1
00:01:12,990 --> 00:01:13,949
మీరు సీగల్ దంపతులా?

2
00:01:14,032 --> 00:01:14,950
అవును.

3
00:01:15,033 --> 00:01:16,994
మీ అబ్బాయి ఆపరేషన్ పూర్తి అయింది. అతను బతికే ఉన్నాడు.

4
00:01:17,077 --> 00:01:17,953
బతికే ఉన్నాడా?

5
00:01:18,537 --> 00:01:21,874
-థ్యాంక్…
-మన్నించాలి. అతను బతికే ఉన్నాడు,

6
00:01:21,957 --> 00:01:24,877
కానీ అతని మెదడు బాగా దెబ్బతింది,
దాన్ని బాగు చేయడం అస్సలు సాధ్యపడదు.

7
00:01:24,960 --> 00:01:26,253
ఏమంటున్నారు మీరు?

8
00:01:26,962 --> 00:01:29,131
డేవిడ్ దేహం చక్కగా పని చేస్తోంది,

9
00:01:29,214 --> 00:01:32,676
కానీ అతను మళ్లీ మాట్లాడటం కానీ,
కదలడం కానీ, ఆలోచించడం కానీ అస్సలు చేయలేడు.

10
00:01:33,260 --> 00:01:34,511
ఇంకెప్పటికీ అది సాధ్యం కాదు.

11
00:01:34,595 --> 00:01:36,680
ఈ ప్రస్తావన తీసుకురాక తప్పట్లేదు,

12
00:01:36,763 --> 00:01:40,893
కానీ అవయవ దానం అనేది చాలా గొప్ప వరం…

13
00:01:49,109 --> 00:01:52,237
కుడి చేయి, ఎడమ చేయి గురించి ఒక చిన్న కథ చెప్పనా?

14
00:01:53,864 --> 00:01:55,574
అది మంచి, చెడుల కథ అన్నమాట.

15
00:01:57,993 --> 00:02:00,162
ద్వేషం.

16
00:02:00,245 --> 00:02:01,455
ఈ ఎడమ చేత్తోనే

17
00:02:01,538 --> 00:02:04,041
కెయిన్, తన తమ్ముడుని చంపేస్తాడు.

18
00:02:07,002 --> 00:02:08,586
ప్రేమ.

19
00:02:09,170 --> 00:02:10,547
ఈ వేళ్లను చూశారా, మిత్రులారా?

20
00:02:10,631 --> 00:02:13,634
ఈ వేళ్లలో ఉండే వెయిన్స్ నేరుగా
మనిషి అంతరాత్మతో అనుసంధానం అయ్యుంటాయి.

21
00:02:14,384 --> 00:02:16,637
మిత్రులారా, ఈ కుడి చేయి ప్రేమకి చిహ్నం.

22
00:02:17,429 --> 00:02:19,765
ఇప్పుడు చూడండి, మీకు జీవిత గాథను చూపిస్తాను.

23
00:02:20,641 --> 00:02:22,142
మిత్రులారా, ఈ వేళ్లు,

24
00:02:22,226 --> 00:02:24,728
ఎప్పుడూ జగడమాడుతూనే ఉంటాయి.

25
00:02:26,605 --> 00:02:27,689
ఇప్పుడు వీటిని చూడండి.

26
00:02:29,816 --> 00:02:33,654
అన్నయ్య అయిన ఎడమ చేయి…
ద్వేషానికి రూపమైన ఎడమ చేయి పోరాడుతోంది,

27
00:02:33,737 --> 00:02:35,364
చూస్తుంటే ప్రేమ ఓడిపోయేలా ఉంది.

28
00:02:36,323 --> 00:02:39,076
కానీ ఆగండి. ఒక్క నిమిషం ఆగండి.

29
00:02:39,576 --> 00:02:42,913
వారెవ్వా, ప్రేమ గెలుస్తోంది! అవునండీ అవును.

30
00:02:44,331 --> 00:02:45,499
చివరికి ప్రేమే గెలిచింది.

31
00:02:45,999 --> 00:02:48,794
ద్వేషానికి చిహ్నమైన ఎడమ చేయి ఓడిపోయింది!

32
00:02:52,422 --> 00:02:53,799
ఇవాళ చాలా ముఖ్యమైన రోజు.

33
00:02:55,217 --> 00:02:57,094
నిద్రపట్టలేదు. ఉదయాన్నే లేచా.

34
00:02:58,387 --> 00:03:00,389
చార్లీ ఎప్పుడెప్పుడు ఫోన్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నా.

35
00:03:00,931 --> 00:03:03,392
బైరన్ స్టాలింగ్స్ ఇంటికి వచ్చినప్పుడు,
తను నాకు ఫోన్ చేసి చెప్తుంది.

36
00:03:06,520 --> 00:03:08,355
ఇది చాలా ముఖ్యమైన రోజని అనిపిస్తోంది.

37
00:03:10,023 --> 00:03:11,024
ముఖ్యమైన రోజు.

