీకు ఎంత నరకం చూపిస్తానంటే,

119
00:07:14,518 --> 00:07:16,228
ఎందుకు బతికి ఉన్నానా అని బాధపడతారు.

120
00:07:18,397 --> 00:07:19,982
- అది జోక్ లా అనిపించిందా?
- లేదు, కానీ...

121
00:07:19,982 --> 00:07:21,859
- మీరు అతనికి తల్లి, కాబట్టి అతనికి ఎల్లప్పుడూ...
- హా.

122
00:07:21,859 --> 00:07:24,069
...అండగా ఉంటారు.

123
00:07:24,069 --> 00:07:25,946
కానీ అతని దగ్గర తన చెల్లిని
కనిపెట్టడానికి ఉపయోగపడే సమాచారం...

124
00:07:25,946 --> 00:07:27,155
సవతి తల్లికి పుట్టిన చెల్లి.

125
00:07:27,155 --> 00:07:29,366
ఒలీవియా కోసం వెతకడం

126
00:07:29,366 --> 00:07:31,535
పిచ్చితనం అని ఇదివరకే స్పష్టంగా చెప్పా కదా.

127
00:07:31,535 --> 00:07:33,871
అంటే, ఒలీవియాకి అలా జరగడంలో తప్పు లేదంటారా?

128
00:07:33,871 --> 00:07:36,415
లేదు, అలా అని నేను అనలేదు.

129
00:07:36,415 --> 00:07:38,542
కానీ మా నాన్న అభిమతాన్ని
నేను గౌరవించి, మీ పనికి అడ్డు రాలేదు.

130
00:07:38,542 --> 00:07:42,212
తను సిక్స్ ప్యాక్ గల డ్రగ్స్ వర్తకుని కలిసి ఉంటుంది,

131
00:07:42,212 --> 00:07:46,592
అంతే తప్ప ఇంకేమీ జరిగి ఉండదు.

132
00:07:46,592 --> 00:07:49,261
మీరు ఏదో అనాలని అంటున్నారంతే,
అది మీ మనస్సులో నుండి వచ్చింది కాదు.

133
00:07:50,262 --> 00:07:51,096
కెన్నీ.

134
00:07:51,096 --> 00:07:52,556
కార్లోస్.

135
00:07:52,556 --> 00:07:53,473
ఇతడిని వెళ్లిపొమ్మని చెప్పు.

136
00:07:53,473 --> 00:07:55,559
- మిస్టర్ షుగర్ ని ఇక సాగనంపుతావా?
- హేయ్, కార్లోస్.

137
00:07:56,602 --> 00:07:58,562
నువ్వు చెప్పినా నేను వెళ్లను, కెన్నీ.

138
00:08:02,065 --> 00:08:03,150
నిజంగానే చెప్తున్నా.

139
00:08:12,159 --> 00:08:13,619
పర్లేదులే. ఏమీ కాదులే.

140
00:08:14,119 --> 00:08:19,208
డేవీ. డేవీ, నీకు చెప్పా కదా, బంగారం,
ఈ విషయాన్ని నాకు వదిలేయ్.

141
00:08:19,208 --> 00:08:20,959
- ఇది నేనే చూసుకోవాల్సిన పని.
- డేవీ.

142
00:08:20,959 --> 00:08:22,628
మీరు వెళ్లిపోండి. మీరు రండి మాట్లాడుకుందాం.

143
00:08:23,253 --> 00:08:26,006
- డేవీ, చెప్పేది విను.
- అమ్మా, ఆపు. ఇక చాలు, అమ్మా.

144
00:08:26,006 --> 00:08:28,133
- డేవీ, నేను...
- ఇక చాలు! ఇక వెళ్లు.

145
00:08:29,176 --> 00:08:30,177
- రండి.
- సరే.

146
00:08:30,177 --> 00:08:31,261
సరే.

147
00:08:31,887 --> 00:08:33,639
అతనేమీ చేయడు... ఏమీ కాదులే, కెన్నీ.

148
00:08:33,639 --> 00:08:34,722
అబ్బా.

149
00:08:38,769 --> 00:08:40,437
తనకి నేనంటే ప్రాణం. అందుకనే...

150
00:08:47,444 --> 00:08:49,071
మొదట్నుంచీ నాతో మహిళలు విచిత్రంగానే ప్రవర్తించేవారు.

151
00:08:49,571 --> 00:08:52,407
విచిత్రమని కాదు, ఏమోలే. ఛ.

152
00:08:54,117 --> 00:08:57,871
నాకు పుట్టుకతోనే పేరు వచ్చింది. నా కుటుంబ సభ్యులందరూ
గొప్పవాళ్లే. మహిళలు ఎప్పుడూ చుట్టూ ఉండేవాళ్లు.

153
00:08:57,871 --> 00:09:00,916
కాబట్టి, నాకు తెలీదు అన్నమాట...

154
00:09:01,708 --> 00:09:04,419
వాళ్లతో మామూలుగా ఎలా ఉండాలి అనేది.

155
00:09:05,045 --> 00:09:07,339
- అర్థమవుతోందా మీకు?
- మామూలుగా అంటే మీ ఉద్దేశమేమిటి?

156
00:09:07,339 --> 00:09:09,508
అంటే, మీతో పడక పంచుకోవడానికి

157
00:09:09,508 --> 00:09:10,843
మీరు బెదిరించకుండానే పని జరిగిపోవడమా?

