1
00:02:10,380 --> 00:02:11,965
- సరే మరి.
- హా.

2
00:02:14,092 --> 00:02:15,093
అతడిని ఏమీ చేయవద్దు.

3
00:02:16,011 --> 00:02:17,221
ఒకవేళ అతను పారిపోవడానికి ప్రయత్నిస్తే?

4
00:02:17,221 --> 00:02:18,972
అతడిని ఏమీ చేయకుండా ఉండటానికే ప్రయత్నించు.

5
00:02:20,307 --> 00:02:21,266
తప్పకుండా.

6
00:02:30,359 --> 00:02:32,444
మోటల్
ఖాళీ లేదు

7
00:02:41,411 --> 00:02:44,957
జనాలు సమస్యల్లో ఉన్నప్పుడు, వాళ్లు దాని గురించి
మాట్లాడాలి. కానీ నీకు పాత సామెత ఒకటి తెలుసు కదా.

8
00:02:46,250 --> 00:02:47,334
విషయం తెలీనప్పుడు ఏ బాధా ఉండదు.

9
00:02:51,463 --> 00:02:52,714
- హేయ్.
- హేయ్.

10
00:02:53,882 --> 00:02:54,883
ఎలా ఉంది?

11
00:02:57,928 --> 00:03:01,640
ఎలా ఉంది అని అడుగుతున్నావా? మనిషినని అనిపిస్తోంది, కానీ...

12
00:03:03,892 --> 00:03:05,018
పర్వాలేదు.

13
00:03:05,018 --> 00:03:09,147
నువ్వు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని హెన్రీ చెప్పాడు.

14
00:03:09,731 --> 00:03:11,817
దానర్థం స్పృహ తప్పి నేల మీద
పడిపోవడం కాదు అనుకుంటా కదా.

15
00:03:11,817 --> 00:03:13,986
నేనేమీ స్పృహ తప్పి పడిపోలేదు.
నాకు నేల మీద పడుకోవడం ఇష్టం.

16
00:03:13,986 --> 00:03:15,404
తెలుస్తోందిలే.

17
00:03:17,948 --> 00:03:19,449
నిద్రలో నువ్వు కలవరించావు.

18
00:03:21,451 --> 00:03:22,870
ఎవరినో గట్టిగా పిలుస్తూ ఉన్నావు.

19
00:03:22,870 --> 00:03:25,497
వేరే భాషలా అనిపించింది.

20
00:03:28,125 --> 00:03:29,501
నీకు వేరే భాష కూడా వచ్చా?

21
00:03:30,085 --> 00:03:31,837
హా, నాకు చాలా భాషలు వచ్చు.

22
00:03:35,841 --> 00:03:36,842
సమయం ఎంత అయింది?

23
00:03:37,384 --> 00:03:38,468
పది గంటలు దాటింది.

24
00:03:39,178 --> 00:03:42,264
ఇక నేను స్నానం చేసి, పనులు మొదలుపెడతా.

25
00:03:42,264 --> 00:03:43,307
నేను వెళ్లి కాఫీ తెస్తా.

26
00:03:43,307 --> 00:03:44,808
- వద్దు, మెలనీ.
- షుగర్,

27
00:03:44,808 --> 00:03:47,686
ఈ చెత్త పంచాయితీ ఏంటి అని వివరించకుండానే,
అందులోకి నన్ను లాగగలవని

28
00:03:47,686 --> 00:03:51,190
నువ్వు నిజంగా, మనస్ఫూర్తిగా అనుకుంటున్నావా?

29
00:03:53,901 --> 00:03:54,860
అలా చేయలేనని తెలిసిపోతోంది.

30
00:03:55,652 --> 00:03:57,487
- వెళ్లి కాఫీ తెస్తా.
- సరే. కాఫీ.

31
00:04:01,825 --> 00:04:05,245
తనకి అంతా చెప్పేయాలని ఉంది,
కానీ చెప్పలేను. ఎప్పటికీ చెప్పలేను.

32
00:04:18,550 --> 00:04:19,551
డేవిడ్ సీగల్
1988 - 2023

33
00:04:19,551 --> 00:04:24,139
"నరులు వట్టి ఊపిరిని పోలియున్నారు,
వారి దినములు దాటిపోవు నీడవలె ఉన్నవి.

34
00:04:25,265 --> 00:04:26,850
వరదచేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా.

35
00:04:27,851 --> 00:04:32,606
వారు నిద్రింతురు.
ప్రొద్దున వారు పచ్చ గడ్డివలె చిగురింతురు.

36
00:04:34,525 --> 00:04:40,280
ప్రొద్దున అది మొలిచి చిగురించును,
సాయంకాలమున అది కోయబడి వాడబారును."

37
00:04:59,508 --> 00:05:00,843
కార్లోస్, ఒక నిమిషం మాకు ఏకాంతం ఇవ్వు.

38
00:05:05,472 --> 00:05:10,185
మీ అమ్మ చనిపోయినప్పుడు... నాకు చాలా కష్టంగా అనిపించింది.

39
00:05:11,645 --> 00:05:14,481
కానీ తన వయస్సు పైబడిందని,
భూమ్మీద తనకి కాలం చెల్లిందని అనుకొని...

40
00:05:16,400 --> 00:05:17,609
నాకు నేను సర్దిచెప్పుకున్నాను.

41
00:05:20,320 --> 00:05:21,321
కానీ ఇది?

42
00:05:25,409 --> 00:05:26,910
ఇది వేరు.

43
00:05:30,163 --> 00:05:34,042
తల్లిదండ్రులు బతికి ఉండగానే పిల్లలు పోవడం దారుణం.

44
00:05:38,213 --> 00:05:40,549
నా సానుభూతి తెలియజేస్తున్నాను.

45
00:05:51,602 --> 00:05:53,270
ఒలీవియా గురించి ఇంకా ఏమీ తెలీలేదు కదా?

46
00:05:53,770 --> 00:05:56,148
లేదు, తెలిసి ఉంటే నీకు చెప్పేవాడినే.

47
00:05:58,358 --> 00:06:01,195
గతంలో తను ఎంత బాధ్యతారహితంగా ఉన్నా కానీ,

48
00:06:01,195 --> 00:06:04,072
తను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కానీ,
ఇక్కడికైతే తప్పనిసరిగా వచ్చేది.