38
00:03:22,536 --> 00:03:23,662
రండి. తినండి.

39
00:03:40,262 --> 00:03:44,183
రండి, రండి, రండి.

40
00:03:51,982 --> 00:03:53,317
పిరికిపంద.

41
00:03:56,862 --> 00:03:58,197
హేయ్, హేయ్, హేయ్.

42
00:04:04,536 --> 00:04:06,038
ఇంకా కార్లో సంప్రదించలేదా?

43
00:04:07,039 --> 00:04:07,998
అస్సలు సంప్రదించలేదు.

44
00:04:08,999 --> 00:04:10,167
భలే విచిత్రంగా ఉంది కదా?

45
00:04:11,502 --> 00:04:13,295
బాగా తాగి ఏదైనా హోటల్ గదిలో స్పృహ తప్పి ఉంటే

46
00:04:13,378 --> 00:04:15,839
వాడిని నా కుక్కలకి ఆహారంగా వేసేస్తా.

47
00:04:17,048 --> 00:04:18,509
మరి మాస్ ఏమైనా కాల్ చేశాడా?

48
00:04:18,591 --> 00:04:19,927
వస్తున్నాడు.

49
00:04:20,010 --> 00:04:21,386
సర్లే. హాయ్.

50
00:04:22,012 --> 00:04:23,055
హాయ్.

51
00:04:40,280 --> 00:04:42,824
హేయ్. ఇప్పుడే స్టాలింగ్స్ ఇంటికి వచ్చాడు.

52
00:04:42,908 --> 00:04:44,201
ఆగు, ఇప్పుడు అక్కడికే వెళ్తున్నావా?

53
00:04:44,284 --> 00:04:46,954
-హా, వెళ్తున్నా. దారిలో ఉన్నా.
-సరే. కానీ షుగర్, అతను…

54
00:04:47,037 --> 00:04:49,540
-ఒలీవియాని కనిపెట్టడానికి అతను కీలకం.
-బైరన్ స్టాలింగ్స్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి…

55
00:04:49,623 --> 00:04:52,334
రూబీ, కంగారుపడకు, నాకేమీ కాదు. సరేనా?

56
00:05:04,221 --> 00:05:06,473
సరే మరి, ఆ ఆటలను పక్కకు పెట్టు, కాస్త మాట్లాడాలి.

57
00:05:07,099 --> 00:05:09,142
డిబెనిడెటోకి ఏమైందో చెప్పు.

58
00:05:11,061 --> 00:05:12,312
వావ్.

59
00:05:16,108 --> 00:05:17,109
ప్లాన్ లో మార్పు.

60
00:05:18,819 --> 00:05:20,028
పైకి లేవండి!

61
00:05:40,090 --> 00:05:41,758
హేయ్. ఏంటి సమాచారం?

62
00:05:42,593 --> 00:05:46,305
స్టాలింగ్స్ బాబు ఉన్నాడు, కొందరు తెలిసిన సహచరులు
ఉన్నారు, రెండు డాబర్మాన్ కుక్కలు ఉన్నాయి.

63
00:05:46,388 --> 00:05:49,308
ఒలీవియా కనిపించలేదు, అంటే
తననేమీ వాళ్లు కనబడేలా దాచరు కదా.

64
00:05:50,058 --> 00:05:53,854
రెండు వైపులా తలుపులు ఉన్నాయి, వెనుక వైపు
మెట్లు ఉన్నాయి, అందరి దగ్గరా తుపాకులు ఉన్నాయి.

65
00:05:54,521 --> 00:05:57,399
సరే. నేను పది నిమిషాల్లో రాకపోతే నీ పని నువ్వు చేస్తావుగా?

66
00:05:57,482 --> 00:05:59,860
తప్పకుండా. ఎప్పటిలాగానే.

67
00:05:59,943 --> 00:06:01,111
ఎప్పటిలాగానే.

68
00:06:40,442 --> 00:06:41,443
ఇలా రండి.

69
00:06:44,571 --> 00:06:45,697
మంచి కుక్కలు మీరు.

70
00:08:36,350 --> 00:08:37,476
ఒలీవియా.

71
00:08:45,234 --> 00:08:46,235
హేయ్.

72
00:08:51,156 --> 00:08:52,866
మిస్టరీ మనిషి వచ్చాడయ్యా.

73
00:08:57,496 --> 00:08:58,622
కాపాడటం కోసం.

74
00:09:02,084 --> 00:09:03,252
వచ్చేశాడయ్యా.

75
00:09:06,046 --> 00:09:08,048
నా దగ్గర తుపాకీ లేదు. నా దగ్గర తుపాకీ లేదు.

76
00:09:09,591 --> 00:09:10,884
మీకు హాని తలపెట్టాలని నాకు లేదు.

77
00:09:10,968 --> 00:09:13,971
నాకు హాని తలపెట్టాలని లేదా?

78
00:09:14,471 --> 00:09:15,597
నాకు హింస వద్దు.