158
00:09:10,843 --> 00:09:12,678
- అదేనా మీ ఉద్దేశం?
- సరే. నేను... నేను...

159
00:09:12,678 --> 00:09:15,764
నేను కొన్ని పాపిష్ఠి పనులు చేశాను.

160
00:09:15,764 --> 00:09:19,059
కానీ ఇప్పుడు లోకమంతా తెలిసిపోయింది. కాబట్టి...

161
00:09:20,310 --> 00:09:21,436
ఒలీవియా ఎవరి వద్ద ఉంది?

162
00:09:21,436 --> 00:09:22,771
"తను ఎక్కడ ఉంది? తను ఎక్కడ ఉంది?"

163
00:09:22,771 --> 00:09:25,774
ఉడుము పట్టులా ఆ ఒక్కదాన్నే పట్టుకున్నారు మీరు.
సరే, సరే. పర్వాలేదు. మరేం పర్వాలేదు.

164
00:09:25,774 --> 00:09:27,150
మీరు అలా ఉండటమే న్యాయం కూడా.

165
00:09:27,150 --> 00:09:29,152
- ఇక ఒలీవియాని అపహరించింది ఎవరో చెప్పండి.
- సరే. సరే.

166
00:09:29,152 --> 00:09:31,071
నాకు ఈ సంభాషణను కొనసాగించడం కష్టంగానే ఉంది.

167
00:09:31,071 --> 00:09:33,323
నాకు పుట్టుకతోనే పేరు వచ్చింది.
నా కుటుంబ సభ్యులందరూ గొప్పవాళ్లే.

168
00:09:33,323 --> 00:09:36,118
మామూలుగా ఎలా ఉండాలో తెలియదు.
వాళ్లేమో ఎప్పుడూ చుట్టూ ఉండేవాళ్లు, కానీ నాకు...

169
00:09:36,118 --> 00:09:37,411
- నాకు తెలీనే తెలీదు వాళ్లతో...
- హేయ్.

170
00:09:39,496 --> 00:09:40,581
ఒలీవియాని ఎవరు అపహరించారు?

171
00:09:40,581 --> 00:09:41,665
సరే.

172
00:09:42,583 --> 00:09:48,130
చాలా కాలం క్రితం,
అమ్మాయిలని సరఫరా చేసే ఒక వ్యక్తి గురించి తెలిసింది.

173
00:09:48,630 --> 00:09:53,677
అంటే, వేశ్యలు లాంటి వారే కాదు, కానీ...

174
00:09:53,677 --> 00:09:56,638
అక్రమంగా రవణా చేయబడిన
అమ్మాయిలు, మహిళలు అన్నమాట, అంటే వాళ్లకేం జరిగినా...

175
00:09:57,514 --> 00:09:58,849
- అడిగే దిక్కు ఉండదు.
- చూడు, నేను...

176
00:09:58,849 --> 00:10:01,059
వాళ్లపై హింస జరిగినట్టు పైకి కనిపించలేదు,

177
00:10:01,059 --> 00:10:03,770
అసలు ఏ ఆకృత్యాలూ జరిగినట్టు అనిపించలేదు.

178
00:10:03,770 --> 00:10:07,441
అమ్మాయిలందరూ...
అంటే నేను కలిసిన వాళ్లందరూ అందంగానే ఉన్నారు,

179
00:10:07,441 --> 00:10:09,902
- ఇంకా...
- ఆనందంగా ఉన్నట్టు అనిపించారా?

180
00:10:12,154 --> 00:10:14,573
ఇదంతా చాలా చెడ్డ పనిలా
అనిపిస్తూ ఉంటుందనడంలో సందేహమే లేదు.

181
00:10:14,573 --> 00:10:16,450
అయితే మీరు అమ్మాయిల కోసం బైరన్ స్టాలింగ్స్ ని కలిశారన్నమాట.

182
00:10:16,450 --> 00:10:21,872
- లేదు. నేను పేరు చెప్పలేదు. అస్సలు చెప్పలేదు.
- నువ్వు బైరన్ స్టాలింగ్స్ ని కలిశావు, డేవిడ్.

183
00:10:22,873 --> 00:10:24,791
- దేవుడా.
- కొన్ని సార్లే వెళ్లాను.

184
00:10:24,791 --> 00:10:27,419
చాలా సార్లే వెళ్లాను, సరేనా?

185
00:10:27,419 --> 00:10:28,712
కొంత కాలం అయ్యాక,

186
00:10:29,546 --> 00:10:33,258
మేమిద్దరమూ టెన్నిస్ క్లబ్స్ కి
వెళ్లడం వంటివి చేయడం మొదలుపెట్టాం.

187
00:10:33,258 --> 00:10:36,303
ఈ స్టాలింగ్స్ అనేవాడు మామూలు మూర్ఖుడు కాదు.

188
00:10:36,303 --> 00:10:40,766
కానీ, మేము ఇద్దరూ పిచ్చాపాటిగా
మాట్లాడుకునే వాళ్లం అంతే, అంతకు మించీ ఏం లేదు.

189
00:10:40,766 --> 00:10:43,894
అలాంటి ఒకానొక సందర్భంలో...
నేను స్టాలింగ్స్ తో ఈ విషయాలన్నీ చెప్పాను,

190
00:10:43,894 --> 00:10:48,607
ఈ అమ్మాయిలందరూ అజ్ఞాతం వీడి, నాపై దాడి చేస్తున్నారని

191
00:10:49,274 --> 00:10:50,943
పోలీసులకు చెప్తామని బెదిరిస్తున్నారని చెప్పా.