49
00:06:06,366 --> 00:06:08,202
తనకి ఏమైనా జరిగి ఉంటుందని అనిపిస్తోందా?

50
00:06:11,079 --> 00:06:13,123
హా, అవును.

51
00:06:17,294 --> 00:06:18,128
కార్లోస్.

52
00:06:21,089 --> 00:06:26,762
వాళ్లు బారులో కూర్చొని
నా జీవన బండి నడపడానికి డబ్బు ఇస్తున్నారు

53
00:06:26,762 --> 00:06:31,183
"బాసూ, నీకు ఇక్కడేం పని?" అని అంటున్నారు

54
00:06:48,867 --> 00:06:51,870
దరిద్రుడా, నన్ను తాకావంటే అయిపోతావు!

55
00:06:52,913 --> 00:06:54,831
తాకావంటే అయిపోతావు.

56
00:07:09,429 --> 00:07:10,681
మాస్ ఫోన్.

57
00:07:11,723 --> 00:07:13,100
మాకు తిరిగి కాల్ చేయ్
టచ్ లో ఉండు.

58
00:07:13,100 --> 00:07:14,935
వాడి కోసం ఎవరో వెతుకుతున్నారు.

59
00:07:30,409 --> 00:07:32,119
నేను నిన్ను చాలా అడగాలి.

60
00:07:34,121 --> 00:07:35,122
జెన్ ఎవరు?

61
00:07:35,789 --> 00:07:38,792
నీ కలవరింతల్లో నాకు ఆ జెన్ అనే
ఒక్క పదమే అర్థమైంది. ఎవరు ఆమె?

62
00:07:39,543 --> 00:07:40,836
తను నా చెల్లెలు.

63
00:07:40,836 --> 00:07:43,297
నీ చెల్లెలా? ఎక్కడ ఉంది తను? తనకి ఏమైనా...

64
00:07:43,297 --> 00:07:44,840
ఎవరో వస్తున్నారు.

65
00:07:57,269 --> 00:07:58,812
- మిల్లర్ వచ్చాడు.
- మిల్లర్ ఎవరు?

66
00:07:58,812 --> 00:08:00,022
నా బాస్.

67
00:08:00,022 --> 00:08:02,691
షుగర్, తలుపు తెరువు. నీతో మాట్లాడాలి.

68
00:08:02,691 --> 00:08:04,193
నిన్ను పొడిచింది అతనేనా?

69
00:08:05,152 --> 00:08:06,320
లేదు. ఇతను నా స్నేహితుడు.

70
00:08:06,320 --> 00:08:07,988
స్నేహితుడు అయితే, తలుపు ఎందుకు తెరవట్లేదు నువ్వు?

71
00:08:09,031 --> 00:08:10,240
నాకు తెరవాలని లేదు కాబట్టి.

72
00:08:11,325 --> 00:08:13,035
టవల్ ర్యాక్ తీసుకొని కొడదామా అతడిని?

73
00:08:13,035 --> 00:08:14,786
టవల్ ర్యాక్ తో అతడిని ఆపలేం.

74
00:08:28,258 --> 00:08:29,259
వెనుక పక్కకి వెళ్లి చూడండి.

75
00:08:55,953 --> 00:08:56,912
పద.

76
00:08:58,830 --> 00:08:59,998
హేయ్.

77
00:09:01,041 --> 00:09:04,211
కొట్టినందుకు సారీ. నీతో మాట్లాడాలనే వచ్చా.

78
00:09:08,173 --> 00:09:10,008
కారు తీసుకురా. ఇదుగో.

79
00:09:18,684 --> 00:09:20,352
మిల్లర్ ఎందుకు ఇలా చేస్తున్నాడు?

80
00:09:20,352 --> 00:09:23,438
ఏదో జరిగి ఉంటుంది. ఏదో మారి ఉంటుంది.

81
00:09:28,610 --> 00:09:29,528
పక్కకి ఆపు.

82
00:09:50,132 --> 00:09:52,301
ఓరి దేవుడా. ఇందాక ఏం జరిగిందో చెప్పవా?

83
00:09:53,927 --> 00:09:55,721
అతను ఒంటి చేత్తో నిన్ను ఎత్తేశాడు?

84
00:09:56,680 --> 00:09:58,432
నేను అతడిని కొట్టాను. కొట్టాల్సి వచ్చింది.

85
00:09:58,432 --> 00:10:00,350
- హా. అతనికి ఏమీ కాదు.
- అతనికి ఏమీ కాదు కదా?

86
00:10:00,350 --> 00:10:03,061
సరే మరి. అతను నీకు స్నేహితుడా?

87
00:10:05,022 --> 00:10:06,690
అతను నాకు చాలా కాలంగా తెలుసు.

88
00:10:06,690 --> 00:10:08,692
"నీతో మాట్లాడాలనే వచ్చా," అని అన్నాడు. ఎందుకలా అన్నాడు?

89
00:10:08,692 --> 00:10:10,277
దేని గురించి మాట్లాడాలట? ఏం చేశావు నువ్వు?

90
00:10:17,451 --> 00:10:18,452
ఇలా చూడు.

91
00:10:19,244 --> 00:10:20,662
చూడు, నేను...

92
00:10:22,039 --> 00:10:23,165
నేను వింటున్నా, చెప్పు.

93
00:10:23,165 --> 00:10:25,959
హా, కానీ... ఏంటంటే, అతని పేరు మిల్లర్.

94
00:10:25,959 --> 00:10:30,714
అతను, ఇంకా కొందరు, మేమందరం కలిసి పని చేస్తాం.

95
00:10:30,714 --> 00:10:32,883
అంటే? మీరందరూ ప్రైవేట్ డిటెక్టివ్సా?

96
00:10:32,883 --> 00:10:35,344
కాదు... అంటే... అది నా ఉద్యోగ వృత్తి మాత్రమే,

97
00:10:35,344 --> 00:10:38,138
ఒక్కొక్కరికీ ఒక్కో వృత్తి ఉంది.

98
00:10:42,392 --> 00:10:43,560
మాకు ఒక గ్రూప్ ఉంది.

99
00:10:44,394 --> 00:10:48,065
ఒక సంస్థలా అన్నమాట, దాని గురించి ఎవరికీ తెలీకూడదు.

100
00:10:50,108 --> 00:10:53,487
దాని గురించి నేను... నేను నీకు చెప్పలేను.