79
00:09:16,098 --> 00:09:17,391
అయిదు గుద్దులకేనా?

80
00:09:18,100 --> 00:09:23,397
నా దృష్టిలో, హింస అంటే ఏంటో చెప్పనా,
మ్యానీ నీ మోకాలులో ఒక తూటా దింపుతాడు,

81
00:09:23,897 --> 00:09:26,817
దానికి నువ్వు విలవిలలాడుతుంటే,
నా కాలు తీసుకొచ్చి నీ తల మీద పెట్టి,

82
00:09:26,900 --> 00:09:28,819
నీ చేతిని నరికేస్తా.

83
00:09:30,195 --> 00:09:32,906
అదీ హింస అంటే.

84
00:09:34,533 --> 00:09:37,744
మీకందరికీ అది బాగా అనిపిస్తోందని
నేను అర్థం చేసుకోగలను. నిజంగానే చెప్తున్నా.

85
00:09:38,537 --> 00:09:40,873
ఏమైనా చేయగల శక్తి ఉందనే ఫీలింగ్.

86
00:09:41,874 --> 00:09:46,336
నాకు కానీ, మీ అందరికీ కానీ
దాన్ని నేను కోరుకోవడం లేదు, సరేనా?

87
00:09:46,420 --> 00:09:49,339
నాకు ఒలీవియా కావాలి, అంతే.

88
00:09:50,048 --> 00:09:51,592
దయచేసి వినండి, తనని ఇంటికి చేర్చాలనే చూస్తున్నా.

89
00:09:53,093 --> 00:09:56,471
నువ్వు భలే విచిత్రంగా ఉన్నావు.

90
00:09:56,555 --> 00:09:59,892
నువ్వు నిజంగానే చాలా వింతగా ఉన్నావు.

91
00:10:00,642 --> 00:10:02,686
కానీ నీ విషయంలో

92
00:10:04,062 --> 00:10:08,275
ఏం జరగాలి అన్నది ముందే నిర్ణయమైపోయింది.

93
00:10:09,818 --> 00:10:11,320
అదెవరు నిర్ణయించారు? ఏమంటున్నావు?

94
00:10:11,904 --> 00:10:14,281
నిన్ను కాపాడటానికి ఈసారి చార్లీ రాదు.

95
00:10:14,907 --> 00:10:16,074
ఏం జరుగుతోంది?

96
00:10:16,158 --> 00:10:18,368
ఏం జరుగుతోంది అంటే, నీ చావే.

97
00:10:19,411 --> 00:10:21,205
-మ్యానీ.
-వద్దు! వద్దు!

98
00:10:21,288 --> 00:10:24,833
చూడండి, తను ఎక్కడ ఉందో చెప్పండి చాలు.

99
00:10:26,960 --> 00:10:30,297
పోలీసులకు లొంగిపోయే అవకాశం మీకు ఇస్తాను.

100
00:10:30,380 --> 00:10:35,594
తుపాకీ లేని మిస్టరీ మనిషి మనకి లొంగిపోయే అవకాశం ఇస్తాడట.

101
00:10:35,677 --> 00:10:37,387
-థ్యాంక్యూ.
-హా, అదైనా జరగాలి,

102
00:10:37,471 --> 00:10:38,972
లేదా మీ అందరినీ నేను చంపేయడం అయినా జరగాలి.

103
00:10:39,056 --> 00:10:40,140
ఓయబ్బో.

104
00:10:43,602 --> 00:10:44,770
కాల్చి పారేయ్.

105
00:10:46,396 --> 00:10:47,773
అయ్య బాబోయ్!

106
00:11:16,552 --> 00:11:18,220
అబ్బా!

107
00:11:34,486 --> 00:11:38,156
ఇక్కడికి నేను వస్తున్నానని నీకు ఎవరో చెప్పారు. ఎవరు?

108
00:11:44,538 --> 00:11:45,455
షుగర్ వస్తున్నాడు. వెళ్లిపోండి

109
00:11:45,539 --> 00:11:46,456
అయ్యో.

110
00:11:47,040 --> 00:11:48,250
మింగుడుపడటం లేదా?

111
00:11:48,333 --> 00:11:51,295
అయ్యయ్యో. ఆ నంబర్ ఎవరిదో నాకు తెలుసు.

112
00:11:51,378 --> 00:11:54,840
మింగుడుపడటం లేదన్నమాట. ఆ సన్నాసులు.

113
00:11:54,923 --> 00:11:57,968
ఒలీవియా ఎక్కడ? ఎక్కడో చెప్పు.

114
00:11:58,051 --> 00:11:59,720
పోరా.

115
00:12:00,637 --> 00:12:01,930
నేను అసలు ఈ హింసని కోరుకోలేదు.

116
00:12:04,141 --> 00:12:05,350
ఒలీవియా ఎక్కడ?

117
00:12:06,685 --> 00:12:07,978
దొబ్బేయ్.

118
00:12:08,061 --> 00:12:09,354
ఎక్కడ?