192
00:10:50,943 --> 00:10:55,906
అలా అన్నీ చెప్తున్నప్పుడే... నేను...

193
00:10:57,241 --> 00:11:00,744
నా సవతి తల్లి కూతురైన ఒలీవియా గురించి కూడా చెప్పినట్టున్నా.

194
00:11:04,164 --> 00:11:05,165
ఏమని చెప్పావు?

195
00:11:05,874 --> 00:11:08,961
ఏం చెప్పానా? నాకు తను చేసే అన్యాయం గురించే చెప్పాను.

196
00:11:09,461 --> 00:11:10,754
ఆ...

197
00:11:12,923 --> 00:11:15,509
రాజీ పడవద్దని ఆ అమ్మాయికి చెప్తోంది.

198
00:11:16,009 --> 00:11:17,970
మీడియా వాళ్లకి నా గురించి అంతా బట్టబయలు చేస్తుందట.

199
00:11:17,970 --> 00:11:20,889
అది కూడా, సరిగ్గా నా సినిమా విడుదల అయ్యేటప్పుడే!

200
00:11:21,390 --> 00:11:25,185
నేను... చూడండి. దయచేసి
నన్ను నమ్మండి. దయచేసి నా మాట వినండి.

201
00:11:26,186 --> 00:11:27,855
తనని ఊరికే భయపెడతాడని అనుకున్నానంతే.

202
00:11:27,855 --> 00:11:29,690
అంతా... అంతా మర్చిపొమ్మని చెప్తాడనుకున్నా.

203
00:11:29,690 --> 00:11:34,236
అతను ఇలా చేస్తాడని... దేవుడా, చాలా దారుణం జరిగిపోయింది.

204
00:11:37,322 --> 00:11:38,323
ఇదంతా మార్గిట్ కి...

205
00:11:39,408 --> 00:11:40,617
- లేదు.
- మీ అమ్మకి...

206
00:11:40,617 --> 00:11:44,872
లేదు, లేదు. తనకు నేను అమ్మాయిలతో కులుకుతాననే తెలుసు.

207
00:11:44,872 --> 00:11:46,290
ఒలీవియా సంగతి తెలీదు.

208
00:11:46,790 --> 00:11:47,916
స్టాలింగ్స్ చిరునామా చెప్పండి.

209
00:11:48,417 --> 00:11:51,545
- అతను ఎక్కడ ఉంటాడో చెప్పండి.
- లా సియనెగా రహదారి పక్కనే.

210
00:11:51,545 --> 00:11:54,464
చాలా భయంకరంగా ఉంటుంది ఆ ఇల్లు,
చమురు క్షేత్రాలకు పక్కనే అన్నమాట.

211
00:11:54,464 --> 00:11:56,633
కానీ ఇప్పుడు అతను అక్కడ లేడు. టీజేకి వెళ్లాడు.

212
00:11:56,633 --> 00:11:57,968
మళ్లీ రేపు వస్తాడు.

213
00:12:01,013 --> 00:12:03,807
నేనంటే తనకి ఇష్టం లేదేమో అని అనిపించేది.

214
00:12:05,893 --> 00:12:07,811
కాబట్టి నేను కూడా తనని ద్వేషించాలని నిర్ణయించుకున్నా.

215
00:12:10,772 --> 00:12:11,982
నాకు ఏం తెలీట్లేదు.

216
00:12:12,649 --> 00:12:14,067
తను నీకు చెల్లెలు.

217
00:12:19,072 --> 00:12:21,033
నీ బాధ్యతగా తనని కాపాడాల్సింది పోయి, ఇలా చేస్తావా?

218
00:12:23,535 --> 00:12:24,536
హా.

219
00:13:04,785 --> 00:13:06,078
మనం రెండు సెట్లు చేద్దాం.

220
00:13:06,078 --> 00:13:07,955
హా, అలాగే.

221
00:13:10,624 --> 00:13:11,792
నాకు తెలుసు.

222
00:13:11,792 --> 00:13:13,544
కానీ పశువుల డాక్టర్ తప్పదని అంటున్నాడు.

223
00:13:14,044 --> 00:13:19,299
మా కుక్కకి... పేల బెడదతో పాటు
చెవి ఇన్ఫెక్షన్ ఉంది, కంటి ఇన్ఫెక్షన్ ఉంది,

224
00:13:19,299 --> 00:13:24,012
భుజానికి వాపు ఉంది...
దాని వల్వా కూడా రివర్సులో ఉంటాయి.

225
00:13:24,513 --> 00:13:25,764
వల్వా ఏంటో కూడా నాకు తెలీదు.

226
00:13:25,764 --> 00:13:30,894
- అంటే ఏం లేదు, నాకు 1,500 డాలర్ల బొక్క, అంతే.
- ఆపమ్మా ఇక. వ్యాపారం బాగానే ఉందా?

227
00:13:31,979 --> 00:13:33,814
- బాగానే ఉంది.
- మంచిది.

228
00:13:33,814 --> 00:13:36,275
- మందుకు దూరం ఉండే కార్యక్రమం సంగతేంటి?
- నాలుగు రోజులుగా ముట్టలేదు.

229
00:13:36,275 --> 00:13:40,112
- అది చాలా గొప్ప విషయం. మెల్, నీకది చాలా మేలు చేస్తుంది.
- హా, థ్యాంక్స్.