101
00:10:53,487 --> 00:10:56,490
నేను టవల్ బారుతో ఇందాకే ఒకడి నెత్తిని పగులగొట్టాను.

102
00:10:56,490 --> 00:10:58,408
- కాబట్టి నువ్వు చెప్పి తీరాలి.
- ఆ పని చేసినందుకు ధన్యవాదాలు.

103
00:10:58,408 --> 00:11:00,285
కానీ అది చాలా ప్రమాదకరం, అందుకే నేను నీకు చెప్పలేను.

104
00:11:01,495 --> 00:11:02,955
అది నీకు మాత్రమే ప్రమాదం కాదు,

105
00:11:02,955 --> 00:11:06,041
నాకు, నా స్నేహితులలో చాలా మందికి,
నా ఆత్మీయులకి కూడా ప్రమాదకరం.

106
00:11:07,709 --> 00:11:10,170
ఆ రహస్యాన్ని నేను చాలా కాలంగా దాచి ఉంచాను.

107
00:11:12,548 --> 00:11:13,715
మేమందరమూ కూడా.

108
00:11:17,094 --> 00:11:19,137
నేను దాన్ని ఎప్పుడూ ఎవరికీ చెప్పాలనుకోలేదు,

109
00:11:20,347 --> 00:11:24,226
నీకు చెప్పాలని చాలా ఉంది, కానీ... నేను చెప్పలేను.

110
00:11:31,650 --> 00:11:32,484
నువ్వు గూఢచారివి.

111
00:11:34,152 --> 00:11:35,362
నీకు చాలా భాషలు తెలుసు.

112
00:11:35,362 --> 00:11:36,822
ఎప్పుడూ గమనిస్తూ, ఆలకిస్తూ ఉంటావు.

113
00:11:36,822 --> 00:11:39,700
నీ కన్నా... నీ గురించి చెప్పుకోవడం కన్నా
ఇతరుల విషయాల్లోనే ఆసక్తి చూపేవాడివి.

114
00:11:39,700 --> 00:11:42,870
బాబోయ్, నేను ముందే గ్రహించి ఉండాల్సింది.

115
00:11:42,870 --> 00:11:45,038
కన్యా రాశి వాళ్లకి అది ఎక్కువే అయినా,
దాని గురించి ఓసారి ఆలోచించి ఉండాల్సింది.

116
00:11:45,038 --> 00:11:47,124
నిన్ను నేను ప్రశ్నలు అడగడానికి ఏకైక కారణం ఏంటంటే,

117
00:11:47,124 --> 00:11:49,126
ఆ సమాధానాలను నా అవసరాల కోసం
నేను తెలుసుకోవాలనుకున్నా, అంతే.

118
00:11:49,710 --> 00:11:51,003
నువ్వు గూఢచారివి.

119
00:11:52,379 --> 00:11:55,424
అందుకే కదా ఈ పంచాయితీ అంతా? నువ్వు విదేశీ గూఢచారివి.

120
00:12:00,429 --> 00:12:01,763
మేము ఇక్కడికి గమనించడానికే వచ్చాం.

121
00:12:03,724 --> 00:12:05,142
అయ్య బాబోయ్.

122
00:12:05,893 --> 00:12:07,519
అదే మా లక్ష్యం. మా ఏకైక లక్ష్యం అదే.

123
00:12:07,519 --> 00:12:09,313
దేవుడా. ఒక సిగరెట్ తాగాలనిపిస్తోంది నాకు.

124
00:12:12,065 --> 00:12:13,233
- మరి థోర్ప్ సంగతేంటి?
- అతనికి ఏమైంది?

125
00:12:13,233 --> 00:12:14,568
అతను కూడా మీవాడే కదా?

126
00:12:15,360 --> 00:12:16,403
అవును.

127
00:12:16,403 --> 00:12:18,655
- కానీ అతను నీ వెంట పడటం లేదు. నీకు సాయపడుతున్నాడా?
- అయ్యయ్యో.

128
00:12:18,655 --> 00:12:19,740
ఏమైంది?

129
00:12:19,740 --> 00:12:21,283
హెన్రీ. తర్వాత వాళ్లు అతని దగ్గరికే వెళ్తారు.

130
00:12:21,283 --> 00:12:22,951
మనం బయలుదేరాలి. మనం విశ్వవిద్యాలయానికి వెళ్లాలి.

131
00:12:23,869 --> 00:12:28,373
కాబట్టి అవును, ఆ లార్సెన్ గురించి కూడా
మనం కొంత చర్చించుకుంటాం.

132
00:12:28,373 --> 00:12:31,210
మనం చివరిసారిగా కలిసినప్పుడు,
పేలియోలితిక్ కాలం ఆఖరి రోజుల గురించి చర్చించుకున్నాం.

133
00:12:32,586 --> 00:12:35,839
తర్వాత మెసోలితిక్ కాలం గురించి చర్చిస్తాం.

134
00:12:37,049 --> 00:12:41,929
ఇక సుమారుగా 30,000 ఏళ్ల క్రితం
నియాండెర్తల్స్, హోమో సేపియన్స్,

135
00:12:41,929 --> 00:12:44,181
ఇంకా జాతి పరిణామం చెందడం ప్రారంభమైంది.

136
00:12:44,181 --> 00:12:45,390
ఎత్తు, హెన్రీ.

137
00:12:47,601 --> 00:12:48,602
అతను ఫోన్ ఎత్తడం లేదు.

138
00:12:49,603 --> 00:12:51,855
సంక్లిష్టత, విభిన్నత.

139
00:12:51,855 --> 00:12:55,359
వివిధ రకాల విరుద్ధ భావాలను, ఆలోచనలను ఒకే సమయంలో

140
00:12:55,359 --> 00:12:58,403
మెదడులో ఉంచుకోగల సామర్థ్యం.

141
00:12:59,696 --> 00:13:04,201
దాని వల్లనే మీరు ఇంకా
ఇక్కడ ఉన్నారు, మీ పూర్వీకులు లేరు.

142
00:13:07,913 --> 00:13:08,997
మీకు ఏం కావాలి?

143
00:13:08,997 --> 00:13:12,125
నేను ఒక స్నేహితుని కోసం వచ్చాను.
ఆయన ఆంథ్రపాలజీ ప్రొఫెసర్, హెన్రీ థోర్ప్.