119
00:12:09,438 --> 00:12:11,148
నాకు అస్సలు తెలీదు…

120
00:13:35,941 --> 00:13:38,485
ఓహో. బంగారం, ఇంటికి వచ్చేశా.

121
00:14:04,595 --> 00:14:05,596
హేయ్.

122
00:14:07,973 --> 00:14:11,435
నీ మిత్రులందరూ చచ్చారు.

123
00:14:12,603 --> 00:14:15,856
నేను ఇక్కడి నుండి వెళ్లిపోతా, దీని గురించి
పెదవి విప్పను. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను.

124
00:14:20,903 --> 00:14:22,905
సరే. వెళ్లిపో.

125
00:14:25,741 --> 00:14:26,742
ఆగు.

126
00:14:27,951 --> 00:14:31,038
నీ దగ్గర ఫోన్ ఉందా?

127
00:14:31,580 --> 00:14:33,165
ఇప్పుడు నా ఫోన్ సురక్షితం కాదు.

128
00:14:36,585 --> 00:14:37,586
థ్యాంక్స్.

129
00:14:46,720 --> 00:14:49,723
సీ
చార్లీ

130
00:14:53,310 --> 00:14:54,937
-క్షమించండి…
-అయ్యయ్యో, చార్లీ.

131
00:14:55,020 --> 00:14:57,481
-…ఈ నంబరు మనుగడలో లేదు.
-వాళ్లకి చార్లీ చిక్కింది.

132
00:15:02,903 --> 00:15:03,904
మెలనీ.

133
00:15:10,953 --> 00:15:12,663
అన్నీ సినిమాలలో చూపినట్టు జరగవు.

134
00:15:15,040 --> 00:15:16,041
ఆ విషయం నాకు తెలుసు.

135
00:15:20,295 --> 00:15:22,965
ఒక్కోసారి, మనం సంఘటనని, సంఘటనగానే చూడాలి.

136
00:15:23,590 --> 00:15:26,426
విభిన్నమైనదిగా. ప్రత్యేకమైనదిగా.

137
00:15:28,136 --> 00:15:33,767
అయినా కానీ, నా ప్రమేయం లేకుండానే,
నాకు… నాకు అదేదో సినిమా గుర్తుకువస్తోంది.

138
00:15:35,811 --> 00:15:38,939
కిమ్ బాసింగర్, రసెల్ క్రో నటించిన
1930ల బ్యాక్ డ్రాపులో నడిచే సినిమా.

139
00:15:40,232 --> 00:15:41,316
దాని పేరేంటబ్బా?

140
00:15:43,110 --> 00:15:45,821
హా, గుర్తొచ్చింది. "ఎల్.ఏ. కాన్ఫిడెన్షియల్."

141
00:15:46,864 --> 00:15:48,282
ఆ సినిమా అంతా నయవంచనే ఉంటుంది.

142
00:16:15,934 --> 00:16:17,102
డేవిడ్ తుపాకీతో కాల్చుకున్నాడు.

143
00:16:22,733 --> 00:16:24,860
బతికే ఉన్నాడు, కాకపోతే,

144
00:16:26,486 --> 00:16:30,115
డాక్టర్లు ఏమంటున్నారంటే, ఆ బలమైన గాయం వల్ల…

145
00:16:31,366 --> 00:16:33,368
అతని మెదడుకు ఎంత దెబ్బతిందంటే…

146
00:16:36,205 --> 00:16:37,748
ఏదేమైనా, వాడు ఇప్పుడు ఇదివరకటిలా ఉండలేడు.

147
00:16:42,294 --> 00:16:46,215
వాడికన్నీ మరీ ఎక్కువగా వడ్డించిన విస్తరిలా, తేలిగ్గా లభించాయి.

148
00:16:47,174 --> 00:16:49,510
ఈ పేరు, హోదాతో పాటు

149
00:16:49,593 --> 00:16:52,387
ఏవేవో వాడికి ఉత్తపుణ్యానికి దక్కేశాయి.

150
00:16:53,764 --> 00:16:55,098
అది వాడి తప్పు కాదు.

151
00:16:58,143 --> 00:17:02,814
వాడిని తొలిసారి వేగస్ కి తీసుకెళ్లిన సందర్భం గుర్తు వచ్చింది.

152
00:17:03,607 --> 00:17:09,154
అది పంపిణీదారుల సమావేశం అన్నమాట,
వాడికి అప్పుడు 12-13 ఏళ్లుంటాయి.

153
00:17:09,238 --> 00:17:13,200
కెసినోకి వెళ్లాలంటే కనీసం 18 ఏళ్లు ఉండాలి,

154
00:17:13,282 --> 00:17:17,913
వాడితో నేను ఉన్నాను, పైగా వాడు సీగల్ వంశస్థుడు,
కాబట్టి అక్కడి మేనేజర్లు అదేమీ పట్టించుకోలేదు,

155
00:17:17,996 --> 00:17:19,122
కాబట్టి…

156
00:17:19,205 --> 00:17:22,251
ఏదేమైనా, వాడి విషయంలో నియమాలు వర్తించలేదు,
నేను వాడిని జూదం ఆడే చోటికి తీసుకెళ్లాను.