230
00:13:40,112 --> 00:13:46,118
- ఒలీవియా గురించి ఇంకా ఏం తెలీలేదా?
- మేమిద్దరమూ కలిసి వెతుకుతున్నాం.

231
00:13:46,118 --> 00:13:47,035
ఇద్దరం అంటే?

232
00:13:47,035 --> 00:13:49,371
షుగర్. అతని పేరు జాన్ షుగర్.

233
00:13:49,371 --> 00:13:51,039
పేరు... పేరు భలే ఉంది కదా?

234
00:13:51,039 --> 00:13:54,334
అతను చాలా మంచివాడు.
నాకు... నాకు అతని గురించి అంతగా తెలీదనుకో.

235
00:13:54,334 --> 00:13:56,378
చాలా రహస్యంగా ఉంటాడు. అతని గురించి పెద్దగా చెప్పడు.

236
00:13:56,378 --> 00:13:57,588
అలాంటి సోది అన్నమాట.

237
00:13:57,588 --> 00:13:58,714
అదీ సంగతి.

238
00:13:58,714 --> 00:14:03,385
కానీ ఏమో... అతనిపై నాకు నమ్మకం ఉంది.

239
00:14:04,720 --> 00:14:08,390
విషయం ఏంటంటే, ఒలీవియాని కనిపెట్టాలని
నాకెంతగా ఉందో, అతనికి కూడా అంతే ఉంది.

240
00:14:09,099 --> 00:14:10,225
అది ముఖ్యం.

241
00:14:11,143 --> 00:14:14,855
కొన్ని రోజుల క్రితం నిన్ను మీ ఇంట్లో దిగబెట్టింది అతనే కదా?

242
00:14:14,855 --> 00:14:17,566
హా, అవును. కానీ ఏం జరగలేదు.

243
00:14:17,566 --> 00:14:21,028
- అందంగా ఉంటాడా?
- ఉంటాడు, కానీ వేరేగా అనుకోకు.

244
00:14:21,695 --> 00:14:25,032
మా ఇద్దరి మధ్య ఏదో అయిపోవడం,
కోరికలు కలగడం వంటివేవీ లేవు.

245
00:14:28,410 --> 00:14:29,953
నేను వివరించలేకపోతున్నా కూడా.

246
00:14:29,953 --> 00:14:32,748
చెప్పాలని లేకున్నా ఒకటి చెప్పేస్తున్నా,
ప్రస్తుతం నా జీవితం కన్నా

247
00:14:32,748 --> 00:14:35,459
నీ జీవితమే వంద రెట్లు మేలుగా ఉందనిపిస్తోంది.

248
00:14:35,459 --> 00:14:38,504
కాదేమో. నీ కుక్క జననేంద్రియానికి
సంబంధించిన విషయమే ఇంకా ఆసక్తికరంగా ఉంది.

249
00:14:40,923 --> 00:14:43,383
కాస్త జాగ్రత్తగా ఉండు, మెల్.

250
00:14:44,384 --> 00:14:47,763
- ఎల్లప్పుడూ.
- హా.

251
00:15:43,193 --> 00:15:45,529
కాల్ వస్తోంది
జాన్ షుగర్

252
00:15:58,959 --> 00:15:59,960
రూబీ.

253
00:16:02,754 --> 00:16:03,630
హలో, మిల్లర్.

254
00:16:04,798 --> 00:16:05,883
ఏదో మాట్లాడాలని రమ్మన్నావే?

255
00:16:05,883 --> 00:16:07,885
సారీ. నువ్వు చాలా బిజీగా ఉన్నావని తెలుసు.

256
00:16:08,969 --> 00:16:10,971
షుగర్ ఏమేం చేస్తున్నాడేంటి?

257
00:16:10,971 --> 00:16:12,556
అంటే...

258
00:16:13,515 --> 00:16:18,353
అతను ప్రస్తుతం పని చేస్తున్న కేసు వల్ల...

259
00:16:19,730 --> 00:16:22,274
కొన్ని విషయాలు అతనికి తెలిసే అవకాశం ఉందని అనిపిస్తోంది.

260
00:16:25,652 --> 00:16:29,698
మనం తెలియకూడదని దాచిన విషయాలను
అతను తెలుసుకొనేందుకు ఇంకెంతో సమయం పట్టదు.

261
00:16:29,698 --> 00:16:33,327
నిజానికి, ఇవి నాకు కూడా అంత నచ్చని విషయాలే.

262
00:16:35,495 --> 00:16:38,832
- ఈ కొత్త పద్ధతులు.
- ఎప్పటిలాగే, ఇప్పుడు కూడా మనం గమనిస్తున్నామంతే.

263
00:16:38,832 --> 00:16:42,002
కాదు, మిల్లర్. ఇది కొత్త విషయం.

264
00:16:43,754 --> 00:16:45,130
వీళ్లు...

265
00:16:45,130 --> 00:16:47,174
అవును, నువ్వన్నది నిజమే.

266
00:16:52,679 --> 00:16:55,516
కానీ ఏదేమైనా, అది మనకి తప్పదు.

267
00:16:56,016 --> 00:16:57,559
కానీ షుగర్ కి అలా అనిపించదు.

268
00:16:58,227 --> 00:16:59,770
అలాంటప్పుడు, అతనికి తెలియనివ్వవద్దు.