144
00:13:12,125 --> 00:13:13,627
ఈరోజు ఆయన కోసం చాలా మంది వచ్చారు.

145
00:13:13,627 --> 00:13:15,087
ఎందుకలా అన్నారు?

146
00:13:37,359 --> 00:13:38,485
ఇప్పుడే ఎటైనా వెళ్లిపోయాడేమో?

147
00:13:38,485 --> 00:13:40,153
అబ్బా. మిల్లర్ తీసుకొని వెళ్లుంటాడు.

148
00:13:52,457 --> 00:13:53,458
ఒక గంటలో అక్కడ ఉంటా.

149
00:13:53,458 --> 00:13:55,127
ఎవరో తమ పనులను కప్పిపుచ్చే పనిలో ఉన్నారు.

150
00:13:56,378 --> 00:13:59,173
స్టాలింగ్స్ తో సంబంధం ఉన్నవాళ్లందరి నోర్లూ మూయిస్తున్నారు.

151
00:13:59,173 --> 00:14:00,465
ఇప్పుడు ఏంటి?

152
00:14:01,091 --> 00:14:05,053
మాస్ దగ్గరికి వాళ్ల కన్నా ముందే
నేను చేరుకోవాలి. హెన్రీ సంగతి తర్వాత చూస్తా.

153
00:14:05,846 --> 00:14:06,889
సరే, పద.

154
00:14:18,400 --> 00:14:20,152
నేను నీకు ఒకటి చెప్తాను, దానితో నీకు చాలా కోపం వస్తుంది.

155
00:14:20,152 --> 00:14:21,695
కానీ నాకు కూడా కోపంగానే ఉందని తెలుసుకో.

156
00:14:21,695 --> 00:14:23,030
ఏంటి?

157
00:14:23,030 --> 00:14:25,616
నా వాళ్లు... అంటే మిల్లర్, ఇంకా ఇంకొందరు...

158
00:14:27,409 --> 00:14:29,453
వీళ్లందరూ ఒలీవియా ఆచూకీ
కనుగొనే నా పనికి అడ్డుపడుతున్నారు.

159
00:14:30,621 --> 00:14:32,915
ఒక్క నిమిషం. ఒలీవియాని అపహరించింది మీవాళ్లేనా?

160
00:14:32,915 --> 00:14:34,666
కాదు. కాదు. కానే కాదు. వాళ్లు...

161
00:14:34,666 --> 00:14:35,876
వాళ్లు తననేం చేశారు?

162
00:14:35,876 --> 00:14:37,628
- ఏమీ చేయలేదు.
- దేవుడా.

163
00:14:37,628 --> 00:14:40,506
మేము జనాలకు హాని తలపెట్టం. మేము
అలాంటి వాళ్లం కాదు. సరేనా? ప్రమాణపూర్తిగా చెప్తున్నా.

164
00:14:41,507 --> 00:14:43,759
- దీన్ని నేను సరి చేస్తా.
- ఓరి దేవుడా.

165
00:15:14,164 --> 00:15:15,541
తను ఈ ఇంట్లో ఉందంటావా?

166
00:15:15,541 --> 00:15:17,960
లేదు, ఇది స్టాలింగ్స్ మనుషుల్లో ఒకడి ఇల్లు.

167
00:15:18,585 --> 00:15:20,671
అతను ఇక్కడే ఉంటాడు, మనకి
కావాల్సిన కొన్ని విషయాలు ఇతనికి తెలిసి ఉండవచ్చు.

168
00:15:24,007 --> 00:15:25,175
నువ్వు ఇక్కడే ఉండు. సరేనా?

169
00:15:26,552 --> 00:15:28,011
పర్వాలేదులే, నాకు ఎలాగూ లోపలికి రావాలని లేదు.

170
00:15:28,011 --> 00:15:29,429
సరే.

171
00:16:06,049 --> 00:16:07,050
ఏం చేస్తున్నావు?

172
00:16:07,050 --> 00:16:09,511
మనస్సు మార్చుకొని, నీతో వస్తున్నా.

173
00:16:11,555 --> 00:16:12,890
- నా పక్కనే ఉండు.
- సరే.

174
00:16:53,639 --> 00:16:54,640
షుగర్.

175
00:17:03,524 --> 00:17:05,733
సరే. వెళ్దాం పద. రా.

176
00:17:14,785 --> 00:17:16,244
పరిస్థితులు అదుపు తప్పాయి.

177
00:17:16,869 --> 00:17:20,165
కాస్త నిదానించాల్సిన, శాంతించాల్సిన సమయం ఆసన్నమైందేమో.

178
00:17:21,208 --> 00:17:23,669
"ప్రశాంతంగా ఉంటే పైచేయి సాధించవచ్చు" లాగా అన్నమాట.

179
00:17:23,669 --> 00:17:26,003
సహజంగా నేను ప్రతిభావంతుడిని అని చాలా మంది అంటుంటారు.

180
00:17:26,713 --> 00:17:28,464
కానీ నేను పరిస్థితులను ఏ మాత్రం అంచనా వేయలేను.

181
00:17:29,466 --> 00:17:31,927
హా. ఇలా కూడా పని చేయవచ్చు.

182
00:17:37,599 --> 00:17:39,518
క్లింటన్ వచ్చి, నిన్ను వేరే గదికి మారుస్తాడు,

183
00:17:39,518 --> 00:17:41,478
ఎందుకైనా మంచిదనిలే. నేను వచ్చేస్తాను ఇంకో...

184
00:17:42,896 --> 00:17:44,523
ఎంత సేపు పడుతుందో తెలీదు. కానీ వచ్చేస్తా.

185
00:17:45,023 --> 00:17:46,149
- సరే.
- హా.

186
00:17:49,069 --> 00:17:50,904
హేయ్. నువ్వు బాగానే ఉన్నావా?

187
00:17:52,739 --> 00:17:54,032
నేను వస్తే ఒలీవియాతోనే వస్తా, లేకపోతే రాను.

188
00:17:56,869 --> 00:17:57,703
మంచిది.

189
00:18:20,726 --> 00:18:21,727
తేల్చుకోవాల్సిన సమయం ఇది.

190
00:18:23,770 --> 00:18:25,522
ఈరాత్రి నాకు సమాధానాలు లభించాల్సిందే.

191
00:18:28,108 --> 00:18:29,484
అది ఎలాగైనా కానీ.