157
00:17:22,751 --> 00:17:24,252
నా తరఫున పాచికలు వేయమని చెప్పా వాడికి.

158
00:17:24,336 --> 00:17:27,964
వాడు పాచికలను అదిరిపోయేలా వేశాడు.

159
00:17:29,216 --> 00:17:32,010
ఒక గంటకు పైగానే ఆడాం, కానీ
ఒక్కసారి కూడా వాడు ఏడు సంఖ్యని వేయలేదు.

160
00:17:32,094 --> 00:17:35,138
అక్కడ… అంతా మామూలు కోలాహాలంగా లేదు.

161
00:17:35,222 --> 00:17:38,183
వాడు తప్పు సంఖ్య వేసేటప్పటికే
నలభై వేల డాలర్లు గెలుచుకున్నాడు.

162
00:17:40,310 --> 00:17:45,566
ఆ ఆనందంలో వాడిని నేను ఒక మంచి రెస్టారెంటుకు తీసుకెళ్లా.

163
00:17:46,692 --> 00:17:47,693
అప్పుడు…

164
00:17:49,570 --> 00:17:53,657
చాలా అద్భుతంగా, చాలా బాగా అనిపించింది.
డేవిడ్ గాల్లో తేలిపోతూ ఉన్నాడు అప్పుడు.

165
00:17:53,740 --> 00:17:55,617
వాడు "భలే సరదాగా అనిపించింది. చాలా తేలిగ్గానే ఉంది.

166
00:17:55,701 --> 00:17:57,578
మళ్లీ వెళ్లి ఆడాలని చాలా ఆరాటంగా ఉంది," అని అన్నాడు.

167
00:17:58,620 --> 00:18:03,417
తండ్రిగా వారించాలని అనిపించింది.

168
00:18:04,877 --> 00:18:08,005
తండ్రిలా అన్నమాట. ఆ గుణం నాకెక్కడిది!

169
00:18:08,088 --> 00:18:10,799
అది అందరికీ దక్కే అదృష్టం కాదే.

170
00:18:14,636 --> 00:18:15,762
కానీ నేను చెప్పలేకపోయా.

171
00:18:17,222 --> 00:18:22,186
ఆ సమయంలో డేవిడ్ చాలా ఆనందంగా ఉన్నాడు,

172
00:18:23,604 --> 00:18:25,314
అందుకని నేనేమీ చెప్పలేదు,

173
00:18:26,481 --> 00:18:29,943
నాకు వాడి ఆనందమే అప్పుడు ముఖ్యం అనిపించింది.

174
00:18:32,529 --> 00:18:35,115
ఎంతైనా అది నీకు అర్థమయ్యే విషయం కాదనుకో.

175
00:18:41,371 --> 00:18:43,373
నన్ను మన్నించు. అది న్యాయం కాదు. అది…

176
00:18:45,459 --> 00:18:48,420
నీ చేతనైనంత నువ్వు చేశావు.
మనందరమూ మన చేతనైనంతే చేశాం.

177
00:18:48,504 --> 00:18:54,009
కానీ అది చాలలేదు. అస్సలు చాలలేదు.

178
00:18:56,595 --> 00:18:57,596
ఏదేమైనా…

179
00:18:59,348 --> 00:19:02,267
మార్గిట్, నేనూ మాట్లాడుకున్నాం,

180
00:19:03,894 --> 00:19:07,356
మేము ఈ బాధ నుండి
డేవీకి విముక్తి కలిగించాలని నిర్ణయించుకున్నాం.

181
00:19:09,942 --> 00:19:11,568
కనీసం వాడి మంచికి ఆ పనైనా చేయాలి కదా నేను.

182
00:19:16,323 --> 00:19:17,741
అంటే, నాకు…

183
00:19:19,243 --> 00:19:21,245
ఇవన్నీ చెప్పి నిన్ను ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించు.

184
00:19:22,204 --> 00:19:24,998
దీన్ని తర్వాత ఎప్పుడైనా నీకు చెప్పవచ్చు, కానీ నేను…

185
00:19:34,883 --> 00:19:36,635
దేవుడా.

186
00:20:05,706 --> 00:20:06,707
నేనే.

187
00:20:08,542 --> 00:20:10,836
-షుగర్. ఏమైంది? ఏమైంది?
-తలుపు వేసేయ్.

188
00:20:12,629 --> 00:20:13,672
ఏం జరిగింది?

189
00:20:13,755 --> 00:20:17,092
నీకు అభ్యంతరం లేకపోతే,
సందు చివర ఒక మందుల దుకాణం ఉంది.

190
00:20:17,176 --> 00:20:19,678
అక్కడికి వెళ్లి ఒక టేపు,
కొన్ని బ్యాండేజీలు, ఐయోడిన్ తీసుకురా.