269
00:17:01,563 --> 00:17:03,732
అతడిని అడ్డుకోవడం కుదిరేలా లేదు.
నేను ప్రయత్నించాను కూడా.

270
00:17:03,732 --> 00:17:05,108
ఎంత దూరమైనా వెళ్లు.

271
00:17:12,241 --> 00:17:14,742
అది కాటన్ వుడ్ వృక్షం కదా?

272
00:17:17,079 --> 00:17:18,829
- హా, అవును. అదే అనుకుంటా.
- సువాసన వెదజల్లుతోంది.

273
00:17:19,705 --> 00:17:21,250
హా, ఇక్కడ చాలా బాగుంది.

274
00:17:21,750 --> 00:17:24,336
కొన్ని బాగా పెరుగుతున్నాయి, కొన్ని చచ్చిపోయి ఉన్నాయి.

275
00:17:25,878 --> 00:17:29,508
ఇంతకీ... ఇంతకీ ఆ మనవరాలి పేరేంటి?

276
00:17:29,508 --> 00:17:31,468
ఒలీవియా. ఒలీవియా సీగల్.

277
00:18:25,147 --> 00:18:28,066
హేయ్. మొన్న పూర్తిగా మాట్లాడుకోలేకపోయాం కదా.

278
00:18:29,484 --> 00:18:33,780
కాబట్టి, మరింత లోతుగా దర్యాప్తు
చేద్దామని వచ్చా. కూర్చుంటావా?

279
00:18:37,242 --> 00:18:39,578
మీ ఇల్లు చాలా బాగుంది. ఇక్కడ కూర్చో.

280
00:18:41,872 --> 00:18:43,081
ఫోన్ ఇలా ఇవ్వు.

281
00:18:43,916 --> 00:18:46,251
అది బేస్ గిటార్ కదా?

282
00:18:47,503 --> 00:18:48,712
డబుల్ బేస్ గిటార్.

283
00:18:49,296 --> 00:18:52,216
హై స్కూలులో ఉండగా నేను ఎలక్ట్రిక్ గిటార్ వాయించేవాడిని.

284
00:19:05,354 --> 00:19:08,106
చూడు, నువ్వు త్వరగా వెళ్లిపోతే మంచిది,

285
00:19:08,106 --> 00:19:09,942
ఎందుకంటే, నా లవర్ వస్తున్నాడు ఇక్కడికి.

286
00:19:09,942 --> 00:19:12,569
నువ్వు పోటుగాడిలా నా మీదకి
తుపాకీ ఎక్కు పెట్టి ఉండటం కనుక అతను చూస్తే...

287
00:19:12,569 --> 00:19:14,279
"నా లవర్ వస్తున్నాడు." అవును కదా?

288
00:19:15,697 --> 00:19:19,243
ఎవరైనా ఒక మగాడు నిన్ను భయపెట్టాలని చూసినప్పుడల్లా

289
00:19:20,160 --> 00:19:22,579
రెక్కల గుర్రంపై ఎగురుతూ ఒక వీరాధివీరుడైన లవర్ వచ్చి

290
00:19:22,579 --> 00:19:24,623
నిన్ను కాపాడేస్తాడా?

291
00:19:28,210 --> 00:19:29,670
- ఎవరు?
- నేనే.

292
00:19:29,670 --> 00:19:30,754
అదుగో వచ్చేశాడు.

293
00:19:39,847 --> 00:19:40,848
హేయ్.

294
00:19:49,398 --> 00:19:50,732
భలే దాక్కున్నావులే.

295
00:19:50,732 --> 00:19:53,151
- ఆహారం తెచ్చా. నూడుల్స్.
- థ్యాంక్స్.

296
00:19:55,195 --> 00:19:56,280
నీ యెంకమ్మ.

297
00:19:59,408 --> 00:20:00,492
ఎలా సాగుతోంది నీ పని?

298
00:20:00,492 --> 00:20:03,620
తను బయటకు వెళ్లి, ఒక స్నేహితురాలిని కలిసింది.

299
00:20:03,620 --> 00:20:05,664
ఇప్పుడే వచ్చింది. ఇంతే ప్రస్తుతానికి.

300
00:20:08,000 --> 00:20:09,042
ఇప్పుడేం చేస్తావు?

301
00:20:10,127 --> 00:20:12,337
- డేవిడ్ సీగల్ తో మాట్లాడావా?
- హా.

302
00:20:13,505 --> 00:20:14,673
ఏం తెలిసింది?

303
00:20:14,673 --> 00:20:17,217
హా, చాలా విషయాలు మాట్లాడుకున్నాం,
కానీ నాకు అర్థమైన ముఖ్యమైన విషయం ఏంటంటే,

304
00:20:17,217 --> 00:20:18,594
నేను బైరన్ స్టాలింగ్స్ తో మాట్లాడాలి.

305
00:20:21,221 --> 00:20:23,390
అతను మెక్సికోలో ఉన్నాడు. రేపే వస్తాడు.

306
00:20:23,390 --> 00:20:25,100
రేపు ఉదయాన్నే నువ్వు అతని ఇంటి దగ్గరికి వెళ్లిపో.

307
00:20:25,100 --> 00:20:26,560
చిరునామా నీకు మెసేజ్ చేస్తాను.

308
00:20:31,607 --> 00:20:33,483
అయితే ఈ రాత్రి నీకు విశ్రాంతేనా?

309
00:20:35,402 --> 00:20:36,403
ఏదైనా సినిమా చూడటానికి వెళ్తానేమో.