192
00:18:43,832 --> 00:18:47,002
మిల్లర్

193
00:19:10,817 --> 00:19:12,694
నేను తనకి చెప్పింది నిజమే.

194
00:19:12,694 --> 00:19:13,904
మేము ఇలాంటి వాళ్లం కాదు.

195
00:19:14,738 --> 00:19:16,823
అపహరణలు. హత్యలు.

196
00:19:18,534 --> 00:19:20,577
మాస్ వెధవనా, కాదా అన్నదానితో సంబంధం లేదు.

197
00:19:21,954 --> 00:19:24,039
మేము జనాలకు హాని తలపెట్టకూడదు.

198
00:19:26,250 --> 00:19:30,379
మేము ఇక్కడికి రావడానికి గల ఏకైక కారణం ఏంటంటే,
మా శాంతియుత జీవనాన్ని పరిరక్షించుకోవడం.

199
00:19:32,840 --> 00:19:34,341
కానీ ఈ చోటు మమ్మల్ని మార్చేస్తోంది.

200
00:19:36,093 --> 00:19:37,177
మా అందరినీ మార్చేస్తోంది.

201
00:20:38,488 --> 00:20:39,656
ఏం జరుగుతోంది?

202
00:20:44,828 --> 00:20:45,662
మన పని పూర్తి అయిపోయింది.

203
00:20:47,789 --> 00:20:48,999
వెనక్కి వచ్చేయమని మనకి పిలుపు వచ్చింది.

204
00:20:50,125 --> 00:20:51,460
ఏంటి?

205
00:20:51,460 --> 00:20:53,337
- అవును.
- హెన్రీ.

206
00:20:54,213 --> 00:20:57,049
నాకేమీ కాలేదు. నాకు... నువ్వు తన మాట విను.

207
00:20:57,049 --> 00:20:59,092
ఒక్క నిమిషం ఆగండి. ఏంటి?

208
00:20:59,885 --> 00:21:01,512
మన నివాసం నుండి ఈ ఉదయం ఒక వర్తమానం వచ్చింది.

209
00:21:01,512 --> 00:21:02,930
అది మాట్లాడాలనే మిల్లర్ నీ దగ్గరికి వచ్చాడు.

210
00:21:02,930 --> 00:21:03,889
అందుకే మేము ఇక్కడికి వచ్చాం.

211
00:21:03,889 --> 00:21:05,933
- ఎలా వెళ్లిపోవాలి అని ప్లాన్స్ ని చర్చిస్తున్నాం.
- మన పని పూర్తి కాలేదు.

212
00:21:05,933 --> 00:21:07,184
పూర్తి అయింది.

213
00:21:07,684 --> 00:21:11,438
ఒకటి, రెండు రోజులలో, నీతో పాటు ఈ గదిలో ఉన్న వాళ్లందరూ

214
00:21:11,438 --> 00:21:13,232
మన సహచరులందరూ, ఈ గ్రహం నుండి బయలుదేరిపోతారు.

215
00:21:13,232 --> 00:21:14,942
- అలా అని ఎవరు ఉన్నారు?
- మన నివాసంలో ఉన్నవారు.

216
00:21:15,817 --> 00:21:17,945
ఇప్పుడు నువ్వు ఎలా వెళ్లిపోవాలి
అనేదాని గురించి మిల్లర్ తో మాట్లాడు.

217
00:21:17,945 --> 00:21:20,197
లేదు, లేదు. బాగానే ప్రయత్నించావు కానీ,
తనని కనిపెట్టే దాకా నేను రాను.

218
00:21:20,864 --> 00:21:22,115
నువ్వు వెళ్లాల్సిందే.

219
00:21:24,660 --> 00:21:25,786
తనని కనిపెట్టాకే నేను వస్తా.

220
00:21:27,204 --> 00:21:28,205
ఒలీవియా సీగల్.

221
00:21:29,331 --> 00:21:32,459
నేను గాలిస్తున్న మహిళ తను.

222
00:21:34,169 --> 00:21:36,755
ఆ మహిళ ఆచూకీని నేను కనిపెట్టడం
ఈ గదిలో ఉన్న కొందరికి, ఎందుకో కానీ ఇష్టం లేదు,

223
00:21:36,755 --> 00:21:38,674
అది మాత్రం నేను పక్కాగా చెప్పగలను.

224
00:21:39,258 --> 00:21:40,259
ఇప్పుడు ఇలా అంటారా?

225
00:21:40,259 --> 00:21:42,344
ఇంత కాలం తర్వాత, ఉన్నట్టుండి,
ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా

226
00:21:42,344 --> 00:21:44,054
వచ్చేయమంటే అన్నీ సర్దేసుకొని వెళ్లిపోవాలా? అది జరగని పని!

227
00:21:44,054 --> 00:21:46,348
మన లక్ష్యం ఒలీవియా సీగల్ కాదు, షుగర్.

228
00:21:47,182 --> 00:21:48,976
నువ్వు లోక కళ్యాణం గురించి ఆలోచించడం లేదు.

229
00:21:48,976 --> 00:21:50,310
తను ఎక్కడ ఉంది?

230
00:21:50,310 --> 00:21:52,855
- జాన్.
- లేదు, ఆగు. ఇక తప్పించుకోవడాలు, అబద్ధాలు వద్దు.

231
00:21:52,855 --> 00:21:55,148
- జాన్.
- ఆగు, హెన్రీ! దయచేసి ఆగు.

232
00:21:58,610 --> 00:22:00,946
మర్యాదగా అడుగుతున్నా, తను ఎక్కడ ఉందో చెప్పండి.

233
00:22:00,946 --> 00:22:02,614
ఇక్కడున్న వారిలో ఆ విషయం
కొందరికి తెలుసని నాకు తెలుసు.

234
00:22:02,614 --> 00:22:04,116
అది నిజమే. నేను చెప్తాను.

235
00:22:04,116 --> 00:22:06,285
వద్దు. ఆ పని చేయకు, హెన్రీ.

236
00:22:06,285 --> 00:22:08,745
నువ్వే గెలిచావు. ఎలాగూ అందరం
వెళ్లిపోతున్నాం కదా. చెప్పేయడం వల్ల పోయేదేముంది?

237
00:22:08,745 --> 00:22:10,414
నేను చెప్తాను. రా.

238
00:22:16,170 --> 00:22:17,504
ఇదంతా నాకు ఈరోజే తెలిసింది. నేను...