191
00:20:19,761 --> 00:20:22,181
ఇంకా ఒక దిట్టమైన కుట్టు సామాగ్రి.

192
00:20:22,264 --> 00:20:24,766
-బాబోయ్.
-తెలుసు. నువ్వు ఈపాటికి ఇంటికి బయలుదేరే పనిలో ఉండాలి.

193
00:20:24,850 --> 00:20:26,560
నేను ఎక్కడికీ వెళ్లట్లేదు.
ఆంబులెన్సుకు కాల్ చేస్తాను, ఆగు.

194
00:20:27,144 --> 00:20:30,189
వద్దు, వద్దు. నాకేమీ కాదు, కాకపోతే…

195
00:20:37,529 --> 00:20:38,780
మనం ఎవరోకరికి కాల్ చేయకపోతే కష్టం.

196
00:20:38,864 --> 00:20:42,034
వద్దు. ఆంబులెన్సులు, ఆసుపత్రులు వద్దు.

197
00:20:42,117 --> 00:20:44,703
నేను డాక్టరుని కాదు, షుగర్.
నాకు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలీదు.

198
00:20:44,786 --> 00:20:47,998
అదేం లేదు. నువ్వు బాగానే చేస్తున్నావు.

199
00:20:48,081 --> 00:20:50,375
నా బ్యాగ్ తీసుకురావా?

200
00:20:53,504 --> 00:20:56,465
మనం ఒకరికి కాల్ చేయవచ్చు.

201
00:20:57,841 --> 00:21:02,346
-ఈ నంబరుకు కాల్ చేయ్. ఇది హెన్రీది.
-సరే.

202
00:21:02,930 --> 00:21:04,598
-అతను నా స్నేహితుడు.
-సరే.

203
00:21:04,681 --> 00:21:05,724
అతనికి ఏం చేయాలో తెలుసు.

204
00:21:10,062 --> 00:21:11,271
వచ్చినందుకు థ్యాంక్స్.

205
00:21:27,412 --> 00:21:29,706
సరే మరి. అది ఇలా ఇవ్వండి.

206
00:21:31,166 --> 00:21:33,502
-హెన్రీ.
-జానీ.

207
00:21:34,211 --> 00:21:36,630
ఇతడిని బాత్రూముకు తీసుకువెళ్దాం ముందు.

208
00:21:36,713 --> 00:21:37,714
సరే.

209
00:21:38,423 --> 00:21:41,343
మీరు కాళ్లను పట్టుకోండి. సిద్దంగా ఉన్నారా? కానివ్వండి.

210
00:21:41,885 --> 00:21:43,136
ఒకటి, రెండు.

211
00:21:45,347 --> 00:21:46,849
తను వెళ్లిపోయింది.

212
00:21:48,350 --> 00:21:50,561
ఎప్పుడూ ఏదోక సమస్యలో చిక్కుకుంటూనే ఉంటావా?

213
00:21:58,944 --> 00:22:01,655
మీరు మందుల దుకాణానికి వెళ్లి ఇంకాస్త బెటాడిన్ తీసుకురండి.

214
00:22:03,574 --> 00:22:04,992
ఇప్పుడే వెళ్లరా?

215
00:22:26,847 --> 00:22:28,515
నిబ్బరంగా ఉండు, జాన్. సరేనా?

216
00:22:29,349 --> 00:22:30,350
జాన్.

217
00:22:31,018 --> 00:22:35,189
సరే మరి. తెలీట్లేదా? సరే. నీకేమీ కాదు, మిత్రమా.

218
00:22:35,272 --> 00:22:40,777
ఇస్తున్నా. ఒకటి, రెండు, మూడు, నాలుగు, అయిదు.

219
00:22:53,707 --> 00:22:59,296
నేను అతని కోసం కొన్ని బట్టలు ఉంచాను.
నైట్ ప్యాంట్లు, అండర్ వేర్ లాంటివేలే.

220
00:23:00,839 --> 00:23:02,466
అతనితో ఉండటం మీకు పర్లేదా?

221
00:23:03,675 --> 00:23:06,595
నేను ఉండేవాడినే, కానీ నా పని ఎలాంటిదంటే…

222
00:23:06,678 --> 00:23:07,971
పర్వాలేదులెండి.

223
00:23:11,099 --> 00:23:12,476
మీ మీద అతనికి చాలా నమ్మకం ఉండుంటుంది.

224
00:23:13,852 --> 00:23:16,230
సరే మరి. అతను
అస్సలు కదలకూడదు. ఎక్కడికీ వెళ్లకూడదు.

225
00:23:16,313 --> 00:23:17,314
బెడ్ మీదనే ఉండాలి.

226
00:23:18,065 --> 00:23:20,692
మన్నించాలి. కానీ అతడిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఏమవుతుంది?

227
00:23:21,318 --> 00:23:22,569
ఆసుపత్రి అతనికి సురక్షితం కాదు.

228
00:23:22,653 --> 00:23:25,364
అంటే ఏంటి? అసలేం జరుగుతోంది?