310
00:20:39,406 --> 00:20:42,618
రేపు నీకు స్టాలింగ్స్ కనబడగానే, నాకు కాల్ చేసేయ్, సరేనా?

311
00:20:42,618 --> 00:20:43,577
సరే. తప్పకుండా.

312
00:20:44,953 --> 00:20:46,622
నీ లవర్ వస్తున్నాడు!

313
00:20:46,622 --> 00:20:49,291
- ఆహారం తెచ్చినందుకు థ్యాంక్స్.
- పర్లేదులే.

314
00:20:49,958 --> 00:20:50,959
చచ్చావే నా చేతిలో.

315
00:21:02,054 --> 00:21:02,930
ఎక్కడే వాడు?

316
00:21:32,876 --> 00:21:34,545
నీ యెంకమ్మ!

317
00:21:51,019 --> 00:21:52,145
ఆపు.

318
00:21:54,773 --> 00:21:55,774
షుగర్!

319
00:21:56,733 --> 00:21:57,734
షుగర్!

320
00:21:58,652 --> 00:21:59,903
షుగర్!

321
00:22:16,587 --> 00:22:17,588
నీకేమీ కాలేదు కదా?

322
00:22:38,442 --> 00:22:39,526
సారీ.

323
00:22:45,324 --> 00:22:47,159
ఇక మనం స్టాలింగ్స్ తో మాట్లాడాలి.

324
00:22:47,159 --> 00:22:48,660
- రేపు ఉదయమా?
- అవును.

325
00:22:49,494 --> 00:22:52,080
- ఇప్పుడు వీడిని ఏం చేద్దాం?
- వదిలేద్దాం.

326
00:22:53,040 --> 00:22:55,459
బార్స్టోలో లేదా బోయిస్ లో కొత్త జీవితం ప్రారంభిస్తాడేమో.

327
00:22:56,502 --> 00:22:59,129
లేదా ఇక్కడే ఉండి, చేసిన పని చేయలేకపోయానని
వాడి బాస్ కాళ్ళావేళ్ళా పడతాడేమో.

328
00:22:59,129 --> 00:23:01,381
- వాడి ఇష్టం. వదిలేద్దాం.
- మరి తన సంగతి?

329
00:23:01,381 --> 00:23:03,217
- తనతో నేను మాట్లాడతాను.
- సరే.

330
00:23:07,554 --> 00:23:08,597
హేయ్.

331
00:23:12,267 --> 00:23:14,228
నువ్వు ఈరాత్రికి ఇక్కడ ఉండటం మంచిది కాదేమో అనిపిస్తోంది.

332
00:23:14,228 --> 00:23:15,938
హోటల్ కి వస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది, ఏమంటావు?

333
00:23:16,522 --> 00:23:17,981
- నా సామాను తెచ్చుకుంటా అయితే.
- సరే.

334
00:23:37,209 --> 00:23:40,963
ఆకలిగా ఉంటే చెప్పు,
రూమ్ సర్వీస్ ఇంకా అందుబాటులోనే ఉంటుంది.

335
00:23:44,091 --> 00:23:45,717
సరే. ఇప్పుడే వస్తా.

336
00:23:47,177 --> 00:23:49,304
నెల్లూరు చేపల పులుసు చాలా బాగుంటుందని విన్నాను.

337
00:23:49,847 --> 00:23:51,139
నాకేమీ వద్దు.

338
00:23:51,640 --> 00:23:53,141
ఇంత జరిగాక, నాకు అసలు...

339
00:23:53,141 --> 00:23:54,977
ఎవరికైనా అసలు ఆకలి ఎలా వేస్తుంది?

340
00:23:55,644 --> 00:23:56,645
అవునులే.

341
00:23:59,147 --> 00:24:00,482
వాడు నిన్ను ఏదైనా చేసుండేవాడు.

342
00:24:00,482 --> 00:24:03,861
కాబట్టి ఏమో... ఏమో అలా జరిగిపోయింది.

343
00:24:04,444 --> 00:24:05,779
నువ్వు వాడిని ఏదైనా చేద్దామనుకున్నావు.

344
00:24:09,616 --> 00:24:11,076
నిన్ను భయపెట్టి ఉంటే సారీ.

345
00:24:15,622 --> 00:24:16,623
ఏంటి ఆ వేషం?

346
00:24:19,835 --> 00:24:21,336
స్నానానికి వెళ్లబోతున్నా.

347
00:24:22,754 --> 00:24:25,090
సారీ... సోఫా మీద నేనే పడుకుంటాను.

348
00:24:25,090 --> 00:24:27,593
- నువ్వు, వైలీ బెడ్ మీద పడుకోండి.
- వద్దు, వద్దు.

349
00:24:27,593 --> 00:24:29,803
నేను ఒకప్పుడు డ్రగ్స్ బాగా తీసుకున్న రాక్ సింగర్ ని.

350
00:24:29,803 --> 00:24:34,016
హోటల్ లోని అందమైన సోఫాలో ఒక రాత్రి
హాయిగా పడుకోగలనులే. నాకేం పర్వాలేదు.

351
00:24:35,058 --> 00:24:36,101
సరే.

352
00:24:44,818 --> 00:24:46,236
ఇవిగో పడుకోవడానికి.

353
00:24:51,742 --> 00:24:53,076
- థ్యాంక్స్.
- పర్వాలేదు.

354
00:24:53,076 --> 00:24:54,953
- గుడ్ నైట్.
- గుడ్ నైట్.