239
00:22:17,504 --> 00:22:20,507
- నీకు తను ఎక్కడుందో తెలుసా? చెప్పు.
- నాకు ఒక చిరునామా ఇచ్చారు. హా.

240
00:22:20,507 --> 00:22:21,675
సరే. ఆ చిరునామా చూపించు.

241
00:22:22,634 --> 00:22:23,844
సరే. రాసి ఇస్తా ఆగు.

242
00:22:24,720 --> 00:22:27,973
చిరునామా. ఇంత జరిగాక ఒక చిరునామా దొరికింది, నేను...

243
00:22:37,274 --> 00:22:38,901
నాకు తెలిసింది నీకు చెప్తాను, సరేనా?

244
00:22:40,777 --> 00:22:42,112
అలాగే.

245
00:22:42,112 --> 00:22:44,656
సరే. విషయం ఏంటంటే...

246
00:22:44,656 --> 00:22:48,035
వాళ్లకి మన గురించి తెలిసిపోయింది... మనుషులకి.

247
00:22:48,035 --> 00:22:49,912
అవును. కొందరికి తెలిసిపోయింది.

248
00:22:55,417 --> 00:22:56,919
ఈ చిరునామాలో ఉండే వాళ్లనే మనం కాపాడేది?

249
00:23:01,173 --> 00:23:02,257
వీళ్లు చాలా శక్తివంతులు.

250
00:23:02,257 --> 00:23:03,300
తెలిసిపోతోందిలే.

251
00:23:03,926 --> 00:23:05,010
కాబట్టి వాళ్ల తప్పులని మనం చూడట్లేదా?

252
00:23:05,010 --> 00:23:06,970
ఏమీ చేయకుండా, ఇలాంటి నీచపు పనిని
చూసీ చూడనట్టుగా వదిలేస్తున్నామా?

253
00:23:06,970 --> 00:23:08,263
మన వాళ్లని కాపాడుకోవడానికి తప్పట్లేదు.

254
00:23:09,139 --> 00:23:11,642
వాళ్లే తలుచుకుంటే, ఏ సమయంలోనైనా మనల్ని చంపేయగలరు.

255
00:23:11,642 --> 00:23:13,060
ఇక ఇప్పుడు మన పని ముగిసింది.

256
00:23:13,060 --> 00:23:14,478
- అవును.
- ఇప్పుడు నాకు అన్నీ చెప్పవచ్చు.

257
00:23:14,478 --> 00:23:15,979
ఒలీవియాకి ఏం జరిగి ఉన్నా కానీ.

258
00:23:15,979 --> 00:23:17,648
తను ఎంత అనుభవించి ఉన్నా కానీ.

259
00:23:20,859 --> 00:23:22,027
ఈ... ఈ ఇంట్లో ఉండేది...

260
00:23:23,028 --> 00:23:24,655
ఒక పలుకుబడి ఉన్న రాజకీయవేత్త కొడుకు.

261
00:23:24,655 --> 00:23:26,323
ఈ పనికిమాలినోడు, స్టాలింగ్స్ క్లయింటా?

262
00:23:27,032 --> 00:23:28,158
- అవును.
- అసలు ఎలా జరిగింది?

263
00:23:28,158 --> 00:23:30,702
ఎలా మన... వాళ్లకి మన గురించి ఎలా తెలిసింది?

264
00:23:30,702 --> 00:23:33,372
ఆ విషయం నాకు తెలీదు.
ఏదేమైనా, ఇప్పుడు అది ముఖ్యం కాదు కదా?

265
00:23:33,372 --> 00:23:34,873
అది ముఖ్యమే.

266
00:23:36,542 --> 00:23:39,753
అన్నింటికన్నా ముఖ్యం అది.
మనం ఇలాంటి నీచపు పనులు చేయం, హెన్రీ.

267
00:23:39,753 --> 00:23:43,674
కోపం నీ ఒక్కడికే వస్తోందని అనుకోకు.
ఈ విషయంలో ఎవరూ ఆనందంగా లేరు.

268
00:23:43,674 --> 00:23:46,969
ఆనందమా? ఒలీవియాకి ఇది ఆనందపడే విషయమా?

269
00:23:47,678 --> 00:23:49,471
ఇలా అస్సలు జరిగి ఉండాల్సింది కాదు, హెన్రీ!

270
00:23:53,183 --> 00:23:55,769
నిజమే. కానీ జరిగిపోయింది.

271
00:24:00,691 --> 00:24:04,111
ఇప్పుడు మనం వెళ్లిపోతున్నాం.
కాబట్టి దీన్ని సరిచేసేందుకు ప్రయత్నించు.

272
00:24:06,321 --> 00:24:08,448
ఎందుకంటే, ఒకవేళ
తను బతికే ఉంటే, ఆ చిరునామాలోనే ఉంటుంది.

273
00:24:16,331 --> 00:24:21,962
ఆగు. స్టాలింగ్స్ ఇంట్లో ఏం జరిగిందో నాకు చెప్పారు.

274
00:24:23,338 --> 00:24:26,049
నువ్వు ముగ్గురిని చంపావని అన్నారు.

275
00:24:27,885 --> 00:24:29,970
- అది నిజమేనా?
- అది నా ఆత్మరక్షణలో భాగంగా జరిగింది.

276
00:24:29,970 --> 00:24:31,054
అయితే నీకు వాళ్లని చంపక తప్పలేదా?

277
00:24:43,358 --> 00:24:44,860
మొదటి ఇద్దరి విషయంలో, తప్పలేదు.

278
00:24:46,486 --> 00:24:47,905
ఒక మగాడిని, ఒక మహిళని.

279
00:24:50,282 --> 00:24:51,533
నన్ను నేను కాపాడుకుందామని చేసిన పని అది.

280
00:24:55,329 --> 00:24:56,496
కానీ మూడవ హత్య, అది...

281
00:24:58,665 --> 00:24:59,750
అది నేను కాపాడుకుందామని చేసింది కాదు.

282
00:25:02,127 --> 00:25:04,129
నా మనస్సంతా ఆలోచనలతో నిండిపోయి ఉంది అన్నమాట.

283
00:25:05,631 --> 00:25:08,133
"నేను ప్రమాదంలో ఉన్నాను."
"వాడు మంచివాడు కాదు." "ఒకవేళ వాడు ఏమైనా"...