229
00:23:27,824 --> 00:23:31,954
నాకు కూడా ఆ ప్రశ్నలే మెదులుతున్నాయి.
రేపు వచ్చి చెక్ చేస్తాను.

230
00:24:07,906 --> 00:24:08,907
బాధగా ఉంది.

231
00:24:10,450 --> 00:24:12,369
నేను చేసిన పనికి ఆ శాస్తి నాకు జరగాల్సిందే.

232
00:24:14,830 --> 00:24:16,331
ఈరోజు చాలా జరిగాయి…

233
00:24:18,750 --> 00:24:20,169
కానీ జరగాల్సిన పనులు ఇంకా ఉన్నాయి.

234
00:24:46,987 --> 00:24:50,365
-హేయ్.
-హేయ్, నేను నీకు చాలాసార్లు కాల్ చేశాను.

235
00:24:53,035 --> 00:24:54,328
హేయ్, నీళ్లు ఇవ్వవా?

236
00:25:02,586 --> 00:25:03,921
స్టాలింగ్స్ ఇంట్లో ఏమైంది?

237
00:25:05,714 --> 00:25:07,007
నేను వస్తున్నానని అతనికి తెలిసిపోయింది.

238
00:25:14,264 --> 00:25:16,642
అసలేం అయింది? నీకేమైనా అయిందా?

239
00:25:16,725 --> 00:25:19,269
-నాకేమీ కాలేదులే.
-సరే.

240
00:25:19,353 --> 00:25:21,688
-నేను వెళ్లి నీకు ఆస్పిరిన్ తీసుకొస్తా…
-నీ ఆస్పిరిన్ నాకు అక్కర్లేదు!

241
00:25:27,611 --> 00:25:29,363
ఈ కేసు గురించి నీకు ముందే చెప్పా.

242
00:25:36,286 --> 00:25:37,746
స్టాలింగ్స్ కి నేను వస్తున్నానని నువ్వే చెప్పావు.

243
00:25:41,583 --> 00:25:42,960
ఆ మెసేజ్ నేను చూశా.

244
00:25:45,420 --> 00:25:47,130
నేను వస్తున్నానని వాడిని హెచ్చరించావు.

245
00:25:49,132 --> 00:25:50,133
ఎందుకు?

246
00:25:52,970 --> 00:25:54,721
-అది నేను చెప్పలేను.
-ఎందుకు?

247
00:25:56,974 --> 00:25:57,975
ఎందుకు?

248
00:26:01,436 --> 00:26:02,437
అది నేను చెప్పలేను.

249
00:26:04,731 --> 00:26:05,983
అలాంటి పనికిమాలిన వెధవ ఎక్కువైపోయాడా?

250
00:26:08,360 --> 00:26:12,239
మనుషులను అక్రమ రవాణా చేసేవాడు ఎక్కువయ్యాడా?
పైగా నా గురించి అతడిని హెచ్చరిస్తావా?

251
00:26:19,538 --> 00:26:22,541
లేదు, అక్కడి నుండి వెళ్లిపొమ్మనే
వాళ్లకి చెప్పాను. నీ మీద దాడి చేయమనలేదు.

252
00:26:22,624 --> 00:26:24,918
నీకు ఏదైనా అవ్వాలని
నేను ఎందుకు కోరుకుంటాను? అది నీకూ తెలుసు.

253
00:26:25,669 --> 00:26:28,005
చార్లీ ఎక్కడ ఉంది? తను సురక్షితంగానే ఉందా?

254
00:26:33,302 --> 00:26:34,303
నాకు తెలీదు.

255
00:26:39,516 --> 00:26:41,560
చెప్తున్నా కదా, ఇవేవీ నేను తీసుకున్న నిర్ణయాలు కావు.

256
00:26:41,643 --> 00:26:42,644
ఇవేవీ అంటే?

257
00:26:46,023 --> 00:26:47,274
చెప్పు.

258
00:26:48,775 --> 00:26:49,776
చెప్పలేను.

259
00:26:53,488 --> 00:26:54,489
చెప్పను కూడా.

260
00:27:03,040 --> 00:27:04,583
ఒలీవియాని అపహరించింది స్టాలింగ్సే.

261
00:27:05,417 --> 00:27:10,088
అతని కోసమో లేదా, అతని క్లయింట్స్ అయిన,

262
00:27:11,548 --> 00:27:13,383
ఈ లోకంలోని డేవీ సీగల్స్ లాంటి వారి కోసమో కాదు.

263
00:27:13,467 --> 00:27:17,012
అతను ఇంకెవరి కోసమో తనని అపహరించాడు.

264
00:27:21,058 --> 00:27:23,644
వాళ్ల గురించి నాకు తెలీకూడదు.
వాళ్లనే మీరు రక్షిస్తున్నారు.

265
00:27:28,857 --> 00:27:31,443
మనం రక్షిస్తున్నాం.

266
00:27:35,322 --> 00:27:36,323
రూ.