355
00:25:28,111 --> 00:25:30,030
గుడ్ ఈవినింగ్. దిగండి.

356
00:25:31,031 --> 00:25:32,449
దయచేసి దిగండి.

357
00:25:33,575 --> 00:25:36,828
కానివ్వండి. త్వరలోనే మనం గ్యమస్థానానికి చేరుకుంటాం.

358
00:25:37,496 --> 00:25:39,081
మరేం పర్వాలేదు, చూడండి.

359
00:25:39,081 --> 00:25:41,542
ఇంకాస్త వేగంగా దిగండి. కానివ్వండి.

360
00:25:42,501 --> 00:25:43,669
మరేం పర్వాలేదు.

361
00:25:43,669 --> 00:25:46,088
మేము కొన్ని మార్పులు చేయాలనుకుంటున్నామంతే.

362
00:25:46,839 --> 00:25:50,551
మగవాళ్లు ఇక్కడికి రండి, ఆడవాళ్లందరూ ఇక్కడికి రండి.

363
00:25:50,968 --> 00:25:53,512
హా, చెప్పిన చోట్లకు వెళ్లండి. ఏం పర్వాలేదు.

364
00:25:53,512 --> 00:25:55,305
మనం త్వరలోనే దాటుతాం.

365
00:25:56,974 --> 00:25:58,851
ఒక్క నిమిషం, మీరు...

366
00:25:58,851 --> 00:25:59,852
మీరు నాతో రండి.

367
00:25:59,852 --> 00:26:01,186
మీరు.

368
00:26:01,728 --> 00:26:02,813
మీరు. ఇంకా మీరు.

369
00:26:04,147 --> 00:26:05,190
మీరు, ఇంకా మీరు కూడా.

370
00:26:05,190 --> 00:26:07,985
మీరందరూ వ్యాన్ ఎక్కండి.

371
00:26:08,694 --> 00:26:10,112
ఏం పర్వాలేదు.

372
00:26:10,112 --> 00:26:14,324
మీ అమ్మానాన్నలు మీ వెనుకే ఇంకో ట్రక్కులో వస్తారు.

373
00:26:14,324 --> 00:26:17,411
- తనకు వెళ్లాలని లేదు.
- ఏమైంది, సర్? ఏం పర్వాలేదులెండి.

374
00:26:17,411 --> 00:26:21,206
వాళ్లు అమ్మాయిలని విడిగా పంపిస్తున్నారు,
తను నాతోనే వస్తుంది.

375
00:26:21,206 --> 00:26:22,374
ఏమీ కాదండి.

376
00:26:23,041 --> 00:26:24,418
అదంత మంచి విషయంలా అనిపించట్లేదు.

377
00:26:25,961 --> 00:26:29,173
నాతో రండి. నేను మీకు వివరంగా చెప్తాను.

378
00:26:30,757 --> 00:26:32,342
నన్ను అర్థం చేసుకోండి. అర్థం చేసుకోమని ఆమెకి చెప్పండి.

379
00:26:32,342 --> 00:26:33,677
వ్యాన్ ఎక్కు.

380
00:26:35,429 --> 00:26:36,889
వ్యాన్ ఎక్కు.

381
00:26:36,889 --> 00:26:38,765
మీకు నా బాధ అర్థం కావట్లేదు.

382
00:26:44,188 --> 00:26:45,647
ఎక్కండి. ఎక్కండి.

383
00:26:55,949 --> 00:26:56,950
థ్యాంక్యూ.

384
00:26:57,910 --> 00:27:00,120
మనం ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా...

385
00:27:00,120 --> 00:27:01,955
ఒక కష్టమైన సన్నివేశం గురించి. గుర్తుందా?

386
00:27:01,955 --> 00:27:03,874
దేవుడా. హా, గుర్తుంది.

387
00:27:04,666 --> 00:27:07,711
అది సాంకేతికపరంగా కూడా కష్టమైనదే.
కేవలం... కేవలం నటన విషయమనే కాదు.

388
00:27:08,670 --> 00:27:11,131
నేను పత్రాలన్ని పట్టుకొని లాయర్ ఆఫీసులోకి వెళ్లాలి.

389
00:27:11,131 --> 00:27:13,592
అదీగాక, సుమారుగా 30 మంది దాకా
జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా?

390
00:27:13,592 --> 00:27:15,928
అంత కన్నా ఎక్కువే. చాలా మంది ఉన్నారు.

391
00:27:16,512 --> 00:27:21,058
పైగా అక్కడ టైమింగ్ ఎలా ఉండాలంటే,
మేము విల్ఫోర్డ్ బ్రిమ్లీ ఆఫీసు ముందుకు రాగానే,

392
00:27:21,058 --> 00:27:24,561
నేను నా ఆఖరి డైలాగును పూర్తి చేసేయాలి, అదే సమయంలో

393
00:27:24,561 --> 00:27:27,940
వీలునామా తుది దస్తావేజులని ఆయనకి ఇచ్చేయాలి.

394
00:27:27,940 --> 00:27:29,816
- కష్టమే అది.
- నాకు దిమ్మతిరిగిపోయింది.

395
00:27:31,318 --> 00:27:33,195
ఒక టేక్ తర్వాత మరొకటి. చేయలేకపోయా అసలు.

396
00:27:33,195 --> 00:27:36,365
"కట్, రీసెట్, కట్, రీసెట్, కట్, రీసెట్, మళ్లీ మొదటికి."