284
00:25:09,968 --> 00:25:10,802
"బహుశా అదే న్యాయమైనది ఏమో.

285
00:25:12,012 --> 00:25:15,474
కనీసం సహేతుకమైనది ఏమో."

286
00:25:20,312 --> 00:25:21,980
కానీ సరిగ్గా నేను...

287
00:25:23,440 --> 00:25:25,150
నేను ట్రిగ్గర్ నొక్కే ముందు...

288
00:25:27,194 --> 00:25:30,280
ఆ ఆలోచనలన్నీ మాయమైపోయి, మనస్సంతా ప్రశాంతత కమ్మేసింది.

289
00:25:32,699 --> 00:25:33,534
ఇక...

290
00:25:37,371 --> 00:25:38,664
అతడిని కావాలనే చంపాను.

291
00:25:49,550 --> 00:25:50,759
అది పిచ్చిపనని తెలుసు.

292
00:25:55,222 --> 00:26:01,019
మనం ఇక్కడ ఎంత ఎక్కువ కాలం ఉంటే,
అంత ఎక్కువగా మనుషుల్లా అయిపోతామేమో.

293
00:26:03,897 --> 00:26:05,023
నేను ఇక బయలుదేరుతా.

294
00:26:05,023 --> 00:26:09,695
నీ పనిలో భాగంగా... నువ్వు ఇక్కడ గడిపిన సమయంలో...
మహా అయితే 25-30 మంది ఆచూకీ కనిపెట్టి ఉంటావు,

295
00:26:10,487 --> 00:26:12,406
అంతే కదా? ఆ సంఖ్య ఇంకా ఎక్కువ కూడా అయ్యుండవచ్చు.

296
00:26:13,615 --> 00:26:16,910
నువ్వు... నువ్వు ఇక్కడ ఉన్నంత కాలమూ
తప్పిపోయిన వారి కోసం గాలిస్తూనే గడిపావు.

297
00:26:19,329 --> 00:26:22,958
ఇవాళ ఒలీవియాని కూడా నువ్వు కనుగొనాలనే కోరుకుంటున్నా.

298
00:26:26,587 --> 00:26:31,758
కానీ నీ చెల్లెలు లేనంత కాలమూ,
నువ్వు ఇలాగే నైరాశ్యంతో ఉంటావు.

299
00:26:52,738 --> 00:26:54,907
అయితే, ఒలీవియా కనిపించకుండా పోవడం వెనుక

300
00:26:54,907 --> 00:26:56,950
బాగా పలుకుబడి, హోదా ఉన్న వ్యక్తులు ఉన్నారు అన్నమాట.

301
00:27:02,623 --> 00:27:03,624
నాకు అంతా ఇప్పుడు అర్థమవుతోంది.

302
00:27:04,791 --> 00:27:07,252
మా గుట్టు బయటపెడతామని వాళ్లు బెదిరిస్తున్నారు.

303
00:27:09,087 --> 00:27:13,217
"ఈ కేసు నుండి షుగర్ ని తప్పుకోమని చెప్పండి,
లేదా మీ రహస్యాన్ని లోకానికి బట్టబయలు చేస్తాము.

304
00:27:14,259 --> 00:27:17,763
'గ్రహాంతరవాసులు మన మధ్యే తిరుగుతున్నారు'
అనే వార్త, ప్రధాన శీర్షికలో పడుతుంది."

305
00:27:20,307 --> 00:27:21,350
అది మంచి విషయం కాదు.

306
00:27:23,268 --> 00:27:25,103
నాకు అది నచ్చలేదు, కానీ అర్థం చేసుకున్నా.

307
00:27:30,776 --> 00:27:35,781
హెన్రీ చెప్పింది నిజమే. మేము ఇక్కడ
చాలా కాలం ఉన్నాం. ఇక మేము మా స్వగ్రహానికి వెళ్లాలి.

308
00:27:53,841 --> 00:27:55,342
{\an8}పావిచ్ కి ఓటు వేయండి - యుఎస్ సెనేట్
"మీ పక్షాన ఉన్న నేత"

309
00:28:20,492 --> 00:28:22,619
{\an8}పావిచ్
యు.ఎస్ సెనేట్

310
00:29:10,167 --> 00:29:13,253
- కదలవద్దు! సెక్యూరిటీ. చేతులు పైకెత్తండి.
- ఎత్తాను.

311
00:29:14,838 --> 00:29:15,964
చూడండి. నేను చేతులు పైకెత్తే ఉన్నా.

312
00:29:15,964 --> 00:29:17,090
ఆయుధాన్ని కింద పడేయండి.

313
00:29:17,090 --> 00:29:18,842
- సరే. కాస్త శాంతించండి...
- తుపాకీని కింద పెట్టండి.

314
00:29:18,842 --> 00:29:20,469
సరే. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈ తుపాకీని కింద పెడతా...

315
00:29:20,469 --> 00:29:21,595
"కదలవద్దు" అన్నా!

316
00:29:22,638 --> 00:29:24,598
నా మాట వినండి. మనం ఇక్కడి నుండి వెళ్లిపోకూడదు.

317
00:29:24,598 --> 00:29:26,934
నేను ప్రైవేట్ డిటెక్టివ్ ని. ఒక తప్పిపోయిన
మహిళ ఆచూకీని కనుగొనే పనిలో ఉన్నాను.

318
00:29:26,934 --> 00:29:28,852
దొంగతనంగా ఇళ్లల్లోకి చొరబడటానికి
ఇలాంటి సాకులు నేను లక్ష విన్నా.

319
00:29:28,852 --> 00:29:30,479
డ్రగ్స్ తీసుకున్న వాడిలా కనిపిస్తున్నానా? చెప్పేది వినండి.

320
00:29:30,479 --> 00:29:33,106
నా పర్సులో నా డిటెక్టివ్ లైసెన్స్, నా డ్రైవింగ్ లైసెన్స్

321
00:29:33,106 --> 00:29:34,608
నా గుర్తింపు కార్డ్ అన్నీ ఉన్నాయి.

322
00:29:34,608 --> 00:29:36,860
- కోటులోని కుడి వైపు జేబులో ఉంది. లోపల ఉంది. హా.
- కుడి వైపు జేబులోనా?

323
00:29:37,778 --> 00:29:40,489
-"జాన్ షుగర్." అది మీ అసలైన పేరేనా?
- నా అసలైన... అవును, సర్.