267
00:27:37,241 --> 00:27:39,326
ఏం జరుగుతోందో ఏమో కానీ…

268
00:27:41,411 --> 00:27:42,829
నీకు కూడా బాధగానే ఉంది. అది నాకు తెలుస్తోంది.

269
00:27:42,913 --> 00:27:46,041
అదేంటో నాకూ అర్థమయ్యేలా చెప్పు.

270
00:27:53,632 --> 00:27:55,217
నువ్వు తన కోసం గాలించడం ఆపేయాలి.

271
00:28:00,055 --> 00:28:01,807
నీకు అది మాత్రమే చెప్పడానికి అనుమతి ఉంది నాకు.

272
00:28:04,726 --> 00:28:06,019
చెప్పు.

273
00:28:06,103 --> 00:28:08,605
నువ్వు గాలించడం ఆపేయడమే వాళ్లకి కావాలి.

274
00:28:11,733 --> 00:28:15,696
"వాళ్లు" అంటే ఎవరు? "వాళ్లు."

275
00:28:17,739 --> 00:28:19,283
"వాళ్లు. మేము."

276
00:28:19,366 --> 00:28:20,826
నేను ఆపకపోతే…

277
00:28:23,161 --> 00:28:24,621
వాళ్లేం చేస్తారంటావు?

278
00:28:31,712 --> 00:28:32,713
నాకు తెలీదు.

279
00:28:44,349 --> 00:28:46,810
ఇదంతా మంచికే అని మనం విశ్వసించాలి.

280
00:28:47,853 --> 00:28:51,940
ఇదంతా కూడా… మొత్తం కూడా మన లక్ష్యం కోసమే అని నమ్మాలి.

281
00:28:56,320 --> 00:28:57,321
షుగర్.

282
00:28:57,404 --> 00:28:59,948
వెళ్లి ఆస్పిరిన్ తీసుకురా, వేసుకుంటా.

283
00:29:01,909 --> 00:29:03,535
అలాగే. తప్పకుండా.

284
00:29:05,329 --> 00:29:06,955
ఇక్కడే ఉండాలనుకుంటా…

285
00:29:13,378 --> 00:29:15,088
పైన ఉంది అది.

286
00:29:16,423 --> 00:29:18,383
ఇప్పుడే వస్తా ఆగు, సరేనా?

287
00:29:40,781 --> 00:29:42,616
చాలా సేపు పట్టింది క్షమించు. నేను…

288
00:29:54,503 --> 00:29:56,046
ఆస్పిరిన్

289
00:29:56,630 --> 00:29:57,631
ఛ.

290
00:29:59,424 --> 00:30:00,884
నన్ను నువ్వు ప్రేమించడం లేదా?

291
00:30:03,095 --> 00:30:07,057
అదే చాలా కష్టమైన పని, కానీ అది తాత్కాలికమేలే.

292
00:30:07,140 --> 00:30:08,892
చాలా వరకు ఏవైనా సరే, కాలం గడిచే కొద్దీ మారిపోతాయి.

293
00:30:11,979 --> 00:30:12,980
హా.

294
00:30:14,815 --> 00:30:17,025
నా గుండె ముక్కలవ్వడం ఇదేమీ తొలిసారి కాదు.

295
00:30:18,944 --> 00:30:22,573
నేను గ్రహించి ఉండాల్సింది. సంకేతాలని పసిగట్టి ఉండాల్సింది.

296
00:30:24,616 --> 00:30:26,785
నీ పరిస్థితి అంత బాగా లేదు, గురూ.
నీకేదైనా తీసుకువస్తా ఆగు.

297
00:30:26,869 --> 00:30:28,370
వద్దు. ఏదేమైనా, థ్యాంక్స్.

298
00:30:29,246 --> 00:30:34,168
కానీ ఈ కేసుకు నేను బాగా కనెక్ట్ అయిపోయా.
వాళ్లు ఇలా జరుగుతుందని ముందే చెప్పారు కూడా.

299
00:30:39,256 --> 00:30:41,884
ఇప్పటికి చాలా ఆలస్యమైపోయింది. కేసు నాలో భాగమైపోయింది.

300
00:30:44,928 --> 00:30:46,346
వాళ్లు నా వెంట పడితే పడనీ.

301
00:30:48,599 --> 00:30:49,933
నేను మాత్రం తగ్గను.

302
00:30:54,354 --> 00:30:59,276
ఈరాత్రికి… బహుశా కాస్తంత విరామం తీసుకుంటే మంచిదే ఏమో.

303
00:31:04,448 --> 00:31:06,909
ఒక చిన్న విరామం.

304
00:31:09,244 --> 00:31:10,454
ఈ ఒక్క రాత్రికి,

305
00:31:11,997 --> 00:31:13,081
ఇంటిని స్మరించుకుంటా.

306
00:31:16,627 --> 00:31:17,836
ఇంటిని స్మరించుకుంటా.

307
00:32:58,228 --> 00:33:00,230
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