397
00:27:36,365 --> 00:27:39,326
నేను... నేను సరిగ్గా చేయలేకపోయా అసలు.

398
00:27:39,326 --> 00:27:42,955
ఒకసారైతే టైమింగ్ కుదరలేదు,

399
00:27:42,955 --> 00:27:47,584
ఒకసారి పత్రాలు మిస్ అయ్యాయి, ఒకసారి డైలాగ్స్ మర్చిపోయాను.

400
00:27:47,584 --> 00:27:51,797
నువ్వు అపుడు చిన్నవాడివి.
ఎలా అయితేనేం, చివరికి ఇరగదీశావుగా.

401
00:27:51,797 --> 00:27:53,298
హా, తెలుసు.

402
00:27:53,924 --> 00:27:57,261
ఇంకా కోర్ట్ సన్నివేశం ఉంది చూడు. సూపర్.

403
00:27:59,221 --> 00:28:02,015
ఆ సీనుకి థియేటరులో కన్నీళ్లు పెట్టనివారు ఉండరు.

404
00:28:02,015 --> 00:28:03,225
హా, అది చాలా బాగుంటుంది.

405
00:28:03,225 --> 00:28:05,185
హా, అందులో సందేహమే లేదు.

406
00:28:11,358 --> 00:28:15,153
నువ్వు అప్పుడు చాలా బాగా చేశావు.
ఇప్పుడు కూడా బాగా చేస్తున్నావు.

407
00:28:20,158 --> 00:28:22,578
సరే మరి. ఇంకాస్త వైన్ తీసుకురానా?

408
00:28:22,578 --> 00:28:24,580
- వద్దు.
- సరే.

409
00:29:24,264 --> 00:29:25,474
ఇది తొక్కలో ఊరు.

410
00:29:41,990 --> 00:29:43,242
హలో?

411
00:29:43,867 --> 00:29:45,035
ఇక్కడ ఉన్నా!

412
00:29:45,869 --> 00:29:48,830
- ఎక్కడ?
- ఇక్కడ! ఇక్కడ ఉన్నా!

413
00:29:50,707 --> 00:29:51,834
అయ్యయ్యో.

414
00:29:51,834 --> 00:29:54,419
అయ్యో. అయ్యయో. దేవుడా.

415
00:29:54,962 --> 00:29:57,965
అయ్యో. దేవుడా. ఓరి దేవుడా.

416
00:29:58,924 --> 00:30:02,386
ఏదోకటి చేయ్. ఏదోకటి చేయ్!

417
00:30:13,647 --> 00:30:15,732
వాడిని జాగ్రత్తగా చూసుకోండి.

418
00:30:26,743 --> 00:30:28,412
ఎవరో ఒకసారి చెప్పారు,

419
00:30:28,412 --> 00:30:29,663
"ప్రపంచంలోని అందరూ

420
00:30:29,663 --> 00:30:31,790
తమకి కావాలనుకుంది చేస్తే,
లాస్ ఏంజెలస్ అంతా జనాలతో కిక్కిరిసి పోతుంది."

421
00:30:32,749 --> 00:30:35,169
లాస్ ఏంజెలస్
అగ్నిమాపక పారామెడిక్ సిబ్బంది

422
00:30:35,169 --> 00:30:36,670
ఇప్పుడు జరుగుతోంది అదేనా?

423
00:30:38,297 --> 00:30:39,798
ఇంత కాలం తర్వాత,

424
00:30:40,966 --> 00:30:44,261
నేను కూడా ఈ చోటుకు ఆకర్షితుడిని అయిపోతున్నానా?

425
00:30:45,846 --> 00:30:49,141
నా ఉద్దేశం, ఇవాళ మెలనీ ఇంట్లో అతడిని నేను బాగా కొట్టాను.

426
00:30:49,808 --> 00:30:52,811
నేను అతడి పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించానంటే,
అది నేను కాదని నేను చెప్పేయవచ్చు.

427
00:30:52,811 --> 00:30:54,438
నేను అలాంటి వాడిని కాదు.

428
00:30:57,274 --> 00:31:00,652
- కానీ ఈమధ్య నాకేమైందో తెలీట్లేదు.
- బుజ్జీ.

429
00:31:02,070 --> 00:31:05,490
- హాయ్. నేను కూడా నిన్ను చాలా మిస్ అయ్యా. ఇలా రా.
- నేను ఇక్కడ చాలా కాలం ఉన్నానేమో.

430
00:31:06,241 --> 00:31:07,367
హా.

431
00:31:07,367 --> 00:31:09,077
ఏదేమైనా, ఈరాత్రికి ఇక ఇంతే.

432
00:31:11,705 --> 00:31:16,126
రేపు స్టాలింగ్స్ తో మాట్లాడాలి.
రేపు అయినా మంచిగా ప్రవర్తిస్తాను.

433
00:31:59,962 --> 00:32:01,213
ఏమైంది?

434
00:32:05,384 --> 00:32:06,802
నా దగ్గర ఒక రహస్యం ఉంది.

435
00:32:09,721 --> 00:32:10,848
చెప్పు.

436
00:32:16,103 --> 00:32:17,104
చెప్పు.

437
00:32:19,982 --> 00:32:21,191
చెప్పు.

438
00:32:24,528 --> 00:32:25,696
నేను చెప్పలేను.

439
00:33:12,868 --> 00:33:14,870
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