324
00:29:40,489 --> 00:29:42,324
- అక్కడ ఉన్న నీలం కారు మీదేనా?
- అవును, సర్.

325
00:29:42,324 --> 00:29:44,535
చూడండి, నేను తప్పు ఇంటికే వచ్చుండవచ్చు.
బహుశా నేను పొరబడే ఉండవచ్చు.

326
00:29:44,535 --> 00:29:46,495
కానీ ఏదోకరోజు ఈ ఇంట్లో ఒక మహిళ చిత్రహింసలకు గురైందని,

327
00:29:46,495 --> 00:29:47,663
నరకం చూసిందని మీరు విన్నప్పుడు,

328
00:29:47,663 --> 00:29:49,957
కనీసం ఒక్క నిమిషం వెచ్చించి
తనని కాపాడే ప్రయత్నమే చేయలేదని...

329
00:29:49,957 --> 00:29:52,125
అసలు తనిఖీ చేయకుండానే
వెళ్లిపోయారని మీరు గ్రహించినప్పుడు...

330
00:29:52,125 --> 00:29:53,836
మీరు చాలా బాధపడిపోతారు. ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది.

331
00:29:53,836 --> 00:29:55,128
కాబట్టి ఇప్పుడే ఆ పని చేయండి.

332
00:29:55,128 --> 00:29:57,130
"టైమ్ ట్రావెల్ చేసి వెళ్లగలిగితే బాగుండు,"
అనుకొని బాధపడనక్కర్లేదు.

333
00:30:00,008 --> 00:30:01,009
కదలకుండా ఇక్కడే ఉండు.

334
00:30:05,681 --> 00:30:06,890
{\an8}నేను వెళ్లి బేస్మెంటులో చూసొస్తా.

335
00:30:10,269 --> 00:30:11,270
{\an8}హలో?

336
00:30:13,772 --> 00:30:15,107
{\an8}కింద ఎవరైనా ఉన్నారా?

337
00:30:19,194 --> 00:30:20,654
కింద ఎవరైనా ఉన్నారా?

338
00:30:24,157 --> 00:30:28,120
- హా, సెనేటర్ కొడుకు.
- హలో?

339
00:30:30,789 --> 00:30:31,748
అర్థమైంది.

340
00:30:31,748 --> 00:30:32,833
హేయ్.

341
00:30:37,880 --> 00:30:38,881
హేయ్.

342
00:30:43,844 --> 00:30:46,513
ఏమన్నా దొరికిందా?

343
00:30:46,513 --> 00:30:51,143
ఏమీ దొరకలేదు. ఒక సుత్తి తప్ప.

344
00:30:52,936 --> 00:30:54,855
కానీ ఎవరైనా సుత్తిని బేస్మెంటులోనే కదా పెట్టుకొనేది.

345
00:30:55,355 --> 00:30:56,940
మీరు అంతా జాగ్రత్తగా వెతికారా?

346
00:30:58,400 --> 00:30:59,401
అంతా వెతికా.

347
00:31:00,903 --> 00:31:02,237
అయితే పొరబడ్డాను అన్నమాట.

348
00:31:04,656 --> 00:31:05,866
అది నిజమే.

349
00:31:06,450 --> 00:31:07,534
మరి ఇప్పుడు ఏం చేస్తారు?

350
00:31:16,752 --> 00:31:18,378
ఇక్కడ ఒకరిని బంధించి ఉంచారని మీకెవరు చెప్పారు?

351
00:31:21,548 --> 00:31:25,135
ఒక స్నేహితుడు. తప్పు సమాచారం అందింది.

352
00:31:26,303 --> 00:31:29,306
ఇలా అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది.
కానీ నాకు కాస్త అదోలా ఉంది.

353
00:31:29,306 --> 00:31:30,599
స్నేహితుడు అంటే ఎవరు?

354
00:31:31,558 --> 00:31:33,810
అంటే... ఆ విషయం మీకు చెప్పలేను.

355
00:31:35,854 --> 00:31:38,649
వాళ్ల గురించి గోప్యంగా ఉంచాలి...
నా వృత్తిలో అది చాలా కీలకం కదా.

356
00:31:50,536 --> 00:31:52,371
నా బేస్మెంటులో ఒకరు ఉన్నారని నీకెవరు చెప్పారు?

357
00:31:56,250 --> 00:31:58,085
నేను అలారాలను ట్రిప్ చేయలేదు కదా.

358
00:31:59,461 --> 00:32:00,462
- మీ పని సూపర్ గా చేశారు.
- అవునా?

359
00:32:00,462 --> 00:32:01,797
నేను అప్పుడే ఆఫీసు నుండి వస్తున్నా.

360
00:32:06,134 --> 00:32:06,969
అదృష్టవంతుడిని.

361
00:32:08,262 --> 00:32:09,263
కానీ నువ్వు దురదృష్టవంతుడివి.

362
00:32:10,097 --> 00:32:13,767
హేయ్, ఇది ఇలా జరగాల్సిన పని లేదు.

363
00:32:16,061 --> 00:32:17,813
అంటే, ఎవరికీ ఏమీ అవ్వాల్సిన పని లేదు.

364
00:32:19,314 --> 00:32:20,315
నీతో సహా.

365
00:32:21,191 --> 00:32:22,943
నిజం చెప్పాలంటే, జనాలకు ఏమైనా నాకు పర్లేదు.

366
00:32:24,361 --> 00:32:29,408
కానీ ప్రశ్న ఏంటంటే, "ముందు నీపై
సుత్తిని ప్రయోగించనా, లేక ఇంకేదైనా ప్రయోగించనా?" అని.

367
00:32:54,850 --> 00:32:55,893
నీ పేరేంటి?

368
00:32:57,060 --> 00:32:58,437
- ర్యాన్.
- ర్యాన్.

369
00:32:59,980 --> 00:33:03,942
అంతా ముగిసింది. సరేనా? కాబట్టి నీ ప్రతిఘటన ఆపేయ్, సరేనా?

370
00:33:06,111 --> 00:33:07,988
- సరే.
- వద్దు. వద్దు!

371
00:35:03,312 --> 00:35:04,313
ఒలీవియా.

372
00:35:54,571 --> 00:35:56,573
సబ్ టైటిళ్లను అనువదించినది: రాంప్రసాద్

